ఓంశాంతి
ఆత్మిక తండ్రి ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, చదువు అంటే అవగాహన (వివేకము).
ఈ చదువు చాలా సహజమైనది మరియు చాలా ఉన్నతమైనది మరియు చాలా ఉన్నత పదవిని అందించేది అని
పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు. ఈ చదువును మేము విశ్వానికి యజమానులుగా అయ్యేందుకు
చదువుకుంటున్నామని కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. కావున చదువుకునేవారికి చాలా
సంతోషము ఉండాలి. ఇది ఎంతటి ఉన్నతమైన చదువు! ఇది అదే గీతా అధ్యాయము కూడా. ఇది
సంగమయుగము కూడా. పిల్లలైన మీరు ఇప్పుడు మేలుకున్నారు, మిగిలినవారంతా నిద్రిస్తూ
ఉన్నారు. మాయా నిద్రలో నిద్రిస్తున్నారని గాయనము కూడా ఉంది. మిమ్మల్ని బాబా వచ్చి
మేలుకొలిపారు. కేవలం ఒక్క విషయముపై అర్థం చేయిస్తారు - మధురమైన పిల్లలూ, కల్పక్రితము
ఏ విధముగా చేసారో, అలాగే స్మృతియాత్ర బలముతో మీరు మొత్తము విశ్వముపై రాజ్యము చేయండి.
ఈ స్మృతిని తండ్రి ఇప్పిస్తున్నారు. కల్ప-కల్పము మేము ఈ యోగబలముతో విశ్వానికి
యజమానులుగా అవుతాము మరియు దైవీ గుణాలను కూడా ధారణ చేసాము అని మాకు స్మృతి కలిగింది
అని పిల్లలు కూడా భావిస్తారు. యోగము పైనే పూర్తి ధ్యాస ఉంచాలి. ఈ యోగబలముతో
పిల్లలైన మీలో ఆటోమేటిక్ గా దైవీ గుణాలు వచ్చేస్తాయి. ఈ పరీక్ష తప్పకుండా మనుష్యుల
నుండి దేవతలుగా అయ్యేందుకు ఉన్నది. యోగబలముతో మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు
మీరు ఇక్కడకు వచ్చారు. మా యోగబలముతో మొత్తము విశ్వమంతా పవిత్రముగా అవ్వనున్నదని కూడా
మీకు తెలుసు. ఇంతకుముందు పవిత్రముగా ఉండేది, ఇప్పుడు అపవిత్రముగా అయ్యింది. మొత్తము
చక్రము యొక్క రహస్యాన్ని పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు మరియు అది హృదయములో కూడా
ఉంది. కొత్తవారికైనా సరే ఇవి చాలా సహజముగా అర్థం చేసుకునే విషయాలు. మీరు దేవతలుగా,
పూజ్యముగా ఉండేవారు, ఆ తర్వాత పూజారులుగా, తమోప్రధానముగా అయ్యారు, ఇంకెవ్వరూ ఈ
విధముగా చెప్పలేరు కూడా. తండ్రి స్పష్టముగా తెలియజేస్తున్నారు - అది భక్తి మార్గము,
ఇది జ్ఞాన మార్గము. భక్తి గతించిపోయింది. గతించిన విషయాల గురించి ఆలోచించకండి. అవి
కింద పడేసే విషయాలు. తండ్రి ఇప్పుడు పైకి ఎక్కే విషయాలను వినిపిస్తున్నారు. మేము
దైవీ గుణాలను తప్పకుండా ధారణ చెయ్యాలి అని పిల్లలకు కూడా తెలుసు. ప్రతిరోజు చార్టు
వ్రాయాలి - మేము ఎంత సమయము స్మృతిలో ఉంటున్నాము, మా ద్వారా ఏయే పొరపాట్లు జరిగాయి
అని. పొరపాటు చేస్తే గట్టి దెబ్బ కూడా పడుతుంది. ఆ చదువులో కూడా క్యారెక్టర్లు చూడటం
జరుగుతుంది. ఇక్కడ కూడా క్యారెక్టర్లు చూడటం జరుగుతుంది. తండ్రి అయితే మీ కళ్యాణము
కోసమే చెప్తారు. అక్కడ కూడా చదువు మరియు క్యారెక్టర్ యొక్క రిజిస్టర్ ను పెడతారు.
