ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు తమ ఆత్మిక తండ్రి యొక్క మహిమను విన్నారు. వాళ్ళు
పాడుతూ ఉంటారు, ఇక్కడ మీరు ప్రాక్టికల్ గా ఆ బాబా నుండి వారసత్వాన్ని
తీసుకుంటున్నారు. బాబా మన ద్వారానే భారత్ ను సుఖధామముగా తయారుచేస్తున్నారని మీకు
తెలుసు. ఎవరి ద్వారానైతే తయారుచేస్తున్నారో, తప్పకుండా వారే సుఖధామానికి యజమానులుగా
అవుతారు. పిల్లలకైతే చాలా సంతోషము ఉండాలి. బాబా మహిమ అపారమైనది. వారి నుండి మనము
వారసత్వాన్ని పొందుతున్నాము. ఇప్పుడు పిల్లలైన మీపై అనగా మొత్తం ప్రపంచముపై బృహస్పతి
యొక్క అవినాశీ దశ ఉంది. ముఖ్యముగా భారత్ పై మరియు ప్రపంచమంతటిపై ఇప్పుడు బృహస్పతి
దశ కూర్చోనున్నదని ఇప్పుడు బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు, ఎందుకంటే మీరు ఇప్పుడు
16 కళల సంపూర్ణులుగా అవుతారు. ఈ సమయములోనైతే ఏ కళలు లేవు. పిల్లలకు చాలా సంతోషము
ఉండాలి. ఇక్కడ సంతోషము ఉండి, బయటకు వెళ్ళడముతో సంతోషము మాయమైపోవడము కాదు. మీరు ఎవరి
మహిమనైతే పాడుతారో, వారు ఇప్పుడు మీ వద్ద హాజరై ఉన్నారు. తండ్రి అర్థం
చేయిస్తున్నారు - 5 వేల సంవత్సరాల క్రితము కూడా మీకు రాజ్యాన్ని ఇచ్చి వెళ్ళాను.
నెమ్మది-నెమ్మదిగా అందరూ పిలుస్తూ ఉండటాన్ని ఇప్పుడు మీరు చూస్తారు. మీ స్లోగన్లు
కూడా వెలువడుతూ ఉంటాయి. ఉదాహరణకు ఇందిరా గాంధీ - ఒకే ధర్మము, ఒకే భాష, ఒకే రాజ్యము
ఉండాలని అనేవారు, వారిలో ఉన్న ఆత్మనే అలా అంటుంది కదా. తప్పకుండా భారత్ లో ఒకే
రాజధాని ఉండేదని, అది ఇప్పుడు ఎదురుగా నిలబడి ఉందని ఆత్మకు తెలుసు. ఎప్పుడైనా ఇదంతా
సమాప్తమైపోతుంది, ఇది కొత్త విషయమేమీ కాదు అని మీరు అర్థం చేసుకున్నారు. భారత్ మళ్ళీ
16 కళల సంపూర్ణముగా తప్పకుండా అవ్వనున్నది. మనము ఈ యోగబలముతో 16 కళల సంపూర్ణులుగా
అవుతున్నామని మీకు తెలుసు. దానమిస్తే గ్రహణము తొలగిపోతుందని అంటారు కదా. తండ్రి కూడా
అంటారు - వికారాలను, అవగుణాలను దానమివ్వండి. ఇది రావణ రాజ్యము. తండ్రి వచ్చి దీని
నుండి విడిపిస్తారు. ఇందులో కూడా కామ వికారము చాలా పెద్ద అవగుణము. మీరు
దేహాభిమానులుగా అయిపోయారు. ఇప్పుడు దేహీ-అభిమానులుగా అవ్వాలి. శరీర భానాన్ని కూడా
వదిలేయాలి. ఈ విషయాలను పిల్లలైన మీరు మాత్రమే అర్థం చేసుకుంటారు. ఇవి ప్రపంచానికి
తెలియవు. 16 కళల సంపూర్ణముగా, సంపూర్ణ దేవతల రాజ్యముగా ఉన్న భారత్ కు ఇప్పుడు
గ్రహణము పట్టి ఉంది. ఈ లక్ష్మీ-నారాయణుల రాజధాని ఉండేది కదా. భారత్ స్వర్గముగా
ఉండేది. ఇప్పుడు వికారాల గ్రహణము పట్టి ఉంది, అందుకే తండ్రి అంటారు, దానమిస్తే
గ్రహణము తొలగిపోతుంది. ఈ కామ వికారమే కింద పడిపోయేలా చేస్తుంది, అందుకే తండ్రి
అంటారు, దీనిని దానమిచ్చినట్లయితే మీరు 16 కళలు కలవారిగా అయిపోతారు. ఇవ్వకపోతే మీరు
అలా తయారవ్వరు. ఆత్మలకు తమ-తమ పాత్ర లభించి ఉంది కదా. ఇది కూడా మీ బుద్ధిలో ఉంది.
