‘‘పరివారముతో ప్రీతిని నిర్వర్తించేందుకు నాలెడ్జ్
ఫుల్ గా అయి బాబా సమానముగా సాక్షీతనపు స్థితిలో ఉండాలి, తండ్రి,
స్వయము, డ్రామా మరియు పరివారము నాలుగింటిలోనూ నిశ్చయబుద్ధి
కలవారిగా అయి విజయులుగా అవ్వాలి’’
ఈ రోజు సమర్థుడైన బాబా తమ సమర్థులైన పిల్లలను చూస్తున్నారు
ఎందుకంటే పిల్లలు ప్రతి ఒక్కరూ స్నేహముతో బాబా సమానముగా అయ్యే
పురుషార్థాన్ని ఎంతో తపనతో చేస్తున్నారు. బాప్ దాదా పిల్లలను
చూసి సంతోషిస్తారు మరియు హృదయములో వాహ్ పిల్లలూ వాహ్ అని
పిల్లల గుణగానము చేస్తూ ఉంటారు, ఎందుకంటే పిల్లలు బాబా తలపై
కిరీటము వంటివారు. చూడండి, పిల్లల పూజ డబుల్ రూపములో జరుగుతుంది,
తండ్రి పూజ ఒక్క రూపములోనే జరుగుతుంది అంటే పిల్లలు తండ్రి
ద్వారా తండ్రి కన్నా ముందుకు వెళ్తారు, అందుకే బాబా పిల్లల
పురుషార్థాన్ని చూసి సంతోషిస్తున్నారు. నంబరువారుగా అయితే
ఉన్నారు కానీ పురుషార్థపు లక్ష్యము ముందుకు తీసుకువెళ్తుంది.
ఈ రోజు అమృతవేళ నలువైపులా ఉన్న పిల్లలలో ఒక విషయాన్ని చూసారు,
అదేమిటంటే, జ్ఞానము యొక్క పునాది. పునాది నిశ్చయము.
నిశ్చయబుద్ధి విజయంతి అని అంటారు కూడా. మీ అందరి నిశ్చయాన్ని
చూసారు, అందరికీ నంబరువారుగా బాబాపై నిశ్చయమైతే ఉండనే ఉంది,
దానికి గుర్తుగా అందరూ బాబాను గుర్తించి బాబాకు చెందినవారిగా
అయ్యారు మరియు ఇక్కడికి కూడా బాబాను కలుసుకోవడానికి వచ్చారు.
బాబాపై పిల్లలు ప్రతి ఒక్కరికీ ఎడతెగని నిశ్చయము ఉంది, కానీ
బాబాపై నిశ్చయముతో పాటు ఇంకా వేరే నిశ్చయాలు కూడా పక్కాగా
ఉండాలి, అవేమిటంటే - స్వయముపై నిశ్చయము, దానితోపాటు డ్రామాపై
నిశ్చయము మరియు పరివారముపై నిశ్చయము. ఈ నాలుగు రకాల నిశ్చయాలలో
పక్కాగా ఉండటము అనగా నిశ్చయబుద్ధి విజయులుగా అవ్వడము. కావున
చెక్ చేసుకోండి, ఈ నాలుగు నిశ్చయాలలోనూ పక్కాగా ఉన్నారా? బాబా
విషయములోనైతే అందరూ - నా బాబా మరియు నేను బాబాకు చెందినవాడిని
అని అంటారు. బాబాను నావారు అని అంటూ బాబాపై పూర్తి అధికారాన్ని
ప్రాప్తి చేసుకున్నారు. సదా బాబా ద్వారా అధికారులుగా అయి సర్వ
ఖజానాలకు అధికారులుగా అయిపోయారు. దీనితోపాటు స్వయముపై కూడా
నిశ్చయము తప్పనిసరి, ఎందుకని? ఒకవేళ స్వయముపై నిశ్చయము లేకపోతే
నిరుత్సాహులుగా అయిపోతారు. స్వయముపై నిశ్చయము అంటే - నేను బాబా
ద్వారా స్వమానధారిని, స్వరాజ్య అధికారిని. స్వయముగా తండ్రి నాకు
ఎన్ని స్వమానాలను ఇచ్చారు. ఒక్కొక్క స్వమానాన్ని గుర్తు
తెచ్చుకుంటే ఎంత నషా కలుగుతుంది! ఈ రోజుల్లో ఎవరికైనా ఏదైనా
టైటిల్ లభిస్తే, దానిని వారు వారి భాగ్యముగా భావిస్తారు. కానీ
పిల్లలైన మీకు ఒక్కొక్క స్వమానాన్ని ఎవరు ఇచ్చారు! స్వయముగా
బాప్ దాదా ప్రతి బిడ్డను స్వమానధారులుగా తయారుచేసారు. ఒక్కొక్క
స్వమానాన్ని గుర్తు చేసుకుంటూ సంతోషముతో ఎగురుతూ ఉంటారు. కావున
స్వయముపై కూడా సదా నషాతో కూడిన ఎంతటి నిశ్చయము ఉండాలంటే - నేను
బాబా ద్వారా స్వరాజ్య అధికారిని, స్వమాన అధికారిని, కోట్లలో
ఒకరిగా ఉన్న ఆత్మను. ఏ విధముగా బాబాపై నిశ్చయము ఉందో, అలా
స్వయముపై నిశ్చయము ఉండటము కూడా అవసరము ఎందుకంటే ఒకవేళ స్వయముపై
నిశ్చయము ఉన్నట్లయితే ఎక్కడైతే నిశ్చయము ఉంటుందో, అక్కడ ప్రతి
కర్మలోనూ నిశ్చయబుద్ధి కలవారిగా అనగా స్వమానధారులుగా, విజయులుగా
ఉంటారు. నిశ్చయానికి అర్థము - సఫలత. మాకైతే బాబాపై నిశ్చయము
ఉంది కదా అంటే సరిపోదు. బాబాపై ఉంది, అది చాలా మంచిది, కానీ
దానితోపాటు ‘నేను ఎవరిని’ అని స్వయము యొక్క నషా కూడా అవసరము!
ఒక్కొక్క స్వమానాన్ని గుర్తు తెచ్చుకున్నట్లయితే నిశ్చయము మరియు
నషా మీ నడవడిక మరియు ముఖము ద్వారా కనిపిస్తుంది. కనిపిస్తూ ఉంది
మరియు కనిపిస్తూ ఉంటుంది. మూడవ విషయము - డ్రామాపై కూడా నిశ్చయము
చాలా అవసరము ఎందుకంటే డ్రామాలో సమస్యలు కూడా వస్తాయి మరియు
సఫలత కూడా లభిస్తుంది. ఒకవేళ డ్రామాపై పక్కా నిశ్చయమున్నట్లయితే
డ్రామాపై నిశ్చయముతో ఎవరైతే నిశ్చయబుద్ధి కలవారిగా ఉన్నారో,
వారు సమస్యను సమాధాన స్వరూపములోకి మార్చివేస్తారు ఎందుకంటే
నిశ్చయము అనగా విజయము. ఎందులో విజయులుగా అవుతారు? పరివర్తన
చెందడములో, ఒక్క క్షణములో సమస్య పరివర్తన అయి సమాధాన రూపముగా
అయిపోతుంది. అలజడిలోకి రారు, అచలముగా ఉంటారు, ఎందుకంటే డ్రామా
జ్ఞానముతో చలించకుండా, స్థిరముగా అయిపోతారు. నిశ్చయము ఏం
ఉంటుందంటే, నేనే కల్పక్రితము కూడా సమాధాన స్వరూపముగా అనగా
సఫలమైన ఆత్మగా అయ్యాను, అవుతున్నాను మరియు కల్పము తర్వాత కూడా
నేనే అవుతాను. డ్రామాపై నిశ్చయము నషాను పక్కా చేయిస్తుంది. నేనే
అలా ఉండేవాడిని, నేనే అలా ఉన్నాను మరియు నేనే అలా అవుతాను అన్న
శుద్ధమైన గర్వముంటుంది, నషా ఉంటుంది. అందుకే, ఈ పురుషార్థీ
జీవితములో డ్రామాపై నిశ్చయము కూడా అవసరము. దానితోపాటు నాల్గవది
పరివారముపై నిశ్చయము ఎందుకంటే బాబా వచ్చిన వెంటనే పరివారానికి
జన్మనిచ్చారు. ఎలా అయితే తండ్రిపై నిశ్చయము ఉందో, అలాగే
పరివారముపై కూడా నిశ్చయము అవసరము, ఎందుకంటే పరివారము ఎవరిది?
