23-10-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - తండ్రి పిల్లలైన మీకు ఈదడం
నేర్పించడానికి వచ్చారు, దీని ద్వారా మీరు ఈ ప్రపంచాన్ని దాటి వెళ్ళిపోతారు, మీ కోసం
ప్రపంచమే మారిపోతుంది’’
ప్రశ్న:-
ఎవరైతే
తండ్రికి సహాయకులుగా అవుతారో, వారికి ఆ సహాయానికి రిటర్న్ లో ఏమి ప్రాప్తిస్తుంది?
జవాబు:-
ఏ పిల్లలైతే
ఇప్పుడు తండ్రికి సహాయకులుగా అవుతారో, వారిని తండ్రి ఏ విధంగా తయారుచేస్తారంటే, వారు
అర్ధకల్పము ఎవరి సహాయాన్ని కానీ లేక సలహాను కానీ తీసుకోవాల్సిన అవసరమే ఉండదు. వారు
ఎంత గొప్ప తండ్రి, వారంటారు - పిల్లలూ, మీరు నాకు సహాయకులుగా అవ్వకపోతే నేను స్వర్గ
స్థాపనను ఎలా చేస్తాను.
ఓంశాంతి
మధురాతి మధురమైన, నంబరువారు అతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి అర్థం
చేయిస్తున్నారు ఎందుకంటే చాలామంది పిల్లలు తెలివితక్కువవారిగా అయిపోయారు. రావణుడు
చాలా తెలివితక్కువవారిగా తయారుచేసేశాడు. ఇప్పుడు మనల్ని ఎంత తెలివైనవారిగా
తయారుచేస్తున్నారు. ఎవరైనా ఐ.సి.ఎస్ పరీక్షను పాస్ అయితే చాలా పెద్ద పరీక్ష పాస్
అయ్యారని భావిస్తారు. ఇప్పుడు మీరు ఎంత పెద్ద పరీక్షను పాస్ అవుతారో చూడండి. కొంచెం
ఆలోచించండి, చదివిస్తున్నవారు ఎవరు! చదువుకుంటున్నవారు ఎవరు! మేము కల్ప-కల్పము ప్రతి
5 వేల సంవత్సరాల తర్వాత తండ్రి, టీచరు, సద్గురువును మళ్ళీ కలుస్తూనే ఉంటామని ఈ
నిశ్చయము కూడా ఉంది. మనము ఉన్నతోన్నతమైన తండ్రి ద్వారా ఎంత ఉన్నతమైన వారసత్వాన్ని
పొందుతాము అనేది కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు. టీచరు కూడా చదివించి,
వారసత్వాన్ని ఇస్తారు కదా. మిమ్మల్ని కూడా చదివించి, మీరు కొత్త ప్రపంచంలో రాజ్యం
చేసేందుకని మీ కోసం ప్రపంచాన్నే పరివర్తన చేసేస్తారు. భక్తి మార్గములో ఎంతగా మహిమను
పాడుతారు. మీరు వారి ద్వారా మీ వారసత్వాన్ని పొందుతున్నారు. పాత ప్రపంచము మారుతోందని
కూడా పిల్లలైన మీకు తెలుసు. మనమందరము శివబాబా పిల్లలమని మీరంటారు. పాత ప్రపంచాన్ని
కొత్తదిగా తయారుచేసేందుకు తండ్రికి కూడా రావలసి ఉంటుంది. బ్రహ్మా ద్వారా కొత్త
ప్రపంచ స్థాపన అని త్రిమూర్తి చిత్రములో కూడా చూపిస్తారు కావున తప్పకుండా బ్రహ్మా
ముఖవంశావళి బ్రాహ్మణ-బ్రాహ్మణీలు కావాలి. బ్రహ్మా అయితే కొత్త ప్రపంచాన్ని స్థాపన
చేయరు. తండ్రి మాత్రమే రచయిత. నేను వచ్చి యుక్తిగా పాత ప్రపంచాన్ని వినాశనము చేయించి
