ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. కొత్తవారు కూడా విన్నారు, పాతవారు
కూడా విన్నారు. ఇది ఒక పాఠశాల అని కుమారులు కూడా విన్నారు. పాఠశాలలో ఏదో ఒక భాగ్యము
తయారుచేసుకోవడము జరుగుతుంది. అక్కడైతే అనేక రకాల భాగ్యాలు ఉన్నాయి. కొంతమంది
సర్జన్లుగా, మరికొంతమంది బ్యారిస్టర్లుగా తయారయ్యే భాగ్యాన్ని తయారుచేసుకుంటారు.
భాగ్యాన్ని లక్ష్యము-ఉద్దేశ్యము అని అంటారు. భాగ్యాన్ని తయారుచేసుకోకుండా పాఠశాలలో
ఇంకేమి చదువుకుంటారు. మనము కూడా భాగ్యాన్ని తయారుచేసుకుని వచ్చామని ఇప్పుడు ఇక్కడ
పిల్లలకు తెలుసు. కొత్త ప్రపంచము కోసం తమ రాజ్య భాగ్యాన్ని తీసుకునేందుకు వచ్చారు.
ఈ రాజయోగము ఉన్నదే కొత్త ప్రపంచము కోసం. ఆ చదువు పాత ప్రపంచము కోసం. వారు పాత
ప్రపంచములో బ్యారిస్టర్, ఇంజనీర్, సర్జన్ మొదలైనవారిగా అవుతారు. ఆ విధముగా తయారవుతూ,
తయారవుతూ ఇప్పుడు పాత ప్రపంచములో చాలా కొద్ది సమయమే మిగిలి ఉంది. వారంతా
సమాప్తమైపోతారు. ఆ భాగ్యము ఈ మృత్యులోకము కోసం ఉన్నది అంటే ఈ జన్మ కోసం ఉన్నది. మీ
ఈ చదువు కొత్త ప్రపంచము కోసం ఉన్నది. మీరు కొత్త ప్రపంచము కోసం భాగ్యాన్ని
తయారుచేసుకుని వచ్చారు. కొత్త ప్రపంచములో మీకు రాజ్య భాగ్యము లభిస్తుంది. ఎవరు
చదివిస్తున్నారు? అనంతమైన తండ్రి, వారి నుండే వారసత్వాన్ని పొందాలి. డాక్టర్ ద్వారా
డాక్టర్ గా అయ్యే వారసత్వాన్ని పొందుతారు, అది ఈ జన్మ కొరకు వారసత్వము. ఒకటి, తండ్రి
నుండి వారసత్వము లభిస్తుంది, మరొకటి, తమ చదువు ద్వారా వారసత్వము లభిస్తుంది. అచ్ఛా,
తర్వాత వృద్ధులుగా అయినప్పుడు గురువుల వద్దకు వెళ్తారు. ఏమి కోరుకుంటారు? మాకు
శాంతిధామానికి వెళ్ళే శిక్షణనివ్వండి, మాకు సద్గతినివ్వండి, ఇక్కడ నుండి బయటకు తీసి
శాంతిధామానికి తీసుకువెళ్ళండి అని అంటారు. ఇప్పుడు తండ్రి నుండి వారసత్వము
లభిస్తుంది, ఈ జన్మ కోసం టీచర్ నుండి కూడా వారసత్వము లభిస్తుంది, ఇకపోతే గురువు
నుండి ఏమీ లభించదు. టీచర్ నుండి చదువుకుని ఏదో ఒక వారసత్వాన్ని పొందుతారు. టీచర్ గా
అవుతారు, కుట్టుకలు నేర్పించే టీచర్ గా అవుతారు, ఎందుకంటే జీవనోపాధి అయితే కావాలి
కదా. తండ్రి వారసత్వము ఉన్నా కూడా చదువుకుంటారు ఎందుకంటే మేము కూడా మా సంపాదన
చేసుకోవాలని అనుకుంటారు. గురువు ద్వారానైతే ఏ సంపాదన జరగదు. అయితే, కొంతమంది గీత
మొదలైనవి బాగా చదువుకుని తర్వాత గీతపై భాషణ మొదలైనవి చేస్తారు. ఇవన్నీ అల్పకాలికమైన
సుఖము కోసం. ఇప్పుడు ఈ మృత్యులోకములో కొద్ది సమయమే ఉంది. పాత ప్రపంచము
సమాప్తమవ్వనున్నది.
