16-04-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - యోగము ద్వారానే ఆత్మలోని మాలిన్యము తొలగుతుంది, తండ్రి నుండి పూర్తి వారసత్వము లభిస్తుంది, అందుకే ఎంత వీలైతే అంత యోగబలాన్ని పెంచండి’’

ప్రశ్న:-
దేవీ-దేవతల కర్మలు శ్రేష్ఠముగా ఉండేవి, ఇప్పుడు అందరి కర్మలు భ్రష్టముగా ఎందుకు అయ్యాయి?

జవాబు:-
ఎందుకంటే తమ అసలైన ధర్మాన్ని మర్చిపోయారు. ధర్మాన్ని మర్చిపోయిన కారణముగానే, ఏవైతే కర్మలు చేస్తున్నారో, అవి భ్రష్టమవుతున్నాయి. తండ్రి మీకు మీ సత్య ధర్మము యొక్క పరిచయాన్ని ఇస్తున్నారు, దానితో పాటు మొత్తము ప్రపంచము యొక్క చరిత్ర-భౌగోళికాలను వినిపిస్తున్నారు, ఇది అందరికీ వినిపించాలి, తండ్రి యొక్క సత్య పరిచయాన్ని ఇవ్వాలి.

పాట:-
ముఖాన్ని చూసుకో ప్రాణీ...

ఓంశాంతి
ఇలా ఎవరు చెప్పారు మరియు ఎవరితో చెప్పారు? తండ్రి పిల్లలకు చెప్పారు. ఏ పిల్లలనైతే పతితము నుండి పావనముగా తయారుచేస్తున్నారో వారితో చెప్పారు. ఒకప్పుడు దేవీ-దేవతలుగా ఉన్న భారతవాసులైన మనము ఇప్పుడు 84 జన్మల చక్రములో తిరిగి, సతోప్రధానతను దాటి సతో, రజో, తమోలోకి వచ్చాము మరియు ఇప్పుడు తమోప్రధానముగా అయిపోయాము అని పిల్లలు తెలుసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ పతితులను పావనముగా తయారుచేసే తండ్రి చెప్తున్నారు - నేను ఎంతవరకు పుణ్యాత్మగా అయ్యాను అని మీ హృదయాన్ని ప్రశ్నించుకోండి. మొదట్లో మీరు దేవి-దేవతలుగా పిలువబడే సమయములో మీరు సతోప్రధానులుగా, పవిత్రాత్మలుగా ఉండేవారు, దానిని ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము అని అనేవారు. ఇప్పుడు భారతవాసులెవరూ తమను తాము దేవీ-దేవతా ధర్మము వారిగా పిలుచుకోరు. హిందూ అనేది ధర్మమేమీ కాదు, కానీ పతితముగా ఉన్న కారణముగా తమను తాము దేవతలుగా పిలుచుకోలేరు. సత్యయుగములో దేవతలు పవిత్రముగా ఉండేవారు, అప్పుడు పవిత్ర ప్రవృత్తి మార్గముండేది. యథా రాజా-రాణి తథా ప్రజా, అందరూ పవిత్రముగా ఉండేవారు. భారతవాసులకు తండ్రి స్మృతిని ఇప్పిస్తున్నారు - పవిత్ర ప్రవృత్తి మార్గము వారైన మీరు ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారు, దానిని స్వర్గము అని అనేవారు, అక్కడ ఒకే ధర్మముండేది. మొదటి నంబర్ మహారాజు-మహారాణిగా లక్ష్మీ-నారాయణులు ఉండేవారు. వారిది కూడా వంశావళి ఉండేది మరియు భారత్ చాలా సంపన్నముగా ఉండేది, అదే సత్యయుగము. ఆ తర్వాత త్రేతాలోకి వచ్చారు, అప్పుడు కూడా పూజ్య