25-08-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - అడుగడుగులోనూ ఏదైతే జరుగుతోందో అది
కళ్యాణకారియే, ఈ డ్రామాలో అందరికంటే ఎక్కువ కళ్యాణము ఎవరిది జరుగుతుందంటే, ఎవరైతే
తండ్రి స్మృతిలో ఉంటారో వారిది’’
ప్రశ్న:-
డ్రామాలో నిశ్చితమై ఉన్న ఏ విషయాన్ని తెలుసుకునే పిల్లలు అపారమైన సంతోషములో
ఉండగలుగుతారు?
జవాబు:-
డ్రామానుసారముగా ఇప్పుడు ఈ పాత ప్రపంచము వినాశనమవుతుంది, ప్రకృతి వైపరీత్యాలు కూడా
జరుగుతాయి, కానీ మా రాజధాని అయితే స్థాపన అయ్యే తీరుతుంది, ఇందులో ఎవ్వరూ ఏమీ
చేయలేరు అని ఏ పిల్లలకైతే తెలుసో, వారు అపారమైన సంతోషములో ఉండగలుగుతారు. అవస్థలు
పైకి-కిందికి అవుతూ ఉంటాయి, ఒక్కోసారి చాలా ఉత్సాహము ఉంటుంది, ఒక్కోసారి
చల్లబడిపోతారు, కానీ ఇందులో తికమకపడకూడదు. సర్వాత్మలకు తండ్రి అయిన భగవంతుడు
మమ్మల్ని చదివిస్తున్నారు అన్న ఈ సంతోషములో ఉండాలి.
పాట:-
సభలో జ్యోతి
వెలిగింది...
ఓంశాంతి
నంబరువారు పురుషార్థానుసారముగా ఉన్న మధురాతి మధురమైన చైతన్యమైన దీపము పురుగుల
వంటివారికి బాబా ప్రియస్మృతులను ఇస్తున్నారు. మీరందరూ చైతన్యమైన దీపము పురుగులు.
తండ్రిని జ్యోతి అని కూడా అంటారు, కానీ వారి గురించి ఏ మాత్రము తెలియదు. ఇక్కడ
జ్యోతి పెద్దగా లేరు, ఒక బిందువులా ఉన్నారు. ఆత్మనైన నేను ఒక బిందువునని, ఆత్మనైన
నాలో పాత్ర అంతా ఉందని ఎవ్వరి బుద్ధిలోనూ ఉండదు. ఆత్మ మరియు పరమాత్మల జ్ఞానము
ఇంకెవ్వరి బుద్ధిలోనూ లేదు. పిల్లలైన మీకే తండ్రి వచ్చి అర్థం చేయించారు, ఆత్మ
యొక్క రియలైజేషన్ ను కలిగించారు. ఆత్మ అంటే ఏమిటి, పరమాత్మ అంటే ఎవరు అనేది
ఇంతకుముందు ఏమీ తెలియదు! అందుకే దేహాభిమానము కారణముగా పిల్లల్లో మోహము కూడా ఉంది,
వికారాలు కూడా ఎంతగానో ఉన్నాయి. భారత్ ఎంత ఉన్నతముగా ఉండేది. అక్కడ వికారాల పేరు
కూడా ఉండేది కాదు. అది నిర్వికారీ భారత్, ఇప్పుడు ఉన్నది వికారీ భారత్. తండ్రి ఏ
విధముగానైతే అర్థం చేయిస్తారో, అలా ఇంకెవ్వరూ అర్థం చేయించలేరు. నేటికి ఐదు వేల
సంవత్సరాల క్రితం నేను దీనిని శివాలయముగా చేసాను. నేనే శివాలయాన్ని స్థాపన చేసాను.
ఎలా? అది కూడా మీరు ఇప్పుడు అర్థం చేసుకుంటున్నారు. అడుగడుగునా ఏదైతే జరుగుతోందో అది
కళ్యాణకారియేనని మీకు తెలుసు. ఎవరైతే తండ్రిని బాగా స్మృతి చేస్తూ తమ కళ్యాణాన్ని
కూడా చేసుకుంటూ ఉంటారో, వారి కొరకు ప్రతి రోజూ ఇంకా ఎక్కువ కళ్యాణకారిగా ఉంటుంది.
