18-07-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - ఈ పాత ప్రపంచములో మనుష్యులు ఏ రకమైన
ఆశలను పెట్టుకుంటారో, ఆ ఆశలను మీరు పెట్టుకోకూడదు, ఎందుకంటే ఈ ప్రపంచము
వినాశనమవ్వనున్నది’’
ప్రశ్న:-
సంగమయుగములో ఏ
ఆశ పెట్టుకున్నట్లయితే అన్ని ఆశలు సదా కొరకు పూర్తవుతాయి?
జవాబు:-
నేను పావనముగా
అయి, తండ్రిని స్మృతి చేసి, వారి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి - ఈ ఆశ
మాత్రమే ఉండాలి. ఈ ఆశ ద్వారానే సదా కొరకు అన్ని ఆశలు పూర్తవుతాయి. ఆయుష్మాన్ భవ,
పుత్రవాన్ భవ, ధనవాన్ భవ... ఈ వరదానాలన్నీ లభిస్తాయి. సత్యయుగములో అన్ని కామనలు
పూర్తవుతాయి.
పాట:-
నీవే తల్లివి,
నీవే తండ్రివి...
ఓంశాంతి
మధురాతి
మధురమైన ఆత్మిక పిల్లలకు అనగా ఆత్మలకు పరమపిత పరమాత్మ ఇది అర్థం చేయిస్తున్నారు.
అనంతమైన తండ్రి మనకు వరదానాలు ఇస్తున్నారని మీకు తెలుసు. ఆ మనుష్యులు - పుత్రవాన్
భవ, ఆయుష్మాన్ భవ, ధనవాన్ భవ అనే ఆశీర్వాదాలను ఇస్తారు. ఇప్పుడు తండ్రి మీకు
ఆయుష్మాన్ భవ అనే వరదానాన్ని ఇస్తారు. మీ ఆయుష్షు చాలా ఎక్కువగా ఉంటుంది. అక్కడ
కొడుకు ఉంటాడు, ఆ కొడుకు కూడా సుఖమిచ్చేవాడిగా ఉంటాడు. ఇక్కడ, పిల్లలందరూ
దుఃఖమిచ్చేవారే. సత్యయుగములో అందరూ సుఖమిచ్చే పిల్లలే ఉంటారు. అనంతమైన తండ్రి
అనంతమైన సుఖ వారసత్వాన్ని ఇస్తున్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తప్పకుండా
మనము ఆయుష్మంతులుగా మరియు ధనవంతులుగా కూడా అవుతాము. ఇప్పుడు ఎలాంటి కోరికను మనసులో
పెట్టుకోకూడదు. మీ కోరికలన్నీ సత్యయుగములో పూర్తవ్వనున్నాయి. ఈ నరకములో ఎలాంటి
కోరికను పెట్టుకోకూడదు. ధనము కావాలనే కోరికను కూడా పెట్టుకోకండి. చాలా ధనముండాలి,
పెద్ద ఉద్యోగము లభించాలి - ఇలాంటి కోరికలను కూడా ఎక్కువగా పెట్టుకోకూడదు. కడుపైతే
ఒక పావు పిండి రొట్టెను తింటుంది, ఎక్కువ లోభము ఉండకూడదు. ఎక్కువ ధనము ఉన్నట్లయితే,
అది సమాప్తము అవ్వబోతుంది. బాబా మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారని
పిల్లలకు తెలుసు. దానమిస్తే గ్రహణము తొలగిపోతుందని ఇప్పుడు తండ్రి అంటారు. ఏ
దానమివ్వాలి? ఈ 5 వికారాలను దానమివ్వాలి. వీటిని దానమిచ్చినట్లయితే, గ్రహచారము
తొలగిపోతుంది మరియు మీరు 16 కళల సంపూర్ణులుగా అవుతారు. మనము సర్వగుణ సంపన్నులుగా,
16 కళల సంపూర్ణులుగా... ఇక్కడే తయారవ్వాలని మీకు తెలుసు. 5 వికారాలను దానమివ్వాల్సి
ఉంటుంది. పిల్లలకు బాబా చెప్తారు - మధురమైన పిల్లలూ, అనంతమైన తండ్రి నుండి అనంతమైన
