15-12-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు ఇప్పుడు ఆత్మిక తండ్రి ద్వారా
ఆత్మిక డ్రిల్ నేర్చుకుంటున్నారు, ఈ డ్రిల్ ద్వారానే మీరు ముక్తిధామానికి,
శాంతిధామానికి వెళ్ళిపోతారు’’
ప్రశ్న:-
తండ్రి
పిల్లల చేత పురుషార్థము చేయిస్తూ ఉంటారు కానీ పిల్లలు ఏ విషయములో చాలా స్ట్రిక్ట్
గా ఉండాలి?
జవాబు:-
పాత
ప్రపంచానికి నిప్పు అంటుకునే కంటే ముందే తయారవ్వాలి, స్వయాన్ని ఆత్మగా భావిస్తూ
తండ్రి స్మృతిలో ఉంటూ తండ్రి నుండి పూర్తిగా వారసత్వము తీసుకోవడములో చాలా స్ట్రిక్ట్
గా ఉండాలి. ఫెయిల్ అవ్వకూడదు. ఆ విద్యార్థులు ఫెయిల్ అయితే పశ్చాత్తాపపడతారు, నా
సంవత్సరము అనవసరముగా పోయిందని భావిస్తారు. కొందరేమో - చదవకపోతే ఏమైపోతుంది అని
అంటారు! కానీ మీరు చాలా స్ట్రిక్ట్ గా ఉండాలి. టూ లేట్ అని టీచర్ అనవలసిన వచ్చే
విధముగా ఉండకూడదు.
ఓంశాంతి
ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు ఆత్మిక పాఠశాలలో డైరెక్షన్లు ఇస్తున్నారు లేదా
పిల్లలకు డ్రిల్ నేర్పిస్తున్నారని అనవచ్చు. ఏ విధముగా టీచర్లు డైరెక్షన్లు ఇస్తారు
మరియు డ్రిల్ నేర్పిస్తారు కదా, అదే విధముగా ఈ ఆత్మిక తండ్రి కూడా పిల్లలకు డైరెక్ట్
గా చెప్తున్నారు. ఏమి చెప్తున్నారు? మన్మనాభవ. ఏ విధముగా వారు అటెన్షన్ ప్లీజ్ అని
అంటారో, అలా తండ్రి మన్మనాభవ అని చెప్తున్నారు. ఇది ప్రతి ఒక్కరూ తమపై తాము దయ
చూపించుకోవడము వంటిది. తండ్రి అంటారు, పిల్లలూ, నన్నొక్కరినే స్మృతి చేయండి,
అశరీరిగా అవ్వండి. ఈ ఆత్మిక డ్రిల్ ను ఆత్మలకు ఆత్మిక తండ్రియే నేర్పిస్తారు. వారు
సుప్రీమ్ టీచర్. మీరు అసిస్టెంట్ (సహాయక) టీచర్. మీరు కూడా అందరికీ - స్వయాన్ని
ఆత్మగా భావించండి, తండ్రిని స్మృతి చేయండి, దేహీ-అభిమానీ భవ అని చెప్తారు.
మన్మనాభవకు అర్థం కూడా ఇదే. బాబా పిల్లల కళ్యాణము కోసం డైరెక్షన్లు ఇస్తారు. వారు
స్వయం ఎవరి నుండి నేర్చుకోలేదు. మిగిలిన టీచర్లందరూ స్వయము నేర్చుకుని ఆ తర్వాత
నేర్పిస్తారు. వీరైతే ఎక్కడా స్కూల్ మొదలైనవాటిలో చదువుకుని నేర్చుకోలేదు. వీరు
కేవలం నేర్పిస్తారు. నేను ఆత్మలైన మీకు ఆత్మిక డ్రిల్ ను నేర్పిస్తాను అని అంటారు.
వారంతా దైహిక పిల్లలకు దైహిక డ్రిల్ ను నేర్పిస్తారు. వారు డ్రిల్ మొదలైనవి కూడా
శరీరముతోనే చేయవలసి ఉంటుంది. ఇందులోనైతే శరీరము యొక్క విషయమేమీ లేదు. తండ్రి అంటారు,
నాకు నాదంటూ శరీరమేమీ లేదు. నేను అయితే డ్రిల్ నేర్పిస్తాను, డైరెక్షన్లు ఇస్తాను.
