20-01-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - అనంతమైన తండ్రిని స్మృతి చేయడమనేది గుప్తమైన విషయము, స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది, ఎవరైతే స్మృతి చేయరో, వారిని తండ్రి కూడా ఎలా స్మృతి చేయగలరు’’

ప్రశ్న:-
మొత్తం కల్పమంతటిలోనూ ఎప్పుడూ చదివించబడని ఏ చదువును పిల్లలైన మీరు సంగమయుగములో చదువుతారు?

జవాబు:-
జీవిస్తూనే శరీరము నుండి అతీతముగా అయ్యే అనగా శవముగా అయ్యే చదువును ఇప్పుడు మీరు చదువుతారు, ఎందుకంటే మీరు కర్మాతీతులుగా అవ్వాలి. కానీ ఎప్పటివరకైతే శరీరములో ఉంటారో, అప్పటివరకు కర్మలనైతే తప్పకుండా చేయవలసిందే. మనసు కూడా ఎప్పుడు శాంతమవుతుందంటే శరీరము లేనప్పుడే. అందుకే మనసును జయిస్తే జగత్తును జయిస్తామని భావించడము కాదు, కానీ మాయను జయిస్తేనే జగత్ జీతులుగా అవుతారు.

ఓంశాంతి
తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు ఎందుకంటే తెలివితక్కువవారినే చదివించడము జరుగుతుందని పిల్లలు అర్థం చేసుకుంటారు. ఇప్పుడు ఉన్నతోన్నతమైన భగవంతుడైన అనంతమైన తండ్రి వస్తారు, వారు ఎవరిని చదివిస్తూ ఉండవచ్చు? తప్పకుండా ఎవరైతే చాలా చాలా బుద్ధిహీనులుగా ఉంటారో, వారినే చదివిస్తారు, అందుకే వినాశకాలే విపరీత బుద్ధి అని అంటారు. విపరీత బుద్ధి కలవారిగా ఎలా అయ్యారు? 84 లక్షల యోనులని వ్రాయబడి ఉంది కదా! కావున తండ్రిని కూడా 84 లక్షల జన్మలలోకి తీసుకువచ్చారు. పరమాత్మను కుక్క, పిల్లి, జీవజంతువులన్నింటిలోనూ ఉన్నారని చెప్తారు. ఇది సెకండు నంబరు పాయింటుగా చెప్పవలసి ఉంటుందని పిల్లలకు అర్థం చేయించడము జరుగుతుంది. తండ్రి అర్థం చేయించారు - ఎవరైనా కొత్తవారు వస్తే మొట్టమొదట వారికి హద్దు మరియు అనంతమైన తండ్రుల పరిచయాన్ని ఇవ్వాలి. వారు అనంతమైన పెద్ద తండ్రి మరియు వీరు హద్దులోని చిన్న తండ్రి. అనంతమైన తండ్రి అంటేనే అనంతమైన ఆత్మలకు తండ్రి. ఆ హద్దు తండ్రి జీవాత్మకు తండ్రి అవుతారు. వారైతే ఆత్మలందరికీ తండ్రి. ఈ జ్ఞానాన్ని కూడా అందరూ ఏకరసముగా ధారణ చేయలేరు. కొందరు 1 శాతము ధారణ చేస్తే, కొందరు 95 శాతము ధారణ చేస్తారు. ఇది అర్థం చేసుకోవలసిన విషయము. సూర్యవంశీ రాజ్య కుటుంబము ఉంటుంది కదా! రాజా, రాణి మరియు ప్రజలు ఉంటారు. ఇది బుద్ధిలోకి వస్తుంది కదా. ప్రజలలో అన్ని రకాల మనుష్యులు ఉంటారు. ప్రజలంటే ప్రజలే. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇది చదువు, ప్రతి ఒక్కరూ తమ బుద్ధి అనుసారముగా చదువుకుంటారు. ప్రతి ఒక్కరికీ తమ-తమ పాత్ర లభించి ఉంది. కల్పక్రితము ఎవరు ఎంత చదువును ధారణ చేసారో, ఇప్పుడు కూడా అంతే ధారణ చేస్తారు. చదువు ఎప్పుడూ దాగి ఉండలేదు. చదువు అనుసారముగానే పదవి లభిస్తుంది. తండ్రి అర్థం చేయించారు, మున్ముందు పరీక్షలైతే తప్పకుండా జరుగుతాయి. పరీక్షలు లేకుండానైతే ట్రాన్స్ఫర్ అవ్వలేరు. చివరిలో అంతా తెలుస్తుంది. ఇప్పుడు కూడా, మేము ఏ పదవికి యోగ్యముగా ఉన్నాము అన్నది మీరు అర్థం చేసుకోగలరు. అయితే సిగ్గు వలన అందరితోపాటు చేతులు ఎత్తేస్తారు కానీ మేము అలా ఎలా అవ్వగలమని మనసులో భావిస్తారు కూడా, అయినా చేతులెత్తేస్తారు. అర్థం చేసుకుని కూడా చేతులు ఎత్తితే, దీనిని కూడా అజ్ఞానమనే అంటారు. ఎంత అజ్ఞానముంది అన్నది తండ్రి వెంటనే అర్థం చేసుకుంటారు. వీరి కంటే ఆ విద్యార్థులలోనే తెలివి ఉంటుంది. నేను స్కాలర్షిప్ తీసుకునేందుకు యోగ్యుడిని కాదు, పాస్ అవ్వలేను అని ఆ విద్యార్థులలో కూడా అర్థం చేసుకుంటారు. దీని కన్నా ఆ అజ్ఞానులే మేలు, ఎందుకంటే వారు టీచరు ఏదైతే చదివిస్తారో, అందులో వారు ఎన్ని మార్కులను తీసుకుంటారనేది అర్థం చేసుకుంటారు. వారేమీ మేము పాస్ విత్ ఆనర్ గా అవుతామని అనరు. ఇక్కడ అంతటి బుద్ధి కూడా లేదని తద్వారా నిరూపించబడుతుంది. దేహాభిమానము చాలా ఉంది. ఈ విధముగా (లక్ష్మీ-నారాయణులుగా) అయ్యేందుకు మీరిక్కడకు వచ్చారు కావున నడవడిక చాలా బాగుండాలి. తండ్రి అంటారు, కొందరు వినాశకాలే విపరీత బుద్ధి కలవారిగా ఉన్నారు ఎందుకంటే నియమానుసారముగా తండ్రితో ప్రీతి లేదు, అటువంటప్పుడు వారి పరిస్థితి ఎలా ఉంటుంది. ఉన్నత పదవిని పొందలేరు.

వినాశకాలే విపరీత బుద్ధి అన్నదాని అర్థమేమిటో తండ్రి కూర్చుని పిల్లలైన మీకు అర్థం చేయిస్తారు. పిల్లలే పూర్తిగా అర్థం చేసుకోలేకపోతే, ఇక ఇతరులేమి అర్థం చేసుకుంటారు! ఏ పిల్లలైతే మేము శివబాబాకు పిల్లలమని భావిస్తారో, వారే పూర్తి అర్థాన్ని అర్థం చేసుకోలేరు. తండ్రిని స్మృతి చేయడమనేది గుప్తమైన విషయము. చదువైతే గుప్తమైనది కాదు కదా. చదువులో నంబరువారుగా ఉన్నారు. అందరూ ఒకే విధముగా ఏమీ చదవరు. వీరింకా బేబీస్ (పసి పిల్లలు) గా ఉన్నారని తండ్రి అర్థం చేసుకుంటారు. ఇటువంటి అనంతమైన తండ్రిని మూడేసి, నాలుగేసి నెలలు స్మృతి కూడా చేయరు. వీరు స్మృతి చేస్తున్నారని ఎలా తెలుస్తుంది? వారి నుండి ఉత్తరము వస్తే తెలుస్తుంది. ఆ ఉత్తరములో - నేను ఈ-ఈ ఆత్మిక సేవ చేస్తున్నానని సేవా సమాచారము కూడా వ్రాయాలి. ఋజువు కావాలి కదా. ఎవరైతే ఎప్పుడూ స్మృతి చేయరో, సేవకు ఋజువును చూపించరో, వారు దేహాభిమానులుగా ఉంటారు. కొందరైతే - బాబా, ఫలానా-ఫలానావారు వచ్చారు, వారికి నేను ఇది అర్థం చేయించాను అని సమాచారము వ్రాస్తారు, అప్పుడు ఆ పిల్లలు బ్రతికే ఉన్నారు, సేవా సమాచారాన్ని సరిగ్గా ఇస్తున్నారని తండ్రి కూడా అర్థం చేసుకుంటారు. కొందరైతే 3-4 