కొత్త ప్రపంచాన్ని తయారుచేస్తాను అని తండ్రి అంటారు. కొత్త ప్రపంచ నివాసులు చాలా
కొద్దిమంది మాత్రమే ఉంటారు. జన సంఖ్యను తగ్గించాలని గవర్నమెంట్ ప్రయత్నిస్తూ ఉంటుంది
కానీ ఇప్పుడు అది తగ్గదు. యుద్ధాలలో కోట్లాదిమంది మనుష్యులు మరణిస్తారు, అయినా
మనుష్యుల సంఖ్య తగ్గదు, జనసంఖ్య అయితే ఇంకా పెరుగుతూనే ఉంటుంది. ఇది కూడా మీకు
తెలుసు. మీ బుద్ధిలో విశ్వము యొక్క ఆదిమధ్యాంతాల జ్ఞానముంది. మీరు స్వయాన్ని
విద్యార్థులుగా కూడా భావిస్తారు. మీరు ఈదడం కూడా నేర్చుకుంటారు. నా నావను తీరానికి
చేర్చండి అని అంటారు కదా. ఈదడం నేర్చుకున్నవారు చాలా ప్రసిద్ధమవుతారు. ఇప్పుడు మీ
ఈదడం ఎలా ఉందో చూడండి, పూర్తిగా పైకి వెళ్ళిపోతారు, మళ్ళీ ఇక్కడకు వస్తారు. అక్కడ
వారు ఇన్ని మైళ్ళు పైకి వెళ్ళినట్లుగా చూపిస్తారు. ఆత్మలైన మీరు ఎన్ని మైళ్ళు పైకి
వెళ్తారు. అది స్థూలమైన లెక్క, దానిని లెక్కపెడతారు. మీది అయితే లెక్కించలేనంత ఉంది.
ఆత్మలమైన మనము మన ఇంటికి వెళ్ళిపోతామని మీకు తెలుసు, అక్కడ సూర్య చంద్రులు మొదలైనవి
ఉండవు. అది మన ఇల్లు అని మీకు సంతోషముంది. మనము అక్కడి నివాసులము. మనుష్యులు
ముక్తిధామానికి వెళ్ళడం కోసమని భక్తి చేస్తారు, పురుషార్థము చేస్తారు. కానీ ఎవ్వరూ
వెళ్ళలేరు. ముక్తిధామములో భగవంతుడిని కలుసుకునేందుకు ప్రయత్నిస్తారు. అనేక రకాల
ప్రయత్నాలు చేస్తారు. జ్యోతులైన మేము జ్యోతిలో లీనమైపోవాలి అని కొంతమంది అంటారు.
కొంతమంది ముక్తిధామానికి వెళ్ళాలి అని అంటారు. ముక్తిధామము గురించి ఎవ్వరికీ తెలియదు.
బాబా వచ్చి ఉన్నారని, వారు మన ఇంటికి తీసుకువెళ్తారని పిల్లలైన మీకు తెలుసు.
మధురాతి-మధురమైన బాబా వచ్చి ఉన్నారు, వారు మనల్ని ఇంటికి తీసుకువెళ్ళేందుకు
యోగ్యులుగా తయారుచేస్తున్నారు. దీని కోసం అర్ధకల్పము పురుషార్థము చేస్తున్నా కూడా
యోగ్యులుగా అవ్వలేకపోయారు. ఎవ్వరూ జ్యోతిలో లీనమవ్వలేకపోయారు, ముక్తిధామానికి
వెళ్ళలేకపోయారు, మోక్షాన్ని పొందలేకపోయారు. ఏదైతే పురుషార్థము చేసారో, అది వృధా
అయ్యింది. ఇప్పుడు బ్రాహ్మణ కులభూషణులైన మీ పురుషార్థము సత్యమైనదని ఋజువవుతుంది. ఈ
ఆట ఎలా తయారై ఉంది. మిమ్మల్ని ఇప్పుడు ఆస్తికులని అంటారు. తండ్రి గురించి మీకు బాగా
తెలుసు మరియు తండ్రి ద్వారా సృష్టి చక్రాన్ని కూడా తెలుసుకున్నారు. తండ్రి
చెప్తున్నారు, ముక్తి-జీవన్ముక్తుల జ్ఞానము ఎవ్వరిలోనూ లేదు, దేవతలలో కూడా లేదు.
తండ్రి గురించి ఎవ్వరికీ తెలియనప్పుడు ఇక ఎవరైనా ఎవరినైనా ఎలా తీసుకువెళ్తారు.