వారసత్వాన్ని తీసుకోవాలనే ఆశను తప్ప ఇంకెలాంటి ఆశలను పెట్టుకోకండి. ఇంకా కొద్ది
సమయము మాత్రమే మిగిలి ఉంది. చాలా సమయము గడిచిపోయింది, కొద్దిగానే మిగిలి ఉంది అని
అంటూ ఉంటారు కూడా. ఈ వినాశనానికి ఇంకా కొద్ది సమయము మాత్రమే మిగిలి ఉంది, అందుకే, ఈ
పాత ప్రపంచానికి సంబంధించిన ఆశలేమీ పెట్టుకోకండి. కేవలం తండ్రిని స్మృతి చేస్తూ
ఉండండి. స్మృతి ద్వారా పిల్లలు సతోప్రధానముగా అవ్వాలి. ఈ ప్రపంచములో మనుష్యులు ఏ
ఆశలనైతే పెట్టుకుంటారో, అవేవీ మీరు పెట్టుకోకండి. మనము ఒక్క శివబాబా నుండి మన
స్వర్గ వారసత్వాన్ని తీసుకోవాలి అనే ఆశను మాత్రమే పెట్టుకోవాలి. ఎప్పుడూ ఎవ్వరికీ
దుఃఖమివ్వకూడదు. ఒకరిపై ఒకరు కామ ఖడ్గాన్ని ఉపయోగించడము - ఇది అన్నింటికన్నా పెద్ద
దుఃఖము, అందుకే సన్యాసులు స్త్రీల నుండి వేరైపోతారు. వారు అన్నీ వదిలేసారు అని
అంటారు. ఈ సమయములో రావణ రాజ్యములో అందరూ పతితులు, పాపాత్ములే ఉన్నారు.
ఇప్పుడు సమయము చాలా
తక్కువగా ఉంది, మీరు ఒకవేళ తండ్రి శ్రీమతముపై నడవకపోతే శ్రేష్ఠముగా అవ్వరు. పిల్లలు
ఉన్నతోన్నతులుగా అవ్వాలి, అందుకే, 5 వికారాలను దానమివ్వాలి, అప్పుడు ఈ గ్రహణము
తొలగిపోతుంది. అందరిపైనా గ్రహచారము ఉంది, పూర్తిగా నల్లగా అయిపోయారు. తండ్రి అంటారు
- ఒకవేళ నా నుండి వారసత్వాన్ని తీసుకోవాలంటే పావనముగా అవ్వండి. ద్వాపరము నుండి
మొదలుకుని మీరు పతితులుగా అవుతూ-అవుతూ సతోప్రధానము నుండి తమోప్రధానముగా అయిపోయారు,
అందుకే - పతిత-పావనా రండి, వచ్చి మమ్మల్ని పావనముగా చేయండి అని పాడుతారు. కావున
తండ్రి ఆజ్ఞాపిస్తున్నారు - పిల్లలూ, ఇప్పుడు పతితముగా అవ్వకండి, కామము అనే
మహాశత్రువుపై గెలవండి, దాని వలనే మీరు ఆదిమధ్యాంతాలు దుఃఖాన్ని పొందారు. తండ్రి
అంటారు - మీరు స్వర్గములో పూర్తిగా పవిత్రముగా ఉండేవారు. ఇప్పుడు రావణుడి
మతమనుసారముగా మీరు పతితముగా అయ్యారు, అందుకే దేవతల ముందుకు వెళ్ళి - మీరు సర్వగుణ
సంపన్నులు, సంపూర్ణ నిర్వికారులు, మేము వికారులము అని వారి మహిమను గాయనము చేస్తారు.
నిర్వికారులుగా అయినట్లయితే సుఖమే సుఖముంటుంది. తండ్రి అంటారు - పిల్లలైన మిమ్మల్ని
నిర్వికారులుగా తయారుచేయడానికి ఇప్పుడు నేను వచ్చాను. ఇప్పుడు పిల్లలైన మీరు అన్ని
కోరికలను వదలాలి. తమ వ్యాపార-వ్యవహారాలు మొదలైనవి చేసుకోండి మరియు ఇతరులకు
జ్ఞానామృతాన్ని తాగించండి. అమృతాన్ని వదిలి విషాన్ని ఎందుకు తాగుతారని అంటారు.