మీ ఆత్మలో ఎంతటి పాత్ర ఉంది. మీరు విశ్వము యొక్క రాజ్య భాగ్యాన్ని తీసుకుంటారు. ఇది
అనంతమైన డ్రామా. ఎంతోమంది పాత్రధారులు ఉన్నారు. వీరిలో ఫస్ట్ క్లాస్ పాత్రధారులు ఈ
లక్ష్మీ-నారాయణులు. వీరిది నంబర్ వన్ పాత్ర. విష్ణువే బ్రహ్మా-సరస్వతులుగా, మళ్ళీ
బ్రహ్మా-సరస్వతులే విష్ణువుగా అవుతారు. వీరు 84 జన్మలు ఎలా తీసుకుంటారు. మొత్తం
చక్రమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. శాస్త్రాలు చదవడము వల్ల ఎవరూ ఏమీ అర్థం చేసుకోరు.
వారు కల్పము యొక్క ఆయువునే లక్షల సంవత్సరాలని అంటారు. అలాగైతే స్వస్తిక్ కూడా
తయారవ్వదు. వ్యాపారస్థులు వారి ఖాతా పుస్తకాలపై స్వస్తిక్ ను వేస్తారు. గణేశుడిని
పూజిస్తారు. ఇది అనంతమైన ఖాతా పుస్తకము. స్వస్తిక్ లో 4 భాగాలు ఉంటాయి.
జగన్నాథపురిలో బియ్యమును పాత్రలో ఉడికిస్తారు, అది ఉడికిపోయిన తర్వాత 4 భాగాలుగా
విడిపోతుంది. అక్కడ కేవలం అన్నము మాత్రమే భోగ్ గా పెడతారు, ఎందుకంటే అక్కడ అన్నము
ఎక్కువగా తింటారు. శ్రీనాథ ద్వారములో భోగ్ లో అన్నము ఉండదు. అక్కడ అన్ని పదార్థాలు
శుద్ధమైన నెయ్యితో పక్కాగా తయారవుతాయి. భోజనము తయారుచేసేటప్పుడు కూడా శుభ్రతతో
నోటిని కప్పుకుని తయారుచేస్తారు. ప్రసాదాన్ని చాలా గౌరవపూర్వకముగా తీసుకువెళ్తారు,
భోగ్ పెట్టిన తర్వాత అదంతా పండాలకు లభిస్తుంది. ఆ ప్రసాదాన్ని తీసుకువెళ్ళి
దుకాణాలలో పెడతారు. అక్కడ చాలా జన సమూహము ఉంటుంది. ఇది బాబా చూసి ఉన్నారు. ఇప్పుడు
పిల్లలైన మిమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు? అత్యంత ప్రియమైన తండ్రి వచ్చి మీకు
సేవకునిగా అయ్యారు, మీ సేవను చేస్తున్నారు, అంత నషా కలుగుతుందా? ఆత్మలైన మనల్ని
తండ్రి చదివిస్తారు. ఆత్మయే అంతా చేస్తుంది కదా. మనుష్యులేమో ఆత్మ నిర్లేపి అని
అంటారు. ఆత్మలో 84 జన్మల అవినాశీ పాత్ర నిండి ఉందని మీకు తెలుసు, అటువంటి ఆత్మను
నిర్లేపి అని అనడమంటే, రాత్రికి పగలుకు ఉన్నంత తేడా అవుతుంది. ఇదంతా ఎవరైనా నెల
నెలన్నర కూర్చుని బాగా అర్థం చేసుకున్నప్పుడే, ఈ పాయింట్లు బుద్ధిలో కూర్చుంటాయి.
