17-05-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మిమ్మల్ని మీరు చూసుకోండి - నేను పుష్పములా అయ్యానా, దేహ అహంకారములోకి వచ్చి ముల్లులా అయితే అవ్వడం లేదు కదా? తండ్రి మిమ్మల్ని ముళ్ళ నుండి పుష్పాలుగా తయారుచేయడానికి వచ్చారు’’

ప్రశ్న:-
ఏ నిశ్చయము ఆధారముగా తండ్రిపై ఎడతెగని ప్రేమ ఉండగలదు?

జవాబు:-
మొదట స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకున్నట్లయితే తండ్రిపై ప్రేమ ఉంటుంది. దానితోపాటు - నిరాకారుడైన తండ్రి ఈ భగీరథునిపై విరాజమానమై ఉన్నారు, వారు మమ్మల్ని వీరి ద్వారా చదివిస్తున్నారు అన్న విషయములో కూడా ఎడతెగని నిశ్చయము ఉండాలి. ఎప్పుడైతే ఈ నిశ్చయము ఖండితమవుతుందో, అప్పుడు ప్రేమ తగ్గిపోతుంది.

ఓంశాంతి
ముళ్ళ నుండి పుష్పాలుగా తయారుచేసే భగవంతుని యొక్క వాచ అనగా తోటయజమాని అయిన భగవంతుని వాచ. మనము ఇక్కడికి ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యేందుకు వచ్చామని పిల్లలకు తెలుసు. ఇంతకుముందు మేము ముళ్ళలా ఉండేవారము, ఇప్పుడు పుష్పాలుగా తయారవుతున్నాము అని ప్రతి ఒక్కరూ అర్థం చేసుకుంటారు. ఓ పతిత పావనా రండి అంటూ తండ్రి మహిమను ఎంతగానో చేస్తారు. వారు నావికుడు, తోటయజమాని, పాపకటేశ్వరుడు. ఇలా అనేక నామాలతో పిలుస్తారు, కానీ చిత్రము అన్నిచోట్ల ఒకటే ఉంది. జ్ఞాన సాగరుడు, సుఖ సాగరుడు... అని వారి మహిమను కూడా పాడుతారు. మనము ఆ ఒక్క తండ్రి వద్దే కూర్చున్నామని ఇప్పుడు మీకు తెలుసు. ముళ్ళ వంటి మనుష్యుల నుండి ఇప్పుడు మనము పుష్పాల వంటి దేవతలుగా అయ్యేందుకు వచ్చాము. ఇదే లక్ష్యము-ఉద్దేశ్యము. ఇప్పుడు ప్రతి ఒక్కరూ తమ హృదయములో చూసుకోండి - నాలో దైవీ గుణాలు ఉన్నాయా? నేను సర్వగుణ సంపన్నుడిగా ఉన్నానా? ఇంతకుముందు దేవతల మహిమను పాడేవారు, స్వయాన్ని ముళ్ళగా భావించేవారు. నిర్గుణులమైన మాలో ఏ గుణమూ లేదు... అని అంటారు, ఎందుకంటే వారిలో పంచ వికారాలు ఉన్నాయి. దేహాభిమానము కూడా చాలా కఠినమైన అభిమానము. స్వయాన్ని ఆత్మగా భావించినట్లయితే తండ్రి పట్ల కూడా చాలా ప్రేమ ఉంటుంది. నిరాకారుడైన తండ్రి ఈ రథముపై విరాజమానమై ఉన్నారని ఇప్పుడు మీకు తెలుసు. ఈ విషయముపై నిశ్చయము ఏర్పడినా కూడా, మళ్ళీ నిశ్చయము ఖండితమైపోతుంది. మీరు అంటారు - మనము శివబాబా వద్దకు వచ్చాము, వారు ఈ భగీరథుడైన ప్రజాపిత బ్రహ్మా తనువులో ఉన్నారు, ఆత్మలైన మన అందరి తండ్రి ఒక్క శివబాబాయే, వారు ఈ రథములో విరాజమానమై ఉన్నారు. ఈ విషయములో పక్కా నిశ్చయము కావాలి, ఇందులోనే మాయ సంశయములోకి తీసుకువస్తుంది. కన్య తన పతిని వివాహము చేసుకుంటుంది, అతని ద్వారా ఎంతో సుఖము లభిస్తుంది అని భావిస్తుంది, కానీ ఏం సుఖము లభిస్తుంది, వెంటనే వెళ్ళి అపవిత్రమవుతుంది. కన్యగా ఉన్నప్పుడు తల్లిదండ్రులు మొదలైనవారందరూ ఆమెకు నమస్కరిస్తారు, ఎందుకంటే ఆమె పవిత్రముగా ఉంటుంది. అపవిత్రముగా అవ్వగానే అందరి ముందు ఆమె తల వంచి నమస్కరించడం మొదలుపెడుతుంది. ఈ రోజు అందరూ ఆమెకు తల వంచి నమస్కరిస్తారు, రేపు ఆమె స్వయం అందరికీ తల వంచి నమస్కరించడం మొదలుపెడుతుంది.