అంతేకాక ఇంత పెద్ద పరివారము ఇంకెవరికైనా ఉండగలదా! కావున
పరివారముపై నిశ్చయము కూడా అత్యంత అవసరము ఎందుకంటే ఇంతటి పెద్ద
పరివారము విశ్వములో ఇంకెవ్వరికైనా ఉందా? చెక్ చేసుకోండి, మీకు
ఉన్నంతటి పరివారము విశ్వములో ఇంకెవరికైనా ఉందా? పరివారము
రూపములో ఏ డివైన్ ఫాదర్ కు కూడా లేదు, అక్కడ ఫాలోవర్స్ (శిష్యులు)
ఉంటారు. ఇక్కడ పరివారము ఉంది. పరివారముతో కలిసే సేవలలో,
సంబంధాలలో ఉంటారు. అంతేకానీ మాకైతే బాబాతోనే కనెక్షన్ ఉంది,
పరివారముతో లేకపోతే ఏమవుతుంది అని అనుకోవద్దు. పరివారముపై ఉన్న
నిశ్చయమైతే మీకు 21 జన్మల కొరకు ఉండబోతుంది. తెలుసు కదా!
పరివారముతో పాటు సంబంధాలలోకి వచ్చినప్పుడే తెలుస్తుంది - నేను
ఇంత పెద్ద పరివారములో అందరితోనూ నిశ్చయబుద్ధి కలవాడిగా అయి
నడుచుకుంటున్నానా? పరివారముతో కలిసి నడుచుకోవడానికి అటెన్షన్
పెట్టవలసి ఉంటుంది, పరివారములో ప్రతి ఒక్కరి సంస్కారాలు
వేరువేరుగా ఉన్నాయి మరియు ఉంటాయి కూడా. మీ స్మృతిచిహ్నమైన మాల
ఉంది, మాలలో చూడండి, ఎక్కడ మొదటి నంబరు మరియు ఎక్కడ 108వ నంబరు!
ఎందుకంటే పరివారములో భిన్న-భిన్న సంస్కారాలు ఉన్నాయి. మరి ఇంత
పెద్ద పరివారములో నడుస్తూ, సంస్కారాలను అర్థం చేసుకుంటూ
పరస్పరము ఒకే పరివారము, ఒకే తండ్రి, ఒకే రాజ్యము, కావున
ఒక్కటిగా అయ్యి నడుచుకోవాలి. పరివారాలలో కూడా పెద్ద పరివారాలు
ఉంటాయి కదా, అలాగే ఇతరుల పట్ల పెద్ద మనసు కలిగి ఉండాలి, ప్రతి
ఒక్కరి పట్ల శుభ భావన, శుభ కామనల స్థితిలో స్థితులై నడుచుకోవాలి
ఎందుకంటే పరివారము మధ్యనే సంస్కార, స్వభావాలు వస్తాయి. కానీ
కొందరు - పరివారముతో మాకేమిటి, బాబాతో అయితే బాగానే ఉంది కదా
అని అనుకుంటారు. కానీ, ఇక్కడ ధర్మము మరియు రాజ్యము, రెండింటి
స్థాపన జరుగుతోంది. కేవలం ధర్మము మాత్రమే కాదు. ఇతర
ధర్మపితలెవరైతే వచ్చారో, వారిది కేవలం ధర్మము మాత్రమే, రాజ్యము
లేదు. ఇక్కడైతే మీరందరూ రాజ్యము కూడా చేయాలి. మరి రాజ్యములో
పరివారము యొక్క అవసరము ఉంటుంది మరియు 21 జన్మలు భిన్న-భిన్న
