24-11-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - జ్ఞాన ధనాన్ని దానము చేయడానికి విచార
సాగర మంథనము చేయండి, దానము చేయాలనే అభిరుచి పెట్టుకున్నట్లయితే మంథనము నడుస్తూ
ఉంటుంది’’
ప్రశ్న:-
జ్ఞాన
మార్గములో సదా స్వయాన్ని ఆరోగ్యముగా ఉంచుకునేందుకు సాధనమేమిటి?
జవాబు:-
సదా స్వయాన్ని
ఆరోగ్యముగా ఉంచుకునేందుకు బాబా ద్వారా ఏదైతే జ్ఞానమనే గడ్డి (మురళి) లభిస్తుందో,
దానిని తిని, తర్వాత నెమరువేయాలి అనగా మంథనము చేయాలి. ఏ పిల్లలకైతే మంథనము చేసే అనగా
జీర్ణము చేసుకునే అలవాటు ఉందో, వారు అనారోగ్యము పాలవ్వరు. ఎవరిలోనైతే వికారాల వ్యాధి
ఉండదో, వారే సదా ఆరోగ్యవంతులు.
పాట:-
నీవు ప్రేమ
సాగరుడవు...
ఓంశాంతి
పిల్లలు
పాటను విన్నారు. మనుష్యులు పాటలు మొదలైనవాటిని ఏవైతే తయారుచేస్తారో, శాస్త్రాలు
మొదలైనవి ఏవైతే వినిపిస్తారో, వాటి గురించి ఏమీ అర్థం చేసుకోరు. ఏవైతే చదువుతూ
వచ్చారో, వాటి ద్వారా ఎవరి కళ్యాణము జరగలేదు, ఇంకా అకళ్యాణమే జరుగుతూ వచ్చింది.
సర్వుల కళ్యాణకారి ఒక్క ఈశ్వరుడు మాత్రమే. మన కళ్యాణము చేసేవారు వచ్చి ఉన్నారని మీరు
అర్థం చేసుకుంటారు. వారు కళ్యాణము యొక్క మార్గాన్ని తెలియజేస్తున్నారు. ముఖ్యముగా
భారతవాసులైన మీకు మరియు మొత్తం ప్రపంచానికి కళ్యాణము చేసేవారు ఒక్క తండ్రి మాత్రమే.
సత్యయుగములో అందరి కళ్యాణము జరిగి ఉంది, మీరంతా సుఖధామములో ఉండేవారు మరియు
మిగిలినవారంతా శాంతిధామములో ఉండేవారు. ఈ విషయము పిల్లల బుద్ధిలో ఉంది కానీ పాయింట్
జారిపోతుంది, పూర్తిగా ధారణ చేయరు. ఒకవేళ ఒక్క పాయింటుపై విచార సాగర మంథనము చేస్తూ
ఉన్నా కూడా ఇలా జరగదు. జంతువులలో ఎంతైతే తెలివి ఉందో, నేటి మనుష్యులలో అంత తెలివి
కూడా లేదు. జంతువు (ఆవు) గడ్డి తిన్న తర్వాత నెమరువేస్తూ ఉంటుంది. మీకు కూడా భోజనము
లభిస్తుంది. కానీ మీరు దానిని రోజంతా నెమరువేయరు. ఆవులైతే రోజంతా నెమరువేస్తూనే
ఉంటాయి. ఇక్కడ మీకు ఈ జ్ఞానమనే గడ్డి లభిస్తుంది. యోగము మరియు జ్ఞానము. దీనిపై
రోజంతా విచార సాగర మంథనము చేస్తూ ఉండాలి. ఎవరికైతే సేవ పట్ల అభిరుచి లేదో, వారు
విచార సాగర మంథనము చేసి ఏం చేస్తారు. అభిరుచి లేకపోతే చేయరు కూడా. కొంతమందికి జ్ఞాన
ధనాన్ని ఇచ్చే అభిరుచి ఉంటుంది. గోశాలకు మనుష్యులు వెళ్ళి ఆవులకు గడ్డి మొదలైనవి
ఇస్తారు. దానిని కూడా పుణ్యముగా భావిస్తారు. తండ్రి మీకు ఈ జ్ఞానమనే గడ్డిని
తినిపిస్తారు. దీనిపై విచార సాగర మంథనము చేస్తూ ఉన్నట్లయితే సంతోషముగా ఉంటారు మరియు
సేవ పట్ల అభిరుచి కూడా ఉంటుంది. కొందరు చెంబు నిండా తీసుకుంటారు లేక ఒక్క బిందువే
తీసుకుంటారు, వారు కూడా స్వర్గములోకి వెళ్తారు. స్వర్గ ద్వారాలైతే తెరుచుకునేదే ఉంది.
