18-04-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు తండ్రి ద్వారా సమ్ముఖముగా
చదువుకుంటున్నారు, మీరు సత్యయుగీ రాజ్యాధికారానికి యోగ్యులుగా అయ్యేందుకు పావనముగా
తప్పకుండా అవ్వాలి’’
ప్రశ్న:-
తండ్రి యొక్క ఏ కర్తవ్యము గురించి పిల్లలైన మీకు మాత్రమే తెలుసు?
జవాబు:-
మన తండ్రి,
తండ్రి కూడా, టీచరు మరియు సద్గురువు కూడా అని మీకు తెలుసు. పాత ప్రపంచాన్ని
కొత్తదిగా చేయడానికి, ఒక్క ఆది సనాతన ధర్మాన్ని స్థాపన చేయడానికి తండ్రి కల్పము
యొక్క సంగమయుగములో వస్తారు. తండ్రి ఇప్పుడు పిల్లలైన మనల్ని, మనుష్యుల నుండి
దేవతలుగా తయారుచేయడానికి చదివిస్తున్నారు. ఈ కర్తవ్యము గురించి పిల్లలైన మనకు తప్ప
ఇంకెవ్వరికీ తెలియదు.
పాట:-
భోళానాథుని
కన్నా అతీతమైనవారు...
ఓంశాంతి
ఓం శాంతి యొక్క అర్థాన్ని పిల్లలకు అనేక సార్లు అర్థం చేయించారు. ఓం అనగా నేను
ఆత్మను మరియు ఇది నా శరీరము. ఇది నా ఆత్మ అని శరీరము కూడా అనవచ్చు. శివబాబా ఏ
విధముగా మీరు నా వారు అని అంటారో మరియు పిల్లలు ఏ విధముగా బాబా, మీరు మా వారు అని
అంటారో, అలా ఆత్మ కూడా, ఇది నా శరీరము అని అంటుంది మరియు శరీరము, ఇది నా ఆత్మ అని
అంటుంది. నేను అవినాశీ అని ఇప్పుడు ఆత్మకు తెలుసు. ఆత్మ లేకుండా శరీరము ఏమీ చేయలేదు.
ఆత్మకు శరీరమైతే ఉంటుంది, నా ఆత్మకు కష్టము కలిగించవద్దని అంటుంది, నా ఆత్మ పాపాత్మ
అని లేదా నా ఆత్మ పుణ్యాత్మ అని ఆత్మ అంటుంది. మీ ఆత్మ సత్యయుగములో పుణ్యాత్మగా
ఉండేదని మీకు తెలుసు. నేను సత్యయుగములో సతోప్రధానముగా అనగా సత్యమైన బంగారముగా
ఉండేదానిని అని స్వయంగా ఆత్మ కూడా అంటుంది. నిజంగా ఆత్మ బంగారమని కాదు, ఒక ఉదాహరణగా
ఇలా చెప్పడము జరుగుతుంది. నా ఆత్మ పవిత్రcgగా ఉండేది, బంగారుయుగానికి చెందినదిగా
ఉండేది. ఇప్పుడు అపవిత్రముగా ఉన్నాను అని అంటారు. ప్రపంచములోని వారికి ఈ విషయము
తెలియదు. మనకైతే శ్రీమతము లభిస్తుంది. మన ఆత్మ సతోప్రధానముగా ఉండేదని, ఇప్పుడు
తమోప్రధానముగా అయ్యిందని మీకు ఇప్పుడు తెలుసు. ప్రతి వస్తువు ఇలా అవుతుంది. బాల్యము,
యవ్వనము, వృద్ధాప్యము... ఇలా ప్రతి వస్తువు కొత్తది నుండి పాతదిగా తప్పకుండా
అవుతుంది. ప్రపంచము కూడా మొదట బంగారుయుగముగా, సతోప్రధానముగా ఉండేది, తర్వాత
తమోప్రధానముగా, ఇనుపయుగముగా అయ్యింది, కావుననే దుఃఖితులుగా ఉన్నారు. సతోప్రధానము
అనగా తీర్చిదిద్దబడినది అని అర్థం, తమోప్రధానము అనగా పాడైపోయినది అని అర్థం. పాటలో
కూడా, పాడైనదానిని బాగుచేసేవారు... అని అంటారు. పాత ప్రపంచము పాడైపోయింది ఎందుకంటే
ఇది రావణ రాజ్యము మరియు అందరూ పతితముగా ఉన్నారు. సత్యయుగములో అందరూ పావనముగా
ఉండేవారు, దానిని కొత్త నిర్వికారీ ప్రపంచము అని అంటారు. ఇది పాత వికారీ ప్రపంచము.
