ఓంశాంతి
ఈ పాట అర్థం ఎంత విచిత్రముగా ఉంది - ప్రీతి ఎందుకని ఏర్పడింది? ఎవరి పట్ల ఏర్పడింది?
భగవంతుని పట్ల, ఎందుకంటే ఈ ప్రపంచము నుండి మరణించి వారి వద్దకు వెళ్ళాలి. ఈ విధముగా
ఎప్పుడైనా ఎవరి పట్లనైనా ప్రీతి ఉంటుందా? ఈ ప్రీతి వలన మేము మరణిస్తాము అన్నది
ఆలోచనలో ఉన్నప్పుడు ఎవరైనా ప్రీతి కలిగి ఉంటారా? పాట అర్థం ఎంత అద్భుతముగా ఉంది.
దీపము పట్ల దీపపు పురుగులు ప్రీతిని పెట్టుకుని దాని చుట్టూ తిరుగుతూ, తిరుగుతూ
కాలిపోయి మరణిస్తాయి. మీరు కూడా తండ్రి ప్రీతిలో ఈ శరీరాన్ని వదలాలి అనగా తండ్రిని
స్మృతి చేస్తూ-చేస్తూ శరీరాన్ని వదలాలి. ఈ గాయనము కేవలం ఒక్కరి కోసమే ఉంది. ఆ తండ్రి
ఎప్పుడైతే వస్తారో, అప్పుడు ఎవరైతే వారి పట్ల ప్రీతిని పెట్టుకుంటారో, వారు ఈ
ప్రపంచము నుండి మరణించవలసి ఉంటుంది. భగవంతుని పట్ల ప్రీతి కలిగి ఉన్నట్లయితే
మరణించిన తర్వాత ఎక్కడకు వెళ్తారు. తప్పకుండా భగవంతుని వద్దకే వెళ్తారు. భగవంతుని
వద్దకు వెళ్ళేందుకని మనుష్యులు దానపుణ్యాదులు, తీర్థయాత్రలు మొదలైనవి చేస్తారు.
శరీరము విడిచిపెట్టే సమయములో కూడా భగవంతుడిని స్మృతి చేయమని మనుష్యులకు చెప్తారు.
భగవంతుడు ఎంత ప్రఖ్యాతి కలిగినవారు. వారు వచ్చినప్పుడు మొత్తం ప్రపంచమంతటినీ
సమాప్తము చేసేస్తారు. మనము పాత ప్రపంచము నుండి మరణించి కొత్త ప్రపంచములోకి
వెళ్ళేందుకని ఈ యూనివర్సిటీలోకి వస్తాము. పాత ప్రపంచాన్ని పతిత ప్రపంచమని, నరకమని
అంటారు. తండ్రి కొత్త ప్రపంచములోకి వెళ్ళేందుకు మార్గాన్ని తెలియజేస్తారు. కేవలం
నన్ను స్మృతి చేయండి, నేను హెవెన్లీ గాడ్ ఫాదర్ ను. ఆ తండ్రి నుండి మీకు ధనము
లభిస్తుంది, ఆస్తి, ఇల్లు మొదలైనవి లభిస్తాయి. కుమార్తెలకైతే వారసత్వము లభించదు.
వారిని ఇంకొక ఇంటికి పంపించేస్తారు, అనగా వారు వారసులు కానట్లు. ఈ భగవంతుడైతే
ఆత్మలందరికీ తండ్రి, వీరి వద్దకు అందరూ రావలసిందే. ఏదో ఒక సమయములో తప్పకుండా తండ్రి
వస్తారు, అందరినీ ఇంటికి తీసుకువెళ్తారు ఎందుకంటే కొత్త ప్రపంచములో చాలా కొద్దిమంది
మనుష్యులే ఉంటారు. పాత ప్రపంచములోనైతే అనేకమంది ఉన్నారు. కొత్త ప్రపంచములో మనుష్యులు
కూడా కొద్దిమందే ఉంటారు మరియు సుఖము కూడా చాలా ఉంటుంది. పాత ప్రపంచములో చాలామంది
మనుష్యులు ఉన్నారు కావున దుఃఖము కూడా చాలా ఉంది, అందుకే పిలుస్తారు. బాపూ గాంధీజీ
కూడా ఓ పతిత-పావనా రండి అని పిలిచేవారు, కాకపోతే వారెవరో తెలియదు. పతిత-పావనుడు
పరమపిత పరమాత్మ అని, వారే ప్రపంచానికి ముక్తిప్రదాత అని భావించేవారు కూడా.
