23-09-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీరు ఆత్మిక తండ్రి నుండి కొత్త-కొత్త ఆత్మిక విషయాలను వింటున్నారు, ఏ విధంగానైతే ఆత్మలమైన మనము మన రూపాన్ని మార్చుకొని వచ్చామో, అదే విధంగా తండ్రి కూడా వచ్చారని మీకు తెలుసు’’

ప్రశ్న:-
చిన్న-చిన్న పిల్లలు తండ్రి ఇచ్చే వివరణ పట్ల మంచి రీతిలో అటెన్షన్ పెట్టినట్లయితే ఏ టైటిల్ ను తీసుకోగలరు?

జవాబు:-
స్పిరిచ్యుల్ లీడర్ అనే టైటిల్ ను తీసుకోగలరు. చిన్న పిల్లలు ఒకవేళ ఏదైనా ధైర్యంతో కూడిన పని చేసి చూపిస్తే, తండ్రి నుండి విన్నదాని పట్ల అటెన్షన్ పెడితే మరియు ఇతరులకు అర్థం చేయిస్తే, వారిని అందరూ చాలా ప్రేమిస్తారు. తండ్రి పేరు కూడా ప్రసిద్ధమవుతుంది.

పాట:-
ఆకాశ సింహాసనాన్ని వదిలి రండి...

ఓంశాంతి
పిల్లలు పిలిచారు, తండ్రి రెస్పాన్స్ ఇచ్చారు, ప్రాక్టికల్ గా పిల్లలు ఏమంటారంటే - బాబా, మీరు మళ్ళీ రావణ రాజ్యంలోకి రండి. మాయ నీడ మళ్ళీ పడింది అన్న పదాలు కూడా ఉన్నాయి కదా. మాయ అని రావణుడిని అంటారు. కావున, రావణ రాజ్యం వచ్చేసింది అందుకే ఇప్పుడు మళ్ళీ రండి అని పిలుస్తారు. ఇక్కడ రావణ రాజ్యంలో చాలా దుఃఖముంది. మనము చాలా దుఃఖితులుగా, పాపాత్ములుగా అయిపోయాము. ఇప్పుడు తండ్రి ప్రాక్టికల్ గా ఉన్నారు. మళ్ళీ అదే మహాభారత యుద్ధం ఎదురుగా ఉందని పిల్లలకు తెలుసు. తండ్రి జ్ఞానాన్ని మరియు రాజయోగాన్ని నేర్పిస్తున్నారు. ఓ నిరాకార పరమపిత పరమాత్మ, నిరాకార లోకం నుండి వచ్చి సాకార రూపాన్ని ధరించండి, రూపాన్ని మార్చుకోండి అని పిలుస్తారు కూడా. తండ్రి అర్థం చేయిస్తారు - మీరు కూడా అక్కడ ఆ బ్రహ్మా మహాతత్వంలో అనగా ఆ నిరాకారీ ప్రపంచంలో నివసించేవారు. మీరు కూడా రూపాన్ని మార్చుకున్నారు. ఈ విషయము గురించి ఎవరికీ తెలియదు. నిరాకారిగా ఉండే ఆత్మయే వచ్చి సాకార శరీరాన్ని ధారణ చేస్తుంది. అది నిరాకారీ ప్రపంచము. ఇది సాకారీ ప్రపంచము మరియు అది సూక్ష్మ లోకము (ఆకారీ ప్రపంచము). అది వేరు. మేము శాంతిధామము అనగా నిర్వాణధామము నుండి వస్తాము అని మీ బుద్ధిలో ఉంది. తండ్రి మొట్టమొదట కొత్త రచనను రచించాల్సి వచ్చినప్పుడు, సూక్ష్మవతనాన్నే రచిస్తారు. సూక్ష్మవతనంలోకి ఇప్పుడు మీరు వెళ్ళగలరు, ఇక తర్వాత ఎప్పుడూ వెళ్ళలేరు. మొట్టమొదట మీరు సూక్ష్మవతనాన్ని దాటుకుంటూ రారు. డైరెక్ట్ గా వస్తారు. ఇప్పుడు మీరు సూక్ష్మవతనములోకి వెళ్ళి-రాగలరు. అక్కడికి కాలి నడకనో లేక ఇంకే రకంగానో వెళ్ళే విషయము కాదు. ఈ విధంగా పిల్లలైన మీకు సాక్షాత్కారము అవుతుంది. మూలవతనము యొక్క సాక్షాత్కారము కూడా జరగవచ్చు కానీ అక్కడికి వెళ్ళలేరు. వైకుంఠము యొక్క సాక్షాత్కారము కూడా జరగవచ్చు కానీ ఎప్పటి వరకైతే సంపూర్ణ పవిత్రంగా అవ్వరో, అప్పటి వరకు అక్కడికి వెళ్ళలేరు. మేము సూక్ష్మవతనంలోకి వెళ్ళగలము అని మీరు చెప్పలేరు. మీరు సాక్షాత్కారంలో చూడగలరు. శివబాబా, దాదా మరియు పిల్లలైన మీరు ఉన్నారు. పిల్లలైన మీరు ఎటువంటి కొత్త-కొత్త ఆత్మిక విషయాలను వింటారు. ఈ విషయాల గురించి ప్రపంచంలో ఇంకెవరికీ తెలియదు. నిరాకారీ ప్రపంచము అని అంటారు కానీ అది ఎలా ఉంటుందో, వారికి తెలియదు. ముందుగా ఆత్మ గురించే తెలియనప్పుడు ఇక నిరాకారీ ప్రపంచం గురించి ఎలా తెలుస్తుంది! తండ్రి వచ్చి మొట్టమొదట ఆత్మ యొక్క రియలైజేషన్ చేయిస్తారు. మీరు ఆత్మలు, మీరు రూపాన్ని మార్చుకున్నారు అనగా నిరాకార లోకము నుండి సాకారంలోకి వచ్చారు.