ఇక్కడ కూడా పిల్లలు దైవీ క్యారెక్టర్ ను తయారుచేసుకోవాలి. పొరపాట్లు జరగకుండా
సంభాళించుకోవాలి. నా ద్వారా ఎటువంటి పొరపాటు జరగలేదు కదా? అందుకే కచేరీ కూడా
నిర్వహిస్తారు. ఇంకే స్కూలు మొదలైనవాటిలో కచేరీ జరగదు. తమ హృదయాన్ని
ప్రశ్నించుకోవాలి. మాయ కారణముగా ఏవో ఒక ఆజ్ఞల ఉల్లంఘన జరుగుతూ ఉంటుందని తండ్రి అర్థం
చేయించారు. ప్రారంభములో కూడా కచేరీ జరిగేది. పిల్లలు సత్యము చెప్పేవారు. తండ్రి
అర్థం చేయిస్తూ ఉంటారు - ఒకవేళ సత్యము చెప్పకపోతే ఆ పొరపాట్లు వృద్ధి చెందుతూ ఉంటాయి,
దాని వలన మరింతగా ఆ పొరపాటులకు శిక్ష లభిస్తుంది. చేసిన పొరపాటు గురించి చెప్పకపోతే
ఆజ్ఞను ఉల్లంఘించినవారు అనే ముద్ర పడిపోతుంది, అప్పుడిక రాజ్య తిలకము లభించదు.
ఆజ్ఞను పాటించకపోతే, అవిశ్వాసపాత్రులుగా అయితే రాజ్యాన్ని పొందలేరు. సర్జన్
రకరకాలుగా అర్థం చేయిస్తూ ఉంటారు. సర్జన్ నుండి ఒకవేళ అనారోగ్యాన్ని
దాచిపెట్టినట్లయితే పదవి కూడా తక్కువైపోతుంది. సర్జన్ కు చెప్పినట్లయితే దెబ్బలేమీ
పడవు కదా. తండ్రి కేవలం జాగ్రత్తగా ఉండమని చెప్తారు. ఒకవేళ మళ్ళీ అటువంటి పొరపాటును
చేస్తే నష్టపోతారు, పదవి చాలా తక్కువైపోతుంది. అక్కడైతే న్యాచురల్ గానే దైవీ నడవడిక
ఉంటుంది, ఇక్కడైతే పురుషార్థము చేయాలి. పదే-పదే ఫెయిల్ అవ్వకూడదు. తండ్రి అంటారు -
పిల్లలూ, ఎక్కువ పొరపాట్లు చేయకండి. తండ్రి చాలా ప్రేమ సాగరుడు, పిల్లలు కూడా ఆ
విధముగా తయారవ్వాలి. యథా తండ్రి, తథా పిల్లలు. యథా రాజా రాణి, తథా ప్రజలు. బాబా
అయితే రాజుగా అవ్వరు. బాబా మనల్ని తమ సమానముగా తయారుచేస్తారని మీకు తెలుసు. తండ్రికి
ఏ మహిమనైతే చేస్తారో, అది మీకు కూడా జరగాలి. బాబా సమానముగా అవ్వాలి. మాయ చాలా
శక్తివంతమైనది, మిమ్మల్ని రిజిస్టర్ పెట్టనివ్వదు. మాయ పంజాలో పూర్తిగా చిక్కుకొని
ఉన్నారు. మాయ జైలు నుండి మీరు బయటపడలేరు. మీరు సత్యము చెప్పరు. తండ్రి అంటారు,
స్మృతి చార్టును ఏక్యురేట్ గా పెట్టండి. ఉదయాన్నే లేచి బాబాను స్మృతి చేయండి. తండ్రి
మహిమనే చేయండి. బాబా, మీరు మమ్మల్ని విశ్వానికి యజమానులుగా చేస్తారు కావున మేము మీ
మహిమనే చేస్తాము. భక్తి మార్గములో ఎంత మహిమను పాడుతారు, కానీ వారికి ఏమీ తెలియదు.