దేవీ-దేవతలుగా, క్షత్రియులుగా పిలువబడేవారు. మొదటిది లక్ష్మీ-నారాయణుల రాజ్యము, ఆ తర్వాతది సీతా-రాముల రాజ్యము, వారి వంశావళి కూడా నడిచింది. ఏ విధముగా క్రిస్టియన్లలో ఎడ్వర్డ్ ది ఫస్ట్, సెకెండ్... అని ఉంటుందో, భారత్ లో కూడా అదే విధముగా ఉండేది. ఇది 5 వేల సంవత్సరాల నాటి విషయము అనగా 5 వేల సంవత్సరాల క్రితం భారత్ లో ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది. కానీ వారు ఈ రాజ్యాన్ని ఎప్పుడు మరియు ఎలా పొందారు అన్నది ఎవరికీ తెలియదు. ఆ సూర్యవంశీ రాజ్యమే మళ్ళీ చంద్రవంశములోకి వచ్చింది ఎందుకంటే పునర్జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ మెట్లు దిగాల్సి ఉంటుంది. భారత్ యొక్క ఈ చరిత్ర-భౌగోళికాల గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రి రచయిత, కనుక తప్పకుండా వారు సత్యయుగీ కొత్త ప్రపంచానికి రచయిత అవుతారు. తండ్రి అంటారు, పిల్లలూ, మీరు నేటికి 5 వేల సంవత్సరాల క్రితం స్వర్గములో ఉండేవారు, ఈ భారత్ స్వరముగా ఉండేది, ఆ తర్వాత నరకములోకి వచ్చారు. ప్రపంచములోని వారికి ఈ ప్రపంచము యొక్క చరిత్ర-భౌగోళికాల గురించి తెలియదు. వారికి పూర్తి హిస్టరీ గురించి తెలియదు అనగా కేవలం తర్వాతర్వాత జరిగిన హిస్టరీ గురించే తెలుసు. సత్య, త్రేతాయుగాల చరిత్ర-భౌగోళికాల గురించి ఎవరికీ తెలియదు. ఋషులు, మునులు కూడా, మాకు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల గురించి తెలియదని అంటూ వచ్చారు. అయినా, ఎవరికైనా ఎలా తెలుస్తుంది, తండ్రి కూర్చుని మీకు మాత్రమే అర్థం చేయిస్తున్నారు. శివబాబా భారత్ లోనే దివ్య జన్మను తీసుకుంటారు, వారి పేరు మీద శివ జయంతి కూడా జరుగుతుంది. శివ జయంతి తర్వాత గీతా జయంతి జరగాలి. దానితోపాటు శ్రీకృష్ణ జయంతి జరగాలి, కానీ శివ జయంతి ఎప్పుడు జరిగింది అని, ఈ జయంతి గురించిన రహస్యము భారతవాసులకు తెలియదు. బుద్ధ జయంతి, క్రైస్టు జయంతి ఎప్పుడు జరిగాయి అనేది ఇతర ధర్మాలవారైతే వెంటనే చెప్తారు. శివ జయంతి ఎప్పుడు జరిగింది అని భారతవాసులను అడగండి. ఎవ్వరూ చెప్పలేరు. శివుడు భారత్ లో వచ్చారు, వచ్చి ఏమి చేసారు, ఇది ఎవరికీ తెలియదు. శివుడు ఆత్మలందరికీ తండ్రి. ఆత్మ అవినాశీ. ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది. ఇది 84 జన్మల చక్రము. శాస్త్రాలలోనైతే 84 లక్షల జన్మలు అని తప్పుగా వ్రాశారు. తండ్రి వచ్చి రైట్ విషయాన్ని తెలియజేస్తున్నారు. తండ్రి తప్ప మిగిలినవారంతా రచయిత మరియు రచనల గురించి అసత్యమే చెప్తారు ఎందుకంటే ఇది ఉన్నదే మాయా రాజ్యము. పూర్వము మీరు పారసబుద్ధి కలవారిగా ఉండేవారు, భారత్ పారసపురిగా ఉండేది. ఆ సమయములో బంగారము, వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఉండేవి. తండ్రి కూర్చుని రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అనగా ప్రపంచము యొక్క చరిత్ర-భౌగోళికాలను తెలియజేస్తారు. మేమే మొట్టమొదట దేవీ-దేవతలుగా ఉండేవారమని, ఇప్పుడు పతితముగా, నిరుపేదగా, అధర్మయుక్తముగా అయిపోయామని, మా ధర్మాన్ని మర్చిపోయామని భారతవాసులకు తెలియదు. ఇది కూడా డ్రామానుసారముగా జరగాల్సి ఉంది. ఈ ప్రపంచము యొక్క చరిత్ర-భౌగోళికాలు బుద్ధిలోకి రావాలి కదా. ఉన్నతోన్నతమైన సర్వాత్మల తండ్రి మూలవతనములో ఉంటారు, తర్వాత సూక్ష్మవతనము ఉంటుంది, ఇది స్థూలవతనము. సూక్ష్మవతనములో కేవలం బ్రహ్మా, విష్ణు, శంకరులు ఉంటారు. వారికి వేరే చరిత్ర-భౌగోళికాలేమీ ఉండవు. ఇవి మూడు అంతస్థులు. గాడ్ ఈజ్ వన్ (భగవంతుడు ఒక్కరే). వారి రచన కూడా ఒక్కటే. ఆ చక్రము తిరుగుతూ ఉంటుంది. సత్యయుగము నుండి త్రేతాలోకి, తర్వాత ద్వాపర, కలియుగాలలోకి రావాల్సి ఉంటుంది. 84 జన్మల లెక్క ఉండాలి కదా, ఇది ఎవరికీ తెలియదు, అలానే ఇది ఏ శాస్త్రాలలోనూ లేదు. 84 జన్మల పాత్రను పిల్లలైన మీరే అభినయిస్తారు. తండ్రి అయితే ఈ చక్రములోకి రారు. పిల్లలే పావనుల నుండి పతితులుగా అవుతారు, అందుకే - బాబా, మీరు వచ్చి మమ్మల్ని మళ్ళీ పావనముగా చేయండి అని ఆర్తనాదాలు చేస్తారు. అందరూ ఒక్కరినే పిలుస్తారు - రావణ రాజ్యములో దుఃఖితులుగా ఉన్న మా అందరినీ, మీరు వచ్చి విముక్తులుగా చేయండి, మళ్ళీ రామరాజ్యములోకి తీసుకువెళ్ళండి అని అంటారు. అర్ధకల్పము రామ రాజ్యము, అర్ధకల్పము రావణ రాజ్యము. ఒకప్పుడు పవిత్రముగా ఉన్న భారతవాసులే పతితముగా అవుతారు. వామ మార్గములోకి వెళ్ళడముతో పతితముగా అవ్వడము మొదలుపెడతారు. భక్తి మార్గము ప్రారంభమవుతుంది. ఇప్పుడు పిల్లలైన మీకు జ్ఞానము వినిపించడము జరుగుతుంది, దీని ద్వారా అర్ధకల్పము, 21 జన్మల కోసం మీరు సుఖ వారసత్వాన్ని పొందుతారు. అర్ధకల్పము జ్ఞానము యొక్క ప్రారబ్ధము నడుస్తుంది, ఆ తర్వాత రావణ రాజ్యము వస్తుంది, కింద పడిపోవడము మొదలవుతుంది. మీరు దైవీ రాజ్యములో ఉండేవారు, ఆ తర్వాత ఆసురీ రాజ్యములోకి వచ్చారు. దీనిని నరకము అని కూడా అంటారు. మీరు స్వర్గములో ఉండేవారు, ఆ తర్వాత 84 జన్మలను దాటి నరకములోకి వచ్చి చేరుకున్నారు. ఆ ప్రపంచము సుఖధామము. ఇది దుఃఖధామము, 100 శాతము దివాలా తీసి ఉన్నారు. 