ఇప్పుడు పిల్లలైన మీరు సంగమములో పురుషోత్తములుగా అవుతున్నారు. రేపు ఎక్కడ ఉంటారు? ఈ రోజు ఉన్న ఈ ఇల్లు, వాకిలి ఎలా ఉంది! ఎంత అశుద్ధత వ్యాపించి ఉంది! దీనినే వేశ్యాలయము అని అంటారు. అందరూ విషము ద్వారా జన్మిస్తారు. మీరే శివాలయములో ఉండేవారు, నేటికి 5000 సంవత్సరాల క్రితం చాలా సుఖముగా ఉండేవారు, దుఃఖము యొక్క నామ-రూపాలు ఉండేవి కావు. ఇప్పడు మళ్ళీ ఆ విధంగా తయారయ్యేందుకు వచ్చారు. మనుష్యులకు శివాలయమును గురించి తెలియనే తెలియదు. స్వర్గాన్ని శివాలయము అని అంటారు. శివబాబా స్వర్గాన్ని స్థాపన చేసారు. ‘తండ్రీ’ అని అందరూ అంటారు, కానీ ఆ తండ్రి ఎక్కడ ఉన్నారు అని అడిగితే, వారు సర్వవ్యాపి, కుక్క-పిల్లి, తాబేలు-చేప అన్నింటిలోనూ ఉన్నారు అని అనేస్తారు, ఎంత తేడా వచ్చేస్తుంది! తండ్రి అంటారు, మీరు పురుషోత్తములుగా ఉండేవారు, మళ్ళీ 84 జన్మలు అనుభవించి మీరు ఎలా తయారయ్యారు? నరకవాసులుగా అయ్యారు. అందుకే అందరూ - ఓ పతిత పావనా రండి అని పాడుతారు. ఇప్పుడు తండ్రి పావనముగా తయారుచేయడానికి వచ్చారు. ఈ అంతిమ జన్మలో విషాన్ని తాగడం మానండి అని చెప్తారు, అయినా అర్థం చేసుకోరు. సర్వాత్మలకు తండ్రి ఇప్పుడు చెప్తున్నారు - పవిత్రముగా అవ్వండి. అందరూ వారిని తండ్రీ అని అంటారు కూడా. మొదట ఆత్మకు ఆ తండ్రి గుర్తుకువస్తారు, ఆ తర్వాత ఈ తండ్రి. నిరాకార రూపములో ఆ తండ్రి, సాకార రూపములో ఈ తండ్రి. పరమ ఆత్మ ఈ పతిత ఆత్మలకు కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మీరు కూడా ఇంతకుముందు పవిత్రముగా ఉండేవారు, తండ్రితోపాటు ఉండేవారు, తర్వాత మీరు పాత్రను అభినయించేందుకు ఇక్కడకు వచ్చారు. ఈ చక్రాన్ని బాగా అర్థం చేసుకోండి. ఇప్పుడు మనము సత్యయుగములోకి, కొత్త ప్రపంచములోకి వెళ్ళబోతున్నాము. మేము స్వర్గములోకి వెళ్ళాలి అని మీకు ఆశ కూడా ఉంది కదా. కృష్ణుడి వంటి బిడ్డ కావాలి అని మీరు అనేవారు కూడా. ఇప్పుడు నేను మిమ్మల్ని ఆ విధంగా తయారుచేయడానికి వచ్చాను. అక్కడ పిల్లలందరూ శ్రీకృష్ణుని వలె ఉంటారు. వారు సతోప్రధానమైన పుష్పాలు కదా. ఇప్పుడు మీరు కృష్ణపురిలోకి వెళ్తారు. మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. స్వయాన్ని ప్రశ్నించుకోవాలి - నేను పుష్పములా తయారయ్యానా? దేహ అహంకారములోకి వచ్చి ముల్లులా అయితే అవ్వడం లేదు కదా? మనుష్యులు స్వయాన్ని ఆత్మగా భావించేందుకు బదులుగా శరీరముగా భావిస్తారు. ఆత్మను మర్చిపోవడము వలన తండ్రిని కూడా మర్చిపోయారు. తండ్రి గురించి తండ్రి ద్వారా