ఓంశాంతి
ఆత్మిక తండ్రి కూర్చుని ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రి యొక్క
మహిమనైతే పిల్లలకు వినిపించారు. వారు జ్ఞానసాగరుడు, సత్ చిత్ ఆనంద స్వరూపుడు. వారు
శాంతిసాగరుడు. వారి విషయములో అనంతమైన విశేషతలు మహిమ చేయడము జరుగుతుంది. ఇప్పుడు
తండ్రి జ్ఞానసాగరుడు మరియు ఈ సమయములోని ఏ మనుష్యులైతే ఉన్నారో, వారందరికీ - మేము
భక్తి సాగరులము అని తెలుసు. భక్తిలో ఎవరైతే అందరికన్నా చురుకుగా ఉంటారో, వారికి
గౌరవము లభిస్తుంది. ఈ సమయములో కలియుగములో భక్తి, దుఃఖము ఉన్నాయి. సత్యయుగములో జ్ఞాన
సుఖము ఉంటుంది. అలాగని అక్కడ జ్ఞానముంటుందని కాదు. కావున ఈ మహిమ కేవలం ఒక్క తండ్రిది
మాత్రమే మరియు పిల్లలకు కూడా మహిమ ఉంది, ఎందుకంటే తండ్రి పిల్లలను చదివిస్తారు మరియు
యాత్రను నేర్పిస్తారు. తండ్రి అర్థం చేయించారు, రెండు యాత్రలు ఉన్నాయి. భక్తులు
తీర్థయాత్రలు చేస్తారు, నలువైపులా సంచరించి వస్తారు. కావున ఎంత సమయమైతే అలా
నలువైపులా తిరుగుతారో, అంత సమయము వికారాలలోకి వెళ్ళరు. మద్యము మొదలైన ఛీ-ఛీ
పదార్థాలేవీ తినరు, తాగరు. అప్పుడప్పుడు బద్రీనాథ్ కు, అప్పుడప్పుడు కాశీకి వెళ్ళి
వస్తారు. భగవంతునికి భక్తి చేస్తారు. వాస్తవానికి భగవంతుడు అనేవారు ఒక్కరే ఉండాలి
కదా. అన్ని చోట్లకు అలా తిరగకూడదు కదా! శివబాబా యొక్క తీర్థస్థానాలకు కూడా వెళ్ళి
వస్తుంటారు. బనారస్ లోని తీర్థ స్థానాన్ని అన్నింటికన్నా పెద్దది అని అంటూ ఉంటారు,
దానిని శివుని పురి అని అంటారు. అలా నలువైపులకు వెళ్తారు కానీ ఎవరి దర్శనము
చేసుకోవడానికైతే వెళ్తారో లేక ఎవరి భక్తినైతే చేస్తారో, వారి జీవితచరిత్ర, వారి
కర్తవ్యము గురించి ఎవ్వరికీ తెలియదు, అందుకే దానిని అంధవిశ్వాసము అని అంటారు.
ఎవరినైనా పూజిస్తున్నారు, వారికి తల వంచి నమస్కరిస్తున్నారు కానీ వారి జీవిత కథ
గురించి తెలియదు అంటే దానిని అంధవిశ్వాసము అని అంటారు. ఇంటిలో కూడా జరుపుకుంటారు,
దేవీలకు ఎంతగా పూజలు చేస్తారు, మట్టితో లేక రాతితో దేవీలను తయారుచేసి వారిని బాగా
అలంకరిస్తారు. ఉదాహరణకు లక్ష్మి యొక్క చిత్రాన్ని తయారుచేసారనుకోండి, ఆమె జీవిత
చరిత్రను గురించి చెప్పమని వారిని అడిగితే, ఆమె సత్యయుగ మహారాణిగా ఉండేవారు అని
అంటారు. త్రేతాయుగ మహారాణిగా సీత ఉండేవారు అని అంటారు. కానీ వారు ఎంత సమయము రాజ్యము
చేసారు, లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఎప్పటినుండి ఎప్పటివరకు కొనసాగింది అన్నది
ఎవ్వరికీ తెలియదు. మనుష్యులు భక్తి మార్గములో యాత్రలకు వెళ్తారు, అవన్నీ భగవంతుడిని
కలుసుకునేందుకు ఉపాయాలు అని భావిస్తారు. శాస్త్రాలు చదవడము కూడా భగవంతుడిని
కలుసుకునేందుకు ఉపాయముగా భావిస్తారు. కానీ భగవంతుడు ఎక్కడ ఉన్నారు అని అడిగితే వారు
సర్వవ్యాపి అని అంటారు.