84 జన్మల చక్రములో తిరుగుతూ, ఆ భారతవాసులే పూజ్యుల నుండి పూజారులుగా అయిపోయారు. దీనినే ప్రపంచము యొక్క చరిత్ర-భౌగోళికాలని అంటారు. ఇదంతా భారతవాసులైన మీ చక్రము, ఇతర ధర్మాలవారైతే 84 జన్మలను తీసుకోరు. వారు సత్యయుగములో ఉండనే ఉండరు. సత్య, త్రేతాయుగాలలో కేవలం భారత్ మాత్రమే ఉండేది. సూర్యవంశీయులు, చంద్రవంశీయులు, ఆ తర్వాత వైశ్యవంశీయులు, శూద్రవంశీయులు ఉంటారు... ఇప్పుడు మీరు మళ్ళీ దేవతా వంశీయులుగా అయ్యేందుకని వచ్చి బ్రాహ్మణ వంశీయులుగా అయ్యారు. ఇవి భారత్ యొక్క వర్ణాలు. ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అవ్వడముతో శివబాబా నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. తండ్రి మిమ్మల్ని 5 వేల సంవత్సరాల క్రితం వలె చదివిస్తున్నారు. కల్ప-కల్పము మీరు పావనముగా అయి మళ్ళీ పతితముగా అవుతారు. సుఖధామములోకి వెళ్ళి మళ్ళీ దుఃఖధామములోకి వస్తారు. ఆ తర్వాత శాంతిధామములోకి వెళ్ళాలి, దానిని నిరాకారీ ప్రపంచమని అంటారు. ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఎవరు, ఇది మనుష్యులెవరికీ తెలియదు. ఆత్మ కూడా ఒక నక్షత్రము వలె ఉండే బిందువు. భృకుటి మధ్యలో నక్షత్రము మెరుస్తుంది అని అంటారు. ఆత్మ ఒక చిన్న బిందువు, దానిని దివ్యదృష్టి ద్వారా చూడవచ్చు. వాస్తవానికి ఆత్మను నక్షత్రమని కూడా అనరు. నక్షత్రమైతే చాలా పెద్దగా ఉంటుంది, కేవలం దూరముగా ఉన్న కారణముగా చిన్నగా కనిపిస్తుంది. ఇది కేవలం ఒక ఉదాహరణగా ఇలా చెప్పబడుతుంది. ఏ విధముగా పైనున్న నక్షత్రము ఇక్కడికి చిన్నగా కనిపిస్తుందో, అలా ఆత్మ కూడా అంతే చిన్నగా ఉంటుంది. తండ్రి ఆత్మ కూడా ఒక బిందువు వలె ఉంటుంది. వారిని సుప్రీమ్ ఆత్మ అని అంటారు, వారి మహిమ వేరు. వారు మనుష్య సృష్టికి చైతన్య బీజరూపుడైన కారణముగా వారిలో మొత్తము జ్ఞానమంతా ఉంది. మీ ఆత్మకు కూడా ఇప్పుడు జ్ఞానము లభిస్తుంది. ఆత్మయే జ్ఞానాన్ని గ్రహిస్తూ ఉంది, ఇంత చిన్నని బిందువులో 84 జన్మల పాత్ర నిశ్చితమై ఉంది. అది కూడా అవినాశీ పాత్ర, 84 జన్మల చక్రములో తిరుగుతూ వచ్చారు. దీనికి అంతమనేది ఉండదు. దేవతలుగా ఉండేవారు, అసురులుగా అయ్యారు, మళ్ళీ దేవతలుగా అవ్వాలి. ఈ చక్రము తిరుగుతూ వచ్చింది. మిగిలినవన్నీ ఉపకథలు. ఇస్లాములు, బౌద్ధులు మొదలైనవారెవరూ 84 జన్మలను తీసుకోరు. భారత్ లో అదే సత్యయుగము ధర్మయుక్తముగా, సంపన్నముగా ఉండేది, తర్వాత 84 జన్మలు తీసుకుని వికారులుగా అయ్యారు. ఇది వికారీ ప్రపంచము. 