25-10-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - సంగమయుగములోనే మీరు ఆత్మాభిమానులుగా అయ్యేందుకు కృషి చేయవలసి ఉంటుంది, సత్యయుగములో లేక కలియుగములో ఈ కృషి ఉండదు’’

ప్రశ్న:-
శ్రీకృష్ణుని పేరు వారి తల్లి-తండ్రుల పేరు కన్నా ఎక్కువ ప్రసిద్ధి చెందింది, ఎందుకని?

జవాబు:-
ఎందుకంటే శ్రీకృష్ణుని కన్నా ముందు ఎవరి జన్మ అయితే జరుగుతుందో వారి జన్మ యోగబలము ద్వారా జరగదు. శ్రీకృష్ణుని తల్లి-తండ్రులు యోగబలము ద్వారా జన్మ తీసుకోరు. 2 - పూర్తి కర్మాతీత అవస్థ కలవారు రాధా-కృష్ణులు మాత్రమే, వారే సద్గతిని పొందుతారు. ఎప్పుడైతే పాపాత్ములందరూ సమాప్తమైపోతారో అప్పుడు పుష్పాల (పావన) కొత్త ప్రపంచములో శ్రీకృష్ణుని జన్మ జరుగుతుంది, దానినే వైకుంఠమని అంటారు. 3 - సంగమములో శ్రీకృష్ణుని ఆత్మ అందరికన్నా ఎక్కువ పురుషార్థము చేసారు, అందుకే వారి పేరు ప్రసిద్ధి చెందింది.

ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు. 5 వేల సంవత్సరాల తర్వాత ఒక్కసారి మాత్రమే వచ్చి పిల్లలను చదివిస్తారు. మీరు వచ్చి పతితులైన మమ్మల్ని పావనముగా చేయండి అని పిలుస్తారు కూడా, కావున ఇది పతిత ప్రపంచమని ఋజువవుతుంది. కొత్త ప్రపంచము పావన ప్రపంచముగా ఉండేది. కొత్త ఇల్లు సుందరముగా ఉంటుంది. పాతది పాడుబడి ఉంటుంది. వర్షము కురిస్తే కూలిపోతుంది. తండ్రి కొత్త ప్రపంచాన్ని తయారుచేసేందుకు వచ్చారని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. వారు ఇప్పుడు చదివిస్తున్నారు. మళ్ళీ 5 వేల సంవత్సరాల తర్వాత చదివిస్తారు. ఈ విధముగా ఎప్పుడూ సాధు-సత్పురుషులు మొదలైనవారెవ్వరూ తమ ఫాలోవర్స్ ను చదివించరు. వారికి అసలు ఇది తెలియనే తెలియదు, అలాగే వారికి నాటకము గురించి కూడా తెలియదు, ఎందుకంటే వారు నివృత్తి మార్గము వారు. తండ్రి తప్ప ఇతరులెవ్వరూ సృష్టి ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయించలేరు. ఆత్మాభిమానులుగా అవ్వడములోనే పిల్లలకు శ్రమ అనిపిస్తుంది ఎందుకంటే అర్ధకల్పము మీరు ఎప్పుడూ ఆత్మాభిమానులుగా అవ్వలేదు. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు, స్వయాన్ని ఆత్మగా భావించండి. ఆత్మయే పరమాత్మ అని కాదు. అలా కాదు. స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పరమపిత పరమాత్మ అయిన శివుడిని స్మృతి చేయాలి. స్మృతియాత్ర ముఖ్యమైనది, దాని ద్వారా మీరు పతితము నుండి పావనముగా అవుతారు. ఇందులో స్థూలమైన విషయమేదీ లేదు. ఇందులో ముక్కు, చెవులు మొదలైనవేవీ మూసుకోవలసిన అవసరము లేదు. ముఖ్యమైన విషయము - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయడము. మీరు అర్ధకల్పము నుండి దేహాభిమానములో ఉండటానికి అలవాటు పడిపోయారు. మొదట స్వయాన్ని ఆత్మగా భావించినప్పుడే తండ్రిని స్మృతి చేయగలుగుతారు. భక్తి మార్గములో కూడా బాబా-బాబా అని అంటూ వచ్చారు. సత్యయుగములో లౌకిక తండ్రి ఒక్కరు మాత్రమే ఉంటారని పిల్లలకు తెలుసు. అక్కడ పారలౌకిక తండ్రిని స్మృతి చేయరు ఎందుకంటే అక్కడ సుఖము ఉంది. భక్తి మార్గములో మళ్ళీ ఇద్దరు తండ్రులు ఉంటారు. లౌకిక తండ్రి మరియు పారలౌకిక తండ్రి. దుఃఖములో అందరూ పారలౌకిక తండ్రిని స్మృతి చేస్తారు. సత్యయుగములో భక్తి ఉండదు. అక్కడ ఉన్నదే జ్ఞానము యొక్క ప్రారబ్ధము. అలాగని అక్కడ జ్ఞానము ఉంటుందని కాదు. ఈ సమయములోని జ్ఞానము యొక్క ప్రారబ్ధము అక్కడ లభిస్తుంది. తండ్రి అయితే ఒక్కసారి మాత్రమే వస్తారు. అర్ధకల్పము అనంతమైన తండ్రి ఇచ్చే సుఖపు వారసత్వము ఉంటుంది. లౌకిక తండ్రి నుండి అల్పకాలికమైన వారసత్వము లభిస్తుంది. ఇదంతా మనుష్యులు అర్థం చేయించలేరు. ఇది కొత్త విషయము, 5 వేల సంవత్సరాలలో సంగమయుగములో ఒక్కసారి మాత్రమే తండ్రి వస్తారు. కలియుగాంతము, సత్యయుగ ఆది యొక్క సంగమము ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడు మాత్రమే తండ్రి వస్తారు, కొత్త ప్రపంచాన్ని మళ్ళీ స్థాపన చేయడానికి వస్తారు. కొత్త ప్రపంచములో ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేది, ఆ తర్వాత త్రేతాలో రామ రాజ్యము ఉండేది. ఇకపోతే దేవతలు మొదలైనవారివి ఇన్ని చిత్రాలేవైతే తయారుచేసారో, ఇదంతా భక్తి మార్గపు సామాగ్రి. తండ్రి అంటారు, వీటన్నిటినీ మర్చిపోండి, ఇప్పుడు మీ ఇంటిని మరియు కొత్త ప్రపంచాన్ని స్మృతి చేయండి.

జ్ఞాన మార్గము వివేకానికి సంబంధించిన మార్గము, దీనితో మీరు 21 జన్మలు వివేకవంతులుగా అవుతారు. ఏ దుఃఖమూ ఉండదు. సత్యయుగములో ఎప్పుడూ ఎవ్వరూ మాకు శాంతి కావాలి అని అనరు. అడగడం కన్నా మరణించడం మేలు అని అంటారు కదా. తండ్రి మిమ్మల్ని ఎటువంటి షావుకారులుగా తయారుచేస్తారంటే, ఇక దేవతలకు భగవంతుడిని ఏదీ అడగవలసిన అవసరము ఉండదు. ఇక్కడైతే ఆశీర్వాదాలు అడుగుతారు కదా. పోప్ మొదలైనవారు వచ్చినప్పుడు వారి ఆశీర్వాదాలు తీసుకోవడానికి ఎంతమంది వెళ్తారు. పోప్ లు ఎంతమందికి వివాహాలు చేయిస్తుంటారు. బాబా అయితే ఈ పని చేయరు. భక్తి మార్గములో ఇంతకుముందు ఏదైతే జరిగిందో, అదే ఇప్పుడు జరుగుతోంది, అదే తర్వాత కూడా రిపీట్ అవుతుంది. రోజురోజుకు భారత్ ఎంతగా పడిపోతూ ఉంది. ఇప్పుడు మీరు సంగమములో ఉన్నారు. మిగిలినవారందరూ కలియుగీ మనుష్యులు. ఎప్పటివరకైతే ఇక్కడికి రారో, అప్పటివరకు - ఇప్పుడు ఇది సంగమయుగమా లేక కలియుగమా అన్నది ఏమీ అర్థం చేసుకోలేరు. ఒకే ఇంటిలో, పిల్లలు సంగమయుగములో ఉన్నట్లు భావిస్తారు, కానీ తండ్రి నేను కలియుగములో ఉన్నాను అని అంటారు, అప్పుడు ఎంత కష్టమవుతుంది. అన్నపానాదులు మొదలైనవాటి విషయములో కూడా ఇబ్బంది అవుతుంది. సంగమయుగవాసులైన మీరు శుద్ధమైన, పవిత్రమైన భోజనము తినేటటువంటివారు. దేవతలు ఎప్పుడూ ఉల్లి మొదలైనవి తినరు. ఈ దేవతలను నిర్వికారులు అని అంటారు. భక్తి మార్గములో అందరూ తమోప్రధానముగా అయిపోయారు. ఇప్పుడు తండ్రి అంటారు, సతోప్రధానముగా అవ్వండి. ఆత్మ మొదట సతోప్రధానముగా ఉండేదని, ఆ తర్వాత తమోప్రధానముగా అయ్యిందని అర్థం చేసుకునేవారు ఎవ్వరూ లేరు ఎందుకంటే వారు ఆత్మను నిర్లేపిగా భావిస్తారు. ఆత్మయే పరమాత్మ అని ఈ విధముగా అంటూ ఉంటారు.

తండ్రి అంటారు, జ్ఞాన సాగరుడిని నేనే. ఈ దేవీ-దేవతా ధర్మానికి చెందినవారెవరైతే ఉంటారో, వారందరూ వచ్చి మళ్ళీ తమ వారసత్వాన్ని తీసుకుంటారు. ఇప్పుడు అంటు కట్టబడుతోంది. ఫలానావారు అంత ఉన్నతమైన పదవిని పొందేందుకు అర్హులు కాదు అని మీరు అర్థం చేసుకుంటారు. ఇంటికి వెళ్ళి వివాహము చేసుకుని ఛీ-ఛీగా అవుతూ ఉంటారు. అటువంటివారు ఉన్నతమైన పదవిని పొందలేరని అర్థం చేయించడం జరుగుతుంది. ఇక్కడ రాజధాని స్థాపన అవుతోంది. తండ్రి అంటారు, నేను మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారుచేస్తాను కావున తప్పకుండా ప్రజలను తయారుచేయవలసి ఉంటుంది, లేకపోతే రాజ్యాన్ని ఎలా పొందుతారు. ఇవి గీతలోని పదాలు కదా - దీనిని అనడమే గీతా యుగము అని అంటారు. మీరు రాజయోగాన్ని నేర్చుకుంటున్నారు - ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క పునాది వేయబడుతుందని మీకు తెలుసు. సూర్యవంశీయులది, చంద్రవంశీయులది, ఈ రెండు రాజ్యాలు స్థాపన అవుతున్నాయి. బ్రాహ్మణ కులము స్థాపన అయ్యింది. బ్రాహ్మణులే మళ్ళీ సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా అవుతారు. ఎవరైతే మంచి రీతిలో కృషి చేస్తారో, వారు సూర్యవంశీయులుగా అవుతారు. ఇతర ధర్మాలవారు ఎవరైతే వస్తారో, వారు తమ ధర్మాలను స్థాపన చేయడానికే వస్తారు. వారి వెనుక ఆ ధర్మానికి చెందిన ఆత్మలు వస్తూ ఉంటారు, ఆ ధర్మము వృద్ధి చెందుతూ ఉంటుంది. క్రిస్టియన్లు ఎవరైనా ఉన్నారనుకోండి, వారి బీజరూపుడు క్రైస్టు. మీ బీజరూపుడు ఎవరు? తండ్రి, ఎందుకంటే తండ్రియే వచ్చి బ్రహ్మా ద్వారా స్వర్గ స్థాపన చేస్తారు. బ్రహ్మానే ప్రజాపిత అని అంటారు. వారిని రచయిత