15-10-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - పతితముగా, నల్లగా తయారైన ఆత్మలను
మరియు శరీరాలను తండ్రి స్మృతితో పావనముగా తయారుచేయండి, ఎందుకంటే ఇప్పుడు పావన
ప్రపంచములోకి వెళ్ళాలి’’
ప్రశ్న:-
భగవంతుడు ఏ
పిల్లలకు లభిస్తారు, తండ్రి ఏ లెక్కను తెలియజేశారు?
జవాబు:-
ఎవరైతే
ప్రారంభము నుండి భక్తి చేశారో, వారికే భగవంతుడు లభిస్తారు. బాబా తెలియజేసిన లెక్క
ఏమిటంటే - అందరికన్నా ముందు మీరే భక్తి చేస్తారు, అందుకే మీకే మొట్టమొదట భగవంతుని
ద్వారా జ్ఞానము లభిస్తుంది, దాని ఆధారముగా మీరు కొత్త ప్రపంచములో రాజ్యము చేస్తారు.
తండ్రి అంటారు - మీరు అర్ధకల్పము నన్ను స్మృతి చేసారు, ఇప్పుడు నేను మీకు భక్తి
ఫలాన్ని ఇవ్వడానికి వచ్చాను.
పాట:-
నీ దారిలోనే
మరణించాలి...
ఓంశాంతి
పిల్లలు
పాటను విన్నారు. ఎవరైనా మరణిస్తే ఒక తండ్రి వద్ద జన్మ తీసుకుంటారు. మనము ఆత్మలమని
మీకు తెలుసు. మరణమనేది శరీరానికి సంబంధించినది. ఒక శరీరాన్ని వదిలి ఇంకొక తండ్రి
వద్దకు వెళ్తారు. మీరు ఎంతమంది సాకార తండ్రులను పొందారు. వాస్తవానికి మీరు నిరాకారీ
తండ్రికి పిల్లలు. ఆత్మలైన మీరు పరమపిత పరమాత్ముని పిల్లలు. వాస్తవానికి మీరు అక్కడి
నివాసులే, దానిని నిర్వాణధామము లేక శాంతిధామమని అంటారు. తండ్రి కూడా అక్కడే ఉంటారు.
మీరు ఇక్కడకు వచ్చి లౌకిక తండ్రికి పిల్లలుగా అవుతారు, అప్పుడిక ఆ తండ్రిని
మర్చిపోతారు. సత్యయుగములో మీరు సుఖమయముగా ఉంటారు, అప్పుడు ఆ పారలౌకిక తండ్రిని
మర్చిపోతారు. సుఖములో ఆ తండ్రిని స్మృతి చేయరు, దుఃఖములో స్మృతి చేస్తారు. ఆత్మయే
స్మృతి చేస్తుంది. లౌకిక తండ్రిని గుర్తు చేసుకున్నప్పుడు బుద్ధి శరీరము వైపుకు
వెళ్తుంది. ఆ పారలౌకిక తండ్రిని, ‘ఓ తండ్రి’, అంటూ గుర్తు చేసుకుంటారు. ఇరువురూ
తండ్రులే. తండ్రి అనే పదమే సరియైనది. వారు కూడా తండ్రే, వీరు కూడా తండ్రే. ఆత్మ
ఆత్మిక తండ్రిని గుర్తు చేసుకున్నప్పుడు బుద్ధి అటువైపుకు వెళ్ళిపోతుంది. ఈ
విషయాన్ని తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. బాబా వచ్చి ఉన్నారని, మనల్ని
తమవారిగా చేసుకున్నారని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి అంటారు - మొట్టమొదట నేను
మిమ్మల్ని స్వర్గములోకి పంపించాను, మీరు చాలా షావుకారులుగా ఉండేవారు, తర్వాత 84
జన్మలు తీసుకుని డ్రామా ప్లాన్ అనుసారముగా ఇప్పుడు మీరు దుఃఖితులుగా అయ్యారు.
డ్రామానుసారముగా ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది. మీ ఆత్మ మరియు ఈ శరీరము రూపీ
వస్త్రము సతోప్రధానముగా ఉండేవి, తర్వాత బంగారు యుగము నుండి ఆత్మ వెండి యుగములోకి
వచ్చింది, అప్పుడు శరీరము కూడా వెండి యుగములోకి వచ్చింది, తర్వాత రాగి యుగములోకి
వచ్చింది. ఇప్పుడైతే మీ ఆత్మ పూర్తిగా పతితముగా అయిపోయింది, కావున శరీరము కూడా
పతితముగా ఉంది. 14 క్యారట్ల బంగారాన్ని ఎవరూ ఇష్టపడరు కదా, అది నల్లగా అయిపోతుంది.