ఆత్మలమైన మనము 84 జన్మలను ఎలా అనుభవిస్తాము అనేది ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు. ఈ పాత్ర అంతా ఆత్మలో రికార్డు వలె నిండి ఉంది. బాబా ఈ విషయాలను ఇంతకుముందు వినిపించారు. తండ్రి అంటారు - ఇప్పుడు మీకు గుహ్యమైన, రమణీకమైన విషయాలను వినిపిస్తాను. ఇవి మీకు ఇంతకుముందు తెలియవు, ఇప్పుడు తెలుసు. కొత్త-కొత్త పాయింట్లు బుద్ధిలోకి వస్తూ ఉంటాయి, అందుకే ఇతరులకు కూడా వెంటనే అర్థం చేయించగలరు. రోజురోజుకూ ఈ బ్రాహ్మణుల వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. ఇదే తర్వాత దైవీ వృక్షంగా అవ్వనున్నది, బ్రాహ్మణులే వృద్ధి చెందుతారు. ఈ వృక్షము చూడడానికి ఎంత చిన్నగా కనిపిస్తుంది. ఉదాహరణకు ప్రపంచ పటంలో ఇండియాను చూస్తే, ఎంత చిన్నగా కనిపిస్తుంది. వాస్తవానికి ఇండియా ఎంత పెద్దది. అలాగే జ్ఞానము గురించి కూడా - మన్మనాభవ అనగా అల్ఫ్ (భగవంతుడు) ను స్మృతి చేయండి అని అంటారు. బీజం ఎంత చిన్నగా ఉంటుంది. దాని నుండి ఎంత పెద్ద వృక్షం వెలువడుతుంది. అదే విధంగా ఈ బ్రాహ్మణ కులం కూడా చిన్నది, వృద్ధి చెందుతూ ఉంటుంది. మనము ఈ సమయంలో బ్రాహ్మణులము, తర్వాత దేవతలుగా అవుతామని మీ బుద్ధిలో ఉంది. 84 జన్మల మెట్ల చిత్రమైతే చాలా బాగుంది. పిల్లలు అర్థం చేయించవచ్చు - ఎవరైతే 84 జన్మలు తీసుకుంటారో, వారే వచ్చి అర్థం చేసుకుంటారు. కొందరు 84 జన్మలు, మరి కొందరు 80 జన్మలు కూడా తీసుకుంటూ ఉండవచ్చు. మనము ఈ దైవీ కులానికి చెందినవారమని భావిస్తారు. మనము సూర్యవంశం వారిగా అవుతాము. ఒకవేళ ఫెయిల్ అయితే, ఆలస్యంగా వస్తారు. అందరూ ఒకేసారి కలిసి రారు. చాలామంది జ్ఞానము తీసుకుంటూ ఉంటారు కానీ అందరూ కలిసి ఒకేసారి రారు కదా. వెళ్ళడము కలిసి వెళ్తారు, కానీ రావడము కొంత-కొంత మంది చొప్పున వస్తారు, ఇది అర్థం చేసుకోవాల్సిన విషయము కదా. అందరూ ఒకేసారి కలిసి 84 జన్మలు ఎలా తీసుకుంటారు. బాబా, మళ్ళీ వచ్చి గీతా జ్ఞానాన్ని వినిపించండి అని తండ్రిని పిలుస్తారు. కావున ఎప్పుడైతే మహాభారత యుద్ధం జరుగుతుందో, ఆ సమయంలోనే వచ్చి గీతా జ్ఞానాన్ని వినిపిస్తారని దీని ద్వారా నిరూపణ అవుతుంది. దీనినే రాజయోగమని అంటారు. ఇప్పుడు మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు. కల్ప-కల్పము 5 వేల సంవత్సరాల తర్వాత బాబా వచ్చి మనకు జ్ఞానాన్ని ఇస్తారు. సత్యనారాయణ కథను వింటారు కదా. వీరు ఎక్కడ నుండి వచ్చారు, తర్వాత ఎక్కడికి వెళ్ళారు అనేది వారికి తెలియదు. తండ్రి అర్థం చేయిస్తారు - పిల్లలూ, మీపై రావణుని నీడ పడింది, ఇప్పుడు డ్రామానుసారంగా రావణ రాజ్యం సమాప్తమవ్వనున్నది. సత్యయుగంలో రామ రాజ్యము ఉంది మరియు ఈ సమయంలో రావణ రాజ్యము ఉంది.

ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు, మాకు ఏ జ్ఞానమైతే లభించిందో, అది ఈ ప్రపంచంలో ఎవరికీ లేదు. ఇది కొత్త ప్రపంచం కోసము మన కొత్త చదువు. గీతలో శ్రీకృష్ణుని పేరు వ్రాసారు, అది పాత విషయము కదా. ఇప్పుడు మీరు కొత్త విషయాలను వింటున్నారు. శివ భగవానువాచ అని ఎప్పుడూ వినలేదు, మేము కృష్ణ భగవానువాచ అనే వింటూ వచ్చాము అని అంటారు. మీరు కొత్త ప్రపంచం కోసం అన్నీ కొత్త విషయాలనే వింటారు. భారత్ ప్రాచీనమైనదని అందరికీ తెలుసు. కానీ ఎప్పుడు ఉండేది, ఈ లక్ష్మీనారాయణుల రాజ్యము ఎలా నడిచింది, వీరు రాజ్యాన్ని ఎలా పొందారు, తర్వాత అది ఏమైపోయింది - ఈ విషయాలు ఎవరి బుద్ధిలోకి రావు. ఏం జరగిందని వీరి రాజ్యం సమాప్తమైపోయింది, ఎవరు విజయము పొందారు, ఏమీ అర్థం చేసుకోరు. వారు సత్యయుగానికి లక్షల సంవత్సరాలని అంటారు. లక్ష్మీ-నారాయణులు లక్షల సంవత్సరాలు రాజ్యం చేయడము అనేది జరగదు. అలా జరిగి ఉంటే సూర్యవంశీ రాజులు ఎంతో మంది ఉండాలి. కానీ ఇప్పుడు ఇంకెవ్వరి పేర్లు కూడా లేవు. 1250 సంవత్సరాల గురించి ఎవరికీ తెలియదు, అలాగే లక్ష్మీనారాయణుల రాజ్యం ఎంత వరకు నడిచింది అనేది కూడా ఎవరికీ తెలియదు, అటువంటప్పుడు లక్షల సంవత్సరాల గురించి ఎవరికైనా ఎలా తెలుస్తుంది. ఎవరి బుద్ధి పని చేయడము లేదు. ఇప్పుడు చిన్న-చిన్న పిల్లలైన మీరు వెంటనే అర్థం చేయించగలరు. ఇది చాలా సహజము. ఈ మొత్తం కథ అంతా భారత్ కు చెందినదే. సత్య, త్రేతాయుగాలలో కూడా భారతవాసులు రాజులుగా ఉండేవారు. వేర్వేరు చిత్రాలు కూడా ఉన్నాయి. ఇక్కడైతే వేలాది సంవత్సరాలని అంటారు, తండ్రి అంటారు - ఇది 5 వేల సంవత్సరాల కథ. నేటికి 5 వేల సంవత్సరాల క్రితం లక్ష్మీనారాయణుల రాజ్యముండేది, రాజ్య వంశముండేది, తర్వాత పునర్జన్మలు తీసుకోవాల్సి వచ్చింది. చిన్న-చిన్న కుమార్తెలు, ఈ కొంచెం అర్థం చేయించినా సరే, వీరు చాలా మంచి జ్ఞానాన్ని చదువుకున్నారని వారు భావిస్తారు. ఈ స్పిరిచ్యుల్ నాలెడ్జ్ (ఆధ్యాత్మిక జ్ఞానము) స్పిరిచ్యుల్ ఫాదర్ (ఆత్మిక తండ్రి) వద్ద తప్ప ఇంకెవరి వద్ద లేదు. మాకు కూడా స్పిరిచ్యుల్ ఫాదర్ వచ్చి తెలియజేసారని మీరంటారు. ఆత్మ శరీరము ద్వారా వింటుంది. నేను ఫలానాగా అవుతానని ఆత్మయే అంటుంది. మనుష్యులు స్వయము గురించి రియలైజ్ అవ్వరు. మనకు తండ్రి రియలైజ్ చేయించారు. ఆత్మలమైన మనము పూర్తి 84 జన్మలు తీసుకుంటాము. ఇటువంటి విషయాలను కూర్చొని అర్థం చేయిస్తే, వీరికి చాలా మంచి జ్ఞానముందని అంటారు. భగవంతుడు నాలెడ్జ్ ఫుల్ కదా. భగవంతుడు నాలెడ్జ్ ఫుల్, బ్లిస్ ఫుల్, ముక్తిదాత, మార్గదర్శకుడు అని అంటారు కూడా, కానీ వారు ఎక్కడికి తీసుకువెళ్తారు అనేది ఎవరికీ తెలియదు. ఈ విషయాన్ని పిల్లలు అర్థం చేయించగలరు. స్పిరిచ్యుల్ ఫాదర్ నాలెడ్జ్ ఫుల్, వీరినే బ్లిస్ ఫుల్ అని అంటారు. ఎప్పుడైతే మనుష్యులు చాలా దుఃఖితులుగా అవుతారో, అప్పుడే వచ్చి విముక్తులుగా చేస్తారు. రావణ రాజ్యము అని ఒకటి ఉంటుంది. హెవెన్లీ గాడ్ ఫాదర్ (స్వర్గ రచయిత) అని అంటారు. హెల్ (నరకం) ను రావణ రాజ్యమని అంటారు. ఎవరికైనా ఈ జ్ఞానము వినిపించినట్లయితే, వారు వెంటనే - దీనిని అందరికీ వెళ్ళి వినిపించండి అని అంటారు. కానీ ధారణ చాలా బాగుండాలి. ప్రదర్శనీ చిత్రాల మ్యాగజైన్ కూడా ఉంది, వీటిని ఇంకా బాగా అర్థం చేసుకుంటే ఈ చిత్రాలపై చాలా సేవ చేయవచ్చు.

