24-09-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - సత్యమైన తండ్రి సత్య ఖండాన్ని స్థాపన
చేస్తారు, మీరు నరుని నుండి నారాయణునిగా తయారయ్యే సత్యాతి-సత్యమైన జ్ఞానాన్ని
వినేందుకు తండ్రి వద్దకు వచ్చారు’’
ప్రశ్న:-
పిల్లలైన మీరు
మీ గృహస్థ వ్యవహారములో చాలా-చాలా సంభాళించుకుని నడుచుకోవాలి - ఎందుకని?
జవాబు:-
ఎందుకంటే మీ
గతి-మతము అన్నింటికన్నా అతీతమైనవి. మీ జ్ఞానము గుప్తమైనది, అందుకే విశాల బుద్ధి
కలవారిగా అయి అందరితోనూ యుక్తియుక్తముగా సంబంధాలను నిర్వర్తించాలి. మనమందరమూ
పరస్పరములో సోదరులము లేక సోదరీ-సోదరులము అని లోలోపల భావించాలి. అంతేకానీ స్త్రీ తన
పతిని, మీరు నా సోదరుడు అని అనకూడదు. అలా అంటే, ఆ మాట వినేవారు వీరికి ఏమైంది అని
అంటారు. యుక్తిగా నడుచుకోవాలి.
ఓంశాంతి
ఆత్మిక తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ‘ఆత్మిక’ అనే పదాన్ని
ఉపయోగించకుండా కేవలం ‘తండ్రి’ అని అన్నా సరే, వారు ఆత్మిక తండ్రి అనేది అర్థమవుతుంది.
తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. అందరూ పరస్పరములో తమను తాము
సోదరులుగానే చెప్పుకుంటారు. తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. వారు
అందరికీ అర్థం చేయిస్తూ ఉండకపోవచ్చు. గీతలో కూడా భగవానువాచ అని వ్రాయబడి ఉంది. ఎవరి
కోసము? అందరూ భగవంతుని పిల్లలే. ఆ భగవంతుడు తండ్రి కావున భగవంతుని పిల్లలందరూ
పరస్పరములో సోదరులు. భగవంతుడే అర్థం చేయించి ఉంటారు, రాజయోగము నేర్పించి ఉంటారు.
ఇప్పుడు మీ బుద్ధి తాళము తెరుచుకుంది, ఇటువంటి ఆలోచనలు మీకు తప్ప ఇంకెవరికీ కలగవు.
ఎవరెవరికైతే సందేశము లభిస్తూ ఉంటుందో, వారు స్కూలుకు వస్తూ ఉంటారు, చదువుకుంటూ
ఉంటారు. ప్రదర్శనీ అయితే చూసాము, ఇప్పుడు వెళ్ళి ఇంకా ఎక్కువ వినాలి అని వారు
భావిస్తారు. మొట్టమొదటి ముఖ్యమైన విషయము ఏమిటంటే - ఇది జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు,
గీతా జ్ఞానదాత అయిన శివ భగవానువాచ. ఇక్కడ మీకు నేర్పించేవారు, అర్థం చేయించేవారు
ఎవరు అనేది వారికి తెలియాలి. వారు పరమ ఆత్మ, జ్ఞానసాగరుడు, నిరాకారుడు. వారు ఉన్నదే
సత్యము. వారు సత్యమే వినిపిస్తారు, ఇక అందులో ఎలాంటి ప్రశ్న ఉత్పన్నము అవ్వనే అవ్వదు.
మీరు అంతా ఆ సత్యమైనవారిపై వదిలేసారు. మొట్టమొదట - పరమపిత పరమాత్మ మనకు బ్రహ్మా
ద్వారా రాజయోగాన్ని నేర్పిస్తున్నారు అనేది అర్థం చేయించాలి. ఇది రాజ్య పదవి.
అందరికీ తండ్రి అయిన ఆ పారలౌకిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారని, వారే
అందరికంటే గొప్ప అథారిటీ అని ఎవరికైతే నిశ్చయము కలుగుతుందో, వారికి ఇక వేరే
ప్రశ్నలేవీ కలగవు. వారు పతిత-పావనుడు. వారు ఇక్కడకు వచ్చినప్పుడు తప్పకుండా వారి
సమయానికి వస్తూ ఉండవచ్చు. ఇది ఆ మహాభారత యుద్ధమేనని మీరు చూస్తున్నారు కూడా.