తండ్రి అంటారు - మీరు ఎలాంటి కోరికలు పెట్టుకోకండి. మనము స్మృతియాత్రతో పూర్తిగా
సతోప్రధానముగా అయిపోతాము. 63 జన్మలు ఏ పాపాలనైతే చేసామో, అవి స్మృతి ద్వారానే
సమాప్తమవుతాయి. ఇప్పుడు నిర్వికారులుగా అవ్వాలి. మాయా తుఫానులు వచ్చినా కానీ
పతితముగా అవ్వకూడదు. మనుష్యుల నుండి దేవతలుగా అవ్వాలి. మీరే సతోప్రధాన పూజ్య
దేవతలుగా ఉండేవారు, తర్వాత మీరే పూజ్యుల నుండి పూజారులుగా అవుతారు. మనము నిరోగులుగా
ఉండేవారము, తర్వాత రోగులుగా అవుతాము, ఇప్పుడు మళ్ళీ నిరోగులుగా అవుతున్నాము.
నిరోగులుగా ఉన్నప్పుడు ఆయుష్షు ఎక్కువగా ఉండేది. ఇప్పుడు చూడండి, కూర్చుని ఉండగానే
మనుష్యులు మరణిస్తుంటారు. కావున ఎలాంటి ఆశలను పెట్టుకోకూడదు. ఇవన్నీ ఛీ-ఛీ ఆశలు.
ముళ్ళ నుండి పుష్పాలుగా అయ్యేందుకైతే ఒకే ఒక్క ఫస్ట్ క్లాస్ ఆశ ఉంది, తండ్రి అంటారు
- నన్ను స్మృతి చేసినట్లయితే పుణ్యాత్ములుగా అవుతారు. ఈ సమయములో అందరిపైనా రాహు
గ్రహణముంది. మొత్తం భారత్ పై రాహు గ్రహణముంది. ఇప్పుడు బృహస్పతి దశ కావాలి. ఇప్పుడు
మనపై బృహస్పతి దశ కూర్చుని ఉందని మీకు తెలుసు. భారత్ స్వర్గముగా ఉండేది కదా.
సత్యయుగములో మీపై బృహస్పతి దశ ఉండేది. ఈ సమయములో రాహు దశ ఉంది. ఇప్పుడు మళ్ళీ
అనంతమైన తండ్రి ద్వారా బృహస్పతి దశ లభిస్తుంది. బృహస్పతి దశలో 21 జన్మల సుఖము
ఉంటుంది. త్రేతాలో శుక్ర దశ ఉంటుంది. ఎవరెంత స్మృతి చేస్తే అంత. ఎక్కువగా స్మృతి
చేస్తే బృహస్పతి దశ ఉంటుంది. ఇది కూడా అర్థం చేయించారు - ఇప్పుడు అందరూ తిరిగి
ఇంటికి వెళ్ళాలి, అందుకే తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే వికర్మలు వినాశనమవుతాయి
మరియు మీరు ఎగిరేందుకు యోగ్యులుగా అవుతారు. మాయ మీ రెక్కలను కట్ చేసేసింది.
ఇప్పుడు మీకు ఈశ్వరీయ
మతము లభిస్తుంది, దాని ద్వారా మీరు సదా సుఖమయముగా అవుతారు. ఈశ్వరీయ మతముపై మీరు
స్వర్గానికి యజమానులుగా అవుతారు. మీరు విశ్వ రాజ్యాన్ని తీసుకుంటున్నారు. తండ్రిని
స్మృతి చేసినట్లయితే అంతమతి సో గతి జరుగుతుంది (అంతిమ సమయములో ఎలాంటి ఆలోచనలతో
చనిపోతారో, అలాంటి జన్మ లభిస్తుంది) - ఈ ఈశ్వరీయ మతము లభిస్తుంది. స్మృతి ద్వారానే
వికర్మలు వినాశనమవుతాయి, పవిత్రముగా అవుతారు. పవిత్ర ఆత్మలే స్వర్గానికి యోగ్యులుగా
అవుతారు. అక్కడ మీ శరీరము కూడా నిరోగిగా ఉంటుంది, ఆయుష్షు కూడా ఎక్కువగా ఉంటుంది,
ధనము కూడా ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఎప్పుడూ పిల్లలను దత్తత తీసుకోవడం జరగదు. తండ్రి
అంటారు - ఆయుష్మాన్ భవ, సంపత్తివాన్ భవ. ఒక కొడుకైతే తప్పకుండా ఉంటారు. ఈ సమయములో
తండ్రి పిల్లలందరినీ దత్తత తీసుకుంటారు. సత్యయుగములో ఇక దత్తత తీసుకోబడిన పిల్లలు
ఎవరూ ఉండరు. యోగబలముతో ఒక కొడుకు, ఒక కూతురు జన్మిస్తారు. అక్కడ పిల్లలు ఎలా
జన్మిస్తారని అడుగుతారు, అక్కడ యోగబలము ఉంటుంది. ఇది డ్రామాలో నిశ్చితమై ఉంది.
