19-10-2025 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 31.03.2006


‘‘సుపుత్రులుగా అయి తమ ముఖము ద్వారా తండ్రి ముఖాన్ని చూపించండి, నిర్మాణముగా ఉండటముతో (సేవ)తో పాటుగా నిర్మల వాణి, నిర్మానచిత్త స్థితి యొక్క బ్యాలెన్సు పెట్టుకోండి’’

ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లల భాగ్య రేఖలను చూసి హర్షిస్తున్నారు. పిల్లలందరి మస్తకములో మెరుస్తున్న జ్యోతి యొక్క రేఖ మెరుస్తూ ఉంది. నయనాలలో ఆత్మికత యొక్క భాగ్య రేఖ కనిపిస్తూ ఉంది. నోటిలో శ్రేష్ఠ వాణి యొక్క భాగ్య రేఖ కనిపిస్తూ ఉంది. పెదవులలో ఆత్మిక చిరునవ్వును చూస్తున్నారు. చేతులలో పరమాత్మ యొక్క సర్వ ఖజానాల రేఖ కనిపిస్తూ ఉంది. స్మృతిలో వేసే ప్రతి అడుగులో పదమాల రేఖలను చూస్తున్నారు. ప్రతి ఒక్కరి హృదయములో తండ్రి ప్రేమలో లవలీనమయ్యే రేఖను చూస్తున్నారు. ఇటువంటి శ్రేష్ఠ భాగ్యాన్ని ప్రతి బిడ్డ అనుభవం చేస్తున్నారు కదా! ఎందుకంటే ఈ భాగ్య రేఖలను స్వయముగా తండ్రి ప్రతి ఒక్కరి శ్రేష్ఠ కర్మలు అనే కలముతో గీశారు. అవినాశీ అయిన ఇటువంటి శ్రేష్ఠ భాగ్యము, కేవలం ఈ జన్మ కొరకే కాదు, కానీ ఇవి అనేక జన్మల యొక్క అవినాశీ భాగ్య రేఖలు. వీరు అవినాశీ తండ్రి మరియు ఇవి అవినాశీ భాగ్య రేఖలు. ఈ సమయములో శ్రేష్ఠ కర్మల ఆధారముతో సర్వ రేఖలు ప్రాప్తిస్తాయి. ఈ సమయములోని పురుషార్థము అనేక జన్మల ప్రారబ్ధాన్ని తయారుచేస్తుంది.