ఎంతమంది గురువులు ఉన్నారు, ఎంతమంది వారికి ఫాలోవర్స్ గా అవుతారు. సత్యాతి-సత్యమైన
సద్గురువు శివబాబా. వారికైతే పాదాలు లేవు. నాకు చరణాలు లేవు, నేను నాకు ఎలా పూజ
చేయించుకోగలను అని అంటారు. పిల్లలు విశ్వానికి యజమానులుగా అవుతారు, వారి చేత పూజ
చేయించుకుంటానా. భక్తి మార్గములో పిల్లలు తండ్రి పాదాలకు నమస్కరిస్తారు. వాస్తవానికి
తండ్రి ఆస్తికి యజమానులు పిల్లలే. కానీ నమ్రతతో అలా చేస్తారు. చిన్న పిల్లలు
మొదలైనవారందరూ వెళ్ళి పాదాలకు నమస్కరిస్తారు. ఇక్కడ తండ్రి అంటారు, పాదాలపై పడడం
నుండి కూడా మిమ్మల్ని విడిపిస్తాను. వారు ఎంత గొప్ప తండ్రి. వారు అంటారు, పిల్లలైన
మీరు నాకు సహాయకులు. మీరు సహాయకులుగా అవ్వకపోతే నేను స్వర్గ స్థాపన ఎలా చేస్తాను.
తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, ఇప్పుడు మీరు సహాయకులుగా అవ్వండి, తర్వాత
నేను మిమ్మల్ని ఎలా తయారుచేస్తానంటే, ఇక మీరు ఎవ్వరి సహాయము తీసుకోవలసిన అవసరము
ఉండదు. మీకు ఎవ్వరి సలహా కూడా అవసరముండదు. ఇక్కడ తండ్రి పిల్లల సహాయము
తీసుకుంటున్నారు. వారు అంటారు - పిల్లలూ, ఇప్పుడు ఛీ-ఛీగా అవ్వకండి, మాయతో ఓడిపోకండి,
లేదంటే పేరును అప్రతిష్టపాలు చేసేస్తారు. బాక్సింగ్ జరిగినప్పుడు అందులో
గెలిచినవారిని వాహ్-వాహ్ అని అంటారు. ఓడిపోయినవారి ముఖము పాలిపోతుంది. ఇక్కడ కూడా
ఓడిపోతారు. ఇక్కడ ఓడిపోయినవారిని నల్ల ముఖము చేసుకున్నారని అంటారు. వచ్చింది తెల్లగా
తయారయ్యేందుకు, కానీ తర్వాత ఏం చేస్తున్నారు. చేసుకున్న సంపాదనంతా సమాప్తమైపోతుంది,
మళ్ళీ కొత్తగా ప్రారంభించవలసి ఉంటుంది. తండ్రికి సహాయకులుగా అయి మళ్ళీ ఓడిపోయి
పేరును అప్రతిష్టపాలు చేసేస్తారు. రెండు పార్టీలు ఉన్నాయి. ఒకరు, మాయకు బానిసలు,
ఒకరు ఈశ్వరునికి చెందినవారు. మీరు తండ్రిని ప్రేమిస్తారు. వినాశన కాలములో విపరీత
బుద్ధి అని గాయనము కూడా ఉంది. మీది ప్రీతి బుద్ధి. కావున మీరు పేరును అప్రతిష్టపాలు
చేయకూడదు. ప్రీతి బుద్ధి కలవారైన మీరు మళ్ళీ మాయతో ఎందుకు ఓడిపోతారు. ఓడిపోయేవారికి
దుఃఖము కలుగుతుంది. గెలిచినవారికి వాహ్-వాహ్ అంటూ చప్పట్లు కొడతారు. మేము అయితే
