17-01-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - ఈ భారత్ స్వర్గముగా ఉన్నప్పుడు మీరు
అత్యంత ప్రకాశములో ఉండేవారు, ఇప్పుడు అంధకారము ఉంది, మళ్ళీ ప్రకాశములోకి పదండి’’
ప్రశ్న:-
తండ్రి
తమ పిల్లలకు ఏ కథను వినిపించడానికి వచ్చారు?
జవాబు:-
బాబా
అంటున్నారు - మధురమైన పిల్లలూ, నేను మీకు 84 జన్మల కథను వినిపిస్తాను. మీరు
మొట్టమొదటి జన్మలో ఉన్నప్పుడు ఒకే దైవీ ధర్మము ఉండేది, మళ్ళీ మీరే రెండు యుగాల
తర్వాత పెద్ద-పెద్ద మందిరాలను నిర్మించారు. భక్తిని ప్రారంభించారు. ఇప్పుడు ఇది మీ
అంతిమములో కూడా అంతిమ జన్మ. దుఃఖహర్త, సుఖకర్త రండి... అని మీరు పిలిచారు. ఇప్పుడు
నేను వచ్చాను.
పాట:-
నేడు మానవుడు
అంధకారములో ఉన్నాడు...
ఓంశాంతి
ఇప్పుడిది కలియుగీ ప్రపంచమని, అందరూ అంధకారములో ఉన్నారని పిల్లలైన మీకు తెలుసు.
మొదట భారత్ స్వర్గముగా ఉన్నప్పుడు ప్రకాశములో ఉండేవారు. ఇప్పుడు తమను తాము
హిందువులుగా పిలుచుకునే ఈ భారతవాసులే, వాస్తవానికి దేవీ-దేవతలుగా ఉండేవారు. ఇతర ఏ
ధర్మమూ లేనప్పుడు భారత్ లో స్వర్గవాసులు ఉండేవారు. అప్పుడు ఒకే ధర్మముండేది.
స్వర్గము, వైకుంఠము, బహిష్త్, హెవెన్ - ఇవన్నీ ఈ భారత్ యొక్క పేర్లే. భారత్
పవిత్రముగా మరియు ప్రాచీనముగా, ఎంతో సంపన్నముగా ఉండేది. ఇప్పుడైతే భారత్ నిరుపేదగా
ఉంది ఎందుకంటే ఇప్పుడిది కలియుగము. మనము అంధకారములో ఉన్నామని మీకు తెలుసు.
స్వర్గములో ఉన్నప్పుడు ప్రకాశములో ఉండేవారము. స్వర్గపు రాజ-రాజేశ్వరుడు,
రాజ-రాజేశ్వరిగా శ్రీ లక్ష్మీ-నారాయణులు ఉండేవారు. దానిని సుఖధామమని అంటారు. తండ్రి
నుండే మీరు స్వర్గ వారసత్వాన్ని తీసుకునేది ఉంది, దానిని జీవన్ముక్తి అని అంటారు.
ఇప్పుడైతే అందరూ జీవన బంధనములో ఉన్నారు. ముఖ్యముగా భారత్ మరియు మిగిలిన ప్రపంచమంతా
రావణుడి జైలులో, శోకవాటికలో ఉన్నారు. రావణుడు కేవలం లంకలో ఉండేవారని మరియు రాముడు
భారత్ లో ఉండేవారని, రావణుడు వచ్చి సీతను అపహరించాడని కాదు. ఇవన్నీ కల్పితమైన కథలు.
గీత ముఖ్యమైనది, అది సర్వశాస్త్రమయి శిరోమణి, శ్రీమతము అనేది భగవంతుని ద్వారా భారత్
లో వినిపించబడినది. మనుష్యులైతే ఎవరి సద్గతిని చేయలేరు. సత్యయుగములో జీవన్ముక్త
దేవీ-దేవతలు ఉండేవారు, వారు ఈ వారసత్వాన్ని కలియుగాంతములో పొందారు. భారతవాసులకు ఇది
తెలియదు, అలాగే ఇది ఏ శాస్త్రాలలోనూ లేదు. శాస్త్రాలలో భక్తి మార్గపు జ్ఞానముంది.