పిల్లలందరికీ అనేక జన్మల కొరకు ఏదైతే ప్రారబ్ధము లభించనున్నదో, బాప్ దాదా దానిని ఇప్పుడు ఈ సమయములో, ఈ జన్మలో పురుషార్థము యొక్క ప్రారబ్ధపు ప్రాప్తిని చూడాలనుకుంటున్నారు. కేవలము భవిష్యత్తులోనే కాదు, కానీ ఇప్పుడు కూడా ఈ రేఖలన్నీ సదా అనుభవమవ్వాలి ఎందుకంటే ఇప్పటి ఈ దివ్య సంస్కారాలు మీ కొత్త ప్రపంచాన్ని తయారుచేస్తున్నాయి. కనుక చెక్ చేసుకోండి, చెక్ చేసుకోవడం వస్తుంది కదా! స్వయమే స్వయం యొక్క చెకర్ (పరిశీలించుకునేవారి)గా అవ్వండి. మరి సర్వ భాగ్య రేఖలు ఇప్పుడు కూడా అనుభవమవుతున్నాయా? ఈ ప్రారబ్ధము అంతిమములో కనిపిస్తుంది అని ఇలా అయితే భావించడము లేదు కదా? ప్రాప్తి కూడా ఇప్పుడే ఉంది, అలాగే ప్రారబ్ధము యొక్క అనుభవము కూడా ఇప్పుడే చేయాలి. భవిష్య ప్రపంచము యొక్క సంస్కారాలు ఇప్పుడు ప్రత్యక్ష జీవితములో అనుభవమవ్వాలి. మరి ఏం చెక్ చేసుకోవాలి? భవిష్య ప్రపంచము యొక్క సంస్కారాలను ఎలా గాయనము చేస్తారంటే, భవిష్య ప్రపంచములో ఒకే రాజ్యము ఉంటుంది. ఆ ప్రపంచము గుర్తుంది కదా! ఎన్ని సార్లు ఆ ప్రపంచములో రాజ్యము చేసారు? గుర్తుందా లేక గుర్తు తెప్పిస్తే గుర్తొస్తుందా? ఎలా ఉండేవారు అన్నది గుర్తుంది కదా? కానీ ఆ సంస్కారము ఇప్పటి జీవితములో ప్రత్యక్ష రూపములో ఉందా? చెక్ చేసుకోండి - ఇప్పుడు కూడా మనసులో, బుద్ధిలో, సంబంధ-సంపర్కములో, జీవితములో ఒకే రాజ్యము ఉందా? లేక అప్పుడప్పుడు ఆత్మ రాజ్యముతో పాటుగా మాయా రాజ్యమైతే లేదు కదా? ఏ విధముగా భవిష్య ప్రారబ్ధములో ఒకే రాజ్యము ఉంటుంది, రెండు ఉండవు, మరి ఇప్పుడు కూడా రెండు రాజ్యాలైతే లేవు కదా? అలాగే భవిష్య రాజ్యములో ఒకే రాజ్యముతోపాటు ఒకే ధర్మము ఉంటుంది, ఆ ధర్మము ఏమిటి? సంపూర్ణ పవిత్రతా ధారణ యొక్క ధర్మము. కనుక ఇప్పుడు చెక్ చేసుకోండి, పవిత్రత సంపూర్ణముగా ఉందా? స్వప్నములో కూడా అపవిత్రత యొక్క నామ-రూపాలు ఉండకూడదు. పవిత్రత అనగా సంకల్పాలలో, మాటలలో, కర్మలలో మరియు సంబంధ-సంపర్కములో సంపూర్ణ పవిత్రత యొక్క ధారణ మాత్రమే ఉండాలి. బ్రహ్మాచారిగా ఉండాలి. స్వయాన్ని చెకింగ్ చేసుకోవటం వస్తుందా? ఎవరికైతే స్వయాన్ని చెకింగ్ చేసుకోవటం వస్తుందో వారు చేతులెత్తండి. చెకింగ్ వస్తుందా మరియు చేసుకుంటారు కూడానా? చేసుకుంటారా, చేసుకుంటారా? టీచర్లకు వస్తుందా? డబుల్ విదేశీయులకు వస్తుందా? ఎందుకు? ఇప్పటి పవిత్రత కారణముగానే మీ జడ చిత్రాల నుండి కూడా పవిత్రతను యాచిస్తారు. పవిత్రత అనగా ఒకే ధర్మము, అది ఇప్పుడు స్థాపన అవుతుంది మరియు భవిష్యత్తులో కూడా కొనసాగుతుంది. అలాగే భవిష్యత్తుకు సంబంధించి ఇంకేమి గాయనము ఉంది? ఒకే రాజ్యము, ఒకే ధర్మము మరియు వాటితో పాటుగా సదా సుఖము, శాంతి, సంపద, అఖండమైన సుఖము, అఖండమైన శాంతి, అఖండమైన సంపద. అది విశ్వ రాజ్యము మరియు ఈ సమయములో ఉన్నది స్వరాజ్యము, కనుక చెక్ చేసుకోండి, ఇప్పటి మీ స్వరాజ్య జీవితములో అవినాశీ సుఖమైన పరమాత్మ సుఖము అవినాశీగా అనుభవము అవుతుందా? ఏదైనా సాధనము లేక ఏదైనా సౌకర్యము ఆధారముగా సుఖమనేది అనుభవమవ్వటం లేదు కదా? ఎప్పుడూ ఏ కారణముగానూ దుఃఖపు అల అనుభవమవ్వకూడదు. ఏదైనా పేరు, గౌరవము, ప్రతిష్ఠల ఆధారముగా సుఖమనేది అనుభవమవ్వటం లేదు కదా? ఎందుకని? ఈ పేరు, గౌరవము, ప్రతిష్ఠ, సాధనాలు, సౌకర్యాలు, ఇవి స్వయమే వినాశీ అయినవి, అల్పకాలికమైనవి. వినాశీ అయినవాటి ఆధారముతో అవినాశీ సుఖము లభించదు. చెక్ చేసుకుంటూ వెళ్ళండి. ఇప్పుడు కూడా వింటూ వెళ్ళండి మరియు స్వయాన్ని చెక్ చేసుకుంటూ కూడా వెళ్ళండి, అప్పుడు - ఇప్పటి సంస్కారాలకు మరియు భవిష్య ప్రపంచపు ప్రారబ్ధానికి ఎంత వ్యత్యాసముంది అన్నది తెలుస్తుంది! మీరందరూ జన్మిస్తూనే బాప్ దాదాతో ప్రతిజ్ఞ చేసారు, ప్రతిజ్ఞ గుర్తుందా లేక మర్చిపోయారా? ఏమని ప్రతిజ్ఞ చేసారంటే - మేమందరము తండ్రికి సహచరులుగా అయ్యి, విశ్వ కళ్యాణకారులుగా అయ్యి కొత్త సుఖ, శాంతిమయ ప్రపంచాన్ని తయారుచేసేవారము అని. గుర్తుందా? మీ ప్రతిజ్ఞ గుర్తుందా? గుర్తుంటే చేతులెత్తండి. పక్కా ప్రతిజ్ఞనా లేక కాస్త గడబిడ అవుతుంటుందా? మీరు కొత్త ప్రపంచాన్ని ఇప్పుడు పరమాత్మ సంస్కారాల ఆధారముగా తయారుచేయబోతున్నారు. కావున ఇప్పుడు కేవలము పురుషార్థము చెయ్యటమే కాదు, కానీ పురుషార్థపు ప్రారబ్ధాన్ని కూడా ఇప్పుడు అనుభవము చెయ్యాలి. సుఖముతోపాటు శాంతిని కూడా చెక్ చేసుకోండి - అశాంతితో కూడిన పరిస్థితులు, అశాంతి వాయుమండలము, వీటిలో కూడా శాంతి సాగరుని పిల్లలైన మీరు సదా కమల పుష్ప సమానముగా అశాంతిని కూడా శాంతి వాయుమండలములోకి పరివర్తన చెయ్యగలరా? శాంతిగా ఉన్న వాయుమండలములో మీరు శాంతిని అనుభవము చేస్తే అదేమంత గొప్ప విషయము కాదు, కానీ అశాంతిని శాంతిలోకి పరివర్తన చేసేవారము అన్నది మీ ప్రతిజ్ఞ. కావున చెక్ చేసుకోండి - చెక్ చేసుకుంటున్నారు కదా? మీరు పరివర్తకులు కదా, పరవశులైతే కారు కదా? మీరు పరివర్తకులు. పరివర్తకులు ఎప్పుడూ పరవశులవ్వలేరు. ఇదే విధముగా సంపద, తరగని సంపద. స్వరాజ్య అధికారుల తరగని సంపద ఏమిటి? జ్ఞానము, గుణాలు మరియు శక్తులు, ఇవి స్వరాజ్య అధికారుల సంపదలు. కావున చెక్ చేసుకోండి - జ్ఞానము యొక్క మొత్తము విస్తారము యొక్క సారాన్ని స్పష్టముగా తెలుసుకున్నారు కదా? జ్ఞానము అంటే కేవలము భాషణ చేయటము, కోర్స్ చేయించటము అని కాదు అర్థము. జ్ఞానము అంటే వివేకము అని అర్థము. మరి ప్రతి సంకల్పము, ప్రతి కర్మ, ప్రతి మాట, జ్ఞానము ఆధారముగా అనగా వివేకవంతులుగా, నాలెడ్జ్ ఫుల్ గా అయి చేస్తున్నారా? అలాగే సర్వ గుణాలు ప్రాక్టికల్ జీవితములో ఇమర్జ్ అయి ఉంటున్నాయా? సర్వ గుణాలు ఇమర్జ్ అయి ఉంటున్నాయా లేక యథాశక్తిగా ఉంటున్నాయా? ఇదే విధముగా సర్వ శక్తులు - మీ టైటిల్ మాస్టర్ సర్వశక్తివాన్, అంతేకానీ శక్తివాన్ కాదు. మరి సర్వ శక్తులు సంపన్నముగా ఉన్నాయా? మరొక విషయమేమిటంటే - సర్వ శక్తులు అవసరమైన సమయములో కార్యము చేస్తున్నాయా? అవసరమైన సమయములో హాజరవుతున్నాయా లేక సమయము గడిచిపోయిన తరువాత మీకు గుర్తుకొస్తుందా? కనుక చెక్ చేసుకోండి - మూడు విషయాలనూ చెక్ చేసుకోండి - ఒకే రాజ్యము, ఒకే ధర్మము మరియు అవినాశీ సుఖ-శాంతులు, సంపద ఎందుకంటే ఇప్పటి స్వరాజ్య సమయములో ఈ విషయాల అనుభవమేదైతే ఉన్నదో, అది కొత్త ప్రపంచములో ఉండదు. ఇప్పుడే ఈ విషయాలన్నింటినీ అనుభవము చేయగలరు. ఇప్పటినుండే ఈ సంస్కారాలు ఇమర్జ్ అయితే అప్పుడు అనేక జన్మలు ప్రారబ్ధము రూపములో వస్తాయి. ధారణ చేస్తున్నాము, అయిపోతుంది, అంతిమ సమయానికల్లా తయారైపోతాము అని ఈ విధముగానైతే అనుకోవటం లేదు కదా!