నెలలు కూడా ఉత్తరము వ్రాయరు. ఏ సమాచారము లేకపోతే మరణించారనో లేక రోగగ్రస్థులుగా అయ్యారనో భావిస్తారు! రోగగ్రస్థులైన మనుష్యులు వ్రాయలేరు. కొంతమంది, మా ఆరోగ్యం బాగాలేదు, అందుకే ఉత్తరము వ్రాయలేదని కూడా వ్రాస్తారు. కొందరైతే సమాచారమే ఇవ్వరు, అలాగని ఏ అనారోగ్యమూ లేదు. దేహాభిమానము ఉంది. మరి తండ్రి కూడా ఎవరిని స్మృతి చేస్తారు. స్మృతి ద్వారా స్మృతి లభిస్తుంది. కానీ దేహాభిమానము ఉంది. తండ్రి వచ్చి అర్థం చేయిస్తున్నారు, నన్ను సర్వవ్యాపి అని అంటూ 84 లక్షల కన్నా ఎక్కువ యోనులలోకి తీసుకువెళ్తారు. మనుష్యులను రాతిబుద్ధి కలవారని అంటారు. భగవంతుడినైతే రాళ్ళలో, రప్పలలో ఉన్నారని అనేస్తారు. ఇవి అనంతమైన నిందలు అయినట్లే కదా! కావుననే తండ్రి అంటారు, నన్ను ఎంతగా గ్లాని చేస్తారు. ఇప్పుడు మీరు నంబరువారుగా అర్థం చేసుకున్నారు. మీరు వస్తే మేము బలిహారమైపోతాము, మిమ్మల్ని వారసునిగా చేసుకుంటామని భక్తి మార్గములో పాడుతారు కూడా. రాళ్ళలో, రప్పలలో ఉన్నారని అన్నవారు వారసులుగా చేసుకుంటారా! ఎంత గ్లాని చేస్తారు, అందుకే తండ్రి అంటారు - యదా యదాహి... ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి గురించి తెలుసు కావున తండ్రిని ఎంతగా మహిమ చేస్తారు. కొందరు మహిమ కాదు కదా, కనీసం స్మృతి చేసి రెండు అక్షరాలు కూడా వ్రాయరు. దేహాభిమానులుగా అయిపోతారు. మాకు తండ్రి లభించారని, మా తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారని పిల్లలైన మీరు భావిస్తారు. భగవానువాచ కదా! నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. విశ్వరాజ్యాధికారాన్ని ఎలా పొందవచ్చు అన్నదాని కోసం నేను మీకు రాజయోగాన్ని నేర్పిస్తాను. మేము విశ్వరాజ్యాధికారాన్ని తీసుకునేందుకు అనంతమైన తండ్రి నుండి చదువుకుంటున్నాము - ఈ నషా ఉన్నట్లయితే అపారమైన సంతోషము కలుగుతుంది. గీతను కూడా చదువుతారు కానీ ఒక సాధారణ పుస్తకాన్ని చదివినట్లుగా చదువుతారు. అంతేకానీ గీతను చదివేవారిలో లేక వినిపించేవారిలో అంతటి సంతోషము ఉండదు. గీతను చదవడము పూర్తి చేసి వ్యాపారములోకి వెళ్ళిపోతారు. అనంతమైన తండ్రి మమ్మల్ని చదివిస్తున్నారని ఇప్పుడు మీకైతే బుద్ధిలో ఉంది. మాకు భగవంతుడు చదివిస్తున్నారని ఇంకెవ్వరి బుద్ధిలోకీ రాదు. కావున ఎవరు వచ్చినా, మొదట వారికి ఇద్దరు తండ్రుల థియరీని (సిద్ధాంతము) అర్థం చేయించాలి. భారత్ స్వర్గముగా ఉండేది కదా, ఇప్పుడది నరకముగా ఉందని చెప్పండి. మేము సత్యయుగములోనూ ఉన్నాము, కలియుగములోనూ ఉన్నాము అనైతే ఎవరూ అనలేరు. ఎవరికైనా దుఃఖము కలిగితే వారు నరకములో ఉన్నట్లు, ఎవరికైనా సుఖము లభిస్తే వారు స్వర్గములో ఉన్నట్లు అని