ఈ బచ్చీ (జయంతి బెహెన్) కూడా అక్కడ లండన్ లో తమ టీచరుకు అర్థం చేయించవచ్చు. అక్కడ లండన్ లో ఈ సేవను చేయవచ్చు. ప్రపంచంలో చాలా మోసం ఉంది కదా. రావణుడు అందరినీ పూర్తిగా మోసము చేసేవారిగా చేసేసాడు. పిల్లలు మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర-భూగోళాలను అర్థం చేయించగలరు. లక్ష్మీనారాయణుల రాజ్యం ఎంత కాలం నడిచింది, తర్వాత ఫలానా సంవత్సరము నుండి ఇస్లామీయులు, బౌద్ధులు, క్రిస్టియన్లు వస్తారు, ఇలా వృద్ధి చెందుతూ-చెందుతూ వెరైటీ ధర్మాల వృక్షం ఎంత పెద్దది అయిపోతుంది. అర్ధకల్పము తర్వాత వేరే ధర్మాలు వస్తాయి. ఇటువంటి విషయాలను వీరు (జయంతి బెహెన్) కూర్చొని వినిపించినట్లయితే, వీరు ఒక స్పిరిచ్యుల్ లీడర్, వీరిలో స్పిరిచ్యుల్ నాలెడ్జ్ ఉంది అని వినేవారు అంటారు. అప్పుడు వీరు చెప్తారు - ఈ జ్ఞానము అయితే ఇండియాలో లభిస్తుంది. స్పిరిచ్యుల్ గాడ్ ఫాదర్ ఇస్తున్నారు. వారు బీజరూపుడు, ఇది తలక్రిందులుగా ఉన్న వృక్షము. బీజము నాలెడ్జ్ ఫుల్. బీజానికి వృక్షం గురించిన నాలెడ్జ్ ఉంటుంది కదా. ఇది వెరైటీ ధర్మాల వృక్షము. దీనిని భారత్ యొక్క దైవీ ధర్మమని అంటారు. మొదట లక్ష్మీనారాయణుల రాజ్యముంటుంది, తర్వాత సీతా-రాముల రాజ్యముంటుంది. అర్ధకల్పము ఇవి కొనసాగుతాయి, తర్వాత ఇస్లాములు వస్తారు... వృక్షం వృద్ధి చెందుతూ ఉంటుంది. ఈ బచ్చీ వెళ్ళి ఈ విధంగా భాషణ చేయాలి మరియు ఈ వృక్షం ఎలా ఇమర్జ్ అవుతుంది అనేది అర్థం చేయించాలి. ఈ సృష్టి చక్రం ఎలా తిరుగుతుంది అనేది మనము అర్థం చేయించగలము. విదేశాలలోనైతే ఇంకెవ్వరూ లేరు. ఈ బచ్చీ వెళ్ళి, ఇప్పుడిది ఇనుపయుగము యొక్క అంతిమము, బంగారు యుగము రానున్నది అని అర్థం చేయించినట్లయితే వారు చాలా సంతోషిస్తారు. బాబా యుక్తులను తెలియజేస్తూ ఉంటారు, వీటిపై అటెన్షన్ పెట్టాలి. చిన్న పిల్లలకు చాలా గౌరవము లభిస్తుంది. చిన్నవారు ఏదైనా ధైర్యంతో కూడిన పని చేస్తే, వారిని చాలా ప్రేమిస్తారు. ఈ విధంగా చిన్న పిల్లలు ఈ విషయాల పట్ల అటెన్షన్ పెట్టినట్లయితే స్పిరిచ్యుల్ లీడర్లుగా అవుతారని తండ్రికి అనిపిస్తుంది. స్పిరిచ్యుల్ గాడ్ ఫాదర్ యే కూర్చొని