రూపాలతో పరివారముతో పాటే ఉండాలి. పరివారాన్ని విడిచి ఎక్కడికీ
వెళ్ళలేరు. కావున చెక్ చేసుకోండి. అంతేకానీ బాబాకు తెలుసు, నాకు
తెలుసు, బాబాతోటే నాకు పని ఉంది అని భావించకండి. ఒకవేళ ఈ నాలుగు
నిశ్చయాలలోనూ ఒక్క నిశ్చయమైనా తక్కువగా ఉన్నట్లయితే అలజడిలోకి
వచ్చేస్తారు. సేవా సహచరులు, బాబా అయితే శక్తిని ఇస్తూ ఉంటారు,
కానీ సహచరులు ఎవరు? సాకారములో తోడుగా అయితే పరివారమే ఉంటుంది
కదా. బాబా ఏమి చూసారంటే, మూడు నిశ్చయాలలో మెజారిటీ బాగానే
నడుచుకుంటున్నారు. కానీ పరివారముతో సంబంధాన్ని నిర్వర్తించడము,
సంస్కారాలను కలుపుకోవడము, ప్రతి ఒక్కరినీ కళ్యాణ భావనతో చూడటము
మరియు అదే విధముగా నడుచుకోవడము, ఇందులో కొందరు పిల్లలు
యథాశక్తిగా అయిపోతున్నారు. కానీ బాబా ఏం చూసారంటే, ఎవరైతే
పరివారముపై నిశ్చయములో నాలెడ్జ్ ఫుల్ అయి సదా బాబా సమానముగా
సాక్షీతనపు స్థితిలో ఉంటూ సంబంధాలలోకి వస్తారో, ఉంటారో, వారే
నంబర్ వన్ లోకి లేక నంబర్ వన్ డివిజన్ లోకి వస్తారు. కావున చెక్
చేసుకోండి. భావ స్వభావాల విషయాలు పరివారములో వస్తాయి,
చిన్న-చిన్న పొరపాట్లు కూడా జరుగుతాయి, విఘ్నాలు వస్తాయి -
ఇవన్నీ పరివారపు సంబంధాలలోనే వస్తాయి. కావున అన్నింటికన్నా
అవసరమైనది ఈ పరివారపు సంబంధములో పాస్ అవ్వడము. ఒకవేళ పరివారముతో
కలిసి నడుచుకోవడములో, తోడును నిర్వర్తించడములో ఏదైనా లోపము ఉంటే,
అప్పుడు విఘ్నము చిన్నదైనా లేక పెద్దదైనా అది విసిగిస్తూ
ఉంటుంది. ఇది ఎందుకు, ఇది ఎలా - అన్నవి పరివారపు సంబంధాలలోనే
వస్తాయి. కావున ఎందుకు అనేదానికి బదులుగా, ఎందుకు అని అనకుండా,
మేము కలిసి నడుచుకోవాలి అని అనుకోవాలి, పరివారముతో ప్రీతిని
నిర్వర్తించాలి, ఎందుకంటే ఇది తండ్రి యొక్క పరివారము, భగవంతుని
పరివారము. ఇది సాధారణ పరివారము కాదు. వాహ్ బాబా, వాహ్ డ్రామా,
వాహ్ నేను మరియు వాహ్ పరివారము అని నషా ఉండాలి. సరేనా? చెక్
చేసుకుంటున్నారా? నాలుగింటిలోనూ పాస్ అయ్యారా? నాలుగింటిలోనూనా?