సద్గతి మార్గపు జ్ఞానము మనుష్యమాత్రులలో ఏ మాత్రమూ లేదు. అందరూ భక్తిని
నేర్పించేవారే. శాస్త్రాలు చదవండి, దాన-పుణ్యాలు చేయండని అంటారు. ఈ భక్తి ద్వాపరము
నుండి కొనసాగుతూ వస్తుంది. సత్య, త్రేతాయుగాలలో ఉన్నది జ్ఞాన ప్రారబ్ధము. అక్కడ కూడా
ఈ జ్ఞానము కొనసాగుతూ వస్తుందని కాదు. భారత్ కు ఈ వారసత్వమేదైతే ఉండేదో, అది తండ్రి
ద్వారా సంగమయుగములోనే లభించింది, అది మళ్ళీ ఇప్పుడు మీకు లభిస్తుంది. భారతవాసులు
ఎప్పుడైతే నరకవాసులుగా, అనంతమైన దుఃఖితులుగా అవుతారో, అప్పుడు - ఓ పతిత-పావనా,
దుఃఖహర్త, సుఖకర్త అని పిలుస్తారు. ఎవరికి? సర్వులకు, ఎందుకంటే ముఖ్యముగా భారత్ లో
మరియు పూర్తి ప్రపంచములో, అందరిలోనూ 5 వికారాలు ఉన్నాయి. తండ్రి పతిత-పావనుడు.
తండ్రి అంటారు, నేను కల్ప-కల్పము, కల్పము యొక్క సంగమములో వస్తాను, సర్వులకు
సద్గతిదాతగా అవుతాను. అహల్యలు, వేశ్యలు మరియు గురువులెవరైతే ఉన్నారో, వారందరి
ఉద్ధరణను నేనే చేయవలసి ఉంటుంది, ఎందుకంటే ఇది ఉన్నదే పతిత ప్రపంచము. పావన ప్రపంచమని
సత్యయుగాన్ని అంటారు. భారత్ లో ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యముండేది. వీరు స్వర్గానికి
యజమానులుగా ఉండేవారు అన్నది భారతవాసులకు తెలియదు. పతిత ఖండము అనగా అసత్య ఖండము,
పావన ఖండము అనగా సత్య ఖండము. భారత్ పావన ఖండముగా ఉండేది, ఈ భారత్ అవినాశీ ఖండము, ఇది
ఎప్పుడూ వినాశనమవ్వదు. ఎప్పుడైతే వీరి రాజ్యము (లక్ష్మీ-నారాయణుల రాజ్యము) ఉండేదో,
అప్పుడు ఇతర ఖండాలేవీ లేవు. అవన్నీ తర్వాత వస్తాయి. మనుష్యులైతే కల్పము ఆయువును
లక్షల సంవత్సరాలని వ్రాసేసారు. తండ్రి అంటారు, కల్పము ఆయువు 5 వేల సంవత్సరాలు. అలాగే
మనుష్యులు 84 లక్షల జన్మలు తీసుకుంటారని వారంటారు. మనుష్యులను కుక్క, పిల్లి, గాడిద
మొదలైనవాటిలా చేసేసారు. కానీ కుక్కలు, పిల్లుల జన్మలు వేరు, 84 లక్షల వెరైటీలు
ఉన్నాయి. మనుష్యుల వెరైటీ అయితే ఒక్కటే. వారికే 84 జన్మలు ఉన్నాయి. తండ్రి అంటారు,
భారతవాసులు తమ ధర్మాన్ని డ్రామా ప్లాన్ అనుసారముగా మర్చిపోయారు. కలియుగాంతములో
పూర్తిగా పతితముగా అయిపోయారు. మళ్ళీ తండ్రి సంగమములో వచ్చి పావనముగా తయారుచేస్తారు,
దీనిని దుఃఖధామమని అంటారు, మళ్ళీ భారత్ సుఖధామముగా ఉంటుంది. తండ్రి అంటారు, ఓ
పిల్లలూ, భారతవాసులైన మీరు స్వర్గవాసులుగా ఉండేవారు, ఆ తర్వాత మీరు 84 జన్మల మెట్లను