వాస్తవానికి జ్ఞాన సాగరుడిని మింగేయాలి. కొందరైతే పూర్తిగా మింగేస్తారు, కొందరైతే
ఒక్క బిందువునే తీసుకుంటారు, అయినా కానీ స్వర్గములోకైతే వెళ్తారు. ఇకపోతే, ఎంతగా
ధారణ చేస్తారో, అంత ఉన్నత పదవిని పొందుతారు. ఇకపోతే, స్వర్గములోకైతే ఒక్క బిందువును
తీసుకున్నా కూడా వెళ్ళిపోతారు. మనుష్యులు మరణించేటప్పుడు వారికి గంగ యొక్క ఒక్క
బిందువును అందిస్తారు. కొందరి ఇళ్ళలో ఎప్పుడూ గంగా జలాన్నే తాగుతారు. ఎంతగా తాగుతూ
ఉండవచ్చు. గంగ అయితే ప్రవహిస్తూనే ఉంటుంది. దానినైతే ఎవరూ మింగేయలేరు. సాగరాన్ని
మింగేశారని మీ గురించే అంటూ ఉంటారు. ఎవరైతే జ్ఞాన సాగరునికి సమీపముగా వస్తారో,
ఎక్కువ సేవ చేస్తారో, వారే విజయమాలలో కూర్చబడతారు. ఎవరు ఎంతగా మింగుతారో మరియు
ఇతరుల కళ్యాణము చేస్తారో, వారు పదవిని కూడా పొందుతారు. ఎంతగా ధారణ చేస్తారో, అంత
సంతోషము కూడా ఉంటుంది. ధనవంతులకు సంతోషము ఉంటుంది కదా. ఎవరి వద్దనైతే ఎంతో అపారమైన
ధనముంటుందో, దానము చేస్తారో, కాలేజీలు, ధర్మశాలలు, మందిరాలు మొదలైనవి కట్టిస్తారో,
వారికి అంత సంతోషము కూడా ఉంటుంది. ఇక్కడ మీకు అవినాశీ జ్ఞాన రత్నాలు లభిస్తాయి, 21
జన్మల కోసం అవినాశీ ఖజానా. ఎవరైతే మంచి రీతిలో ధారణ చేసి, తర్వాత దానము కూడా
చేస్తారో, వారికి మంచి పదవి లభిస్తుంది. కొందరు పిల్లలు ఏమని వ్రాస్తారంటే - బాబా,
ఉద్యోగము వదిలేసి ఈ ఆత్మిక సేవలో నిమగ్నమవ్వాలని, ప్రొజెక్టరు, ప్రదర్శనీ తీసుకుని
తిరుగుతూ ఉండాలి అని నాకు అనిపిస్తుంది. ఎవరికైనా ఒక్క బిందువు లభించినా సరే, వారి
కళ్యాణము జరుగుతుంది, సేవ పట్ల నాకు చాలా అభిరుచి ఉంది అని అంటారు. ఇకపోతే, ప్రతి
ఒక్కరి అవస్థ గురించి బాబాకు తెలుసు. సేవతో పాటు గుణాలు కూడా కావాలి. క్రోధము
ఉండకూడదు, అలాగే తప్పుడు ఆలోచనలేవీ రాకూడదు. వికారాల వ్యాధి ఏదీ ఉండకూడదు. ఆరోగ్యము
బాగా ఉండాలి. ఎవరిలోనైతే వికారాలు తక్కువగా ఉన్నాయో, వారిని బాబా - వీరు ఆరోగ్యముగా
ఉన్నారని అంటారు. బాబా వారిని మహిమ చేస్తారు కదా. ఎవరెవరు మంచి మహారథులు అని
చెప్పుకుంటూ ఉంటారు కూడా. వాళ్ళు అసురులకు మరియు దేవతలకు యుద్ధము జరిగినట్లుగా,
దేవతలు విజయము పొందినట్లుగా చూపించారు. ఇప్పుడు మనకు 5 వికారాల రూపీ అసురులతో
యుద్ధము జరుగుతుంది. అంతేకానీ, అసురులు అంటే వేరే రకమైన మనుష్యులెవరూ కారు.