ఒక్కదానిలో కూడా తగ్గకూడదు, చెక్ చేసుకోండి. ఇప్పుడిప్పుడే చెక్
చేసుకోండి, ఎందుకంటే విజయులుగా అయ్యేందుకు సాధనమే ఇది. పరివారము
మధ్యలోనే సంస్కారాలు తలెత్తుతాయి మరియు ఆ సంస్కారాలతో
కలుపుకుపోవడము అంటే స్వయము కూడా పరివర్తన చెందడము మరియు
పరివారాన్ని కూడా అంతటి ఉన్నతమైన దృష్టితో చూడటము. బాప్ దాదా
ఇంతకుముందు కూడా చెప్పారు, బాప్ దాదా తమ చివరి బిడ్డను కూడా అతి
భాగ్యశాలిగా భావిస్తున్నారు, ఎందుకని? భగవంతుడిని గుర్తించడము,
సాధారణ రూపములో ఉన్న తండ్రిని గుర్తించడము, పెద్ద-పెద్ద
మహాత్ములు కూడా గుర్తించలేకపోయారు, కానీ బాప్ దాదా యొక్క చివరి
బిడ్డ కూడా నా బాబా అని అంటారు. మనస్ఫూర్తిగా నా బాబా అని
అంటారు. బాప్ దాదా చివరి బిడ్డలో ఉన్న విశేషతను కూడా చూస్తూ,
ఎలా అయితే ఇతర పిల్లలకు ప్రియస్మృతులు ఇస్తారో అలాగే చివరిలో
ఉన్న పిల్లలకు కూడా ఇస్తారు. కావున చెక్ చేసుకోండి, మూడింటిలో
బాగున్నారా లేక నాలుగింటిలోనూ బాగున్నారా లేక రెండింటిలో
బాగున్నారా లేక ఒక్కదానిలో బాగున్నారా. చెక్ చేసుకున్నారా?
చేసుకున్నారా చెకింగ్? నేను నాలుగు నిశ్చయాలలోనూ అనగా తండ్రి,
స్వయము, డ్రామా మరియు పరివారము, నాలుగు నిశ్చయాలలోనూ బాగున్నాను
అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. బాగున్నారా?
అచ్ఛా, బాగున్నారా, మరి పరీక్ష తీసుకోమంటారా? చేతులెత్తండి.
అచ్ఛా, పరివారములో పాస్ అయ్యారా? పరివారములో సంబంధాలలోకి రండి,
ఎందుకంటే పరివారాన్ని విడిచైతే ఎక్కడికీ వెళ్ళరు, ఇందులో
ఉండాల్సిందే, నిర్వర్తించాల్సిందే. మరి ఇందులో పాస్ అయ్యారా?
వీరు లేకపోతే బాగుండేది, వీరిలా ఎందుకు చేస్తున్నారు, ఇది ఇలా
ఎందుకు జరుగుతోంది... అన్న సంకల్పాలు ఎప్పుడైనా వస్తున్నాయా...
పూర్తిగా పరివారపు నషా ఉండాలి. నాలుగు నిశ్చయాలు ఉన్నవారు
ఎప్పుడూ కూడా - ఇలా, అలా అని సంకల్పాలలో కూడా చెయ్యరు. ఇలా
ఎందుకు జరుగుతుంది అని సంకల్పములో వచ్చినా కూడా, ఆ ఎందుకు,
ఏమిటి అన్నవి నన్ను కదిలించకూడదు, అవి నా మూడ్ ను మార్చకూడదు.
