16-07-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఇది పురుషోత్తములుగా తయారయ్యేటటువంటి సంగమయుగము, ఈ యుగములో ఎటువంటి పాప కర్మలు చేయకూడదు’’

ప్రశ్న:-
సంగమములో పిల్లలైన మీరు అన్నింటికన్నా గొప్ప పుణ్యము ఏమి చేస్తారు?

జవాబు:-
స్వయాన్ని తండ్రికి అర్పించడము అనగా సంపూర్ణముగా స్వాహా అవ్వడము, ఇది అన్నింటికన్నా గొప్ప పుణ్యము. ఇప్పుడు మీరు మమకారాన్ని తొలగించుకుంటారు. పిల్లలు, ఇళ్ళు-వాకిళ్ళు అన్నింటినీ మర్చిపోతారు, ఇదే మీ వ్రతము. మీరు మరణించినట్లయితే మీకు సంబంధించినంత వరకు ఈ ప్రపంచము మరణించినట్లే. ఇప్పుడు మీరు వికారీ సంబంధాల నుండి ముక్తులుగా అవుతారు.

పాట:-
దీపపు పురుగులు ఎందుకు కాలిపోవు...

ఓంశాంతి
భక్తి మార్గములో తండ్రికి ఈ విధముగా మహిమ చేస్తారు. ఇది దీపం కోసం దీపం పురుగులు చేసే మహిమ, తండ్రి వచ్చినప్పుడు జీవించి ఉండగానే వారికి చెందినవారిగా ఎందుకు అవ్వకూడదు. జీవిస్తూ మరణించడమంటే దత్తత తీసుకోబడడమని అర్థం. ఇంతకుముందు మీరు ఆసురీ పరివారానికి చెందినవారిగా ఉండేవారు, ఇప్పుడు మీరు ఈశ్వరీయ పరివారానికి చెందినవారిగా అయ్యారు. జీవించి ఉండగానే ఈశ్వరుడు వచ్చి మిమ్మల్ని దత్తత తీసుకున్నారు, దానినే శరణాగతి అని అనడము జరుగుతుంది. నేను మీ శరణులోకి వచ్చాను... అని పాడుతారు కదా. ఎప్పుడైతే ప్రభు వచ్చి, వారి శక్తిని చూపిస్తారో, సత్తాను చూపిస్తారో, అప్పుడే వారి శరణు లభిస్తుంది. వారే సర్వశక్తివంతుడు కదా. తప్పకుండా వారిలో ఆకర్షణ కూడా ఉంది కదా. అన్నింటినీ విడిపిస్తారు. ఎవరైతే నిజంగా తండ్రికి కుమారులుగా మరియు కుమార్తెలుగా అవుతారో, వారు ఆసురీ సాంప్రదాయ సంబంధాలతో విసిగిపోతారు. బాబా, ఈ సంబంధాలు ఎప్పుడు దూరమవుతాయి అని అడుగుతారు. ఇక్కడ ఈ పాత సంబంధాలను మర్చిపోవాల్సి ఉంటుంది. ఆత్మ దేహము నుండి వేరైనప్పుడు బంధనాలు సమాప్తమవుతాయి. అందరికీ మృత్యువు ఉంటుందని మరియు ఇవన్నీ వికారీ బంధనాలన్నీ ఈ సమయములో మీకు