అని అనరు. వీరి ద్వారా పిల్లలు దత్తత తీసుకోబడతారు. బ్రహ్మాను కూడా సృష్టిస్తారు కదా. తండ్రి వచ్చి ప్రవేశించి వీరిని రచిస్తారు. శివబాబా అంటారు, మీరు నా పిల్లలు. మీరు నా సాకారీ పిల్లలు అని బ్రహ్మా కూడా అంటారు. ఇప్పుడు మీరు నల్లగా ఛీ-ఛీగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ బ్రాహ్మణులుగా అయ్యారు. ఈ సంగమములోనే మీరు పురుషోత్తమ దేవీ-దేవతలుగా అయ్యేందుకు కృషి చేస్తారు. దేవతలకు గాని, శూద్రులకు గాని కృషి చేయవలసిన అవసరము ఉండదు. బ్రాహ్మణులైన మీరు దేవతలుగా అయ్యేందుకు కృషి చేయవలసి ఉంటుంది. తండ్రి సంగమయుగములోనే వస్తారు. ఇది చాలా చిన్నని యుగము, అందుకే దీనిని లీప్ యుగము అని అంటారు. దీని గురించి ఎవ్వరికీ తెలియదు. తండ్రి కూడా కృషి చేయవలసి వస్తుంది. కొత్త ప్రపంచము వెంటనే తయారైపోతుందని కాదు. మీకు దేవతలుగా అవ్వడానికి సమయము పడుతుంది. ఎవరైతే మంచి కర్మలు చేస్తారో, వారు మంచి కులములో జన్మ తీసుకుంటారు. ఇప్పుడు మీరు నంబరువారు పురుషార్థానుసారముగా పుష్పాలుగా అవుతున్నారు. ఆత్మయే అలా తయారవుతుంది. ఇప్పుడు మీ ఆత్మ మంచి కర్మలు నేర్చుకుంటుంది. ఆత్మయే మంచి లేదా చెడు సంస్కారాలను తీసుకువెళ్తుంది. ఇప్పుడు మీరు పుష్పాలుగా అయ్యి మంచి ఇళ్ళల్లో జన్మలు తీసుకుంటూ ఉంటారు. ఇక్కడ ఎవరైతే మంచి పురుషార్థము చేస్తారో, వారు తప్పకుండా మంచి కులములో జన్మ తీసుకుంటూ ఉండవచ్చు. నంబరువారుగా అయితే ఉన్నారు కదా. ఎటువంటి కర్మలు చేస్తారో, అటువంటి జన్మ తీసుకుంటారు. ఎప్పుడైతే చెడు కర్మలు చేసేవారు పూర్తిగా సమాప్తమైపోతారో, అప్పుడు సెలెక్షన్ జరిగి స్వర్గ స్థాపన జరిగిపోతుంది. తమోప్రధానముగా ఎవరైతే ఉన్నారో వారంతా సమాప్తమైపోతారు. అప్పుడు కొత్త దేవతలు రావడం ప్రారంభమవుతుంది. ఎప్పుడైతే భ్రష్టాచారులందరూ సమాప్తమైపోతారో, అప్పుడు శ్రీకృష్ణుని జన్మ జరుగుతుంది, అప్పటివరకు మార్పులు-చేర్పులు జరుగుతూ ఉంటాయి. ఎప్పుడైతే ఛీ-ఛీగా ఉన్నవారు ఎవ్వరూ ఉండరో, అప్పుడు శ్రీకృష్ణుడు వస్తారు, అప్పటివరకు మీరు వస్తూ-వెళ్తూ ఉంటారు. శ్రీకృష్ణుడిని రిసీవ్ చేసుకునే తల్లి-తండ్రులు కూడా ముందు నుండే కావాలి కదా. ఆ తర్వాత అందరూ మంచి-మంచివారు ఉంటారు, మిగిలినవారు వెళ్ళిపోతారు, అప్పుడే దానిని స్వర్గము అని అంటారు. మీరు శ్రీకృష్ణుడిని రిసీవ్ చేసుకునేవారిగా ఉంటారు. అప్పటికి మీ జన్మ ఛీ-ఛీగానే జరుగుతుంది ఎందుకంటే ఇది రావణ రాజ్యము కదా. శుద్ధ జన్మ అయితే జరగదు. పుష్పము వంటి (పవిత్రమైన) జన్మ మొట్టమొదట శ్రీకృష్ణునిదే జరుగుతుంది. దాని