5 వేల సంవత్సరాల క్రితం పవిత్రత ఉండేది, శాంతి కూడా ఉండేది, సంపద కూడా ఉండేది. తండ్రి పిల్లలకు స్మృతిని ఇప్పిస్తున్నారు. ముఖ్యమైనది పవిత్రత. అందుకే వికారులను నిర్వికారులుగా తయారుచేసేవారా రండి, అని అంటారు. వారే సద్గతిని ఇచ్చేవారు, అందుకే వారే సద్గురువు. ఇప్పుడు మీరు తండ్రి ద్వారా బికారుల నుండి రాకుమారులుగా అవుతున్నారు అనగా నరుని నుండి నారాయణునిగా, నారి నుండి లక్ష్మిగా అవుతారు. ఇది మీ రాజయోగము. భారత్ కే ఇప్పుడు తండ్రి ద్వారా రాజ్యము లభిస్తుంది. ఆత్మయే 84 జన్మలను తీసుకుంటుంది. ఆత్మయే చదువుకుంటుంది, శరీరము ద్వారా. అంతేకానీ శరీరము చదువుకోదు. ఆత్మ సంస్కారాలను తీసుకువెళ్తుంది. ఆత్మనైన నేను ఈ శరీరము ద్వారా చదువుకుంటాను - దీనిని దేహీ-అభిమానమని అంటారు. ఆత్మ వేరైపోతే, ఇక శరీరము దేనికీ పనికిరాదు. ఇప్పుడు నేను పుణ్యాత్మగా అవుతున్నానని ఆత్మ అంటుంది. మనుష్యులు దేహాభిమానములోకి వచ్చి, నేను ఇది చేస్తాను... అని అంటారు. నేను ఒక ఆత్మను, నా ఈ శరీరము పెద్దది అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి అయిన పరమాత్మ ద్వారా ఆత్మనైన నేను చదువుకుంటున్నాను. తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేయండి. మీరు బంగారుయుగములో సతోప్రధానముగా ఉండేవారు, ఆ తర్వాత మీలో మాలిన్యము చేరింది. మాలిన్యము చేరుతూ-చేరుతూ మీరు పావనము నుండి పతితముగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ పావనముగా అవ్వాలి, అందుకే - ఓ పతిత-పావనా రండి, వచ్చి మమ్మల్ని పావనముగా చేయండి అని అంటారు. అందుకే తండ్రి సలహా ఇస్తున్నారు - ఓ పతితాత్మ, తండ్రినైన నన్ను స్మృతి చేసినట్లయితే మీ నుండి మాలిన్యము తొలగిపోతుంది మరియు మీరు పావనముగా అయిపోతారు. దీనిని ప్రాచీన యోగమని అంటారు. ఈ స్మృతి ద్వారా అనగా యోగాగ్ని ద్వారా మాలిన్యము భస్మమైపోతుంది. ముఖ్యమైన విషయము - పతితుల నుండి పావనులుగా అవ్వడము. సాధు-సన్యాసులు మొదలైనవారంతా పతితులుగానే ఉన్నారు. పావనముగా అయ్యే ఉపాయాన్ని తండ్రియే తెలియజేస్తున్నారు - నన్నొక్కరినే స్మృతి చేయండి. ఈ అంతిమ జన్మలో పవిత్రముగా అవ్వండి. తింటూ-తాగుతూ, నడుస్తూ-తిరుగుతూ నన్నొక్కరినే స్మృతి చేయండి ఎందుకంటే ఆత్మలైన మీ అందరికీ (ప్రేయసులకు) ప్రియుడిని నేను. మిమ్మల్ని నేను