వినాశనము తర్వాత నిర్వికారీ ప్రపంచము రానున్నది. భారత్ యే నిర్వికారిగా ఉండేదని
మనుష్యులకు తెలియదు. వారి బుద్ధి పని చేయదు. గోద్రెజ్ తాళము వేయబడి ఉంది. దాని
తాళంచెవి ఒక్క తండ్రి వద్ద మాత్రమే ఉంది, అందుకే మిమ్మల్ని చదివించేవారు ఎవరు అనేది
ఎవరికీ తెలియదు. ఈ దాదా చదివిస్తున్నారని అనుకుంటారు, అందుకే విమర్శిస్తారు, ఏదో
ఒకటి అంటారు, అందుకే మొట్టమొదటగా - ఇక్కడ శివ భగవానువాచ అని వ్రాసి ఉందని అర్థం
చేయించండి. వారు ఉన్నదే సత్యము. తండ్రి ఉన్నదే నాలెడ్జ్ ఫుల్. వారు సృష్టి
ఆదిమధ్యాంతాల రహస్యాలను అర్థం చేయిస్తారు. ఈ శిక్షణ మీకు ఇప్పుడు ఆ అనంతమైన తండ్రి
నుండి లభిస్తుంది. వారే సృష్టి రచయిత, వారు పతిత సృష్టిని పావనముగా తయారుచేసేవారు.
కావున మొట్టమొదట తండ్రి పరిచయాన్నే ఇవ్వాలి. ఆ పరమపిత పరమాత్మునితో మీకు ఏ
సంబంధముంది అనేది చెప్పాలి. వారు నరుని నుండి నారాయణునిగా తయారయ్యే సత్యమైన
జ్ఞానాన్ని ఇస్తారు. తండ్రి సత్యము అని పిల్లలకు తెలుసు, ఆ తండ్రియే సత్య ఖండాన్ని
తయారుచేస్తారు. నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకే మీరు ఇక్కడకు వచ్చారు.
బ్యారిస్టరు వద్దకు వెళ్తే, బ్యారిస్టరుగా అయ్యేందుకు వచ్చామని భావిస్తారు. మనల్ని
భగవంతుడు చదివిస్తున్నారని ఇప్పుడు మీకు నిశ్చయముంది. కొంతమంది నిశ్చయము
ఏర్పరచుకుంటారు కూడా, మళ్ళీ సంశయ బుద్ధి కలవారిగా అవుతారు, అప్పుడు - మిమ్మల్ని
భగవంతుడు చదివిస్తున్నారని మీరు అనేవారు కదా, మరి భగవంతుడిని ఎందుకు వదిలేసి
వచ్చారని వారిని అందరూ అడుగుతారు. సంశయము కలిగినప్పుడే వదిలేసి వెళ్ళిపోతారు, ఏదో
ఒక వికర్మ చేస్తారు. భగవానువాచ - కామము మహాశత్రువు, దానిపై విజయము పొందినట్లయితేనే
జగత్ జీతులుగా అవుతారు. ఎవరైతే పావనముగా అవుతారో, వారే పావన ప్రపంచములోకి వెళ్తారు.