బాప్ దాదా ముందుగానే సూచన ఇచ్చేసారు, అదేమిటంటే - ఇప్పటి బహుకాలపు అభ్యాసమే బహుకాలపు ప్రాప్తికి ఆధారము. అంతిమ సమయములో అయిపోతుంది అని ఆలోచించకండి, అయిపోతుంది కాదు, అవ్వాల్సిందే. ఎందుకు? స్వరాజ్యము యొక్క అధికారము ఏదైతే ఉందో అది ఇప్పుడు బహుకాలపు అభ్యాసముగా ఉండాలి. ఒకవేళ ఒక్క జన్మలోనే అధికారిగా అవ్వలేకపోతే, ఆధీనులుగా అయితే మరి అనేక జన్మల కొరకు ఎలా అవుతారు! కావుననే బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లలందరికీ పదే-పదే సూచన ఇస్తున్నారు, అదేమిటంటే - ఇప్పుడు సమయము యొక్క వేగము తీవ్రగతితో వెళ్తూ ఉంది, అందుకే పిల్లలందరూ ఇప్పుడు కేవలము పురుషార్థులుగా అవ్వడమే కాదు, కానీ తీవ్ర పురుషార్థులుగా అయ్యి, పురుషార్థపు ప్రారబ్ధాన్ని ఇప్పుడు బహుకాలము నుండి అనుభవము చెయ్యాలి. తీవ్ర పురుషార్థుల గుర్తులను బాప్ దాదా ఇంతకుముందు కూడా వినిపించారు. తీవ్ర పురుషార్థి సదా మాస్టర్ దాతగా ఉంటారు, తీసుకునేవారిగా కాదు, దేవతగా ఉంటారు, ఇచ్చేవారు. ఇది ఉంటేనే నా పురుషార్థము అవుతుంది, వీరు చేస్తే నేను కూడా చేస్తాను, వీరు మారితే నేను కూడా మారుతాను, వీరు మారాలి, వీరు చెయ్యాలి, ఇవి దాతాతనపు గుర్తులు కావు. ఎవరు చేసినా, చేయకపోయినా కానీ నేను బాప్ దాదా సమానముగా చేయాలి, బ్రహ్మాబాబా సమానముగా కూడా చెయ్యాలి. సాకారములో కూడా చూసారు, పిల్లలు చేస్తే నేను చేస్తాను అని ఎప్పుడూ ఇలా అనలేదు, నేను చేసి పిల్లల చేత చేయిస్తాను అని అనేవారు. తీవ్ర పురుషార్థానికి చెందిన రెండవ గుర్తు ఏమిటంటే - సదా నిర్మానచిత్తులుగా ఉండటము, కార్యము చేస్తూ కూడా నిర్మానచిత్తము, నిర్మాణము మరియు నిర్మానచిత్తము, ఈ రెండింటి బ్యాలెన్స్ కావాలి. ఎందుకు? నిర్మానచిత్తులుగా అయ్యి కార్యము చేయటము వలన సర్వుల నుండి హృదయపూర్వకమైన స్నేహము మరియు ఆశీర్వాదాలు లభిస్తాయి. బాప్ దాదా చూసారు - నిర్మాణము అనగా సేవా క్షేత్రములో ఈ రోజుల్లో అందరూ మంచి ఉల్లాస-ఉత్సాహాలతో కొత్త-కొత్త ప్లాన్లు తయారుచేస్తున్నారు. ఇందుకు బాప్ దాదా నలువైపులా ఉన్న పిల్లలకు అభినందనలను తెలుపుతున్నారు.