అనుకుంటారు. దుఃఖితులైన మనుష్యులు నరకములో ఉన్నారు, మేమైతే చాలా సుఖములో ఉన్నాము, మహళ్ళు మొదలైనవన్నీ ఉన్నాయని చాలామంది అంటారు. వారు బాహ్య సుఖాలను చాలా చూస్తారు కదా. సత్యయుగములోని సుఖమైతే ఇక్కడ ఉండదని కూడా మీరిప్పుడు అర్థం చేసుకున్నారు. బంగారు యుగాన్ని ఇనుప యుగమని అన్నా లేక ఇనుప యుగాన్ని బంగారు యుగమని అన్నా అర్థము ఒకటేనని కూడా కాదు. అలా భావించేవారిని కూడా అజ్ఞానులనే అంటారు. కావున మొట్టమొదట తండ్రి యొక్క థియరీని (సిద్ధాంతము) చెప్పాలి. తండ్రి మాత్రమే తమ పరిచయాన్ని ఇస్తారు. ఇది ఇంకెవ్వరికీ తెలియదు. పరమాత్మ సర్వవ్యాపి అని అనేస్తారు. ఆత్మ-పరమాత్మల రూపము ఒక్కటేనని ఇప్పుడు మీరు చిత్రాలలో చూపిస్తారు. వారు కూడా ఆత్మనే కానీ వారిని పరమ ఆత్మ అని అంటారు. తాను ఎలా వస్తారు అనేది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. ఆత్మలన్నీ అక్కడ పరంధామములో ఉంటాయి. ఈ విషయాలను బయటివారెవ్వరూ అర్థం చేసుకోలేరు. భాష కూడా చాలా సహజమైనది. గీతలో శ్రీకృష్ణుని పేరును వేసారు. ఇప్పుడు శ్రీకృష్ణుడైతే గీతను వినిపించరు. నన్నొక్కరినే స్మృతి చేయండి అని అతను అందరికీ చెప్పలేరు. దేహధారుల స్మృతితోనైతే పాపాలు తొలగిపోవు. దేహ సంబంధాలన్నింటినీ త్యజించి నన్నొక్కరినే స్మృతి చేయండి అన్నది శ్రీకృష్ణ భగవానువాచ అని అంటారు, కానీ దేహపు సంబంధాలైతే శ్రీకృష్ణునికి కూడా ఉన్నాయి, మరియు అతడు చిన్న పిల్లవాడు కదా. ఇది కూడా ఎంత పెద్ద పొరపాటు. ఈ ఒక్క పొరపాటు కారణముగా ఎంత తేడా వచ్చేస్తుంది! పరమాత్మ సర్వవ్యాపి కాలేరు. ఎవరి గురించైతే సర్వుల సద్గతిదాత అని అంటారో, వారు కూడా దుర్గతిని పొందుతారా! పరమాత్మ ఎప్పుడైనా దుర్గతిని పొందుతారా ఏమిటి? ఇవన్నీ విచార సాగర మంథనము చేయవలసిన విషయాలు. ఇది సమయాన్ని వ్యర్థము చేసుకునే విషయము కాదు. మనుష్యులైతే మాకు తీరిక లేదని అనేస్తారు. వచ్చి కోర్సు తీసుకోమని మీరు అర్థం చేయిస్తే తీరిక లేదని అంటారు. రెండు రోజులు వస్తారు, మళ్ళీ నాలుగు రోజులు రారు... చదువుకోకపోతే ఈ విధముగా లక్ష్మీ-నారాయణులుగా ఎలా అవ్వగలరు? మాయ ఫోర్స్ ఎంతగా ఉంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఏ క్షణము, ఏ నిమిషమైతే గడుస్తుందో, అది యథావిధిగా అలానే రిపీట్ అవుతుంది. లెక్కలేనన్నిసార్లు రిపీట్ అవుతూ ఉంటుంది. ఇప్పుడైతే తండ్రి ద్వారా వింటున్నారు. బాబా అయితే జనన-మరణాలలోకి రారు. పూర్తి జనన-మరణాలలోకి వచ్చేది ఎవరు మరియు రానివారు ఎవరు అని పోల్చి చూడడము జరుగుతుంది. కేవలం ఒక్క తండ్రి మాత్రమే జనన-మరణాలలోకి రారు. మిగిలినవారంతా వస్తారు, అందుకే చిత్రాలను కూడా చూపించారు. బ్రహ్మా మరియు