ఇక్కడ ఇది రాజయోగానికి సంబంధించిన విషయము, మీరు వెళ్ళి రాజ్యము చేస్తారు. మిగిలిన
ఆత్మలందరూ తమ లెక్కాచారాలను సమాప్తము చేసుకుని తిరిగి వెళ్ళిపోతారు. ఇది వినాశన
సమయము. సత్యయుగ స్థాపన తప్పకుండా జరగనున్నదని ఇప్పుడు బుద్ధి చెప్తుంది. పావన
ప్రపంచమని సత్యయుగాన్ని అంటారు. మిగిలినవారంతా ముక్తిధామానికి వెళ్ళిపోతారు. వారు
మళ్ళీ తమ పాత్రను రిపీట్ చేయాల్సి ఉంటుంది. పావనముగా అయి పావన ప్రపంచానికి
యజమానులుగా అయ్యేందుకు మీరు కూడా మీ పురుషార్థము చేస్తూ ఉంటారు. తమను తాము
యజమానులుగానే భావిస్తారు కదా. ప్రజలు కూడా యజమానులే. ఇప్పుడు ప్రజలు కూడా ‘మా భారత్’
అని అంటారు కదా. ఇప్పుడు అందరూ నరకవాసులని మీకు అర్థమవుతుంది. ఇప్పుడు మనము
స్వర్గవాసులుగా అయ్యేందుకు రాజయోగాన్ని నేర్చుకుంటున్నాము. అందరూ స్వర్గవాసులుగా
అవ్వరు. తండ్రి అంటారు - ఎప్పుడైతే భక్తి మార్గము పూర్తవుతుందో, అప్పుడే నేను
వస్తాను. నేనే వచ్చి భక్తులందరికీ భక్తి ఫలాన్ని ఇవ్వాల్సి ఉంటుంది. మెజారిటీ అయితే
భక్తులదే కదా. ఓ గాడ్ ఫాదర్ అని అందరూ పిలుస్తూ ఉంటారు. భక్తుల నోటి నుండి - ఓ గాడ్
ఫాదర్, ఓ భగవంతుడా అని తప్పకుండా వెలువడుతుంది. ఇప్పుడు భక్తికి మరియు జ్ఞానానికి
మధ్యన వ్యత్యాసము ఉంది. మీ నోటి నుండి ఎప్పుడూ - ఓ ఈశ్వరా, ఓ భగవంతుడా అనే మాట
వెలువడదు. మనుష్యులకైతే ఇది అర్ధకల్పము బట్టి అలవాటైపోయింది. వారు మన తండ్రి అని
మీకు తెలుసు. మీరు - ఓ బాబా, అని పిలవకూడదు. తండ్రి నుండి మీరు వారసత్వాన్ని
తీసుకోవాలి. మనము తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటామని ముందుగా ఈ నిశ్చయముండాలి.
తండ్రి పిల్లలను - వారసత్వము తీసుకునేందుకు అధికారులుగా తయారుచేస్తారు. వీరు
సత్యమైన తండ్రి కదా. తండ్రికి తెలుసు - నేను ఏ పిల్లలకైతే జ్ఞానామృతాన్ని తాగించి,
జ్ఞాన చితిపై కూర్చోబెట్టి, విశ్వానికి యజమానులుగా, దేవతలుగా తయారుచేసానో, వారే కామ
చితిపై కూర్చుని భస్మమైపోయారు. ఇప్పుడు నేను మళ్ళీ జ్ఞాన చితిపై కూర్చోబెట్టి గాఢ
నిద్ర నుండి మేలుకొలిపి స్వర్గములోకి తీసుకువెళ్తాను.
తండ్రి అర్థం చేయించారు - ఆత్మలైన మీరు అక్కడ శాంతిధామములో మరియు సుఖధామములో ఉంటారు.
సుఖధామాన్ని వైస్ లెస్ వరల్డ్ అని, సంపూర్ణ నిర్వికారీ ప్రపంచమని అంటారు. అక్కడ (సుఖధామములో)
దేవతలుంటారు మరియు అది (శాంతిధామము) స్వీట్ హోమ్, ఆత్మల ఇల్లు. పాత్రధారులందరూ ఆ
శాంతిధామము నుండి ఇక్కడ పాత్రను అభినయించేందుకు వస్తారు. ఆత్మలమైన మనము ఇక్కడి
నివాసులము కాము. ఆ పాత్రధారులు ఇక్కడి నివాసులు. వారు ఇంటి నుండి వచ్చి, కేవలం
వస్త్రాలను మార్చుకుని పాత్రను అభినయిస్తారు. మన ఇల్లు శాంతిధామమని, మనము అక్కడికే
తిరిగి వెళ్తామని మీకు తెలుసు. పాత్రధారులందరూ స్టేజి పైకి వచ్చినప్పుడు, తండ్రి
వచ్చి అందరినీ తీసుకువెళ్తారు. అందుకే వారిని లిబరేటర్ (ముక్తిప్రదాత) మరియు గైడ్ (మార్గదర్శకుడు)
అని కూడా అంటారు. వారే దుఃఖహర్త-సుఖకర్త. ఇంతమంది మనుష్యులు ఎక్కడికి వెళ్తారు.