తెలుసుకుంటేనే తండ్రి ఇచ్చే వారసత్వము లభిస్తుంది. అనంతమైన తండ్రి నుండి వారసత్వమైతే అందరికీ లభిస్తుంది. వారసత్వము లభించనివారు ఒక్కరు కూడా ఉండరు. తండ్రే వచ్చి అందరినీ పావనముగా తయారుచేస్తారు, నిర్వాణధామములోకి తీసుకువెళ్తారు. జ్యోతి జ్యోతిలో కలిసిపోయింది, బ్రహ్మములో లీనమైపోయింది అని వారు అంటారు. వారిలో జ్ఞానమేమీ లేదు. మీరు ఎవరి వద్దకు వచ్చారు అనేది మీకు తెలుసు. ఇది మానవుని యొక్క సత్సంగము కాదు. ఆత్మలు పరమాత్మ నుండి దూరమయ్యారు, ఇప్పుడు మళ్ళీ వారి సాంగత్యము లభించింది. సత్యాతి సత్యమైన ఈ సత్సాంగత్యము 5000 సంవత్సరాలకు ఒక్కసారి మాత్రమే లభిస్తుంది. సత్య, త్రేతాయుగాలలో సత్సంగము ఉండదు. ఇకపోతే భక్తి మార్గములోనైతే అనేకానేక సత్సంగాలు ఉన్నాయి. ఇప్పుడు వాస్తవానికి సత్యమైనవారు ఒక్క తండ్రియే. ఇప్పుడు మీరు వారి సాంగత్యములో కూర్చున్నారు. మేము దైవీ విద్యార్థులము, భగవంతుడు మమ్మల్ని చదివిస్తున్నారు అన్న విషయము గుర్తున్నా అహో సౌభాగ్యము.

మన బాబా ఇక్కడ ఉన్నారు, వారు మనకు తండ్రి, టీచర్ మరియు గురువుగా కూడా అవుతారు. ఈ మూడు పాత్రలను ఇప్పుడు అభినయిస్తున్నారు. పిల్లలను తనవారిగా చేసుకుంటారు. తండ్రి అంటారు, స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. తండ్రిని స్మృతి చేయడము ద్వారానే పాపాలు కట్ అవుతాయి, ఆ తర్వాత మీకు ప్రకాశ కిరీటము లభిస్తుంది. ఇది కూడా ఒక చిహ్నము మాత్రమే, అంతేకానీ ఆ ప్రకాశము స్థూలంగా కనిపిస్తుందని కాదు. ఇది పవిత్రతకు గుర్తు. ఈ జ్ఞానము ఇంకెవ్వరికీ లభించదు. ఈ జ్ఞానాన్ని ఇచ్చేది ఒక్క తండ్రే. వారిలో పూర్తి జ్ఞానము ఉంది. తండ్రి అంటారు, నేను మనుష్య సృష్టికి బీజరూపుడను. ఇది తలక్రిందులుగా ఉన్న వృక్షము. ఇదే కల్పవృక్షము కదా. పూర్వము దైవీ పుష్పాల వృక్షము ఉండేది. ఇప్పుడు అది ముళ్ళ అడవిగా అయిపోయింది ఎందుకంటే పంచ వికారాలు ప్రవేశించాయి. మొట్టమొదట ముఖ్యమైనది దేహాభిమానము. అక్కడ దేహాభిమానము ఉండదు. స్వయాన్ని ఆత్మగా భావిస్తారు, కానీ వారికి తండ్రి అయిన పరమాత్మ గురించి తెలియదు. కేవలం నేను ఆత్మను అన్న జ్ఞానము మాత్రమే ఉంటుంది, ఇతర ఏ జ్ఞానమూ ఉండదు. (సర్పము ఉదాహరణ ఉంది కదా) ఇది జన్మ-జన్మాంతరాలుగా పాతబడిన, కుళ్ళిపోయిన శరీరము, దీనిని మీరు ఇప్పుడు వదలాలి అని ఇప్పుడు మీకు అర్థం చేయించడం జరుగుతుంది. ఇప్పుడు ఆత్మ మరియు శరీరము, రెండూ పతితముగా ఉన్నాయి. ఆత్మ పవిత్రముగా అయితే ఇక ఈ శరీరము వదిలేస్తుంది. ఆత్మలన్నీ పరుగెడతాయి. ఈ నాటకము ఇప్పుడు