24-02-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు మీ జీవితమనే దారాన్ని ఒక్క
తండ్రితో ముడి వేసారు, మీ కనెక్షన్ ఒక్కరితోనే ఉంది, ఒక్కరితోనే తోడును
నిర్వర్తించాలి’’
ప్రశ్న:-
సంగమయుగములో ఆత్మ తన దారాన్ని పరమాత్మతో ముడి వేస్తుంది, అజ్ఞానములో ఇది ఏ ఆచారముగా
కొనసాగుతూ వస్తుంది?
జవాబు:-
వివాహ సమయములో
స్త్రీ కొంగును పతికి ముడి పెడతారు. జీవితాంతము అతనికే సహచరిణిగా అయ్యి ఉండాలని
స్త్రీ భావిస్తుంది. మీరు ఇప్పుడు మీ కొంగును తండ్రితో ముడి వేసారు. మన పాలన
అర్ధకల్పము కోసం తండ్రి ద్వారా జరుగుతుందని మీకు తెలుసు.
పాట:-
జీవితమనే
దారాన్ని నీతోనే ముడి వేసుకున్నాను...
ఓంశాంతి
చూడండి, జీవితమనే దారాన్ని నీతోనే ముడి వేసుకున్నానని పాటలో అన్నారు. ఉదాహరణకు ఒక
కన్య, తన జీవితమనే దారాన్ని పతితో ముడి వేసుకుంటుంది. ఆమె జీవితాంతము అతనికే
సహచరిణిగా అయ్యి ఉండాలని, అతనే ఆమెను చూసుకోవాలని భావిస్తుంది. ఒక కన్య ఆమె పతిని
చూసుకోవాలని కాదు, అలా కాదు, పతి జీవితాంతము ఆమెను చూసుకోవాలి. పిల్లలైన మీరు కూడా
మీ జీవిత దారాన్ని ముడి వేసారు. అనంతమైన తండ్రి అనండి, టీచరు అనండి, గురువు అనండి
ఏమన్నా అనండి..... ఆత్మల జీవిత దారాన్ని పరమాత్మునితో ముడి వేయాలి. అది హద్దు యొక్క
స్థూలమైన విషయము, ఇది సూక్ష్మమైన విషయము. కన్య యొక్క జీవితమనే దారాన్ని పతితో ముడి
వేయడము జరుగుతుంది. ఆమె అతని ఇంటికి వెళ్తుంది. చూడండి, ప్రతి విషయాన్ని అర్థం
చేసుకునే బుద్ధి కావాలి. కలియుగములో అన్నీ ఆసురీ మతానికి సంబంధించిన విషయాలు ఉన్నాయి.
మనము మన జీవితమనే దారాన్ని ఒక్కరితోనే ముడి వేసుకున్నామని మీకు తెలుసు. మీ కనెక్షన్
ఒక్కరితోనే ఉంది. ఒక్కరితోనే తోడు నిర్వర్తించాలి ఎందుకంటే వారి నుండి మనకు చాలా
మంచి సుఖము లభిస్తుంది. వారు మనల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తారు. కావున
ఇటువంటి తండ్రి శ్రీమతముపై నడవాలి. ఇది ఆత్మిక దారము. ఆత్మయే శ్రీమతము తీసుకుంటుంది.
ఆసురీ మతాన్ని తీసుకోవడముతో కిందకు పడిపోయారు. ఇప్పుడు ఆత్మిక తండ్రి యొక్క
శ్రీమతముపై నడుచుకోవాలి.
