18-10-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఆత్మాభిమానులుగా అయి కూర్చోండి, నేను ఆత్మను... అని లోలోపల అభ్యాసము చేస్తూ ఉండండి, దేహీ-అభిమానులుగా అవ్వండి, సత్యమైన చార్టు పెట్టుకున్నట్లయితే తెలివికలవారిగా అవుతూ ఉంటారు, చాలా లాభముంటుంది’’

ప్రశ్న:-
అనంతమైన నాటకాన్ని అర్థము చేసుకునే పిల్లలు ఏ ఒక్క లా ను (నియమాన్ని) మంచి రీతిలో అర్థము చేసుకుంటారు?

జవాబు:-
ఇది అవినాశీ నాటకము, ఇందులో ప్రతి పాత్రధారి పాత్రను అభినయించడానికి తన సమయానికి రావాల్సిందే. నాకు సదా శాంతిధామములోనే కూర్చుండిపోవాలని ఉంది అని ఎవరైనా అంటే, అది నియమము కాదు. అటువంటివారిని పాత్రధారి అనే అనరు. ఈ అనంతమైన విషయాలను అనంతమైన తండ్రియే మీకు వినిపిస్తారు.

ఓంశాంతి
స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి. దేహాభిమానాన్ని విడిచిపెట్టి కూర్చోండి. అనంతమైన తండ్రి పిల్లలకు అర్థము చేయిస్తున్నారు. ఎవరైతే తెలివిలేనివారిగా ఉంటారో, వారికి అర్థం చేయించడం జరుగుతుంది. ఆత్మనైన నేను తెలివిలేనివానిగా అయిపోయానని తండ్రి సత్యము చెప్తున్నారని ఆత్మ అర్థము చేసుకుంటుంది. ఆత్మనైన నేను అవినాశీ, శరీరము వినాశీ. నేను ఆత్మాభిమానాన్ని వదిలి దేహాభిమానములో చిక్కుకుపోయాను అంటే తెలివిలేనివారనే కదా. తండ్రి చెప్తున్నారు, దేహాభిమానములోకి పిల్లలందరూ వచ్చి తెలివిలేనివారిగా అయిపోయారు. మళ్ళీ మీరు తండ్రి ద్వారా దేహీ-అభిమానులుగా అయినప్పుడు పూర్తిగా తెలివికలవారిగా అవుతారు. కొందరైతే అలా తయారైపోయారు, మరికొందరు పురుషార్థము చేస్తూ ఉంటారు. తెలివిలేనివారిగా అవ్వడములో అర్ధకల్పము పట్టింది. ఈ అంతిమ జన్మలో మళ్ళీ తెలివికలవారిగా అవ్వాలి. అర్ధకల్పము నుండి తెలివిలేనివారిగా అవుతూ-అవుతూ 100 శాతము తెలివిలేనివారిగా అయిపోతారు. దేహాభిమానములోకి వచ్చి డ్రామా ప్లాన్ అనుసారముగా మీరు పడిపోతూ వచ్చారు. ఇప్పుడు మీకు తెలివి లభించింది, అయినా సరే చాలా పురుషార్థము చేయాలి, ఎందుకంటే పిల్లలలో దైవీ గుణాలు కూడా కావాలి. మేము సర్వగుణ సంపన్నులుగా, 16 కళల సంపూర్ణులుగా.... ఉండేవారము, ఈ సమయములో మళ్ళీ నిర్గుణులుగా అయ్యాము, ఏ గుణమూ మిగల్లేదు అని పిల్లలకు తెలుసు. పిల్లలైన మీలో కూడా నంబరువారు పురుషార్థానుసారముగా ఈ ఆటను