దిగుతారు. సతో నుండి రజో, తమోలలోకి తప్పకుండా రావాలి. దేవతలైన మీ వంటి ధనవంతులుగా,
సదా సంతోషముగా, సదా ఆరోగ్యముగా, సదా సంపన్నముగా ఇంకెవ్వరూ ఉండరు. భారత్ ఎంత
షావుకారుగా ఉండేది, వజ్ర-వైఢూర్యాలైతే రాళ్ళ వలె ఎన్నో ఉండేవి. రెండు యుగాల తర్వాత
భక్తి మార్గములో ఇంత పెద్ద-పెద్ద మందిరాలను తయారుచేస్తారు. అది కూడా ఎంత పెద్ద
మందిరాలను తయారుచేసారు. సోమనాథ మందిరము అత్యంత పెద్దదిగా ఉండేది. కేవలం ఒక్క మందిరము
మాత్రమే ఉండదు కదా. ఇంకా ఎందరో రాజుల మందిరాలు ఉండేవి. ఎంతగా దోచుకొని
తీసుకువెళ్ళిపోయారు. తండ్రి పిల్లలైన మీకు స్మృతిని కలిగిస్తున్నారు. నేను మిమ్మల్ని
ఎంత షావుకార్లుగా తయారుచేసాను. యథా మహారాజా-మహారాణి, మీరు కూడా సర్వగుణ సంపన్నులుగా,
16 కళల సంపూర్ణులుగా ఉండేవారు. వారిని భగవాన్-భగవతి అని కూడా అనవచ్చు. కానీ తండ్రి
అర్థం చేయించారు - భగవంతుడు ఒక్కరే, వారే తండ్రి. కేవలం ఈశ్వరుడు లేక ప్రభువు అని
అనడముతో వారు సర్వాత్మలకు తండ్రి అన్నది గుర్తుకు రాదు. తండ్రి కూర్చుని కథను
వినిపిస్తారు. ఇప్పుడిది మీ అనేక జన్మల అంతిమ జన్మ. ఇది ఒక్కరి విషయము కాదు, అలాగని
యుద్ధ మైదానము మొదలైనవేవీ లేవు. తమ రాజ్యముండేది అని భారతవాసులు మర్చిపోయారు.
సత్యయుగ ఆయువును ఎక్కువగా చేయడము వలన చాలా దూరము తీసుకువెళ్ళిపోయారు. మనుష్యులను
భగవంతుడని అనలేరని తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు. మనుష్యులు ఎవ్వరికీ సద్గతిని
ఇవ్వలేరు. సర్వుల సద్గతిదాత, పతితుల పావనకర్త ఒక్కరే అని నానుడి ఉంది. సత్యమైన బాబా
ఒక్కరే ఉన్నారు, వారే సత్య ఖండాన్ని స్థాపన చేస్తారు. పూజలు కూడా చేస్తారు కానీ
భక్తి మార్గములో మీరు ఎవరి పూజనైతే చేస్తూ వచ్చారో, వారిలో ఒక్కరి జీవితచరిత్ర
గురించి కూడా మీకు తెలియదు. అందుకే తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు శివజయంతిని
జరుపుకుంటారు కదా. ఆ తండ్రి కొత్త ప్రపంచ రచయిత, వారు హెవెన్లీ గాడ్ ఫాదర్. వారు
అనంతమైన సుఖాన్ని ఇచ్చేవారు. సత్యయుగములో చాలా సుఖముండేది. దానిని ఎలా స్థాపించారు
మరియు ఎవరు స్థాపించారు? ఇది తండ్రియే కూర్చుని అర్థం చేయిస్తారు. వచ్చి నరకవాసులను
స్వర్గవాసులుగా తయారుచేయడము లేక భ్రష్టాచారులను శ్రేష్ఠాచారీ దేవతలుగా తయారుచేయడము,
ఈ పని తండ్రిదే. తండ్రి అంటారు, నేను పిల్లలైన మిమ్మల్ని పావనముగా తయారుచేస్తాను.
మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. మిమ్మల్ని పతితముగా ఎవరు తయారుచేస్తారు? ఈ
రావణుడు. దుఃఖాన్ని కూడా ఈశ్వరుడే ఇస్తారని మనుష్యులంటారు. తండ్రి అంటారు, నేనైతే
అందరికీ ఎంత సుఖాన్ని ఇస్తానంటే, ఇక మళ్ళీ అర్ధకల్పము వరకు మీరు తండ్రిని స్మరణ
చేయరు. మళ్ళీ ఎప్పుడైతే రావణ రాజ్యము ప్రారంభమవుతుందో, అప్పుడు అందరినీ పూజించడము
మొదలుపెడతారు. ఇది మీ అనేక జన్మల అంతిమ జన్మ. బాబా, మేము ఎన్ని జన్మలు తీసుకున్నాము
అని పిల్లలు అడుగుతారు. బాబా అంటారు - మధురాతి మధురమైన భారతవాసులు, ఓ ఆత్మలూ, నేను
ఇప్పుడు మీకు అనంతమైన వారసత్వాన్ని ఇస్తాను. పిల్లలూ, మీరు 84 జన్మలు తీసుకున్నారు.
ఇప్పుడు మీరు 21 జన్మల కోసం తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చారు. అందరూ
కలిసి రారు కదా. మీరే సత్యయుగ సూర్యవంశీ పదవిని మళ్ళీ తీసుకుంటారు అనగా సత్యాతి
సత్యమైన బాబా ద్వారా నరుని నుండి నారాయణునిగా అయ్యే సత్య జ్ఞానాన్ని వింటారు. ఇది
జ్ఞానము, అది భక్తి. శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గము కోసం ఉన్నాయి. అవి జ్ఞాన
మార్గానికి చెందినవి కావు. ఇది ఆధ్యాత్మికమైన ఆత్మిక జ్ఞానము. సుప్రీమ్ ఆత్మ
కూర్చుని జ్ఞానాన్ని ఇస్తారు. పిల్లలు దేహీ-అభిమానులుగా అవ్వవలసి ఉంటుంది. స్వయాన్ని
ఆత్మ అని నిశ్చయము చేసుకుని నన్ను ఒక్కరినే స్మృతి చేయండి. తండ్రి అర్థం చేయిస్తారు,
ఆత్మలోనే మంచి లేక చెడు సంస్కారాలు ఉంటాయి, వాటి అనుసారముగానే మనుష్యులకు మంచి లేక
చెడు జన్మ లభిస్తుంది. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు, ఇంతకుముందు పావనముగా
ఉన్న వీరే అంతిమ జన్మలో పతితముగా ఉన్నారు, తతత్వమ్. తండ్రినైన నేను ఈ పాత రావణ
ప్రపంచములోకి, పతిత ప్రపంచములోకి రావలసి ఉంటుంది. నేను రావడము కూడా - ఎవరైతే మళ్ళీ
మొదటి నంబరులోకి వెళ్ళేది ఉందో, అతని తనువులోకే వచ్చేది ఉంది. సూర్యవంశీయులే పూర్తి