ఇది ఉన్నదే పురుషోత్తములుగా అయ్యే కళ్యాణకారీ యుగము. తండ్రికి ఎంత మహిమ ఉంది.
ఇప్పుడు సత్యాతి-సత్యమైన భాగవతము జరుగుతోందని మీకు తెలుసు. ద్వాపరములో ఎప్పుడైతే
భక్తి మార్గము ప్రారంభమవుతుందో అప్పుడు మొట్టమొదట మీరు కూడా వజ్రాలతో లింగాన్ని
తయారుచేసి పూజిస్తారు. మేము పూజారులుగా అయినప్పుడు మందిరాలను నిర్మించామని ఇప్పుడు
మీకు స్మృతి కలిగింది. వజ్రాలతో, మాణిక్యాలతో తయారుచేసేవారు. ఆ చిత్రాలైతే ఇప్పుడు
లభించవు. ఇక్కడైతే ఈ మనుష్యులు వెండి మొదలైనవాటితో తయారుచేసి పూజిస్తారు. ఇటువంటి
పూజారులకు కూడా ఎంత గౌరవము ఉందో చూడండి. శివుని పూజనైతే అందరూ చేస్తారు. కానీ
అవ్యభిచారి పూజ అయితే లేదు.
వినాశనము కూడా తప్పకుండా వస్తుందని, దాని కొరకు ఏర్పాట్లు జరుగుతున్నాయని ఇది
కూడా పిల్లలకు తెలుసు. ప్రకృతి వైపరీత్యాలు కూడా డ్రామాలో నిశ్చితమై ఉన్నాయి. ఎవరు
ఎంత తలకొట్టుకున్నా మీ రాజధాని అయితే స్థాపన అయ్యే తీరుతుంది. ఇందులో ఏమీ చేయగలిగే
శక్తి ఎవ్వరికీ లేదు. ఇకపోతే అవస్థలు అయితే కింద-మీద అవుతూ ఉంటాయి. ఇది చాలా గొప్ప
సంపాదన. ఒక్కోసారి మీరు చాలా సంతోషముగా మంచి ఆలోచనలలో ఉంటారు, ఒక్కోసారి
చల్లబడిపోతారు. యాత్రలో కూడా పైకి ఎక్కడము, కిందికి దిగడము జరుగుతూ ఉంటుంది కదా,
ఇక్కడ కూడా అలా అవుతూ ఉంటుంది. ఒక్కోసారి అయితే - ఉదయమే లేచి తండ్రిని స్మృతి
చేయడముతో చాలా సంతోషము కలుగుతుంది - ఓహో, బాబా మమ్మల్ని చదివిస్తున్నారు, ఇది ఎంత
అద్భుతము, సర్వాత్మలకు తండ్రి అయిన భగవంతుడే మమ్మల్ని చదివిస్తున్నారు. కానీ వారు
శ్రీకృష్ణుడిని భగవంతునిగా భావించారు. మొత్తం ప్రపంచములో గీతకు మహిమ ఎంతగానో ఉంది
ఎందుకంటే అది భగవానువాచ కదా. కానీ భగవంతుడు అని ఎవరినంటారో ఎవ్వరికీ తెలియదు. ఎంతో
పొజిషన్ లో ఉన్న పెద్ద-పెద్ద విద్వాంసులు, పండితులు మొదలైనవారు ఉన్నా సరే, మేము గాడ్
ఫాదర్ ను స్మృతి చేస్తున్నాము అని అంటారు కానీ, వారు ఎవరు, వారు వచ్చి ఏమి చేసారు,
అదంతా మర్చిపోయారు. తండ్రి అన్ని విషయాలనూ అర్థం చేయిస్తూ ఉంటారు. డ్రామాలో ఇవన్నీ
నిశ్చితమై ఉన్నాయి. ఈ రావణ రాజ్యము మళ్ళీ వస్తుంది మరియు మనము రావలసి ఉంటుంది.