పావనముగా తయారుచేసాను, మీరు మళ్ళీ పతితముగా అయ్యారు. భక్తురాళ్ళలందరూ ప్రేయసులు. కర్మలు కూడా చేయండి కానీ బుద్ధితో నన్ను స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వికర్మలు వినాశనమవుతాయని ప్రియుడు అంటారు. ఇది శ్రమతో కూడుకున్నది. కావున వారసత్వాన్ని పొందేందుకు తండ్రిని స్మృతి చేయాలి కదా. ఎవరైతే ఎక్కువగా స్మృతి చేస్తారో, వారికి వారసత్వము కూడా ఎక్కువగా లభిస్తుంది. ఇది స్మృతియాత్ర. ఎవరైతే ఎక్కువగా స్మృతి చేస్తారో, వారే పావనముగా అయి వచ్చి, నా కంఠహారముగా అవుతారు. నిరాకారీ ప్రపంచములో ఆత్మలందరిదీ ఒక వంశవృక్షము తయారై ఉంది, దానిని నిరాకారీ వృక్షమని అంటారు. ఇది సాకార వృక్షము, నిరాకారీ ప్రపంచము నుండి అందరూ నంబరువారుగా రావాల్సి ఉంటుంది, అలా వస్తూనే ఉండాల్సి ఉంటుంది. వృక్షము ఎంత పెద్దది. ఆత్మ పాత్రను అభినయించేందుకని ఇక్కడకు వస్తుంది. ఆత్మలందరూ ఈ డ్రామాలోని పాత్రధారులు. ఆత్మ అవినాశీ, ఆత్మలోని పాత్ర కూడా అవినాశీ అయినది. డ్రామా ఎప్పుడు తయారయ్యింది అనేది చెప్పలేము. ఇది నడుస్తూనే ఉంటుంది. భారతవాసులు మొట్టమొదట సుఖములో ఉండేవారు, ఆ తర్వాత దుఃఖములోకి వచ్చారు, మళ్ళీ శాంతిధామములోకి వెళ్ళాలి. ఆ తర్వాత తండ్రి సుఖధామములోకి పంపిస్తారు. ఇందులో ఎవరు ఎంత పురుషార్థము చేస్తే అంత ఉన్నత పదవిని పొందుతారు. తండ్రి రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. పురుషార్థానుసారముగా ఆ రాజ్యములో పదవిని పొందుతారు. సత్యయుగములోనైతే తప్పకుండా కొద్దిమంది మనుష్యులే ఉంటారు. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క వృక్షము చిన్ననిది, ఇక మిగిలినదంతా వినాశనమైపోతుంది. ఈ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము స్థాపనవుతోంది అనగా స్వర్గము యొక్క గేట్లు తెరుచుకుంటున్నాయి. 5 వేల సంవత్సరాల క్రితం కూడా ఈ యుద్ధము తర్వాత స్వర్గ స్థాపన జరిగింది, అనేక ధర్మాలు వినాశనమైపోయాయి. ఈ యుద్ధాన్ని కళ్యాణకారీ యుద్ధమని అంటారు. ఇప్పుడు నరకము యొక్క గేట్లు తెరుచుకుని ఉన్నాయి, ఆ తర్వాత స్వర్గము యొక్క గేట్లు తెరుచుకుంటాయి. స్వర్గ ద్వారాలను తండ్రి తెరుస్తారు, నరక ద్వారాలను రావణుడు తెరుస్తాడు. తండ్రి వారసత్వాన్ని ఇస్తారు, రావణుడు శాపాన్ని ఇస్తాడు. ఈ విషయాలు ప్రపంచములోని వారికి తెలియదు, నేను పిల్లలైన మీకు అర్థం చేయిస్తాను. ఎడ్యుకేషన్ మినిష్టర్ కూడా అనంతమైన జ్ఞానాన్ని