తర్వాత కొత్త ప్రపంచము, వైకుంఠము అని అంటారు. శ్రీకృష్ణుడు పూర్తిగా పుష్పము వంటి కొత్త ప్రపంచములోకి వస్తారు. రావణ సాంప్రదాయము పూర్తిగా సమాప్తమైపోతుంది. శ్రీకృష్ణుని పేరు వారి తల్లి-తండ్రుల కన్నా ప్రసిద్ధమైనది. శ్రీకృష్ణుని తల్లి-తండ్రుల పేర్లు అంత ప్రసిద్ధమైనవి కాదు. శ్రీకృష్ణుని కన్నా ముందు జన్మించినవారిది యోగబలముతో జన్మ జరిగిందని అనరు. శ్రీకృష్ణుని తల్లి-తండ్రులు యోగబలముతో జన్మ తీసుకున్నారని కాదు. అలా కాదు. ఒకవేళ అలా జరిగి ఉంటే, వారి పేర్లు కూడా ప్రసిద్ధమవుతాయి. కావున శ్రీకృష్ణుడు ఎంతైతే పురుషార్థము చేసారో, వారి తల్లి-తండ్రులు అంత చేయలేదని ఋజువవుతుంది. ఈ విషయాలన్నీ మున్ముందు మీరు అర్థం చేసుకుంటూ ఉంటారు. సంపూర్ణ కర్మాతీత స్థితిని పొందినవారు రాధా-కృష్ణులే. వారే సద్గతిలోకి వస్తారు. పాపాత్ములందరూ సమాప్తమైనప్పుడు వారి జన్మ జరుగుతుంది, అప్పుడు పావన ప్రపంచము అని అంటారు, అందుకే శ్రీకృష్ణుని పేరు ప్రసిద్ధి చెందింది, వారి తల్లి-తండ్రులది అంత ప్రసిద్ధి చెందలేదు. మున్ముందు మీకు చాలా సాక్షాత్కారాలు జరుగుతాయి. సమయమైతే ఇంకా ఉంది. మేము ఈ విధముగా తయారయ్యేందుకు చదువుకుంటున్నాము అని మీరు ఎవరికైనా అర్థం చేయించవచ్చు. విశ్వములో వీరి రాజ్యము ఇప్పుడు స్థాపన అవుతోంది. మన కొరకైతే కొత్త ప్రపంచము కావాలి. ఇప్పుడు మిమ్మల్ని దైవీ సాంప్రదాయులు అని అనరు. మీరు బ్రాహ్మణ సాంప్రదాయులు. మీరు దేవతలుగా అవ్వనున్నారు. మీరు దైవీ సాంప్రదాయులుగా అయినప్పుడు మీ ఆత్మ మరియు శరీరము, రెండూ స్వచ్ఛముగా అవుతాయి. ఇప్పుడు సంగమయుగవాసులైన మీరు పురుషోత్తములుగా అవ్వనున్నారు. ఇదంతా కృషితో కూడిన విషయము. స్మృతితో వికర్మాజీతులుగా అవ్వాలి. స్మృతిని పదే-పదే మర్చిపోతున్నామని మీరు స్వయముగా చెప్తారు. బాబా పిక్నిక్ లో కూర్చున్నప్పుడు, నేను స్మృతిలో ఉండకపోతే బాబా ఏమంటారు అని బాబాకు ఆలోచన ఉంటుంది, అందుకే బాబా అంటారు, మీరు స్మృతిలో కూర్చుని పిక్నిక్ చేసుకోండి. కర్మలు చేస్తూ ప్రియుడిని స్మృతి చేసినట్లయితే వికర్మలు వినాశనమవుతాయి, ఇందులోనే కృషి చేయాలి. స్మృతితో ఆత్మ పవిత్రముగా అవుతుంది, అవినాశీ జ్ఞాన ధనము కూడా జమ అవుతుంది. ఒకవేళ మళ్ళీ అపవిత్రముగా అయితే, జ్ఞానమంతా బయటకు వెళ్ళిపోతుంది. పవిత్రతయే ముఖ్యమైనది. తండ్రి అయితే మంచి-మంచి విషయాలనే అర్థం చేయిస్తారు. ఈ సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానము మరెవ్వరిలోనూ లేదు. ఇతర సత్సంగాలు మొదలైనవేవైతే ఉన్నాయో, అవన్నీ భక్తి మార్గానికి చెందినవి.

