24-10-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీకు ఇంటి యొక్క మార్గాన్ని చూపించడానికి బాబా వచ్చారు, మీరు ఆత్మాభిమానులుగా అయి ఉన్నట్లయితే ఈ మార్గము సహజముగా కనిపిస్తుంది’’

ప్రశ్న:-
సంగమములో ఏ జ్ఞానము లభించిన కారణముగా సత్యయుగీ దేవతలు మోహాన్ని జయించినవారిగా పిలువబడతారు ?

జవాబు:-
సంగమములో మీకు తండ్రి అమరకథను వినిపించి అమరమైన ఆత్మ యొక్క జ్ఞానాన్ని ఇచ్చారు. మీకు ఇప్పుడు జ్ఞానము లభించింది - ఇది అవినాశీ తయారై, తయారుచేయబడిన డ్రామా, ప్రతి ఆత్మ తన-తన పాత్రను అభినయిస్తుంది, ఆత్మ ఒక శరీరాన్ని వదిలి మరొకటి తీసుకుంటుంది, ఇందులో ఏడ్వవలసిన విషయమేమీ లేదు. ఈ జ్ఞానము కారణముగానే సత్యయుగీ దేవతలను మోహాన్ని జయించినవారు అని అంటారు. అక్కడ మృత్యువు అన్న మాటే ఉండదు. వారు సంతోషముగా పాత శరీరాన్ని వదిలి కొత్తది తీసుకుంటారు.

పాట:-
నయనహీనులకు దారి చూపించండి ప్రభు...

ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి చెప్తున్నారు - నేను మార్గాన్ని అయితే చూపిస్తాను కానీ మొదట స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకుని కూర్చోండి. దేహీ-అభిమానులుగా అయి కూర్చున్నట్లయితే మీకు మార్గము చాలా సహజముగా కనిపిస్తుంది. భక్తి మార్గములో అర్ధకల్పము ఎదురుదెబ్బలు తిన్నారు. భక్తి మార్గములో ఎంతో సామాగ్రి ఉంది. ఇప్పుడు తండ్రి అర్థం చేయించారు, అనంతమైన తండ్రి ఒక్కరే. తండ్రి చెప్తున్నారు, నేను మీకు మార్గాన్ని తెలియజేస్తున్నాను. వారు ఏ మార్గాన్ని తెలియజేస్తున్నారు అన్నది కూడా ప్రపంచానికి తెలియదు. వారు ముక్తి-జీవన్ముక్తుల, గతి-సద్గతుల మార్గాన్ని తెలియజేస్తున్నారు. ముక్తి అని శాంతిధామాన్ని అంటారు. శరీరము లేకుండా ఆత్మ ఏమీ మాట్లాడలేదు. కర్మేంద్రియాల ద్వారానే శబ్దము వస్తుంది, నోటి ద్వారా శబ్దము వస్తుంది. నోరు లేకపోతే శబ్దము ఎక్కడ నుండి వస్తుంది. ఆత్మకు ఈ కర్మేంద్రియాలు కర్మలు చేసేందుకు లభించాయి. రావణ రాజ్యములో మీరు వికర్మలు చేస్తారు. ఈ వికర్మలు ఛీ-ఛీ కర్మలుగా అవుతాయి. సత్యయుగములో రావణుడే ఉండడు కావున కర్మలు అకర్మలుగా అవుతాయి. అక్కడ పంచ వికారాలు ఉండవు. దానిని స్వర్గము అని అంటారు. భారతవాసులు స్వర్గవాసులుగా ఉండేవారు, ఇప్పుడు వారిని నరకవాసులు అని అంటారు. ఇక్కడ విషయ వైతరణి నదిలో మునకలు వేస్తూ ఉంటారు, అందరూ ఒకరికొకరు దుఃఖమునిచ్చుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఏమంటారంటే - బాబా, దుఃఖము అన్న మాటే లేని స్థానానికి మమ్మల్ని తీసుకువెళ్ళండి. భారత్ స్వర్గముగా ఉన్నప్పుడు దుఃఖమనే మాటే ఉండేది కాదు. స్వర్గము నుండి నరకములోకి వచ్చారు, ఇప్పుడు