ఇప్పుడు కలియుగము ఇనుపయుగముగా ఉంది. ఈ విషయాలన్నింటినీ ఏ స్కూలులో గానీ, కాలేజిలో
గానీ చదివించడము జరగదు. భగవంతుడు వచ్చి చదివిస్తారు మరియు రాజయోగాన్ని నేర్పిస్తారు.
గీతలో భగవానువాచ - శ్రీమద్భగవద్గీత అని వ్రాయబడి ఉంది. శ్రీమత్ అనగా శ్రేష్ఠమైన మతము.
శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవారు, ఉన్నతోన్నతమైనవారు భగవంతుడు. వారి ఏక్యురేట్ పేరు శివ.
రుద్ర జయంతి లేక రుద్ర రాత్రి అని ఎప్పుడూ విని ఉండరు. శివరాత్రి అని అంటారు.
శివుడైతే నిరాకారుడు, నిరాకారుని రాత్రిని లేక జయంతిని ఎలా జరుపుకోవాలి. శ్రీకృష్ణ
జయంతి అనడము బాగానే ఉంది. ఫలానావారి బిడ్డ అని, అతని తిథి-తారీఖులను చూపిస్తారు.
శివుడు ఎప్పుడు జన్మించారు అనేదైతే ఎవరికీ తెలియదు, కానీ తెలుసుకోవాలి కదా.
శ్రీకృష్ణుడు సత్యయుగము ఆదిలో ఎలా జన్మ తీసుకున్నారు అనేది ఇప్పుడు అర్థమయ్యింది.
అతను జన్మించి 5 వేల సంవత్సరాలు అయ్యిందని మీరు అంటారు. వారు కూడా, క్రైస్టుకు 3
వేల సంవత్సరాల క్రితం భారత్ ప్యారడైజ్ గా ఉండేదని అంటారు. ఇస్లాముల కన్నా ముందు
చంద్రవంశీయులు, వారి కన్నా ముందు సూర్యవంశీయులు ఉండేవారు. శాస్త్రాలలో సత్యయుగానికి
లక్షల సంవత్సరాలని చూపించారు. గీత ముఖ్యమైనది. గీత ద్వారానే దేవీ-దేవతా ధర్మము
స్థాపన అయ్యింది. అది సత్య, త్రేతాయుగాల వరకు కొనసాగింది అనగా గీతా శాస్త్రము ద్వారా
ఆది సనాతన దేవీ-దేవతా ధర్మ స్థాపనను పరమపిత పరమాత్మ చేసారు. ఆ తర్వాత అర్ధకల్పము
వరకు ఏ శాస్త్రమూ లేదు, ఏ ధర్మ స్థాపకుడూ లేరు. తండ్రి వచ్చి బ్రాహ్మణులను దేవతలుగా,
క్షత్రియులుగా చేసారు అనగా తండ్రి మూడు ధర్మాలను స్థాపన చేస్తారు. ఇది లీప్ ధర్మము,
దీని ఆయువు తక్కువగా ఉంటుంది. సర్వశాస్త్రమయి శిరోమణి గీతను భగవంతుడు వినిపించారు.