తెలుసు. ఇప్పుడు పిల్లలు నిర్వికారీ సంబంధాలను కోరుకుంటున్నారు. ఇంతకుముందు నిర్వికారీ సంబంధాలలో ఉండేవారు, తర్వాత వికారీ సంబంధాలలోకి వచ్చారు, మళ్ళీ మనకు నిర్వికారీ సంబంధాలు ఉంటాయి. ఈ విషయాలు ఇంకెవరి బుద్ధిలోనూ ఉండవు. మనము ఆసురీ బంధనాల నుండి ముక్తులుగా అయ్యే పురుషార్థము చేస్తున్నామని పిల్లలకు తెలుసు. ఒక్క తండ్రితో యోగము జోడించడము జరుగుతుంది. అటువైపు ఒక రావణుడు ఉన్నాడు, ఇటువైపు ఒక రాముడు ఉన్నారు. ఈ విషయాలు ప్రపంచానికి తెలియవు. రామరాజ్యము కావాలని అంటారు కూడా, కానీ ప్రపంచమంతా రావణ రాజ్యములో ఉంది, ఇది ఎవరూ అర్థం చేసుకోరు. రామ రాజ్యములోనైతే పవిత్రత, సుఖ-శాంతులు ఉండేవి, అవి ఇప్పుడు లేవు. కానీ వారు ఏదైతే చెప్తున్నారో, దానిని అనుభూతి చేయరు. ఈ ఆత్మలందరూ సీతలని అంటూ ఉంటారు. ఇది ఒక్క సీత విషయము కాదు, అలాగే ఒక్క అర్జునుడు లేక ఒక్క ద్రౌపది విషయము కాదు. ఇది అనేకుల విషయము. ఉదాహరణగా ఒక్కరిని చూపిస్తారు. మీరంతా అర్జునుడి వలె ఉన్నారని మీకు కూడా చెప్పడము జరుగుతుంది. మీరంటారు - అర్జునుడే, ఈ భగీరథుడయ్యారు. తండ్రి అంటారు - నేను ఈ సాధారణ వృద్ధ తనువును రథముగా తీసుకుంటాను. వారేమో చిత్రాలలో గుర్రాల రథాన్ని చూపించారు, దీనిని అజ్ఞానమని అంటారు. ఈ శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గానికి చెందినవని పిల్లలు అర్థం చేసుకుంటారు. 7 రోజులు అర్థం చేసుకోవాల్సిన కోర్సు తీసుకోనంతవరకు ఈ విషయాలను ఎవరూ అర్థం చేసుకోలేరు. భక్తి వేరు. జ్ఞానము, భక్తి మరియు వైరాగ్యము అని అంటారు. వాస్తవానికి సన్యాసుల వైరాగ్యము సత్యమైనదేమీ కాదు, వారు అడవులకు వెళ్ళి, తర్వాత వచ్చి పట్టణాలలో నివసిస్తూ పెద్ద-పెద్ద ఇళ్ళు కట్టుకుంటారు. మేము ఇళ్ళు-వాకిళ్ళను వదిలేశామని కేవలం మాట వరుసకు అంటారు. మీది మొత్తం పాత ప్రపంచముతో వైరాగ్యము. ఇది యథార్థమైన విషయము, అది హద్దు విషయము, అందుకే దానిని హఠయోగమని, హద్దు వైరాగ్యమని అంటారు.