పూర్తవుతుంది అన్న జ్ఞానము ఇప్పడు మీకు ఉంది. ఇప్పుడు మనము తండ్రి వద్దకు వెళ్ళాలి, అందుకే ఇంటిని స్మృతి చేయాలి. ఈ దేహాన్ని వదిలేయాలి. శరీరము అంతమైతే ప్రపంచము అంతమైనట్లే, మళ్ళీ కొత్త ఇంటిలోకి వెళ్తే కొత్త సంబంధాలు ప్రారంభమవుతాయి. కానీ వారు పునర్జన్మలైతే ఇక్కడే తీసుకుంటారు. కానీ మీరు పుష్పాల ప్రపంచములో పునర్జన్మ తీసుకునేది ఉంది. దేవతలను పవిత్రులు అని అంటారు. మనమే పుష్పాల వలె ఉండేవారమని, మళ్ళీ ముళ్ళ వలె అయ్యామని, మళ్ళీ పుష్పాల ప్రపంచములోకి వెళ్ళాలని మీకు తెలుసు. మున్ముందు మీకు ఎన్నో సాక్షాత్కారాలు జరుగుతాయి. అవన్నీ ఆటపాటల వంటివి. మీరా ధ్యానములో ఆడుతూ ఉండేవారు, ఆమెకు జ్ఞానము లేదు. మీరా ఏమీ వైకుంఠములోకి వెళ్ళలేదు. ఇక్కడే ఎక్కడో ఉంటారు. ఈ బ్రాహ్మణ కులానికి చెంది ఉంటే ఇక్కడే జ్ఞానము తీసుకుంటూ ఉండవచ్చు. అంతేకానీ నాట్యము చేసినంత మాత్రాన వైకుంఠానికి వెళ్ళిపోయారని కాదు. అలా అయితే ఎంతోమంది నాట్యము చేస్తూ ఉండేవారు. ధ్యానములోకి వెళ్ళి చూసి వచ్చేవారు, మళ్ళీ వెళ్ళి వికారులుగా అయిపోయారు. పైకి ఎక్కితే వైకుంఠ రసాన్ని రుచి చూస్తారు, కింద పడితే ముక్కలు-ముక్కలుగా అయిపోతారు అని అంటూ ఉంటారు కదా. ఒకవేళ జ్ఞాన-యోగాలను నేర్చుకున్నట్లయితే మీరు వైకుంఠానికి యజమానులుగా అవ్వగలరు అని తండ్రి ఆశను కలిగిస్తారు. తండ్రిని వదిలేస్తే బురదలో (వికారాలలో) పడిపోతారు. ఆశ్చర్యము కలిగేలా బాబాకు చెందినవారిలా అవుతారు, వారి నుండి వింటారు, వినిపిస్తారు, మళ్ళీ పారిపోతారు. ఓహో మాయ, ఎంత పెద్ద దెబ్బ తగులుతుంది. ఇప్పుడు తండ్రి శ్రీమతముపై మీరు దేవతలుగా అవుతారు. ఆత్మ మరియు శరీరము, రెండూ శ్రేష్ఠమైనవి కావాలి కదా. దేవతల జన్మ వికారాల ద్వారా జరగదు. ఆ ప్రపంచమే నిర్వికారీ ప్రపంచము. అక్కడ పంచ వికారాలు ఉండవు. శివబాబా స్వర్గాన్ని తయారుచేసారు. ఇప్పుడు నరకము ఉంది. ఇప్పుడు మీరు మళ్ళీ స్వర్గవాసులుగా అయ్యేందుకు వచ్చారు. ఎవరైతే బాగా చదువుతారో వారే స్వర్గములోకి వెళ్తారు. మీరు మళ్ళీ చదువుకుంటారు, కల్ప-కల్పమూ చదువుకుంటూ ఉంటారు. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఇది తయారై, తయారుచేయబడిన డ్రామా, దీని నుండి ఎవ్వరూ తప్పించుకోలేరు. ఏదైతే చూస్తారో, ఉదాహరణకు ఒక దోమ ఎగిరిందనుకోండి, అది కల్పము తర్వాత కూడా ఎగురుతుంది. ఇది అర్థం చేసుకోవడానికి చాలా మంచి బుద్ధి కావాలి. ఈ షూటింగ్ జరుగుతూ ఉంటుంది. ఇది కర్మ క్షేత్రము. ఇక్కడ పాత్ర అభినయించేందుకు పరంధామము నుండి వచ్చారు.