మనము కొత్త ప్రపంచము యొక్క భాగ్యాన్ని తయారుచేసుకునేందుకు వచ్చామని మీకు తెలుసు.
ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది. తండ్రి ఆస్తి మరియు మన ఆస్తి కూడా భస్మమైపోతుంది.
అప్పుడు ఇక చేతులు ఖాళీ అయిపోతాయి. ఇప్పుడు కొత్త ప్రపంచము కోసం సంపాదన కావాలి. పాత
ప్రపంచములోని మనుష్యులైతే ఆ సంపాదనను చేయించలేరు. కొత్త ప్రపంచము కోసం సంపాదన
చేయించేవారు శివబాబా. ఇక్కడకు మీరు కొత్త ప్రపంచము కోసం భాగ్యాన్ని
తయారుచేసుకునేందుకు వచ్చారు. ఆ తండ్రే మీకు తండ్రి కూడా, టీచర్ కూడా, గురువు కూడా,
మరియు వారు రావడము కూడా సంగమయుగములో వస్తారు. వారు భవిష్యత్తు కోసం సంపాదన
చేసుకోవడము నేర్పిస్తారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచములో ఇంకా కొద్ది రోజులే ఉన్నాయి. ఇది
ఈ ప్రపంచములోని మనుష్యులకు తెలియదు. కొత్త ప్రపంచము మళ్ళీ ఎప్పుడు వస్తుంది, వీరు
ప్రగల్భాలు పలుకుతున్నారని అంటారు. ఈ విధముగా భావించేవారు కూడా చాలామంది ఉన్నారు.
ఒకే ఇంటిలో, కొత్త ప్రపంచము స్థాపనవుతుందని తండ్రి అంటారు, ఇవి ప్రగల్భాలని కొడుకు
అంటారు. కొత్త ప్రపంచము కోసం వీరు మనకు తండ్రి, టీచర్, సద్గురువు అని పిల్లలైన మీకు
తెలుసు. శాంతిధామానికి, సుఖధామానికి తీసుకువెళ్ళేందుకే తండ్రి వస్తారు. ఎవరైనా
భాగ్యాన్ని తయారుచేసుకోవడము లేదంటే వారు ఏమీ అర్థం చేసుకోవటము లేదనే. ఒకే ఇంటిలో,
పత్ని చదువుకుంటుంది, పతి చదవరు, పిల్లలు చదువుకుంటారు, తల్లి-తండ్రులు చదవరు. ఇలా
జరుగుతూ ఉంటుంది. ప్రారంభములో కుటుంబాలకు కుటుంబాలే వచ్చేసాయి కానీ మాయ తుఫానులు
రావడముతో ఆశ్చర్యము కలిగించేలా విని, వర్ణించినవారు, తండ్రిని వదిలి వెళ్ళిపోయారు.
ఆశ్చర్యము కలిగించేలా వింటారు, తండ్రికి చెందినవారిగా అవుతారు, చదువును చదువుకుంటారు,
అయినా... డ్రామా విధి అని అంటారు. ఓహో డ్రామా, ఓహో మాయ అని తండ్రి స్వయమే అంటారు.
ఇది డ్రామా యొక్క విషయమే కదా. స్త్రీ-పురుషులు ఒకరికొకరు విడాకులు ఇచ్చుకుంటారు.
పిల్లలు తండ్రిని వదిలి వెళ్ళిపోతారు. ఇక్కడ అలా కాదు. ఇక్కడ విడాకులు ఇవ్వలేరు.
తండ్రి వచ్చిందే పిల్లల చేత సత్యమైన సంపాదనను చేయించడానికి. తండ్రి ఎవ్వరినీ
గోతిలోకి తోయరు. తండ్రి ఉన్నదే పతిత-పావనుడు, దయార్ద్ర హృదయుడు. తండ్రి వచ్చి దుఃఖము
నుండి విముక్తులుగా చేస్తారు మరియు మార్గదర్శకునిగా అయ్యి తమతో పాటు తీసుకువెళ్తారు.