రావణుడే మిమ్మల్ని అజ్ఞానమనే ఘోర అంధకారములో నిదురింపజేస్తాడు. జ్ఞానాన్ని అయితే
ఒక్క జ్ఞానసాగరుడే తెలియజేస్తారు, దాని ద్వారా సద్గతి కలుగుతుంది. తండ్రి తప్ప
ఇంకెవ్వరూ సద్గతిని ఇవ్వలేరు. సర్వుల సద్గతిదాత ఒక్కరే. తండ్రి ఏదైతే గీతా
జ్ఞానాన్ని వినిపించారో, అది మళ్ళీ కనుమరుగైపోయింది. ఈ జ్ఞానము పరంపరగా కొనసాగుతూ
వస్తుందనేమీ కాదు. ఇతరుల ఖురాన్, బైబిల్ మొదలైనవి పరంపరగా కొనసాగుతూ వస్తాయి, అవి
వినాశనమవ్వవు. మీకు ఇప్పుడు ఏ జ్ఞానాన్ని అయితే నేను ఇస్తున్నానో, ఈ జ్ఞానము పరంపరగా
కొనసాగేందుకు, దీని శాస్త్రము ఏదీ తయారవ్వదు. ఈ విషయాలను మీరు వ్రాసుకుంటారు, ఆ
తరువాత ఇవన్నీ అంతం చేసేస్తారు. ఇవన్నీ న్యాచురల్ గా కాలిపోయి అంతమైపోతాయి. తండ్రి
కల్పపూర్వము కూడా వినిపించారు, ఇప్పుడు కూడా మీకు చెప్తున్నారు - ఈ జ్ఞానము మీకు
లభిస్తుంది, ఆ తర్వాత దీని ప్రారబ్ధాన్ని అక్కడ పొందుతారు, ఇక ఆ తరువాత ఈ జ్ఞానము
యొక్క అవసరముండదు. భక్తి మార్గములో అన్ని శాస్త్రాలు ఉన్నాయి. బాబా ఏమీ మీకు గీతను
చదివి వినిపించరు. వారు రాజయోగము యొక్క శిక్షణను ఇస్తారు, దానినే మళ్ళీ భక్తి
మార్గములో శాస్త్రాలుగా తయారుచేస్తారు, అప్పుడు అంతా తికమక చేసేస్తారు. గీతా
జ్ఞానాన్ని ఎవరు ఇచ్చారు అన్న మీ ముఖ్యమైన విషయము ఏదైతే ఉందో, అతని పేరును
మార్చేసారు, ఇంకెవ్వరి పేర్లు మారలేదు. అందరివీ ముఖ్యమైన ధర్మ శాస్త్రాలు ఉన్నాయి
కదా. అందులో ముఖ్యమైనవి దేవీ-దేవతా ధర్మము, ఇస్లామ్ ధర్మము, బౌద్ధ ధర్మము. కొందరు
బౌద్ధ ధర్మము ముందు వచ్చింది, ఆ తర్వాత ఇస్లామ్ ధర్మము వచ్చింది అని అంటారు. మీరు
చెప్పండి - ఈ విషయాలతో గీతకు ఏ సంబంధమూ లేదు, మన పని తండ్రి నుండి వారసత్వము
తీసుకోవడము. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తున్నారు - ఇది పెద్ద వృక్షము. మంచిది, ఇది
ఒక ఫ్లవర్ వేజ్ లా ఉంది. దీని నుండి మూడు శాఖలు వెలువడతాయి. ఇది ఎంత మంచి వివేకముతో
తయారుచేయబడిన వృక్షము. మేము ఏ ధర్మానికి చెందినవారము, మా ధర్మాన్ని ఎవరు స్థాపన
చేసారు అనేది ఎవరైనా వెంటనే అర్థం చేసుకుంటారు. ఈ దయానంద్, అరవింద్ ఘోష్
మొదలైనవారందరూ మొన్నమొన్ననే వెళ్ళారు. వారు కూడా యోగము మొదలైనవి నేర్పిస్తూ ఉంటారు.