డ్రామా ప్లాన్ అనుసారముగా వారిలో డ్రిల్ నేర్పించే పాత్ర నిండి ఉంది, ఈ సేవ నిండి
ఉంది. వారు రావడమే డ్రిల్ నేర్పించేందుకు వస్తారు. మీరు తమోప్రధానము నుండి
సతోప్రధానముగా అవ్వాలి. ఇది చాలా సహజము. మెట్ల వరుస బుద్ధిలో ఉంది. 84 జన్మల
చక్రములో తిరిగి ఏ విధముగా దిగిపోయారు. ఇప్పుడు తండ్రి అంటున్నారు, మీరు తిరిగి
వెళ్ళాలి. ఓ ఆత్మిక పిల్లలూ, ఇప్పుడు తిరిగి వెళ్ళాలి అని ఈ విధముగా ఎవ్వరూ తమ
ఫాలోవర్స్ కు గాని, విద్యార్థులకు గాని చెప్పరు. ఆత్మిక తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థం
చేయించలేరు. ఇప్పుడు మనము తిరిగి వెళ్ళాలి అని పిల్లలు అర్థం చేసుకుంటారు. ఈ
ప్రపంచమే ఇప్పుడు తమోప్రధానముగా ఉంది. మనము సతోప్రధాన ప్రపంచానికి యజమానులుగా
ఉండేవారము, ఆ తర్వాత 84 జన్మల చక్రములో తిరిగి తమోప్రధాన ప్రపంచానికి యజమానులుగా
అయ్యాము. ఇక్కడ దుఃఖమే దుఃఖముంది. తండ్రిని దుఃఖహర్త, సుఖకర్త అని అంటారు అనగా
తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా తయారుచేసేవారు ఒక్క తండ్రి మాత్రమే. మనము చాలా
సుఖము చూసామని పిల్లలైన మీరు భావిస్తారు. రాజ్యమెలా చేసాము అన్నది గుర్తులేదు కానీ
లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా ఉంది. అది ఉన్నదే పుష్పాల తోట. ఇప్పుడు మనము ముళ్ళ
నుండి పుష్పాలుగా తయారవుతున్నాము.
మీరు నిశ్చయము ఏ విధముగా ఏర్పరచుకోవాలి అని అనరు. ఒకవేళ సంశయము ఉన్నట్లయితే ఇక
వినశ్యంతి. స్కూల్ నుండి అడుగు బయటకు వేస్తే, ఇక చదువు సమాప్తమైపోతుంది, పదవి కూడా
వినశ్యంతి అయిపోతుంది, చాలా నష్టము కలుగుతుంది, ప్రజలలో కూడా తక్కువ పదవి అయిపోతుంది.
ముఖ్యమైన విషయము సతోప్రధాన పూజ్య దేవీ-దేవతలుగా అవ్వడమే. ఇప్పుడైతే దేవతలుగా లేరు
కదా. బ్రాహ్మణులైన మీకు ఇప్పుడు అర్థమయ్యింది. బ్రాహ్మణులే వచ్చి తండ్రి నుండి ఈ
డ్రిల్ ను నేర్చుకుంటారు. లోలోపల సంతోషము కూడా కలుగుతుంది. ఈ చదువు బాగా
అనిపిస్తుంది కదా. ఇది భగవానువాచ. వారు శ్రీకృష్ణుని పేరును వేసారు కానీ
శ్రీకృష్ణుడు ఈ డ్రిల్ ను నేర్పించలేదని మీకు తెలుసు, దీనిని తండ్రి నేర్పిస్తారు.