నేను మిమ్మల్ని నాతో పాటు తీసుకువెళ్తానని ఈ విధముగా ఏ లౌకిక గురువు అనరు. ఇటువంటి
గురువును ఎప్పుడైనా చూసారా, ఎప్పుడైనా విన్నారా? మీరు గురువులను అడగండి - మీకు
ఇంతమంది ఫాలోవర్స్ ఉన్నారు కదా, మీరు శరీరాన్ని విడిచిపెట్టి వెళ్తే ఈ ఫాలోవర్స్ ను
కూడా మీతో పాటు తీసుకువెళ్తారా? నేను నా ఫాలోవర్స్ ను నాతో పాటు తీసుకువెళ్తానని ఈ
విధముగా ఎప్పుడూ ఎవ్వరూ చెప్పరు. ఇదైతే జరగదు. నేను మిమ్మల్నందరినీ నిర్వాణధామానికి
లేక ముక్తిధామానికి తీసుకువెళ్తానని ఎప్పుడూ ఎవ్వరూ చెప్పలేరు. మమ్మల్ని మీతోపాటు
తీసుకువెళ్తారా అని ఇటువంటి ప్రశ్నను ఎవ్వరూ అడగలేరు కూడా. నేను మిమ్మల్ని
తీసుకువెళ్తాను అని శాస్త్రాలలో భగవానువాచ ఉన్నది. దోమల గుంపు వలె అందరూ వెళ్తారు.
సత్యయుగములోనైతే కొద్దిమంది మనుష్యులే ఉంటారు. కలియుగములోనైతే ఎంతోమంది మనుష్యులు
ఉంటారు. శరీరాలను వదిలి ఆత్మలు లెక్కాచారాన్ని పూర్తి చేసుకుని వెళ్ళిపోతాయి.
తప్పకుండా పారిపోవలసిందే, ఇంతమంది మనుష్యులు ఉండలేరు.
ఇప్పుడు మనము ఇంటికి వెళ్ళాలని పిల్లలైన మీకు మంచి రీతిలో తెలుసు. ఈ శరీరాన్ని
అయితే విడిచిపెట్టాలి. మీరు మరణిస్తే మీకు సంబంధించినంత వరకు ప్రపంచము మరణించినట్లే.
స్వయాన్ని కేవలం ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. ఈ పాత శరీరాన్ని అయితే
విడిచిపెట్టాలి. ఈ ప్రపంచము కూడా పాతది. ఎలాగైతే కొత్త ఇల్లు ఎదురుగా
తయారవుతున్నప్పుడు, పాత ఇంట్లో కూర్చుని, ఈ ఇల్లు మా కోసం తయారవుతుందని భావిస్తారు.
బుద్ధి కొత్త ఇంటి వైపుకు వెళ్ళిపోతుంది. ఇందులో ఇది తయారుచేయాలి, ఇది చేయాలి అని
అనుకుంటారు. మమకారము అంతా పాతదాని నుండి తొలగి కొత్తదాని వైపు జోడించబడుతుంది. అది
హద్దు యొక్క విషయము. ఇది అనంతమైన ప్రపంచము యొక్క విషయము. పాత ప్రపంచము పట్ల
మమకారాన్ని తొలగించాలి మరియు కొత్త ప్రపంచముతో జోడించాలి. ఈ పాత ప్రపంచమైతే
సమాప్తమవ్వనున్నదని మీకు తెలుసు. కొత్త ప్రపంచము స్వర్గము. అందులో మనము రాజ్య పదవిని
పొందుతాము. ఎంతగా యోగములో ఉంటామో, జ్ఞానాన్ని ధారణ చేస్తామో, ఇతరులకు అర్థం
చేయిస్తామో, అంతగా సంతోషము యొక్క పాదరసము పైకి ఎక్కుతుంది. ఇది చాలా పెద్ద పరీక్ష.
మనము స్వర్గ వారసత్వాన్ని 21 జన్మల కోసం పొందుతున్నాము. షావుకారులుగా అవ్వడము మంచిదే
కదా. ఆయుష్షు ఎక్కువగా లభిస్తే మంచిదే కదా. ఎంతగా సృష్టి చక్రాన్ని స్మృతి చేస్తారో,
ఎంతమందిని తమ సమానముగా తయారుచేస్తారో, అంత లాభము. రాజులుగా అవ్వాలంటే ప్రజలను కూడా
తయారుచేసుకోవాలి. ప్రదర్శినీలకు ఎంతోమంది వస్తారు. వారంతా ప్రజలుగా అవుతూ ఉంటారు
ఎందుకంటే ఈ అవినాశీ జ్ఞానము యొక్క వినాశనమైతే జరగదు. పవిత్రముగా అయి పవిత్ర
ప్రపంచానికి యజమానులుగా అవ్వాలని బుద్ధిలోకి వచ్చేస్తుంది. పురుషార్థము ఎక్కువ
చేస్తే ప్రజలలో ఉన్నత పదవిని పొందుతారు లేకపోతే తక్కువ పదవి గల ప్రజలుగా అవుతారు.