దీనినే నాలుగింటిలోనూ పాస్ అని అంటారు. చేతులైతే ఎత్తారు, బాప్
దాదాను సంతోషపెట్టారు కానీ బాప్ దాదాకు పరివారము విషయములో
కొన్నింటిని వినవలసి వస్తుంది, చూడవలసి వస్తుంది. పూర్తిగా
పెద్ద మనసు చేసుకోవాలి. అందరినీ శుభ భావన, శుభ కామనలతో మంచిగా
చేయాలి ఎందుకంటే పరివారము ఒక్కటే. ఏకమతముతో నడుచుకోవాలి మరియు
నడిపించాలి. కేవలం నడుచుకోవడము కాదు, నడిపించాలి కూడా. అందుకే
బాప్ దాదా ఒక విషయము పట్ల అటెన్షన్ ఇప్పిస్తున్నారు, పరివారములో
ఎవరైతే ఏ అలజడిలోనైనా పాస్ అవుతారో, ఎవరికైతే వ్యర్థము నడవదో,
వారు ఇతరులను కూడా అలా తయారుచెయ్యాలి. ఇప్పుడైతే మీరు మీ-మీ
సెంటర్లలో ఎంతమంది ఉంటారు, సరే, ఎక్కువలో ఎక్కువ 25-50 మంది,
ఇంతమంది ఉండరు, కానీ ఒకవేళ పెద్ద స్థానమైతే అందులో కూడా 50-60
మంది, సరే, ఇంకా ఎక్కువలో ఎక్కువ అంటే 100 మంది అనుకోండి.
ఇంతమంది లేరు కానీ ఉన్నారనుకోండి. బాప్ దాదా సెంటర్లలోని
పిల్లలందరినీ లాస్ట్ వారిని కూడా తమకు ప్రియమైనవారిగా భావిస్తూ
నడిపించారు మరియు ప్రేమకు గుర్తుగా రోజూ బాప్ దాదా ఏమని
ప్రియస్మృతులు ఇస్తున్నారు? మధురాతి మధురమైన పిల్లలు అని అంటారు.
పుల్లని పిల్లలు కూడా ఉన్నారని తెలుసు, కానీ మధురమైన, పుల్లనైన
పిల్లలు అని ఎప్పుడైనా ప్రియస్మృతులు చెప్పారా? వారిని కూడా
గారాబాల పిల్లలు అనే అంటారు, కేవలం అలా అనడమే కాదు, కానీ నా
పిల్లలు అంటూ నా వారు అన్న భావముతో నడిపిస్తారు కూడా! ఎందుకంటే
డ్రామాలో, మాలలో అందరూ ఒకే నంబరులో లేరు. ఇది రిజల్ట్.
సంస్కారాలు భిన్న-భిన్నముగా ఉంటాయి, అలా ఉండవలసిందే, లేకపోతే
అందరూ రాజులైపోతే ప్రజలుగా ఎవరు అవుతారు! రాజ్యము ఎవరిపై
చేస్తారు? మంచి ప్రజలు కూడా కావాలి కదా, రాయల్ ప్రజలు, రాజధాని
కదా, ఇలా ప్రతి ఒక్కరూ స్వయాన్ని చెక్ చేసుకోండి, పరివారములో ఏ
విషయములోనైనా ఎవరి సంస్కారాలైనా చెడుగా ఉన్నాయనుకోండి, కానీ నా
సంస్కారము ఏమిటి? ఒకవేళ చెడును చూసి నా సంస్కారము కూడా పాడైతే,
అప్పుడు నేను కూడా పాడైపోయినట్లే కదా! చెడు అనేది మంచిని కూడా
పాడుచేసేస్తుంది.
బాబా స్థాపనా సమయములో 350-400 మందిని ఒకేసారి సంభాళించారు.
ఇంతమంది కలిసి ఒకేచోట ఉండే పరివారమైతే ఇప్పుడు ఎక్కడా లేదు. సరే,
డ్యూటీలు వేరువేరుగా ఉండవచ్చు కానీ అది డ్యూటీ, అంతేకాక
పరివారము అన్న తర్వాత డ్యూటీలు ఉంటాయి. సాధారణ పరివారము,
సాధారణ డ్యూటీ, సాధారణ పద్ధతిలో దినచర్యను గడపడము... ఇది కాదు.
ఇది ప్రియమైన మరియు అతీతమైన పరివారము. ఇందులో డిస్టర్బ్ అవ్వడము
మరియు - వారు ఇలా చేసారు అందుకే ఇలా జరిగింది, వారు అలా చేసారు
కావున అలా జరిగింది అని సాకులు చెప్తారు. కానీ బాబా ముందు
అపోజిషన్ జరగలేదా! పారిపోయారు కూడా! అది అపోజిషన్ కాదా!