పతిత-పావనుడిని అసలు ఎందుకు పిలుస్తున్నారో ఆలోచించండి. తమ మృత్యువు కోసమే. దుఃఖపు
ప్రపంచములో ఉండాలని అనిపించదు, అందుకే ఇంటికి తీసుకువెళ్ళండి అని అంటారు. ఈ మాట
అంటున్నవారంతా కేవలం ముక్తిని మాత్రమే నమ్ముతారు. భారత్ యొక్క ప్రాచీన యోగము కూడా
ఎంత ప్రసిద్ధమైనది. ప్రాచీన రాజయోగాన్ని నేర్పించేందుకు విదేశాలకు కూడా వెళ్తారు.
క్రిస్టియన్లలో చాలా మంది సన్యాసులను గౌరవించేవారు ఉన్నారు. కాషాయ వస్త్రధారణ
హఠయోగానికి సంబంధించింది. మీరైతే ఇళ్ళు-వాకిళ్ళను వదలకూడదు, అలాగే తెలుపు వస్త్రాలను
ధరించాలనే బంధనము కూడా లేదు. కానీ, తెలుపు మంచిది. మీరు భట్టీలో ఉన్నారు కావున ఇదే
మీ డ్రెస్సు అయిపోయింది. ఈ రోజుల్లో తెలుపును ఇష్టపడతారు. మనుష్యులు మరణించినప్పుడు
తెల్లని వస్త్రాన్ని కప్పుతారు. ముందు ఎవరికైనా తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. ఇద్దరు
తండ్రులు ఉన్నారు. ఈ విషయాలను అర్థం చేసుకోవడానికి సమయము పడుతుంది. ప్రదర్శనీలలో
అంతెక్కువ అర్థం చేయించలేరు. సత్యయుగములో ఒక్క తండ్రి ఉంటారు, ఈ సమయములో మీకు
ముగ్గురు తండ్రులు ఉన్నారు, ఎందుకంటే భగవంతుడు ప్రజాపిత బ్రహ్మా తనువులోకి వస్తారు.
బ్రహ్మా కూడా అందరికీ తండ్రియే. అచ్ఛా, ఇప్పుడు ముగ్గురు తండ్రులలోనూ ఉన్నతమైన
వారసత్వము ఎవరిది? నిరాకార తండ్రి వారసత్వాన్ని ఎలా ఇస్తారు? వారు బ్రహ్మా ద్వారా
ఇస్తారు. బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తారు మరియు బ్రహ్మా ద్వారా వారసత్వాన్ని కూడా
ఇస్తారు. ఈ చిత్రముపై మీరు చాలా మంచి రీతిలో అర్థం చేయించవచ్చు. శివబాబా ఉన్నారు,
తర్వాత ఆది దేవుడైన ప్రజాపిత బ్రహ్మా మరియు ఆది దేవి ఉన్నారు. వీరు (బ్రహ్మా) గ్రేట్
గ్రేట్ గ్రాండ్ ఫాదర్. తండ్రి అంటారు - శివుడినైన నన్ను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్
అని అనరు. నేను అందరికీ తండ్రిని. వీరు ప్రజాపిత బ్రహ్మా. మీరందరూ పరస్పరములో
సోదరీ-సోదరులు కావున పరస్పరము వికారాలలోకి వెళ్ళకూడదు. ఒకవేళ ఇరువురికీ ఒకరి పట్ల
ఒకరికి వికారీ దృష్టి ఆకర్షించినట్లయితే కింద పడిపోతారు, ఇక తండ్రిని మర్చిపోతారు.