ఆత్మలమైన మనము మన జీవితమనే దారాన్ని పరమాత్మునితో ముడి వేస్తామని మీకు తెలుసు,
అందుకే మనకు వారి నుండి 21 జన్మలకు సదా సుఖము యొక్క వారసత్వము లభిస్తుంది. అక్కడ
అల్పకాలికమైన జీవిత దారము వలన (కొంగు ముడి వలన) కిందకు పడిపోతూ వచ్చారు. ఇక్కడ 21
జన్మల కోసం గ్యారంటీ ఉంది. మీ సంపాదన ఎంత గొప్పది, ఇందులో పొరపాట్లు చేయకూడదు. మాయ
చాలా పొరపాటులను చేయిస్తుంది. ఈ లక్ష్మీ-నారాయణులు తప్పకుండా తమ జీవితమనే దారమును
ఎవరితోనో ముడి వేసారు, తద్వారా వారికి 21 జన్మల వారసత్వము లభించింది. కల్ప-కల్పము
ఆత్మలైన మీ జీవితమనే దారాన్ని పరమాత్మునితో ముడి వేయడము జరుగుతుంది. ఎన్నిసార్లు
అనేది లెక్క లేదు. మనము శివబాబాకు చెందినవారిగా అయ్యామని, వారితో మన జీవితమనే
దారాన్ని ముడి వేసుకున్నామని బుద్ధిలో కూర్చుంటుంది. ప్రతి ఒక్క విషయాన్ని తండ్రి
కూర్చుని అర్థం చేయిస్తారు. కల్పక్రితము కూడా తండ్రితో ముడి వేసుకున్నామని మీకు
తెలుసు. ఇప్పుడు శివజయంతిని జరుపుతారు, కానీ ఎవరిది జరుపుతున్నారు అనేది వారికి
తెలియదు. శివబాబా పతిత-పావనుడు, వారు తప్పకుండా సంగమయుగములోనే వస్తారు. ఇది మీకు
తెలుసు, ప్రపంచములోని వారికి తెలియదు, అందుకే కోట్లలో కొందరు అని అంటారు. ఆది సనాతన
దేవీ-దేవతా ధర్మము కనుమరుగైపోయింది, ఇతర శాస్త్రాలు, కథలు మొదలైనవన్నీ మిగిలి
ఉన్నాయి. ఆ ధర్మము లేనే లేనప్పుడు దాని గురించి ఎలా తెలుసుకుంటారు. ఇప్పుడు మీరు
జీవితమనే దారాన్ని ముడి వేస్తున్నారు. ఆత్మల జీవితమనే దారము పరమాత్మునితో జోడించబడి
ఉంది, ఇందులో శరీరము యొక్క విషయమేమీ లేదు. ఇంట్లో కూర్చుని ఉన్నా, బుద్ధి ద్వారా
స్మృతి చేయాలి. ఆత్మలైన మీ జీవితమనే దారము ముడి వేయబడి ఉంది. కొంగుముడి వేస్తారు కదా.
అది స్థూలమైన కొంగు, ఇది పరమాత్మునితో ఆత్మల యోగము. భారత్ లో శివజయంతిని కూడా
జరుపుకుంటారు కానీ వారు ఎప్పుడు వచ్చారు అనేది ఎవ్వరికీ తెలియదు. శ్రీకృష్ణుని జయంతి
ఎప్పుడు, రాముని జయంతి ఎప్పుడు అనేది వారికి తెలియదు. పిల్లలూ, మీరు త్రిమూర్తి
శివజయంతి అనే పదాన్ని వ్రాస్తారు కానీ ఈ సమయములో ముగ్గురు మూర్తులూ అయితే లేరు.
శివబాబా బ్రహ్మా ద్వారా సృష్టిని రచిస్తారని మీరంటారు, కావున బ్రహ్మా సాకారములో
తప్పకుండా ఉండాలి కదా. మీరు త్రిమూర్తి అని అంటున్నప్పుడు, మరి విష్ణువు మరియు
శంకరుడు ఈ సమయములో ఎక్కడ ఉన్నారు. ఇవి చాలా అర్థం చేసుకోవలసిన విషయాలు. త్రిమూర్తి
అంటే అర్థమే బ్రహ్మా-విష్ణు-శంకరులు. బ్రహ్మా ద్వారా స్థాపన, అది ఈ సమయములోనే
జరుగుతుంది. విష్ణువు ద్వారా సత్యయుగములో పాలన జరుగుతుంది. వినాశన కార్యము అంతిమములో
జరుగనున్నది. ఈ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఒక్కటే భారత్ లో ఉంటుంది. మిగిలినవారంతా
ధర్మ స్థాపన చేయడానికి వస్తారు. ఫలానా ధర్మాన్ని స్థాపన చేసారని మరియు ఫలానా కాలములో