నాలెడ్జ్ ఇస్తారు. శ్రీకృష్ణుడిని గాడ్ ఫాదర్ అని అనడము పొరపాటు. భగవంతుడు నిరాకారుడు. ఆత్మలమైన మనందరము సోదరులము, వారు తండ్రి. ఇనుప యుగంలో అందరూ దుఃఖితులుగా ఉన్నప్పుడు తండ్రి వస్తారు. ఇనుప యుగంగా అయినప్పుడు, తండ్రి బంగారు యుగాన్ని స్థాపన చేయడానికి రావాల్సి ఉంటుంది. ప్రాచీన భారత్ సుఖధామంగా ఉండేది, హెవెన్ గా ఉండేది. చాలా తక్కువ మంది మనుష్యులు ఉండేవారు. మరి మిగిలిన ఆత్మలందరూ ఎక్కడ ఉండేవారు. శాంతిధామంలో ఉండేవారు కదా. ఈ విధముగా అర్థం చేయించాలి. ఇందులో భయపడాల్సిన విషయము లేదు, ఇది ఒక కథ. కథను సంతోషంగా చెప్పడము జరుగుతుంది. ప్రపంచ చరిత్ర-భూగోళము ఎలా రిపీట్ అవుతుంది అన్నదానిని కథ అని కూడా అనవచ్చు, నాలెడ్జ్ అని కూడా అనవచ్చు. మీకైతే ఇది పక్కాగా గుర్తుండాలి. తండ్రి అంటారు - ఆత్మనైన నాలో మొత్తం వృక్షం యొక్క జ్ఞానము ఉంది, దానిని నేను రిపీట్ చేస్తాను. నాలెడ్జ్ ఫుల్ తండ్రి పిల్లలకు నాలెడ్జ్ ఇస్తున్నారు. వీరు (జయంతి బెహన్) వెళ్ళి నాలెడ్జ్ ఇచ్చినట్లయితే, మీరు ఇతరులను కూడా పిలవండి అని వీరితో అంటారు. అప్పుడు - సరే, పిలవగలను అని వారికి చెప్పండి ఎందుకంటే వారు - ఏ రాజయోగము ద్వారానైతే భారత్ స్వర్గముగా తయారయ్యిందో, ఆ ప్రాచీన రాజయోగము గురించి తెలుసుకోవాలని అనుకుంటున్నారు. ఈ విషయాన్ని వారికి ఎవరైనా అర్థం చేయించాలి. దీని గురించి సన్యాసులు ఏం వినిపించగలరు? స్పిరిచ్యుల్ నాలెడ్జ్ కేవలం గీతలోనే ఉంది. కావున వారు వెళ్ళి ఆ గీతనే వినిపిస్తారు. ఆ గీతను ఎంత మంది చదువుతారు, కంఠస్థం చేస్తూ ఉంటారు. మరి ఆ గీతలో ఉన్నది స్పిరిచ్యుల్ నాలెడ్జ్ యా? అది మనిషి పేరు మీద తయారుచేయబడింది. స్పిరిచ్యుల్ నాలెడ్జ్ ను మనుష్యులు ఇవ్వలేరు. ఇప్పుడు మీరు తేడాను అర్థం చేసుకుంటారు - ఆ గీతకు మరియు బాబా ఏదైతే వినిపిస్తారో దానికి రాత్రికి పగలుకు ఉన్నంత తేడా ఉంది. స్పిరిచ్యుల్ నాలెడ్జ్ ను ఇచ్చింది ఫాదర్ కానీ పేరు శ్రీకృష్ణునిది వేసారు. సత్యయుగంలో శ్రీకృష్ణునికి ఈ జ్ఞానము లేదు. తండ్రియే నాలెడ్జ్ ఫుల్. ఇవి ఎంత గమ్మత్తు అయిన విషయాలు. శ్రీకృష్ణుని ఆత్మ సత్యయుగంలో