మళ్ళీ స్వర్గములోకి వెళ్ళాలి. ఇది ఒక ఆట. తండ్రియే కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. సత్యాతి-సత్యమైన సత్సంగము ఇదే. మీరు ఇక్కడ సత్యమైన తండ్రిని స్మృతి చేస్తారు, వారే ఉన్నతోన్నతమైన భగవంతుడు. వారు రచయిత, వారి నుండి వారసత్వము లభిస్తుంది. తండ్రియే పిల్లలకు వారసత్వాన్ని ఇస్తారు. హద్దు తండ్రి ఉన్నప్పటికీ కూడా మళ్ళీ - ఓ భగవంతుడా, ఓ పరమపిత పరమాత్మా, దయ చూపించండి అని తలచుకుంటారు. భక్తి మార్గములో ఎదురుదెబ్బలు తింటూ-తింటూ విసిగిపోయారు. ఓ బాబా, మాకు సుఖ-శాంతుల వారసత్వాన్ని ఇవ్వండి అని అంటారు. దీనిని తండ్రి మాత్రమే ఇవ్వగలరు, అది కూడా 21 జన్మల కోసం ఇస్తారు. లెక్క వేయాలి. సత్యయుగములో వీరి రాజ్యము ఉన్నప్పుడు తప్పకుండా కొద్దిమంది మనుష్యులే ఉంటారు. ఒకే ధర్మము ఉండేది, ఒకే రాజ్యము ఉండేది. దానిని స్వర్గము, సుఖధామము అని అంటారు. కొత్త ప్రపంచాన్ని సతోప్రధాన ప్రపంచము అని అంటారు, పాతదానిని తమోప్రధాన ప్రపంచము అని అంటారు. ప్రతి వస్తువు మొదట సతోప్రధానముగా ఉంటుంది, ఆ తర్వాత సతో, రజో, తమోలలోకి వస్తుంది. చిన్న పిల్లలను సతోప్రధానమైనవారు అని అంటారు. చిన్న పిల్లలను మహాత్ముల కన్నా ఉన్నతమైనవారు అని అంటారు. మహాత్ములు అయితే జన్మ తీసుకున్న తర్వాత పెద్దవారై వికారాలను అనుభవించి ఇళ్ళు-వాకిళ్ళను వదిలి పారిపోతారు. చిన్న పిల్లలకైతే వికారాల గురించే తెలియదు. వారు చాలా అమాయకముగా ఉంటారు. అందుకే వారిని మహాత్ముల కన్నా ఉన్నతమైనవారు అని అంటారు. దేవతలకు సర్వగుణ సంపన్నులు... అని మహిమను పాడుతారు. సాధువులను ఎప్పుడూ ఇలా మహిమ చేయరు. తండ్రి హింస మరియు అహింసల అర్థాన్ని అర్థం చేయించారు. ఎవరినైనా కొట్టడాన్ని హింస అని అంటారు. అన్నిటికన్నా పెద్ద హింస కామ ఖడ్గాన్ని ఉపయోగించడము. దేవతలు హింసకులుగా ఉండరు. వారు కామ ఖడ్గాన్ని ఉపయోగించరు. తండ్రి అంటారు, ఇప్పుడు నేను మిమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేసేందుకు వచ్చాను. దేవతలు సత్యయుగములో ఉంటారు. ఇక్కడ ఎవ్వరూ స్వయాన్ని దేవతలుగా చెప్పుకోలేరు. మేము నీచులము, పాపులము, వికారులము అని భావిస్తారు కావున స్వయాన్ని దేవతలుగా ఎలా చెప్పుకుంటారు, అందుకే హిందూ ధర్మమని అన్నారు. వాస్తవానికి ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము ఉండేది. హిందూ అన్న పేరును హిందుస్థాన్ నుండి తీసారు. ఇక వారు హిందూ ధర్మమని అనేసారు. మేము దేవతా ధర్మానికి చెందినవారమని మీరు చెప్పినా కూడా హిందువులలో కలిపేస్తారు. మా వద్ద హిందూ ధర్మమనే కాలమ్ మాత్రమే ఉందని అంటారు. పతితముగా అయిన కారణముగా స్వయాన్ని దేవతలుగా చెప్పుకోలేరు.