బాబా అర్థం చేయించారు - భక్తి వాస్తవానికి ప్రవృత్తి మార్గములోనివారే చేయాలి. మీలోనైతే ఎంత శక్తి ఉంటుంది. ఇంట్లో కూర్చునే మీకు సుఖము లభిస్తుంది. సర్వశక్తివంతుడైన తండ్రి నుండి మీరు అంతటి శక్తిని తీసుకుంటారు. సన్యాసులలో కూడా మొదట శక్తి ఉండేది, అడవులలో నివసించేవారు. ఇప్పుడైతే ఎంత పెద్ద-పెద్ద ఫ్లాట్లు నిర్మించుకుని నివసిస్తున్నారు. ఇప్పుడు వారిలో ఆ శక్తి లేదు. ఏ విధముగా మీలో కూడా మొదట సుఖము యొక్క శక్తి ఉంటుంది, అది తర్వాత మాయమైపోతుంది, అదే విధముగా వారిలో కూడా మొదట శాంతి శక్తి ఉండేది, ఇప్పుడు ఆ శక్తి లేదు. మాకు రచయిత మరియు రచనల గురించి తెలియదని వారు పూర్వము సత్యము చెప్పేవారు. ఇప్పుడైతే స్వయాన్ని భగవంతునిగా చెప్పుకుంటున్నారు, శివోహమ్ అనుకుంటూ కూర్చున్నారు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ సమయములో మొత్తం వృక్షమంతా తమోప్రధానముగా ఉంది, అందుకే అందరినీ ఉద్ధరించడానికి నేను వస్తాను. ఈ ప్రపంచమే మారిపోయేది ఉంది. ఆత్మలన్నీ తిరిగి వెళ్ళిపోతాయి. ఆత్మలైన మనలో అవినాశీ పాత్ర నిండి ఉందని, అది మళ్ళీ రిపీట్ చేస్తామని తెలిసినవారు ఒక్కరూ కూడా లేరు. ఆత్మ ఇంత చిన్ననిది, ఇందులో అవినాశీ పాత్ర నిండి ఉంది, అది ఎప్పుడూ వినాశనమవ్వదు. ఇందులో బుద్ధి చాలా మంచిగా, పవిత్రముగా ఉండాలి. అది ఎప్పుడు సాధ్యమవుతుందంటే స్మృతియాత్రలో ఆనందముగా నిమగ్నమై ఉన్నప్పుడు. ఏ కృషి లేకుండా పదవి లభించదు, అందుకే ఉన్నతిలోకి వెళ్తూ ఉంటే వైకుంఠ రసాన్ని ఆస్వాదిస్తారు, పడిపోతే ముక్కలు ముక్కలుగా అయిపోతారు.... అని అంటూ ఉంటారు. ఉన్నతోన్నతమైన డబల్ కిరీటధారులైన రాజులకే రాజులెక్కడ, ప్రజలెక్కడ. చదివించేవారైతే ఒక్కరే. ఇందులో చాలా మంచి తెలివి కావాలి. స్మృతియాత్ర ముఖ్యమైనది అని బాబా పదే-పదే అర్థం చేయిస్తున్నారు. నేను మిమ్మల్ని చదివించి విశ్వానికి యజమానులుగా తయారుచేస్తాను. అలాగే వారు టీచరు మరియు గురువు కూడా. తండ్రి టీచర్లకే టీచర్, తండ్రులకే తండ్రి. మన బాబా చాలా ప్రియమైనవారు అని పిల్లలైన మీకు తెలుసు. ఇటువంటి తండ్రినైతే చాలా స్మృతి చేయాలి. చదువు కూడా పూర్తిగా చదువుకోవాలి. తండ్రిని స్మృతి చేయకపోతే పాపాలు దూరమవ్వవు. తండ్రి ఆత్మలందరినీ తమతోపాటు తీసుకువెళ్తారు. ఇకపోతే శరీరాలన్నీ సమాప్తమైపోతాయి. ఆత్మలు తమ-తమ ధర్మాలకు చెందిన సెక్షన్లలోకి వెళ్ళి నివసిస్తాయి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. బుద్ధిని పవిత్రముగా చేసుకునేందుకు స్మృతియాత్రలో ఆనందముగా నిమగ్నమై ఉండాలి. కర్మలు చేస్తూ కూడా ఒక్క ప్రియుడే స్మృతి ఉండాలి - అప్పుడు వికర్మాజీతులుగా అవుతారు.