కానీ వాస్తవానికి అదంతా భక్తి. అందులో జ్ఞానము యొక్క నామ-రూపాలు కూడా లేవు. వారికి
ఎంత పెద్ద-పెద్ద టైటిల్స్ లభిస్తాయి. ఇదంతా కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది, ఇది ఐదు
వేల సంవత్సరాల తరువాత మళ్ళీ జరుగుతుంది. ప్రారంభము నుండి మొదలుకుని ఈ చక్రము ఎలా
తిరిగింది, ఇది మళ్ళీ ఎలా రిపీట్ అవుతూ ఉంటుంది అనేది మీకు తెలుసు. ఇప్పటి వర్తమానము
మళ్ళీ గతముగా మారి ఆ తరువాత మళ్ళీ భవిష్యత్తుగా మారుతుంది. భూత, భవిష్యత్,
వర్తమానాలు. ఏదైతే గతించిపోతుందో, అదే మళ్ళీ భవిష్యత్తుగా మారుతుంది. ఈ సమయములో మీకు
జ్ఞానము లభిస్తుంది, ఆ తర్వాత మీరు రాజ్యము తీసుకుంటారు, అక్కడ దేవతల రాజ్యము ఉండేది
కదా. ఆ సమయములో ఇంకెవ్వరి రాజ్యము ఉండేది కాదు. దీనిని కూడా ఒక కథలా చెప్పండి. ఇది
చాలా సుందరమైన కథలా అవుతుంది. అనగనగా ఐదు వేల సంవత్సరాల క్రితం ఈ భారత్ సత్యయుగముగా
ఉండేది, అప్పుడు ఇతర ధర్మాలేవీ ఉండేవి కావు, కేవలం దేవీ-దేవతా రాజ్యము మాత్రమే
ఉండేది. దానిని సూర్యవంశీ రాజ్యము అని అనేవారు. లక్ష్మీ-నారాయణుల రాజ్యము 1250
సంవత్సరాలు కొనసాగింది, ఆ తరువాత వారు తమ సోదరులైన క్షత్రియులకు రాజ్యాన్ని ఇచ్చారు,
అప్పుడు వారి రాజ్యము కొనసాగింది. తండ్రి వచ్చి చదివించారని మీరు అర్థం చేయించవచ్చు.
ఎవరైతే బాగా చదువుకున్నారో వారు సూర్యవంశీయులుగా అయ్యారు. ఎవరైతే ఫెయిల్ అయ్యారో
వారికి క్షత్రియులు అన్న పేరు వచ్చింది. అంతేకానీ యుద్ధము మొదలైనవాటి విషయమేమీ లేదు.
బాబా అంటున్నారు - పిల్లలూ, మీరు నన్ను స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు
వినాశనమవుతాయి. మీరు వికారాలపై విజయము పొందాలి. ఎవరైతే కామముపై విజయాన్ని పొందుతారో
వారే జగత్తును జయిస్తారు అని తండ్రి ఆర్డినెన్స్ జారీ చేశారు. మళ్ళీ అర్ధకల్పము
తరువాత వామ మార్గములో కింద పడిపోతారు. వారి చిత్రాలు కూడా ఉన్నాయి. ముఖాలు దేవతల వలె
తయారుచేసారు. రామ రాజ్యము మరియు రావణ రాజ్యము సగం-సగం ఉన్నాయి. ఆ తరువాత ఏమి
జరిగింది, ఆ తరువాత ఏమి జరిగింది అంటూ వారి కథను కూర్చుని తయారుచేయాలి. ఇదే
సత్యనారాయణుని కథ. తండ్రి ఒక్కరే సత్యము, వారు ఈ సమయములో వచ్చి మొత్తం ఆదిమధ్యాంతాల