అయినప్పటికీ బాబా ఏమన్నారు - ఎవరైనా పారిపోయినా కానీ వారికి
టోలీ పంపండి, వారిని పిలిచేందుకు ప్రయత్నించండి, సేవ చేయండి,
గుర్తు తెప్పించండి అని. ఇలా నాలుగు నిశ్చయాలలోనూ పాస్ అవ్వాలా
లేక మూడింటిలోనా లేక రెండింటిలోనా? నంబర్ వన్ గా అవ్వాలి. దీని
కోసం వినాశనము ఏర్పాట్లు జరుగుతున్నప్పటికీ ఇప్పుడు వినాశనము
ఇంకా ఆగి ఉంది. ప్రకృతి కూడా బాబా వద్దకు వస్తుంది. ఇప్పుడు
చాలా భారముగా ఉంది అని ప్రకృతి కూడా అంటుంది. ప్రకృతి కూడా ఆ
భారము నుండి దూరము కావాలనుకుంటుంది. మాయ కూడా ఇలా అంటుంది -
ఇప్పుడిక నా పాత్ర అయిపోనుందని నాకు తెలుసు, కానీ బ్రాహ్మణ
పరివారములో ఎటువంటి పిల్లలు కూడా ఉన్నారంటే, వారు చిన్న
విషయములో కూడా నాకు తోడుగా అయిపోతారు, నన్ను వారి వద్ద
కూర్చోబెట్టుకుంటారు అని. మన రాజ్యాన్ని తీసుకువద్దాము అని
చూస్తే ఈ నాలుగు నిశ్చయాలు పర్సెంటేజ్ లో ఉన్నాయి, అందుకే సమయము
కూడా ఆగి ఉంది. వాస్తవానికి మాయ మరియు అవి ప్రకృతి, రెండూ
సిద్ధముగా ఉన్నాయి. మరి చెప్పండి, వాటిని ఆజ్ఞాపించమంటారా?
పిల్లలు ఒకవేళ ఎవర్రెడీగా లేకపోతే మాయ మరియు ప్రకృతిని ఆర్డర్
చెయ్యమంటారా? చెయ్యమంటారా? చేతులెత్తండి, సిద్ధముగా ఉన్నారా?
ఊరికే అలా చేతులెత్తకండి. పరీక్ష అయితే వస్తుంది. వస్తుంది
పరీక్ష. మీరు ఎవర్రెడీగా ఉన్నారా?
ఇప్పుడు బాప్ దాదాకు ప్రతి బిడ్డ పట్ల ఇదే ఆశ ఉంది,
అదేమిటంటే - ‘ఎలా’ అన్నదానిని తొలగించి ‘ఇలా’ అని మార్చండి. ఎలా
చెయ్యను, ఎలా అవుతుంది అని అనకండి. ఇలా చేయాలి. ఏమి చెయ్యాలి
కాదు, ఇలా చేయాలి. ఈ ఆశను ఎప్పటిలోపు పూర్తి చేస్తారు? ఎంత
సమయము కావాలి? ఎందుకంటే అందరూ తయారవ్వాలి. ఒకవేళ మీరు
తయ్యారయ్యారంటే, చేతులెత్తారంటే, మరి మీ పని ఏమిటి? ఇతరులను మీ
సమానముగా తయారుచెయ్యడము. అచ్ఛా!
బాప్ దాదా అన్ని సమాచారాల రిజల్టును విన్నారు. ఏదైతే
జరిగిందో అది బాగా జరిగింది మరియు రిజల్టు కూడా మంచి
ఉల్లాస-ఉత్సాహాలతో కూడినదిగా ఉంది. అందుకే ఇప్పుడు లక్ష్యము
పెట్టుకోండి - అవ్వాల్సిందే, చెయ్యాల్సిందే, సమాప్తిని సమీపముగా
తీసుకురండి. మీరు కొంచెం కదిలితే సమాప్తి కూడా దూరముగా
వెళ్ళిపోతుంది. మీరే సమాప్తిని సమీపముగా తీసుకురావాలి ఎందుకంటే
రాజ్యము చేసేవారు సిద్ధముగా లేకపోతే సమయము ఏం చెయ్యగలదు? అందుకే
అన్ని సాకులు, కారణాలు... కారణము అన్న పదాన్ని సమాప్తము చేయండి.