శ్రీకృష్ణుని ఆత్మ ఏదైతే రకరకాల నామ-రూపాలను ధారణ చేస్తూ తమోప్రధానమైపోయిందో, వారికి
కూడా నేర్పిస్తారు. బాబా స్వయము నేర్చుకోరు, మిగిలినవారంతా తప్పకుండా ఎవరో ఒకరి
నుండి నేర్చుకుంటారు. బాబా ఉన్నదే నేర్పించే ఆత్మిక తండ్రి. వారు మీకు నేర్పిస్తారు,
మీరు తిరిగి ఇతరులకు నేర్పిస్తారు. మీరు 84 జన్మలు తీసుకుని పతితముగా అయ్యారు,
ఇప్పుడు మళ్ళీ పావనముగా అవ్వాలి. దాని కోసం ఆత్మిక తండ్రిని స్మృతి చేయండి. భక్తి
మార్గములో మీరు - ఓ పతిత పావనా అని పాడుతూ వచ్చారు. ఇప్పుడు కూడా మీరు ఎక్కడికైనా
వెళ్ళి చూడండి. మీరు రాజఋషులు కదా. మీరు ఎక్కడికైనా వెళ్ళి తిరగవచ్చు. మీకు ఎటువంటి
బంధనాలు లేవు. అనంతమైన తండ్రి సేవ చేయడానికి వచ్చారని పిల్లలైన మీకు ఈ నిశ్చయముంది.
తండ్రి పిల్లల నుండి చదువు యొక్క ఫీజ్ ఎలా తీసుకుంటారు. టీచర్ కు తన పిల్లలే
విద్యార్థులైతే ఫ్రీగా చదివిస్తారు కదా. వీరు కూడా ఫ్రీగా చదివిస్తారు. మేము ఏదో
ఇస్తున్నామని భావించకండి. ఇది ఫీజ్ కాదు. మీరు ఏమీ ఇవ్వరు, వాస్తవానికి రిటర్న్ లో
మీరు చాలా తీసుకుంటారు. మనుష్యులు దాన-పుణ్యాలు చేస్తారు, మరుసటి జన్మలో మాకు
రిటర్న్ లభిస్తుందని భావిస్తారు. అక్కడ అల్పకాలికమైన క్షణ భంగుర సుఖము లభిస్తుంది.
మరుసటి జన్మలో లభిస్తుంది కానీ అది కిందకు దిగజారే జన్మలో లభిస్తుంది ఎందుకంటే
మెట్లు దిగుతూనే వస్తారు కదా. ఇప్పుడు మీరు ఏదైతే చేస్తున్నారో, అది ఎక్కే కళలోకి
వెళ్ళేందుకు చేస్తారు. కర్మల ఫలము అని అంటారు కదా. ఆత్మకు కర్మల ఫలము లభిస్తుంది. ఈ
లక్ష్మీ-నారాయణులకు కూడా కర్మల ఫలమే లభించింది కదా. అనంతమైన తండ్రి నుండి అనంతమైన
ఫలము లభిస్తుంది. అక్కడ ఇన్ డైరెక్ట్ గా లభిస్తుంది. డ్రామాలో నిశ్చితమై ఉంది. ఇది
కూడా తయారై, తయారుచేయబడిన డ్రామా. మనము కల్పము తర్వాత వచ్చి తండ్రి నుండి అనంతమైన
వారసత్వాన్ని తీసుకుంటామని మీకు తెలుసు. తండ్రి కూర్చుని మన కోసం స్కూల్ ను
తయారుచేస్తారు. గవర్నమెంట్ కు చెందిన అవి దైహిక స్కూల్స్. అక్కడ అర్ధకల్పము నుండి
రకరకాలుగా చదువుతూ వచ్చారు. ఇప్పుడు తండ్రి 21 జన్మల కోసం అన్ని దుఃఖాలను దూరము
చేయడానికి చదివిస్తున్నారు. అక్కడ రాజ్యము ఉంటుంది. అందులోకి నంబరువారుగానే వస్తారు.
ఇక్కడ కూడా రాజు, రాణి, మంత్రి, ప్రజలు మొదలైనవారందరూ నంబరువారుగా ఉన్నారు. వీరు
పాత ప్రపంచములో ఉన్నారు, కొత్త ప్రపంచములోనైతే చాలా తక్కువమంది ఉంటారు. అక్కడ సుఖము
చాలా ఉంటుంది, మీరు విశ్వానికి యజమానులుగా అవుతారు. రాజులు-మహారాజులు ఉండి
వెళ్ళిపోయారు. వారు ఎన్ని వేడుకలు జరుపుకుంటారు. కానీ వారైతే మళ్ళీ కిందకు పడిపోయేదే
ఉందని తండ్రి అంటారు. పడిపోవడం అందరూ పడిపోతారు కదా. దేవతల కళలు కూడా
నెమ్మది-నెమ్మదిగా తగ్గిపోతాయి. కానీ అక్కడ రావణ రాజ్యమే ఉండదు కనుక సుఖమే
సుఖముంటుంది. ఇక్కడ రావణ రాజ్యముంది. మీరు ఎలాగైతే ఎక్కుతారో, అలాగే పడిపోతారు కూడా.