రోజురోజుకూ ఎన్నో పాయింట్లు వెలువడుతూ ఉంటాయి. ఇది కస్తూరి వంటిది. పిల్లలకు
ఎప్పుడైతే పూర్తి నిశ్చయము ఏర్పడుతుందో, అప్పుడు - నిజంగా పరమపిత పరమాత్మయే వచ్చి
దుర్గతి నుండి సద్గతిని కలగిస్తారని అర్థం చేసుకుంటారు.
తండ్రి అంటారు, మీపై ఇప్పుడు బృహస్పతి దశ ఉంది. నేను మిమ్మల్ని స్వర్గానికి
యజమానులుగా తయారుచేసాను, ఇప్పుడు మళ్ళీ రావణుడు మీపై రాహు దశను కూర్చోబెట్టాడు.
ఇప్పుడు మళ్ళీ తండ్రి స్వర్గానికి యజమానులుగా చేయడానికి వచ్చారు. కావున స్వయానికి
నష్టము కలిగించుకోకూడదు. వ్యాపారస్థులు తమ ఖాతాను సదా సరిగ్గా ఉంచుకుంటారు. నష్టము
కలిగించుకునేవారిని అమాయకులని అంటారు. ఇప్పుడు ఇది అన్నిటికంటే పెద్ద వ్యాపారము.
ఎవరో అరుదుగా ఈ వ్యాపారము చేస్తారు. ఇదే అవినాశీ వ్యాపారము, మిగిలిన వ్యాపారాలన్నీ
మట్టిలో కలిసిపోనున్నాయి. ఇప్పుడు మీ సత్యమైన వ్యాపారము జరుగుతుంది. తండ్రి
జ్ఞానసాగరుడు, వ్యాపారస్థుడు, రత్నాకరుడు. ప్రదర్శినీలకు ఎంతమంది వస్తారో చూడండి.
సెంటరుకు ఎవరో కొంతమంది కష్టము మీద వస్తారు. భారత్ చాలా విశాలమైనది కదా. మీరు అన్ని
స్థానాలకు వెళ్ళాలి. నీటి గంగ మొత్తం భారతదేశమంతటా ఉంది కదా. ఇది కూడా మీరు అర్థం
చేయించవలసి ఉంటుంది. నీటి గంగ ఏమీ పతిత-పావని కాదు. జ్ఞాన గంగలైన మీరు వెళ్ళవలసి
ఉంటుంది. నలువైపులా మేళాలు, ప్రదర్శనీలు జరుగుతూ ఉంటాయి. రోజురోజుకూ చిత్రాలు
తయారవుతూ ఉంటాయి. చిత్రాలు ఎంత శోభాయమానముగా ఉండాలంటే, అవి చూడడముతోనే ఆనందము కలగాలి,
వీరు కరక్టుగా అర్థం చేయిస్తున్నారు, ఇప్పుడు లక్ష్మీ-నారాయణుల రాజధాని
స్థాపనవుతుంది అన్నట్లు అనిపించాలి. మెట్ల వరుస చిత్రము కూడా ఫస్ట్ క్లాస్ గా ఉంది.
ఇప్పుడు బ్రాహ్మణ ధర్మము యొక్క స్థాపన జరుగుతోంది. ఈ బ్రాహ్మణులే తర్వాత దేవతలుగా
అవుతారు. మీరు ఇప్పుడు పురుషార్థము చేస్తున్నారు కావున మనసులో స్వయాన్ని
ప్రశ్నించుకుంటూ ఉండండి - నాలో ఇంకా ఏవైనా చిన్న-చిన్న ముళ్ళు అయితే లేవు కదా, కామము
అనే ముల్లు లేదు కదా? క్రోధమనే చిన్న ముల్లు కూడా చాలా చెడ్డది. దేవతలు క్రోధము
కలవారిగా ఉండరు. శంకరుని నేత్రము తెరుచుకుంటే వినాశనమవుతుందని చూపిస్తారు. ఇది ఒక
కళంకము. వినాశనమైతే జరగవలసిందే. సూక్ష్మవతనములో శంకరునికి పాము మొదలైనవేవీ ఉండవు.