ఎవరిలోనైతే ఆసురీ స్వభావము ఉంటుందో, వారినే అసురులని అంటారు. నంబరువన్ ఆసురీ
స్వభావము కామము, అందుకే సన్యాసులు కూడా దానిని వదిలి పారిపోతారు. ఈ ఆసురీ అవగుణాలను
వదలడములో శ్రమ అనిపిస్తుంది. ఉండటము కూడా గృహస్థములోనే ఉండాలి కానీ ఆసురీ
స్వభావాన్ని విడిచిపెట్టాలి. పవిత్రముగా అవ్వడముతో ముక్తి-జీవన్ముక్తులు లభిస్తాయి.
ఇది ఎంత పెద్ద ప్రాప్తి. వారైతే ఇళ్ళు-వాకిళ్ళను వదిలి పారిపోతారు, కానీ ప్రాప్తి
ఏమీ లేదు. ఈ చిత్రాలలో ఎంత మంచి-మంచి అర్థం చేసుకోవాల్సిన విషయాలు ఉన్నాయి. వారు
కేవలం చిత్రాలను షో చేస్తారు. కేవలం చిత్రాలను చూసేందుకు ఎంతమంది వెళ్తారు. లాభమేమీ
ఉండదు. ఇక్కడ ఈ చిత్రాలలో ఎంత జ్ఞానముంది, వీటితో చాలా లాభము కలుగుతుంది. ఇందులో
ఆర్ట్ మొదలైనవాటి విషయమేమీ లేదు, అలాగే తయారుచేసేవారి తెలివితేటలు కూడా లేవు.
మనుష్యులు తయారుచేసిన చిత్రాలపైనైతే వారి పేర్లు వ్రాయబడి ఉంటాయి. ఆర్టిస్టుకు కూడా
బహుమతి లభిస్తుంది. చాలామంది, తండ్రినైతే తప్పకుండా స్మృతి చేయాలి అని ఈ మాత్రమైతే
అర్థం చేసుకుంటారు. ఈ మాత్రం అన్నా కూడా, ప్రజలుగా అవుతారు. ప్రజలైతే అనేకమంది
తయారయ్యేది ఉంది. నేనైతే జ్ఞాన సాగరుడిని. ఎవరికైనా ఒక్క బిందువు లభించినా కూడా,
స్వర్గములోకి తప్పకుండా వస్తారు.
ప్రదర్శనీలు,
మేళాల ద్వారా చాలామంది కళ్యాణము జరుగుతుందని మీరు అర్థం చేసుకుంటారు. ఈశ్వరుడు
కళ్యాణకారి కదా. మీ కళ్యాణము కూడా జరుగుతూ ఉంది. కానీ దాని కోసం మళ్ళీ స్వయం విచార
సాగర మంథనము చేస్తూ ఉండాలి. స్మృతిలోకి తీసుకువస్తూ ఉంటే చాలా లాభముంటుంది. తప్పుడు
మాటలనైతే ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయాలి. తండ్రి అంటారు - నేను మీకు చాలా
మంచి విషయాలను వినిపిస్తాను. నంబర్ వన్ ముఖ్యమైన విషయము ఒక్కటే - ఎవరికైనా సరే
తండ్రి పరిచయాన్ని ఇవ్వండి. కేవలం ఒక్క తండ్రినే స్మృతి చేయండి, వారే సర్వస్వము.
భక్తి మార్గములో చాలామంది ఇలాంటివారు ఉంటారు. వారికి చెప్పండి - మీరైతే చాలా మంచి
పని చేస్తున్నారు, అంతా పరమాత్మయే చేయిస్తారని వేలితో పైకి సూచిస్తారు, ఆ సర్వుల
కళ్యాణకారి పైన ఉంటారు. వాస్తవానికి ఆత్మలైన మీరు కూడా అక్కడే ఉంటారు. జ్ఞానానికి
సంబంధించిన ఈ విషయాలన్నింటినీ మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటారు.