బాప్ దాదా వద్దకు నిర్మాణానికి చెందిన సేవా ప్లాన్లు చాలా మంచి-మంచివి వచ్చాయి. కానీ బాప్ దాదా ఏం చూసారంటే - నిర్మాణ కార్యాలైతే చాలా బాగున్నాయి, కానీ ఎంతగానైతే సేవా కార్యాలలో ఉల్లాస-ఉత్సాహాలు ఉన్నాయో, అంతగానే ఒకవేళ నిర్మానచిత్త స్థితి యొక్క బ్యాలెన్స్ ఉన్నట్లయితే నిర్మాణ కార్యములో అనగా సేవా కార్యములో సఫలత ఇంకా ఎక్కువగా ప్రత్యక్ష రూపములో లభించగలదు. బాప్ దాదా ఇంతకుముందు కూడా వినిపించారు - నిర్మాన స్వభావముతో, నిర్మానతతో కూడిన మాటలతో మరియు నిర్మానచిత్త స్థితితో సంబంధ-సంపర్కములలోకి రండి. దేవతల గురించి మహిమ చేస్తారు కానీ వాస్తవానికి అది బ్రాహ్మణుల మహిమ, దేవతల కోసం ఏమంటారంటే, వారి నోటి నుండి ఏవైతే మాటలు వెలువడుతాయో అవి వజ్రాలు, ముత్యాల వంటివి, అమూల్యమైనవి, వారికి నిర్మల వాణి, నిర్మలమైన స్వభావము ఉంటుంది. ఇప్పుడు బాప్ దాదా చూస్తున్నారు, రిజల్టును వినిపించాలి కదా, ఎందుకంటే ఇది ఈ సీజన్ యొక్క చివరి టర్న్. బాప్ దాదా ఏం చూసారంటే - నిర్మల వాణి మరియు నిర్మానచిత్త స్థితి, వీటి పట్ల ఇప్పుడు అటెన్షన్ ఉండాలి.