మీరు కూడా ఇప్పుడు నల్లగా, ఇనుప యుగము వారిగా అయిపోయారు. ఇప్పుడు నల్లగా అయిపోయిన
ఆత్మ మరియు శరీరము పవిత్రముగా ఎలా అవ్వాలి. ఆత్మ పవిత్రముగా అయితే శరీరము కూడా
పవిత్రమైనదే లభిస్తుంది. అది ఎలా జరుగుతుంది? గంగా స్నానము చేయడము ద్వారానా? కాదు.
ఓ పతిత-పావనా రండి అని పిలుస్తారు కదా. ఆత్మ ఇలా పిలిచినప్పుడు బుద్ధి పారలౌకిక
తండ్రి వైపుకు వెళ్తుంది. ‘ఓ బాబా’, అని అంటారు. చూడండి, ‘బాబా’ అనే ఆ పదమే ఎంత
మధురమైనది. భారత్ లోనే ‘బాబా, బాబా’ అని అంటారు. ఇప్పుడు మీరు ఆత్మాభిమానులుగా అయి
బాబాకు చెందినవారిగా అయ్యారు. బాబా అంటారు, నేను మిమ్మల్ని స్వర్గములోకి పంపించాను,
అక్కడ మీరు కొత్త శరీరాలను ధారణ చేసారు, ఇప్పుడు మీరు ఎలా తయారయ్యారు. ఈ విషయాలు సదా
మీ లోపల ఉండాలి. బాబాను మాత్రమే స్మృతి చేయాలి. ‘ఓ బాబా, ఆత్మలమైన మేము పతితముగా
అయిపోయాము, ఇప్పుడు రండి, వచ్చి పావనముగా తయారుచేయండి’ అని అందరూ తలచుకుంటారు కదా.
డ్రామాలో ఈ పాత్ర కూడా ఉంది, అందుకే పిలుస్తారు. డ్రామా ప్లాన్ అనుసారముగా పాత
ప్రపంచము కొత్తది తయారయ్యేది ఉందన్నప్పుడు వారు వస్తారు, అంటే తప్పకుండా సంగమములోనే
వస్తారు. తండ్రి అత్యంత ప్రియమైనవారని పిల్లలైన మీకు నిశ్చయముంది. స్వీట్,
స్వీటెస్ట్ (మధురమైన, అత్యంత మధురమైన)... అని అంటారు కూడా. ఇప్పుడు మధురమైనవారు ఎవరు?
లౌకిక సంబంధములో ముందు జన్మనిచ్చిన తండ్రి ఉంటారు, ఆ తర్వాత టీచరు. మీరు టీచరు
ద్వారా చదువుకుని పదవిని పొందుతారు. జ్ఞానము సంపాదనకు ఆధారము అని అంటారు. జ్ఞానమంటే
నాలెడ్జ్, యోగమంటే స్మృతి. అనంతమైన తండ్రి గురించి ఎవరికీ తెలియదు. బ్రహ్మా ద్వారా
స్థాపనను శివబాబా చేయిస్తారని చిత్రాలలో స్పష్టముగా చూపించారు కూడా. శ్రీకృష్ణుడు
రాజయోగాన్ని ఎలా నేర్పిస్తారు. రాజయోగాన్ని సత్యయుగము కోసమే నేర్పిస్తారు. కావున
తప్పకుండా సంగమములోనే తండ్రి నేర్పించి ఉంటారు. సత్యయుగాన్ని స్థాపన చేసేవారు బాబా,
వారు బ్రహ్మా ద్వారా చేయిస్తారు. బాబా చేసేవారు-చేయించేవారు కదా. మనుష్యులు
త్రిమూర్తి బ్రహ్మా అని అంటారు. కానీ ఉన్నతోన్నతమైనవారు శివుడు కదా. వీరు సాకారుడు,
వారు నిరాకారుడు. సృష్టి కూడా ఇదే. ఈ సృష్టి చక్రమే తిరుగుతూ ఉంటుంది, రిపీట్ అవుతూ
ఉంటుంది. సూక్ష్మవతనములో సృష్టి చక్రము ఉంటుందని అనరు. ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు
రిపీట్ అవుతాయి. సత్య, త్రేతా, ద్వాపర, కలియుగాలని అంటూ ఉంటారు కూడా. మధ్యలో
తప్పకుండా సంగమము ఉండాలి. లేదంటే కలియుగాన్ని సత్యయుగముగా ఎవరు తయారుచేస్తారు?