తండ్రి అంటారు
- పిల్లలూ, ఇప్పుడు మీ ఈ వస్త్రము (శరీరము) కుళ్ళిపోయింది. సత్య, త్రేతాయుగాలలో ఎంత
మంచి వస్త్రము ఉండేది. ఇప్పుడు కుళ్ళిపోయిన వస్త్రాన్ని ఎంతవరకని ధరిస్తారు. కానీ ఈ
విషయాన్ని ఎవరూ అర్థం చేసుకోరు. తండ్రి వచ్చి అర్థం చేయించినప్పుడే అర్థం
చేసుకుంటారు. ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకున్నారు - జ్ఞానాన్ని ఇచ్చేవారు
ఒక్క తండ్రి మాత్రమే. వారు సాగరుడు. ఎవరైతే సాగరాన్ని మింగేస్తారో, వారే విజయమాలలోని
మణులుగా అవుతారు. వారు సదా సేవలోనే తత్పరులై ఉంటారు. బాబా పిల్లలను పావనముగా
తయారుచేయడానికే వచ్చారు, పావనముగా అయి తిరిగి వెళ్ళాలి. ఎక్కడి నుండైతే వచ్చారో,
మళ్ళీ అక్కడికే నంబరువారుగా వెళ్తారు. ముందు-వెనుక వెళ్ళలేరు. నాటకములో పాత్రధారుల
పాత్ర సమయమనుసారముగా జరుగుతుంది కదా. ఇందులో కూడా, ఎవరైతే పాత్రధారులు ఉన్నారో, వారు
నంబరువారుగా తమ-తమ సమయమనుసారముగా వస్తూ ఉంటారు. ఈ అనంతమైన నాటకము తయారై ఉంది.
బ్రహ్మతత్వములో ఆత్మలమైన మనము బిందువుల వలె ఉంటాము. అక్కడ ఇంకేమి ఉంటుంది. బిందువైన
ఆత్మ ఎక్కడ, ఇంత పెద్ద శరీరము ఎక్కడ. ఆత్మ ఎంత తక్కువ స్థానము తీసుకుంటుంది. బ్రహ్మ
మహాతత్వము ఎంత పెద్దది. ఎలాగైతే ఆకాశానికి అంతం లేదో, అలా బ్రహ్మ మహాతత్వానికి కూడా
అంతం లేదు. దానిని సంపూర్ణముగా తెలుసుకుందామని ఎంతగా ప్రయత్నిస్తారు కానీ
తెలుసుకోలేరు. ఎంతగా కష్టపడుతూ ఉంటారు. కానీ దానిని పట్టుకునేందుకు లేక దాటి
వెళ్ళేందుకు అది ఒక వస్తువేమీ కాదు. సైన్స్ యొక్క గర్వము ఎంతగా ఉంది. దాని వలన
లాభమేమీ లేదు. ఆకాశమే ఆకాశము, పాతాళమే పాతాళము అని విన్నారు కదా. చంద్రునిలో
ప్రపంచము ఉంటుందని భావిస్తారు. ఇది కూడా డ్రామాలో వారి పాత్ర. లాభమేమీ లేదు. తండ్రి
వచ్చి మనల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు. ఎంత లాభముంది. ఇకపోతే,
చంద్రునిపైకి వెళ్ళడము, మాయమంత్రాలతో విభూతి మొదలైనవాటిని తీయడం... వాటి వలన ఏం
లాభము. ఇప్పుడైతే మనం అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటాము.