గురించి మీకు జ్ఞానాన్ని ఇస్తున్నారు, ఈ జ్ఞానాన్ని ఇంకెవ్వరూ ఇవ్వలేరు. మనుష్యులకు
అసలు ఆ తండ్రి గురించే తెలియదు. ఏ డ్రామాలోనైతే పాత్రధారులుగా ఉన్నారో, ఆ డ్రామా
యొక్క క్రియేటర్, డైరెక్టర్ మొదలైనవారి గురించి ఆ పాత్రధారులకే తెలియదు, మరి ఇంకెవరు
తెలుసుకుంటారు! డ్రామానుసారముగా ఇది మళ్ళీ ఇలాగే జరుగుతుందని ఇప్పుడు మీకు తండ్రి
తెలియజేస్తున్నారు. తండ్రి వచ్చి పిల్లలైన మిమ్మల్ని మళ్ళీ చదివిస్తారు. ఇక్కడికి
ఇతరులెవ్వరూ రాలేరు. బాబా అంటారు, నేను పిల్లలనే చదివిస్తాను. కొత్తవారినెవ్వరినీ
ఇక్కడ కూర్చోబెట్టడానికి వీల్లేదు. ఇంద్రప్రస్థము యొక్క కథ కూడా ఉంది కదా. నీలమ్ పరి,
పుఖరాజ్ పరి అనే దేవకన్యల పేర్లు కూడా ఉన్నాయి కదా. మీలో కూడా కొందరు వజ్రాల వంటి
రత్నాలలా ఉన్నారు. చూడండి, రమేష్ ‘ప్రదర్శనీ’ అనే సలహాను ఇచ్చారు, అప్పుడు అందరి
విచార సాగర మంథనము నడిచింది, కావున వారు వజ్రము లాంటి పని చేసారు కదా. ఒకరు
పుష్యరాగము వలె ఉన్నారు, మరొకరు మరోలా ఉన్నారు! కొందరికి అసలు ఏమీ తెలియదు. రాజధాని
స్థాపన అవుతోందని కూడా తెలుసు. అందులో రాజులు, రాణులు మొదలైనవారందరూ కావాలి.
బ్రాహ్మణులమైన మేము శ్రీమతము ఆధారముగా చదువుకుంటూ విశ్వానికి యజమానులుగా అవుతాము అని
మీరు అర్థం చేసుకుంటారు, కావున ఎంత సంతోషము కలగాలి. ఈ మృత్యులోకము సమాప్తమవ్వనున్నది.
నేను వెళ్ళి చిన్న బాలుడిలా అవుతాను అని ఈ బాబా అయితే ఇప్పటి నుండే అనుకుంటూ ఉంటారు.
ఆ బాల్యపు విషయాలు ఇప్పటి నుండే వీరికి ఎదురుగా వస్తున్నాయి, ఇక నడవడికే మారిపోతూ
ఉంటుంది. అలాగే అక్కడ కూడా ఎప్పుడైతే వృద్ధులుగా అవుతారో అప్పుడు - ఈ వానప్రస్థ
శరీరాన్ని వదిలి నేను కిశోరావస్థలోకి వెళ్తాను అని వారు ముందు నుండే అనుకుంటూ ఉంటారు.
బాల్యము సతోప్రధాన అవస్థ. లక్ష్మీ-నారాయణులు అయితే యువత, వివాహము చేసుకున్న తరువాత
వారిని కిశోరావస్థ అని అనరు కదా. యువావస్థను రజో అని, వృద్ధావస్థను తమో అని అంటారు,
అందుకే శ్రీకృష్ణుడిపై ఎక్కువ ప్రేమ ఉంటుంది. వాస్తవానికి లక్ష్మీ-నారాయణులు కూడా
వారే కదా. కానీ మనుష్యులకు ఈ విషయాల గురించి తెలియదు. శ్రీకృష్ణుడిని ద్వాపరములోకి,
లక్ష్మీ-నారాయణులను సత్యయుగములోకి తీసుకువెళ్ళారు. ఇప్పుడు మీరు దేవతలుగా అయ్యేందుకు
పురుషార్థము చేస్తున్నారు.
తండ్రి అంటారు, కుమారీలు బాగా లేచి నిలబడాలి. కుమారీ కన్య మందిరము, అదర్ కుమారీ
మందిరము, దిల్వాడా మందిరము మొదలైన మందిరాలు ఏవైతే ఉన్నాయో, ఇవి మీ యొక్క ఏక్యురేట్
స్మృతిచిహ్నాలు. అవి జడమైనవని, మీరు చైతన్యముగా ఉన్నారు. మీరు ఇక్కడ చైతన్యముగా
కూర్చుని ఉన్నారు, భారత్ ను స్వర్గముగా తయారుచేస్తున్నారు. స్వర్గమైతే ఇక్కడే
ఉంటుంది. మూలవతనము, సూక్ష్మవతనము ఎక్కడ ఉన్నాయి అనేది పిల్లలైన మీకు తెలుసు. మొత్తం
డ్రామా గురించి మీకు తెలుసు. ఏదైతే గతించిపోయిందో అదే మళ్ళీ భవిష్యత్తుగా అవుతుంది,
మళ్ళీ అదే గతముగా మారిపోతుంది. మిమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు అన్నది అర్థం
చేసుకోవాలి. మనల్ని భగవంతుడు చదివిస్తున్నారు. ఇక ఈ సంతోషములో శీతలముగా అయిపోవాలి.
తండ్రి స్మృతితో అన్ని అలజడులు తొలగిపోతాయి. బాబా మనకు తండ్రి కూడా, వారు మనల్ని
చదివిస్తారు కూడా, ఆ తరువాత మనల్ని వారితోపాటు తీసుకువెళ్తారు కూడా. స్వయాన్ని
ఆత్మగా భావిస్తూ పరమాత్మ అయిన తండ్రితో ఈ విధముగా మాట్లాడాలి. బాబా, ఇప్పుడు మాకు
అన్నీ తెలిసాయి, బ్రహ్మా మరియు విష్ణువుల గురించి కూడా తెలిసింది. విష్ణువు నాభి
నుండి బ్రహ్మా వెలువడ్డారు అని అంటారు. మరి ఇప్పుడు విష్ణువును క్షీరసాగరములో
చూపిస్తారు, బ్రహ్మాను సూక్ష్మవతనములో చూపిస్తారు, కానీ వాస్తవానికి వారు ఇక్కడ
ఉన్నారు. విష్ణువు రాజ్యము చేసేవారు. ఒకవేళ విష్ణువు నుండి బ్రహ్మా వెలువడినట్లయితే
మరి వారు తప్పకుండా రాజ్యము కూడా చేస్తారు కదా. విష్ణు నాభి నుండి వెలువడ్డారంటే మరి
వారు అతనికి సంతానము అయినట్లు. ఈ విషయాలన్నింటినీ తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు.
బ్రహ్మాయే 84 జన్మలను పూర్తి చేసి ఇప్పుడు మళ్ళీ విష్ణుపురికి యజమానిగా అవుతారు. ఈ
విషయాలను కూడా ఎవ్వరూ పూర్తిగా అర్థం చేసుకోరు, అందుకే ఆ సంతోషపు పాదరసము పైకి
ఎక్కదు. గోప-గోపికలు మీరే. వారు సత్యయుగములో ఉండరు కదా. అక్కడైతే యువరాజులు,
యువరాణులు ఉంటారు. గోప-గోపికలకు గోపీ వల్లభుడు ఉన్నారు కదా. ప్రజాపిత బ్రహ్మా
అందరికీ తండ్రి, అలాగే ఆత్మలందరికీ తండ్రి నిరాకారుడైన శివుడు. వీరందరూ ముఖవంశావళి.
బి.కె.లైన మీరందరూ సోదరీ-సోదరులవుతారు. వికారీ దృష్టి ఉండకూడదు, ఈ విషయములోనే మాయ
ఓడిస్తుంది. తండ్రి అంటారు, ఇప్పటివరకు ఏదైతే చదివారో దానిని బుద్ధి ద్వారా
మర్చిపోండి. నేను ఏదైతే వినిపిస్తున్నానో దానినే చదవండి. మెట్ల చిత్రము అయితే చాలా
ఫస్ట్ క్లాస్ గా ఉంది. మొత్తం ఆధారమంతా ఒకే విషయముపై ఉంది. గీతా భగవానుడు ఎవరు?
శ్రీకృష్ణుడిని భగవానుడు అని అనడానికి వీల్లేదు. అతనైతే సర్వగుణ సంపన్నుడైన దేవత.