తండ్రి పునర్జన్మలలోకి రారు. వారికి జన్మ ఉంటుంది కానీ తండ్రి అంటారు - నేను
గర్భములోకి రాను, నా పాలన జరగదు. సత్యయుగములో జన్మ తీసుకునే పిల్లలు కూడా గర్భ
మహళ్ళలో ఉంటారు. రావణ రాజ్యములో గర్భ జైలులోకి రావలసి ఉంటుంది. పాపాలను జైలులో
అనుభవిస్తారు. గర్భములో ఉన్నప్పుడు, నేను ఇక పాపము చేయను అని ప్రతిజ్ఞ చేస్తారు కానీ
ఇది ఉన్నదే పాపాత్ముల ప్రపంచము. గర్భము నుండి బయటకు రాగానే, మళ్ళీ పాపము చేయడము
మొదలుపెడతారు. అక్కడి ప్రతిజ్ఞ అక్కడే ఉండిపోతుంది... ఇక్కడ కూడా చాలా ప్రతిజ్ఞలను
చేస్తారు - మేము పాపాలు చేయమని, పరస్పరము కామ ఖడ్గాన్ని ఉపయోగించమని అంటారు ఎందుకంటే
ఈ వికారాలు ఆదిమధ్యాంతాలు దుఃఖమునిస్తాయి. సత్యయుగములో విషము ఉండదు కావున మనుష్యులు
ఆదిమధ్యాంతాలు అనగా 21 జన్మలు దుఃఖాన్ని అనుభవించరు ఎందుకంటే అది రామ రాజ్యము. దాని
స్థాపనను ఇప్పుడు తండ్రి మళ్ళీ చేస్తున్నారు. సంగమములోనే స్థాపన జరుగుతుంది కదా.
ఎవరైతే ధర్మ స్థాపన చేయడానికి వస్తారో, వారు ఏ పాపము చేయకూడదు. అర్ధ సమయము
పుణ్యాత్ములుగా ఉంటారు, మళ్ళీ అర్ధ సమయము తర్వాత పాపాత్ములుగా అవుతారు. మీరు సత్య,
త్రేతాయుగాలలో పుణ్యాత్మగా ఉంటారు, తర్వాత పాపాత్మగా అవుతారు. సతోప్రధాన ఆత్మ పై
నుండి వచ్చినప్పుడు, అది శిక్షలు అనుభవించదు. క్రైస్టు ఆత్మ ధర్మ స్థాపన చేయడానికి
వచ్చారు, వారికి ఎటువంటి శిక్ష లభించదు. క్రైస్టును శిలువ పైకి ఎక్కించారని అంటారు
కానీ ఆ ఆత్మ ఎటువంటి వికర్మలను చేయలేదు. ఆ ఆత్మ ఎవరి శరీరములోకైతే ప్రవేశిస్తుందో,
వారికి దుఃఖము కలుగుతుంది, వారు సహనము చేస్తారు. ఎలాగైతే వీరిలోకి బాబా
ప్రవేశిస్తారో, అక్కడ కూడా అలా జరుగుతుంది. శివబాబా అయితే ఎలాగూ సతోప్రధానమైనవారే.
ఏదైనా దుఃఖము లేక కష్టము వీరి ఆత్మకు కలుగుతుంది, శివబాబాకు కలగదు. వారు సదా సుఖ,
శాంతులతో ఉంటారు. వారు సదా సతోప్రధానులు. కానీ రావడమైతే ఈ పాత శరీరములోకే వస్తారు
కదా. అదే విధముగా క్రైస్టు ఆత్మ ఎవరిలోకైతే ప్రవేశించారో, ఆ శరీరానికి దుఃఖము
కలగవచ్చు. క్రైస్టు ఆత్మ దుఃఖాన్ని అనుభవించదు ఎందుకంటే ఇంకా సతో, రజో, తమోలలోకి
రావాల్సి ఉంది. కొత్త-కొత్త ఆత్మలు వస్తుంటారు కూడా కదా. వారు ముందు తప్పకుండా
సుఖాన్ని అనుభవించవలసి ఉంటుంది, వారు దుఃఖాన్ని అనుభవించలేరు. నియమము అలా లేదు.