ఈ పాత ప్రపంచము ఇప్పుడు సమాప్తమవ్వనున్నదని పిల్లలైన మీకు తెలుసు, అందుకే తప్పకుండా దీని పట్ల వైరాగ్యము కలగాలి. కొత్త ఇల్లు తయారైతే పాత ఇంటిని పడగొట్టడము జరుగుతుందని బుద్ధి కూడా చెప్తుంది. ఇప్పుడు ఏర్పాట్లు జరుగుతున్నాయని మీకు తెలుసు. కలియుగము తర్వాత మళ్ళీ సత్యయుగము తప్పకుండా వస్తుంది. ఇప్పుడిది పురుషోత్తమ సంగమయుగము. పురుషోత్తమ మాసం కూడా ఉంటుంది. మీది పురుషోత్తమ యుగము. పురుషోత్తమ మాసంలో దానపుణ్యాలు మొదలైనవి చేస్తారు. మీరు ఈ పురుషోత్తమ యుగములో సర్వస్వాన్ని స్వాహా చేస్తారు. ఈ ప్రపంచమంతా స్వాహా అవ్వనున్నదని మీకు తెలుసు. కావున ప్రపంచములోని సర్వస్వము స్వాహా అయ్యే కన్నా ముందే మనము స్వయాన్ని ఎందుకు స్వాహా చేసుకోకూడదు. ఇలా చేస్తే మీకు ఎంత పుణ్యము లభిస్తుంది. అది హద్దులోని పురుషోత్తమ మాసం కానీ ఇక్కడ ఉన్నది అనంతమైన విషయము. పురుషోత్తమ మాసంలో చాలా కథలు వింటారు, వ్రతాలు-నియమాలు ఆచరిస్తారు. మీదైతే చాలా భారీ వ్రతము. మీకు పిల్లలు, ఇళ్ళు-వాకిళ్ళు మొదలైనవన్నీ ఉన్నాయి కానీ మనసులో నుండి మమకారము తొలగిపోయింది. మీరు మరణించినట్లయితే మీకు సంబంధించినంత వరకు ఈ ప్రపంచము మరణించినట్లే. అంతా సమాప్తమైపోతారని మీకు తెలుసు. మనము పురుషోత్తములుగా అయ్యేందుకని తండ్రికి చెందినవారిగా అయ్యాము. సర్వ పురుషులలో అనగా మనుష్యులందరిలోనూ ఉత్తమ పురుషులైన ఈ లక్ష్మీ-నారాయణులు ఎదురుగా నిలబడి ఉన్నారు. వీరి కన్నా ఉత్తమమైన మనుష్యులు ఇంకెవరూ ఉండరు. లక్ష్మీ-నారాయణులు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. మీరు వారి వలె పురుషోత్తములుగా అయ్యేందుకు వచ్చారు. మనుష్యమాత్రులందరూ సద్గతిని పొందుతారు. మనుష్య ఆత్మలు పురుషోత్తమముగా అయినప్పుడు వారు నివసించే స్థానము కూడా ఆ విధముగా ఉత్తమముగా ఉండాలి. ఉదాహరణకు ప్రెసిడెంట్ అందరికన్నా ఉన్నత పదవిలో ఉన్నారు కావున వారు నివసించేందుకు రాష్ట్రపతి భవన్ లభించింది. అక్కడ ఎంత పెద్ద మహల్, ఉద్యానవనము మొదలైనవి ఉన్నాయి. ఇది ఇక్కడి విషయము. రామ రాజ్యము గురించైతే మీకు తెలుసు. మీరు సత్యయుగీ పురుషోత్తములుగా అవుతారు, అప్పుడిక ఈ కలియుగీ పురుషోత్తములు ఉండరు. మీరు సత్యయుగీ పురుషోత్తములుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. మన మహళ్ళు ఎలా తయారై ఉంటాయి అనేది మీకు తెలుసు. రేపు రామ రాజ్యము ఉంటుంది. రామ రాజ్యములో మీరు పురుషోత్తములుగా ఉంటారు. మేము రావణ రాజ్యాన్ని పరివర్తన చేసి రామ రాజ్యాన్ని స్థాపన చేస్తామని మీరు ఛాలెంజ్ చేస్తారు. ఇప్పుడు ఛాలెంజ్ చేసారు కావున ఒకరినొకరు - భవిష్య 21 జన్మల కొరకు పురుషోత్తములుగా తయారుచేయాలి. సర్వగుణ సంపన్నులు... అహింసా పరమో దేవీ-దేవతా ధర్మము అని దేవతల మహిమను పాడుతారు. ఇది మీకు తెలుసు, ఇతర మనుష్యులెవరికీ తెలియదు. మీరు మరుసటి జన్మలో పురుషోత్తములుగా అవుతారు, అప్పుడిక ఈ రావణ రాజ్యానికి చెందినవారెవరూ ఉండరు. ఇప్పుడు మీకు జ్ఞానమంతా ఉంది. ఇప్పుడిక రావణ రాజ్యము సమప్తమవ్వనున్నది.