అర్థము చేసుకుంటారు. అర్థము చేసుకుంటూ, అర్థము చేసుకుంటూ కూడా ఎన్ని సంవత్సరాలు గడిచిపోయాయి. అయినా కొత్తవారు మంచి తెలివికలవారిగా అవుతూ ఉంటారు. ఇతరులను కూడా తయారుచేసే పురుషార్థము చేస్తారు. కొందరైతే అసలు ఏ మాత్రము అర్థము చేసుకోలేదు. తెలివిహీనులుగా ఉన్నవారు తెలివిహీనులుగానే ఉండిపోయారు. తండ్రి వచ్చిందే తెలివికలవారిగా తయారుచేయడానికి. మాయ కారణముగా మేము తెలివిలేనివారిగా అయ్యామని పిల్లలు భావిస్తారు. మనము పూజ్యులుగా ఉన్నప్పుడు తెలివికలవారిగా ఉండేవారము, మళ్ళీ మనమే పూజారులుగా అయి తెలివిలేనివారిగా అయ్యాము. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము కనుమరుగైపోయింది. దీని గురించి ప్రపంచములో ఎవ్వరికీ తెలియదు. ఈ లక్ష్మీ-నారాయణులు ఎంత తెలివికలవారిగా ఉండేవారు, రాజ్యము చేసేవారు. తండ్రి అంటున్నారు - తతత్వమ్ (ఇది మీకు కూడా వర్తిస్తుంది). మీరు కూడా మీ గురించి ఇలాగే భావించండి. ఇవి చాలా-చాలా అర్థము చేసుకోవలసిన విషయాలు. వీటిని తండ్రి తప్ప ఇంకెవ్వరూ అర్థము చేయించలేరు. తండ్రియే ఉన్నతోన్నతమైనవారిగా, అందరికన్నా తెలివికలవారిగా ఉంటారు కదా అని ఇప్పుడు అనుభవమవుతుంది. ఒకటేమో, వారు జ్ఞానసాగరుడు కూడా, సర్వుల సద్గతిదాత కూడా, పతిత-పావనుడు కూడా. మహిమ ఒక్కరిది మాత్రమే. ఇంత ఉన్నతోన్నతమైన తండ్రి వచ్చి పిల్లలూ-పిల్లలూ అని అంటూ ఎంత బాగా అర్థము చేయిస్తున్నారు. పిల్లలూ, ఇప్పుడు పావనముగా అవ్వాలి. దీని కోసం తండ్రి ఒకే ఒక మందునిస్తున్నారు, వారు చెప్తున్నారు - యోగము ద్వారా మీరు భవిష్య 21 జన్మలకు నిరోగులుగా అవుతారు. మీ రోగాలు, దుఃఖాలు అన్నీ సమాప్తమైపోతాయి. మీరు ముక్తిధామానికి వెళ్ళిపోతారు. అవినాశీ సర్జన్ వద్ద ఒకే ఒక మందు ఉంది. వారు వచ్చి ఆత్మకు ఒకే ఒక ఇంజెక్షన్ ను ఇస్తారు. మనుష్యులలో ఎవరైనా బ్యారిస్టరీ కూడా చేసి, ఇంజనీరింగ్ కూడా చేస్తారని కాదు. అలా జరగదు. ప్రతి వ్యక్తి తన వ్యాపారములోనే నిమగ్నమై ఉంటారు. మీరు వచ్చి పతితము నుండి పావనముగా చేయండి అని తండ్రిని అడుగుతారు ఎందుకంటే పతితత్వములో దుఃఖము ఉంది. శాంతిధామాన్ని పావన ప్రపంచమని అనరు. స్వర్గమునే పావన ప్రపంచమని అంటారు. మనుష్యులు శాంతిని మరియు సుఖాన్ని కోరుకుంటారని కూడా అర్థము చేయించారు. ఎక్కడైతే శరీరాలు