22-07-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడు మీరు కొత్త ప్రపంచములోకి
వెళ్ళాలి, ఈ దుఃఖపు రోజులు పూర్తి అవుతున్నాయి, అందుకే పాత గతించిపోయిన విషయాలను
మర్చిపోండి’’
ప్రశ్న:-
కర్మయోగీ
పిల్లలైన మీరు ఏ అభ్యాసాన్ని నిరంతరము చేయాలి?
జవాబు:-
ఇప్పుడిప్పుడే
శరీర నిర్వహణార్థము దేహములోకి రావాలి మరియు ఇప్పుడిప్పుడే దేహీ-అభిమానులుగా అవ్వాలి.
దేహము స్మృతి లేకుండా కర్మలైతే జరగవు, అందుకే ఈ అభ్యాసము చేయాలి - కర్మ చేసేటప్పుడు
దేహము యొక్క స్మృతిలో ఉండండి, మళ్ళీ దేహీ-అభిమానులుగా అయిపోండి. ఇటువంటి అభ్యాసాన్ని
పిల్లలైన మీరు తప్ప ప్రపంచములో ఇంకెవ్వరూ చేయలేరు.
పాట:-
మేలుకోండి
ప్రేయసులారా మేలుకోండి...
ఓంశాంతి
ఆత్మిక తండ్రి
అంటారు - మధురాతి మధురమైన ఆత్మలు లేక పిల్లలు ఈ పాటను విన్నారు. దీనిని జ్ఞాన
యుక్తమైన పాట అని అంటారు. ఈ పాట అయితే చాలా బాగుంది. ఆత్మలైన మీరు ఇప్పుడు
మేలుకున్నారు. డ్రామా రహస్యాన్ని కూడా ఇప్పుడు మీరు తెలుసుకున్నారు. భక్తి మార్గము
యొక్క షో అయితే చూసారు కదా - ఏదైతే గతించిందో, అదంతా మీ బుద్ధిలో ఉంది. మీకు
గతించిన మీ 84 జన్మల చరిత్ర గురించి తెలుసు. తండ్రి 84 జన్మల కథను వినిపించారు. ఇవి
కొత్త ప్రపంచము కోసం కొత్త విషయాలు. తండ్రి ద్వారా మీరు కొత్త విషయాలను వింటారు.
తండ్రి పిల్లలకు ఓదార్పును ఇస్తారు. పిల్లలూ, ఇప్పుడు కొత్త ప్రపంచములోకి వెళ్ళాలి
కనుక పాత విషయాలను మర్చిపోండి. భక్తి మార్గపు సామాగ్రి అయిన ఈ వేద-శాస్త్రాలన్నీ
సమాప్తమవ్వనున్నాయి. అక్కడ భక్తి మార్గపు గుర్తులు కూడా ఉండవు. అక్కడైతే భక్తి
యొక్క ఫలం లభిస్తుంది. భక్తులకు తండ్రి వచ్చి ఫలాన్ని ఇస్తారు. తండ్రి వచ్చి భక్తి
ఫలాన్ని ఎలా ఇస్తారు అనేది పిల్లలు తెలుసుకున్నారు. ఎవరైతే అందరికన్నా ఎక్కువ భక్తి
చేసారో, వారికి తప్పకుండా ఎక్కువ ఫలం లభిస్తుంది. జ్ఞానము యొక్క పురుషార్థాన్ని కూడా
వారే ఎక్కువగా చేస్తారు. ఆత్మలమైన మనము ఎక్కువ భక్తి చేసామని మీకు తెలుసు. తప్పకుండా
జ్ఞానములో కూడా వారే చురుకుగా ముందుకు వెళ్తారు, అప్పుడే ఈ లక్ష్మీ-నారాయణుల వలె
ఉన్నత పదవిని పొందుతారు. ఇప్పుడు మీరు జ్ఞాన-యోగాల పురుషార్థము చేస్తున్నారు.
దేహీ-అభిమానులుగా అయి ఉండాలి, మళ్ళీ దేహధారులుగా కూడా అవ్వాలి. కర్మలు చేస్తూ
తండ్రిని స్మృతి చేయాలి. దేహము లేకుండానైతే మనము కర్మలు చేయలేము. బాబాను స్మృతి
చేయాలి అన్నది అయితే కరక్టే కానీ స్వయాన్ని ఆత్మగా భావిస్తూ దేహాన్ని మర్చిపోతే పని
అవ్వదు, కర్మలైతే చేయాల్సిందే. తండ్రి స్మృతిలో చాలా మజా ఉంటుంది. లేస్తూ-కూర్చుంటూ,
నడుస్తూ-తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి కానీ కడుపుకు భోజనమైతే కావాలి కదా.