తండ్రి అంటారు - నీవు నా బిడ్డగా అయి నల్ల ముఖము చేసుకున్నావు. అనంతమైన తండ్రి
పిల్లలకు అర్థం చేయిస్తున్నారు, మీకు ఈ నషా ఎక్కి ఉంది. గృహస్థ వ్యవహారములో కూడా
ఉండాలి, లౌకిక సంబంధీకులకు కూడా ముఖాన్ని చూపించాలి అని మీకు తెలుసు. లౌకిక తండ్రిని
మీరు తండ్రి అనే పిలుస్తారు కదా. వారిని మీరు సోదరుడు అని పిలవకూడదు. సాధారణ రీతిలో
తండ్రిని తండ్రి అనే పిలుస్తారు. బుద్ధిలో, వీరు మా లౌకిక తండ్రి అని ఉంటుంది.
జ్ఞానముంది కదా. ఈ జ్ఞానము చాలా విచిత్రమైనది. ఈ రోజుల్లోనైతే పేరుతో కూడా
పిలుస్తుంటారు కానీ ఎవరైనా విజిటర్లు లేక బయటవారి ముందు తండ్రిని సోదరుడని
సంబోధిస్తే, వీరి బుద్ధి పాడైపోయిందని అనుకుంటారు. ఇందులో చాలా యుక్తి అవసరము. మీది
గుప్తమైన జ్ఞానము, గుప్తమైన సంబంధాలు. చాలా వరకు స్త్రీలు, తమ పతిని పేరుతో పిలవరు,
కానీ పతి తన స్త్రీని పేరుతో పిలవచ్చు. ఇందులో చాలా యుక్తిగా నడుచుకోవాలి. లౌకికము
వారితో కూడా యుక్తిగా సంబంధాన్ని నిర్వర్తించాలి. బుద్ధి పైకి వెళ్ళిపోవాలి. మనము
తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాము. ఇకపోతే, చిన్నాన్నను చిన్నాన్న అని,
తండ్రిని తండ్రి అనే పిలవాలి కదా. బ్రహ్మాకుమార-బ్రహ్మాకుమారీలుగా అవ్వనివారు
సోదరీ-సోదరులుగా భావించరు. ఎవరైతే బి.కె.లుగా అయ్యారో, వారే ఈ విషయాలను అర్థం
చేసుకుంటారు. బయటివారు ఈ విషయాలను వింటే ఆశ్చర్యపోతారు. ఈ విషయాలను అర్థం
చేసుకునేందుకు మంచి బుద్ధి కావాలి. తండ్రి పిల్లలను విశాల బుద్ధి కలవారిగా
తయారుచేస్తారు. ఇంతకుముందు మీరు హద్దు బుద్ధి కలవారిగా ఉండేవారు. ఇప్పుడు బుద్ధి
అనంతములోకి వెళ్ళిపోతుంది. వారు మన అనంతమైన తండ్రి. వీరంతా మన సోదరీ-సోదరులు, కానీ
ఇంటిలో అత్తగారిని అత్తగారు అనే పిలవాలి, అంతేకానీ సోదరి అని పిలవకూడదు. ఇంటిలో ఉంటూ
చాలా యుక్తిగా నడుచుకోవాలి. లేదంటే లోకులు - వీరు పతిని సోదరుడని, అత్తగారిని సోదరి
అని పిలుస్తున్నారు, ఇదేమిటి అని అడుగుతారు. ఈ జ్ఞానము యొక్క విషయాలు మీకు మాత్రమే
తెలుసు, ఇంకెవరికీ తెలియవు. ప్రభూ, మీరు ఇచ్చే గతి, మీరు చూపే మార్గము మీకే తెలుసు
అని అంటారు కదా. ఇప్పుడు మీరు వారికి పిల్లలుగా అయ్యారు కనుక మీ గతి-మతము మీకే
తెలుసు. చాలా జాగ్రత్తగా నడుచుకోవాల్సి ఉంటుంది. ఎక్కడా ఎవరూ తికమకపడకూడదు.