84 జన్మలను తీసుకుంటారు. వీరు బ్రహ్మా మరియు బ్రహ్మావంశీయులైన బ్రాహ్మణులు. తండ్రి
అయితే ప్రతి రోజు అర్థం చేయిస్తారు. రాతి బుద్ధిని పారస బుద్ధిగా చేయడము పిన్నమ్మ
ఇంటికి వెళ్ళినంత సులువేమీ కాదు. ఓ ఆత్మలూ, ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవ్వండి. ఓ
ఆత్మలూ, ఒక్క తండ్రిని స్మృతి చేయండి మరియు రాజ్యాన్ని స్మృతి చేయండి. దేహ సంబంధాలను
విడిచిపెట్టండి. మరణించడమైతే అందరూ మరణించవలసిందే. ఇది అందరి వానప్రస్థావస్థ. ఒక్క
సద్గురువు తప్ప ఇతరులెవ్వరూ సర్వులకు సద్గతిదాతగా అవ్వలేరు. తండ్రి అంటారు - ఓ
భారతవాసులైన పిల్లలూ, మీరే మొట్టమొదట నా నుండి దూరమయ్యారు. ఆత్మ-పరమాత్మ చాలా కాలము
వేరుగా ఉన్నారు... అని అంటూ ఉంటారు. మొట్టమొదట భారతవాసీ దేవీ-దేవతా ధర్మస్థులైన మీరే
వచ్చారు. ఇతర ధర్మాలవారికి కొన్ని జన్మలే ఉంటాయి. పూర్తి చక్రమంతా ఎలా తిరుగుతుంది
అనేది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. ఎవరైతే ధారణ చేయలేరో, వారికి కూడా ఇది
చాలా సహజము. ఆత్మలు ధారణ చేస్తాయి, పుణ్యాత్మగా, పాపాత్మగా అవుతాయి కదా. ఇది మీ 84వ
అంతిమ జన్మ. మీరందరూ వానప్రస్థావస్థలో ఉన్నారు. వానప్రస్థావస్థలో ఉన్నవారు మంత్రము
తీసుకునేందుకు గురువులను ఆశ్రయిస్తారు. మీకైతే ఇప్పుడు దేహధారీ గురువులను
ఆశ్రయించవలసిన అవసరము లేదు. మీ అందరికీ నేను తండ్రిని, టీచర్ ను, గురువును. నన్ను ఓ
పతిత-పావన శివబాబా అని అంటారు కూడా. ఇప్పుడు స్మృతి కలిగింది. వారు సర్వాత్మలకు
తండ్రి. ఆత్మ సత్యమైనది, చైతన్యమైనది ఎందుకంటే ఆత్మ అమరమైనది. ఆత్మలందరిలోనూ పాత్ర
నిండి ఉంది. తండ్రి కూడా సత్యమైనవారు, చైతన్యమైనవారు. వారు మనుష్య సృష్టికి
బీజరూపుడైన కారణముగా ఏమంటారంటే - నాకు పూర్తి వృక్షము యొక్క ఆదిమధ్యాంతాల గురించి
తెలుసు, అందుకే నన్ను నాలెడ్జ్ ఫుల్ అని అంటారు. మీకు కూడా పూర్తి జ్ఞానముంది. బీజము
నుండి వృక్షము ఎలా వెలువడుతుంది. వృక్షము పెద్దది అవ్వడానికి సమయము పడుతుంది కదా.