కల్ప-కల్పము తీసుకుంటూ వచ్చాము. ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు రిపీట్ అవుతాయి. ఈ చక్రము
తిరుగుతూ ఉంటుంది. ప్రపంచములో మొట్టమొదట కేవలం భారత్ యే ఉండేది. భారతవాసులే
విశ్వానికి యజమానులుగా ఉండేవారు. అక్కడ దేవతలకు ఇతర ఏ ఖండాల గురించి తెలియదు. అవి
తర్వాత వృద్ధి చెందుతాయి. కొత్త-కొత్త ధర్మ స్థాపకులు వచ్చి తమ-తమ ధర్మాలను స్థాపన
చేస్తారు. ఇకపోతే, వారేమీ సద్గతినివ్వరు, కేవలం ధర్మ స్థాపన చేస్తారు. వారికి ఏం
మహిమ ఉంటుంది! ముక్తిధామము నుండి పాత్రను అభినయించేందుకు వస్తారు. మనుష్యులేమంటారంటే
- మోక్షములోనే కూర్చుండిపోవాలి, ఈ రాకపోకల చక్రములోకి అసలు ఎందుకు రావాలి? కానీ
ఇందులోకి రావాల్సిందే, పునర్జన్మలు తీసుకోవాల్సిందే, మళ్ళీ తిరిగి వెళ్ళాలి. ఇది
తయారై, తయారుచేయబడిన డ్రామా చక్రము. లక్షల సంవత్సరాల డ్రామా అయితే ఏదీ ఉండనే ఉండదు.
ఇది సహజమైన అనాది డ్రామా, దీనిని ఈశ్వరీయ సృష్టి రచన అని అంటారు. రచయిత మరియు రచనల
అద్భుతమేదైతే ఉందో, దానిని తెలుసుకోవాల్సి ఉంటుంది. సృష్టి చక్రాన్ని
తెలుసుకునేందుకు కూర్చుని పురుషార్థము చేసే మనుష్యులెవరూ ఉండరు. ఈ సృష్టి చక్రము ఎలా
తిరుగుతుంది అనే ఆలోచన అసలు రానే రాదు. అన్నిటికంటే అత్యంత పురాతనమైన చిత్రము
శివలింగముది. ఖుదా వచ్చి ఉన్నారు, తర్వాత వారి స్మృతిచిహ్నాన్ని తయారుచేస్తారు.
ముందుగా శివుని పూజ మొదలైనప్పుడు వజ్రాల లింగాన్ని తయారుచేస్తారు. తర్వాత భక్తి రజో,
తమోగా అయినప్పుడు రాతితో కూడా తయారుచేస్తారు. శివబాబా అయితే వజ్రాలతో తయారుచేయబడి
లేరు. వారు ఒక బిందువు, పూజ కోసం పెద్దగా తయారుచేస్తారు. మేము వజ్రాల శివలింగాన్ని
తయారుచేయాలని భావిస్తారు. అంత పెద్ద సోమనాథుని మందిరములో ఒక్క బిందువును పెడితే
అర్థం కూడా కాదు. భక్తి మార్గములో ఏమేమి జరుగుతుంది అనేది తండ్రి అర్థం
చేయిస్తున్నారు. సైన్స్ వారు ఆవిష్కరణలు చేస్తూ ఉంటారు. మంచి-మంచి వస్తువులను
కనిపెడుతూ ఉంటారు. వినాశనము కోసం కూడా కనిపెడుతూ ఉంటారు. ఇంతకుముందు విద్యుత్తు
ఉండేది కాదు, మట్టి దీపాలను వెలిగించేవారు.
తండ్రి అర్థం
చేయిస్తున్నారు - మధురాతి మధురమైన పిల్లలూ, కొద్దిలోనే రాజీ పడకండి. మంచి రీతిలో
ధారణ చేసి సాగరాన్ని మింగేయండి. ఎవరైతే మంచి సేవ చేస్తారో, వారు పదవి కూడా మంచిదే
పొందుతారు. రోజంతా సంతోషము యొక్క పాదరసము పైకి ఎక్కి ఉండాలి. ఇదైతే ఛీ-ఛీ ప్రపంచము.