దేవతల మహిమ లేనే లేదు. మహిమ అనేది బ్రాహ్మణులైన మీకే ఉంది. అందరికీ సద్గతినిచ్చేవారు
కూడా ఒక్క తండ్రి మాత్రమే. వారు క్రియేటర్ కూడా, డైరెక్టర్ కూడా. వారు సేవ కూడా
చేస్తారు మరియు పిల్లలకు అర్థం చేయిస్తారు కూడా. వారు ప్రాక్టికల్ గా చెప్తారు. వారు
శాస్త్రాల ద్వారా కేవలం భగవానువాచ అని వింటూ ఉంటారు. వారు గీతను చదువుతూ ఉంటారు,
కానీ దాని నుండి ఏం లభిస్తుంది? వారు ఎంత ప్రేమగా కూర్చొని చదువుతారు, భక్తి
చేస్తారు, కానీ దాని ద్వారా ఏమి జరుగుతుంది అనేది వారికి తెలియదు! మేము మెట్లు
కిందకు దిగుతూనే వచ్చాము అన్నది వారికి తెలియదు. రోజురోజుకు తమోప్రధానముగా
అవ్వాల్సిందే. డ్రామాలో ఆ విధముగానే నిశ్చితమై ఉంది. ఈ మెట్ల రహస్యాన్ని తండ్రి
తప్ప ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. శివబాబాయే బ్రహ్మా ద్వారా అర్థం చేయిస్తారు. ఇతను
కూడా వారి నుండి అర్థం చేసుకొని మీకు అర్థం చేయిస్తారు. ముఖ్యమైన పెద్ద టీచర్,
పెద్ద సర్జన్ అయితే తండ్రియే. వారినే స్మృతి చేయాలి. బ్రాహ్మణీని స్మృతి చేయండి అని
ఈ విధముగా చెప్పరు. ఒక్కరి స్మృతియే ఉంచుకోవాలి. ఎప్పుడూ ఎవరి పట్ల మోహము
పెట్టుకోకూడదు. ఒక్క తండ్రి నుండే శిక్షణ తీసుకోవాలి. నిర్మోహులుగా కూడా అవ్వాలి.
ఇందులో చాలా కృషి చేయాలి. మొత్తం పాత ప్రపంచము పట్ల వైరాగ్యము ఉండాలి. ఇది
సమాప్తమయ్యేదే ఉంది. దీని పట్ల ప్రేమ కానీ, అభిరుచి కానీ ఏమాత్రము ఉండదు. ఎంత
పెద్ద-పెద్ద ఇళ్ళు మొదలైనవి నిర్మిస్తూ ఉంటారు. ఈ పాత ప్రపంచము ఇంకా ఎంత సమయము
ఉంటుంది అనేది కూడా వారికి తెలియదు. పిల్లలైన మీరు ఇప్పుడు మేలుకున్నారు, ఇతరులను
కూడా మేలుకొలుపుతారు. తండ్రి ఆత్మలనే మేలుకొలుపుతారు, స్వయాన్ని ఆత్మగా భావించండి
అని పదే-పదే చెప్తారు. స్వయాన్ని శరీరముగా భావిస్తున్నారంటే నిద్రిస్తున్నట్లే.
స్వయాన్ని ఆత్మగా భావించండి మరియు తండ్రిని కూడా స్మృతి చేయండి. ఆత్మ పతితముగా
ఉన్నట్లయితే శరీరము కూడా పతితమైనదే లభిస్తుంది. ఆత్మ పావనముగా ఉన్నట్లయితే శరీరము
కూడా పావనమైనది లభిస్తుంది.
తండ్రి అర్థం చేయిస్తున్నారు, మీరే ఈ దేవీ-దేవతా వంశానికి చెందినవారిగా ఉండేవారు,
మళ్ళీ మీరే అలా తయారవుతారు. ఇది ఎంత సహజము. ఇటువంటి అనంతమైన తండ్రిని మనము ఎందుకు
స్మృతి చేయము. ఉదయాన్నే లేచి కూడా తండ్రిని స్మృతి చేయండి. బాబా, మీదైతే అద్భుతము,
మీరు మమ్మల్ని ఎంత ఉన్నతమైన దేవీ-దేవతలుగా తయారుచేసి నిర్వాణధామములో కూర్చుండిపోతారు,
ఇంత ఉన్నతముగా అయితే ఎవ్వరూ తయారుచేయలేరు. మీరు ఎంత సహజము చేసి తెలియజేస్తారు.
తండ్రి అంటారు - ఎంత సమయము లభిస్తే అంత, కార్యవ్యవహారాలు చేసుకుంటూ కూడా తండ్రిని
స్మృతి చేయవచ్చు. స్మృతియే మీ నావను తీరానికి చేర్చేటువంటిది అనగా కలియుగము నుండి
ఆవలి తీరానికి అనగా శివాలయములోకి తీసుకువెళ్ళేది. శివాలయాన్ని కూడా స్మృతి చేయాలి,
శివబాబా ద్వారా స్థాపన చేయబడిన స్వర్గము - ఈ రెండింటి స్మృతి కలుగుతుంది. శివబాబాను
స్మృతి చేయడము ద్వారా మనము స్వర్గానికి యజమానులుగా అవుతాము. ఈ చదువు ఉన్నదే కొత్త
ప్రపంచము కోసము. తండ్రి కూడా కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయడానికి వస్తారు. తప్పకుండా
తండ్రి వచ్చి ఏదో ఒక కర్తవ్యాన్ని చేస్తారు కదా. నేను డ్రామా ప్లాన్ అనుసారముగా
పాత్రను అభినయిస్తున్నాను అన్నది మీరు చూస్తున్నారు కూడా. పిల్లలైన మీకు 5 వేల
సంవత్సరాల క్రితము యొక్క స్మృతియాత్రను మరియు ఆదిమధ్యాంతాల రహస్యాన్ని తెలియజేస్తాను.
ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత బాబా మన సమ్ముఖములోకి వస్తారని మీకు తెలుసు. ఆత్మయే
మాట్లాడుతుంది, శరీరము మాట్లాడదు. తండ్రి పిల్లలకు శిక్షణనిస్తారు - ఆత్మనే
పవిత్రముగా తయారుచేసుకోవాలి. ఆత్మ ఒక్కసారి మాత్రమే పవిత్రముగా అవ్వవలసి ఉంటుంది.
బాబా అంటారు - నేను మిమ్మల్ని అనేక సార్లు చదివించాను, మళ్ళీ కూడా చదివిస్తాను. ఈ
విధముగా సన్యాసులెవ్వరూ అనలేరు. తండ్రియే అంటారు - పిల్లలూ, నేను డ్రామా ప్లాన్
అనుసారముగా చదివించడానికి వచ్చాను, మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత ఇలాగే వచ్చి
చదివిస్తాను, ఎలాగైతే కల్పక్రితం మిమ్మల్ని చదివించి రాజధానిని స్థాపన చేసానో, అలా
అనేక సార్లు మిమ్మల్ని చదివించి రాజ్యాన్ని స్థాపన చేసాను. తండ్రి ఎంత అద్భుతమైన
విషయాలను అర్థం చేయిస్తారు. శ్రీమతము ఎంత శ్రేష్ఠమైనది. శ్రీమతము ద్వారానే మనము
విశ్వానికి యజమానులుగా అవుతాము. అది చాలా-చాలా గొప్ప పదవి! ఎవరికైనా పెద్ద లాటరీ
లభిస్తే వారు పిచ్చివారిలా అయిపోతారు. కొందరు నడుస్తూ-నడుస్తూ - మేము చదవలేము, మేము
విశ్వరాజ్యాధికారాన్ని ఎలా తీసుకుంటాము అని నిరాశ చెందుతారు. పిల్లలైన మీకు చాలా
సంతోషముండాలి. బాబా అంటారు, అతీంద్రియ సుఖము మరియు సంతోషపు విషయాల గురించి నా
పిల్లలను అడగండి. మీరు అందరికీ సంతోషపు విషయాలను వినిపించడానికి వెళ్తారు. మీరే
విశ్వానికి యజమానులుగా ఉండేవారు, మళ్ళీ 84 జన్మలు తీసుకుని బానిసలుగా అయ్యారు. నేను
బానిసను, నేను మీ బానిసను అని పాడుతారు కూడా. స్వయాన్ని నీచులమని చెప్పుకోవడము,
చిన్నవారిగా అయి నడుచుకోవడము మంచిదని భావిస్తారు. చూడండి, తండ్రి ఎవరు! వారి గురించి
ఎవ్వరికీ తెలియదు. వారి గురించి కూడా కేవలం మీరే తెలుసుకున్నారు. బాబా వచ్చి అందరినీ
పిల్లలూ-పిల్లలూ అని అంటూ ఏ విధముగా అర్థం చేయిస్తున్నారు. ఇది ఆత్మ మరియు పరమాత్మల
మేళ. వారి నుండి మనకు స్వర్గ రాజ్యాధికారము లభిస్తుంది. అంతేకానీ గంగా స్నానాలు
మొదలైనవి చేయడము ద్వారా స్వర్గ రాజ్యమేమీ లభించదు. గంగా స్నానాలైతే చాలా సార్లు
చేసారు. ఆ మాటకొస్తే నీరు సాగరము నుండి వస్తుంది, కానీ ఈ వర్షము ఎలా కురుస్తుంది,
దీనిని కూడా సృష్టి అద్భుతమని అంటారు. ఈ సమయములో తండ్రి మీకు అన్నీ అర్థం చేయిస్తారు.