వీరిలో బాబా కూర్చుని ఉన్నారు, ఏ కష్టమైనా వీరికి (దాదాకు) కలుగుతుంది, అంతేకానీ
శివబాబాకు కాదు. కానీ ఈ విషయాలు మీకు తెలుసు, ఇంకెవరికీ తెలియవు.
ఈ రహస్యాలన్నింటినీ ఇప్పుడు తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఈ సహజ రాజయోగము
ద్వారానే స్థాపన జరిగింది, తర్వాత భక్తి మార్గములో ఇవే విషయాలు గాయనము చేయబడతాయి. ఈ
సంగమములో ఏదైతే జరుగుతుందో, అది గాయనము చేయబడుతుంది. భక్తి మార్గము ప్రారంభమైనప్పుడు
శివబాబా పూజ జరుగుతుంది. మొట్టమొదటగా భక్తి ఎవరు చేస్తారు. ఆ లక్ష్మీ-నారాయణులు
ఎప్పుడైతే రాజ్యము చేస్తారో, అప్పుడు పూజ్యులుగా ఉండేవారు, ఆ తర్వాత వామ మార్గములోకి
వచ్చేస్తారు, అప్పుడు పూజ్యుల నుండి పూజారులుగా అయిపోతారు. తండ్రి అర్థం
చేయిస్తున్నారు - నిరాకార పరమపిత పరమాత్మ వీరి ద్వారా మమ్మల్ని చదివిస్తున్నారు
అన్నది మొట్టమొదట పిల్లలైన మీ బుద్ధిలో రావాలి. ఈ విధముగా అర్థం చేయించేటువంటి
స్థానము, మొత్తము ప్రపంచములో ఇంకెక్కడా ఉండదు. తండ్రియే వచ్చి భారత్ కు మళ్ళీ
స్వర్గ వారసత్వాన్ని ఇస్తారు. త్రిమూర్తి చిత్రము కింద ఇలా వ్రాయబడి ఉంది - దైవీ
ప్రపంచపు స్వరాజ్యము మీ ఈశ్వరీయ జన్మ సిద్ధ అధికారము. శివబాబా వచ్చి పిల్లలైన మీకు
స్వర్గ రాజ్యాధికారము యొక్క వారసత్వాన్ని ఇస్తున్నారు, యోగ్యులుగా తయారుచేస్తున్నారు.
బాబా మనల్ని యోగ్యులుగా తయారుచేస్తున్నారని మీకు తెలుసు. మనము పతితులుగా ఉండేవారము
కదా, పావనముగా అయిన తర్వాత ఇక ఈ శరీరము ఉండదు. రావణుడి ద్వారా మనము పతితులుగా
అయ్యాము, మళ్ళీ పరమపిత పరమాత్మ పావనముగా తయారుచేసి పావన ప్రపంచానికి యజమానులుగా
తయారుచేస్తారు. వారే జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు. ఈ నిరాకార బాబా మనల్ని
చదివిస్తున్నారు. అందరూ కలిసి ఒకేచోట కూర్చుని చదువుకోలేరు కదా. సమ్ముఖముగా మీరు
కొద్దిమందే కూర్చున్నారు. ఇక మిగిలిన పిల్లలందరికీ - ఇప్పుడు శివబాబా బ్రహ్మా
తనువులో కూర్చుని సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తూ ఉండవచ్చు అని తెలుసు.
ఆ మురళి వ్రాతపూర్వకముగా వస్తుంది. ఇతర సత్సంగాలలో ఈ విధముగా భావించరు. ఈ రోజుల్లో
టేప్ రికార్డరు కూడా వెలువడింది, అందుకే టేప్ లో నింపి పంపిస్తారు. వారు, ఫలానా పేరు
కల గురువు వినిపిస్తున్నారని అంటారు, వారి బుద్ధిలో మనుష్యులే ఉంటారు. ఇక్కడైతే
అటువంటి విషయమేమీ లేదు. ఇక్కడ నాలెడ్జ్ ఫుల్ అయిన నిరాకార తండ్రి ఉన్నారు.