ఇప్పుడు ఇక్కడ నుండి వెళ్ళిపోతాము. పాత ప్రపంచమైతే సమాప్తమయ్యేదే ఉంది, ఏర్పాట్లు
జరుగుతున్నాయి. ఇంకా కొన్ని రోజులే ఉన్నాయి, ఈ లోపు కూడా ఎంత సేవ చేయాలి. కేవలం
భారత్ లో మాత్రమే కాదు, విదేశాలలో కూడా అన్ని వైపులా చుట్టి రావాలి. వార్తాపత్రికల
ద్వారా విదేశాలలోని మూలమూలల వరకు కూడా తెలిసిపోవాలి. ఈ మెట్ల వరస చిత్రము
మొదలైనవాటితో వెంటనే అర్థం చేసుకుంటారు. తండ్రి పిల్లలను మళ్ళీ స్వర్గవాసులుగా
తయారుచేయడానికే వస్తారు. తప్పకుండా లక్ష్మీ-నారాయణులు భారత్ లోనే రాజ్యము చేసి
వెళ్ళారు. భారత్ ప్రాచీన దేశమని మహిమను అయితే చాలా చేస్తారు. భారత్ అలా ఉండేదని,
భారత్ లో అటువంటి పవిత్రమైన దేవీలు ఉండేవారని చాలా మహిమ చేస్తారు. మనం తండ్రి నుండి
21 జన్మల ప్రారబ్ధాన్ని పొందుతామని మీకు తెలుసు. తండ్రి పూర్తిగా సింపుల్ గా
చదివిస్తారు. ద్రౌపది పాదాలను ఒత్తారని చూపిస్తారు, కానీ అలాంటిదేమీ లేదు. ఇక్కడైతే
బాబా అంటారు - పిల్లలు భక్తి మార్గములో ఎదురుదెబ్బలు తిని అలసిపోయారు, ఇప్పుడు నేను
మీ అలసటను దూరం చేస్తాను, మీరు ఎదురుదెబ్బలు తింటూ-తింటూ పతితముగా అయిపోయారు. తండ్రి
అంటారు - నేను మీ అలసటను దూరం చేస్తున్నాను, ఇక తర్వాత ఎప్పుడూ దుఃఖాన్ని చూడరు.
కొద్దిగా కూడా దుఃఖము అన్న పేరే ఉండదు. ఇకపోతే, పురుషార్థము చేసి ఉన్నత పదవిని
పొందాలి. మంచి పదవిని పొందితే అంటారు కదా - వీరు గత జన్మలో మంచి కర్మలు చేసారు అని.
మహిమ అయితే జరుగుతుంది కదా. కానీ వారు ఎప్పుడు పురుషార్థము చేసి ఆ పదవిని పొందారు
అనేది ఎవ్వరికీ తెలియదు! ఇప్పుడు తండ్రి మీకు అటువంటి కర్మలను నేర్పిస్తున్నారు.
మీకు కూడా చెప్తున్నారు - మంచి కర్మలు చేసి ఉన్నత పదవిని పొందండి అని. ఇక్కడ
మనుష్యుల కర్మలు వికర్మలుగా అవుతాయి. అక్కడ ఉన్నదే స్వర్గము. అక్కడ కర్మలు అకర్మలు
అవుతాయి. అక్కడ ఈ జ్ఞానము ఉండదు. తండ్రి అంటారు - కర్మల గతి గురించి నాకు తెలుసు. ఈ
సమయములో ఎవరైతే మంచి కర్మలు చేస్తారో, వారు ఫలాన్ని కూడా మంచిదే పొందుతారు. ఇది
కర్మక్షేత్రము. కొందరు చాలా మంచి కర్మలు చేస్తారు. కొంతమందికి కేవలం సేవ గురించి
మాత్రమే చింత ఉంటుంది. బాబా, మాలో ఏవైనా లోపాలు ఉన్నాయా అని అడుగుతారు. లేదు. సేవను
అయితే ఎంత చేయగలరో అంత చేస్తారు. సేవ వృద్ధి చెందుతూ ఉంటుంది. సేవ చేసేవారు కూడా
వెలువడుతూ ఉంటారు. ఇంకా కొద్ది రోజులే ఉన్నాయని మనసులో ధైర్యముంది. ఇప్పుడు ఎలాంటి
పురుషార్థము చేయాలంటే, అక్కడ కూడా ఉన్నత పదవిని పొందాలి. బాబా ఈ జ్ఞానమనే గడ్డిని
తినిపిస్తారు. బాబా అంటారు - దీనిని నెమరువేస్తూ ఉన్నట్లయితే ధారణ పక్కా అవుతుంది,
సంతోషము యొక్క పాదరసము కూడా పైకి ఎక్కుతుంది. చాలా సేవ చేయాలి, చాలామందికి
సందేశాన్ని ఇవ్వాలి. మీరు సందేశకుని పిల్లలు, సందేశకులు. ఒకానొక రోజు పెద్ద
వార్తాపత్రికలలో కూడా మీ చిత్రాలు ముద్రించబడతాయి. విదేశాల వరకు పత్రికలు వెళ్తాయి
కదా. ఈ జ్ఞానమైతే గాడ్ ఫాదర్ అందించినది అని చిత్రాల ద్వారా అర్థం చేసుకుంటారు.
