19-01-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మేము బ్రాహ్మణుల నుండి దేవతలుగా అవుతాము, బ్రాహ్మణులైన మాకే తండ్రి యొక్క శ్రేష్ఠ మతము లభిస్తుంది అని మీకు నషా ఉండాలి’’

ప్రశ్న:-
ఎవరికైతే కొత్త రక్తము ఉంటుందో, వారికి ఏ అభిరుచి మరియు ఏ నషా ఉండాలి?

జవాబు:-
ఈ ప్రపంచమేదైతే పాతదిగా, ఇనుప యుగముదిగా అయిపోయిందో, దానిని కొత్త బంగారు యుగముగా తయారుచేయాలనే, పాతదానిని కొత్తదిగా తయారుచేయాలనే అభిరుచి ఉండాలి. కన్యలది కొత్త రక్తము కనుక తమ తోటివారిని పైకి లేపాలి. నషాను స్థిరముగా ఉంచుకోవాలి. భాషణ చేయడములో కూడా చాలా నషా ఉండాలి.

పాట:-
రాత్రి ప్రయాణీకుడా అలసిపోకు...

ఓంశాంతి
పిల్లలు ఈ పాట అర్థాన్ని అయితే అర్థం చేసుకున్నారు. ఇప్పుడు భక్తి మార్గపు ఘోర అంధకారమయమైన రాత్రి అయితే పూర్తవుతోంది. మనపైకి ఇప్పుడు కిరీటము రానున్నది అని పిల్లలు అర్థం చేసుకున్నారు. ఇక్కడ కూర్చుని ఉన్నారు, మనుష్యుల నుండి దేవతలుగా అవ్వడము మీ లక్ష్యము-ఉద్దేశ్యము. సన్యాసులు అర్థం చేయిస్తూ ఉంటారు కదా - నీవు స్వయాన్ని ఎద్దుగా భావించినట్లయితే ఆ విధముగా తయారైపోతావు అని. అది భక్తి మార్గము యొక్క ఉదాహరణ. అలాగే రాముడు వానర సైన్యాన్ని తీసుకున్నారన్న ఉదాహరణ కూడా ఉంది. మీరు ఇక్కడ కూర్చుని ఉన్నారు. మనమే డబల్ కిరీటధారులైన దేవీ-దేవతలుగా అవుతామని మీకు తెలుసు. స్కూల్లో చదువుకుంటున్నప్పుడు - నేను ఇది చదువుకొని డాక్టరుగా అవుతాను, ఇంజినీరుగా అవుతానని అంటారు. ఈ చదువు ద్వారా మనమే దేవీ-దేవతలుగా అవుతున్నామని మీరు భావిస్తారు. ఈ శరీరాన్ని వదిలేస్తాము మరియు మన తలపై కిరీటముంటుంది. ఇదైతే చాలా అశుద్ధమైన ఛీ-ఛీ ప్రపంచము కదా. కొత్త ప్రపంచము ఫస్ట్ క్లాస్ ప్రపంచము. పాత ప్రపంచము పూర్తిగా థర్డ్ క్లాస్ ప్రపంచము. ఇదైతే అంతమవ్వనున్నది. కొత్త ప్రపంచానికి యజమానులుగా తయారుచేసేవారు తప్పకుండా విశ్వ రచయితయే అవుతారు. ఇతరులెవ్వరూ చదివించలేరు. శివబాబాయే మిమ్మల్ని చదివించి నేర్పిస్తారు. తండ్రి అర్థం చేయించారు, పూర్తిగా ఆత్మాభిమానులుగా అయిపోతే ఇంకేమి కావాలి. మీరు బ్రాహ్మణులుగా ఉండనే ఉన్నారు. మేము దేవతలుగా తయారవుతున్నామని మీకు తెలుసు. దేవతలు ఎంత పవిత్రముగా ఉండేవారు. ఇక్కడ ఎంత పతిత మనుష్యులు ఉన్నారు. ముఖము మనుష్యులదే కానీ లక్షణాలు ఎలా ఉన్నాయో చూడండి. ఎవరైతే దేవతల పూజారులు ఉన్నారో, వారు స్వయమే వారి ఎదురుగా - మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు... మేము వికారులము, పాపులము అని దేవతల మహిమను పాడుతారు. దేవతల ముఖము కూడా మనుష్యుల వంటిదే కానీ వారి వద్దకు