ధారణ కూడా ఆత్మయే చేస్తుంది, అంతేకానీ శరీరము కాదు. తప్పకుండా బాబా ఎలా ఉన్న మనల్ని
ఎలా తయారుచేసారు అని మీరు ఫీల్ అవుతారు! ఇప్పుడు తండ్రి అంటారు - పిల్లలూ, మీపై మీరు
దయ చూపించుకోండి. ఎటువంటి అవజ్ఞ చేయకండి. దేహాభిమానులుగా అవ్వకండి. అనవసరముగా మీ
పదవిని తగ్గించేసుకుంటారు. టీచర్ అయితే అర్థం చేయిస్తారు కదా. తండ్రి అనంతమైన టీచర్
అని మీకు తెలుసు. ప్రపంచములో ఎన్ని భాషలు ఉన్నాయి. దేనినైనా ముద్రించినట్లయితే,
దానిని అన్ని భాషల్లోనూ ముద్రించాలి. ఏదైనా లిటరేచర్ ను ముద్రించినట్లయితే అందరికీ
ఒక్కొక్క కాపీని పంపించండి. ఒక్కొక్క కాపీని లైబ్రరీకి పంపించాలి. ఖర్చు యొక్క
విషయము కాదు. బాబా యొక్క భండారా చాలా నిండుతుంది. ధనాన్ని తమ వద్ద ఉంచుకొని ఏం
చేస్తారు. ఇంటికైతే తీసుకువెళ్ళరు. ఒకవేళ ఏదైనా ఇంటికి తీసుకువెళ్ళినట్లయితే
పరమాత్మ యజ్ఞము నుండి దొంగతనము చేసినట్లవుతుంది. అది చాలా పెద్ద తప్పు, అటువంటి
బుద్ధి ఎవ్వరికీ ఉండకూడదు. పరమాత్ముని యజ్ఞము నుండి దొంగతనమా! వారి వంటి మహాన్
పాపాత్ములు ఇంకెవ్వరూ ఉండరు. వారు ఎంతటి అధోగతిని పొందుతారు. తండ్రి అంటారు, ఇదంతా
డ్రామాలోని పాత్ర. మీరు రాజ్యము చేస్తారు, వారు మీ సేవకులుగా అవుతారు. సేవకులు
లేకుండా రాజ్యము ఎలా నడుస్తుంది! కల్పక్రితము కూడా ఇలాగే స్థాపన జరిగింది.
ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - మీ కళ్యాణము చేసుకోవాలనుకుంటే శ్రీమతముపై నడవండి,
దైవీ గుణాలను ధారణ చేయండి. క్రోధము చేయడము దైవీ గుణము కాదు. అది ఆసురీ గుణము
అవుతుంది. ఎవరైనా క్రోధము చేస్తే మౌనముగా ఉండాలి. వారికి బదులు చెప్పకూడదు. ప్రతి
ఒక్కరి నడవడిక ద్వారా అర్థం చేసుకోవచ్చు, అవగుణాలైతే అందరిలోనూ ఉన్నాయి. ఎవరైనా
క్రోధము చేస్తే వారి ముఖము రాగి వలె అయిపోతుంది. నోటి నుండి బాంబులు వేస్తారు.
స్వయాన్నే నష్టపరచుకుంటారు. వారి పదవి భ్రష్టమైపోతుంది. వివేకము ఉండాలి. తండ్రి
అంటారు, ఏదైనా పాప కర్మ చేసినట్లయితే, దానిని వ్రాయండి. బాబాకు తెలియజేసినట్లయితే
క్షమాపణ లభిస్తుంది. భారము తేలికవుతుంది. జన్మ-జన్మాంతరాలుగా మీరు వికారాలలోకి
వెళ్తూ ఉన్నారు. ఈ సమయములో మీరు ఏదైనా పాప కర్మ చేసినట్లయితే అది వంద రెట్లు
అవుతుంది. తండ్రి ఎదురుగా తప్పు చేసినట్లయితే వంద రెట్లు శిక్ష పడుతుంది. ఒకవేళ చేసి
చెప్పకపోతే అది మరింత వృద్ధి చెందుతుంది. తండ్రి అయితే అర్థం చేయిస్తారు, స్వయాన్ని
నష్ట పరచుకోకండి. తండ్రి పిల్లల బుద్ధిని మంచిగా చేయడానికి వచ్చారు. వారు ఎటువంటి
పదవిని పొందుతారు అనేది తండ్రికి తెలుసు. అది కూడా 21 జన్మల విషయము. ఎవరైతే
సర్వీసబుల్ పిల్లలుంటారో, వారి స్వభావము చాలా మధురముగా ఉండాలి. బాబా, ఈ పొరపాటు
జరిగింది అని కొందరు వెంటనే బాబాకు చెప్తారు. బాబా సంతోషిస్తారు. భగవంతుడు
సంతోషిస్తే ఇంకేమి కావాలి. వీరైతే తండ్రి, టీచర్, గురువు ముగ్గురూ కూడా, లేదంటే
ముగ్గురూ అసంతుష్టమవుతారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.