ఉండవో, సత్యాతి-సత్యమైన శాంతి అక్కడ ఉంటుంది, దానిని శాంతిధామము అని అంటారు. చాలామంది శాంతిధామములోనే ఉండిపోవాలని ఉంది అని అంటారు, కానీ ఆ నియమము లేదు. అలా ఉంటే వారు పాత్రధారులు కానట్లు. పిల్లలు నాటకాన్ని కూడా అర్థము చేసుకున్నారు. ఎప్పుడైతే పాత్రధారుల పాత్ర ఉంటుందో, అప్పుడు బయట స్టేజ్ పైకి వచ్చి పాత్రను అభినయిస్తారు. ఈ అనంతమైన విషయాలు అనంతమైన తండ్రి మాత్రమే అర్థము చేయిస్తారు. జ్ఞానసాగరుడు అని కూడా వారినే అంటారు. వారు సర్వుల సద్గతిదాత, పతిత-పావనుడు. తత్వాలు అందరినీ పావనముగా చేయలేవు. నీరు మొదలైనవన్నీ తత్వాలు, అవి సద్గతినెలా కలిగిస్తాయి. ఆత్మయే పాత్రను అభినయిస్తుంది. హఠయోగ పాత్రను కూడా ఆత్మయే అభినయిస్తుంది. ఈ విషయాలను కూడా తెలివికలవారు ఎవరైతే ఉంటారో, వారే అర్థము చేసుకోగలరు. పూజ్యుల నుండి మళ్ళీ పూజారులుగా ఎలా అవుతారు అన్నది మనుష్యులు అర్థము చేసుకునే విధముగా ఏవైనా యుక్తులు రచించండి అని తండ్రి ఎంతగా అర్థము చేయించారు. పూజ్యులు కొత్త ప్రపంచములో ఉంటారు, పూజారులు పాత ప్రపంచములో ఉంటారు. పావనమైనవారిని పూజ్యులని, పతితులను పూజారులని అంటారు. ఇక్కడైతే అందరూ పతితులుగానే ఉన్నారు ఎందుకంటే వికారాల ద్వారా జన్మ తీసుకుంటారు. అక్కడ శ్రేష్ఠమైనవారు ఉంటారు. సంపూర్ణ శేష్ఠాచారులని అంటూ ఉంటారు కూడా. ఇప్పుడు పిల్లలైన మీరు అలా తయారవ్వాలి. ఇందులో శ్రమ ఉంది. ముఖ్యమైన విషయము స్మృతి. స్మృతిలో ఉండడం చాలా కష్టమని అందరూ అంటుంటారు. మేము స్మృతిలో ఉండాలని ఎంతగా అనుకుంటున్నా ఉండలేకపోతున్నామని అంటారు. ఒకవేళ ఎవరైనా సత్యముగా చార్టు వ్రాస్తే చాలా లాభము కలగవచ్చు. పిల్లలకు తండ్రి మన్మనాభవ అన్న జ్ఞానమునిస్తున్నారు. మీరు అర్థ సహితముగా చెప్తారు, మీకు తండ్రి ప్రతి విషయాన్ని యథార్థ రీతిలో అర్థ సహితముగా అర్థము చేయిస్తున్నారు. తండ్రిని పిల్లలు అనేక రకాల ప్రశ్నలు అడుగుతారు, తండ్రి పిల్లల మనసును గెలుచుకోవడం కోసమని ఏదైనా సమాధానము చెప్తారు. కానీ తండ్రి అంటున్నారు, నా పనైతే పతితము నుండి పావనముగా చేయడమే. నన్ను మీరు పిలిచేదే దాని కోసము. ఆత్మ అయిన మనము శరీర సహితముగా పావనముగా ఉండేవారమని మీకు తెలుసు. ఇప్పుడు అదే ఆత్మ శరీర సహితముగా పతితముగా అయ్యింది. 84 జన్మల లెక్క ఉంది కదా.