నరకవాసులను స్వర్గవాసులుగా తయారుచేయడానికి తండ్రి సంగమములోనే వస్తారు. ఎంత పాత
ప్రపంచమో, అంత ఎక్కువ దుఃఖముంటుంది. ఆత్మ ఎంతగా తమోప్రధానముగా అవుతూ ఉంటుందో, అంత
దుఃఖితముగా అవుతుంది. దేవతలు సతోప్రధానమైనవారు. ఇది హైయ్యెస్ట్ అథారిటీ అయిన గాడ్
ఫాదర్లీ గవర్నమెంట్. వీరితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు. తండ్రి అంటారు, మీరు
శివాలయములో ఉండేవారు, ఇప్పుడిది వేశ్యాలయము. మీరు పావనముగా ఉండేవారు, ఇప్పుడు
పతితముగా అయ్యారు, అందుకే, మేము పాపులమని అంటూ ఉంటారు. నిర్గుణుడినైన నాలో ఏ గుణము
లేదు అని ఆత్మ అంటుంది. ఏ దేవత మందిరానికి వెళ్ళినా, వారి ఎదురుగా ఇలానే అంటారు.
కానీ వాస్తవానికి ఈ మాటలు బాబా ఎదురుగా అనాలి. వారిని వదిలి సోదరుల ఎదురుగా అంటారు,
ఈ దేవతలు మీ సోదరులు కదా. సోదరుల నుండైతే ఏమీ లభించదు. సోదరులను పూజిస్తూ-పూజిస్తూ
కిందకు పడిపోతూ వచ్చారు. తండ్రి వచ్చి ఉన్నారని, వారి నుండి మనకు వారసత్వము
లభిస్తుందని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. ఇకపోతే, మనుష్యులకైతే తండ్రి గురించి
తెలియనే తెలియదు. వారిని సర్వవ్యాపి అని అంటారు. కొంతమంది భగవంతుడిని అఖండ జ్యోతి
తత్వమని అంటారు. కొంతమంది వారు నామ-రూపాలకు అతీతమైనవారని అంటారు. అరే, మీరు అఖండ
జ్యోతి స్వరూపుడని అంటారు, మళ్ళీ నామ-రూపాలకు అతీతమైనవారని ఎలా అంటారు? తండ్రి
గురించి తెలియని కారణముగానే పతితముగా అయిపోయారు. తమోప్రధానముగా కూడా అవ్వాల్సిందే.
తర్వాత, తండ్రి వచ్చినప్పుడు అందరినీ పావనముగా తయారుచేస్తారు. ఆత్మలందరూ నిరాకారీ
ప్రపంచములో తండ్రితో పాటు ఉంటారు. తర్వాత ఇక్కడకు వచ్చి సతో, రజో, తమోల పాత్రను
అభినయిస్తారు. ఆత్మయే తండ్రిని స్మృతి చేస్తుంది. తండ్రి వచ్చి చెప్తారు - నేను
బ్రహ్మా తనువును ఆధారముగా తీసుకుంటాను, ఇది భాగ్యశాలి రథము. ఆత్మ లేకుండా రథము ఉండదు.
భగీరథుడు గంగను తీసుకువచ్చారని అంటారు. కానీ అలాంటిదేమీ జరగదు. కానీ వారేమి
చెప్తున్నారో వారికి అర్థం కావడము లేదు.
ఇది జ్ఞాన
వర్షమని ఇప్పుడు పిల్లలైన మీకు అర్థం చేయించారు. దీనితో ఏం జరుగుతుంది? పతితము నుండి
పావనముగా అవుతారు. గంగ, యమునా అయితే సత్యయుగములో కూడా ఉంటాయి. శ్రీకృష్ణుడు యమునా
నదీ తీరములో ఆడుకునేవారని అంటారు. అలాంటి విషయాలేమీ జరగలేదు. వారు సత్యయుగ
రాకుమారుడు, వారిని చాలా జాగ్రత్తగా పాలన చేస్తారు ఎందుకంటే వారు పుష్పము వంటివారు
కదా. పుష్పాలు ఎంత బాగా సుందరముగా ఉంటాయి. అందరూ పుష్పాల నుండి సుగంధము తీసుకుంటారు.