వెళ్ళి మహిమను పాడుతారు, తమను తాము అశుద్ధమైనవారిమని, వికారులమని అనుకుంటారు. మాలో ఏ గుణాలు లేవని అంటారు. వారు కూడా మనుష్యులే. మనమైతే ఇప్పుడు పరివర్తనై వెళ్ళి దేవతలుగా అవుతామని ఇప్పుడు మీరు భావిస్తారు. కృష్ణపురిలోకి వెళ్ళాలనే శ్రీకృష్ణుని పూజ చేస్తారు కానీ ఎప్పుడు వెళ్తారనేది వారికి తెలియదు. భగవంతుడు వచ్చి భక్తి ఫలాన్ని ఇస్తారని భక్తి చేస్తూ ఉంటారు. మమ్మల్ని చదివించేవారు ఎవరు అని మొట్టమొదట మీకు ఈ నిశ్చయము ఉండాలి. ఇది శ్రీ శ్రీ శివబాబా యొక్క మతము. శివబాబా మీకు శ్రీమతాన్ని ఇస్తున్నారు. ఎవరికైతే ఈ విషయము తెలియదో, వారు శ్రేష్ఠముగా ఎలా అవ్వగలరు. ఇంతమంది బ్రాహ్మణులందరూ శ్రీ శ్రీ శివబాబా మతముపై నడుస్తున్నారు. పరమాత్ముని మతమే శ్రేష్ఠముగా తయారుచేస్తుంది. ఎవరి భాగ్యములో ఉంటే, వారి బుద్ధిలో కూర్చుంటుంది. లేకపోతే ఏమీ అర్థం చేసుకోరు. ఎప్పుడైతే అర్థం చేసుకుంటారో, అప్పుడు సంతోషించి సహాయము చేయడము ప్రారంభిస్తారు. చాలామందికి తెలియదు, వీరు ఎవరు అనేది వారికేమి తెలుసు, అందుకే బాబా ఎవ్వరినీ కలవరు కూడా. అటువంటివారైతే ఇంకా తమ మతాన్ని ఇస్తారు. శ్రీమతము తెలియని కారణముగా వారికి కూడా తమ మతమును ఇవ్వడము మొదలుపెడతారు. ఇప్పుడు తండ్రి వచ్చిందే పిల్లలైన మిమ్మల్ని శ్రేష్ఠముగా తయారుచేయడానికి. 5 వేల సంవత్సరాల క్రితము వలె బాబా వచ్చి మనల్ని కలుసుకున్నారని పిల్లలకు తెలుసు. ఎవరికైతే తెలియదో, వారు ఈ విధముగా బదులు చెప్పలేరు. పిల్లలకు చదువు యొక్క నషా చాలా ఉండాలి. ఇది చాలా ఉన్నతమైన చదువు కానీ మాయ కూడా చాలా విరోధిస్తుంది. ఏ చదువు ద్వారానైతే మన శిరస్సుపై డబుల్ కిరీటము రానున్నదో, మనము ఆ చదువును చదువుకుంటున్నామని మీకు తెలుసు. భవిష్య జన్మజన్మాంతరాలు డబుల్ కిరీటధారులుగా అవుతారు. కనుక దీని కోసం మళ్ళీ అటువంటి పురుషార్థాన్ని పూర్తిగా చేయాలి కదా. దీనిని రాజయోగమని అంటారు. ఇది ఎంత అద్భుతమైనది. బాబా ఎల్లప్పుడూ అర్థం చేయిస్తూ ఉంటారు - లక్ష్మీ-నారాయణుల మందిరాలకు వెళ్ళండి. పూజారులకు కూడా మీరు అర్థం చేయించవచ్చు. ఈ లక్ష్మీ-నారాయణులకు కూడా ఈ పదవి ఎలా లభించింది, వీరు విశ్వానికి యజమానులుగా ఎలా అయ్యారు అన్నది పూజారులు కూడా కూర్చుని ఎవరికైనా అర్థం చేయించాలి. ఈ విధముగా కూర్చుని వినిపించినట్లయితే పూజారులకు కూడా గౌరవము లభిస్తుంది. ఈ లక్ష్మీ-నారాయణులకు ఈ రాజ్యమెలా లభించింది అనేది మేము మీకు అర్థం చేయిస్తామని మీరు చెప్పవచ్చు. గీతలో కూడా భగవానువాచ ఉంది కదా. నేను మీకు రాజయోగాన్ని నేర్పించి రాజులకే రాజుగా తయారుచేస్తాను. స్వర్గవాసులుగా మీరు