బాప్ దాదా ఖజానాలకు చెందిన మూడు ఖాతాలను జమ చేసుకోండి అని ఇంతకుముందు వినిపించారు. మరి రిజల్టులో ఏం చూసారు? మూడు ఖాతాలు ఏమిటి? అవైతే గుర్తుండే ఉంటాయి కదా! అయినా కానీ మళ్ళీ రివైజ్ చేస్తున్నాము - ఒకటేమో, మీ పురుషార్థము ద్వారా జమ ఖాతాను పెంచుకోండి. రెండవది, సదా స్వయము కూడా సంతుష్టముగా ఉండాలి మరియు ఇతరులను కూడా సంతుష్టపరచాలి, భిన్న-భిన్న సంస్కారాల గురించి తెలిసి కూడా సంతుష్టముగా ఉండాలి మరియు సంతుష్టపరచాలి, దీనితో ఆశీర్వాదాల ఖాతా జమ అవుతుంది. ఒకవేళ ఏ కారణముగానైనా సంతుష్టపరచడములో లోపము ఉన్నట్లయితే పుణ్య ఖాతాలో జమ అవ్వదు. సంతుష్టత పుణ్యానికి తాళముచెవి, అది సంతుష్టముగా ఉండడమైనా కావచ్చు, సంతుష్టపరచడమైనా కావచ్చు. మరియు మూడవది - సేవలో కూడా సదా నిస్వార్థముగా ఉండాలి, నేను అన్నది ఉండకూడదు. నేను చేసాను, లేదా నేను అనుకున్నట్లు జరగాలి, ఈ నేను మరియు నాది అనేవి సేవలో ఎక్కడైతే వస్తాయో అక్కడ పుణ్య ఖాతా జమ అవ్వదు. నాది అన్న భావములో మీరు అనుభవజ్ఞులు, రాయల్ రూపానికి చెందిన నాది అన్నవి చాలా ఉంటాయి. రాయల్ రూపములోని నాది యొక్క లిస్టు సాధారణమైన నాది యొక్క లిస్టు కన్నా పెద్దది. కనుక ఎక్కడైతే నేను మరియు నాది అన్న స్వార్థము వస్తుందో, నిస్వార్థముగా ఉండరో, అక్కడ పుణ్య ఖాతా తక్కువ జమ అవుతుంది. నాది అన్నదాని లిస్టు మరొకసారి ఎప్పుడైనా వినిపిస్తాము, అది చాలా పెద్ద లిస్టు మరియు చాలా సూక్ష్మమైనది. బాప్ దాదా ఏం చూసారంటే, తమ పురుషార్థము ద్వారా యథా శక్తి అందరూ తమ-తమ ఖాతాను జమ చేసుకుంటున్నారు కానీ ఆశీర్వాదాల ఖాతా మరియు పుణ్య ఖాతా, వీటిని నింపుకునే అవసరము ఇప్పుడు ఉంది, అందుకే మూడు ఖాతాలను జమ చేసుకోవడము పట్ల అటెన్షన్ పెట్టాలి. వెరైటీ సంస్కారాలు ఇప్పుడు కూడా కనిపిస్తాయి, అందరి సంస్కారాలు ఇప్పుడింకా సంపన్నముగా అవ్వలేదు కానీ మనపై ఇతరుల బలహీన స్వభావము మరియు బలహీన సంస్కారాల ప్రభావము పడకూడదు. నేను మాస్టర్ సర్వశక్తివంతుడిని, అంతేకానీ బలహీన సంస్కారాలు శక్తిశాలి అయినవి కావు. మాస్టర్ సర్వశక్తివంతుడినైన నాపై బలహీన సంస్కారాల ప్రభావము పడకూడదు. రక్షణకు సాధనము ఏమిటంటే - బాప్ దాదా ఛత్రఛాయలో ఉండటము. బాప్ దాదాతో కంబైండుగా ఉండండి. ఛత్రఛాయ శ్రీమతము.