నంబరువారుగా అయితే ఉంటారు కదా. రామ రాజ్యము యొక్క స్థాపన జరుగుతుంది. రావణ రాజ్యము
వినాశనమైపోతుంది. సత్యయుగములో దేవతలే ఉంటారు.
బాబా అర్థం చేయించారు, స్మృతియాత్ర ద్వారా మీరు సతోప్రధాన ప్రపంచానికి యజమానులుగా
అవుతారు. రాజులు, ప్రజలు, అందరూ యజమానులుగానే ఉంటారు. మా భారత్ అన్నింటికన్నా
ఉన్నతమైనదని ప్రజలు కూడా అంటారు. తప్పకుండా భారత్ చాలా ఉన్నతముగా ఉండేది. ఇప్పుడలా
లేదు, ఒకప్పుడు తప్పకుండా అలా ఉండేది. ఇప్పుడైతే పూర్తిగా నిరుపేదగా అయిపోయింది.
ప్రాచీన భారత్ అన్నింటికన్నా షావుకారుగా ఉండేది. తప్పకుండా భారతవాసులైన మనము
అన్నింటికన్నా ఉన్నతమైన దేవీ-దేవతా కులానికి చెందినవారమని మీకు తెలుసు.
ఇతరులెవ్వరినీ దేవతలని అనరు. ఇప్పుడు పిల్లలైన మీరు ఇది చదువుకుంటున్నారు, తర్వాత
ఇతరులకు అర్థం చేయించాలి. మనుష్యులకైతే అర్థం చేయించాలి కదా. మీ వద్ద చిత్రాలు కూడా
ఉన్నాయి, వీరు ఈ పదవిని ఎలా పొందారు అనేది మీరు ఋజువు చేసి చెప్పగలరు. తిథి-తారీఖుల
సహితముగా మీరు ఋజువు చేయగలరు. ఇప్పుడు శివబాబా నుండి మళ్ళీ ఈ పదవిని పొందుతున్నారు.
వారి చిత్రాలు కూడా ఉన్నాయి. శివుడు పరమపిత పరమాత్మ. తండ్రి అంటారు, బ్రహ్మా ద్వారా
మీకు యోగబలముతో 21 జన్మల వారసత్వము లభిస్తుంది. మీరు సూర్యవంశీ దేవీ-దేవతలుగా,
విష్ణుపురికి యజమానులుగా అవ్వగలరు. శివబాబా, దాదా అయిన బ్రహ్మా ద్వారా ఈ
వారసత్వాన్ని ఇస్తున్నారు. మొదట వీరి ఆత్మ వింటుంది, ఆత్మయే ధారణ చేస్తుంది.
ముఖ్యమైన విషయము ఇదే. శివుని చిత్రాన్ని చూపిస్తారు. ఈ చిత్రము పరమపిత పరమాత్మ
శివునిది. బ్రహ్మా-విష్ణు-శంకరులు సూక్ష్మవతనములోని దేవతలు. ప్రజాపిత బ్రహ్మా అయితే
తప్పకుండా ఇక్కడ కావాలి. ప్రజాపిత బ్రహ్మా పిల్లలైన బ్రహ్మాకుమార-కుమారీలు ఎంతోమంది
ఉన్నారు. ఎప్పటివరకైతే బ్రహ్మాకు పిల్లలుగా అవ్వరో, అప్పటివరకు బ్రాహ్మణులుగా అవ్వరు,
అటువంటప్పుడు శివబాబా నుండి వారసత్వాన్ని ఎలా తీసుకుంటారు. గర్భము నుండి జన్మ
తీసుకునేవారైతే కాదు. ముఖవంశావళి అని అంటూ ఉంటారు కూడా. మనము ప్రజాపిత బ్రహ్మా ముఖ
వంశావళి అని మీరంటారు. వారు గురువులకు ఫాలోవర్స్ గా ఉంటారు. ఇక్కడ మీరు ఒక్కరినే
తండ్రి-టీచర్-సద్గురువు అని అంటారు. అది కూడా వీరిని అలా అనరు. నిరాకార శివబాబా కూడా