సీతా-రాములను ప్రపంచమంతా అంగీకరించదు. ప్రపంచమంతా పరమపిత పరమాత్మను ముక్తిప్రదాత,
మార్గదర్శకుడు అని అంగీకరిస్తుంది. వారు దుఃఖము నుండి విముక్తులుగా చేస్తారు. అచ్ఛా,
దుఃఖాన్ని ఇచ్చేవారు ఎవరు? తండ్రి అయితే దుఃఖాన్ని ఇవ్వలేరు ఎందుకంటే వారు
పతిత-పావనుడు. వారు పావన ప్రపంచమైన సుఖధామములోకి తీసుకువెళ్ళేవారు. మీరు ఆ ఆత్మిక
తండ్రి యొక్క ఆత్మిక పిల్లలు. తండ్రి ఎలా ఉన్నారో, పిల్లలు కూడా అలాగే ఉన్నారు.
లౌకిక తండ్రికి లౌకిక పిల్లలు అనగా దైహిక పిల్లలు ఉంటారు. మేము ఆత్మలము, పరమపిత
పరమాత్మ మాకు వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చారు అని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం
చేసుకోవాలి. మనము వారికి పిల్లలుగా అయినట్లయితే స్వర్గ వారసత్వము తప్పకుండా
లభిస్తుంది. వారు స్వర్గాన్ని స్థాపన చేసేవారు. మేము విద్యార్థులము అన్న విషయాన్ని
మర్చిపోకూడదు. శివబాబా మధుబన్ లో మురళీని వినిపిస్తారని పిల్లల బుద్ధిలో ఉంటుంది. ఆ
వెదురు మురళీ అయితే ఇక్కడ లేదు. శ్రీకృష్ణుడు నాట్యము చేయడము, మురళీని వాయించడము -
ఇవన్నీ భక్తి మార్గానికి చెందినవి. ఇకపోతే జ్ఞాన మురళీనైతే శివబాబా మాత్రమే
వినిపిస్తారు. మీ వద్దకు మంచి-మంచి పాటలను తయారుచేసేవారు వస్తారు. పాటలను చాలావరకు
పురుషులే తయారుచేస్తారు. మీరు జ్ఞానము యొక్క పాటలను మాత్రమే పాడాలి, వాటితో శివబాబా
స్మృతి కలగాలి.
తండ్రి అంటారు, భగవంతుడినైన నన్ను స్మృతి చేయండి. శివుడిని బిందువని అంటారు.
వ్యాపారస్థులు బిందువు వ్రాసినప్పుడు శివ అని అంటారు. ఒకటి పక్కన బిందువు పెడితే 10
అవుతుంది, మళ్ళీ బిందువు పెడితే 100 అవుతుంది, ఇంకొక బిందువు పెడితే 1000 అయిపోతుంది.
అలా మీరు కూడా శివుడిని స్మృతి చేయాలి. శివుడిని ఎంతగా స్మృతి చేస్తారో, అన్ని
బిందువులు పడుతూ ఉంటాయి. మీరు అర్ధకల్పము కోసం షావుకార్లుగా అయిపోతారు. అక్కడ
పేదవారు ఉండనే ఉండరు. అందరూ సుఖముగా ఉంటారు. దుఃఖమనే మాటే ఉండదు. తండ్రి స్మృతి
ద్వారా వికర్మలు వినాశనమవుతూ ఉంటాయి. మీరు చాలా ధనవంతులుగా అవుతారు. దీనినే సత్యమైన
తండ్రి ద్వారా లభించే సత్యమైన సంపాదన అని అంటారు. ఇదే మీతోపాటు వస్తుంది.