ఈ రోజు బాప్ దాదా సూచనను ఇస్తున్నారు, స్వయము విషయములో ప్రతి ఒక్కరూ సంకల్పాలలో, మాటలలో, సంబంధ-సంపర్కాలలో, కర్మలలో నవీనతను తీసుకువచ్చే ప్లాన్ ను తయారుచెయ్యాల్సిందే. ఏం నవీనతను తీసుకువచ్చారు అని బాప్ దాదా ముందు రిజల్టును చూస్తారు. పాత సంస్కారాలను దృఢ సంకల్పముతో పరివర్తన చేసుకున్నారా? ఈ రిజల్టును ముందు చూస్తారు. ఏం ఆలోచిస్తున్నారు, ఇలా చేస్తారా? చేస్తారా? చేస్తాము అని ఎవరైతే అంటారో వారు చేతులెత్తండి. చేస్తారా? అచ్ఛా! చేస్తారా లేక ఇతరులను చూస్తారా? ఏం చేస్తారు? ఇతరులను చూడవద్దు, బాప్ దాదాను చూడండి, మీ పెద్ద దాదీని చూడండి. దాదీజీది ఎంతటి అతీతమైన మరియు ప్రియమైన స్థితి. బాప్ దాదా చెప్తున్నారు, ఒకవేళ హద్దులోని నేను మరియు నాది అన్నదాని నుండి అతీతంగా ఉన్నవారినెవరినైనా చూడాలనుకుంటే బాప్ దాదా యొక్క హృదయసింహాసనాధికారి అయిన మీ దాదీని చూడండి. మొత్తము జీవితమంతా హద్దు యొక్క నాది, హద్దు యొక్క నేను అన్న భావము, వీటి నుండి అతీతముగా ఉన్నారు, దాని పరిణామేమిటంటే - అనారోగ్యము ఎంత ఉన్నా కానీ దాదీ దుఃఖము, నొప్పి యొక్క అనుభూతి నుండి అతీతముగా ఉన్నారు. ఒక్క మాటే పక్కాగా ఉండేది. దాదీ, ఏదైనా నొప్పి ఉందా, దాదీ, ఏమైనా అవుతుందా? అని ఎవరు అడిగినా సరే, ఏం సమాధానము లభించేది? ఏమీ లేదు అని అనేవారు, ఎందుకంటే దాదీ నిస్వార్థముగా ఉండేవారు, పెద్ద మనసు కలవారు, సర్వులను ఇముడ్చుకునేవారు, సర్వులకు ప్రియమైనవారు, ఈ ప్రాక్టికల్ గుర్తులను వారిలో చూస్తున్నారు. బ్రహ్మాబాబా గురించి చెప్పేటప్పుడు, వారిలోనైతే తండ్రి ఉండేవారు కదా అని అంటారు, కానీ దాదీ అయితే మీతోపాటు ప్రభు పాలన తీసుకున్నవారిలో ఉన్నారు, మీతోపాటు చదువులో ఉన్నారు, సేవలో సహచరునిగా ఉన్నారు, మరి ఒక్కరు తయారవ్వగలిగినప్పుడు, ఒక్కరు నిస్వార్థ స్థితిలో ఉండగలిగినప్పుడు, మరి మీరందరూ అలా అవ్వలేరా? అవ్వగలరు కదా! మీరే అలా తయారవ్వబోతున్నారు అని బాప్ దాదాకు నిశ్చయముంది. ఎన్ని సార్లు అలా తయారయ్యారు? గుర్తుందా? అనేక కల్పాలు తండ్రి సమానముగా అయ్యారు మరియు ఇప్పుడు కూడా మీరే తయారవ్వబోతున్నారు. ఈ ఉల్లాసముతోనే, ఉత్సాహముతోనే ఎగురుతూ వెళ్ళండి. తండ్రికి మీపై నిశ్చయము ఉంది కావున మీరు కూడా స్వయము పట్ల సదా నిశ్చయబుద్ధి కలిగి ఉండాలి. తయారవ్వాల్సిందే, ఇటువంటి నిశ్చయబుద్ధి కలవారిగా అయ్యి ఎగురుతూ వెళ్ళండి. తండ్రిపై ప్రేమ ఉంది అన్నప్పుడు, ప్రేమ విషయములో 100 శాతము కంటే కూడా ఎక్కువ ఉంది అని అంటారు కదా. ఇది నిజమేనా? ఎవరెవరైతే కూర్చుని ఉన్నారో మరియు ఎవరైతే తమ-తమ స్థానాలలో వింటున్నారో, చూస్తున్నారో, వారందరూ ప్రేమ అనే సబ్జెక్టులో, మాకు 100 శాతము ఉంది అని భావిస్తున్నారా? వారు చేతులెత్తండి. 100 శాతమా? (అందరూ చేతులెత్తారు) అచ్ఛా! వెనక ఉన్నవారు చేతులు బాగా పైకి ఎత్తండి, చేతులూపండి (ఈ రోజు 22 వేల మంది కంటే కూడా ఎక్కువ సోదర, సోదరీలు చేరుకున్నారు) ఇందులో అయితే అందరూ చేతులెత్తారు. మరి ప్రేమకు గుర్తు - సమానముగా అవ్వటము. ఎవరిపైనైతే ప్రేమ ఉంటుందో వారిలా మాట్లాడటము, వారిలా నడుచుకోవడము, వారిలా సంబంధ-సంపర్కాలను నిర్వర్తించటము, ఇది ప్రేమకు గుర్తు.