దేహీ-అభిమానులుగా అయి ఉండాలి. ఈ సమయములో పిల్లలైన మీరు తప్ప దేహీ-అభిమానులుగా ఎవ్వరూ
లేరు. ఒకవేళ ఎవరైనా స్వయాన్ని ఆత్మగా భావించినా కానీ పరమాత్మ పరిచయము లేదు. నేను
ఆత్మను అవినాశీ, ఈ శరీరము వినాశీ అని అర్థం చేసుకుంటారు కానీ ఇది అర్థం చేసుకున్నంత
మాత్రాన వికర్మలు వినాశనమవ్వవు. పుణ్యాత్మ, పతితాత్మ అని అంటారు కూడా. నేను ఆత్మను,
ఇది నా శరీరము - ఇదైతే కామన్ విషయము. ముఖ్యమైన విషయాన్ని తండ్రి ఏమని అర్థం
చేయిస్తున్నారంటే - నన్ను స్మృతి చేయండి. శరీర నిర్వహణార్థము దేహము యొక్క
స్మృతిలోకైతే రావాల్సిందే. దేహానికి తినిపించాలి కూడా, దేహము లేకుండానైతే ఏమీ
చేయలేరు. ప్రతి జన్మలోనూ తమ శరీర నిర్వహణను చేసుకుంటూ ఉంటారు, కర్మలు చేస్తూ కూడా
తమ ప్రియుడిని గుర్తుంచుకోవాలి. ఆ ప్రియుడి గురించి ఎవరికీ పూర్తిగా తెలియదు. ఆ
ప్రియుడి నుండి లేక తండ్రి నుండి మనకు వారసత్వము లభించనున్నది మరియు వారి స్మృతితో
వికర్మలు వినాశనమవుతాయి. ఈ విషయాన్ని ఎవరూ అర్థం చేయించరు.
పిల్లలైన మీరు ఇప్పుడు
కొత్త విషయాలను వింటారు. ఇప్పుడు మనకు ఇంటికి వెళ్ళేందుకు మార్గము లభించిందని మీకు
తెలుసు. మన ఇంటికి వెళ్ళి మళ్ళీ రాజధానిలోకి వస్తాము. తండ్రి కొత్త ఇల్లు కడితే,
అందులోకి వెళ్ళి కూర్చోవాలని తప్పకుండా మనసుకు అనిపిస్తుంది కదా. ఇప్పుడు మీకు
మార్గము లభించింది, దీని గురించి ఇతరులెవ్వరికీ తెలియదు. ఎన్ని యజ్ఞ-తపాదులు
మొదలైనవి చేసినా సరే, ఎంత తల బాదుకున్నా సరే, సద్గతిని పొందలేరు, ఈ ప్రపంచము నుండి
ఆ ప్రపంచములోకి వెళ్ళలేరు. ఇది కూడా అర్థం చేసుకోవాలి. శాస్త్రాలలో లక్షల
సంవత్సరాలని రాసేశారు, అందుకే మనుష్యుల బుద్ధి పని చేయడము లేదు. ఇది నిన్నటి
విషయమేనని మీరు మంచి రీతిలో అర్థం చేసుకోగలరు. భారత్ అయితే స్వర్గముగా ఉండేది. మనము
ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారము. దేవీ-దేవతా ధర్మము చాలా
సుఖాన్ని ఇచ్చేది. భారత్ వంటి సుఖాన్ని ఎవ్వరూ పొందలేరు. స్వర్గములోకైతే ఇతర ధర్మాల
వారెవ్వరూ వెళ్ళలేరు. ఎంత ప్రయత్నించినా సరే, మీకు ఉన్నటువంటి సుఖము ఇంకెవ్వరికీ
ఉండదు! ధనము ఖర్చు చేసినా కూడా, స్వర్గములో ఏ సుఖమైతే ఉంటుందో, అది లభించదు కదా.