ఇప్పుడు ఈ ప్రపంచము ముళ్ళ అడవిలా తయారయ్యిందని మీకు తెలుసు. ఈ లక్ష్మీ-నారాయణులు అయితే పుష్పాల వంటివారు కదా. వారి ఎదురుగా వెళ్ళి ముళ్ళ వంటివారు అంటారు - మీరు సర్వగుణ సంపన్నులు... మేము పాపులము, కపటబుద్ధి కలవారము అని. అన్నిటికన్నా పెద్ద ముల్లు - కామ వికారము. తండ్రి అంటారు, దీనిపై విజయము పొంది జగత్ జీతులుగా అవ్వండి. భగవంతుడు ఏదో ఒక రూపములో రావాలి, భగీరథునిపై విరాజమానమై రావాలని మనుష్యులంటారు. పాత ప్రపంచాన్ని కొత్తదిగా చేసేందుకని భగవంతుడు రావాల్సిందే. కొత్త ప్రపంచాన్ని సతోప్రధానమని, పాతదానిని తమోప్రధానమని అంటారు. ఇప్పుడిది పాత ప్రపంచము కావున తప్పకుండా తండ్రి రావలసే ఉంటుంది. తండ్రినే రచయిత అని అంటారు. పిల్లలైన మీకు ఎంత సహజముగా అర్థము చేయిస్తారు. ఎంత సంతోషముండాలి. ఇకపోతే ఎవరికైనా కర్మభోగపు లెక్కాచారము ఉంటే, ఇంకేదైనా ఉంటే, దానిని అనుభవించాల్సిందే, ఇందులో బాబా ఆశీర్వదించరు. బాబా, మీరు వచ్చి మాకు వారసత్వాన్ని ఇవ్వండి అనే నన్ను పిలుస్తారు. బాబా నుండి ఏ వారసత్వము పొందాలనుకుంటున్నారు? ముక్తి-జీవన్ముక్తుల వారసత్వము. ముక్తి-జీవన్ముక్తుల దాత ఒక్క జ్ఞానసాగరుడైన తండ్రి మాత్రమే, అందుకే వారిని జ్ఞానదాత అని అంటారు. భగవంతుడు జ్ఞానాన్ని ఇచ్చారు, కానీ ఎప్పుడు ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనేది ఎవ్వరికీ తెలియదు. తికమక అంతా ఇందులోనే ఉంది. ఎవరికి జ్ఞానమిచ్చారు అన్నది కూడా ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు ఈ బ్రహ్మా కూర్చొని ఉన్నారు - వీరికి, నేనే నారాయణునిగా ఉండేవాడిని, మళ్ళీ 84 జన్మలు తీసుకున్నాను అని తెలిసింది. వీరు నంబరువన్ లో ఉన్నారు. నాకైతే కళ్ళు తెరుచుకున్నాయి అని బాబా అంటుంటారు. మీరు కూడా మా కళ్ళు తెరుచుకున్నాయని అంటుంటారు. మూడవ నేత్రమైతే తెరుచుకుంటుంది కదా. మాకు తండ్రి గురించి, సృష్టి చక్రము గురించి మొత్తం జ్ఞానము లభించిందని మీరంటారు. నేను ఎవరిని, ఎలా ఉన్నాను - నా కళ్ళు తెరుచుకున్నాయి. ఇది ఎంత అద్భుతము. ముందుగా నేను ఆత్మను, కానీ నేను స్వయాన్ని దేహముగా భావించి కూర్చున్నాను. నేను ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటానని ఆత్మ అంటుంది. అయినా, మనము స్వయాన్ని ఆత్మగా మర్చిపోయి దేహాభిమానులుగా అయిపోతాము, అందుకే ఇప్పుడు మీకు మొట్టమొదట నేను ఈ జ్ఞానాన్ని ఇస్తున్నాను - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ కూర్చోండి. నేను ఒక ఆత్మను అని లోలోపల అభ్యాసము చేస్తూ ఉండండి. ఆత్మగా భావించకపోతే తండ్రిని మర్చిపోతారు. తప్పకుండా మేము పదే-పదే దేహాభిమానములోకి వచ్చేస్తున్నామని అనుభవం చేస్తుంటారు. కష్టపడాలి. ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా ఆత్మాభిమానులుగా అయి కూర్చోండి. తండ్రి చెప్తున్నారు, నేను పిల్లలైన మీకు రాజ్యాన్ని ఇవ్వడానికి వచ్చాను. అర్ధకల్పము మీరు నన్ను స్మృతి చేశారు. ఏ విషయము ఎదురుగా వచ్చినా కూడా, అయ్యో రామా అని అంటారు, కానీ ఈశ్వరుడెవరు లేక రాముడెవరు అనేది ఎవ్వరికీ తెలియదు. జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు, సర్వుల సద్గతిదాత, పరమపిత పరమాత్మ అయిన త్రిమూర్తి శివుడని మీరు ఋజువు చేయాలి. బ్రహ్మా-విష్ణు-శంకరులు, ముగ్గురి జన్మ ఒక్కసారే కలిపి జరుగుతుంది. కేవలం శివజయంతి కాదు, అది త్రిమూర్తి శివజయంతి. తప్పకుండా శివుని జయంతి జరిగినప్పుడే బ్రహ్మా జయంతి కూడా జరుగుతుంది. శివుని జయంతిని జరుపుకుంటారు, మరి బ్రహ్మా ఏం చేశారు. లౌకిక తండ్రి, పారలౌకిక తండ్రి మరియు వీరు అలౌకిక తండ్రి. వీరు ప్రజాపిత బ్రహ్మా. తండ్రి చెప్తున్నారు, కొత్త ప్రపంచము కోసం ఈ కొత్త జ్ఞానము ఇప్పుడు మీకు లభిస్తుంది, ఆ తర్వాత ఇది కనుమరుగైపోతుంది. ఎవరికైతే రచయిత అయిన తండ్రి మరియు రచన యొక్క జ్ఞానము ఉండదో, వారు అజ్ఞానులనే కదా. అజ్ఞాన నిద్రలో నిద్రిస్తూ ఉన్నారు. జ్ఞానముతో పగలు, భక్తితో రాత్రి. శివరాత్రి యొక్క అర్థము కూడా తెలియదు, అందుకే దానికి సెలవు కూడా తొలగించేసారు.