ఆత్మలు కూడా నామ-రూపాలు ధారణ చేస్తూ-చేస్తూ కిందకు దిగిపోయారు. డ్రామా ప్లాన్
అనుసారముగా కల్పక్రితము వలె పడిపోయి తమోప్రధానముగా అయిపోయారు. కామ చితిపైకి
ఎక్కడముతోనే దుఃఖము ప్రారంభమవుతుంది. ఇప్పుడు అతి దుఃఖముంది. అక్కడ మళ్ళీ అతి
సుఖముంటుంది. మీరు రాజఋషులు. వారిది హఠయోగము. రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాలు తెలుసా
అని మీరు ఎవరినైనా అడగండి. వారు తెలియదు అని అంటారు. ఎవరికైతే తెలుసో, వారే
అడుగుతారు. స్వయానికే తెలియకపోతే ఎలా అడగగలరు. ఋషులు-మునులు మొదలైనవారెవ్వరూ
త్రికాలదర్శులు కారని మీకు తెలుసు. తండ్రి మనల్ని త్రికాలదర్శులుగా
తయారుచేస్తున్నారు. ఒకప్పుడు విశ్వానికి యజమానిగా ఉన్న ఈ బాబాలో ఇంతకుముందు ఈ
జ్ఞానముండేది కాదు. ఈ జన్మలో కూడా 60 సంవత్సరాల వరకు జ్ఞానము లేదు. తండ్రి వచ్చిన
తర్వాత కూడా మెల్లమెల్లగా ఇదంతా వినిపిస్తూ ఉంటారు. నిశ్చయబుద్ధి కలవారిగా అవుతారు,
అయినా కానీ మాయ చాలామందిని పడేస్తూ ఉంటుంది. వారి పేర్లు చెప్పలేము, లేదంటే నిరాశ
చెందుతారు. సమాచారాలైతే అందుతాయి కదా. చెడు సాంగత్యములోకి వస్తే, కొత్తగా వివాహము
చేసుకున్నవారి సాంగత్యములోకి వస్తే చంచలమైపోతారు. మేము వివాహము చేసుకోకుండా ఉండలేమని
అంటారు. రోజూ వచ్చే మంచి మహారథులను, ఇక్కడికి కూడా చాలా సార్లు వచ్చి వెళ్ళిన వారిని,
మాయ రూపీ మొసలి వచ్చి పట్టుకుంది. ఇలాంటి కేసులు చాలా జరుగుతూ ఉంటాయి. ప్రస్తుతము
ఇంకా వివాహము చేసుకోలేదు కానీ మాయ వారిని నోటిలో వేసుకుని మింగుతూ ఉంది. స్త్రీ రూపీ
మాయ లాగుతూ ఉంటుంది. వచ్చి మొసలి నోటిలో పడ్డారు, ఇక అది మెల్లమెల్లగా మింగేస్తుంది.
కొంతమంది పొరపాట్లు చేస్తారు లేదా చూడగానే చంచలమైపోతారు. నేను ఒక్కసారిగా పై నుండి
కిందకు గోతులోకి పడిపోతానని భావిస్తారు. ఆ బిడ్డ చాలా మంచివాడు, పాపం ఇప్పుడు
వెళ్ళిపోయాడు అని అంటారు. నిశ్చితార్థము జరగగానే మరణిస్తాడు. తండ్రి అయితే పిల్లలకు
సదా - జీవిస్తూ ఉండండి అని వ్రాస్తారు. మాయ ఎక్కడా కూడా తీవ్రముగా దాడి చేయకూడదు.