కొందరికి ఆరోగ్యముంటే ధనముండదు, కొందరికి ధనముంటే ఆరోగ్యముండదు. ఇది ఉన్నదే దుఃఖపు
ప్రపంచము. కనుక ఇప్పుడు తండ్రి అంటారు - ఓ ఆత్మలూ, మేలుకోండి... మీకు ఇప్పుడు
జ్ఞానమనే మూడవ నేత్రము లభించింది. ఎంతటి మేలుకొలుపు కలిగింది. మీరు మొత్తం ప్రపంచము
యొక్క చరిత్ర-భౌగోళికాలను తెలుసుకున్నారు. తండ్రి అన్నీ తెలిసినవారు కదా. దీని అర్థం,
అందరి మనసులలో ఏముందో వారికి తెలుసు అని కాదు. ఫలానావారు ఎవరు, వారు ఎంతవరకు అర్థం
చేయిస్తారు, వారు ఎంతవరకు పవిత్రముగా ఉంటారు, ఎంతవరకు బాబాను స్మృతి చేస్తారు? అని
ప్రతి ఒక్కరి గురించి నేను ఎందుకు ఆలోచించాలి... నేనైతే మార్గాన్ని తెలియజేస్తాను -
ఆత్మలైన మీరు పరమపిత పరమాత్మను స్మృతి చేయాలి అని. ఈ సృష్టి చక్రాన్ని బుద్ధిలో
ఉంచుకోవాలి. దేహీ-అభిమానులుగా అయితే తప్పకుండా అవ్వాలి. దేహాభిమానులుగా అయిన
కారణముగా మీకు ఈ దుర్గతి కలిగింది. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేయాలి. గృహస్థ
వ్యవహారములో ఉంటూ కమల పుష్ప సమానముగా అవ్వాలి. స్వదర్శన చక్రధారులు కూడా మీరే,
దేవతలకైతే శంఖము మొదలైనవి ఉండవు. ఈ జ్ఞాన శంఖము మొదలైనవి బ్రాహ్మణులైన మీకే ఉన్నాయి.
సిక్కులు శంఖము మోగిస్తారు, చాలా పెద్ద ధ్వని చేస్తారు. మీరు కూడా కూర్చుని ఈ
జ్ఞానాన్ని ఇచ్చినట్లయితే, పెద్ద సభలో లౌడ్ స్పీకర్ ను అమరుస్తారు. ఇక్కడ మీరు లౌడ్
స్పీకర్ పెట్టాల్సిన అవసరము లేదు. టీచరు చదివించేటప్పుడు లౌడ్ స్పీకర్ పెడతారా ఏమిటి?
ఇక్కడైతే కేవలం శివబాబాను స్మృతి చేయాలి, అప్పుడు వికర్మలు వినాశనమవుతాయి. నేను
సర్వశక్తివంతుడను కదా. దూరదూరాల వరకు శబ్దము వినిపించాలని మీరు లౌడ్ స్పీకర్ పెడతారు.
అది కూడా మున్ముందు ఉపయోగపడుతుంది. మృత్యువు ఎదురుగా ఉందని, ఇప్పుడు అందరూ తిరిగి
వెళ్ళాలని మీరు వినిపించాలి. మహాభారత యుద్ధము కూడా ఎదురుగా నిలబడి ఉంది. మహాభారత
యుద్ధము జరిగిందని, వినాశనము అయ్యిందని గీతలో కూడా వ్రాసి ఉంది. అచ్ఛా, తర్వాత
ఏమయ్యింది? పాండవులు కూడా కరిగిపోయి మరణించారని వ్రాసారు. తండ్రి అర్థం
చేయిస్తున్నారు - ఒకవేళ వినాశనము ముందే జరిగి ఉంటే, భారత ఖండము కూడా ఖాళీ
అయిపోయుండేది. భారత్ అవినాశీ ఖండము, అది ఖాళీ అవ్వదు. ప్రళయమైతే జరగదని మీకు తెలుసు.
తండ్రి అవినాశీ కనుక వారి జన్మ స్థలము కూడా అవినాశీ. పిల్లలకు సంతోషము ఉండాలి.