ఉన్నప్పుడు జ్ఞానము లేదు. దారము ఎంతగా చిక్కు పడిపోయి ఉంది. వీరందరూ విదేశాలకు వెళ్ళి పేరును ప్రసిద్ధి చేయగలరు, భాషణ చేయగలరు. ప్రపంచ చరిత్ర-భూగోళాల జ్ఞానాన్ని మేము మీకు ఇవ్వగలమని చెప్పండి. భగవంతుడు హెవెన్ ను ఎలా స్థాపన చేస్తారు, అది హెవెన్ నుండి మళ్ళీ హెల్ గా ఎలా తయారవుతుంది అనేది మేము మీకు అర్థం చేయిస్తాము. ఇవి కూర్చొని వ్రాయండి, నేను ఏ పాయింటును మర్చిపోలేదు కదా అని చూసుకోండి. మళ్ళీ గుర్తు తెచ్చుకొని వ్రాయండి. ఈ విధముగా ప్రాక్టీస్ చేసినట్లయితే చాలా బాగా వ్రాయగలరు, చాలా బాగా అర్థం చేయించినట్లయితే పేరు ప్రసిద్ధమవుతుంది. ఇక్కడి నుండి కూడా బాబా ఎవరినైనా బయటకు (విదేశాలకు) పంపించగలరు. వీరు (జయంతి బెహెన్) వెళ్ళి అర్థం చేయిస్తే చాలా బాగుంటుంది. 7 రోజుల్లోనే చాలా తెలివైనవారిగా అవ్వొచ్చు. బుద్ధిలో ధారణ చేయాలి, బీజం మరియు వృక్షం గురించి వివరంగా అర్థం చేయించాలి. చిత్రాలపై చాలా బాగా అర్థం చేయించవచ్చు. సేవ పట్ల అభిరుచి ఉండాలి. చాలా ఉన్నత పదవి లభిస్తుంది. జ్ఞానము చాలా సహజము. ఇది పాత ఛీ-ఛీ ప్రపంచము. స్వర్గముతో పోలిస్తే ఈ పాత ప్రపంచము పేడ వంటిది, దీని నుండి దుర్గంధం వస్తుంది. అది బంగారు ప్రపంచము, ఇది పేడ వంటి ప్రపంచము. పిల్లలైన మీకు తెలుసు - ఇప్పుడు మనము ఈ శరీరాన్ని వదిలి వెళ్ళి రాకుమారులు-రాకుమారీలుగా అవుతాము. అటువంటి స్కూలులో చదువుకునేందుకు వెళ్తాము. అక్కడ ఫుల్ ప్రూఫ్ గా (పూర్తి సురక్షితంగా) ఉండే విమానాలు ఉంటాయి. పిల్లలకు లోలోపల ఈ సంతోషము ఉన్నట్లయితే ఎప్పుడూ ఏ విషయంలోనూ ఏడుపు రాదు. మేము రాకుమారులు-రాకుమారీలుగా అవుతామని మీకు అర్థం అవుతుంది కదా. మరి మీకు లోలోపల సంతోషమనేది ఎందుకు ఉండడము లేదు. మనము భవిష్యత్తులో ఇటువంటి స్కూలుకు వెళ్తాము, ఇలా-ఇలా చేస్తాము. ఎందుకు మర్చిపోతున్నాము అనేది పిల్లలు తెలియదు. చాలా నషా ఎక్కాలి. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఈ పాత ఛీ-ఛీ పేడ సమానమైన ప్రపంచాన్ని బుద్ధి ద్వారా మర్చిపోయి, సత్యయుగీ ప్రపంచాన్ని స్మృతి చేస్తూ అపారమైన సంతోషంలో మరియు నషాలో ఉండాలి. ఎప్పుడూ ఏడవకూడదు.