సూక్ష్మవతనములో మరియు మూలవతనములో తోటలు, ఉద్యానవనాలు, సర్పాలు మొదలైనవేవీ ఉండవు.
అవన్నీ ఇక్కడ ఉంటాయి. స్వర్గము కూడా ఇక్కడే ఉంటుంది. ఈ సమయములో మనుష్యులు ముళ్ళ వలె
ఉన్నారు, అందుకే దీనిని ముళ్ళ అడవి అని అనడము జరుగుతుంది. సత్యయుగము పుష్పాల తోట.
బాబా ఎటువంటి తోటను తయారుచేస్తారో మీరు చూస్తారు. అత్యంత సుందరముగా తయారుచేస్తారు.
అందరినీ సుందరముగా తయారుచేస్తారు. వారు స్వయమైతే సదా సుందరముగా ఉంటారు.
ప్రేయసులందరినీ లేదా పిల్లలందరినీ సుందరముగా తయారుచేస్తారు. రావణుడు పూర్తిగా నల్లగా
చేసేశాడు. మాపై బృహస్పతి దశ కూర్చుంది అని ఇప్పుడు పిల్లలైన మీకు సంతోషముండాలి.
అర్ధ సమయము సుఖము, అర్ధ సమయము దుఃఖము ఉంటే దాని వలన లాభమేముంది? అలా కాదు, 3/4 భాగము
సుఖము, 1/4 భాగము దుఃఖము ఉంటుంది. డ్రామా ఈ విధముగా తయారై ఉంది. డ్రామాను ఈ విధముగా
ఎందుకు తయారుచేశారని చాలామంది అడుగుతూ ఉంటారు. అరే, ఇది అనాది డ్రామా కదా. ఎందుకు
తయారైంది అన్న ప్రశ్నే తలెత్తదు. ఇది అనాది, అవినాశీగా తయారైన డ్రామా. ఇది తయారై,
తయారుచేయబడిన, తయారవుతూ ఉన్న డ్రామా. ఎవ్వరికీ మోక్షము లభించదు. ఈ సృష్టి అనాదిగా
నడుస్తూ ఉంది, నడుస్తూనే ఉంటుంది. ప్రళయము జరగదు.
తండ్రి కొత్త ప్రపంచాన్ని తయారుచేస్తారు కానీ అది ఎంతో పని. మనుష్యులెప్పుడైతే
పతితముగా, దుఃఖితులుగా అవుతారో, అప్పుడు తండ్రిని పిలుస్తారు. తండ్రి వచ్చి అందరి
శరీరాలను కల్పతరువుగా చేస్తారు, దాని వలన అర్ధకల్పము మీకు ఎప్పటికీ అకాలమృత్యువు
సంభవించదు. మీరు కాలుడిపై విజయము పొందుతారు. కావున పిల్లలు చాలా పురుషార్థము చేయాలి.
ఎంత ఉన్నతమైన పదవిని పొందితే అంత మంచిది. ప్రతి ఒక్కరూ ఎక్కువ సంపాదన కోసమని
తప్పకుండా పురుషార్థము చేస్తారు. కట్టెలు కొట్టేవారు కూడా నేను ఎక్కువ సంపాదించాలని
అంటారు. కొందరు మోసము ద్వారా కూడా సంపాదిస్తారు. ధనము కారణముగానే ఆపదలు వస్తున్నాయి.
అక్కడైతే మీ ధనాన్ని ఎవ్వరూ దోచుకోలేరు. ఈ ప్రపంచములో ఏమేమి జరుగుతుందో చూడండి.