తండ్రి సర్వుల సద్గతిదాత, సుఖకర్త, శాంతికర్త. ఎవరు వచ్చినా కూడా, శాంతి కావాలని
అంటారు. ఆత్మకు శాంతి అనేది అంతగా ఎందుకు గుర్తుకువస్తుంది! శాంతిధామము ఆత్మల ఇల్లు
కదా. ఇల్లు ఎవరికి గుర్తుండదు? ఎవరైనా విదేశాలలో మరణిస్తే, వారిని తమ జన్మస్థలానికి
తీసుకువెళ్ళాలని అనుకుంటారు. భారత్ యే సర్వుల సద్గతిదాత మరియు దుఃఖము నుండి
విముక్తిని ఇప్పించే శివబాబా యొక్క జన్మ స్థలమని ఒకవేళ అందరికీ తెలిస్తే, భారత్ కు
ఎంతో గౌరవముంటుంది, అప్పుడు వచ్చి ఒక్క శివునికే పుష్పాలు అర్పిస్తారు. ఇప్పుడైతే
ఎంతమందికి పుష్పాలు అర్పిస్తూ ఉంటారు. అందరికీ సుఖ-శాంతులను ఇచ్చే వారి నామ-రూపాలనే
మాయం చేసేసారు. ఎవరికైతే తండ్రి గురించి మంచి రీతిలో తెలుసో, వారే వారసత్వాన్ని
తీసుకునే పురుషార్థాన్ని చేస్తారు. నా పేరే దుఃఖహర్త-సుఖకర్త. దుఃఖము నుండి
విముక్తిని ఇప్పించి ఏమి చేస్తారు! శాంతిధామములో శాంతిగా ఉంటారని, సుఖధామములో
సుఖముంటుందని మీకు తెలుసు. శాంతిధామము ఉండే చోటు వేరు, సుఖధామము ఉండే చోటు వేరు, ఇది
ఉన్నదే దుఃఖధామము. అందరికీ ఈ సమయములో దుఃఖమే దుఃఖముంది. మనము ఎలాంటి సుఖములోకి
వెళ్తామంటే, అక్కడ 21 జన్మల వరకు ఏ విధమైన దుఃఖము ఉండదని ఇప్పుడు మీకు తెలుసు. దాని
పేరే సుఖధామము, అది ఎంత మధురమైన పేరు. తండ్రి అంటారు - మీకు ఎటువంటి కష్టము ఇవ్వను,
కేవలం తండ్రిని మరియు వారసత్వాన్ని స్మృతి చేయాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి. ఈ
జ్ఞానాన్ని మీకు బాబా నేర్పిస్తున్నారు. సత్యయుగములో - ఆత్మనైన నేను ఈ శరీరాన్ని
వదిలి మరొక జన్మ తీసుకుంటానని ఆత్మ జ్ఞానముంటుంది, దీనిని ఆత్మాభిమాని స్థితి అని
అంటారు. ఇది ఆత్మిక జ్ఞానము. దీనిని ఇతరులెవ్వరూ ఇవ్వలేరు. ఆత్మల తండ్రి వచ్చి
ఆత్మలకు జ్ఞానాన్ని ఇస్తారు. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత ఇస్తారు. మనుష్యులైతే
పూర్తిగా ఘోర అంధకారములో ఉన్నారు. ఇప్పుడు మీకు ప్రకాశము లభించింది, మీరు అజ్ఞాన
నిద్ర నుండి మేలుకున్నారు. ప్రేయసులందరి ప్రియుడు ఒక్క తండ్రియే. తండ్రి అంటారు -
నేను మీకు తండ్రిని కూడా, ప్రియుడిని కూడా, గురువులకు గురువును కూడా, సుప్రీమ్
టీచరును. గురువులందరి సద్గతిదాత ఒక్క సద్గురువు మాత్రమే. వారంటారు - పిల్లలూ, నేను
సర్వులకు సద్గతినిస్తాను. గతి తర్వాత సద్గతి ఉంటుంది.
తండ్రి అర్థం
చేయించారు, ప్రతి ఆత్మ తిరిగి వెళ్ళాల్సిందే. ఆత్మయే సతోప్రధానముగా, సతో, రజో, తమోగా
అవుతుంది. కొంతమంది పాత్ర చాలా కొద్దిగానే ఉంటుంది. వస్తారు, వెళ్ళిపోతారు. దోమల వలె
జన్మిస్తారు మరియు మరణిస్తారు. అటువంటివారు తండ్రి నుండి వారసత్వము తీసుకోరు. తండ్రి
నుండి పవిత్రత, సుఖ-శాంతుల వారసత్వము తీసుకోవడము జరుగుతుంది. తండ్రి ఆత్మలైన మీకు
అర్థం చేయిస్తారు, తండ్రి అయితే నిరాకారుడు. వారు కూడా వచ్చి ఈ నోటి ద్వారా అర్థం
చేయిస్తారు. శివబాబా మందిరాలను కూడా చాలా ఎత్తులో నిర్మిస్తారు. తీర్థయాత్రలకు,
మేళాలకు ఎంత దూరదూరాలకు వెళ్తారు. అక్కడ పైన తాగడానికి జ్ఞానామృతము ఏమైనా పెట్టారా
ఏమిటి! ఎంత ఖర్చు చేస్తారు. గవర్నమెంట్ కూడా వారి కోసం ఎన్ని ఏర్పాట్లు చేయాల్సి
ఉంటుంది, కష్టమవుతుంది. ఇక్కడైతే చిన్న పిల్లలను తీర్థ యాత్రలకు ఎలా తీసుకువెళ్తారు?