చేసారని ప్రతి ఒక్కరికీ తెలుసు. ఫలానా సమయములో ఫలానా ధర్మాన్ని స్థాపన చేసారని
తెలుసు. భారత్ గురించి ఎవ్వరికీ తెలియదు. గీతా జయంతి, శివ జయంతి ఎప్పుడు జరిగింది
అనేది ఎవ్వరికీ తెలియదు. శ్రీకృష్ణుని వయసుకు మరియు రాధ వయసుకు 2-3 సంవత్సరాల తేడా
ఉంటుంది. సత్యయుగములో తప్పకుండా మొదట శ్రీకృష్ణుడు జన్మ తీసుకుని ఉంటారు, ఆ తర్వాత
రాధ. కానీ సత్యయుగము ఎప్పుడు ఉండేది అనేది ఎవ్వరికీ తెలియదు. మీకు కూడా అర్థం
చేసుకోవడానికి చాలా సంవత్సరాలు పట్టింది, అటువంటప్పుడు ఎవరైనా 2 రోజులలో ఎంతవరకని
అర్థం చేసుకుంటారు. తండ్రి అయితే చాలా సహజముగా అర్థం చేయిస్తారు, వారు అనంతమైన
తండ్రి, తప్పకుండా వారి నుండి అందరికీ వారసత్వము లభించాలి కదా. ఓ గాడ్ ఫాదర్, అని
అంటూ స్మృతి చేస్తారు. లక్ష్మీ-నారాయణుల మందిరాలు ఉన్నాయి. వారు స్వర్గములో రాజ్యము
చేసేవారు కానీ వారికి ఆ వారసత్వాన్ని ఎవరు ఇచ్చారు? తప్పకుండా స్వర్గ రచయితయే ఇచ్చి
ఉంటారు. కానీ ఎప్పుడు ఇచ్చారు, ఎలా ఇచ్చారు అనేది ఎవ్వరికీ తెలియదు. సత్యయుగము
ఉన్నప్పుడు ఇంకే ధర్మమూ ఉండేది కాదని పిల్లలైన మీకు తెలుసు. సత్యయుగములో మనము
పవిత్రముగా ఉండేవారము, కలియుగములో మనము పతితముగా ఉన్నాము, అంటే సంగమయుగములోనే
జ్ఞానమిచ్చి ఉంటారు, సత్యయుగములో కాదు. అక్కడ ప్రారబ్ధముంటుంది. తప్పకుండా మునుపటి
జన్మలో జ్ఞానము తీసుకుని ఉంటారు. మీరు కూడా ఇప్పుడు తీసుకుంటున్నారు. ఆది సనాతన
దేవీ-దేవతా ధర్మ స్థాపనను తండ్రే చేస్తారని మీకు తెలుసు. శ్రీకృష్ణుడైతే సత్యయుగములో
ఉండేవారు, అతనికి ఈ ప్రారబ్ధము ఎక్కడ నుండి లభించింది? లక్ష్మీ-నారాయణులే
రాధ-కృష్ణులుగా ఉండేవారు, ఇది ఎవ్వరికీ తెలియదు. తండ్రి అంటారు, ఎవరైతే కల్పక్రితము
అర్థం చేసుకున్నారో, వారే ఇప్పుడు అర్థం చేసుకుంటారు. ఈ అంటు కట్టబడుతుంది. అత్యంత
మధురమైన వృక్షము యొక్క అంటు కట్టబడుతుంది. నేటికి 5 వేల సంవత్సరాల క్రితము కూడా
తండ్రి వచ్చి మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసారని మీకు తెలుసు. ఇప్పుడు మీరు
ట్రాన్స్ఫర్ అవుతున్నారు. మొదట బ్రాహ్మణులుగా అవ్వాలి. పిల్లిమొగ్గల ఆట ఆడేటప్పుడు
పిలక స్థానము తప్పకుండా వస్తుంది. తప్పకుండా మనము ఇప్పుడు బ్రాహ్మణులుగా అయ్యాము.
యజ్ఞములోనైతే తప్పకుండా బ్రాహ్మణులు కావాలి. ఇది శివుని యజ్ఞము లేక రుద్రుని యజ్ఞము.
రుద్ర జ్ఞాన యజ్ఞమనే అంటారు. శ్రీకృష్ణుడు యజ్ఞాన్ని రచించలేదు. ఈ రుద్ర జ్ఞాన
యజ్ఞము నుండి వినాశ జ్వాల ప్రజ్వలితమవుతుంది. ఈ శివబాబా యజ్ఞము పతితులను పావనముగా
తయారుచేయడానికి ఉంది. రుద్రుడైన శివబాబా నిరాకారుడు, వారు మనుష్య తనువులోకి
రానంతవరకు యజ్ఞాన్ని ఎలా రచిస్తారు. మనుష్యులే యజ్ఞాలను రచిస్తారు. సూక్ష్మవతనములో
లేక మూలవతనములో ఈ విషయాలు ఉండవు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇది సంగమయుగము.
లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉన్నప్పుడు సత్యయుగము ఉండేది. ఇప్పుడు మళ్ళీ మీరు ఈ
విధముగా తయారవుతున్నారు. ఆత్మల జీవితమనే దారము పరమాత్మునితో జోడించబడి ఉంది. ఈ
దారాన్ని వారితో ఎందుకు ముడి వేసుకున్నారు. సదా సుఖపు వారసత్వాన్ని పొందేందుకని.
అనంతమైన తండ్రి ద్వారా మనము ఈ లక్ష్మీ-నారాయణులుగా అవుతామని మీకు తెలుసు. తండ్రి
అర్థం చేయించారు - మీరే దేవీ-దేవతా ధర్మానికి చెందినవారిగా ఉండేవారు, ఆ సమయములో మీ
రాజ్యము ఉండేది, తర్వాత మీరు పునర్జన్మలు తీసుకుంటూ, తీసుకుంటూ క్షత్రియ ధర్మములోకి
వచ్చారు. సూర్యవంశీయుల రాజ్యము గడిచిపోయిన తర్వాత చంద్రవంశీయులు వచ్చారు. మనము ఈ
చక్రములో ఎలా తిరుగుతాము, ఎన్ని జన్మలు తీసుకున్నాము అనేది మీకు తెలుసు. భగవానువాచ
- ఓ పిల్లలూ, మీకు మీ జన్మల గురించి తెలియదు, నాకు తెలుసు. ఇప్పుడు ఈ సమయములో ఈ
తనువులో రెండు మూర్తులు ఉన్నాయి, బ్రహ్మా ఆత్మ మరియు శివ పరమ ఆత్మ. ఈ సమయములో రెండు
మూర్తులు కలిసి ఉన్నాయి - బ్రహ్మా మరియు శివ. శంకరుడు ఎప్పుడూ పాత్రలోకి రారు.
ఇకపోతే విష్ణువు సత్యయుగములో ఉన్నారు. ఇప్పుడు మీరు బ్రాహ్మణుల నుండి దేవతలుగా
అవుతారు. వాస్తవానికి హమ్ సో కు అర్థం ఇదే. కానీ వారు ఆత్మనే పరమాత్మ, పరమాత్మనే
ఆత్మ అని అన్నారు. ఎంత తేడా ఉంది. రావణుడు రావడముతోనే రావణుడి మతము ప్రారంభమైంది.
సత్యయుగములోనైతే ఈ జ్ఞానమే కనుమరుగైపోతుంది. ఇదంతా జరగడము డ్రామాలో నిశ్చితమై ఉంది
కదా, అప్పుడే తండ్రి వచ్చి స్థాపన చేయగలరు. ఇప్పుడు ఇది సంగమము. తండ్రి అంటారు -
నేను కల్ప-కల్పము, కల్పము యొక్క సంగమయుగములో వచ్చి మిమ్మల్ని మనుష్యుల నుండి
దేవతలుగా తయారుచేస్తాను, జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తాను. ఇక మిగిలినదంతా ఈ యజ్ఞములో
స్వాహా అవ్వనున్నది. వినాశ జ్వాల ఈ యజ్ఞము నుండే ప్రజ్వలితమవ్వనున్నది. పతిత
ప్రపంచము యొక్క వినాశనము జరగాలి, లేకపోతే పావన ప్రపంచము ఎలా ఏర్పడుతుంది. ఓ
పతిత-పావనా రండి, అని మీరు అంటారు కూడా, మరి పతిత ప్రపంచము, పావన ప్రపంచము కలిసి
ఉంటాయా? పతిత ప్రపంచము యొక్క వినాశనము జరుగుతుంది, ఇందులో సంతోషపడాలి. మహాభారత
యుద్ధము జరిగింది, దీని ద్వారా స్వర్గము యొక్క గేటు తెరవబడింది. ఇది అదే మహాభారత
యుద్ధమని అంటారు. ఇలా జరగడము మంచిదే, పతిత ప్రపంచము సమాప్తమైపోతుంది. శాంతి కోసం తల
బాదుకోవలసిన అవసరము ఏముంది. మీకు ఇప్పుడు ఏదైతే మూడవ నేత్రము లభించిందో, అది
ఇతరులెవ్వరికీ లేదు. మనము అనంతమైన తండ్రి నుండి మళ్ళీ వారసత్వాన్ని తీసుకుంటున్నామని
పిల్లలైన మీరు సంతోషపడాలి. బాబా, మేము అనేక సార్లు మీ నుండి వారసత్వాన్ని
తీసుకున్నాము. రావణుడు మళ్ళీ శాపము ఇచ్చాడు. ఈ విషయాలను గుర్తు చేసుకోవడము సహజము.