సత్యయుగములో ఉన్నవారందరూ యోగులు. శ్రీకృష్ణుడిని యోగేశ్వరుడని అంటారు. అలాగని
శ్రీకృష్ణుడు యోగములో ఉంటారని కాదు. అతను పూర్తి పవిత్రమైన యోగి. ఈశ్వరుడు అందరినీ
యోగేశ్వరులుగా తయారుచేసారు కావున భవిష్యత్తులో యోగులుగా ఉంటారు. తండ్రి యోగులుగా
తయారుచేసారు. యోగుల ఆయుష్షు ఎక్కువగా ఉంటుంది. భోగుల ఆయుష్షు తక్కువగా ఉంటుంది.
ఈశ్వరుడు పిల్లలను పవిత్రముగా తయారుచేసి, యోగాన్ని నేర్పించి దేవతలుగా తయారుచేసారు,
వీరిని యోగులు అని అంటారు. యోగులు మరియు ఋషులు పవిత్రముగా ఉంటారు. మీరు రాజఋషులని
మీకు అర్థం చేయించారు. రాజ్య పదవిని పొందేందుకు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. ఈ
సమయములో తండ్రిని స్మృతి చేయాలి, పిల్లలు జన్మించాలనే తప్పుడు ఆశను ఇక్కడ
పెట్టుకోకూడదు. దాని కోసం వికారాల్లోకి వెళ్ళాల్సి ఉంటుంది, కామ ఖడ్గాన్ని
ఉపయోగించాల్సి ఉంటుంది. దేహాభిమానులు కామ ఖడ్గాన్ని ఉపయోగిస్తారు. దేహీ-అభిమానులు
కామ ఖడ్గాన్ని ఉపయోగించరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, పవిత్రముగా అవ్వండి.
ఇప్పుడు ఈ కామ ఖడ్గాన్ని ఉపయోగించకండి, పవిత్రముగా అయితే మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి
అని ఆత్మలతో మాట్లాడుతారు. మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారు. తండ్రి
ఎంత సుఖాన్ని ఇస్తారు. తండ్రి నుండైతే పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి.
తండ్రి అయితే పేదల
పెన్నిధి. సుదాముడు 2 పిడికెళ్ళ బియ్యము ఇస్తే మహలు లభించిందని అంటారు. బాబా 21
జన్మలకు వారసత్వాన్ని ఇచ్చేస్తారు. ఇప్పుడు అందరూ తిరిగి వెళ్ళాలని కూడా మీరు అర్థం
చేసుకున్నారు. శివబాబా యొక్క స్థాపనా కార్యములో ఎవరెంత సహాయము చేయాలనుకుంటే అంత
చేయవచ్చు. ఇంటిలో యూనివర్శిటీని మరియు హాస్పిటల్ ను తెరవండి. బోర్డుపై ఈ విధముగా
వ్రాయండి - సోదరీ-సోదరులారా, మీరు 21 జన్మల కోసం సదా ఆరోగ్యవంతులుగా,
ఐశ్వర్యవంతులుగా అవ్వాలనుకుంటే వచ్చి అర్థం చేసుకోండి, మేము ఒక్క సెకెండులో సదా
ఆరోగ్యవంతులుగా, ఐశ్వర్యవంతులుగా అయ్యే మార్గాన్ని తెలియజేస్తాము. మీరు సర్జన్లు కదా.
సర్జన్లు బోర్డునైతే తప్పకుండా పెట్టుకుంటారు లేదంటే మనుష్యులకు ఎలా తెలుస్తుంది.
మీరు కూడా మీ ఇంటి బయట బోర్డు పెట్టుకోండి. ఎవరు వచ్చినా సరే వారికి ఇద్దరు తండ్రుల
రహస్యాన్ని అర్థం చేయించండి. హద్దు తండ్రి నుండి హద్దు వారసత్వాన్ని తీసుకుంటూ
వచ్చారు. అనంతమైన తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే అనంతమైన
వారసత్వము లభిస్తుంది. ఈ పురుషార్థము ద్వారా మీరు ఈ విధముగా అవుతారని ప్రొజెక్టర్లు
మరియు ప్రదర్శినీల ద్వారా ముందు ఈ విషయాన్ని అర్థం చేయించండి. ఇప్పుడిది సంగమము.