పిల్లలను ఎవరో ఒకరికి చూసుకోమని అప్పజెప్పి వెళ్తారు. పిల్లలను తమతో పాటు
తీసుకువెళ్ళరు. 2-3 నెలలు యాత్రలు చేస్తారు. ఇక్కడకు మీరు వచ్చినప్పుడు, మీరు
కూర్చుని వినాలి, చదువుకోవాలి. చిన్న పిల్లలైతే వినరు. ఇక్కడకు మీరు జ్ఞాన-యోగాలను
నేర్చుకునేందుకు వచ్చారు. తండ్రి కూర్చుని జ్ఞానము వినిపించేటప్పుడు శబ్దాలు
మొదలైనవేవీ రాకూడదు. లేదంటే అటువైపు అటెన్షన్ వెళ్తుంది. శాంతిగా కూర్చుని అటెన్షన్
పెట్టి వినాలి. యోగమైతే చాలా సహజము. ఏ పని చేస్తున్నా సరే, బుద్ధియోగము అక్కడ
జోడించబడి ఉండాలి. తండ్రి స్మృతి ఉన్నట్లయితే చాలా గొప్ప సంపాదన జరుగుతుంది. మనము
సదా ఆరోగ్యవంతులుగా అవుతామని మీకు తెలుసు. మీతో మీరు మాట్లాడుకోవాల్సి ఉంటుంది.
తండ్రి స్మృతిలో ఉంటూ భోజనాన్ని కూడా తమ చేతులతో తయారుచేసుకోవాలి. చేతులతో పనులు
కూడా చేసుకోండి, కానీ మీ తండ్రిని స్మృతి చేయండి. దానితో మీ కళ్యాణము కూడా
జరుగుతుంది మరియు స్మృతిలో ఉండటము వలన వండిన పదార్థము కూడా బాగా కుదురుతుంది. మీకు
విశ్వ రాజ్యాధికారము లభిస్తుంది. మీరు ఇక్కడకు లక్ష్మీ-నారాయణులుగా అవ్వడానికి
వస్తారు. మేము సూర్యవంశీయులుగా అవుతామని అందరూ అంటారు.
మా మమ్మా-బాబా ఈ
సమయములో బ్రహ్మా-సరస్వతులుగా ఉన్నారని మీకు తెలుసు. మరుసటి జన్మలో
లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. ఇలా భవిష్యత్తులో ఎవరు ఏమవుతారు అని ఎవరి జన్మల
గురించి తెలియదు. నెహ్రూ వెళ్ళి ఏమయ్యారు అనేది ఏమి తెలుసు. అచ్ఛా, ఒకవేళ ఏదైనా
దానము చేసి ఉంటే, ఇక్కడ మంచి కులములో జన్మిస్తారు. ఇప్పుడు మీకు అంతా తెలుస్తుంది.
ఇప్పుడు వీరి పేర్లు ఆది దేవ్ బ్రహ్మా, ఆది దేవి సరస్వతి. వీరే మళ్ళీ స్వర్గానికి
యజమానులుగా అవుతారు. అచ్ఛా, వీరి పిల్లలు కూడా వీరితోనే ఉంటారు. వారు కూడా - మేము
స్వర్గానికి యజమానులుగా అవుతామని అంటారు. ఇదైతే పక్కాగా జరుగుతుంది. మీరు వారిని
సూక్ష్మవతనములో కూడా చూస్తారు. దేవీల మందిరాలలో కూడా చాలా మేళాలు జరుగుతాయి. ఇప్పుడు
జగదాంబ అయితే ఒక్కరే ఉన్నారు. వారి ముఖ కవళికలు కూడా ఒకే విధముగా ఉండాలి. మమ్మాను
కూడా మీరు చూస్తారు. మూర్తులకు పిల్లలైన మీ ముఖ కవళికలు ఉన్నాయి, అందుకే కన్యా
కుమారి, అధర్ కుమారి అనే పేర్లు పెట్టారు. మనమే ఆ విధముగా అవుతామని మీకు తెలుసు.