మనుష్యులను నాలెడ్జ్ ఫుల్ అని అనరు. గాడ్ ఫాదర్ ఈజ్ నాలెడ్జ్ ఫుల్, పీస్ ఫుల్ (శాంతి
స్వరూపుడు), బ్లిస్ ఫుల్ (ఆనంద స్వరూపుడు) అని పాడుతారు, కావున వారు ఇచ్చే వారసత్వము
కూడా కావాలి కదా. వారిలో ఏవైతే గుణాలు ఉన్నాయో, అవి పిల్లలకు లభించాలి, ఇప్పుడు
లభిస్తూ ఉన్నాయి. గుణాలను ధారణ చేసి మనము ఈ విధముగా లక్ష్మీ-నారాయణుల వలె
అవుతున్నాము. అందరూ అయితే రాజా-రాణులుగా అవ్వరు. రాజు, రాణి, మంత్రి... అని అంటూ
ఉంటారు. అక్కడ మంత్రి కూడా ఉండరు. మహారాజు-మహారాణులలో పవర్ ఉంటుంది. ఎప్పుడైతే
వికారులుగా అవుతారో, అప్పుడు మంత్రులు మొదలైనవారు ఉంటారు. పూర్వము మినిస్టర్లు
మొదలైనవారు కూడా ఉండేవారు కారు. అక్కడైతే ఒక్క రాజు-రాణి యొక్క రాజ్యము నడిచేది.
వారికి మంత్రుల యొక్క అవసరము ఏముంది, వారు స్వయమే యజమాని అన్నప్పుడు ఇక ఇంకెవరి
నుండో సలహా తీసుకోవలసిన అవసరము లేదు. ఇది చరిత్ర-భౌగోళికము. కానీ మొట్టమొదటగా
లేస్తూ-కూర్చుంటూ, మమ్మల్ని తండ్రి చదివిస్తున్నారని, యోగము నేర్పిస్తున్నారని
బుద్ధిలోకి రావాలి. స్మృతియాత్రలో ఉండాలి. ఇప్పుడు నాటకము పూర్తవుతోంది, మనము
పూర్తిగా పతితులుగా అయిపోయాము, ఎందుకంటే వికారాలలోకి వెళ్ళాము, అందుకే పాపాత్ములని
అంటారు. సత్యయుగములో పాపాత్ములు ఉండరు. అక్కడ పుణ్యాత్ములు ఉంటారు. అది ప్రారబ్ధము,
దాని కోసం మీరు ఇప్పుడు పురుషార్థము చేస్తున్నారు. మీది స్మృతి యాత్ర, దీనిని భారత్
యొక్క యోగమని అంటారు కానీ అర్థం తెలియదు. యోగము అనగా స్మృతి, దీని ద్వారా వికర్మలు
వినాశనమవుతాయి, తర్వాత ఈ శరీరాన్ని వదిలి ఇంటికి వెళ్ళిపోతాము, దానిని స్వీట్ హోమ్
అని అంటారు. నేను ఆ శాంతిధామ నివాసిని అని ఆత్మ అంటుంది. మనము అక్కడ నుండి
అశరీరులుగా వచ్చాము, ఇక్కడ పాత్రను అభినయించేందుకని శరీరాన్ని తీసుకున్నాము. మాయను
పంచ వికారాలు అని అంటారని కూడా అర్థం చేయించారు, ఇవి ఐదు భూతాలు. కామము భూతము,
క్రోధము భూతము, నంబరువన్ భూతము దేహాభిమానము.
తండ్రి అర్థం చేయిస్తున్నారు - సత్యయుగములో ఈ వికారాలు ఉండవు, దానిని నిర్వికారీ
ప్రపంచమని అంటారు. వికారీ ప్రపంచాన్ని నిర్వికారిగా చేయడము, ఇది కేవలం తండ్రి పనే.