విష్ణువు, ఇరువురూ జనన-మరణాలలోకి వస్తారు. బ్రహ్మా నుండి విష్ణువుగా, విష్ణువు నుండి బ్రహ్మాగా పాత్రలోకి వస్తూ-వెళ్తూ ఉంటారు. ఇది అంతము అవ్వదు. ఈ చిత్రాలను అందరూ వచ్చి చూస్తారు మరియు అర్థం చేసుకుంటారు. ఇది చాలా సహజముగా అర్థం చేసుకునే విషయము. మేమే బ్రాహ్మణులము, మళ్ళీ మేమే క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతామని బుద్ధిలోకి రావాలి. మళ్ళీ తండ్రి వస్తే మనమే బ్రాహ్మణులుగా అవుతాము. ఇది స్మృతి చేసినా స్వదర్శన చక్రధారులుగా అయినట్లే. చాలా మందికి స్మృతి నిలవదు. బ్రాహ్మణులైన మీరే స్వదర్శన చక్రధారులుగా అవుతారు. దేవతలు అలా అవ్వరు. ఈ చక్రము ఎలా తిరుగుతుంది అన్న జ్ఞానాన్ని పొందడము ద్వారా వారు అలా దేవతలుగా అయ్యారు. వాస్తవానికి మనుష్యులెవ్వరూ స్వదర్శన చక్రధారులుగా చెప్పుకునేందుకు యోగ్యులు కాదు. మనుష్యుల సృష్టి అయిన మృత్యులోకమే వేరు. ఎలాగైతే భారతీయుల ఆచార-వ్యవహారాలు వేరో, అలా అందరివీ వేరు-వేరుగా ఉంటాయి. దేవతల ఆచార-వ్యవహారాలు వేరు. మృత్యులోకములోని మనుష్యుల ఆచార-వ్యవహారాలు వేరు. రాత్రికి, పగలుకు ఉన్నంత తేడా ఉంది, అందుకే మేము పతితులము అని అందరూ అంటారు. ఓ భగవంతుడా, పతిత ప్రపంచములో ఉన్న మా అందరినీ పావనముగా చేయండని అంటారు. నేటికి 5 వేల సంవత్సరాల క్రితము పావన ప్రపంచముండేదని, దానిని సత్యయుగమని అంటారని మీ బుద్ధిలో ఉంది. త్రేతాయుగాన్ని అలా అనరు. అది ఫస్ట్ క్లాస్ అయినది, ఇది సెకెండ్ క్లాస్ అయినది అని తండ్రి అర్థం చేయించారు. కావున ఒక్కొక్క విషయాన్ని మంచి రీతిలో ధారణ చేయాలి. ఎవరైనా వచ్చి వింటే ఆశ్చర్యపోవాలి. కొందరు విని ఆశ్చర్యపోతారు కానీ వారికి పురుషార్థము చేయడానికి తీరిక ఉండదు. అయితే పవిత్రముగా తప్పకుండా ఉండాలి అని వింటారు. మనుష్యులను పతితముగా చేసేది ఈ కామ వికారమే, దీనిని జయిస్తేనే మీరు జగత్ జీతులుగా అవుతారు. కామ వికారాన్ని జయించి జగత్ జీతులుగా అవ్వండని తండ్రి చెప్పారు కూడా. కానీ - మనసును జయించి జగత్ జీతులుగా అవ్వండి, మనసును వశము చేసుకోండి అని మనుష్యులు అంటారు. ఎప్పుడైతే శరీరము ఉండదో, అప్పుడే మనసు శాంతమవుతుంది లేదంటే మనసు ఎప్పుడూ శాంతమవ్వదు. దేహము లభించేదే కర్మలు చేసేందుకు, మరి కర్మాతీత అవస్థలో ఎలా ఉండగలరు? కర్మాతీత అవస్థ అని శవానికి అంటారు. జీవించి ఉండే శవాలు అనగా శరీరము నుండి అతీతముగా ఉండటము. మీకు కూడా శరీరము నుండి అతీతముగా అయ్యే చదువును చదివిస్తారు. శరీరము నుండి ఆత్మ వేరుగా ఉంటుంది. ఆత్మ పరంధామ నివాసి. ఆత్మ శరీరములోకి వస్తే, అప్పుడు వారిని మనిషి అని అంటారు. శరీరము లభించేదే కర్మలు చేసేందుకు. ఒక శరీరము వదిలితే, ఆత్మ కర్మలు