ఈ రోజుల్లోనైతే సమయముపై కూడా ఎటువంటి నమ్మకము లేదు, అకాల మృత్యువులు జరుగుతాయి లేదా ఎవరితోనైనా శత్రుత్వము ఏర్పడితే వారిని అంతం చేసేస్తారు. మిమ్మల్ని ఎవరూ అంతం చేయలేరు. మీరు అవినాశీ పురుషోత్తములు, ఇక్కడ ఉన్నవారు వినాశీ పురుషోత్తములు, అది కూడా రావణ రాజ్యములో ఉన్నారు. వీరికి మీ దైవీ రాజ్యము గురించి అసలు తెలియనే తెలియదు. మనము శ్రీమతము అనుసారముగా మన దైవీ స్వరాజ్యాన్ని స్థాపన చేసుకుంటున్నామని మీకు తెలుసు. ఎవరికైతే పూజ జరుగుతుందో, వారు తప్పకుండా మంచి కర్తవ్యము చేసి వెళ్ళారని మీకు తెలుసు. జగదాంబకు ఎంతగా పూజ జరుగుతుందో చూడండి. ఇప్పుడు వీరు జ్ఞాన-జ్ఞానేశ్వరి. మీరు జగదాంబకు కుమార్తెలు, మీరు జ్ఞాన-జ్ఞానేశ్వరులు మరియు రాజ-రాజేశ్వరులు. ఇరువురిలో ఉత్తములు ఎవరు? జ్ఞాన-జ్ఞానేశ్వరి వద్దకు వెళ్ళి అనేక రకాల మనోకామనలను వినిపిస్తారు. అనేక వస్తువులను అడుగుతారు. జగదాంబ మందిరానికి మరియు లక్ష్మీ-నారాయణుల మందిరానికి చాలా తేడా ఉంది. జగదాంబ మందిరము చాలా చిన్ననిది. చిన్న స్థలములో మనుష్యులు గుంపును ఇష్టపడతారు. శ్రీనాథ మందిరములో కూడా చాలా గుంపు ఉంటుంది. వారిని ముందుకు కదలమని వస్త్రము యొక్క కర్రతో కొడుతూ ఉంటారు. కలకత్తాలో కాళీ మందిరము ఎంత చిన్ననిది, లోపల చాలా నూనె మరియు నీళ్ళు ఉంటాయి. లోపలకు చాలా జాగ్రత్తగా వెళ్ళాల్సి ఉంటుంది. చాలా గుంపు ఉంటుంది. లక్ష్మీ-నారాయణుల మందిరమైతే చాలా పెద్దగా ఉంటుంది. జగదాంబ మందిరము చిన్నదిగా ఎందుకుంటుంది? ఆమె పేదవారు కదా. కావున మందిరము కూడా పేదగానే ఉంటుంది. వారు (లక్ష్మీ-నారాయణులు) షావుకారులు కావున మందిరాలలో ఎప్పుడూ మేళాలు జరగవు. జగదాంబ మందిరాల వద్దన చాలా మేళాలు జరుగుతాయి. బయట నుండి చాలామంది వస్తారు. మహాలక్ష్మి మందిరము కూడా ఉంది, మహాలక్ష్మి అంటే అందులో లక్ష్మీ మరియు నారాయణుడు, ఇరువురూ ఉన్నారని మీకు తెలుసు. లక్ష్మిని కేవలం ధనము మాత్రమే అడుగుతారు ఎందుకంటే ఆమె ధనవంతురాలిగా అయ్యారు కదా. ఇక్కడైతే అవినాశీ జ్ఞాన రత్నాలు ఉన్నాయి. ధనము కోసం లక్ష్మి వద్దకు వెళ్తారు, మిగిలిన కోరికలు ఎన్నో పెట్టుకుని జగదాంబ వద్దకు వెళ్తారు. మీరు జగదాంబకు పిల్లలు. అందరి మనోకామనలను 21 జన్మల కోసం మీరు పూర్తి చేస్తారు. ఒకే మహామంత్రముతో అన్ని మనోకామనలు 21 జన్మల కోసం పూర్తవుతున్నాయి. ఇతరులు మంత్రాలు మొదలైనవి ఏవైతే ఇస్తారో, వాటిలో ఎటువంటి అర్థము ఉండదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఈ మంత్రాన్ని కూడా మీకు ఎందుకిస్తానంటే మీరు పతితులుగా ఉన్నారు కదా. నన్నొక్కరిని స్మృతి చేసినప్పుడే మీరు పావనముగా అవుతారు. తండ్రి తప్ప ఆత్మలకు ఈ విధముగా ఇంకెవరూ చెప్పలేరు. దీని బట్టి ఈ సహజ రాజయోగాన్ని ఒక్క తండ్రి మాత్రమే నేర్పిస్తారని నిరూపించబడుతుంది. మంత్రాన్ని కూడా వారే ఇస్తారు. 