చదువు ద్వారా మేము ఈ దేవీ-దేవతలుగా అవుతామని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి స్వయంగా
వచ్చి చదివిస్తారు, వారిని కలుసుకునేందుకని అర్ధకల్పము భక్తి మార్గము కొనసాగుతుంది.
బాబా, పావనముగా తయారుచేయండి మరియు మీరు ఎవరు అన్న మీ పరిచయాన్ని కూడా ఇవ్వండి అని
అంటారు. బాబా అర్థం చేయించారు, ఆత్మ అయిన మీరు బిందువు, ఆత్మకే ఇక్కడ శరీరము
లభించింది, అందుకే ఇక్కడ కర్మలు చేస్తుంది. దేవతల కొరకు వారు సత్యయుగములో రాజ్యము
చేసి వెళ్ళారని అంటారు. తప్పకుండా గాడ్ ఫాదర్ ప్యారడైజ్ ను (స్వర్గాన్ని) స్థాపన
చేసారని, మేము అందులో లేము అని క్రిస్టియన్లు భావిస్తారు. భారత్ లో ప్యారడైజ్ ఉండేది
అని భావిస్తారు, క్రిస్టియన్ల బుద్ధి ఎంతోకొంత బాగుంది. భారతవాసులు సతోప్రధానముగా
కూడా అవుతారు, మళ్ళీ తమోప్రధానముగా కూడా అవుతారు. క్రిస్టియన్లు అంత సుఖాన్ని కూడా
చూడరు, అలాగే అంత దుఃఖాన్ని కూడా చూడరు. ఇప్పుడు చివరిలోని క్రిస్టియన్లు ఎంత
సుఖముగా ఉన్నారు. పూర్వము వారు పేదవారిగా ఉండేవారు. డబ్బును కష్టపడి సంపాదించడము
జరుగుతుంది కదా. మొదట క్రైస్టు ఒక్కరే వచ్చారు, ఆ తర్వాత వారి ధర్మము స్థాపనవుతుంది,
ఇక వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఒకరి నుండి ఇద్దరు, ఇద్దరి నుండి నలుగురు... ఈ విధముగా
వృద్ధి జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు చూడండి, క్రిస్టియన్ల వృక్షము ఎంతగా పెరిగిపోయింది.
పునాది దేవీ-దేవతా వంశమే. అది మళ్ళీ ఇక్కడ ఈ సమయములో స్థాపనవుతుంది. మొదట బ్రహ్మా
ఒక్కరే, ఆ తర్వాత దత్తత తీసుకోబడిన బ్రాహ్మణ సంతానము వృద్ధి చెందుతూ ఉంటారు. తండ్రి
చదివిస్తారు కావున ఎంతోమంది బ్రాహ్మణులు తయారవుతారు. మొదటైతే ఇతను ఒక్కరే ఉండేవారు
కదా. ఒక్కరి నుండి ఎంత వృద్ధి జరిగింది, ఇంకా ఎంతగా జరగనున్నది. ఎంతమంది సూర్యవంశీ,
చంద్రవంశీ దేవతలు ఉండేవారో, అంతమంది మళ్ళీ తయారవ్వనున్నారు. మొదట తండ్రి ఒక్కరే
ఉంటారు, వారి ఆత్మ ఉండనే ఉంది. ఆ తండ్రి సంతానమైన ఆత్మలమైన మనము ఎంతమంది ఉన్నాము?
ఆత్మలమైన మనందరికీ అనాది అయిన తండ్రి ఒక్కరే, ఇక తర్వాత సృష్టి చక్రము తిరుగుతూ
ఉంటుంది. మనుష్యులందరూ అయితే సదా ఉండరు కదా. ఆత్మలు భిన్న-భిన్న పాత్రలను
అభినయించాలి. ఈ వృక్షానికి మొట్టమొదటి కాండము దేవీ-దేవతలది, ఇక తర్వాత దాని నుండి
కొమ్మలు వెలువడ్డాయి. పిల్లలూ, నేను వచ్చి ఏం చేస్తాను అని అంటూ తండ్రి కూర్చుని
పిల్లలకు అర్థం చేయిస్తున్నారు. ఆత్మలోనే ధారణ జరుగుతుంది. నేను ఎలా వచ్చాను అని
అంటూ తండ్రి కూర్చుని వినిపిస్తారు. పిల్లలైన మీరంతా పతితముగా అయినప్పుడు స్మృతి
చేస్తారు. సత్య, త్రేతాయుగాలలోనైతే మీరు సుఖముగా ఉండేవారు కావున స్మృతి చేసేవారు
కాదు. ద్వాపరము తర్వాత దుఃఖము ఎక్కువైనప్పుడు - ఓ పరమపిత పరమాత్మ బాబా అని పిలిచారు.