శాస్త్రాలలో కూడా ఈ విషయాలు కొన్ని ఉన్నాయి కదా. ఇప్పటి ఈ విషయాల గురించే తర్వాత
తలచుకుంటూ ఉంటారు. మీరు పురుషార్థము చేయిస్తారు. మాయ రూపీ మొసలి ఎక్కడా మింగటమనేది
జరగకూడదు. మాయ రకరకాలుగా పట్టుకుంటుంది. ముఖ్యమైనది మహాశత్రువైన కామము, దీని నుండి
బాగా సంభాళించుకోవాలి. పతిత ప్రపంచము నుండి పావన ప్రపంచముగా ఎలా తయారవుతుంది అనేది
మీరు చూస్తున్నారు. ఇందులో తికమకపడే విషయమే లేదు. కేవలం స్వయాన్ని ఆత్మగా భావిస్తూ
తండ్రిని స్మృతి చేస్తే దుఃఖాలన్నీ దూరమైపోతాయి. తండ్రియే పతిత-పావనుడు. ఇది యోగబలము.
భారత్ యొక్క ప్రాచీన రాజయోగము చాలా ప్రసిద్ధమైనది. క్రైస్టుకు 3 వేల సంవత్సరాల
క్రితము స్వర్గముండేదని భావిస్తారు, అంటే తప్పకుండా వేరే ధర్మమేదీ ఉండదు. ఇది ఎంత
సహజమైన విషయము కానీ అర్థం చేసుకోరు. ఆ రాజ్యాన్ని మళ్ళీ స్థాపన చేయడానికి తండ్రి
వచ్చారని ఇప్పుడు మీరు భావిస్తారు. 5 వేల సంవత్సరాల క్రితము కూడా శివబాబా వచ్చారు.
ఇప్పుడు ఏ విధముగా ఇస్తున్నారో, తప్పకుండా అప్పుడు కూడా ఈ జ్ఞానాన్నే ఇచ్చి ఉంటారు.
తండ్రి స్వయంగా అంటున్నారు, నేను కల్ప-కల్పము సంగమయుగములో సాధారణ తనువులోకి వచ్చి
రాజయోగాన్ని నేర్పిస్తాను. మీరు రాజఋషులు. ఇంతకుముందు రాజఋషులు కాదు. బాబా
వచ్చినప్పటి నుండి బాబా వద్ద ఉన్నారు. చదువుకుంటున్నారు కూడా, సేవ కూడా చేస్తున్నారు
- స్థూల సేవ మరియు సూక్ష్మ సేవ. భక్తి మార్గములో కూడా సేవ చేస్తారు, అలాగే
ఇళ్ళు-వాకిళ్ళను కూడా సంభాళిస్తారు. తండ్రి అంటున్నారు - ఇప్పుడు భక్తి పూర్తయ్యి,
జ్ఞానము ప్రారంభమవుతుంది. నేను జ్ఞానము ద్వారా సద్గతిని ఇవ్వడానికి వస్తాను. మనల్ని
బాబా పావనముగా తయారుచేస్తున్నారని మీ బుద్ధిలో ఉంది. తండ్రి అంటున్నారు -
డ్రామానుసారముగా మీకు మార్గాన్ని తెలియజేయడానికి నేను వచ్చాను. టీచర్
చదివిస్తున్నారు, లక్ష్యము-ఉద్దేశ్యము ఎదురుగా ఉంది. ఇది ఉన్నతోన్నతమైన చదువు.
కల్పక్రితము ఏ విధముగా అర్థం చేయించారో, అదే అర్థం చేయిస్తూ ఉంటారు. డ్రామా
టిక్-టిక్ అని నడుస్తూ ఉంటుంది. క్షణ-క్షణము ఏదైతే గతించిందో, అది మళ్ళీ 5 వేల
సంవత్సరాల తర్వాత రిపీట్ అవుతుంది. రోజులు గడుస్తూ ఉంటాయి. ఈ ఆలోచనలు ఇంకెవ్వరి
బుద్ధిలోనూ లేవు. సత్య, త్రేతా, ద్వాపర, కలియుగాలు గడిచిపోయాయి, అవి రిపీట్ అవుతాయి.