మనము పూజ్య దేవతలుగా ఉండేవారమని, ఇప్పుడు పూజారులుగా అయ్యామని ఇప్పుడు మీకు తెలుసు. పూజ కూడా మొదట కేవలం శివునికి మాత్రమే చేస్తారు, ఆ తర్వాత వ్యభిచారీ పూజారులుగా అయ్యారు. తండ్రి ఒక్కరే, వారి నుండి వారసత్వము లభిస్తుంది. ఆపై అనేక రకాల దేవీలు మొదలైనవారు ఉన్నారు. వారి నుండి ఎటువంటి వారసత్వము లభించదు. ఈ బ్రహ్మా నుండి కూడా మీకు వారసత్వము లభించదు. ఒకరు నిరాకారీ తండ్రి, మరొకరు సాకారీ తండ్రి. సాకారీ తండ్రి ఉన్నప్పటికీ కూడా ఓ భగవంతుడా, ఓ పరమపిత అని అంటూ ఉంటారు. లౌకిక తండ్రిని ఈ విధముగా అనరు. వారసత్వము తండ్రి నుండి లభిస్తుంది. పతి మరియు పత్ని హాఫ్ పార్ట్నర్స్ గా ఉంటారు కావున ఆమెకు సగభాగము లభించాలి. మొదట ఆమె కోసం సగభాగము తీసి ఆ తర్వాత మిగిలిన సగభాగము పిల్లలకు ఇవ్వాలి. కానీ ఈ రోజుల్లోనైతే పిల్లలకే మొత్తము ధనమంతటినీ ఇచ్చేస్తున్నారు. కొంతమందికి చాలా ఎక్కువ మోహము ఉంటుంది. వారు, నేను మరణించిన తర్వాత పిల్లలే హక్కుదారులుగా అవుతారని భావిస్తారు. ఈ రోజుల్లోని పిల్లలైతే తండ్రి పోయిన తర్వాత తల్లిని కనీసం అడగను కూడా అడగరు. కొంతమంది మాతృ-స్నేహులుగా ఉంటారు. కానీ కొంతమంది మాతృ-ద్రోహులుగా ఉంటారు. ఈ రోజుల్లో చాలా వరకు మాతృ-ద్రోహులుగానే ఉన్నారు. ధనమంతటినీ ఖర్చు చేసేస్తారు. దత్తత తీసుకోబడిన పిల్లలలో కూడా కొంతమంది చాలా విసిగించేవారు ఉంటారు. ఇప్పుడు పిల్లలు పాటను విన్నారు. బాబా, మాకు ప్రశాంతముగా ఉండేటువంటి సుఖము యొక్క మార్గాన్ని తెలియజేయండి అని అంటారు. రావణ రాజ్యములోనైతే సుఖము ఉండదు. భక్తి మార్గములోనైతే శివుడు వేరు, శంకరుడు వేరు అన్నది కూడా అర్థం చేసుకోరు. కేవలం తల వంచి నమస్కరిస్తూ ఉంటారు, శాస్త్రాలు చదువుతూ ఉంటారు. అచ్ఛా, దీని వలన ఏం లభిస్తుంది, ఏమీ తెలియదు. సర్వుల కొరకు శాంతి దాత, సుఖ దాత ఒక్క తండ్రి మాత్రమే. సత్యయుగములో సుఖము కూడా ఉంటుంది, శాంతి కూడా ఉంటుంది. భారత్ లో సుఖ-శాంతులు ఉండేవి, అవి ఇప్పుడు లేవు, అందుకే భక్తి చేస్తూ ప్రతి ముంగిట ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. శాంతిధామానికి, సుఖధామానికి తీసుకువెళ్ళేవారు ఒక్క తండ్రి మాత్రమేనని ఇప్పుడు మీకు తెలుసు. బాబా, మేము కేవలం మిమ్మల్ని మాత్రమే స్మృతి చేస్తాము, మీ నుండే వారసత్వాన్ని తీసుకుంటాము. తండ్రి అంటారు, దేహ సహితముగా దేహపు సర్వ సంబంధాలను మర్చిపోవాలి, ఒక్క తండ్రినే స్మృతి చేయాలి. ఆత్మ ఇక్కడే పవిత్రముగా అవ్వాలి. స్మృతి చేయకపోతే శిక్షలు అనుభవించవలసి ఉంటుంది, పదవి