మిగిలినవన్నీ కల్పిత కథలు. మిమ్మల్ని ఇంతటి షావుకారులుగా తయారుచేసాను, మళ్ళీ
పేదవారిగా ఎందుకు అయ్యారు. ఇదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. జ్ఞానము, భక్తి,
వైరాగ్యము అని అంటూ ఉంటారు కూడా. భక్తి పట్ల వైరాగ్యము ఎప్పుడు కలుగుతుందంటే జ్ఞానము
లభించినప్పుడు. మీకు జ్ఞానము లభించింది, అప్పుడు భక్తి పట్ల వైరాగ్యము కలిగింది.
మొత్తం పాత ప్రపంచము పట్ల వైరాగ్యము కలిగింది. ఇదైతే శ్మశానము. మీరు 84 జన్మల
చక్రములో తిరిగారు. ఇప్పుడు ఇంటికి వెళ్ళాలి. నన్ను స్మృతి చేసినట్లయితే నా వద్దకు
వచ్చేస్తారు, వికర్మలు వినాశనమవుతాయి, ఇంకే ఉపాయము లేదు. యోగాగ్ని ద్వారా పాపాలు
భస్మమవుతాయి. గంగా స్నానముతో భస్మమవ్వవు.
బాబా అంటారు - మాయ మిమ్మల్ని ఫూల్ చేసేసింది (మూర్ఖులుగా చేసేసింది). ఏప్రిల్
ఫూల్ అని అంటారు కదా. ఇప్పుడు నేను మిమ్మల్ని లక్ష్మీ-నారాయణుల వలె తయారుచేయడానికి
వచ్చాను. ఈ రోజు మనము ఎలా ఉన్నాము, రేపు ఎలా అవుతాము - అనే ఈ చిత్రమైతే చాలా బాగుంది.
కానీ మాయ తక్కువేమీ కాదు. మాయ జీవితమనే దారాన్ని ముడి వేయనివ్వదు. పెనుగులాట
జరుగుతుంది. మనము బాబాను స్మృతి చేస్తాము, ఆ తర్వాత ఏమవుతుందో తెలియదు. బాబాను
మర్చిపోతాము. ఇందులో శ్రమ ఉంది, అందుకే భారత్ యొక్క ప్రాచీన యోగము ప్రసిద్ధమైనది.
వారికి వారసత్వాన్ని ఎవరు ఇచ్చారు, ఇది ఎవ్వరూ అర్థం చేసుకోరు. బాబా అంటారు -
పిల్లలూ, నేను మీకు మళ్ళీ వారసత్వాన్ని ఇవ్వడానికి వచ్చాను. ఇది తండ్రి పని. ఈ
సమయములో అందరూ నరకవాసులుగా ఉన్నారు. మీరు సంతోషముగా ఉన్నారు. ఇక్కడకు ఎవరైనా
వచ్చినప్పుడు, అర్థం చేసుకుంటే సంతోషపడతారు, వీరు చెప్తున్నది తప్పకుండా రైట్ అని
భావిస్తారు. 84 జన్మల లెక్క ఉంది. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవాలి. అర్ధకల్పము
భక్తి చేసి మీరు అలసిపోయారని తండ్రికి తెలుసు. మధురమైన పిల్లలూ, తండ్రి మీ అలసటనంతా
దూరము చేస్తారు. ఇప్పుడు అంధకార మార్గమైన భక్తి పూర్తవుతుంది. ఈ దుఃఖధామము ఎక్కడ, ఆ
సుఖధామము ఎక్కడ. నేను దుఃఖధామాన్ని సుఖధామముగా తయారుచేయడానికి కల్పము యొక్క సంగమములో
వస్తాను. తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. తండ్రి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు.
వారొక్కరికే మహిమ ఉంది. శివబాబా లేకపోతే మిమ్మల్ని పావనముగా ఎవరు తయారుచేస్తారు.