ఈ రోజు బాప్ దాదా ఇప్పుడిప్పుడే చూడాలనుకుంటున్నారు, ఒక్క క్షణములో స్వరాజ్యమనే సీటుపై కంట్రోలింగ్ పవర్, రూలింగ్ పవర్ యొక్క సంస్కారములో ఇమర్జ్ రూపములో క్షణములో కూర్చోగలరా! మరి ఒక్క క్షణములో రెండు, మూడు నిమిషాల కొరకు రాజ్యాధికారి యొక్క సీటుపై సెట్ అయిపోండి. అచ్ఛా! (డ్రిల్)

నలువైపులా ఉన్న పిల్లల ప్రియస్మృతులతో కూడిన ఉత్తరాలు మరియు వాటితో పాటు సైన్స్ సాధనాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా ప్రియస్మృతులు బాప్ దాదా వద్దకు చేరుకున్నాయి. తమ మనసు యొక్క సమాచారాన్ని కూడా చాలామంది పిల్లలు వ్రాస్తారు కూడా మరియు ఆత్మిక సంభాషణలో కూడా వినిపిస్తారు. బాప్ దాదా ఆ పిల్లలందరికీ రెస్పాన్స్ ఇస్తున్నారు, సదా సత్యమైన హృదయముపై స్వామి సంతోషిస్తారు. బాప్ దాదాకు విశేషముగా ఆ ఆత్మల పట్ల హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు మరియు హృదయపూర్వకమైన ప్రేమ ఉంటాయి. నలువైపులా ఉన్నవారు ఎవరైతే సమాచారాలను ఇస్తున్నారో, అందరూ మంచి-మంచి ఉల్లాస-ఉత్సాహాలతో కూడిన ప్లాన్లు ఏవైతే తయారుచేసారో, వాటికి బాప్ దాదా అభినందనలను కూడా తెలుపుతున్నారు మరియు వరదానము కూడా ఇస్తున్నారు, ముందుకు వెళ్తూ ఉండండి, ముందుకు తీసుకువెళ్తూ ఉండండి.