2. ఈ చిన్నని యుగములో మనుష్యుల నుండి దేవతలుగా అయ్యే కృషి చేయాలి. మంచి కర్మల అనుసారముగా మంచి సంస్కారాలను ధారణ చేసి మంచి కులములోకి వెళ్ళాలి.

వరదానము:-
తమ ఆత్మిక లైట్స్ ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేసే సేవ చేసే సహజ సఫలతామూర్త భవ

ఏ విధముగా సాకార సృష్టిలో ఏ రంగు లైట్ వెలిగిస్తే అదే రంగు వాతావరణము ఏర్పడుతుంది. ఒకవేళ ఆకుపచ్చ రంగు లైట్ వెలిగించినట్లయితే నలువైపులా అదే ప్రకాశము వ్యాపిస్తుంది. ఎరుపు రంగు లైట్ వెలిగించినట్లయితే స్మృతితో కూడిన వాయుమండలము ఏర్పడుతుంది. స్థూలమైన లైట్ వాయుమండలాన్ని పరివర్తన చేసినప్పుడు లైట్ హౌస్ లైన మీరు కూడా పవిత్రత యొక్క లైట్ మరియు సుఖము యొక్క లైట్ ద్వారా వాయుమండలాన్ని పరివర్తన చేసే సేవ చేయండి, అప్పుడు సఫలతామూర్తులుగా అవుతారు. స్థూలమైన లైట్ ను కనుల ద్వారా చూస్తారు, ఆత్మిక లైట్ ను అనుభవము ద్వారా తెలుసుకుంటారు.

స్లోగన్:-
వ్యర్థమైన విషయాలలో సమయాన్ని మరియు సంకల్పాలను పోగొట్టుకోవటము - ఇది కూడా అపవిత్రతయే.


అవ్యక్త సూచనలు - స్వయము కొరకు మరియు సర్వుల కొరకు మనసా ద్వారా యోగ శక్తులను ప్రయోగము చెయ్యండి

ఏ ఖజానానైనా తక్కువగా ఖర్చు చేసి అధిక ప్రాప్తిని పొందటము, ఇదే యోగ ప్రయోగము. శ్రమ తక్కువ, సఫలత ఎక్కువ - ఈ విధి ద్వారా ప్రయోగము చెయ్యండి. సమయము మరియు సంకల్పాలు శ్రేష్ఠ ఖజానాలు, కావున సంకల్పాలు తక్కువలో తక్కువ ఖర్చు అవ్వాలి, కానీ ప్రాప్తి ఎక్కువగా ఉండాలి. సాధారణ వ్యక్తి రెండు-నాలుగు సంకల్పాలు చేసిన తర్వాత, ఆలోచించిన తర్వాత ఏదైతే సఫలతను లేక ప్రాప్తిని పొందగలరో దానిని మీరు ఒకటి-రెండు సెకండ్లలో చెయ్యగలరు, దీనినే తక్కువ ఖర్చు, ఎక్కువ ఫలితము అని అంటారు. తక్కువ ఖర్చు చెయ్యండి కానీ ప్రాప్తి 100 రెట్లు ఉండాలి, దీని ద్వారా సమయము మరియు సంకల్పాలు ఏవైతే పొదుపు అవుతాయో, వాటిని ఇతరుల సేవలో ఉపయోగించవచ్చు, దాన-పుణ్యాలు చెయ్యవచ్చు, ఇదే యోగ ప్రయోగము.