కూడా భ్రష్టమైపోతుంది, అందుకే తండ్రి అంటారు, స్మృతి చేసే కృషి చేయండి. తండ్రి ఆత్మలకు అర్థం చేయిస్తున్నారు. ఇతర ఏ సత్సంగాలు మొదలైనవాటిలో కూడా - ఓ ఆత్మిక పిల్లలూ అని ఇలా సంబోధించరు. ఇది ఆత్మిక జ్ఞానము, ఇది ఆత్మిక తండ్రి నుండే పిల్లలకు లభిస్తుంది. రూహ్ అనగా నిరాకారీ. శివుడు కూడా నిరాకారుడే కదా. మీ ఆత్మ కూడా ఒక బిందువు, ఆత్మ చాలా చిన్ననిది. దివ్యదృష్టితో తప్ప ఆత్మను ఎవ్వరూ చూడలేరు. దివ్యదృష్టిని తండ్రి మాత్రమే ఇస్తారు. భక్తులు కూర్చుని హనుమంతుడు, గణేశుడు మొదలైనవారిని పూజిస్తారు, ఇప్పుడు వారి సాక్షాత్కారము ఎలా జరుగుతుంది. తండ్రి అంటారు, దివ్యదృష్టి దాతను నేనే, ఎవరైతే చాలా భక్తి చేస్తారో, వారికి నేనే సాక్షాత్కారము చేయిస్తాను. కానీ దీని వలన లాభమేమీ ఉండదు. కేవలం సంతోషపడతారు. మళ్ళీ పాపాలైతే చేస్తారు. కావున సాక్షాత్కారాల వలన ఏమీ లభించదు. చదువు లేకుండా ఏమీ తయారవ్వలేరు. దేవతలు సర్వగుణ సంపన్నులు. మీరు కూడా అలా తయారవ్వండి కదా. మిగిలినవన్నీ భక్తి మార్గము యొక్క సాక్షాత్కారాలు. మీరు నిజముగానే శ్రీకృష్ణునితో పాటు ఊయల ఊగండి, స్వర్గములో వారితోపాటు ఉండండి. అదంతా చదువుపై ఆధారపడి ఉంది. ఎంతగా శ్రీమతముపై నడుస్తారో, అంతగా ఉన్నత పదవిని పొందుతారు. శ్రీమతము భగవంతునిది అని అంటూ ఉంటారు. అంతేకానీ శ్రీకృష్ణుని శ్రీమతము అని అనరు. పరమపిత పరమాత్ముని శ్రీమతము ద్వారా శ్రీకృష్ణుని ఆత్మ ఈ పదవిని పొందింది. మీ ఆత్మ కూడా దేవతా ధర్మములో ఉండేది అనగా శ్రీకృష్ణుని వంశములో ఉండేది. రాధా-కృష్ణులు ఒకరికి ఒకరు ఏమవుతారు అనేది భారతవాసులకు తెలియదు. ఇరువురూ వేర్వేరు రాజ్యాలకు చెందినవారు, స్వయంవరము తర్వాత లక్ష్మీ-నారాయణులుగా అవుతారు. ఈ విషయాలన్నీ తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీరు స్వర్గము యొక్క రాకుమార, రాకుమారీలుగా అయ్యేందుకు చదువుకుంటున్నారు. రాకుమారునికి, రాకుమారికి స్వయంవరము జరిగినప్పుడు పేర్లు మారుతాయి. ఒకవేళ తండ్రి ఇచ్చే శ్రీమతముపై నడుస్తే, తండ్రి పిల్లలను ఇటువంటి దేవతలుగా తయారుచేస్తారు. మీరు ముఖవంశావళి, వారు కుఖవంశావళి. ఆ బ్రాహ్మణులు కామ చితిపై కూర్చోబెట్టేందుకు ముడి వేస్తారు. ఇప్పుడు సత్యాతి-సత్యమైన బ్రాహ్మణీలైన మీరు కామ చితిపై నుండి దింపి జ్ఞాన చితిపై కూర్చోబెట్టేందుకు ముడి వేస్తారు. కనుక దానిని వదిలిపెట్టవలసి ఉంటుంది. ఇక్కడి పిల్లలైతే కొట్లాడుకుంటూ, గొడవపడుతూ, ధనాన్ని కూడా మొత్తం వృధా చేసేస్తారు. ఈ రోజుల్లో ప్రపంచములో చాలా అశుద్ధత ఉంది. అన్నిటికన్నా అశుద్ధమైన రోగము సినిమా. మంచి పిల్లలు కూడా సినిమాకు వెళ్ళడము వలన పాడైపోతారు, అందుకే బి.