చేయడానికి ఇంకొక శరీరాన్ని తీసుకోవలసి ఉంటుంది. ఎప్పుడైతే కర్మలు చేయవలసిన అవసరము ఉండదో, అప్పుడు శాంతిగా ఉంటారు. మూలవతనములో కర్మలు ఉండవు. సృష్టి చక్రము ఇక్కడ తిరుగుతుంది. తండ్రిని మరియు సృష్టి చక్రాన్ని తెలుసుకోవాలి, దీనినే జ్ఞానమని అంటారు. ఈ కనులు ఎప్పటివరకైతే పతితముగా, క్రిమినల్ గా (అశుద్ధముగా) ఉంటాయో, అప్పటివరకు ఆ కనుల ద్వారా పవిత్రమైన వస్తువును చూడలేరు, అందుకే జ్ఞానమనే మూడవ నేత్రము కావాలి. ఎప్పుడైతే మీరు కర్మాతీత అవస్థను పొందుతారో అనగా దేవతలుగా అవుతారో, అప్పుడు ఈ స్థూల కనుల ద్వారా దేవతలను చూస్తూ ఉంటారు. అంతేకానీ ఈ శరీరములోని కనులతో శ్రీకృష్ణుడిని చూడలేరు. ఒకవేళ సాక్షాత్కారము కలిగినా దాని ద్వారా ఏమీ లభించదు. అల్పకాలికమైన సంతోషముంటుంది, కోరిక పూర్తవుతుంది. డ్రామాలో సాక్షాత్కారాలు కూడా నిశ్చితమై ఉన్నాయి, వాటి వలన ఏమీ ప్రాప్తించదు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. నేను శరీరము నుండి అతీతమైన ఆత్మను. జీవిస్తూనే ఈ శరీరములో ఉంటూ శవము వలె ఉండే స్థితిని అభ్యాసము చేసి కర్మాతీత అవస్థను తయారుచేసుకోవాలి.

2. సేవకు ఋజువును ఇవ్వాలి. దేహ భానాన్ని వదిలి తమ సత్యాతి-సత్యమైన సమాచారాన్ని ఇవ్వాలి. పాస్ విత్ ఆనర్ గా అయ్యే పురుషార్థము చేయాలి.

వరదానము:-
తమ శాంత స్వరూప స్థితి ద్వారా శాంతి కిరణాలను వ్యాపింపజేసే మాస్టర్ శాంతి సాగర భవ

వర్తమాన సమయములో విశ్వములోని మెజారిటీ ఆత్మలకు అన్నింటికంటే ఎక్కువ ఆవశ్యకమైనది - సత్యమైన శాంతి. అశాంతికి చెందిన అనేక కారణాలు రోజురోజుకూ పెరుగుతూ ఉన్నాయి మరియు పెరుగుతూనే ఉంటాయి. ఒకవేళ స్వయము అశాంతిగా లేకపోయినప్పటికీ ఇతరుల అశాంతి వాయుమండలము, వాతావరణము శాంత అవస్థలో కూర్చోనివ్వవు. అశాంతి వలన కలిగే ఒత్తిడి యొక్క అనుభవము ఎక్కువ అవుతుంది. అటువంటి సమయములో మాస్టర్ శాంతి సాగరులైన పిల్లలైన మీరు అశాంతి సంకల్పాలను మర్జ్ చేసి విశేషమైన శాంతి ప్రకంపనాలను వ్యాపింపజేయండి.

స్లోగన్:-
తండ్రిలోని సర్వ గుణాలను అనుభవము చేసుకునేందుకు సదా జ్ఞాన సూర్యుని సమ్ముఖములో ఉండండి.

అవ్యక్త ప్రేరణలు - ఈ అవ్యక్త మాసములో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవము చెయ్యండి

ఇప్పుడు సమయము యొక్క పొదుపు, సంకల్పాల పొదుపు, శక్తుల పొదుపును గురించిన ప్రణాళికను తయారుచేసుకుని బిందు రూప స్థితిని పెంచుకోండి. ఎంతగా బిందు రూప స్థితి ఉంటుందో అంతగా ఎటువంటి చెడు ఆత్మల ప్రభావము గాని లేక చెడు సంస్కారాల ఫోర్స్ గాని మీపై దాడి చెయ్యవు, మీరు కూడా వాటి నుండి ముక్తులుగా ఉంటారు మరియు మీ యొక్క శక్తి రూపము వారిని కూడా ముక్తులుగా చేస్తుంది.