ఉన్నారు. వారు జ్ఞానసాగరుడు. వారు సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని ఇస్తారు. టీచర్
కూడా ఆ నిరాకారుడే, వారు సాకారుని ద్వారా జ్ఞానాన్ని వినిపిస్తారు. ఆత్మయే
మాట్లాడుతుంది. నా శరీరాన్ని విసిగించకండి అని ఆత్మ అంటుంది. ఆత్మ దుఃఖితము
అయినప్పుడు వివరణ ఇవ్వడము జరుగుతుంది. వినాశనము ఎదురుగా నిలిచి ఉన్నప్పుడు,
పారలౌకిక తండ్రి అందరినీ తిరిగి తీసుకువెళ్ళేందుకే అంతిమములో వస్తారు. ఇకపోతే ఏదైతే
ఉందో, అదంతా వినాశనమవ్వనున్నది. దీనిని మృత్యులోకమని అంటారు. స్వర్గము ఇక్కడ
పృథ్విపైనే ఉంటుంది. దిల్వాడా మందిరము నిర్మించబడి ఉంది. కింద తపస్య చేస్తున్నారు,
పైన స్వర్గము ఉంది. లేదంటే స్వర్గాన్ని ఎక్కడ చూపించాలి. పై భాగములో దేవతల చిత్రాలను
చూపించారు. వారు కూడా ఇక్కడే ఉంటారు కదా. అర్థం చేయించేందుకు చాలా మంచి యుక్తి
కావాలి. మందిరాలకు వెళ్ళి - ఇది శివబాబా స్మృతిచిహ్నమని, శివబాబా మనల్ని
చదివిస్తున్నారని అర్థం చేయించాలి. వాస్తవానికి శివుడు ఒక బిందువు, కానీ బిందువును
ఎలా పూజించాలి, ఫలాలు, పుష్పాలను ఎలా అర్పించాలి, అందుకే పెద్ద రూపాన్ని తయారుచేసారు.
ఇంత పెద్దగా ఎవ్వరూ ఉండరు. భృకుటి మధ్యలో అద్భుతమైన నక్షత్రము ప్రకాశిస్తుంది అని
అంటూ ఉంటారు కూడా. వాస్తవానికి ఆత్మ అతి సూక్ష్మమైనది, బిందువు వంటిది. అది పెద్దగా
ఉండి ఉంటే సైన్సు వారు దానిని వెంటనే పట్టుకునేవారు. అలాగని వేలాది సూర్యుల కన్నా
తేజోమయమైనదని కాదు, అలా ఏమీ ఉండదు. కొంతమంది భక్తులు కూడా వస్తారు కదా, మాకు కేవలం
ఈ ముఖమే కనిపిస్తుందని అంటారు. వారికి పరమపిత పరమాత్ముని పరిచయము పూర్తిగా
లభించలేదని, ఇప్పుడింకా వారి భాగ్యము తెరుచుకోలేదని బాబా భావిస్తారు. ఎప్పటివరకైతే
తండ్రిని తెలుసుకోరో అప్పటివరకు నా ఆత్మ బిందువు సమానమైనదని, శివబాబా కూడా బిందువని,
వారిని స్మృతి చేయాలని అర్థం చేసుకోరు. అలా భావించి స్మృతి చేసినప్పుడే వికర్మలు
వినాశనమవుతాయి. అంతేకానీ నాకు వారు కనిపిస్తున్నారు, వారు అలా కనిపిస్తున్నారు, ఇలా
కనిపిస్తున్నారు... వీటిని మాయ విఘ్నాలని అంటారు.
మాకు తండ్రి లభించారని ఇప్పుడు పిల్లలైన మీరు సంతోషముగా అంటారు. మనుష్యులు
శ్రీకృష్ణుని సాక్షాత్కారాన్ని పొంది చాలా సంతోషముగా డ్యాన్స్ మొదలైనవి చేస్తారు
కానీ దాని వలన సద్గతి ఏమీ లభించదు. ఈ సాక్షాత్కారాలనేవి అనాయాసముగానే కలుగుతాయి.