వారినే సర్వశక్తివంతుడు, జ్ఞాన సాగరుడు, పతిత-పావనుడు అని అంటారు. ఈ సమయములో అందరూ
భ్రష్టాచారము ద్వారానే జన్మ తీసుకుంటారు. సత్యయుగములోనే నిర్వికారీ ప్రపంచము ఉంటుంది.
తండ్రి అంటారు, ఇప్పుడు మీరు వికారుల నుండి నిర్వికారులుగా అవ్వాలి. వికారాలు
లేకుండా పిల్లలు ఎలా జన్మిస్తారు అని అంటారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇప్పుడు
ఇది మీ అంతిమ జన్మ. మృత్యులోకమే సమాప్తము అవ్వనున్నది, ఇక దీని తర్వాత వికారీ
మనుష్యులు ఉండరు, అందుకే తండ్రితో పవిత్రముగా అవుతామని ప్రతిజ్ఞ చేయాలి. బాబా, మేము
మీ నుండి వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటామని అంటారు. వారు అసత్యపు ప్రమాణాలు
చేస్తారు. ఏ భగవంతుని పేరు మీదైతే ప్రమాణము చేస్తారో, వారి గురించి తెలియనే తెలియదు.
వారు ఎప్పుడు వస్తారు, ఎలా వస్తారు, వారి నామ, రూప, దేశ, కాలాలు ఏమిటి అనేది ఏమీ
తెలియదు. తండ్రి వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు. ఇప్పుడు మీకు పరిచయము లభిస్తూ ఉంది.
ప్రపంచమంతటిలోనూ ఎవరికీ గాడ్ ఫాదర్ గురించి తెలియదు. తండ్రిని పిలుస్తారు కూడా,
పూజలు కూడా చేస్తారు కానీ వారి కర్తవ్యము గురించి తెలియదు. పరమపిత పరమాత్మ మన తండ్రి,
టీచరు, సద్గురువు అని ఇప్పుడు మీకు తెలుసు. ఈ తండ్రి స్వయంగా తమ పరిచయాన్ని
ఇస్తున్నారు - నేను మీ తండ్రిని, నేను ఈ శరీరములోకి ప్రవేశించాను. ప్రజాపిత బ్రహ్మా
ద్వారా స్థాపన జరుగుతుంది. ఎవరి స్థాపన? బ్రాహ్మణుల స్థాపన. తర్వాత బ్రాహ్మణులైన
మీరు చదువుకుని దేవతలుగా అవుతారు. నేను వచ్చి మిమ్మల్ని శూద్రుల నుండి బ్రాహ్మణులుగా
తయారుచేస్తాను. తండ్రి అంటారు - నేను కల్పము యొక్క సంగమయుగములోనే వస్తాను. కల్పము 5
వేల సంవత్సరాలు ఉంటుంది. ఈ సృష్టి చక్రమైతే తిరుగుతూనే ఉంటుంది. నేను పాత
ప్రపంచాన్ని కొత్తదిగా తయారుచేయడానికి వస్తాను. నేను పాత ధర్మాలను వినాశనము చేయించి,
ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని స్థాపన చేస్తాను. నేను పిల్లలను చదివిస్తాను, మీరు
చదువుకుని 21 జన్మల కొరకు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. సూర్యవంశీయులు,
చంద్రవంశీయులు, ప్రజలు అందరూ దేవతలే. ఇకపోతే పురుషార్థమనుసారముగా ఉన్నత పదవిని
పొందుతారు. ఇప్పుడు ఎవరు ఎంతగా పురుషార్థము చేస్తారో, అదే కల్ప-కల్పము నడుస్తుంది.