మనుష్యులందరూ ఖాళీ చేతులతో వెళ్తారు. మీరు నిండు చేతులతో వెళ్ళాలి. తండ్రిని స్మృతి
చేయాలి. పవిత్రత ఉన్నట్లయితే శాంతి, సంపదలు లభిస్తాయని తండ్రి అర్థం చేయించారు.
ఆత్మలైన మీరు మొదట పవిత్రముగా ఉండేవారు, ఆ తర్వాత అపవిత్రముగా అయ్యారు. సన్యాసులను
కూడా సెమీ ప్యూర్ అని అంటారు. మీది ఫుల్ సన్యాసము. ఇతరులు ఎంత సుఖాన్ని అనుభవిస్తారు
అనేది మీకు తెలుసు. కొద్దిగా సుఖము ఉంటుంది, ఆ తర్వాత దుఃఖమే ఉంటుంది. పూర్వము వారు
సర్వవ్యాపి అని అనేవారు కాదు. సర్వవ్యాపి అనడము వలన దిగజారుతూ ఉంటారు. ప్రపంచములో
అనేక రకాల మేళాలు జరుగుతాయి, ఎందుకంటే వాటి ద్వారా సంపాదన అయితే జరుగుతుంది కదా. ఇది
కూడా వారి వ్యాపారము. నరుని నుండి నారాయణునిగా తయారయ్యే వ్యాపారములో తప్ప మిగిలిన
అన్ని వ్యాపారాలలోనూ ధూళియే ఉందని అంటుంటారు. ఈ వ్యాపారాన్ని ఎవరో అరుదుగా చేస్తారు.
తండ్రికి చెందినవారిగా అయి దేహ సహితముగా అన్నిటినీ తండ్రికి ఇచ్చేయాలి, ఎందుకంటే
మీరు కొత్త శరీరము లభించాలని కోరుకుంటున్నారు. తండ్రి అంటారు, మీరు కృష్ణపురికి
వెళ్ళవచ్చు కానీ ఆత్మ తమోప్రధానము నుండి సతోప్రధానముగా అయినప్పుడు వెళ్ళవచ్చు.
మమ్మల్ని పావనముగా చేయండి అని శ్రీకృష్ణపురిలో ఈ విధముగా అనరు. ఓ ముక్తిప్రదాత రండి,
ఈ పాపాత్ముల ప్రపంచము నుండి మమ్మల్ని విముక్తులుగా చేయండి అని ఇక్కడ
మనుష్యమాత్రులందరూ పిలుస్తారు.
మనల్ని వారితో పాటు తీసుకువెళ్ళేందుకు తండ్రి వచ్చారని ఇప్పుడు మీకు తెలుసు.
అక్కడికి వెళ్ళడమైతే మంచిదే కదా. మనుష్యులు శాంతి కావాలని కోరుకుంటారు. ఇప్పుడు
శాంతి అని దేనినంటారు? కర్మలు చేయకుండానైతే ఎవరూ ఉండలేరు. శాంతి ఉన్నది
శాంతిధామములోనే. అయినా సరే శరీరాన్ని తీసుకుని కర్మలనైతే చేయవలసిందే. సత్యయుగములో
కర్మలు చేస్తూ కూడా శాంతి ఉంటుంది. అశాంతిలో మనుష్యులకు దుఃఖము కలుగుతుంది, అందుకే
శాంతి ఎలా లభిస్తుంది అని అంటారు. శాంతిధామము మన ఇల్లు అని ఇప్పుడు పిల్లలైన మీకు
తెలుసు. సత్యయుగములో శాంతి కూడా ఉంది, సుఖము కూడా ఉంది. అన్నీ ఉన్నాయి. ఇప్పుడు
అవన్నీ కావాలా లేక కేవలం శాంతి మాత్రమే కావాలా. ఇక్కడైతే దుఃఖము ఉంది, అందుకే
పతిత-పావనుడైన తండ్రిని కూడా ఇక్కడే పిలుస్తారు. భక్తి చేసేదే భగవంతుడిని