పహల్వాన్లము అని పిల్లలైన మీరు భావిస్తారు. ఇప్పుడు మాయపై తప్పకుండా గెలవాలి. తండ్రి
అంటారు, దేహ సహితముగా ఏదైతే చూస్తారో, వాటన్నిటినీ మర్చిపోండి, నన్నొక్కరినే స్మృతి
చేయండి. మాయ మిమ్మల్ని సతోప్రధానము నుండి తమోప్రధానముగా చేసేసింది. ఇప్పుడు మళ్ళీ
సతోప్రధానముగా అవ్వాలి. మాయాజీతులుగా, జగత్ జీతులుగా అవ్వాలి. ఇది ఉన్నదే
గెలుపు-ఓటముల, సుఖ-దుఃఖాల ఆట. రావణ రాజ్యములో ఓడిపోతారు. ఇప్పుడు తండ్రి మళ్ళీ
విలువైనవారిగా చేస్తున్నారు. ఒక్క శివబాబా జయంతి మాత్రమే విలువైనదని బాబా అర్థము
చేయించారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఈ విధముగా లక్ష్మీ-నారాయణులుగా తయారవ్వాలి. అక్కడ
ఇంటింటిలోనూ దీపావళి ఉంటుంది, అందరి జ్యోతులు వెలుగుతాయి. మెయిన్ పవర్ తో జ్యోతి
వెలుగుతుంది. బాబా ఎంత సహజ రీతిలో కూర్చుని అర్థము చేయిస్తారు. తండ్రి తప్ప మధురాతి
మధురమైన చాలా కాలం దూరమై ఇప్పుడు కలిసిన ప్రియమైన పిల్లలూ అని ఎవరంటారు. ఆత్మిక
తండ్రి మాత్రమే అంటారు - ఓ నా మధురమైన ప్రియమైన పిల్లలూ, మీరు అర్ధకల్పము నుండి
భక్తి చేస్తూ వచ్చారు, ఒక్కరు కూడా తిరిగి వెళ్ళలేరు. తండ్రియే వచ్చి అందరినీ
తీసుకువెళ్తారు.
తండ్రి ఎలా వచ్చి ఆత్మలందరినీ తీసుకువెళ్తారు అనేది మీరు సంగమయుగములో బాగా అర్థము
చేయించగలరు. ప్రపంచములో ఈ అనంతమైన నాటకము గురించి ఎవ్వరికీ తెలియదు, ఇది అనంతమైన
డ్రామా. ఇది కూడా మీరు అర్థము చేసుకుంటారు, ఇది ఇంకెవ్వరూ చెప్పలేరు. ఒకవేళ దీనిని
అనంతమైన డ్రామా అని అంటే, మరి డ్రామా గురించి ఎలా వర్ణించగలరు. ఇక్కడ మీకు 84 జన్మల
చక్రము గురించి తెలుసు. పిల్లలైన మీరు తెలుసుకున్నారు, మీరే స్మృతి చేయాలి. తండ్రి
ఎంత సహజముగా తెలియజేస్తున్నారు. భక్తి మార్గములో మీరు ఎన్ని ఎదురుదెబ్బలు తిన్నారు.
స్నానం చేసేందుకని మీరు ఎంత దూరాలకు వెళ్తారు. ఒక సరోవరము ఉంది, అందులో మునకలు
వేస్తే దేవతలుగా అవుతారని అంటారు. ఇప్పుడు మీరు జ్ఞానసాగరునిలో మునకలు వేసి దేవతలుగా
అవుతారు. ఎవరైనా బాగా ఫ్యాషన్ గా అలంకరించుకుంటే, వీరు దేవకన్య వలె ఉన్నారని అంటారు.