కలియుగము నుండి సత్యయుగముగా అవ్వాలి. భారతవాసులైన మీరు సతోప్రధానముగా ఉండేవారు,
ఇప్పుడు తమోప్రధానముగా అయ్యారు. ఇప్పుడు తండ్రి అంటారు - నన్ను స్మృతి చేస్తే మీరు
స్వర్గానికి యజమానులుగా అవుతారు. పదాలు రెండే ఉన్నాయి. అల్ఫ్ (భగవంతుడు) ను స్మృతి
చేస్తే బే (రాజ్యాధికారము) మీదవుతుంది. ఈ స్మృతితో సంతోషముగా ఉంటారు. ఈ ఛీ-ఛీ
ప్రపంచములో ఏ రకమైన ఆశలను పెట్టుకోకండి. ఇక్కడ మీరు జీవిస్తూ మరణించేందుకు
పురుషార్థము చేస్తారు. వారైతే మరణించిన తర్వాత స్వర్గవాసులుగా అయ్యారని అంటారు. మేము
స్వర్గవాసులుగా అయ్యేందుకు తండ్రిని స్మృతి చేస్తామని మీరు అందరికీ చెప్తారు. వారి
నుండి అనంతమైన సుఖము లభిస్తుంది. తండ్రిని స్మృతి చేస్తే మీరెప్పుడూ ఏడవరు,
ఆర్తనాదాలు చేయరు. మాయ తుఫానులు వస్తాయి, వాటి గురించి ఆలోచించకండి. మాయ తుఫానులైతే
వస్తాయి. ఇది యుద్ధము. సంకల్ప-వికల్పాలు వస్తే అనవసరంగా సమయము వృధా అవుతుంది.
తుఫానులైతే వెళ్ళిపోతాయి, అవి సదా ఉండవు కదా. ఉదయాన్నే లేచి తండ్రిని స్మృతి చేయాలి,
తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. లోలోపల ఈ తపన ఉండాలి. తండ్రి ఇంకెటువంటి
కష్టాన్ని ఇవ్వరు. కేవలం తండ్రిని స్మృతి చేయాలి. మిగిలినవారందరినీ మర్చిపోండి,
వారంతా మరణించి ఉన్నారు. పరస్పరములో ఈ విషయాలనే మాట్లాడుకుంటూ ఉండండి. బాబా,
ఇప్పుడైతే కేవలం మిమ్మల్ని మాత్రమే స్మృతి చేస్తాము, మీ నుండి స్వర్గ వారసత్వాన్ని
తీసుకుంటాము. మేము 3-4 గంటలకు తప్పకుండా లేచి తండ్రిని స్మృతి చేస్తామని సమయము
నిశ్చితము చేసుకోండి. చక్రాన్ని కూడా గుర్తుంచుకోవాలి. తండ్రి మనకు రచయిత మరియు
రచనల జ్ఞానాన్ని ఇచ్చారు. మనకు ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షము గురించి తెలుసు. మనము
21 జన్మలు ఎలా తీసుకుంటాము అనేది బుద్ధిలో ఉంది. ఇప్పుడు మనము వెళ్తాము,
స్వర్గములోకి మళ్ళీ వచ్చి పాత్రను అభినయిస్తాము. మనము ఆత్మలము, ఆత్మకే రాజ్యము
లభిస్తుంది. తండ్రిని స్మృతి చేయడముతో వారసత్వానికి హక్కుదారులుగా అవుతారు. ఇది
రాజయోగము. తండ్రిని స్మృతి చేస్తారు. అనంతమైన తండ్రి ద్వారా అనేక సార్లు విశ్వానికి
యజమానులుగా అయ్యారు, మళ్ళీ నరకవాసులుగా అయ్యారు. ఇప్పుడు ఒక్క బాబా స్మృతి ద్వారా
మళ్ళీ స్వర్గవాసులుగా అవుతారు. తండ్రి స్మృతి ద్వారానే పాపాలు భస్మమవుతాయి, అందుకే
దీనిని యోగాగ్ని అని అంటారు.
బ్రాహ్మణులైన మీరు
రాజఋషులు. ఋషులు సదా పవిత్రముగా ఉంటారు, తండ్రిని స్మృతి చేస్తారు మరియు రాజ్య
వారసత్వాన్ని తీసుకుంటారు. ఇప్పుడు వికారాల కోసం ఆశ పెట్టుకోకూడదు. ఇది ఛీ-ఛీ ఆశ.