తండ్రి అందరి జ్యోతిని వెలిగించేందుకు వస్తారని ఇప్పుడు మీకు తెలుసు. మీరు ఈ లైట్లు మొదలైనవి వెలిగిస్తే, వీరికిదేదో విశేషమైన రోజు అని భావిస్తారు. ఇప్పుడు మీరు అర్థ సహితముగా వెలిగిస్తారు. ఇది వారికి అర్థము కాదు. మీ భాషణ ద్వారా పూర్తిగా అర్థము చేసుకోలేరు. ఇప్పుడు మొత్తం విశ్వముపై రావణ రాజ్యముంది, ఇక్కడైతే మనుష్యులు ఎంత దుఃఖితులుగా ఉన్నారు. రిద్ధి-సిద్ధి చేసేవారు కూడా చాలా విసిగిస్తారు. వీరిలో ఈవిల్ సోల్ ఉంది అని వార్తాపత్రికల్లో కూడా వస్తుంది. అవి చాలా దుఃఖము కలిగిస్తాయి. బాబా చెప్తున్నారు, ఈ విషయాలతో మీకు ఎటువంటి సంబంధము లేదు. తండ్రి అయితే నేరుగా విషయాన్ని తెలియజేస్తున్నారు - పిల్లలూ, మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనముగా అవుతారు. మీ దుఃఖాలన్నీ దూరమైపోతాయి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. యథార్థ రీతిలో తండ్రిని స్మృతి చేసేందుకు మరియు ఆత్మాభిమానులుగా అయ్యేందుకు కృషి చేయాలి, సత్యతతో మీ చార్టును పెట్టుకోవాలి, ఇందులోనే చాలా-చాలా లాభముంది.