ఇప్పుడు మీరు కూడా రత్నాలుగా అవుతున్నారు. అంతేకానీ మనుష్యులకు ఎగరడానికి రెక్కలు
మొదలైనవి ఉండవు. అలా ఎగరలేరు. అలా ఎగిరేది ఆత్మనే. ఆత్మను రాకెట్ అని కూడా అంటారు,
ఆత్మ ఎంత చిన్నదిగా ఉంటుంది. ఆత్మలన్నీ వెళ్ళేటప్పుడు పిల్లలైన మీకు సాక్షాత్కారము
కూడా జరగవచ్చు. మీరు బుద్ధి ద్వారా అర్థము చేసుకోగలరు, ఇక్కడ మీరు వర్ణించవచ్చు - ఏ
విధముగా వినాశనాన్ని చూడడం జరుగుతుందో, అదే విధముగా ఆత్మల గుంపు ఎలా వెళ్తుందో కూడా
చూడవచ్చు. హనుమంతుడు, గణేశుడు మొదలైనవారైతే లేరు. కానీ వారి భావన అనుసారముగా
సాక్షాత్కారమవుతుంది. బాబా అయితే ఒక బిందువు వంటివారు, వారినేమని వర్ణిస్తారు. వారు
చిన్న నక్షత్రము వంటివారని, వారిని ఈ నేత్రాలతో చూడలేమని కూడా అంటారు. శరీరము ఎంత
పెద్దది, దీనితో కర్మలు చేయాలి. ఆత్మ ఎంత చిన్ననిది, అందులో 84 జన్మల చక్రము
నిశ్చితమై ఉంది. మనము 84 జన్మలు ఎలా తీసుకుంటాము అనేది మనుష్యులలో ఒక్కరి బుద్ధిలో
కూడా లేదు. ఆత్మలో పాత్ర ఎలా నిండి ఉంది అనేది అద్భుతము. ఆత్మయే శరీరము తీసుకుని
పాత్రను అభినయిస్తుంది. అది హద్దులోని నాటకము, ఇది అనంతమైన నాటకము. అనంతమైన తండ్రి
స్వయంగా వచ్చి తమ పరిచయాన్ని ఇస్తారు. మంచి సర్వీసబుల్ పిల్లలెవరైతే ఉన్నారో, వారు
- ఎవరికి ఎలా అర్థం చేయించాలి అని విచార సాగర మంథనము చేస్తూ ఉంటారు. ఎంతగా మీరు
ఒక్కొక్కరి వెనుక కష్టపడుతుంటారు. అయినా సరే, బాబా, మాకు అర్థము కావటం లేదు అని
అంటారు. ఎవరైనా చదవకపోతే, వీరు రాతి బుద్ధికలవారు అని అంటారు. ఇక్కడ కూడా కొంతమంది
7 రోజులలోనే చాలా సంతోషముగా - బాబా వద్దకు వెళ్తాము అని అనడం మీరు చూస్తుంటారు.
కొంతమందైతే ఏమీ అర్థము చేసుకోరు. మనుష్యులైతే - రాతి బుద్ధి, పారస బుద్ధి అని కేవలం
అంటూ ఉంటారు కానీ అర్థము తెలియదు. ఆత్మ పవిత్రముగా అయినప్పుడు పారసనాథునిగా అవుతుంది.
పారసనాథ్ మందిరము కూడా ఉంది. మందిరమంతా బంగారముతో తయారుచేయబడి ఉండదు కానీ పైన
కొద్దిగా బంగారము పూస్తారు. మనకు తోట యజమాని లభించారని, వారు ముళ్ళ నుండి పుష్పాలుగా
అయ్యే యుక్తిని తెలియజేస్తున్నారని పిల్లలైన మీకు తెలుసు. అల్లాహ్ యొక్క పుష్పాల
తోట అని గాయనము కూడా ఉంది కదా. ప్రారంభములో మీ వద్ద ఒక ముస్లిమ్ ధ్యానములోకి
వెళ్ళేవారు - అతను, ఖుదా నాకు పుష్పాలు ఇచ్చారు అని చెప్పేవారు. నిలబడి-నిలబడే
ఉన్నట్లుండి పడిపోయేవారు, అతను ఖుదా యొక్క పుష్పాల తోటను చూసేవారు. ఇప్పుడు ఖుదా
యొక్క పుష్పాల తోటనైతే స్వయంగా ఖుదాయే చూపిస్తారు. ఇతరులెవరైనా ఎలా చూపించగలరు. మీకు
వైకుంఠాన్ని సాక్షాత్కారము చేయిస్తారు. మిమ్మల్ని ఖుదాయే అక్కడికి తీసుకువెళ్తారు.
కానీ వారు స్వయం అక్కడ ఉండరు. ఖుదా శాంతిధామములో ఉంటారు. వారు మిమ్మల్ని వైకుంఠానికి
యజమానులుగా చేస్తారు. ఎంత మంచి-మంచి విషయాలను అర్థము మీరు చేసుకుంటారు. సంతోషము
కలుగుతుంది. ఇప్పుడు మేము సుఖధామములోకి వెళ్తాము అని లోలోపల చాలా సంతోషముండాలి.