ముళ్ళ నుండి సుగంధము తీసుకోరు. ఇప్పుడిది ముళ్ళ ప్రపంచము. ఈ అడవిని తండ్రి వచ్చి
పుష్పాలతోటగా తయారుచేస్తారు, అందుకే వారికి బబుల్ నాథ్ అనే పేరు కూడా పెట్టారు.
ముళ్ళ నుండి పుష్పాలుగా తయారుచేస్తారు. అందుకే, ముళ్ళను పుష్పాలుగా తయారుచేసే బాబా
అని వారి మహిమను పాడుతారు. ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉండాలి.
మనము అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యామని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మీ
సంబంధము వారితోనూ ఉంది, అలాగే లౌకిక తండ్రితో కూడా ఉంది. పారలౌకిక తండ్రిని స్మృతి
చేసినట్లయితే మీరు పావనముగా అవుతారు. వారు మా లౌకిక తండ్రి మరియు వీరు పారలౌకిక
తండ్రి అని ఆత్మకు తెలుసు. భక్తి మార్గములో కూడా ఆత్మకు - వారు మా లౌకిక తండ్రి
మరియు వీరు గాడ్ ఫాదర్ అని తెలుసు. అవినాశీ తండ్రిని స్మృతి చేస్తారు. ఆ తండ్రి
ఎప్పుడు వచ్చి స్వర్గ స్థాపన చేస్తారు అనేది ఎవరికీ తెలియదు. తండ్రి పతితులను
పావనముగా చేయడానికే వస్తారు. కావున వారు తప్పకుండా సంగమములోనే వస్తారు.
శాస్త్రాలలోనైతే కల్పము ఆయువును లక్షల సంవత్సరాలని వ్రాసి మనుష్యులను పూర్తిగా ఘోర
అంధకారములో పడేశారు. ఎవరైతే చాలా భక్తి చేస్తారో, వారికి భగవంతుడు లభిస్తారని అంటారు.
కావున అందరికన్నా ఎక్కువ భక్తి చేసేవారికి తప్పకుండా భగవంతుడు ముందు లభించాలి.
తండ్రి లెక్కను కూడా తెలియజేశారు. అందరికన్నా ముందు మీరే భక్తి చేస్తారు కావున
మొట్టమొదట మీకే భగవంతుని ద్వారా జ్ఞానము లభించాలి. దాని ఆధారముగా మీరే కొత్త
ప్రపంచములో రాజ్యము చేస్తారు. అనంతమైన తండ్రి పిల్లలైన మీకు జ్ఞానము ఇస్తున్నారు,
ఇందులో ఏ కష్టము లేదు. తండ్రి అంటారు, మీరు నన్ను అర్ధకల్పము స్మృతి చేసారు.
సుఖములోనైతే ఎవరూ స్మృతి చేయరు. చివరిలో ఎప్పుడైతే దుఃఖితులుగా అవుతారో, అప్పుడు
నేను వచ్చి సుఖమయముగా చేస్తాను. ఇప్పుడు మీరు చాలా పెద్ద వ్యక్తులుగా అవుతారు. ఛీఫ్
మినిస్టర్, ప్రైమ్ మినిస్టర్ మొదలైనవారి బంగళాలు ఎంత ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి.
ఫర్నీచర్ అంతా చాలా ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది. మీరు ఎంత పెద్ద వ్యక్తులుగా (దేవతలుగా)
అవుతారు. దైవీ గుణాలు కల దేవతలుగా స్వర్గానికి యజమానులుగా అవుతారు. అక్కడ మీ కోసం
మహళ్ళు కూడా వజ్ర-వైఢూర్యాలతో పొదగబడి ఉంటాయి. అక్కడ మీ ఫర్నీచర్ బంగారముతో పొదగబడి
ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది.