5 వేల సంవత్సరాల క్రితం కూడా మంత్రాన్ని ఇచ్చారు, ఈ స్మృతి కలిగింది. ఇప్పుడు మీరు సమ్ముఖములో కూర్చుని ఉన్నారు. క్రైస్టు వచ్చి వెళ్ళారు, ఆ తర్వాత వారి బైబిల్ ను చదువుకుంటూ ఉంటారు. వారు ఏమి చేసి వెళ్ళారు? ధర్మ స్థాపన చేసి వెళ్ళారు. శివబాబా ఏమి చేసి వెళ్ళారు, శ్రీకృష్ణుడు ఏమి చేసి వెళ్ళారు అనేది మీకు తెలుసు! శ్రీకృష్ణుడైతే సత్యయుగ రాకుమారుడు, అతడే తర్వాత నారాయణుడిగా అయ్యారు, పునర్జన్మలు తీసుకుంటూ వచ్చారు. శివబాబా కూడా ఏదో చేసి వెళ్ళారు, అందుకే వారికి ఇంతగా పూజలు మొదలైనవన్నీ జరుగుతున్నాయి. ఇప్పుడు మీకు తెలుసు - వారు రాజయోగాన్ని నేర్పించి వెళ్ళారు, భారత్ ను స్వర్గముగా తయారుచేసి వెళ్ళారు, ఆ స్వర్గానికి మొదటి నంబరు యజమానిగా వారు స్వయము అవ్వలేదు, శ్రీకృష్ణుడు అయ్యారు. తప్పకుండా శ్రీకృష్ణుని ఆత్మను చదివించారని మీరు అర్థం చేసుకున్నారు. శ్రీకృష్ణుని వంశావళి అయిన మీరు కూర్చుని ఉన్నారు. రాజు-రాణులను తల్లి-తండ్రి అని, అన్నదాత అని అంటారు. రాజస్థాన్ లో కూడా రాజును అన్నదాత అని అంటారు. రాజులకు ఎంత గౌరవము ఉంటుంది. ఇంతకుముందు ఫిర్యాదులన్నీ రాజు వద్దకు వచ్చేవి, దర్బారు ఏర్పాటు అయ్యేది. ఎవరైనా తప్పు చేస్తే చాలా పశ్చాత్తాప పడేవారు. ఈ రోజుల్లోనైతే జైలు పక్షులు చాలామంది ఉన్నారు. పదే-పదే జైలుకు వెళ్తారు. ఇప్పుడు పిల్లలైన మీరు గర్భ జైలులోకి వెళ్ళకూడదు, మీరైతే గర్భ మహల్ లోకి వెళ్ళాలి, అందుకే తండ్రిని స్మృతి చేస్తే వికర్మలు వినాశనము అవుతాయి, ఇంకెప్పుడూ గర్భ జైలులోకి వెళ్ళరు. అక్కడ పాపము జరగదు. అందరూ గర్భ మహల్ లో ఉంటారు, కేవలం తక్కువ పురుషార్థము చేసిన కారణముగా తక్కువ పదవిని పొందుతారు. ఉన్నత పదవిలో ఉన్నవారికి సుఖము కూడా చాలా ఉంటుంది. ఇక్కడైతే కేవలం 5 సంవత్సరాల కోసం గవర్నర్ ను, ప్రెసిడెంట్ ను నియమిస్తారు. భారత్ యే దైవీ రాజస్థాన్ గా అయిందని మీరు అర్థం చేయించవచ్చు. ఇప్పుడైతే రాజస్థానూ లేదు, రాజు-రాణి కూడా లేరు. ఇంతకుముందు ఎవరైనా గవర్నమెంట్ కు ధనమిస్తే మహారాజు, మహారాణి అనే టైటిల్ లభించేది. ఇక్కడ మీదైతే చదువు. రాజు-రాణిగా చదువు ద్వారా ఎప్పుడూ అవ్వరు. ఈ చదువు ద్వారా మీరు రాజు-రాణిగా కూడా కాదు, విశ్వానికి మహారాజు-మహారాణిగా అవుతారు, ఇది మీ లక్ష్యము-ఉద్దేశ్యము. రాజు-రాణి అనే టైటిల్ త్రేతా నుండి మొదలవుతుంది.