ఇక కల్ప-కల్పము ఇటువంటి పురుషార్థమునే చేస్తామని, ఇటువంటి పదవినే పొందుతామని మీరు
అర్థం చేసుకుంటారు. మమ్మల్ని నిరాకార భగవంతుడు చదివిస్తున్నారని పిల్లలైన మీ
బుద్ధిలో ఉంది. వారిని స్మృతి చేయడము ద్వారానే వికర్మలు వినాశనమవుతాయి. స్మృతి
చేయకుండా వికర్మలు వినాశనమవ్వవు. తాము ఎన్ని జన్మలు తీసుకుంటారు అనేది కూడా
మనుష్యులకు తెలియదు. శాస్త్రాలలో ఎవరో 84 లక్షల జన్మలుంటాయని తప్పుగా వ్రాశారు. 84
జన్మలుంటాయని ఇప్పుడు మీకు తెలుసు. ఇది అంతిమ జన్మ, ఇక తర్వాత మనము స్వర్గములోకి
వెళ్ళాలి. ముందు మూలవతనానికి వెళ్ళి, ఆ తర్వాత స్వర్గములోకి వస్తాము. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. పవిత్రముగా అవుతామని తండ్రితో ఏదైతే ప్రతిజ్ఞ చేసారో, దానిపై పక్కాగా ఉండాలి.
కామము, క్రోధము మొదలైన భూతాలపై తప్పకుండా విజయాన్ని పొందాలి.
2. నడుస్తూ-తిరుగుతూ, ప్రతి కార్యాన్ని చేస్తూ, చదివించే తండ్రిని
గుర్తుంచుకోవాలి. ఇప్పుడు నాటకము పూర్తవుతోంది, అందుకే ఈ అంతిమ జన్మలో పవిత్రముగా
తప్పకుండా అవ్వాలి.
వరదానము:-
సర్వ ఖజానాలతో నిండుగా అయి తమ ముఖము ద్వారా సేవ చేసే సత్యమైన
సేవాధారీ భవ
ఏ పిల్లలైతే సర్వ ఖజానాలతో సదా సంపన్నముగా మరియు నిండుగా
ఉంటారో, వారి నయనాలు మరియు మస్తకము ద్వారా ఈశ్వరీయ నషా కనిపిస్తుంది. వారి ముఖమే
సేవ చేస్తుంది. ఎవరి వద్దనైనా ఎక్కువగా జమ అయి ఉన్నా లేక తక్కువగా జమ అయి ఉన్నా, అది
కూడా వారి ముఖము ద్వారా కనిపిస్తుంది. ఏ విధముగా ఎవరైనా ఉన్నత కులానికి చెందినవారు
ఉంటే, వారి ముఖము ద్వారా ఆ ప్రకాశము మరియు నషా కనిపిస్తుందో, అదే విధముగా మీ ముఖము
ప్రతి సంకల్పాన్ని, ప్రతి కర్మను స్పష్టము చేయాలి, అప్పుడు సత్యమైన సేవాధారులు అని
అంటారు.
స్లోగన్:-
సమయము
మరియు సంకల్పాల ఖజానాను పొదుపు చేసి జమ ఖాతాను పెంచుకోండి.
అవ్యక్త ప్రేరణలు -
‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’
ఇతరులకు స్వీట్
తినిపించినప్పుడు వారి నోరు కొద్ది సమయము కోసం తీపిగా అవుతుంది కానీ స్వయమే మధురముగా
అయిపోండి, నోటిలో సదా మధురమైన మాటలే ఉండాలి. ఏ విధముగా స్వీట్ తినేటప్పుడు మరియు
తినిపించేటప్పుడు సంతోషపడతారో, అలా మధురమైన మాటలు స్వయాన్ని కూడా సంతోషపరుస్తాయి,
ఇతరులను కూడా సంతోషపరుస్తాయి. ఈ విధముగా సదా సర్వుల నోటిని తీపి చేస్తూ ఉండండి, సదా
మధురమైన దృష్టి, మధురమైన మాటలు, మధురమైన కర్మలు ఉండాలి.
| | | |