ఇప్పుడు ఈ చదువులో కొందరు చాలా తెలివైనవారిగా అవుతారు, కొందరు ఇప్పుడు చదువుతూ ఉన్నారు. కొందరు చదువుతూ, చదువుతూ పాతవారి కన్నా తీవ్రగతితో ముందుకు వెళ్ళిపోతారు. జ్ఞానసాగరుడైతే అందరినీ చదివిస్తూ ఉంటారు. తండ్రికి చెందినవారిగా అయ్యారంటే విశ్వ వారసత్వము మీదవుతుంది. అయితే, పతితముగా ఉన్న మీ ఆత్మను తప్పకుండా పావనముగా తయారుచేసుకోవాలి, దాని కోసం అతి సహజమైన విధానము ఏమిటంటే - అనంతమైన తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి, తద్వారా మీరు ఈ విధంగా తయారైపోతారు. పిల్లలైన మీకు ఈ పాత ప్రపంచముపై వైరాగ్యము కలగాలి. ఇక మిగిలింది ముక్తిధామము మరియు జీవన్ముక్తిధామము. మనము ఒక్క తండ్రిని తప్ప ఇంకెవ్వరినీ స్మృతి చేయము. ఉదయముదయమే లేచి అభ్యాసము చేయాలి - నేను అశరీరిగా వచ్చాను, అలాగే అశరీరిగా వెళ్ళాలి. మరి ఇతర దేహధారులను మనము ఎందుకు స్మృతి చేయాలి. ఉదయమే అమృతవేళలో లేచి స్వయంతో ఈ విధంగా మాట్లాడుకోవాలి. ఉదయమును అమృతవేళ అంటారు. జ్ఞానామృతము జ్ఞానసాగరుని వద్ద ఉంది. జ్ఞానసాగరుడు అంటున్నారు, ఉదయము సమయము చాలా మంచిది. ఉదయమే లేచి చాలా ప్రేమగా తండ్రిని స్మృతి చేయండి - బాబా, మీరు 5000 సంవత్సరాల తర్వాత మళ్ళీ కలిసారు. ఇప్పుడు తండ్రి అంటారు, నన్ను స్మృతి చేసినట్లయితే పాపాలు కట్ అయిపోతాయి. శ్రీమతముపై నడవాలి. సతోప్రధానముగా తప్పకుండా అవ్వాలి. తండ్రిని స్మృతి చేయడం అలవాటైపోతే ఇక సంతోషముగా కూర్చుని ఉంటారు, శరీర భానము తెగిపోతూ ఉంటుంది. ఇక అప్పుడు దేహ భానము ఉండదు, ఎంతో సంతోషము ఉంటుంది. మీరు పవిత్రముగా ఉన్నప్పుడు సంతోషముగా ఉండేవారు. మీ బుద్ధిలో ఈ జ్ఞానమమంతా ఉండాలి. మొట్టమొదట ఎవరైతే వస్తారో, వారు తప్పకుండా 84 జన్మలు తీసుకుంటూ ఉండవచ్చు. ఆ తర్వాత చంద్రవంశీయులు కాస్త తక్కువ జన్మలు తీసుకుంటారు, ఇస్లామీయులు వారికన్నా తక్కువ జన్మలు తీసుకుంటారు. నంబరువారుగా వృక్షము యొక్క వృద్ధి జరుగుతుంది కదా. ముఖ్యమైనది దేవతా ధర్మము, దాని నుండి మళ్ళీ మూడు ధర్మాలు వెలువడుతాయి. ఆ తర్వాత శాఖోపశాఖలు వెలువడుతాయి. ఇప్పుడు మీకు డ్రామా గురించి తెలుసు. ఈ డ్రామా ఒక పేను వలె చాలా మెల్లమెల్లగా తిరుగుతూ ఉంటుంది. క్షణ-క్షణమూ టిక్-టిక్ అంటూ తిరుగుతుంది, అందుకే క్షణములో జీవన్ముక్తి అని అంటూ ఉంటారు. ఆత్మ తన తండ్రిని స్మృతి చేస్తుంది. బాబా, మేము మీ పిల్లలము, కావున స్వర్గములో ఉండాలి కదా, మరి నరకములో ఎందుకు ఉన్నాము. తండ్రి స్వర్గాన్ని స్థాపన చేస్తారు కదా, మరి నరకములో ఎందుకు పడి ఉన్నారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరు స్వర్గములో ఉండేవారు, కానీ 84 జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ మీరు అన్నీ మర్చిపోయారు. ఇప్పుడు మళ్ళీ నా మతముపై నడవండి. తండ్రి స్మృతి ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి, ఎందుకంటే ఆత్మలోనే మలినాలు ఏర్పడతాయి. శరీరము ఆత్మకు ఆభరణము వంటిది. ఆత్మ పవిత్రముగా ఉంటే శరీరము కూడా పవిత్రమైనది లభిస్తుంది. మనము స్వర్గములో ఉండేవారమని మనకు తెలుసు. ఇప్పుడు మళ్ళీ తండ్రి వచ్చారు కావున తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి కదా. పంచ వికారాలను వదలాలి. దేహాభిమానాన్ని వదలాలి. అన్ని పనులూ చేసుకుంటూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి. ఆత్మ తన ప్రియుడిని అర్ధకల్పము నుండి స్మృతి చేస్తూ వచ్చింది. ఇప్పుడు ఆ ప్రియుడు వచ్చి ఉన్నారు. వారు అంటున్నారు, మీరు కామ చితిపై కూర్చుని నల్లగా అయిపోయారు, ఇప్పుడు నేను సుందరముగా తయారుచేయడానికి వచ్చాను. దాని కొరకు ఈ యోగాగ్ని ఉంది. జ్ఞానాన్ని చితి అని అనరు. ఇది యోగము అనే చితి. స్మృతి అనే చితిపై కూర్చోవడం ద్వారా వికర్మలు వినాశనమవుతాయి. జ్ఞానాన్ని నాలెడ్జ్ అని అంటారు. తండ్రి మీకు సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తారు. ఉన్నతోన్నతమైనవారు తండ్రి, ఆ తర్వాత బ్రహ్మా, విష్ణువు, శంకరులు, ఆ తర్వాత సూర్యవంశీయులు మరియు చంద్రవంశీయులు, వారి తర్వాత మిగిలిన ధర్మాల శాఖలు. వృక్షము ఎంత పెద్దగా పెరుగుతుంది. ఇప్పుడు ఈ వృక్షము యొక్క పునాది లేదు, అందుకే మర్రి వృక్షము యొక్క ఉదాహరణ ఇవ్వడం జరుగుతుంది. దేవీ-దేవతా ధర్మము కనుమరుగైపోయింది. ధర్మభ్రష్టులుగా, కర్మభ్రష్టులుగా అయిపోయారు. ఇప్పుడు పిల్లలైన మీరు శ్రేష్ఠముగా అయ్యేందుకు శ్రేష్ఠ కర్మలు చేస్తారు. మీ దృష్టిని పవిత్రముగా తయారుచేసుకుంటారు. మీరు ఇప్పుడు భ్రష్ట కర్మలు చేయకూడదు. ఎప్పుడూ చెడు దృష్టి కలగకూడదు. స్వయాన్ని చూసుకోండి - నేను లక్ష్మిని వరించేందుకు యోగ్యునిగా అయ్యానా? నేను స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేస్తున్నానా? రోజూ లెక్కాపత్రాన్ని చూసుకోండి. మొత్తం రోజంతటిలో దేహాభిమానములోకి వచ్చి వికర్మలు ఏవీ చేయలేదు కదా? లేదంటే వంద రెట్లు శిక్ష పడుతుంది. మాయ చార్టు కూడా పెట్టనివ్వదు. 2-4 రోజులు వ్రాసి మళ్ళీ మానేస్తారు. కానీ తండ్రికి అయితే చింత ఉంటుంది కదా. పిల్లలు నన్ను స్మృతి చేస్తే వారి పాపాలు కట్ అవుతాయి కదా అని పిల్లలపై దయ కలుగుతుంది. ఇందులోనే శ్రమ ఉంది. స్వయాన్ని నష్టపరచుకోకూడదు. జ్ఞానమైతే చాలా సహజమైనది. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఉదయమే అమృతవేళ మేలుకుని తండ్రితో మధురాతి-మధురమైన మాటలు మాట్లాడాలి. ఆశరీరిగా అయ్యే అభ్యాసము చేయాలి. తండ్రి స్మృతి తప్ప ఇంకేదీ గుర్తుకు రాకూడదు అన్న అటెన్షన్ ఉండాలి.

