21-11-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - విచార సాగర మంథనము చేసి సేవకు
సంబంధించిన రకరకాల యుక్తులను తీయండి, వాటి ద్వారా అందరికీ తండ్రి పరిచయము లభించాలి’’
ప్రశ్న:-
తండ్రి ప్రతి
బిడ్డకు ఉన్నత భాగ్యాన్ని తయారుచేసుకునేందుకు ఏ యుక్తిని తెలియజేస్తారు?
జవాబు:-
తమ ఉన్నత
భాగ్యాన్ని తయారుచేసుకోవాలంటే - లోపల నుండి అన్ని ఛీ-ఛీ, చెడు అలవాట్లను తొలగించండి.
అబద్ధాలు చెప్పడము, కోపగించుకోవడము, ఇవి చాలా చెడ్డ అలవాట్లు. సేవ పట్ల అభిరుచి
పెట్టుకోండి. తండ్రి ఎలాగైతే నిరహంకారిగా అయ్యి సేవ చేస్తారో, అలా ఎంత వీలైతే అంత
ఇతరుల కళ్యాణార్థము ఆత్మిక సేవలో బిజీగా ఉండండి.
పాట:-
నీ దారిలోనే
మరణించాలి...
ఓంశాంతి
మధురాతి
మధురమైన ఆత్మిక పిల్లలు మొట్టమొదట - తండ్రి ఎవరు అన్న విషయాన్ని అర్థం చేసుకోవాలి
మరియు అర్థం చేయించాలి! ఎప్పుడైతే - మేము అనంతమైన తండ్రికి సంతానము అనే నిశ్చయము
ఏర్పరచుకుంటారో, అప్పుడు పిల్లలకు అతీంద్రియ సుఖము అనుభవమవుతుంది. కేవలం ఈ ఒక్క
మాటతోనే సంతోషపు పాదరసము పైకి ఎక్కుతుంది. ఇది స్థిరమైన సంతోషాన్ని కలిగించే పాయింటు.
తమను తా