అవుతారు కదా, కనుక మేమిలా అవుతామని పిల్లలకెంత నషా ఉండాలి. మీ ఈ చిత్రాన్ని మరియు మీ రాజ్యపు చిత్రాన్ని కలిపి ఇక్కడ తీయించుకోండి. కింద మీ చిత్రము, పైన రాజ్యము యొక్క చిత్రము ఉండాలి. ఇందులో ఖర్చేమీ లేదు కదా. రాజదుస్తులనైతే వెంటనే తయారుచేయవచ్చు, అప్పుడు - మేమే దేవతలుగా అవుతున్నామని పదే-పదే గుర్తుంటుంది. పైన శివబాబా కూడా ఉండాలి. ఈ ఫోటో కూడా తీసుకోవలసి ఉంటుంది. మీరు మనుష్యుల నుండి దేవతలుగా అవుతారు. ఈ శరీరము వదిలి మనము వెళ్ళి దేవతలుగా అవుతాము ఎందుకంటే ఇప్పుడు మనము ఈ రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. ఈ ఫోటో కూడా సహాయపడుతుంది. పైన శివబాబా, దాని కింద రాజ్యపు చిత్రము, దాని కింద మీ సాధారణ చిత్రము. శివబాబా నుండి రాజయోగాన్ని నేర్చుకుని మనమే దేవతలుగా, డబుల్ కిరీటధారులుగా తయారవుతున్నాము. చిత్రము పెట్టుకున్నట్లయితే - మాకు రాజయోగాన్ని నేర్పించేవారు ఈ శివబాబా అని మనము ఎవరైనా అడిగితే చెప్పగలుగుతాము. చిత్రాన్ని చూస్తూనే పిల్లలకు నషా ఎక్కుతుంది. దుకాణములో కూడా ఈ చిత్రాన్ని పెట్టుకోండి. భక్తి మార్గములో బాబా నారాయణుని చిత్రాన్ని పెట్టుకునేవారు. జేబులో కూడా ఉండేది. మీరు కూడా మీ ఫోటో పెట్టుకున్నట్లయితే - మేమే దేవీ-దేవతలుగా అవుతున్నామని గుర్తుంటుంది. తండ్రిని స్మృతి చేసే ఉపాయాలు వెతుక్కోవాలి. తండ్రిని మర్చిపోవడము వల్లనే పడిపోతారు. వికారాల్లో పడిపోతే మళ్ళీ సిగ్గు అనిపిస్తుంది. ఇప్పుడైతే మేము ఈ దేవతలుగా అవ్వలేమని హార్ట్ ఫెయిల్ అయిపోతారు. ఇప్పుడు మనము దేవతలుగా ఎలా అవుతాము? బాబా అంటారు, వికారాల్లో పడిపోయేవారి ఫొటోలు తీసేయండి. మీరు స్వర్గములోకి వెళ్ళేందుకు యోగ్యులుగా లేరు, మీ పాస్ పోర్ట్ క్యాన్సిల్ అని వారికి చెప్పండి. మేమైతే పడిపోయాము, ఇప్పుడు మేము స్వర్గములోకి ఎలా వెళ్తాము అని వారు స్వయము కూడా ఫీల్ అవుతారు. నారదుని ఉదాహరణ చెప్తారు కదా. నీవు నీ ముఖాన్ని చూసుకో, లక్ష్మిని వరించేందుకు యోగ్యముగా ఉన్నావా అని వారితో అన్నారు. అప్పుడు వారి ముఖము కోతి వలె కనిపించింది. కనుక మనుష్యులకు కూడా - మాలోనైతే ఈ వికారాలు ఉన్నాయి, మరి మేము శ్రీనారాయణుడిని లేక శ్రీలక్ష్మిని ఎలా వరించగలము అని సిగ్గుగా అనిపిస్తుంది. బాబా యుక్తులైతే అన్నీ తెలియజేస్తారు, కానీ వాటి పట్ల విశ్వాసము కూడా ఉంచాలి కదా. వికారాల నషా కలిగినప్పుడు, ఈ లెక్కన మేము రాజులకే రాజుగా, డబుల్ కిరీటధారులుగా ఎలా అవుతామని వారు అర్థం చేసుకుంటారు. పురుషార్థమైతే చేయాలి కదా. ఇటువంటి యుక్తులను రచించండి మరియు అందరికీ అర్థం చేయిస్తూ ఉండండని బాబా