2. తండ్రి ఏవైతే గుహ్యమైన, రమణీకమైన విషయాలను వినిపిస్తారో, వాటిని ధారణ చేసి అందరికీ అర్థం చేయించాలి. స్పిరిచ్యుల్ లీడర్ అనే టైటిల్ ను తీసుకోవాలి.

వరదానము:-
స్వమానంలో స్థితులై ఉంటూ దేహాభిమానాన్ని సమాప్తం చేసే సఫలతా మూర్త భవ

ఏ పిల్లలైతే స్వమానంలో స్థితులై ఉంటారో, వారే తండ్రి యొక్క ప్రతి ఆజ్ఞను సహజంగా పాలన చేయగలరు. స్వమానము రకరకాల దేహాభిమానాన్ని సమాప్తము చేస్తుంది. కానీ స్వమానంలో నుండి ఎప్పుడైతే స్వ అనే పదాన్ని మర్చిపోతారో, అప్పుడు గౌరవ-ప్రతిష్టలలోకి వస్తారు, ఒక్క పదం యొక్క పొరపాటుతో అనేక పొరపాట్లు జరగడం మొదలవుతాయి. అందుకే శ్రమ ఎక్కువ మరియు ప్రత్యక్ష ఫలం తక్కువగా లభిస్తుంది. కానీ సదా స్వమానంలో స్థితులై ఉన్నట్లయితే పురుషార్థంలో మరియు సేవలో సహజంగానే సఫలతా మూర్తులుగా అవుతారు.

స్లోగన్:-
తపస్య చేయాలంటే సమయాన్ని పొదుపు చేయండి, సాకులు చెప్పకండి.

అవ్యక్త ప్రేరణలు - ఇప్పుడు మీ దాత స్వరూపాన్ని ప్రత్యక్షము చేయండి

ఎంతగా దాతగా అవుతారో అంతగా నిండుతూ ఉంటుంది. భండారా నిండుగా ఉన్నప్పుడు మరి దాతగా ఎందుకు అవ్వకూడదు! అటువంటివారినే నిరంతర ఆత్మిక సేవాధారులు అని అంటారు. విశ్వ మహారాజుగా అయ్యేందుకు కేవలం జ్ఞాన దాతగానే అవ్వటము కాదు, దాని కోసం స్నేహాన్ని మరియు సహయోగాన్ని కూడా ఇవ్వాలి. ఒకవేళ ఈ హై జంప్ చేసినట్లయితే ఇక అన్ని విషయాలలోనూ సహజముగానే శ్రేష్ఠముగా అవుతారు.