కె.లు సినిమాకు వెళ్ళడము నిషిద్ధము. అయితే, ఎవరైతే శక్తిశాలిగా ఉంటారో, వారికి బాబా - అక్కడ కూడా మీరు సేవ చేయండి అని చెప్తారు. అక్కడ వారికి మీరు ఇలా అర్థం చేయించండి - ఇది హద్దులోని సినిమా, అలాగే ఒక అనంతమైన సినిమా కూడా ఉంది, అనంతమైన సినిమా నుండే ఈ హద్దులోని అసత్యమైన సినిమాలు వెలువడ్డాయి.

ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి అర్థం చేయించారు - మూలవతనములో ఆత్మలన్నీ ఉంటాయి, ఆ తర్వాత మధ్యలో సూక్ష్మవతనము ఉంది, ఇది సాకార వతనము. నాటకమంతా ఇక్కడే నడుస్తుంది. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. బ్రాహ్మణ పిల్లలైన మీరే స్వదర్శన చక్రధారులుగా అవ్వాలి, అంతేకానీ దేవతలు కాదు. కానీ బ్రాహ్మణులకు ఈ అలంకారాలను చూపించరు ఎందుకంటే వారు పురుషార్థులు. ఈ రోజు బాగా నడుస్తారు, రేపు పడిపోతారు, అందుకే దేవతలకే అవి చూపిస్తారు. శ్రీకృష్ణుడు స్వదర్శన చక్రముతో అకాసురుడు-బకాసురుడు మొదలైనవారిని వధించారని చూపిస్తారు. వాస్తవానికి శ్రీకృష్ణుడిది అహింసా పరమో ధర్మము అని అంటారు, అటువంటప్పుడు వారు హింస ఎలా చేస్తారు! ఇదంతా భక్తి మార్గపు సామాగ్రి. ఎక్కడికి వెళ్ళినా, శివలింగాలే ఉంటాయి, కానీ పేర్లు మాత్రం వేర్వేరుగా ఎన్ని పెట్టారు. మట్టితో ఎన్ని దేవీల విగ్రహాలను తయారుచేస్తారు. వాటిని అలంకరిస్తారు, వేలాది రూపాయలను ఖర్చు చేస్తారు. వాటిని తయారుచేసి, వాటిని పూజించి, పాలన చేసి, మళ్ళీ వెళ్ళి ముంచేస్తారు. బొమ్మల పూజలకు ఎంత ఖర్చు చేస్తారు. కానీ ఏమీ లభించలేదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇదంతా ధనాన్ని వృధా చేసే భక్తి, మెట్లు దిగుతూనే వచ్చారు. తండ్రి వచ్చినప్పుడు అందరిదీ ఎక్కే కళ జరుగుతుంది. వారు అందరినీ శాంతిధామానికి, సుఖధామానికి తీసుకువెళ్తారు. ఇందులో ధనాన్ని వృధా చేసే విషయము లేదు. మళ్ళీ భక్తి మార్గములో మీరు ధనాన్ని వృధా చేస్తూ-చేస్తూ దివాలా అయిపోయారు. ధనవంతులుగా అయ్యే మరియు దివాలాగా అయ్యే కథను తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. మీరు ఈ లక్ష్మీ-నారాయణుల వంశావళికి చెందినవారు కదా. ఇప్పుడు మీకు నరుని నుండి నారాయణుడిగా అయ్యే శిక్షణను తండ్రి ఇస్తున్నారు. వారు మూడవ నేత్రము యొక్క కథను, అమరకథను వినిపిస్తారు. వాస్తవానికి అదంతా అసత్యము. మూడవ నేత్రము యొక్క కథ అయితే