తెలియజేస్తూ ఉంటారు. రాజయోగము యొక్క స్థాపన జరుగుతోంది. ఇప్పుడు వినాశనము ఎదురుగా నిలబడి ఉంది. రోజురోజుకూ తుఫానుల జోరు పెరుగుతూ ఉంటుంది. బాంబులు మొదలైనవి కూడా తయారవుతున్నాయి. భవిష్య ఉన్నత పదవిని పొందేందుకే మీరు ఈ చదువును చదువుకుంటున్నారు. మీరు ఒక్కసారి మాత్రమే పతితము నుండి పావనముగా అవుతారు. మేము నరకవాసులమని మనుష్యులు అర్థం చేసుకోరు ఎందుకంటే రాతిబుద్ధి కలవారిగా ఉన్నారు. ఇప్పుడు మీరు రాతిబుద్ధి కలవారి నుండి పారసబుద్ధి కలవారిగా అవుతున్నారు. భాగ్యములో ఉన్నట్లయితే వెంటనే అర్థం చేసుకుంటారు లేదంటే మీరు ఎంతగా తల బాదుకున్నా సరే, బుద్ధిలో కూర్చోదు. తండ్రి గురించే తెలియకపోతే నాస్తికులు అనగా అనాథలు, కావున శివబాబా పిల్లలైనందుకు వారిని సనాథలుగా చేయాలి కదా. ఇక్కడ ఎవరికైతే జ్ఞానముంటుందో, వారు తమ పిల్లలను వికారాల నుండి రక్షిస్తూ ఉంటారు. అజ్ఞానులైతే వారి పిల్లలను కూడా తమ వలె చిక్కుకునేలా చేస్తూ ఉంటారు. ఇక్కడ వికారాల నుండి రక్షించడము జరుగుతుందని మీకు తెలుసు. మొట్టమొదట కన్యలను రక్షించాలి. తల్లిదండ్రులు పిల్లలను వికారాలలో తోసేస్తూ ఉంటారు. ఇది భ్రష్టాచారీ ప్రపంచమని మీకు తెలుసు. శ్రేష్ఠాచారీ ప్రపంచాన్ని కోరుకుంటారు. భగవానువాచ - నేను శ్రేష్ఠాచారిగా తయారుచేయడానికి వచ్చినప్పుడు అందరూ భ్రష్టాచారులుగా ఉన్నారు. నేను అందరినీ ఉద్ధరిస్తాను. సాధు-సన్యాసులు మొదలైనవారందరినీ ఉద్ధరించేందుకు భగవంతుడే రావలసి ఉంటుందని గీతలో కూడా వ్రాయబడి ఉంది. ఒక్క భగవంతుడైన తండ్రియే వచ్చి అందరినీ ఉద్ధరిస్తారు. మనుష్యులు ఎంత రాతిబుద్ధి కలవారిగా అయిపోతారు అని ఇప్పుడు మీరు ఆశ్చర్యపోతారు. ఈ సమయములో ఒకవేళ గొప్ప-గొప్పవారికి గీతా భగవానుడు శివుడు అన్నది తెలిస్తే ఏమైపోతుందో తెలియదు. హాహాకారాలు వ్యాపిస్తాయి. కానీ అందుకు ఇంకా సమయముంది లేకపోతే అందరి ఆసనాలు ఒక్కసారిగా కదలడము మొదలుపెడతాయి. ఎంతోమంది సింహాసనాలు కదులుతాయి కదా. యుద్ధము జరిగినప్పుడు, వీరి సింహాసనము కదలడము మొదలయ్యింది, ఇప్పుడు పడిపోతారని తెలుస్తుంది. ఇప్పుడే ఇవి కదిలితే చాలా అలజడి జరుగుతుంది. ఇది మున్ముందు జరుగనున్నది. తప్పకుండా బ్రహ్మా తనువు ద్వారానే స్థాపన చేస్తున్నానని పతిత-పావనుడు, సర్వుల సద్గతిదాత స్వయంగా చెప్తున్నారు. సర్వుల సద్గతిని అనగా ఉద్ధరణను చేస్తున్నాను. భగవానువాచ - ఇది పతిత ప్రపంచము, వీరందరినీ నేను ఉద్ధరించాలి. ఇప్పుడందరూ పతితముగా ఉన్నారు. మరి పతితులు ఎవరినైనా పావనముగా ఎలా చేయగలరు? మొదట స్వయము పావనముగా అయి ఆ తర్వాత ఫాలోవర్స్ ను తయారుచేయాలి. భాషణ చేయడములో చాలా నషా