తండ్రి అంటారు, నేను బీజరూపుడను, అంతిమములో మొత్తము వృక్షమంతా శిథిలావస్థకు
చేరుకుంటుంది. ఇప్పుడు చూడండి, దేవీ-దేవతా ధర్మము యొక్క పునాది లేదు. అది
మాయమైపోయింది. ఎప్పుడైతే దేవతా ధర్మము మాయమైపోతుందో, అప్పుడు తండ్రి రావలసి ఉంటుంది,
ఏక ధర్మాన్ని స్థాపన చేసి మిగిలినవాటన్నింటినీ వినాశనము చేయించేస్తారు. ప్రజాపిత
బ్రహ్మా ద్వారా తండ్రి ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేయిస్తున్నారు. ఇదంతా
కూడా తయారై ఉన్న డ్రామా. ఇది అంతమవ్వదు. తండ్రి అంతిమములో వస్తారు, సృష్టి
ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపించవలసి వచ్చినప్పుడు వస్తారు అనగా తప్పకుండా
సంగమములోనే వస్తారు. మీకు ఒకే తండ్రి ఉన్నారు. ఆత్మలందరూ సోదరులు, మూలవతనములో
నివసించేవారు. ఆ ఒక్క తండ్రిని అందరూ తలచుకుంటారు. దుఃఖములో అందరూ స్మరిస్తారు...
రావణ రాజ్యములో దుఃఖముంది కదా, ఇక్కడ స్మరణ చేసుకుంటారు. కావున సర్వుల సద్గతిదాత
అయిన తండ్రి ఒక్కరే. వారికే మహిమ ఉంది. తండ్రి రాకపోతే భారత్ ను స్వర్గముగా ఎవరు
తయారుచేస్తారు! ఇస్లాములు మొదలైనవారు ఎవరైతే ఉన్నారో, అందరూ ఈ సమయములో తమోప్రధానముగా
ఉన్నారు. అందరూ పునర్జన్మలనైతే తప్పకుండా తీసుకోవలసిందే. ఇప్పుడు పునర్జన్మలు
నరకములో ఉంటాయి, అంతేకానీ స్వర్గములోకి వెళ్ళిపోతారని కాదు. స్వర్గస్థులయ్యారని
హిందువులు అంటారు, అంటే తప్పకుండా అప్పటివరకు నరకములో ఉన్నట్లు మరియు అప్పుడు
స్వర్గములోకి వెళ్ళినట్లు కదా. మీ నోటిలో గులాబ్ జామూన్. స్వర్గవాసులుగా అయినట్లయితే
మళ్ళీ నరకపు ఆసురీ వైభవాలను వారికి మీరెందుకు తినిపిస్తారు! బెంగాల్ లో చేపలు
మొదలైనవి కూడా తినిపిస్తారు. అరే, వారు వాటన్నింటినీ తినవలసిన అవసరమేముంది!
ఫలానావారు నిర్వాణధామానికి వెళ్ళారని అంటారు, అవన్నీ ప్రగల్భాలని తండ్రి అంటారు.
ఎవ్వరూ తిరిగి వెళ్ళలేరు. మొదటి నంబరువారే 84 జన్మలు తీసుకోవలసి ఉన్నప్పుడు, ఇక
మిగతావారు ఎలా వెళ్ళగలరు.
తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇందులో ఎటువంటి కష్టము లేదు. భక్తి మార్గములో ఎంత
కష్టము ఉంటుంది. రామ-రామ అని జపిస్తూ రోమాలు నిక్కబొడుచుకుంటాయి. అదంతా భక్తి
మార్గము. ఈ సూర్య-చంద్రులు కూడా ప్రకాశాన్ని ఇస్తాయని మీకు తెలుసు. ఇవేమీ దేవతలు
కావు. వాస్తవానికి జ్ఞాన సూర్యుడు, జ్ఞాన చంద్రుడు మరియు జ్ఞాన సితారలు ఉన్నారు,
వారికే మహిమ ఉంది. వారు మళ్ళీ సూర్య దేవతాయ నమః అని అంటారు. సూర్యుడిని దేవతగా
భావిస్తూ నీటిని అర్పిస్తారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇదంతా భక్తి మార్గము,
ఇది మళ్ళీ ఉంటుంది. మొట్టమొదట ఒక్క శివబాబాకు అవ్యభిచారి భక్తి జరుగుతుంది, ఆ
తర్వాత దేవతలకు జరుగుతుంది, ఆ తర్వాత ఇక దిగిపోతూ-దిగిపోతూ ఇప్పుడు చూడండి, మూడు
రోడ్ల కూడలిలో కూడా మట్టి దీపాన్ని వెలిగించి, నూనె మొదలైనవి వేసి దానిని కూడా
పూజిస్తారు. తత్వాలను కూడా పూజిస్తారు. మనుష్యుల చిత్రాలను కూడా తయారుచేసి పూజిస్తూ
ఉంటారు. ఇప్పుడు వీటి ద్వారా ఎటువంటి ప్రాప్తి లభించదు, ఈ విషయాలను పిల్లలైన మీరు
మాత్రమే అర్థం చేసుకుంటారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఆత్మ నుండి చెడు సంస్కారాలను తొలగించుకునేందుకు దేహీ-అభిమానులుగా ఉండే
అభ్యాసము చేయాలి. ఇది అంతిమ 84వ జన్మ, ఇది వానప్రస్థావస్థ, అందుకే పుణ్యాత్మగా అయ్యే
కృషి చేయాలి.