కల్పక్రితము జరిగినదే మళ్ళీ జరుగుతుంది. ఇంకా కొన్ని రోజులే మిగిలి ఉన్నాయి. వారు
లక్షల సంవత్సరాలని అంటారు, దానితో పోలిస్తే కొన్ని గంటలే మిగిలి ఉన్నాయని మీరు
అంటారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ఎప్పుడైతే నిప్పు అంటుకుంటుందో, అప్పుడు
మేలుకుంటారు. కానీ అప్పటికి టూ లేట్ అయిపోతుంది. కావున తండ్రి పురుషార్థము చేయిస్తూ
ఉంటారు. మీరు తయారై కూర్చోండి. టూ లేట్ అయ్యిందని టీచర్ చెప్పవలసి వచ్చే విధముగా
ఉండకూడదు, ఫెయిల్ అయ్యేవారు చాలా పశ్చాత్తాపపడతారు. నా సంవత్సరము అనవసరముగా పోయిందని
భావిస్తారు. కొందరేమో, చదవకపోతే ఏమైపోతుంది అని అంటారు కదా! నేనైతే తండ్రి నుండి
పూర్తి వారసత్వాన్ని తీసుకుంటాను అని పిల్లలైన మీరు స్ట్రిక్ట్ గా ఉండాలి. స్వయాన్ని
ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. ఇందులో ఏదైనా ఇబ్బంది అయితే తండ్రిని
అడగవచ్చు. ఇదే ముఖ్యమైన విషయము. నేటికి 5 వేల సంవత్సరాల క్రితము కూడా తండ్రి
చెప్పారు - నన్నొక్కరినే స్మృతి చేయండి. నేను పతిత-పావనుడిని, అందరికీ తండ్రిని నేనే.
శ్రీకృష్ణుడైతే అందరికీ తండ్రి కారు. మీరు శివుని పూజారులకు, శ్రీకృష్ణుని పూజారులకు
ఈ జ్ఞానాన్ని వినిపించవచ్చు. ఆ ఆత్మ ఇంతకుముందు పూజ్యముగా అయి ఉండకపోతే మీరు ఎంతగా
తల బాదుకున్నా కానీ వారు అర్థం చేసుకోరు. ఇప్పుడు నాస్తికులుగా ఉన్నారు. బహుశా
మున్ముందు ఆస్తికులుగా అవ్వవచ్చు. ఒకవేళ వివాహము చేసుకుని పడిపోయి మళ్ళీ వచ్చి
జ్ఞానము తీసుకున్నా కానీ వారసత్వము చాలా తగ్గిపోతుంది ఎందుకంటే బుద్ధిలో ఇతరుల
స్మృతి వచ్చి కూర్చుంది. దానిని తొలగించడము చాలా కష్టము అవుతుంది. ముందు స్త్రీ
స్మృతి, ఆ తర్వాత పిల్లల స్మృతి వస్తుంది. పిల్లల కన్నా కూడా పత్ని పట్ల ఎక్కువ
లాగుతుంది ఎందుకంటే చాలా కాలము నుండి ఉన్న స్మృతి కదా. పిల్లల అయితే తర్వాత వస్తారు.
ఆ తర్వాత మిత్ర-సంబంధీకులు, అత్తవారింటివారు గుర్తుకొస్తారు. ముందు చాలా కాలముగా
తోడుగా ఉన్న పత్ని గుర్తుకొస్తారు. ఇక్కడ కూడా అలాగే. మేము దేవతలతోపాటు చాలా కాలము
ఉన్నామని మీరు అంటారు. కానీ శివబాబాపై చాలా కాలము నుండి ప్రేమ ఉందని అంటారు. వారు 5
వేల సంవత్సరాల క్రితము కూడా మనల్ని పావనముగా తయారుచేసారు. వారు కల్ప-కల్పము వచ్చి
మనల్ని రక్షిస్తారు, అందుకే వారిని దుఃఖహర్త, సుఖకర్త అని అంటారు. మీ లైన్ చాలా
క్లియర్ గా ఉండాలి. తండ్రి అంటారు, ఈ కళ్ళ ద్వారా మీరు చూసేదంతా శ్మశానవాటికగా
మారనున్నది. ఇప్పుడు మీరు సంగమములో ఉన్నారు. అమరలోకము రాబోతుంది. ఇప్పుడు మనము