కలుసుకునేందుకని. భక్తి కూడా మొదట అవ్యభిచారిగా ఉంటుంది, ఆ తర్వాత వ్యభిచారిగా
అవుతుంది. వ్యభిచారీ భక్తిలో ఏమేమి చేస్తారో చూడండి. మెట్ల చిత్రములో ఎంత బాగా
చూపించారు, కానీ మొట్టమొదట - భగవంతుడు ఎవరు, శ్రీకృష్ణుడిని ఆ విధముగా ఎవరు
తయారుచేసారు, పూర్వ జన్మలో వారు ఎవరు అనేది ఋజువు చేయాలి. ఈ విషయాలను అర్థం
చేయించేందుకు చాలా యుక్తి కావాలి. ఎవరైతే మంచి సేవ చేస్తారో, వారి హృదయము కూడా
సాక్ష్యము చెప్తుంది. యూనివర్శిటీలో ఎవరైతే బాగా చదువుకుంటారో, వారు తప్పకుండా
చురుకుగా ముందుకు వెళ్తారు. నంబరువారుగా అయితే ఉండనే ఉంటారు. కొందరు మంద బుద్ధి
కలవారు కూడా ఉంటారు. మా బుద్ధి తాళము తెరవండి అని శివబాబాతో ఆత్మ అంటుంది. తండ్రి
అంటారు, బుద్ధి తాళాన్ని తెరవడము కోసమే నేను వచ్చాను. కానీ మీ కర్మలు ఎలా ఉన్నాయంటే,
వాటి కారణముగా తాళము తెరుచుకోవడమే లేదు. అటువంటప్పుడు బాబా ఏం చేస్తారు? చాలా పాపాలు
చేసి ఉన్నారు. ఇప్పుడు బాబా వారిని ఏమి చేస్తారు? మేము తక్కువగా చదువుకుంటామని
విద్యార్థులు టీచరుకు చెప్తే, టీచరు ఏం చేస్తారు? టీచరు కృపనైతే చూపించరు! మహా అయితే
వారి కోసం అదనపు సమయాన్ని కేటాయిస్తారు. ఆ విషయములో మిమ్మల్ని వద్దనరు. ప్రదర్శనీ
తెరవబడి ఉంది, కూర్చుని అభ్యాసము చేయండి. భక్తి మార్గములోనైతే కొందరు మాల తిప్పమని
అంటారు, కొందరు ఈ మంత్రాన్ని తలచుకోండి అని అంటారు. ఇక్కడైతే తండ్రి తమ పరిచయాన్ని
ఇస్తారు. తండ్రిని స్మృతి చేయాలి, తద్వారా వారసత్వము లభిస్తుంది. కావున మంచి రీతిలో
తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి కదా. ఇందులో కూడా తండ్రి చెప్తారు,
వికారాలలోకి ఎప్పుడూ వెళ్ళకండి. కొద్దిగానైనా వికారాల రుచి కలిగినా, ఇక అది వృద్ధి
అయిపోతుంది. సిగరెట్టు మొదలైనవాటి రుచిని ఒక్కసారి చూసినా సరే సాంగత్యపు రంగు వెంటనే
అంటుకుంటుంది. అప్పుడిక ఆ అలవాటును మానుకోవడము కూడా కష్టమైపోతుంది. ఎన్ని సాకులు
చెప్తారు. దేనికీ అలవాటు పడకూడదు. ఛీ-ఛీ అలవాట్లను కూడా తొలగించుకోవాలి. తండ్రి
అంటారు, జీవిస్తూనే శరీర భానాన్ని వదిలి నన్ను స్మృతి చేయండి. దేవతలకు ఎప్పుడూ
పవిత్రమైన భోగ్ మాత్రమే పెట్టడము జరుగుతుంది, కావున మీరు కూడా పవిత్రమైన భోజనమునే
తినండి. ఈ రోజుల్లోనైతే స్వచ్ఛమైన నెయ్యి లభించడము లేదు, నూనెను ఉపయోగిస్తారు.