నివారణను ఎదురుగా తీసుకురండి ఎందుకంటే మీ అందరి లక్ష్యము ఇదే
కదా - దుఃఖములో ఉన్నవారికి సందేశమిచ్చి వారిని ముక్తులుగా
చేయాలి అని. వారికి ముక్తిని ఇవ్వనిదే మీరు ముక్తిలోకి
వెళ్ళలేరు. కావున వారిని ముక్తులుగా చేయండి, ఎందుకంటే బాబా
వచ్చారు కదా, కావున మొత్తము విశ్వములోని పిల్లలకు వారసత్వాన్ని
అయితే ఇస్తారు కదా. మీకు జీవన్ముక్తి వారసత్వాన్ని ఇస్తారు,
కానీ అందరూ పిల్లలే కదా, వారికి కూడా వారసత్వాన్ని అయితే
ఇవ్వాలి కదా. వారి వారసత్వము ముక్తి, మీ వారసత్వము జీవన్ముక్తి.
ఎప్పటివరకైతే ముక్తిని ఇవ్వరో, అప్పటివరకు మీరు కూడా వెళ్ళలేరు.
దీని కోసం 12 సార్లు ఫరిశ్తా రూపములో మరియు 12 సార్లు నిరాకారీ
స్వరూపములో స్థితులయ్యే డ్రిల్ చేయండి. రాత్రి పగలు కలిపి 24
గంటలు ఉన్నాయి మరియు 24 సార్లు ఈ డ్రిల్ చేయాలి. నిద్రపోయే
సమయములో నిద్రపోండి. నిద్రపోకండి అని బాప్ దాదా చెప్పడము లేదు.
నిద్రపోండి కానీ పగలు సమయములో పెంచండి. ఎప్పుడైనా ఫంక్షన్
చేసినప్పుడు రోజంతా పని చేస్తారు కదా, మేలుకుంటారు కదా! అలా ఈ
డ్రిల్ కోసం కూడా సమయాన్ని వెచ్చించండి. అచ్ఛా!
నలువైపులా ఉన్న బాబా స్నేహీలకు, ఎవరైతే స్నేహీలుగా ఉంటారో
వారు సహయోగులుగా తప్పకుండా ఉంటారు, స్నేహానికి రిటర్న్ ఏమిటంటే
వారు ప్రత్యక్ష రూపములో ప్రతి కార్యములోనూ తనువు, మనసు, ధనము,
జనములో ఇతరులకు సహయోగులుగా తప్పకుండా ఉంటారు. ఇటువంటి స్నేహీ
మరియు సహయోగీ పిల్లలకు, ఎవరైతే సదా బాబా ప్రేమలో లవలీనులై
ఉంటారో, ప్రేమలో ఉండటము కాదు, ఎవరైతే ప్రేమలో లీనమై ఉంటారో
వారికి, మరియు సదా బాబా యొక్క సర్వ కార్యాలలో సమయాన్ని,
సంకల్పాలను వెచ్చించేవారికి, ఎందుకంటే సంగమయుగములో సమయానికి
మరియు సంకల్పాలకు ఎంతో విలువ ఉంది, ఒక్క జన్మలో అనేక జన్మల
ప్రారబ్ధాన్ని తయారుచేసుకునేవారికి, ఇటువంటి తీవ్ర
పురుషార్థులకు, ప్రతి గుణాన్ని, ప్రతి శక్తిని, ప్రతి
సమయమనుసారముగా కార్యములో వినియోగించేవారికి, ఇటువంటి గుణ
సంపన్నులకు, శక్తి సంపన్నులైన పిల్లలకు చాలా చాలా పదమాల, పదమాల
రెట్లు ప్రియస్మృతులు మరియు నమస్తే.