ఇకపోతే, మన్మనాభవగా అవ్వడములో శ్రమ ఉంది. భారతవాసులే ఈ శ్రమ చేస్తారు. అచ్ఛా!
మధురాతి
మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. తండ్రి ఏవైతే మంచి-మంచి విషయాలను వినిపిస్తారో, వాటిపై విచార సాగర మంథనము చేసి
అనేకుల కళ్యాణకారిగా అవ్వాలి. తప్పుడు మాటలను ఒక చెవితో విని మరొక చెవితో వదిలేయాలి.
2. ఏదైనా ఆసురీ స్వభావముంటే, దానిని వదిలేయాలి. తండ్రి జ్ఞానమనే గడ్డిని ఏదైతే
తినిపిస్తారో, దానిని నెమరువేస్తూ ఉండాలి.
వరదానము:-
సర్వ ఖజానాలను విశ్వ కళ్యాణము కోసం ఉపయోగించే సిద్ధి స్వరూప
భవ
మీరు మీ హద్దు ప్రవృత్తులలో, మీ హద్దు స్వభావ-సంస్కారాల
ప్రవృత్తిలో చాలా సమయాన్ని వెచ్చిస్తారు, కానీ మీ-మీ ప్రవృత్తుల నుండి అతీతముగా అనగా
ఉపరామముగా ఉండండి మరియు ప్రతి సంకల్పము, మాట, కర్మ మరియు సంబంధ-సంపర్కాలలో
బ్యాలెన్స్ ఉంచండి, అప్పుడు సర్వ ఖజానాల ఎకానమీ ద్వారా తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభము
పొందేవారిగా అవుతారు. ఇప్పుడు సమయము రూపీ ఖజానా, శక్తి యొక్క ఖజానా మరియు స్థూల
ఖజానాలలో తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభము పొందేవారిగా అవ్వండి, వీటిని స్వయం కోసము
కాకుండా విశ్వ కళ్యాణము కోసం ఉపయోగించండి, అప్పుడు సిద్ధి స్వరూపులుగా అయిపోతారు.
స్లోగన్:-
ఒక్కరి లగనములో
సదా నిమగ్నమై ఉన్నట్లయితే నిర్విఘ్నులుగా అయిపోతారు.
అవ్యక్త ప్రేరణలు -
బ్రహ్మాబాబా సమానముగా సంపన్న మరియు సంపూర్ణ స్థితిని అనుభవము చేయండి
ఇప్పుడు సేవా
బంధనములోకి మరియు కర్మ బంధనములోకి కూడా రాకండి. మా స్థానము, మా సేవ, మా విద్యార్థులు,
మా సహయోగీ ఆత్మలు - ఇలా అనుకోవటము కూడా సేవలోని కర్మ బంధనాలే. ఈ కర్మ బంధనాల నుండి
అతీతముగా అనగా కర్మాతీతముగా ఉండాలి. ఎలా అయితే బ్రహ్మాబాబా సదా అతీతము మరియు ప్రియము
యొక్క బ్యాలెన్స్ ను పెట్టుకున్నారో, అందరికీ ‘నా వారు’ అన్న అనుభూతిని చేయిస్తూ
కూడా ప్రతి ఒక్కరి సంబంధాన్ని ఆ ఒక్కరితోనే (నిరాకార బాబాతోనే) జోడింపజేసారో, అలా
పిల్లలైన మీరు కూడా అందరికీ ‘నా వారు’ అన్న అనుభూతిని కలిగిస్తూ, ఆత్మలను సమీప
ఆశ్రయ స్థానాలకు చేర్చేవారిగా అవ్వండి, అప్పుడు బాబా సమానులు అని అంటారు.