అక్కడ ఇటువంటి దుఃఖము కలిగించే విషయాలేవీ ఉండవు. ఇప్పుడు మీరు తండ్రి నుండి ఎంత
వారసత్వాన్ని తీసుకుంటున్నారు. స్వయాన్ని చెక్ చేసుకోవాలి - నేను స్వర్గములోకి
వెళ్ళేందుకు యోగ్యుడినా? (నారదుని ఉదాహరణ). మనుష్యులు అనేక తీర్థయాత్రలు మొదలైనవి
చేస్తూ ఉంటారు, కానీ వారికి ఏమీ లభించదు. నలువైపులా తిరిగినా కూడా మేము మీ నుండి అను
నిత్యము దూరముగానే ఉన్నాము అని పాట కూడా ఉంది కదా. ఇప్పుడు తండ్రి మీకు ఎంత మంచి
యాత్రను నేర్పిస్తున్నారు, ఇందులో ఏ కష్టమూ లేదు. కేవలం నన్నొక్కరినే స్మృతి
చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి అని తండ్రి అంటారు. చాలా మంచి యుక్తి
వినిపిస్తాను. పిల్లలు వింటారు. ఇది నేను అప్పుగా తీసుకున్న శరీరము. నేను బాబాకు
శరీరాన్ని అప్పుగా ఇచ్చానని ఈ తండ్రికి ఎంత సంతోషము కలుగుతుంది. బాబా నన్ను
విశ్వానికి యజమానిగా చేస్తున్నారు. పేరు కూడా భగీరథుడు అని ఉంది. ఇప్పుడు పిల్లలైన
మీరు రామపురిలోకి వెళ్ళేందుకు పురుషార్థము చేస్తున్నారు. కావున పూర్తి పురుషార్థము
చేయడములో నిమగ్నమైపోవాలి. ముల్లుగా ఎందుకు అవ్వాలి.
మీరు బ్రాహ్మణ-బ్రాహ్మణీలు. అంతా మురళీపై ఆధారపడి ఉంది. మీకు మురళీ లభించకపోతే,
శ్రీమతాన్ని మీరు ఎక్కడ నుండి తీసుకువస్తారు. కేవలం బ్రాహ్మణీ మాత్రమే మురళీ
వినిపించాలని కాదు. ఎవరైనా మురళీని చదివి వినిపించవచ్చు. ఈ రోజు మీరు వినిపించండి
అని చెప్పాలి. ఇప్పుడైతే, అర్థం చేయించేందుకని ప్రదర్శనీ చిత్రాలు కూడా బాగా
తయారుచేయబడ్డాయి. ఈ ముఖ్యమైన చిత్రాలను మీ దుకాణములో పెట్టుకోండి, అనేకుల కళ్యాణము
జరుగుతుంది. మీరు వస్తే, ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది అనేది మేము మీకు అర్థం
చేయిస్తామని చెప్పండి. ఎవరి కళ్యాణమునైనా చేయడానికి కొంత సమయము పట్టినా పర్వాలేదు.
ఆ వ్యాపారముతో పాటు ఈ వ్యాపారము కూడా చేయించగలరు. ఇది బాబా యొక్క అవినాశీ జ్ఞాన
రత్నాల దుకాణము. నంబరువన్ చిత్రము మెట్ల వరుస చిత్రము మరియు గీతా భగవానుడు శివుడు
అన్న చిత్రము. భారత్ లోకి శివ భగవానుడు వచ్చారు, వారి జయంతిని జరుపుకుంటారు. ఇప్పుడు
మళ్ళీ ఆ తండ్రి వచ్చారు. యజ్ఞము కూడా రచింపబడి ఉంది. పిల్లలైన మీకు రాజయోగము యొక్క
జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. తండ్రే వచ్చి రాజులకే రాజులుగా తయారుచేస్తారు. తండ్రి
అంటారు, నేను మిమ్మల్ని సూర్యవంశీ రాజా-రాణులుగా తయారుచేస్తాను, వారికి మళ్ళీ వికారీ
రాజులు కూడా నమస్కరిస్తారు. కావున స్వర్గపు మహారాజా-మహారాణులుగా తయారయ్యేందుకు
పూర్తి పురుషార్థము చేయాలి. బాబా ఇల్లు మొదలైనవి కట్టుకోవడానికి వద్దనేమీ అనరు.