2. అన్నింటికన్నా ఎక్కువ దుఃఖాన్ని కలిగించే ముల్లు కామ వికారము, దీనిపై యోగబలము ద్వారా విజయాన్ని ప్రాప్తి చేసుకొని పతితము నుండి పావనముగా అవ్వాలి. మిగిలిన ఏ విషయాలతోనూ మీకు సంబంధము లేదు.

వరదానము:-
ప్రాక్టికల్ జీవితము ద్వారా పరమాత్మ జ్ఞానము యొక్క ఋజువును చూపించే ధర్మ యుద్ధములో విజయీ భవ

ఇప్పుడు ధర్మ యుద్ధము యొక్క స్టేజ్ పైకి రావాలి. ఆ ధర్మ యుద్ధములో విజయులుగా అయ్యేందుకు సాధనము మీ ప్రాక్టికల్ జీవితము ఎందుకంటే పరమాత్మ జ్ఞానము యొక్క ఋజువే ప్రాక్టికల్ జీవితము. మీ మూర్తి ద్వారా జ్ఞానము మరియు గుణాలు ప్రాక్టికల్ గా కనిపించాలి ఎందుకంటే ఈ రోజుల్లో చర్చించడము వలన మీ మూర్తిని నిరూపించుకోలేరు, కానీ మీ ప్రాక్టికల్ ధారణా మూర్తి ద్వారా ఒక్క సెకెండులో ఎవ్వరినైనా సైలెంట్ చేయగలరు.

స్లోగన్:-
ఆత్మను ఉజ్వలముగా చేసేందుకు పరమాత్మ స్మృతి ద్వారా మనసు యొక్క అలజడులను సమాప్తము చేయండి.

మాతేశ్వరిగారి అమూల్యమైన మహావాక్యాలు

‘‘యోగము ద్వారానే ముక్తులుగా అయ్యే శక్తి లభిస్తుంది’’

మొట్టమొదట అయితే మనము ఒక ముఖ్యమైన పాయింటును తప్పకుండా గుర్తుంచుకోవాలి, అదేమిటంటే - ఈ మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజరూపుడు పరమాత్మ కావున ఆ పరమాత్మ ద్వారా ఏ జ్ఞానమైతే ప్రాప్తిస్తుందో, అది మనుష్యులందరికీ అవసరము. అన్ని ధర్మాలవారికి ఈ జ్ఞానము తీసుకునేందుకు అధికారముంది. ప్రతి ధర్మమువారికి తమ-తమ జ్ఞానముంది, ప్రతి ఒక్కరికీ తమ-తమ శాస్త్రముంది, ప్రతి ఒక్కరి అభిప్రాయాలు ఎవరివి వారివే, ప్రతి ఒక్కరి సంస్కారాలు ఎవరివి వారివే, కానీ ఈ జ్ఞానము అందరి కోసముంది. వారు ఈ జ్ఞానాన్ని తీసుకోలేకపోయినా కానీ, మన వంశములోకి రాకపోయినా కానీ, బాబా అందరికీ తండ్రి అయిన కారణముగా వారితో యోగము జోడించినట్లయితే పవిత్రముగా తప్పకుండా అవుతారు. ఈ పవిత్రత కారణముగా తమ సెక్షన్ లోనే పదవిని తప్పకుండా పొందుతారు ఎందుకంటే యోగాన్ని అయితే మనుష్యులందరూ అంగీకరిస్తారు. చాలామంది మనుష్యులు మాకు కూడా ముక్తి కావాలి అని అంటారు, కానీ శిక్షల నుండి విడుదలై ముక్తులయ్యే శక్తి కూడా ఈ యోగము ద్వారా లభిస్తుంది.

‘‘అజపాజపము అనగా నిరంతర ఈశ్వరీయ స్మృతి’’