నలువైపులా ఉన్న బాప్ దాదా యొక్క కోట్లలో కొద్దిమంది, కొద్దిమందిలో కూడా కొద్దిమంది అయిన శ్రేష్ఠ భాగ్యవంతులైన పిల్లలకు బాప్ దాదా యొక్క విశేష ప్రియస్మృతులు, బాప్ దాదా పిల్లలందరికీ ధైర్యానికి మరియు ఉల్లాస-ఉత్సాహాలకు అభినందనలను కూడా తెలుపుతున్నారు. మున్ముందు తీవ్ర పురుషార్థులుగా అయ్యేందుకు బ్యాలెన్సు పెట్టేందుకు పదమాల, పదమాల రెట్లు ఆశీర్వాదాలను కూడా ఇస్తున్నారు. అందరి భాగ్యపు సితార సదా మెరుస్తూ ఉండాలి మరియు ఇతరుల భాగ్యాన్ని తయారుచేయిస్తూ ఉండాలి, దీని కోసము కూడా ఆశీర్వాదాలను ఇస్తున్నారు. నలువైపులా ఉన్న పిల్లలు తమ-తమ స్థానాలలో వింటున్నారు కూడా, చూస్తున్నారు కూడా మరియు బాప్ దాదా కూడా నలువైపులా ఉన్న దూరాలలో కూర్చుని ఉన్న పిల్లలందరినీ చూస్తూ-చూస్తూ సంతోషిస్తున్నారు. చూస్తూ ఉండండి మరియు మధుబన్ శోభను సదా పెంచుతూ ఉండండి. పిల్లలందరికీ హృదయపూర్వకమైన ఆశీర్వాదాలతో పాటు నమస్తే.

వరదానము:-
అటెన్షన్ రూపీ తైలము ద్వారా ఆత్మిక స్వరూపపు సితార యొక్క ప్రకాశాన్ని పెంచే ఆకర్షణ మూర్త భవ

ఎప్పుడైతే తండ్రి ద్వారా, జ్ఞానము ద్వారా ఆత్మిక స్వరూపపు సితార మెరుస్తుందో, అప్పుడు అది ఇక ఆరిపోదు, కానీ ఆ మెరుపు యొక్క పర్సెంటేజ్ తక్కువ-ఎక్కువ అవ్వవచ్చు. ఎప్పుడైతే ప్రతి రోజూ అమృతవేళ అటెన్షన్ రూపీ తైలాన్ని వేస్తూ ఉంటారో, అప్పుడు ఈ సితార సదా మెరుస్తూ అందరినీ ఆకర్షిస్తుంది. ఏ విధముగా దీపములో తైలాన్ని వేసినట్లయితే అది ఏకరసముగా వెలుగుతుందో, అదే విధముగా సంపూర్ణ అటెన్షన్ ను ఇవ్వటము అనగా తండ్రి యొక్క సర్వ గుణాలను మరియు శక్తులను స్వయములో ధారణ చెయ్యటము. ఈ అటెన్షన్ ద్వారానే ఆకర్షణా మూర్తులుగా అవుతారు.

స్లోగన్:-
అనంతమైన వైరాగ్య వృత్తి ద్వారా సాధన అనే బీజాన్ని ప్రత్యక్షము చెయ్యండి.

అవ్యక్త సూచనలు - స్వయము కొరకు మరియు సర్వుల కొరకు మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగము చెయ్యండి

యోగ శక్తిని జమ చేసుకునేందుకు కర్మ మరియు యోగము యొక్క బ్యాలెన్స్ను ఇంకా పెంచండి. కర్మలు చేస్తూ యోగము యొక్క శక్తిశాలి స్థితి ఉండాలి - ఈ అభ్యాసాన్ని పెంచండి. ఏ విధముగా సేవ కొరకు ఇన్వెన్షన్లు చేస్తారో, అదే విధముగా ఈ విశేషమైన అనుభవాల అభ్యాసము కొరకు సమయాన్ని కేటాయించండి మరియు నవీనతను తీసుకువచ్చి అందరి ముందు ఉదాహరణగా అవ్వండి.

సూచన:- ఈ రోజు నెలలోని మూడవ ఆదివారము, రాజయోగీ తపస్వీ సోదర, సోదరీలందరూ సాయంకాలము 6.30 నుండి 7.30 గంటల వరకు, విశేషముగా యోగాభ్యాస సమయములో మాస్టర్ సర్వశక్తిమాన్ యొక్క శక్తిశాలీ స్వరూపములో స్థితులై ప్రకృతి సహితముగా సర్వాత్మలకు పవిత్రతా కిరణాలను ఇవ్వండి, సతోప్రధానముగా తయారుచేసే సేవను చెయ్యండి.