అక్కడ నూనె మొదలైనవి ఉండవు. ఇక్కడ పాల దుకాణాలలో చూడండి, స్వచ్ఛమైన నేతిని కూడా
పెడతారు, కల్తీ నేతిని కూడా పెడతారు. రెండింటి పైనా స్వచ్ఛమైన నెయ్యి అని వ్రాసి
ఉంటుంది, ధరలో తేడా ఉంటుంది. ఇప్పుడు పిల్లలైన మీరు పుష్పాల వలె వికసించి ఉన్నట్లుగా,
హర్షితముగా ఉండాలి. స్వర్గములోనైతే సహజ సౌందర్యము ఉంటుంది. అక్కడ ప్రకృతి కూడా
సతోప్రధానముగా ఉంటుంది. లక్ష్మీ-నారాయణుల వంటి సహజ సౌందర్యాన్ని ఇక్కడ ఎవరూ
తయారుచేయలేరు. వారిని ఈ నేత్రాలతో ఎవ్వరూ చూడలేరు. అవును, సాక్షాత్కారమవుతుంది కానీ
సాక్షాత్కారము అయినంత మాత్రాన ఎవరూ అదే విధమైన చిత్రాన్ని తయారుచేయలేరు. అయితే,
ఎవరైనా కళాకారునికి సాక్షాత్కారమైతే, వారు ఆ సమయములోనే కూర్చొని తయారుచేస్తే,
అప్పుడు తయారుచేయవచ్చు... కానీ అది చాలా కష్టము. కావున పిల్లలైన మీకు చాలా నషా
ఉండాలి. ఇప్పుడు మనల్ని బాబా తీసుకువెళ్ళేందుకని వచ్చారు. తండ్రి నుండి మనకు స్వర్గ
వారసత్వము లభించనున్నది. ఇప్పుడు మన 84 జన్మలు పూర్తయ్యాయి. ఇటువంటి ఆలోచనలు
బుద్ధిలో ఉన్నట్లయితే సంతోషము కలుగుతుంది. వికారాల ఆలోచనలు కొద్దిగా కూడా రాకూడదు.
తండ్రి అంటారు, కామము మహాశత్రువు. ద్రౌపది కూడా అందుకే పిలిచారు కదా. ఆమెకు 5 మంది
పతులు లేరు. నన్ను ఈ దుశ్శాసనుడు వివస్త్రగా చేస్తున్నాడు, దీని నుండి రక్షించండి
అని ఆమె పిలిచారు. ఐదుగురు పతులు ఎలా ఉండగలరు. అటువంటి విషయమేమీ ఉండదు. ఘడియ, ఘడియ
పిల్లలైన మీకు కొత్త-కొత్త పాయింట్లు లభిస్తూ ఉంటాయి, కావున (చిత్రాలను) మార్చవలసి
ఉంటుంది, ఏంతో కొంత మార్పు చేసి పదాలను వ్రాయాలి.
ఇంకా కొద్ది సమయములోనే మేము ఈ భారత్ ను పరిస్తాన్ గా చేస్తామని మీరు వ్రాస్తారు.
మీరు ఛాలెంజ్ చేస్తారు. తండ్రి అంటారు, సన్ షోజ్ ఫాదర్ (కొడుకు తండ్రిని ప్రత్యక్షము
చేస్తారు), ఫాదర్ షోజ్ సన్ (తండ్రి కొడుకును ప్రత్యక్షము చేస్తారు). ఏ తండ్రి?