మీరు ఇప్పుడు జ్ఞాన-జ్ఞానేశ్వరులుగా అవుతారు, తర్వాత రాజ-రాజేశ్వరులుగా అవుతారు. అలా ఎవరు తయారుచేస్తారు? ఈశ్వరుడు. ఎలా తయారుచేస్తారు? రాజయోగము మరియు జ్ఞానము ద్వారా. రాజ్యము కోసం తండ్రిని స్మృతి చేయాలి. తండ్రి మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారు, ఇదైతే చాలా సహజము కదా. స్వర్గాన్ని స్థాపన చేసేవారు గాడ్ ఫాదర్. స్వర్గములోనైతే స్వర్గాన్ని స్థాపన చేయరు. తప్పకుండా వారికి సంగమయుగములో పదవి లభిస్తుంది, అందుకే దీనిని మనోహరమైన కళ్యాణకారీ సంగమయుగము అని అంటారు. తండ్రి పిల్లల కళ్యాణాన్ని ఎంతగా చేస్తారంటే, వారిని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారు. పరమపిత పరమాత్మ కొత్త ప్రపంచాన్ని రచిస్తారని అంటారు కూడా, కానీ అందులో ఎవరు రాజ్యము చేస్తారు అనేది ఎవరికీ తెలియదు. రామ రాజ్యము అని దేనినంటారు అనేది మీకు తెలుసు. వారైతే రామ రాజ్యానికి లక్షల సంవత్సరాలు చూపించారు. కలియుగానికి 40 వేల సంవత్సరాలు చూపించారు. తండ్రి అంటారు - నేను సంగమయుగములోనే వస్తాను, వచ్చి బ్రహ్మా ద్వారా విష్ణుపురిని స్థాపన చేస్తాను. సత్యనారాయణుని కథ కూడా ఇదే. సత్యయుగములో మీరు లక్ష్మీ-నారాయణులుగా, సర్వగుణ సంపన్నులుగా... అవుతారు. తర్వాత కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఎప్పుడైతే స్థాపన జరుగుతుందో, అప్పుడు దానిని కొత్త వృక్షమని అంటారు. కొత్త ఇల్లు తయారైనప్పుడు కొత్తది అని అంటారు. మీరు కూడా సత్యయుగములోకి వచ్చినప్పుడు కొత్త రాజధాని ఉంటుంది, తర్వాత కళలు తగ్గిపోతూ ఉంటాయి. స్థాపన ఇక్కడ జరుగుతుంది. ఈ అద్భుతమైన విషయాలు ఎవరి బుద్ధిలోనూ లేవు. కావున తండ్రి అర్థం చేయించారు, ఈ యుగము ఆత్మలందరికీ పురుషోత్తములుగా అయ్యే యుగము. జీవన్ముక్తిని పురుషోత్తమమని అంటారు. జీవన బంధనాన్ని పురుషోత్తమమని అనరు. ఈ సమయములో అందరూ జీవన బంధనములో ఉన్నారు. తండ్రి వచ్చి అందరినీ జీవన్ముక్తులుగా చేస్తారు. మీరు అర్ధకల్పము జీవన్ముక్తులుగా ఉంటారు, తర్వాత జీవన బంధనములోకి వస్తారు. ఇది మీరు అర్థం చేసుకుంటారు. మీ వ్రతము, నియమము ఏమిటి? బాబా వచ్చి వ్రతము చేపట్టేలా చేసారు. ఇది ఆహార-పానీయాల విషయము కాదు. అన్నీ చేయండి కానీ ఒకటి తండ్రిని స్మృతి చేయండి మరియు పవిత్రముగా అవ్వండి. పురుషోత్తమ మాసంలో చాలావరకు పవిత్రముగా కూడా ఉంటారు. వాస్తవానికి ఈ పురుషోత్తమ యుగానికి గౌరవము ఉంది కనుక మీకు ఎంత సంతోషము, ఎంత నషా ఉండాలి. ఇప్పుడు మీ ద్వారా ఎటువంటి పాప కర్మ జరగకూడదు, ఎందుకంటే మీరు పురుషోత్తములుగా అవుతున్నారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ పురుషోత్తమ యుగములో జీవన్ముక్తులుగా అయ్యేందుకు పుణ్య కర్మలు చేయాలి. పవిత్రముగా తప్పకుండా ఉండాలి. ఇళ్ళు-వాకిళ్ళు మొదలైనవన్నీ ఉన్నప్పటికీ మనసులో నుండి మమకారాన్ని తొలగించాలి.