2. దేహ సంబంధాలన్నింటినీ విడిచి ఒక్క తండ్రిని మరియు రాజ్యాన్ని స్మృతి చేయాలి,
బీజము మరియు వృక్షము యొక్క జ్ఞానాన్ని స్మరిస్తూ సదా హర్షితముగా ఉండాలి.
వరదానము:-
ఉపరామముగా మరియు ఎవర్రెడీగా అయి బుద్ధి ద్వారా అశరీరీ స్థితి
యొక్క అభ్యాసము చేసే సర్వ కళలలో సంపన్న భవ
ఏ విధముగా సర్కస్ లో కళలు చూపించే కళాకారుల యొక్క ప్రతి
కర్మ ఒక కళగా ఉంటుంది, ఆ కళాకారులు శరీరము యొక్క ఏ అంగమునైనా ఎలా కావాలంటే అలా,
ఎక్కడ కావాలంటే అక్కడ, ఎంత సమయము కోసం కావాలంటే అంత సమయము కోసం మలుచుకోగలుగుతారు,
అదే కళ. అదే విధముగా పిల్లలైన మీరు బుద్ధిని ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎంత సమయము
కావాలంటే అంత సమయము, ఎక్కడ స్థిరము చేయాలంటే అక్కడ స్థిరము చేయండి - ఇదే
అన్నింటికంటే పెద్ద కళ. ఈ ఒక్క కళతోనే 16 కళల సంపన్నముగా అయిపోతారు. దీని కొరకు ఎంత
ఉపరామముగా మరియు ఎవర్రెడీగా అవ్వండి అంటే ఆజ్ఞ అనుసారముగా ఒక్క క్షణములో అశరీరిగా
అయిపోండి, యుద్ధములో సమయము పోకూడదు.
స్లోగన్:-
సరళత
మరియు సహనశీలతా గుణాలను ధారణ చేసేవారే సత్యమైన స్నేహులు మరియు సహయోగులు.
అవ్యక్త ప్రేరణలు - ఈ
అవ్యక్త మాసములో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవము చేయండి
పరమాత్మ జ్ఞానీ
పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారికి జ్ఞానము యొక్క ఫలముగా ముక్తి మరియు జీవన్ముక్తుల
వారసత్వము సంగమములోనే ప్రాప్తిస్తుంది. జ్ఞానము అనగా వివేకము. వివేకవంతులు ప్రతి
కర్మను చేస్తూ సదా స్వయాన్ని బంధనముక్తులుగా, సర్వ ఆకర్షణల నుండి ముక్తులుగా
తయారుచేసుకునే వివేకాన్ని ఉంచుతారు. వారి ప్రతి సంకల్పము, మాట, కర్మ, సంబంధము మరియు
సంపర్కములో ముక్తి-జీవన్ముక్తి యొక్క స్థితి ఉంటుంది, దానినే అతీతముగా మరియు
ప్రియముగా ఉండటము అని అంటారు.
| | | |