ఇది రుద్ర
జ్ఞాన యజ్ఞము. శివుడిని రుద్రుడని కూడా అంటారు. భక్తి పూర్తయినప్పుడు భగవంతుడు
రుద్ర యజ్ఞాన్ని రచిస్తారు. సత్యయుగములో యజ్ఞము లేక భక్తి అనే మాటే ఉండదు. ఈ
సమయములోనే తండ్రి ఈ అవినాశీ రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తారు, దీనికే తర్వాత మహిమ
జరుగుతుంది. భక్తి అయితే సదా కొనసాగదు. భక్తి మరియు జ్ఞానము. భక్తి రాత్రి, జ్ఞానము
పగలు. తండ్రి వచ్చి పగలు తయారుచేస్తారు కావున పిల్లలకు కూడా తండ్రి పట్ల ఎంత ప్రేమ
ఉండాలి. తండ్రి మనల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు. తండ్రి అత్యంత
ప్రియమైనవారు కదా. వారి కంటే ప్రియమైన వస్తువేదీ ఉండదు. అర్ధకల్పము నుండి - బాబా,
మీరు వచ్చి మా దుఃఖాన్ని హరించండి అని స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు తండ్రి
వచ్చారు, వారు అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, మీరు మీ గృహస్థ వ్యవహారములో
ఉండాల్సిందే. ఇక్కడ బాబా వద్ద ఎంతవరకని కూర్చుంటారు. నాతో పాటు పరంధామములో మాత్రమే
ఉండగలరు. ఇక్కడైతే ఉండలేరు. ఇక్కడైతే జ్ఞానాన్ని చదువుకోవాలి. జ్ఞానాన్ని
చదువుకునేవారు కొంతమంది మాత్రమే ఉంటారు. లౌడ్ స్పీకర్ ద్వారా ఎప్పుడైనా చదువుకుంటారా?
అలా జరిగితే టీచరు ప్రశ్నలు ఎలా వేస్తారు? లౌడ్ స్పీకరు ద్వారా జవాబులు ఎలా
చెప్పగలరు? అందుకే విద్యార్థులను కొంత-కొంతమంది చొప్పున చదివిస్తారు. కాలేజీలైతే
చాలా ఉంటాయి, అందరికీ పరీక్షలు జరుగుతాయి, రిజల్టు వెలువడుతుంది. ఇక్కడైతే ఒక్క
తండ్రి మాత్రమే చదివిస్తారు. లౌకిక తండ్రి మరియు పారలౌకిక తండ్రి - ఇద్దరు
తండ్రులున్నారని కూడా అర్థం చేయించాలి. దుఃఖములో ఆ పారలౌకిక తండ్రిని స్మరిస్తారు.
ఇప్పుడు ఆ తండ్రి వచ్చి ఉన్నారు. మహాభారత యుద్ధము కూడా ఎదురుగా ఉంది. మహాభారత
యుద్ధములో శ్రీకృష్ణుడు వచ్చారని వారు అనుకుంటారు, కానీ అలా జరగదు. శివుడు
నిరాకారుడు, శ్రీకృష్ణుడు సాకారుడు. నిరాకార తండ్రి సర్వాత్మలకు తండ్రి. ఇరువురూ
అత్యంత ప్రియమైనవారే. శ్రీకృష్ణుడు కూడా విశ్వానికి యజమాని కదా. ఎవరు ఎక్కువ
ప్రియమైనవారు అనేది ఇప్పుడు మీరు జడ్జ్ చేయగలరు. శివబాబాయే ఆ విధముగా యోగ్యులుగా
తయారుచేస్తారు కదా. శ్రీకృష్ణుడేమి చేస్తారు? తండ్రియే వారిని అలా తయారుచేస్తారు కదా.
కావున మహిమ కూడా ఆ తండ్రికే ఎక్కువగా జరగాలి కదా. తండ్రి అర్థం చేయించారు - మీరందరూ
పార్వతులు. అమరనాథుడైన ఈ శివుడు మీకు కథను వినిపిస్తున్నారు. మీరందరే అర్జునులు,
మీరందరే ద్రౌపదులు. ఈ వికారీ ప్రపంచాన్ని రావణ రాజ్యమని అంటారు. అది నిర్వికారీ
ప్రపంచము. వికారాల మాటే ఉండదు. నిరాకార తండ్రి వికారీ ప్రపంచాన్ని రచిస్తారా ఏమిటి?