అక్కడ దుఃఖము యొక్క విషయాలేవీ ఉండవు. తండ్రి అంటారు, సుఖధామాన్ని, శాంతిధామాన్ని
స్మృతి చేయండి. ఇంటిని ఎందుకు స్మృతి చేయరు. ఆత్మ ఇంటికి వెళ్ళడానికి ఎంతగా
కష్టపడుతుంది. జప-తపాదులు మొదలైన శ్రమ చాలా చేస్తారు కానీ ఎవ్వరూ వెళ్ళలేకపోతారు.
వృక్షము నుండి ఆత్మలు నంబరువారుగా వస్తూ ఉంటారు, మళ్ళీ మధ్యలో ఎలా వెళ్తారు. తండ్రి
ఇక్కడే ఉన్నప్పుడు ఆత్మలు ఎలా వెళ్తారు. శాంతిధామాన్ని మరియు సుఖధామాన్ని స్మృతి
చేయమని పిల్లలైన మీకు రోజూ అర్థం చేయిస్తూ ఉంటారు. తండ్రిని మర్చిపోయిన కారణముగానే
దుఃఖితులుగా అవుతారు. మాయతో దెబ్బలు తింటారు. ఇప్పుడు కొంచెము కూడా దెబ్బలు తినకూడదు.
మూలము దేహాభిమానము.
ఓ పతిత-పావనా రండి, అని ఇప్పటివరకు ఏ తండ్రినైతే మీరు స్మృతి చేస్తూ ఉండేవారో, ఆ
తండ్రి ద్వారా మీరు చదువుకుంటున్నారు. వారు మీకు విధేయత గల సేవకుడు మరియు టీచరు కూడా.
తండ్రి కూడా విధేయత గల సేవకుడు. గొప్పవారు ఎప్పుడూ విధేయత గల సేవకుడు అని సంతకము
చేస్తారు. తండ్రి అంటారు, పిల్లలైన మీకు నేను కూర్చుని ఎలా అర్థము చేయిస్తున్నానో
చూడండి. సుపుత్రులైన పిల్లలపైనే తండ్రికి ప్రేమ ఉంటుంది. కుపుత్రులు ఎవరైతే ఉంటారో
అనగా ఎవరైతే తండ్రికి చెందినవారిగా అయి మళ్ళీ ద్రోహులుగా అయిపోతారో, వికారాల్లోకి
వెళ్తారో, అటువంటి పిల్లలు జన్మించకుండా ఉంటేనే బాగుండేది అని తండ్రి అంటారు. ఒక్కరి
కారణముగా ఎంతగా పేరు అప్రతిష్టపాలు అవుతుంది. ఎంతమందికి కష్టమవుతుంది. ఇక్కడ మీరు
ఎంత ఉన్నతమైన పని చేస్తున్నారు. మీరు విశ్వాన్ని ఉద్ధరిస్తున్నారు కానీ మీకు 3
అడుగుల నేల కూడా లభించదు. పిల్లలైన మీరు ఎవ్వరినీ ఇళ్ళు-వాకిళ్ళ నుండి విడిపించరు.
మీరైతే రాజులకు కూడా ఇలా చెప్తారు - మీరు పూజ్యులుగా, డబల్ కిరీటధారులుగా ఉండేవారు,
ఇప్పుడు పూజారులుగా అయ్యారు, ఇప్పుడు తండ్రి మళ్ళీ పూజ్యులుగా తయారుచేస్తున్నారు
కావున అలా తయారవ్వాలి కదా. ఇంకా కొద్దిగా ఆలస్యముంది. మనము ఇక్కడ ఎవరి నుండైనా
లక్షలు తీసుకొని ఏం చేస్తాము. పేదవారికి రాజ్యము లభించేది ఉంది. తండ్రి పేదల
పెన్నిధి కదా. తండ్రిని పేదల పెన్నిధి అని ఎందుకు అంటారో మీరు అర్థ సహితముగా అర్థము
చేసుకున్నారు. భారత్ కూడా ఎంత పేదగా ఉంది, అందులో కూడా మీరు నిరుపేద మాతలు.