2. మీ దృష్టిని చాలా శుద్ధముగా, పవిత్రముగా తయారుచేసుకోవాలి. దైవీ పుష్పాల తోట తయారవుతుంది, అందుకే పుష్పములా తయారయ్యేందుకు పూర్తి పురుషార్థము చేయాలి. ముల్లులా అవ్వకూడదు.

వరదానము:-
తమ శక్తిశాలి స్థితి ద్వారా మనసా సేవ యొక్క సర్టిఫికెట్ ను ప్రాప్తి చేసుకునే స్వ అభ్యాసీ భవ

విశ్వానికి లైట్ మరియు మైట్ (ప్రకాశము మరియు శక్తి) యొక్క వరదానాన్ని ఇచ్చేందుకు అమృతవేళ స్మృతి యొక్క స్వ అభ్యాసము ద్వారా శక్తిశాలి వాయుమండలాన్ని తయారుచేయండి, అప్పుడు మనసా సేవ యొక్క సర్టిఫికెట్ ప్రాప్తిస్తుంది. చివరి సమయములో మనసా ద్వారానే దృష్టితో అతీతముగా చేసే సేవను చేయాలి, తమ వృత్తి ద్వారా వారి వృత్తులను పరివర్తన చేసే సేవను చేయాలి, తమ శ్రేష్ఠ స్మృతి ద్వారా అందరినీ సమర్థులుగా చేయాలి. ఎప్పుడైతే ఈ విధంగా లైట్, మైట్ ను ఇచ్చే అభ్యాసము ఉంటుందో, అప్పుడు నిర్విఘ్న వాయుమండలము తయారవుతుంది మరియు ఈ కోట దృఢముగా అవుతుంది.

స్లోగన్:-
ఎవరైతే మనసా-వాచా-కర్మణా, మూడు సేవలను కలిపి చేస్తారో వారే వివేకవంతులు.

అవ్యక్త సూచనలు - ఆత్మిక రాయల్టీని మరియు పవిత్రత యొక్క పర్సనాలిటీని ధారణ చెయ్యండి

క్షణములో ముక్తి-జీవన్ముక్తుల వారసత్వాన్ని ప్రాప్తి చేసుకోండి అని మీరు ఏదైతే ఛాలెంజ్ చేస్తారో, దానిని ప్రాక్టికల్ లోకి తీసుకువచ్చేందుకు స్వ పరివర్తన యొక్క వేగము క్షణము వరకు చేరుకుందా? స్వ-పరివర్తన ద్వారా ఇతరులను పరివర్తన చేయండి. బ్రహ్మాకుమారులు అనగా వృత్తి, దృష్టి, కృతి మరియు వాణి యొక్క పరివర్తన అన్నది అనుభవము చేయించండి. దానితోపాటు పవిత్రత యొక్క పర్సనాలిటీని, ఆత్మిక రాయల్టీని అనుభవము చేయించండి. రావడముతోనే, కలవడముతోనే ఈ పర్సనాలిటీ వైపుకు ఆకర్షితులవ్వాలి.