కావాలనుకుంటున్నారు. దానిని కేవలం మీరు మాత్రమే ఇవ్వగలరు. కానీ మీరు గుప్తముగా ఉన్నారు. మిమ్మల్ని గుర్తించనే గుర్తించరు. మీరు యోగబలముతో మీ రాజ్యాన్ని తీసుకుంటున్నారు. లక్ష్మీ-నారాయణులు ఈ రాజ్యాన్ని ఎలా పొందారు అనేది మీకు తెలుసు. దీనిని శుభప్రదమైన కళ్యాణకారీ యుగమని అంటారు. ఈ సమయములో తండ్రి వచ్చి పావనముగా తయారుచేస్తారు. శ్రీకృష్ణుడినైతే అందరూ తండ్రి అని అనరు. తండ్రి అని నిరాకారుడినే అంటారు, ఆ తండ్రిని స్మృతి చేయాలి, పావనముగా కూడా అవ్వాలి. వికారాలను తప్పకుండా వదలాల్సి ఉంటుంది. భారత్ నిర్వికారీ సుఖధామముగా ఉండేది, ఇప్పుడు వికారీగా, దుఃఖధామముగా ఉంది. పైసకు కొరగానిదిగా ఉంది. ఇది డ్రామా ఆట, దీనిని బుద్ధిలో ధారణ చేసి ఇతరులకు కూడా చేయించాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. స్మృతితో పావనముగా అయి తండ్రికి కంఠహారముగా అవ్వాలి. కర్మలు చేస్తూ కూడా తండ్రి స్మృతిలో ఉంటూ వికర్మాజీతులుగా అవ్వాలి.

2. పుణ్యాత్ములుగా అయ్యేందుకు పూర్తి పురుషార్థాన్ని చేయాలి. దేహాభిమానాన్ని వదిలి దేహీ-అభిమానులుగా అవ్వాలి.

వరదానము:-
మీ బుద్ధి రూపీ నేత్రాన్ని క్లియర్ గా మరియు కేర్ ఫుల్ గా (స్పష్టముగా మరియు జాగ్రత్తగా) ఉంచుకునే మాస్టర్ నాలెడ్జ్ ఫుల్, పవర్ ఫుల్ భవ

ఎలాగైతే జ్యోతిష్కులు తమ జ్యోతిష్య జ్ఞానముతో, గ్రహాల జ్ఞానముతో రాబోయే ఆపదలను తెలుసుకుంటారో, అలా పిల్లలైన మీరు ఇన్ అడ్వాన్స్ (ముందుగానే) మాయ ద్వారా వచ్చే పేపర్లను గమనించి పాస్ విత్ ఆనర్ గా తయారయ్యేందుకు మీ బుద్ధి రూపీ నేత్రాన్ని క్లియర్ గా (స్పష్టముగా) చేసుకోండి మరియు కేర్ ఫుల్ గా (జాగ్రత్తగా) ఉండండి. రోజురోజుకు స్మృతి యొక్క శక్తిని మరియు సైలెన్స్ శక్తిని పెంచుకోండి. అప్పుడు, ఈ రోజు ఏదో జరగబోతుంది అని ముందే తెలుస్తుంది. మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ గా, శక్తిశాలిగా అయినట్లయితే ఎప్పుడూ ఓడిపోరు.

స్లోగన్:-
పవిత్రతయే నవీనత మరియు ఇదే జ్ఞానానికి పునాది.

అవ్యక్త ప్రేరణలు - ‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’

పిల్లలైన మీ నడవడికలో మధురత మరియు మనసులో అనంతమైన వైరాగ్య వృత్తి ఉండాలి. రెండింటి స్మృతి ఉన్నట్లయితే పాస్ విత్ ఆనర్ గా అవుతారు. మధురత మరియు నమ్రత, ఈ రెండు విశేష ధారణల ద్వారా సదా విశ్వ కళ్యాణకారులుగా, మహాదానులుగా, వరదానులుగా అవుతారు మరియు సహజముగానే స్నేహానికి ఋజువును ఇవ్వగలరు.