పురుషోత్తములుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నాము. ఇది కళ్యాణకారీ పురుషోత్తమ
సంగమయుగము. ప్రపంచములో ఏమేమి జరుగుతూ ఉంది అనేది చూస్తూ ఉన్నారు. ఇప్పుడు తండ్రి
వచ్చి ఉన్నారు కావున పాత ప్రపంచము కూడా సమాప్తమవ్వనున్నది. తప్పకుండా ఎవరో వచ్చి
ఉన్నారు, వారు ప్రపంచాన్ని పరివర్తన చేస్తున్నారు అని మున్ముందు చాలామందికి
అనిపిస్తుంది. ఇది అదే మహాభారత యుద్ధము. మీరు కూడా ఎంత తెలివైనవారిగా అయ్యారు. ఇవి
చాలా మంథనము చేయవలసిన విషయాలు. మీ శ్వాసను వ్యర్థముగా పోగొట్టుకోకూడదు. జ్ఞానము
ద్వారా శ్వాస సఫలమవుతుందని మీకు తెలుసు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మాయ నుండి రక్షించుకునేందుకు సాంగత్య దోషము నుండి స్వయాన్ని చాలా-చాలా
సంభాళించుకోవాలి. మీ లైన్ ను క్లియర్ గా ఉంచుకోవాలి. శ్వాసను వ్యర్థముగా
పోగొట్టుకోకూడదు. జ్ఞానము ద్వారా సఫలము చేసుకోవాలి.
2. ఎంత సమయము లభిస్తే అంత, యోగబలాన్ని జమ చేసుకునేందుకు ఆత్మిక డ్రిల్ ను
అభ్యాసము చేయాలి. ఇప్పుడు కొత్త బంధనాలేవీ తయారుచేసుకోకూడదు.
వరదానము:-
బాబా ఛత్రఛాయ యొక్క అనుభవము ద్వారా విఘ్న-వినాశకులు అనే
డిగ్రీని తీసుకునే అనుభవీమూర్త భవ
ఎక్కడైతే బాబా తోడుగా ఉంటారో అక్కడ ఎవ్వరూ ఏమీ చేయలేరు. ఈ
తోడు యొక్క అనుభవమే ఛత్రఛాయగా అవుతుంది. బాప్ దాదా పిల్లల రక్షణను సదా చేస్తూనే
ఉంటారు. పరీక్షలు మిమ్మల్ని అనుభవజ్ఞులుగా చేయడానికి వస్తాయి. అందుకే సదా ఏమని
భావించండి అంటే, ఈ పరీక్షలు ముందు క్లాసులలోకి తీసుకువెళ్ళడానికే వస్తున్నాయి. వీటి
ద్వారానే సదా కాలము కొరకు విఘ్న-వినాశకులు అనే డిగ్రీ మరియు అనుభవీమూర్తులుగా అయ్యే
వరదానము లభిస్తుంది. ఒకవేళ ఇప్పుడు ఎవరైనా కాస్త గొడవ చేసినా లేక విఘ్నాలను
కలిగించినా కూడా మెల్లమెల్లగా చల్లబడిపోతారు.
స్లోగన్:-
ఎవరైతే
సమయానికి సహయోగులుగా అవుతారో వారికి ఒకటికి పదమాల రెట్లు ఫలము లభిస్తుంది.
అవ్యక్త ప్రేరణలు -
ఇప్పుడు సంపన్నముగా మరియు కర్మాతీతముగా అవ్వాలి అనే ధ్యాసలోనే ఉండండి
ఏ విధముగా చూడటము,
వినటము, వినిపించటము - ఈ విశేష కర్మలు సహజముగా అభ్యాసములోకి వచ్చేసాయో, అదే విధముగా
కర్మాతీతముగా అయ్యే స్థితి అనగా కర్మలను సర్దుబాటు చేసే శక్తి ద్వారా అకర్ములుగా
అనగా కర్మాతీతులుగా అవ్వండి. ఒకటేమో కర్మకు ఆధీనమైన స్టేజ్, రెండవది కర్మాతీతము అనగా
కర్మకు అధికారీ అయిన స్టేజ్. కనుక చెక్ చేసుకోండి - కర్మేంద్రియజీత్, స్వరాజ్య
అధికారి రాజు అయిన నా రాజ్య వ్యవహారాలు సరిగ్గా నడుస్తున్నాయా?
| | | |