ఉండాలి. కన్యలది కొత్త రక్తము. మీరు పాతవారి నుండి కొత్తవారిగా తయారుచేస్తున్నారు. మీ ఆత్మ ఏదైతే పాత ఇనుప యుగముదిగా అయిపోయిందో, అది ఇప్పుడు కొత్త బంగారు యుగముదిగా అవుతుంది. మాలిన్యము తొలగిపోతూ ఉంటుంది. కనుక పిల్లలకు చాలా అభిరుచి ఉండాలి. నషాను స్థిరముగా ఉంచుకోవాలి. మీ తోటివారిని మేలుకొలపాలి. గురుమాత అని అంటూ ఉంటారు కూడా. మాత గురువుగా ఎప్పుడవుతారు అనేది ఇప్పుడు మీకు తెలుసు. జగదంబయే మళ్ళీ రాజరాజేశ్వరిగా అవుతారు. ఇక తర్వాత అక్కడ గురువులెవ్వరూ ఉండరు. గురువుల పరంపర ఇప్పుడే నడుస్తుంది. తండ్రి వచ్చి మాతలపై జ్ఞానామృత కలశాన్ని పెడతారు. ప్రారంభము నుండి ఇలాగే జరుగుతుంది. సెంటర్ల కోసం కూడా బ్రహ్మాకుమారి కావాలని అంటారు. బాబా అయితే అంటారు, మీరే నడుపుకోండి, ధైర్యము లేదా? అలా కాదు బాబా, మాకు టీచర్ కావాలి అని అంటారు. ఇది కూడా మంచిదే, గౌరవము ఇస్తున్నారు.

ఈ రోజుల్లో ప్రపంచములో ఒకరికొకరు కుంటి గౌరవము ఇచ్చుకుంటారు. ఈ రోజు ప్రైమ్ మినిస్టర్ గా ఉంటారు, రేపు వారిని తొలగించేస్తారు. స్థిరమైన సుఖము ఎవ్వరికీ లభించదు. ఈ సమయములో పిల్లలైన మీకు స్థిరమైన రాజ్య భాగ్యము లభిస్తోంది. మీకు బాబా ఎన్ని రకాలుగా అర్థం చేయిస్తారు. స్వయాన్ని సదా హర్షితముగా ఉంచుకునేందుకు చాలా మంచి-మంచి యుక్తులను తెలియజేస్తారు. శుభ భావన ఉంచాలి కదా. ఓహో! మేము ఈ లక్ష్మీ-నారాయణులుగా అవుతాము. ఒకవేళ ఎవరి భాగ్యములోనైనా లేకపోతే ఇక పురుషార్థమేమి చేస్తారు. బాబా పురుషార్థమేమిటి అనేది తెలియజేస్తారు కదా. పురుషార్థము ఎప్పుడూ వ్యర్థమవ్వదు, అది సదా సఫలమవుతుంది. రాజధాని తప్పకుండా స్థాపన అయిపోతుంది. వినాశనము కూడా మహాభారత యుద్ధము ద్వారా జరగవలసిందే. మున్ముందు మీరు ఇంకా తీవ్రతరము చేసినట్లయితే వారంతా వస్తారు. ఇప్పుడు అర్థం చేసుకోరు, లేదంటే వారి రాజ్యమంతా ఎగిరిపోతుంది. ఎంతమంది గురువులు ఉన్నారు. ఎవ్వరికీ ఫాలోవర్స్ గా లేనటువంటి మనుష్యులు ఎవరూ ఉండరు. ఇక్కడ మీకు సద్గతినిచ్చే ఒక్క సద్గురువు లభించారు. చిత్రాలు చాలా బాగున్నాయి. ఇది సద్గతి అనగా సుఖధామము, అది ముక్తిధామము. ఆత్మలైన మనమంతా నిర్వాణధామములో ఉంటామని బుద్ధి కూడా చెప్తుంది. అక్కడి నుండి మళ్ళీ టాకీలోకి వస్తాము. మనము అక్కడి నివాసులము. ఈ ఆట అంతా భారత్ పైనే తయారుచేయబడి ఉంది. శివజయంతిని కూడా ఇక్కడే జరుపుకుంటారు. తండ్రి అంటారు, నేను వచ్చాను, కల్పము తర్వాత మళ్ళీ వస్తాను. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత తండ్రి రాగానే స్వర్గము తయారవుతుంది. క్రైస్టుకు ఇన్ని సంవత్సరాల పూర్వం ప్యారడైజ్ ఉండేది, స్వర్గముండేది అని అంటారు కూడా. ఇప్పుడు లేదు, మళ్ళీ తయారవుతుంది. కనుక తప్పకుండా నరకవాసుల వినాశనము, స్వర్గవాసుల స్థాపన జరగాలి. మీరే స్వర్గవాసులుగా అవుతున్నారు. నరకవాసులందరూ వినాశనమైపోతారు. ఇంకా లక్షల సంవత్సరాలు ఉన్నాయని, పిల్లలు పెద్దవారవుతారు, ఆ తర్వాత వారికి వివాహము చేయాలని వారు భావిస్తారు, కానీ మీరు ఆ విధముగా అనరు. ఒకవేళ కొడుకు మీ సలహాపై నడవకపోతే - అతను స్వర్గవాసిగా అవ్వకపోతే మరి ఏం చేయాలి అని శ్రీమతము తీసుకోవలసి ఉంటుంది. తండ్రి అంటారు, ఒకవేళ ఆజ్ఞాకారిగా లేకపోతే వదిలేసేయండి. దీని కోసం పక్కా నష్టోమోహా అవస్థ కావాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. శ్రీ శ్రీ శివబాబా యొక్క శ్రేష్ఠ మతముపై నడుచుకుని స్వయాన్ని శ్రేష్ఠముగా తయారుచేసుకోవాలి. శ్రీమతములో మన్మతాన్ని మిక్స్ చేయకూడదు. ఈశ్వరీయ చదువు యొక్క నషాలో ఉండాలి.

2. తమ తోటివారి కళ్యాణము కొరకు యుక్తులను రచించాలి. అందరి పట్ల శుభభావనను ఉంచుతూ ఒకరికొకరు సత్యమైన గౌరవాన్ని ఇవ్వాలి. కుంటి గౌరవము కాదు.

వరదానము:-
నిరంతరము బాబా తోడు యొక్క అనుభూతి ద్వారా ప్రతి క్షణము, ప్రతి సంకల్పములో సహయోగిగా అయ్యే సహజయోగీ భవ

ఏ విధముగా శరీరము మరియు ఆత్మకు ఎప్పటివరకైతే పాత్ర ఉంటుందో అప్పటివరకు అవి వేరవ్వలేవో, అదే విధముగా బాబా స్మృతి బుద్ధి నుండి వేరవ్వకూడదు, సదా బాబా తోడు ఉండాలి. మరింకే స్మృతి తనవైపుకు ఆకర్షించకూడదు. అటువంటివారినే సహజయోగులు మరియు స్వతహాయోగులు అని అంటారు. ఇటువంటి యోగులు ప్రతి క్షణము, ప్రతి సంకల్పము, ప్రతి మాట, ప్రతి కర్మలోనూ సహయోగులుగా ఉంటారు. సహయోగీ అనగా వారి ఒక్క సంకల్పము కూడా సహయోగము లేకుండా ఉండదు. ఇటువంటి యోగులు మరియు సహయోగులు శక్తిశాలిగా అయిపోతారు.

స్లోగన్:-
సమస్యా స్వరూపులుగా అయ్యేందుకు బదులుగా సమస్యను అంతము చేసే సమాధాన స్వరూపులుగా అవ్వండి. అవ్యక్త ప్రేరణలు - ఈ అవ్యక్త మాసములో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవము చేయండి

మీ స్థూల మరియు సూక్ష్మ బంధనాల లిస్టును ఎదురుగా పెట్టుకోండి. నేను బంధనముక్తుడిగా అవ్వాల్సిందే అన్న లక్ష్యాన్ని పెట్టుకోండి. ‘‘ఇప్పుడు కాకపోతే మరెప్పుడూ కాదు’’ అన్న ఈ పాఠాన్నే ఎల్లప్పుడూ పక్కా చేసుకోండి. ‘‘స్వతంత్రత బ్రాహ్మణ జన్మ యొక్క అధికారము’’ - మీ జన్మ సిద్ధ అధికారాన్ని ప్రాప్తి చేసుకుని జీవన్ముక్త స్థితిని అనుభవము చెయ్యండి. ఎప్పుడైతే స్వయాన్ని గృహస్థులుగా భావిస్తారో అప్పుడు గృహస్థులు అన్న వల ఏర్పడుతుంది. గృహస్థులుగా అవ్వటము అనగా వలలో చిక్కుకోవటము. ట్రస్టీ అనగా ముక్తులు.