శివుడు మరియు సాలిగ్రామాలకే గాయనముంది. శివబాబా ఏదైతే అర్థం చేయిస్తారో, దానిని ఫాలో
చేయండి. ఫాలో ఫాదర్ అనే గాయనము కూడా వారిదే. లౌకిక తండ్రిని ఫాలో చేయడము వలన మీరు
పతితులుగా అయిపోతారు. వీరైతే పావనముగా తయారుచేయడానికని ఫాలో చేయిస్తారు. తేడా ఉంది
కదా. తండ్రి అంటారు - మధురమైన పిల్లలూ, ఫాలో చేసి పవిత్రముగా అవ్వండి. ఫాలో చేస్తేనే
స్వర్గానికి యజమానులుగా అవుతారు. లౌకిక తండ్రిని ఫాలో చేయడము వలన 63 జన్మలుగా మీరు
మెట్లు కిందకు దిగారు. ఇప్పుడు తండ్రిని ఫాలో చేసి పైకి ఎక్కాలి. తండ్రితో పాటు
వెళ్ళాలి. తండ్రి అంటారు, ఈ ఒక్కొక్క రత్నము లక్షల రూపాయలు విలువైనది. మీరు తండ్రిని
తెలుసుకుని తండ్రి నుండి వారసత్వాన్ని పొందుతారు. వాళ్ళు బ్రహ్మతత్వములో
లీనమైపోతామని అంటారు. లీనము అవ్వరు, వారు మళ్ళీ వస్తారు. తండ్రి ప్రతిరోజూ అర్థం
చేయిస్తూ ఉంటారు - మధురాతి మధురమైన పిల్లలూ, మొట్టమొదట అందరికీ తండ్రి పరిచయాన్ని
ఇవ్వాలి. పారలౌకిక తండ్రి పావనముగా తయారుచేసే వారసత్వాన్ని ఇస్తారు, అందుకే పావనముగా
తయారుచేయండి అని అనంతమైన తండ్రితో అంటారు కూడా. వారు పతిత-పావనుడు. లౌకిక తండ్రిని
పతిత-పావనుడు అని అనరు. లౌకిక తండ్రి స్వయమే - ఓ పతిత-పావనా రండి అని పిలుస్తూ
ఉంటారు. కావున ఇద్దరు తండ్రుల పరిచయాన్ని అందరికీ ఇవ్వాలి. వివాహము చేసుకుని
పతితముగా అవ్వండి అని లౌకిక తండ్రి అంటారు. పారలౌకిక తండ్రి - పావనముగా అవ్వండి అని
అంటారు. నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనముగా అయిపోతారు. ఒక్క తండ్రి మాత్రమే
అందరినీ పావనముగా తయారుచేస్తారు. అర్థం చేయించేందుకు ఇవి చాలా మంచి పాయింట్లు.
రకరకాల పాయింట్లను విచార సాగర మంథనము చేసి అర్థం చేయిస్తూ ఉండండి. ఇది మీ వ్యాపారమే.
మీరు ఉన్నదే పతితులను పావనముగా తయారుచేసేవారు. పారలౌకిక తండ్రి ఇప్పుడు చెప్తున్నారు
- పావనముగా అవ్వండి, వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. ఇప్పుడు ఏం చేయాలి? తప్పకుండా
పారలౌకిక తండ్రి యొక్క మతముపై నడవాలి కదా. ప్రదర్శనీలో ఈ ప్రతిజ్ఞను కూడా
వ్రాయించాలి. పారలౌకిక తండ్రిని ఫాలో చేస్తాము, పతితముగా అవ్వడము మానేస్తాము. తండ్రి
నుండి గ్యారెంటీ తీసుకుంటాము అని వ్రాయండి. మొత్తం విషయమంతా పవిత్రతకు సంబంధించినది.
తండ్రి మనకు స్వర్గ వారసత్వాన్ని ఇస్తున్నారని పిల్లలైన మీకు రాత్రింబవళ్ళు సంతోషము
ఉండాలి. భగవంతుడు మరియు వారు ఇచ్చే రాజ్యాధికార వారసత్వము. శివజయంతి అంటేనే భారత్
లో స్వర్గము యొక్క జయంతి అని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. గీతయే సర్వ
శాస్త్రమయి శిరోమణి, గీతా మాత. వారసత్వమైతే తండ్రి నుండే లభిస్తుంది. గీత రచయిత
శివబాబాయే. పారలౌకిక తండ్రి నుండి పావనముగా తయారయ్యే వారసత్వము లభిస్తుంది. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.