2. శ్రీమతము అనుసారముగా తమ తనువు-మనసు-ధనముతో దైవీ రాజ్యాన్ని స్థాపన చేయాలి. పురుషోత్తములుగా తయారుచేసే సేవను చేయాలి.

వరదానము:-
సహయోగము ద్వారా స్వయాన్ని సహజయోగిగా చేసుకునే నిరంతర యోగీ భవ

సంగమయుగములో తండ్రికి సహయోగులుగా అవ్వడము - ఇదే సహజయోగులుగా అయ్యేందుకు విధి. ఎవరి ప్రతి సంకల్పము, మాట మరియు కర్మ బాబా కర్తవ్యములో లేక తమ రాజ్య స్థాపనా కర్తవ్యములో సహయోగిగా ఉండేలా ఉంటాయో, వారిని జ్ఞాన స్వరూప, యోగ స్వరూప ఆత్మ, నిరంతర సత్యమైన సేవాధారి అని అనడము జరుగుతుంది. మనసు ద్వారా అవ్వకపోతే తనువు ద్వారా, తనువు ద్వారా అవ్వకపోతే ధనము ద్వారా, ధనము ద్వారా కూడా అవ్వకపోతే దేని ద్వారా సహయోగులుగా అవ్వగలరో, దాని ద్వారా సహయోగులుగా అవ్వండి, ఇది కూడా యోగము వంటిదే. మీరు బాబాకు చెందినవారిగా అయ్యారు కనుక, ఇక బాబా మరియు మీరు - మూడవ వారెవ్వరూ ఉండకూడదు, దీని ద్వారా నిరంతర యోగులుగా అయిపోతారు.

స్లోగన్:-
సంగమయుగములో సహనము చేయడము అనగా మరణించడమే స్వర్గ రాజ్యాన్ని తీసుకోవడము.

అవ్యక్త ప్రేరణలు - జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవము చేయండి

సమయము అనుసారముగా మనసులో, సంబంధ-సంపర్కాలలో మిగిలి ఉన్న లెక్కాచారాలు ఏవైతే ఉన్నాయో, వాటిని జ్వాలా స్వరూపపు స్మృతిలో భస్మము చేయండి. తపన ఉంది అన్న విషయములో బాప్ దాదా కూడా పాస్ చేస్తారు కానీ ఇప్పుడు తపనను అగ్ని రూపములోకి తీసుకురండి. విశ్వములో నలువైపులా భ్రష్టాచారము, అత్యాచారము అనే అగ్ని ఏదైతే కాలుతూ ఉందో, అది పిల్లలైన మీ యోగాగ్ని ద్వారా, జ్వాలా రూపపు స్మృతి ద్వారా సమాప్తము అవుతుంది.