ఇప్పుడైతే పారలౌకిక తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. మీరు అనారోగ్యముగా
ఉన్నప్పటికీ స్మృతి చేయవచ్చు. తండ్రికి కూడా పిల్లలు ప్రియముగా అనిపిస్తారు. బాబా
ఎంతమంది పిల్లలకు ఉత్తరాలు వ్రాయాల్సి ఉంటుంది. శివబాబా వ్రాయిస్తారు. మీరు కూడా -
శివబాబా, కేరాఫ్ బ్రహ్మా అని ఉత్తరాలు వ్రాస్తారు. శివబాబాకు పిల్లలైన మనమంతా
పరస్పరములో సోదరులము. ఆత్మిక తండ్రి వచ్చి మనల్ని పావనముగా తయారుచేస్తారు, అందుకే
వారిని పతిత-పావనా అని అంటారు. వారు ఆత్మలందరినీ పావనముగా తయారుచేస్తారు. నేను
ఎవరినీ విడిచిపెట్టను. ప్రకృతి కూడా పావనముగా అవుతుంది. సత్యయుగములో ప్రకృతి కూడా
పావనముగా ఉంటుందని మీకు తెలుసు. ఇప్పుడు శరీరము కూడా పతితముగా ఉంది, అందుకే గంగలో
శరీరాన్ని శుద్ధముగా చేసుకునేందుకు వెళ్తారు, కానీ దానితో ఆత్మ పావనముగా అవ్వదు.
యోగాగ్ని ద్వారానే ఆత్మ పావనముగా అవుతుంది. అచ్ఛా!
మధురాతి మధురమైన
సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక
పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఈ కలియుగీ ప్రపంచములో ఎలాంటి తప్పుడు ఆశలను పెట్టుకోకూడదు. సంపూర్ణ
సతోప్రధానముగా అయ్యేందుకు ఈశ్వరీయ మతముపై నడుచుకోవాలి.
2. పావనముగా అయి తిరిగి ఇంటికి వెళ్ళాలి, ఈ ఒక్క ఆశను మాత్రమే పెట్టుకోవాలి.
అంతమతి సో గతి (అంతిమ సమయములో ఎలాంటి ఆలోచనలతో చనిపోతారో, అలాంటి జన్మ లభిస్తుంది).
మాయ తుఫానులలో సమయాన్ని వృధా చేసుకోకూడదు.
వరదానము:-
సదా శక్తిశాలి వృత్తి ద్వారా అనంతమైన సేవలో తత్పరులై ఉండే
హద్దులోని విషయాల నుండి ముక్త భవ
ఏ విధముగా సాకార బాబాకు సేవ తప్ప ఇంకేమీ కనిపించేది కాదో,
అలా పిల్లలైన మీరు కూడా మీ శక్తిశాలి వృత్తి ద్వారా అనంతమైన సేవలో సదా తత్పరులై
ఉన్నట్లయితే హద్దులోని విషయాలు స్వతహాగానే సమాప్తమైపోతాయి. హద్దులోని విషయాలలో
సమయాన్ని ఇవ్వడము - ఇది కూడా బొమ్మలాట వంటిది. అందులో సమయము మరియు శక్తి
వ్యర్థమైపోతాయి, అందుకే చిన్న-చిన్న విషయాలలో సమయాన్ని లేక జమ చేసుకున్న శక్తులను
వ్యర్థం చేసుకోకండి.
స్లోగన్:-
సేవలో సఫలతను
ప్రాప్తి చేసుకోవాలనుకుంటే మీ మాటలు మరియు నడవడిక ప్రభావశాలిగా ఉండాలి.
అవ్యక్త ప్రేరణలు -
జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవము చేయండి
సమయము అనుసారముగా
ఇప్పుడు బ్రాహ్మణ ఆత్మలందరినీ సమీపముగా తీసుకువస్తూ జ్వాలా స్వరూపపు వాయుమండలాన్ని
తయారుచేసే సేవ చేయండి, దాని కోసం భట్టీలైనా చేయండి లేక పరస్పరములో కలిసి ఆత్మిక
సంభాషణైనా చేయండి, కానీ జ్వాలా స్వరూపాన్ని అనుభవము చేయండి మరియు చేయించండి, ఈ సేవలో
నిమగ్నమైనట్లయితే చిన్న-చిన్న విషయాలు సహజముగానే పరివర్తన అయిపోతాయి.