ఇదే, దీని ద్వారా ఆత్మకు జ్ఞానము యొక్క మూడవ నేత్రము తెరుచుకుంటుంది. మొత్తము చక్రమంతా బుద్ధిలోకి వచ్చేస్తుంది. మీకు జ్ఞానము యొక్క మూడవ నేత్రము లభిస్తూ ఉంది, అమరకథను కూడా వింటున్నారు. అమరుడైన బాబా మీకు కథను వినిపిస్తున్నారు - వారు అమరపురికి యజమానులుగా చేస్తారు. అక్కడ మీరు ఎప్పుడూ మృత్యువును పొందరు. ఇక్కడైతే మృత్యువంటే మనుష్యులకు ఎంత భయము ఉంటుంది. అక్కడ భయపడే విషయము కానీ, ఏడ్చే విషయము కానీ ఉండదు. సంతోషముగా పాత శరీరాన్ని వదిలి కొత్తది తీసుకుంటారు. ఇక్కడ మనుష్యులు ఎంతగా ఏడుస్తారు. ఇది ఉన్నదే ఏడ్చే ప్రపంచము. తండ్రి అంటారు, ఇది తయారై, తయారుచేయబడిన డ్రామా. ప్రతి ఒక్కరూ తమ-తమ పాత్రను అభినయిస్తూ ఉంటారు. ఈ దేవతలు మోహజీతులు కదా. ఇక్కడైతే ప్రపంచములో అనేకమంది గురువుల ఉన్నారు, వారి ద్వారా అనేక మతాలు లభిస్తాయి. ప్రతి ఒక్కరి మతము ఎవరిది వారిదే. సంతోషీ దేవీ కూడా ఒకరు ఉన్నారు, వారికి పూజ జరుగుతుంది. ఇప్పుడు సంతోషీ దేవీలైతే సత్యయుగములో ఉండగలరు, ఇక్కడ ఎలా ఉండగలరు. సత్యయుగములో దేవతలు సదా సంతుష్టముగా ఉంటారు. ఇక్కడైతే ఏదో ఒక ఆశ ఉంటుంది. అక్కడ ఎటువంటి ఆశ ఉండదు. తండ్రి అందరినీ సంతుష్టపరుస్తారు. మీరు పదమపతులుగా అవుతారు. ప్రాప్తి గురించి చింత కలిగే విధముగా అప్రాప్తి అనే వస్తువేదీ ఉండదు. అక్కడ చింత అనేది ఉండనే ఉండదు. తండ్రి అంటారు, సర్వుల సద్గతిదాత అయితే నేనే. పిల్లలైన మీకు 21 జన్మల కోసం సంతోషమే సంతోషాన్ని ఇస్తాను. ఇటువంటి తండ్రిని స్మృతి కూడా చేయాలి కదా. స్మృతి ద్వారానే మీ పాపాలు భస్మమవుతాయి మరియు మీరు సతోప్రధానముగా అవుతారు. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. ఇతరులకు ఎంత ఎక్కువగా అర్థం చేయిస్తూ ఉంటారో, అంతగా ప్రజలు తయారవుతూ ఉంటారు మరియు ఉన్నత పదవిని పొందుతారు. ఇది సాధువులు మొదలైనవారి కథేమి కాదు. భగవంతుడు కూర్చొని వీరి నోటి ద్వారా అర్థం చేయిస్తున్నారు. ఇప్పుడు మీరు సంతుష్ట దేవీ-దేవతలుగా తయారవుతున్నారు. ఇప్పుడు మీరు సదా పవిత్రముగా ఉండే వ్రతాన్ని కూడా పెట్టుకోవాలి ఎందుకంటే పావన ప్రపంచములోకి వెళ్ళాలంటే పతితముగా అవ్వకూడదు. తండ్రి ఈ వ్రతాన్ని నేర్పించారు. మనుష్యులు అనేక రకాల వ్రతాలను తయారుచేసారు. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఒక్క తండ్రి ఇచ్చే మతముపై నడుస్తూ సదా సంతుష్టముగా ఉంటూ సంతోషీ దేవీ వలె తయారవ్వాలి. ఇక్కడ ఎటువంటి ఆశ పెట్టుకోకూడదు. తండ్రి నుండి సర్వ ప్రాప్తులను పొంది పదమపతులుగా అవ్వాలి.