ప్రదర్శనీలలోనైతే పిల్లలైన మీరు మొట్టమొదట ఇది అర్థం చేయించాలి - మనల్ని
చదివించేవారు భగవంతుడు, మరి ఇప్పుడు భగవంతుడు ఎవరో మీరు చెప్పండి. నిరాకారుడైన
శివుడా లేక దేహధారి అయిన శ్రీకృష్ణుడా? గీతలో భగవానువాచ ఉంది - ఆ మహావాక్యాలను శివ
పరమాత్ముడు ఉచ్చరించారా లేక శ్రీకృష్ణుడు ఉచ్చరించారా? శ్రీకృష్ణుడైతే స్వర్గము
యొక్క మొదటి రాకుమారుడు. శ్రీకృష్ణ జయంతియే శివజయంతి అనైతే అనలేరు. శివజయంతి తర్వాత
శ్రీకృష్ణ జయంతి వస్తుంది. శివజయంతి ద్వారా శ్రీకృష్ణుడు స్వర్గ రాకుమారునిగా ఎలా
అయ్యారు అనేది అర్థం చేసుకోవాల్సిన విషయము. శివజయంతి, తర్వాత గీతా జయంతి, తర్వాత
వెంటనే శ్రీకృష్ణ జయంతి వస్తుంది, ఎందుకంటే తండ్రి రాజయోగము నేర్పిస్తారు కదా. ఈ
విషయము పిల్లల బుద్ధిలోకి వచ్చింది కదా. శివపరమాత్మ రానంత వరకు శివజయంతిని
జరుపుకోలేరు. శివుడు వచ్చి కృష్ణపురిని స్థాపన చేయనంత వరకు, శ్రీకృష్ణ జయంతిని కూడా
ఎలా జరుపుకుంటారు. శ్రీకృష్ణుని జన్మను జరుపుకుంటారు కానీ అర్థం చేసుకోరు.
శ్రీకృష్ణుడు మొదటి రాకుమారుడు కావున తప్పకుండా సత్యయుగములోనే ఉంటారు కదా. అక్కడ
దేవీ-దేవతల రాజధాని తప్పకుండా ఉంటుంది. కేవలం ఒక్క శ్రీకృష్ణునికి మాత్రమే
రాజ్యాధికారము లభించదు కదా. తప్పకుండా కృష్ణపురి ఉంటుంది కదా! కృష్ణపురి ఉండేదని
అంటారు... ఇప్పుడు ఇది కంసపురి. కృష్ణపురి అంటే కొత్త ప్రపంచము, కంసపురి అంటే పాత
ప్రపంచము. దేవతలకు మరియు అసురులకు యుద్ధము జరిగిందని, దేవతలు గెలుపొందారని అంటారు.
కానీ అలా జరగలేదు. కంసపురి సమాప్తమై కృష్ణపురి స్థాపన అయ్యింది కదా. కంసపురి పాత
ప్రపంచములో ఉంటుంది. కొత్త ప్రపంచములో ఈ కంసుడు మొదలైన రాక్షసులు ఉండరు. ఇక్కడ
ఎంతమంది మనుష్యులు ఉన్నారో చూడండి. సత్యయుగములో చాలా కొద్దిమంది ఉంటారు. ఇది కూడా
మీరు అర్థం చేసుకోగలరు, ఇప్పుడు మీ బుద్ధి పని చేస్తుంది. దేవతలైతే ఏ యుద్ధము
చేయలేదు. దైవీ సాంప్రదాయము సత్యయుగములోనే ఉంటుంది. ఆసురీ సాంప్రదాయము ఇక్కడ ఉంది.
అంతేకానీ దేవతలు మరియు అసురులకు మధ్యన యుద్ధము జరగలేదు, అలాగే కౌరవులు మరియు
పాండవులకు మధ్యన కూడా యుద్ధము జరగలేదు. మీరు రావణుడిపై విజయము పొందుతారు. తండ్రి
అంటారు - ఈ వికారాలపై విజయము పొందాలి, అప్పుడు జగత్ జీతులుగా అవుతారు. దీనికి
యుద్ధము చేయాల్సిన అవసరము లేదు. యుద్ధము అన్న పేరు తీసుకుంటే, అది హింస అవుతుంది.
రావణుడిపై విజయము పొందాలి కానీ అహింసాయుతముగా పొందాలి. కేవలం తండ్రిని స్మృతి చేస్తే
మన వికర్మలు వినాశనమవుతాయి. భారత్ యొక్క ప్రాచీన రాజయోగము ప్రసిద్ధమైనది.