షావుకారులు ఈ జ్ఞానాన్ని తీసుకోలేరు. పేద అబలలు ఎంతమంది వస్తారు, వారిపై అత్యాచారాలు
జరుగుతాయి. తండ్రి అంటారు, మాతలను ముందుకు తీసుకువెళ్ళాలి. ప్రభాత యాత్రలో కూడా
ముందు మాతలే ఉండాలి. మీ ఈ బ్యాడ్జి కూడా ఫస్ట్ క్లాస్ అయినది. ఈ ట్రాన్స్ లైట్
చిత్రము మీ ఎదురుగా ఉండాలి. ప్రపంచము మారుతోందని అందరికీ వినిపించండి. తండ్రి నుండి
కల్పక్రితము వలె వారసత్వము లభిస్తుంది. సేవను ఎలా అమలులోకి తీసుకురావాలి అని పిల్లలు
విచార సాగర మంథనము చేయాలి. సమయమైతే పడుతుంది కదా. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రిపై పూర్తి ప్రీతిని ఉంచి సహాయకులుగా అవ్వాలి. మాయతో ఓడిపోయి ఎప్పుడూ
పేరును అప్రతిష్ఠపాలు చేయకూడదు. పురుషార్థము చేసి దేహ సహితముగా ఏదైతే కనిపిస్తుందో,
దానిని మర్చిపోవాలి.
2. ఇప్పుడు మేము శాంతిధామానికి, సుఖధామానికి వెళ్తామని లోలోపల సంతోషముండాలి. బాబా
విధేయత కల టీచర్ గా అయి మనల్ని ఇంటికి తీసుకువెళ్ళేందుకు యోగ్యులుగా తయారుచేస్తారు.
యోగ్యులుగా, సుపుత్రులుగా అవ్వాలి, కుపుత్రులుగా అవ్వకూడదు.
వరదానము:-
ప్రతి సంకల్పము, సమయము, వృత్తి మరియు కర్మ ద్వారా సేవ చేసే
నిరంతర సేవాధారీ భవ
ఏ విధముగా తండ్రి అత్యంత ప్రియముగా అనిపిస్తారో, తండ్రి
లేకుండా జీవితము లేదో, అదే విధముగా సేవ లేకుండా జీవితము లేదు. నిరంతర యోగులుగా
అవ్వడముతో పాటు నిరంతర సేవాధారులుగా అవ్వండి. నిద్రిస్తూ ఉన్నా కూడా సేవ జరగాలి.
నిద్రించే సమయములో ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని చూసినట్లయితే మీ ముఖము ద్వారా శాంతి,
ఆనందము యొక్క వైబ్రేషన్స్ అనుభవము చెయ్యాలి. ప్రతి కర్మేంద్రియము ద్వారా తండ్రి
స్మృతిని ఇప్పించే సేవను చేస్తూ ఉండండి. మీ శక్తిశాలి వృత్తి ద్వారా వైబ్రేషన్స్ ను
వ్యాపింపజేస్తూ ఉండండి, కర్మల ద్వారా కర్మయోగీ భవ అనే వరదానాన్ని ఇస్తూ ఉండండి,
ప్రతి అడుగులో పదమాల సంపాదనను జమ చేస్తూ ఉండండి, అప్పుడు నిరంతర సేవాధారీ అనగా
సర్వీసబుల్ అని అంటారు.
స్లోగన్:-
మీ
ఆత్మిక పర్సనాలిటీని స్మృతిలో ఉంచుకున్నట్లయితే మాయాజీతులుగా అవుతారు.
అవ్యక్త సూచనలు -
స్వయము కొరకు మరియు సర్వుల కొరకు మనసు ద్వారా యోగ శక్తులను ప్రయోగము చేయండి
ఏ విధముగా వాణి యొక్క ప్రాక్టీస్చేస్తూ-చేస్తూ వాణిలో శక్తిశాలిగా అయ్యారో, అదే
విధముగా శాంతి శక్తి యొక్క అభ్యాసకులుగా అవుతూ వెళ్ళండి. మున్ముందు వాణి మరియు
స్థూల సాధనాల ద్వారా సేవ చేసేందుకు సమయము లభించదు. అటువంటి సమయములో శాంతి శక్తి
యొక్క సాధనాలు అవసరమవుతాయి ఎందుకంటే ఏదైతే మహాన్ శక్తిశాలిగా ఉంటుందో అది అంతగానే
అతి సూక్ష్మముగా ఉంటుంది. కనుక వాణి కన్నా శుద్ధ సంకల్పాలు సూక్ష్మమైనవి, అందుకే
సూక్ష్మముగా ఉన్నదాని ప్రభావము శక్తిశాలిగా ఉంటుంది.
| | | |