అతని పేరును గీతలో చూపించారు. అతడిని కూడా నల్లగా చూపించారు, అంతేకాక
లక్ష్మీ-నారాయణులను కూడా నల్లగా చూపిస్తారు. అలా చూపించేందుకు కారణమే లేదు.
రామచంద్రుడిని కూడా నల్లగా చూపిస్తారు. తండ్రి అంటారు, కామ చితిపై కూర్చోవడం వల్ల
నల్లగా అయ్యారు. ఇలా ఉదాహరణగా ఎవరో ఒకరి పేరును తీసుకుంటారు. మీరందరూ బ్రాహ్మణులు.
ఇప్పుడు మీరు జ్ఞాన చితిపై కూర్చుంటారు. శూద్రులు కామ చితిపై కూర్చున్నారు. తండ్రి
అంటారు, విచార సాగర మంథనము చేసి - అందరినీ ఎలా మేలుకొలపాలి అని యుక్తులను రచించండి.
మేలుకోవడము కూడా డ్రామానుసారముగానే మేలుకుంటారు. డ్రామా చాలా మెల్లమెల్లగా ముందుకు
వెళ్తూ ఉంటుంది. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మేము గోపీ వల్లభుని గోప-గోపికలము అని సదా ఇదే స్మృతిలో ఉండాలి. ఈ స్మృతి
ద్వారానే సదా సంతోషపు పాదరసము ఎక్కి ఉండాలి.
2. ఇప్పటివరకు ఏదైతే చదివారో దానిని బుద్ధి ద్వారా మరచి, తండ్రి ఏదైతే
వినిపిస్తున్నారో దానినే చదవాలి. మనము సోదరీ-సోదరులము, ఈ స్మృతి ద్వారా వికారీ
దృష్టి సమాప్తము చేయాలి. మాయతో ఓడిపోకూడదు.
వరదానము:-
సేవ ద్వారా యోగయుక్త స్థితిని అనుభవం చేసే ఆత్మిక సేవాధారీ
భవ
బ్రాహ్మణ జీవితము సేవా జీవితము. మాయ నుండి జీవించి
ఉండేందుకు శ్రేష్ఠ సాధనము సేవయే. సేవ యోగయుక్తముగా తయారుచేస్తుంది. కానీ కేవలం నోటి
సేవయే కాదు, మీరు విన్న మధురమైన మాటల యొక్క స్వరూపముగా అయి సేవ చేయడము, నిస్వార్థ
సేవ చేయడము, త్యాగ, తపస్యా స్వరూపముతో సేవ చేయడము, హద్దులోని కామనల నుండి అతీతముగా
ఉంటూ నిష్కామ సేవ చేయడము - దీనినే ఈశ్వరీయ సేవ లేక ఆత్మిక సేవ అని అంటారు.
నోటితోపాటు మనసు ద్వారా సేవ చేయడము అనగా మన్మనాభవ స్థితిలో స్థితులవ్వడము.
స్లోగన్:-
ఆకృతిని
చూడకుండా నిరాకారుడైన తండ్రిని చూసినట్లయితే ఆకర్షణామూర్తులుగా అవుతారు.
అవ్యక్త ప్రేరణలు -
సహజయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి
బాప్ దాదాకు పిల్లలపై
ఎంత ప్రేమ అంటే - పిల్లలు ప్రతి ఒక్కరూ నా కంటే కూడా ముందు ఉండాలి అని వారు
కోరుకుంటారు. ప్రపంచములో కూడా ఎవరి పైనైతే ఎక్కువ ప్రేమ ఉంటుందో వారిని తమకంటే కూడా
ముందుకు తీసుకువెళ్తారు. ఇదే ప్రేమకు గుర్తు. అలాగే బాప్ దాదా కూడా అంటారు - నా
పిల్లలలో ఇప్పుడు ఎటువంటి లోపము ఉండకూడదు, అందరూ సంపూర్ణముగా, సంపన్నముగా మరియు
సమానముగా అయిపోవాలి. ఈ పరమాత్మ ప్రేమయే సహజయోగిగా చేస్తుంది.
| | |