తండ్రి అంటారు - నాతో బుద్ధియోగాన్ని జోడిస్తే మీ పాపాలు భస్మమవుతాయి. తండ్రి
పతిత-పావనుడు కనుక బుద్ధియోగాన్ని ఆ తండ్రితోనే జోడించాలి, అప్పుడు మీరు పతితుల
నుండి పావనులుగా అవుతారు. ఇప్పుడు మీరు ప్రాక్టికల్ గా వారితో యోగము జోడిస్తున్నారు,
ఇందులో యుద్ధమనే మాటే లేదు. ఎవరైతే బాగా చదువుకుంటారో, తండ్రితో యోగము జోడిస్తారో,
వారే తండ్రి నుండి కల్ప క్రితం వలె వారసత్వాన్ని పొందుతారు. ఈ పాత ప్రపంచ వినాశనము
కూడా జరుగుతుంది. అందరూ లెక్కాచారాలను సమాప్తము చేసుకుని వెళ్తారు. తర్వాత
క్లాసులోకి ట్రాన్స్ఫర్ అయి, నంబరువారుగా వెళ్ళి కూర్చుంటారు కదా. మీరు కూడా
నంబరువారుగా వెళ్ళి అక్కడ రాజ్యము చేస్తారు. ఇవి ఎంతగా అర్థం చేసుకోవాల్సిన విషయాలు.
అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఈ వినాశన సమయములో, సత్యయుగ స్థాపన జరుగుతున్నప్పుడు పావనముగా తప్పకుండా
అవ్వాలి. తండ్రి పట్ల మరియు తండ్రి కార్యము పట్ల ఎప్పుడూ సంశయము
ఉత్పన్నమవ్వనివ్వకూడదు.
2. జ్ఞానము మరియు సంబంధాలు గుప్తమైనవి, అందుకే లౌకికములో చాలా యుక్తిగా విశాల
బుద్ధి కలవారిగా అయి నడుచుకోవాలి. వినేవారు తికమకపడే విధముగా ఏ మాటలు మాట్లాడకూడదు.
వరదానము:-
నాలెడ్జ్ యొక్క లైట్ మైట్ ద్వారా బలహీన సంస్కారాలను సమాప్తము
చేసే శక్తి సంపన్న భవ
నాలెడ్జ్ ఆధారముగా తమ బలహీన సంస్కారాల గురించి
తెలుసుకుంటారు మరియు ఆ విషయము యొక్క వివరణ లభించినప్పుడు కొద్ది సమయము కోసం ఆ
సంస్కారాలు లోపలే అణిగిపోతాయి, కానీ బలహీన సంస్కారాలను సమాప్తము చేసేందుకు లైట్
మరియు మైట్ యొక్క ఎక్స్ ట్రా ఫోర్స్ అవసరము. దీని కోసం మాస్టర్ సర్వశక్తివంతులుగా,
మాస్టర్ నాలెడ్జ్ ఫుల్ గా అవ్వడముతో పాటు చెకింగ్ మాస్టర్ గా అవ్వండి. నాలెడ్జ్
ద్వారా స్వయములో శక్తిని నింపుకోండి, మనన శక్తిని పెంచుకోండి, అప్పుడు శక్తి
సంపన్నులుగా అవుతారు.
స్లోగన్:-
ఎక్కడైతే సర్వ
ప్రాప్తులు ఉంటాయో, అక్కడ ప్రసన్నత ఉంటుంది.
అవ్యక్త ప్రేరణలు -
ఇప్పుడు మీ దాత స్వరూపాన్ని ప్రత్యక్షము చేయండి
ఒకవేళ ఇతరులకు ఇచ్చిన
తర్వాత - నేను ఇంత ఇచ్చాను, నాకు వారి నుండి ఎంతోకొంత గౌరవ-మర్యాదలు, మహిమ లభించాలి
అన్న సంకల్పము వచ్చినట్లయితే అది కూడా తీసుకునే భావన అవుతుంది. దాత పిల్లలు ఒకవేళ ఈ
విధముగా తీసుకునే సంకల్పము చేసినా కూడా వారు దాతగా అయినట్లు కాదు. ఇలా తీసుకోవటము
కూడా ఇచ్చేవారికి శోభించదు.