డ్రామాలో అంతా నిశ్చితమై ఉంది. ఓ పతిత-పావనా రండి అని కల్ప-కల్పము మీరు నన్ను
పిలుస్తారు. శివుని జయంతి జరుగుతుంది. బ్రహ్మా స్వర్గ స్థాపన చేసారని అంటారు, మరి
శివుడు ఏమి చేసారని శివజయంతిని జరుపుకుంటారు. ఏమీ అర్థం చేసుకోరు. మీ బుద్ధిలో
జ్ఞానము పూర్తిగా కూర్చుండిపోవాలి. జీవితమనే దారాన్ని ఒక్కరితోనే ముడి వేసిన తర్వాత
ఇక ఇతరులెవ్వరితోనూ ముడి వేయకండి, లేకపోతే పడిపోతారు. పారలౌకిక తండ్రి అత్యంత
సింపుల్ గా ఉంటారు, ఎటువంటి ఆర్భాటము లేదు. ఆ తండ్రి అయితే కార్లలో, విమానాలలో
తిరుగుతారు. ఈ అనంతమైన తండ్రి అంటారు - నేను పతిత ప్రపంచములోకి, పతిత శరీరములోకి
పిల్లల సేవ చేయడానికి వచ్చాను. ఓ అవినాశీ సర్జన్ రండి, వచ్చి మాకు ఇంజెక్షన్ వేయండి
అని మీరు నన్ను పిలిచారు. మీకు ఇంజెక్షన్ వేస్తున్నారు. తండ్రి అంటారు, యోగము
జోడించినట్లయితే మీ పాపాలు భస్మమవుతాయి. తండ్రి ఉన్నదే 63 జన్మల దుఃఖాన్ని
హరించేవారు, 21 జన్మలకు సుఖాన్ని ఇచ్చేవారు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తమ బుద్ధి యొక్క ఆత్మిక దారాన్ని ఒక్క తండ్రితోనే ముడి వేసుకోవాలి. ఒక్కరి
శ్రీమతముపైనే నడుచుకోవాలి.
2. మనము అత్యంత మధురమైన వృక్షము యొక్క అంటు కడుతున్నాము, అందుకే మొదట స్వయాన్ని
చాలా-చాలా మధురముగా తయారుచేసుకోవాలి. స్మృతియాత్రలో తత్పరులై వికర్మలను వినాశనము
చేసుకోవాలి.
వరదానము:-
మనన శక్తి ద్వారా ప్రతి పాయింట్ యొక్క అనుభవజ్ఞులుగా అయ్యే
సదా శక్తిశాలీ, మాయాప్రూఫ్, విఘ్నప్రూఫ్ భవ
ఏ విధముగా శారీరక శక్తి కొరకు జీర్ణశక్తి అవసరమో అలా
ఆత్మను శక్తిశాలిగా చేసుకునేందుకు మనన శక్తి అవసరము. మనన శక్తి ద్వారా అనుభవ
స్వరూపులుగా అవ్వడము - ఇదే అన్నింటికన్నా అత్యంత పెద్ద శక్తి. ఇటువంటి అనుభవజ్ఞులు
ఎప్పుడూ మోసపోరు, వారు చెప్పుడు విషయాలను విని డిస్టర్బ్ అవ్వరు. అనుభవజ్ఞులు సదా
సంపన్నముగా ఉంటారు. వారు సదా శక్తిశాలిగా ఉంటూ మాయాప్రూఫ్ గా, విఘ్నప్రూఫ్ గా
అవుతారు.
స్లోగన్:-
సంతోషమనే ఖజానా తోడుగా ఉన్నట్లయితే మిగిలిన అన్ని ఖజానాలు స్వతహాగా వచ్చేస్తాయి.
అవ్యక్త సూచనలు - ఏకత
మరియు విశ్వాసము యొక్క విశేషతల ద్వారా సఫలతా సంపన్నులుగా అవ్వండి
సఫలతా సంపన్నులుగా
అయ్యేందుకు - సాధారణ కార్యములో ఉన్నప్పటికీ కూడా ఫరిశ్తాల వంటి నడవడిక మరియు
వ్యవహారము ఉండాలి. ఏం చేయను, విషయమే అలా ఉంది, పనే అలా ఉంది, పరిస్థితులు అలా
ఉన్నాయి, సమస్య అలా ఉంది, అందుకే సాధారణత వచ్చేసింది అని ఇలా అనకండి. ఏ సమయములోనైనా,
ఎటువంటి పరిస్థితిలోనైనా కూడా మీ అలౌకిక స్వరూపము ప్రతి ఒక్కరికీ అనుభవమవ్వాలి.
విషయము ఎలా ఉంటే, మీ స్వరూపాన్ని అలా తయారుచేసుకోకండి. విషయాలు మిమ్మల్ని మార్చకూడదు,
అప్పుడు అందరి సమీపములోకి వస్తారు మరియు ఏకతతో కూడిన సంగఠన దృఢముగా అవుతుంది.
| | | |