2. అన్నింటికన్నా అశుద్ధముగా తయారుచేసేది సినిమా. మీకు సినిమా చూడటానికి అనుమతి లేదు. మీరు ధైర్యవంతులైతే హద్దు మరియు అనంతమైన సినిమా యొక్క రహస్యాన్ని అర్థం చేసుకుని ఇతరులకు అర్థం చేయించండి. సేవ చేయండి.

వరదానము:-
పురుషార్థము మరియు సేవలో విధి పూర్వకముగా వృద్ధిని ప్రాప్తి చేసుకునే తీవ్ర పురుషార్థీ భవ

బ్రాహ్మణులు అనగా విధి పూర్వకమైన జీవితము కలవారు. ఏ కార్యమునైనా ఎప్పుడైతే విధి పూర్వకముగా చేస్తారో అప్పుడే అది సఫలమవుతుంది. ఒకవేళ ఏ విషయములోనైనా, స్వ పురుషార్థములోనైనా లేక సేవలోనైనా వృద్ధి జరగకపోతే తప్పకుండా విధిలో ఏదో లోపము ఉన్నట్లు, అందుకే చెక్ చేసుకోండి - అమృతవేళ నుండి రాత్రి వరకు మనసా-వాచ-కర్మణా మరియు సంపర్కము విధి పూర్వకముగా ఉన్నాయా అనగా వృద్ధి జరిగిందా? ఒకవేళ వృద్ధి జరగకపోతే దానికి కారణము ఆలోచించి దానిని నివారణ చెయ్యండి, ఇక అప్పుడు నిరాశపడరు. ఒకవేళ విధి పూర్వక జీవితము ఉన్నట్లయితే వృద్ధి తప్పకుండా జరుగుతుంది మరియు తీవ్ర పురుషార్థులుగా అవుతారు.

స్లోగన్:-
స్వచ్ఛతలో మరియు సత్యతలో సంపన్నులుగా అవ్వటమే సత్యమైన పవిత్రత.

అవ్యక్త సూచనలు - స్వయము కొరకు మరియు సర్వుల కొరకు మనసా ద్వారా యోగ శక్తులను ప్రయోగము చెయ్యండి

ఎప్పుడైనా వాణి ద్వారా ఏ కార్యమైనా జరగకపోతే, అక్కడ ఏమంటారంటే - వీరు వాణితో అర్థం చేసుకోరు, వీరు శుభ భావనతో పరివర్తన అవుతారు అని. ఎక్కడైతే వాణి కార్యాన్ని చేయించలేదో, అక్కడ సైలెన్స్ శక్తి యొక్క సాధనాలైన శుభ సంకల్పాలు, శుభా భావన, నయనాల భాష ద్వారా దయ మరియు స్నేహము యొక్క అనుభూతి ఆ కార్యాన్ని పూర్తి చేస్తుంది.