వికారాలలోనే దుఃఖముంది. సన్యాసులది హఠయోగము, నివృత్తి మార్గము. కర్మను
సన్యసించడమనేది ఎప్పుడూ జరగనే జరగదు. ఆత్మ శరీరము నుండి వేరైనప్పుడే అది
సాధ్యమవుతుంది. తర్వాత గర్భ జైలులో కర్మల లెక్కాచారము మొదలవుతుంది. ఇకపోతే, కర్మ
సన్యాసమని అనడము తప్పు. ఎంతోమంది హఠయోగము మొదలైనవి నేర్చుకుంటారు, గుహలలోకి వెళ్ళి
కూర్చుంటారు, అగ్నిపై కూడా నడుస్తారు. రిద్ధి-సిద్ధులు కూడా చాలా ఉన్నాయి.
ఇంద్రజాలముతో చాలా వస్తువులను తీసి చూపిస్తూ ఉంటారు కూడా. భగవంతుడిని కూడా
ఇంద్రజాలికుడు, రత్నాకరుడు, వ్యాపారస్థుడు అని అంటారు. ఆ హఠయోగుల ద్వారా ఎవరికీ గతి,
సద్గతి లభించదు. ఆ సత్యమైన సద్గురువు ఒక్కరే వచ్చి అందరికీ గతి, సద్గతినిస్తారు.
అచ్ఛా!
మధురాతి
మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ముళ్ళ నుండి పుష్పాలుగా తయారుచేసే అత్యంత ప్రియమైనవారు ఒక్క తండ్రి మాత్రమే,
వారిని చాలా ప్రేమతో స్మృతి చేయాలి. సుగంధభరితమైన పావన పుష్పాలుగా అయి అందరికీ
సుఖాన్ని ఇవ్వాలి.
2. ఈ జ్ఞానము (చదువు) సంపాదనకు ఆధారము, దీనితో 21 జన్మల కొరకు మీరు చాలా పెద్ద
వ్యక్తులుగా అవుతారు, అందుకే దీనిని చాలా బాగా చదువుకోవాలి మరియు చదివించాలి.
ఆత్మాభిమానులుగా అవ్వాలి.
వరదానము:-
బాధ్యతను సంభాళిస్తూ ఆకారీ మరియు నిరాకారీ స్థితి యొక్క
అభ్యాసము ద్వారా సాక్షాత్కార మూర్త భవ
ఏ విధముగా సాకార రూపములో ఇంత పెద్ద బాధ్యత ఉన్నా కూడా
ఆకారీ మరియు నిరాకారీ స్థితిని అనుభవం చేయిస్తూ ఉండేవారో, అలా తండ్రిని ఫాలో చేయండి.
సాకార రూపములో ఫరిశ్తాతనాన్ని అనుభూతి చేయించండి. ఎవరు ఎంతటి అశాంతి లేక వ్యాకులతతో
భయపడుతూ మీ ముందుకు వచ్చినా కానీ మీ ఒక్క దృష్టి, వృత్తి మరియు స్మృతి యొక్క శక్తి
వారిని పూర్తిగా శాంతపర్చాలి. ఎవరైనా వ్యక్త భావముతో వచ్చినా, మీ ద్వారా అవ్యక్త
స్థితిని అనుభవం చేయాలి, అప్పుడు సాక్షాత్కార మూర్తులు అని అంటారు.
స్లోగన్:-
ఎవరైతే
సత్యమైన దయార్ద్ర హృదయులో, వారికి దేహము లేక దేహాభిమానము యొక్క ఆకర్షణ ఉండదు.
అవ్యక్త ప్రేరణలు -
పరోపకార భావనతో సంపన్నులుగా అయి అపకారికి కూడా ఉపకారము చేయండి
జ్ఞాన స్వరూప ఆత్మలు సదా ప్రతి ఒక్కరి పట్ల మాస్టర్ స్నేహ సాగరులుగా ఉంటారు. స్నేహము
తప్ప వారి వద్ద ఇంకేదీ లేదు. ఎవరు వచ్చినా వారికి స్నేహమే ఇస్తారు. ఈ రోజుల్లో సంపద
కన్నా కూడా ఎక్కువగా స్నేహము యొక్క అవసరముంది. స్నేహము యొక్క శక్తి ద్వారా శత్రువును
కూడా మిత్రునిగా చేసుకోగలరు, అపకారులకు కూడా ఉపకారము చేయగలరు.