మనమంతా బ్రహ్మాకుమార-కుమారీలము. యుగళులు కూడా మేము బ్రహ్మాకుమార-కుమారీలము, ఒక్క
తండ్రి పిల్లలమని అంటారు. ఇది మీ స్మృతిచిహ్నమే. తప్పకుండా మీరు కూర్చుని ఈ
జ్ఞానాన్ని అర్థ సహితముగా ఇస్తారు. ఇది దిల్వాడా మందిరము. మీరు మాత్రమే దీని గురించి
అర్థం చేయించగలరు. మనము స్థాపన చేస్తున్నామని, రాజయోగముతో శ్రీమతమనుసారముగా భారత్
ను స్వర్గముగా తయారుచేస్తున్నామని మీకు తెలుసు. అచ్ఛా!
మధురాతి మధురమైన
సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక
పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. జ్ఞాన-యోగాల పట్ల పూర్తి అటెన్షన్ పెట్టాలి. వినే సమయములో చాలా శాంతిగా,
ఏకాగ్రచిత్తులై కూర్చోవాలి. కర్మయోగులుగా కూడా అవ్వాలి.
2. తండ్రి ఏదైతే ఇంటి మార్గాన్ని తెలియజేసారో, అది అందరికీ తెలియజేయాలి.
స్వదర్శన చక్రధారులుగా అవ్వడముతో పాటుగా జ్ఞాన శంఖాన్ని కూడా మ్రోగించాలి.
వరదానము:-
మహాన్ మరియు మెహమాన్ (అతిథి) - రెండు స్మృతుల ద్వారా సర్వ
ఆకర్షణల నుండి ముక్తులుగా అయ్యే ఉపరామ మరియు సాక్షీ భవ
ఉపరామ మరియు సాక్షీ అవస్థను తయారుచేసుకునేందుకు రెండు
విషయాలు పట్ల ధ్యాస ఉండాలి - ఒకటేమో ఆత్మనైన నేను మహాన్ ఆత్మను, రెండవది - ఆత్మనైన
నేను ఇప్పుడు ఈ పాత సృష్టిలో మరియు ఈ పాత శరీరములో అతిథిని. ఈ స్మృతిలో ఉండటము
ద్వారా స్వతహాగా మరియు సహజముగానే సర్వ బలహీనతలు మరియు మోహముతో కూడిన ఆకర్షణలు
సమాప్తమైపోతాయి. మహాన్ గా భావించడము ద్వారా సాధారణ కర్మలు లేక సంకల్పాలు ఏవైతే
సంస్కారాలకు వశమై జరుగుతాయో, అవి పరివర్తన అయిపోతాయి. మహాన్ గా మరియు అతిథిగా
భావిస్తూ నడుచుకోవడము ద్వారా మహిమా యోగ్యులుగా కూడా అవుతారు.
స్లోగన్:-
సర్వుల
శుభభావన మరియు సహయోగపు బిందువుల ద్వారా పెద్ద కార్యము కూడా సహజమైపోతుంది.
అవ్యక్త ప్రేరణలు -
జ్వాలా స్వరూప స్థితిలో ఉంటూ శక్తిశాలి స్మృతిని అనుభవము చేయండి
శక్తిశాలి మనసుకు
గుర్తు - సెకండులో ఎక్కడికి కావాలంటే అక్కడికి చేరుకోవాలి. మనసుకు ఎగరటము
వచ్చినప్పుడు, ప్రాక్టీస్ ఉన్నప్పుడు సెకండులో ఎక్కడికి కావాలంటే అక్కడికి
చేరుకోగలదు. ఇప్పుడిప్పుడే సాకార వతనములోకి, ఇప్పుడిప్పుడే పరంధామానికి, సెకెండులో
చేరుకునేంత తీవ్ర వేగము ఉండాలి - ఇప్పుడు ఈ అభ్యాసాన్నే పెంచండి, అప్పుడు స్మృతి
శక్తిశాలిగా అవుతుంది.