కట్టుకుంటే కట్టుకోండి అని అంటారు. డబ్బు కూడా మట్టిలో కలిసిపోతుంది, దీని కన్నా
ఇల్లు కట్టుకుని సుఖముగా ఎందుకు ఉండకూడదు. ధనాన్ని ఉపయోగించాలి. ఇల్లు కూడా
కట్టుకోండి, తినేందుకు కూడా ధనము ఉంచుకోండి. దానపుణ్యాదులు కూడా చేస్తారు. కాశ్మీరు
రాజు తనకున్న ప్రైవేట్ ప్రాపర్టీని (స్వంత ఆస్తిని) అంతా ఆర్య సమాజము వారికి దానముగా
ఇచ్చారు. తమ ధర్మము మరియు జాతి కోసం దానము చేస్తారు కదా. ఇక్కడ అటువంటి విషయమేమీ
లేదు. అందరూ పిల్లలే. జాతి మొదలైనవాటి విషయమేమీ లేదు. అవి దేహానికి సంబంధించిన
జాతులు. నేనైతే ఆత్మలైన మిమ్మల్ని పవిత్రముగా తయారుచేసి విశ్వ రాజ్యాధికారాన్ని
ఇస్తాను. డ్రామానుసారముగా భారతవాసులే రాజ్య భాగ్యాన్ని తీసుకుంటారు. మాపై బృహస్పతి
దశ కూర్చుని ఉందని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. నన్నొక్కరినే స్మృతి చేయండి,
ఇంకేమీ చేయవలసిన అవసరము లేదు అని శ్రీమతము చెప్తుంది. భక్తి మార్గములో వ్యాపారస్థులు
ధర్మార్థము ఎంతో కొంత తప్పకుండా కేటాయిస్తారు. దానికి కూడా మరుసటి జన్మలో
అల్పకాలికముగా లభిస్తుంది. ఇప్పుడు నేను డైరెక్టుగా వచ్చాను కావున మీరు ఈ కార్యములో
ఉపయోగించండి. నాకైతే ఏమీ వద్దు. శివబాబాకు తమ కోసమంటూ ఇల్లు మొదలైనవేవైనా
తయారుచేసుకోవాలా ఏమిటి. ఇదంతా బ్రాహ్మణులైన మీదే. పేదవారు, షావుకారులు అందరూ కలిసే
ఉంటారు. భగవంతుని వద్ద కూడా సమ దృష్టి లేదని కొంతమంది డిస్టర్బ్ అవుతారు. కొందరిని
మహళ్ళలో, కొందరిని గుడిసెలలో ఉంచుతారని అంటారు. శివబాబాను మర్చిపోతారు. శివబాబా
స్మృతిలో ఉంటే ఎప్పుడూ ఇలాంటి మాటలు మాట్లాడరు. అందరినీ అడగవలసి ఉంటుంది కదా. వారు
ఇంట్లో అంత విశ్రాంతిగా ఉంటున్నారని తెలిసినప్పుడు, వారికి అలాంటి సౌకర్యాలు ఏర్పాటు
చేయవలసి ఉంటుంది, అందుకే అందరినీ పట్టించుకోండి అని అంటారు. ఏదైనా వస్తువు లేకపోతే,
అది మీకు ఇవ్వచ్చు. తండ్రికైతే పిల్లల పట్ల ప్రేమ ఉంటుంది. ఇంతటి ప్రేమ ఇంకెవ్వరికీ
ఉండదు. పురుషార్థము చేయండి అని పిల్లలకు ఎంతగా అర్థం చేయిస్తారు. ఇతరుల కోసం కూడా
యుక్తులు రచించండి. దీని కోసం 3 అడుగుల నేల చాలు, అందులో కుమార్తెలు అర్థం చేయిస్తూ
ఉంటారు. ఎవరైనా పెద్ద వ్యక్తికి హాలు ఉంటే, మేము కేవలం చిత్రాలను పెడతాము,1-2 గంటలు
ఉదయము-సాయంత్రము క్లాస్ చేసి వెళ్ళిపోతాము, ఖర్చంతా మేమే పెట్టుకుంటాము, పేరు మీకు
వస్తుంది, చాలామంది వచ్చి గవ్వల నుండి వజ్ర సమానముగా అవుతారు అని చెప్పండి. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.