శ్వాస-శ్వాసలోనూ నిరంతర జపము జపిస్తూ ఉండండి అనే సామెత ఏదైతే ఉందో, దాని యథార్థ అర్థమేమిటి? మనము అజపాజపము అని అన్నప్పుడు దాని యథార్థమైన అర్థము ఏమిటంటే - ఏ జపము చేయకుండా, శ్వాస-శ్వాసలోనూ తమ బుద్ధియోగాన్ని తమ పరమపిత పరమాత్మతో నిరంతరము జోడించాలి మరియు ఈ ఈశ్వరీయ స్మృతి శ్వాస-శ్వాసలోనూ స్థిరముగా నిలిచి ఉంటుంది, ఆ నిరంతర ఈశ్వరీయ స్మృతిని అజపాజపము అని అంటారు. అంతేకానీ నోటితో ఏదైనా జపము చేయడం అనగా రామ-రామ అని అనడము, లోలోపల ఏదైనా మంత్రాన్ని ఉచ్చరించడము, ఇది నిరంతరం జరగాలంటే సాధ్యము కాదు. వాళ్ళు ఏమనుకుంటారంటే - మేము నోటితో మంత్రాన్ని ఉచ్చరించము కానీ మనసులో ఉచ్చరిస్తాము, ఇదే అజపాజపము అని అనుకుంటారు. అయితే, ఒక సహజమైన ఆలోచించే విషయమేమిటంటే, మన పదమే అజపాజపము అని అన్నప్పుడు, ఇక ఏదీ జపించవలసిన అవసరము కూడా లేదు. ఆంతరికముగా కూర్చుని ఏ మూర్తిని ధ్యానము కూడా చేయనవసరం లేదు, ఏమీ స్మరణ చేయనవసరం లేదు ఎందుకంటే నిరంతరము చేయాలి అన్నప్పుడు తింటూ, తాగుతూ ఉన్నప్పుడు అలా జపము చేయలేరు. కానీ మనం ఏదైతే ఈశ్వరీయ స్మృతి చేస్తామో, అది నిరంతరము నడవగలదు, ఎందుకంటే ఇది చాలా సహజమైనది. ఉదాహరణకు ఒక బాలుడు తన తండ్రిని గుర్తు చేసుకున్నప్పుడు, ఆ సమయములో తండ్రి ఫోటోను ఎదురుగా తెచ్చుకోవలసిన అవసరముండదు, కానీ మనసా-వాచా-కర్మణా తండ్రి యొక్క కర్తవ్యము, కర్మ, గుణాల సహితముగా అన్నీ గుర్తుకొస్తాయి, ఇక అంతే, అవి గుర్తుకు రావడముతో ఆ బాలుడు కూడా ఆ కర్మలే చేస్తాడు, అందుకే సన్ షోస్ ఫాదర్ (కొడుకు తండ్రిని ప్రత్యక్షము చేస్తాడు) అని అంటారు. అలాగే మీరు కూడా ఇతరుల స్మృతులను తమ మనసు లోతుల్లో నుండి తొలగించి, ఆ ఒక్క అసలైన పారలౌకిక పరమపిత పరమాత్ముని స్మృతిలో ఉండాలి. ఇందులో లేస్తూ-కూర్చుంటూ, తింటూ-తాగుతూ నిరంతరము స్మృతిలో ఉండగలరు. ఈ స్మృతి ద్వారానే కర్మాతీతులుగా అవుతారు. కావున ఈ న్యాచురల్ స్మృతినే అజపాజపము అని అంటారు. అచ్ఛా - ఓం శాంతి.

అవ్యక్త సూచనలు - స్వయము కొరకు మరియు సర్వుల కొరకు మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగము చెయ్యండి

అభ్యాసము అనే ప్రయోగశాలలో కూర్చుని యోగ ప్రయోగము చేసినట్లయితే ఒక్క తండ్రి యొక్క ఆధారాన్ని మరియు మాయ యొక్క అనేక రకాల విఘ్నాల నుండి పక్కకు తప్పుకున్నట్లు అనుభవము చేస్తారు. ఇప్పుడు జ్ఞాన సాగరునిలో, గుణాల సాగరునిలో, శక్తుల సాగరునిలో పైపైన అలలలోనే తేలియాడుతున్నారు, అందుకే అల్పకాలికమైన రిఫ్రెష్మెంట్ను అనుభవము చేస్తారు. కానీ ఇప్పుడు సాగరుని లోతుల్లోకి వెళ్ళినట్లయితే అనేక రకాల విచిత్రమైన అనుభవాలను పొంది రత్నాలను ప్రాప్తి చేసుకుంటారు.