ఒకవేళ మంచి రీతిలో చదువుకోకపోతే ప్రజలలోకి వెళ్ళిపోతారు. సాక్షాత్కారాల వలన లాభమంటూ
కలగాలి కదా. భక్తి మార్గములో చాలా కష్టపడినప్పుడు సాక్షాత్కారాలు కలుగుతాయి. ఇక్కడ
కొద్దిగా కష్టపడినా సాక్షాత్కారాలు కలుగుతాయి కానీ లాభమేమీ ఉండదు. శ్రీకృష్ణపురిలోకి
వెళ్ళి సాధారణ ప్రజలు మొదలైనవారిగా అవుతారు. శివబాబా మనకు ఈ జ్ఞానాన్ని
వినిపిస్తున్నారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తప్పకుండా పవిత్రముగా అవ్వాలన్నది
తండ్రి ఆజ్ఞ. కానీ కొంతమంది పవిత్రముగా కూడా ఉండలేకపోతారు, అప్పుడప్పుడు పతితులు
కూడా ఇక్కడకు దాక్కుని వచ్చేస్తారు. వారు తమను తామే నష్టపరచుకుంటారు, స్వయాన్నే మోసం
చేసుకుంటారు. తండ్రిని మోసగించే విషయమేమీ కాదు. తండ్రిని మోసం చేసి ఏమైనా ధనము
తీసుకునేది ఉందా? శివబాబా శ్రీమతముపై నియమానుసారముగా నడుచుకోకపోతే, వారి పరిస్థితి
ఏమవుతుంది. భాగ్యములో లేదని అర్థం చేసుకోవడము జరుగుతుంది. చదువుకోకపోతే ఇతరులకు ఇంకా
దుఃఖమునిస్తూ ఉంటారు. అప్పుడు, ఒకటేమో చాలా శిక్షలు అనుభవించాల్సి ఉంటుంది మరియు
రెండు, పదవి కూడా భ్రష్టమైపోతుంది. నియమవిరుద్ధమైన పనులేవీ చేయకూడదు. మీ నడవడిక
బాగోలేదని తండ్రి అయితే అర్థం చేయిస్తారు కదా. తండ్రి సంపాదన యొక్క మార్గాన్ని
తెలియజేస్తారు, ఇక సంపాదించడము, సంపాదించకపోవడము అనేది వారి భాగ్యము. శిక్షలు
అనుభవించి తిరిగి శాంతిధామానికి వెళ్ళాల్సిందే, అప్పుడు పదభ్రష్టులైపోతారు, ఏమీ
లభించదు. ఇక్కడకు రావడము చాలామంది వస్తారు కానీ ఇక్కడైతే తండ్రి నుండి వారసత్వాన్ని
తీసుకునే విషయముంది. పిల్లలు అంటారు - బాబా, మేమైతే స్వర్గము యొక్క సూర్యవంశీ
రాజ్యపదవిని పొందుతాము. ఇది రాజయోగము కదా. విద్యార్థులు స్కాలర్షిప్ ను కూడా
తీసుకుంటారు కదా. పాస్ అయ్యే వారికి స్కాలర్షిప్ లభిస్తుంది. ఎవరైతే స్కాలర్షిప్
తీసుకున్నారో, వారి మాలే తయారుచేయబడి ఉంది. ఎంతెంత పాస్ అవుతారో, అంతంత స్కాలర్షిప్
లభిస్తుంది. ఈ మాల తయారుచేయబడి ఉంది. స్కాలర్షిప్ తీసుకునేవారి వృద్ధి
జరుగుతూ-జరుగుతూ వేలాదిమంది తయారవుతారు. రాజ్య పదవియే స్కాలర్షిప్. ఎవరైతే చదువును
బాగా చదువుకుంటారో, వారు దాగి ఉండలేరు. చాలామంది కొత్త-కొత్తవారు కూడా పాతవారి కన్నా
ముందుకు వెళ్ళిపోతారు. చూడండి, చాలామంది కుమార్తెలు వస్తారు, వారంటారు - మాకు ఈ
చదువు చాలా బాగా అనిపిస్తుంది, దైహిక చదువు యొక్క కోర్సును పూర్తి చేసి ఈ చదువులో
నిమగ్నమైపోతామని మేము ప్రమాణము చేస్తున్నాము, మా జీవితాన్ని వజ్రతుల్యముగా
తయారుచేసుకుంటాము, మేము మా సత్యమైన సంపాదన చేసుకుని 21 జన్మల కొరకు వారసత్వాన్ని
పొందుతాము. ఎంత సంతోషము కలుగుతుంది. ఈ వారసత్వాన్ని ఇప్పుడు తీసుకోకపోతే
మరింకెప్పటికీ తీసుకోలేమని వారికి తెలుసు. చదువు పట్ల అభిరుచి ఉంటుంది కదా.
కొంతమందికి అర్థం చేసుకునే అభిరుచి ఏ మాత్రము ఉండదు. కొత్త వారికున్నంత అభిరుచి
పాతవారికి కూడా లేదు. ఇది ఆశ్చర్యము కదా. డ్రామానుసారముగా భాగ్యములో లేకపోతే
భగవంతుడు కూడా ఏమి చేస్తారని అంటారు. టీచర్ అయితే చదివిస్తారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.