ఆ పిల్లలూ, విన్నాను, మీకు ఏం కావాలి? బాబా, మీరు వచ్చి పతితులను పావనముగా చేయండి.
బాబా, మేము చాలా దుఃఖితులుగా, పతితముగా ఉన్నాము, మీరు వచ్చి మమ్మల్ని పావనముగా
చేయండి, కృప చూపండి, ఆశీర్వదించండి. బాబా, మీరు వచ్చి పతితులను పావనముగా చేయండి అని
మీరు నన్ను పిలిచారు. పావనము అని సత్యయుగాన్ని అంటారు. ఇది కూడా తండ్రి స్వయంగా
కూర్చుని తెలియజేస్తున్నారు. డ్రామా ప్లాన్ అనుసారముగా ఎప్పుడైతే సంగమయుగము
ప్రారంభమవుతుందో, సృష్టి పాతబడుతుందో, అప్పుడు నేను వస్తాను.
సన్యాసులు కూడా రెండు రకాలవారు ఉంటారని మీరు అర్థం చేసుకుంటారు. వారు హఠయోగులు,
వారిని రాజయోగులని అనరు. వారిది హద్దు సన్యాసము. ఇళ్ళు-వాకిళ్ళను వదిలి అడవుల్లో
ఉంటారు. గురువులకు శిష్యులుగా అవుతారు. గోపిచంద్ రాజు గురించి కూడా ఒక కథను
వినిపిస్తారు. మీరు ఇళ్ళు-వాకిళ్ళను ఎందుకు విడిచిపెడతారు, ఎక్కడికి వెళ్తారు అని
అతను అడుగుతారు. శాస్త్రాలలో ఎన్నో కథలు ఉన్నాయి. ఇప్పుడు బి.కె.లైన మీరు వెళ్ళి
రాజులకు కూడా జ్ఞాన-యోగాలను నేర్పిస్తారు. ఒక అష్టావక్ర గీత కూడా ఉంది, అందులో
రాజుకు వైరాగ్యము కలిగినప్పుడు నన్ను ఎవరైనా పరమాత్మతో కలిపించండి అని అన్నట్లుగా
చూపిస్తారు, దండోరా వేయించినట్లుగా చెప్తారు. ఆ సమయము ఇదే. తండ్రితో కలిపించడానికని
చెప్పి మీరు వెళ్ళి రాజులకు జ్ఞానాన్ని ఇస్తారు కదా. ఏ విధముగా మీరు తండ్రిని
కలిసారో, అదే విధముగా ఇతరులను కూడా కలిపించేందుకు ప్రయత్నము చేస్తారు. మేము
మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా చేస్తాము, ముక్తి-జీవన్ముక్తులను ఇస్తాము అని
మీరంటారు. కావున వారికి - శివబాబానే స్మృతి చేయండి, ఇంకెవ్వరినీ స్మృతి చేయకండి అని
చెప్పండి. మీ వద్ద కూడా ప్రారంభములో కూర్చుని-కూర్చునే ఒకరిని ఒకరు చూసుకుంటూ
ధ్యానములోకి వెళ్ళిపోయేవారు కదా. చాలా అద్భుతముగా అనిపించేది. వీరిలో తండ్రి
ఉండేవారు కదా, కావున వారు చమత్కారము చూపించేవారు. అందరి తాడును లాక్కునేవారు. బాప్
దాదా, ఇరువురు కలిసి ఉన్నారు కదా. స్మశానవాటికలా తయారుచేసేవారు, అందరూ తండ్రి
స్మృతిలో పడుకోండి అనేవారు, దానితో అందరూ ధ్యానములోకి వెళ్ళిపోయేవారు. ఇదంతా శివబాబా
యొక్క చతురత. దీనిని చాలామంది ఇంద్రజాలమని భావించేవారు. అదంతా శివబాబా ఆట. తండ్రి
ఇంద్రజాలికుడు, వ్యాపారస్థుడు, రత్నాకరుడు కదా. వారు చాకలి కూడా, కంసాలి కూడా, వకీలు
కూడా. వారు అందరినీ రావణుడి జైలు నుండి విడిపిస్తారు. వారినే అందరూ పిలుస్తారు - ఓ
పతిత-పావనా, ఓ దూరదేశ నివాసీ... మీరు వచ్చి మమ్మల్ని పావనముగా చేయండి, మీరు రావడము
కూడా పతిత ప్రపంచములోకి, పతిత శరీరములోకి వచ్చి మమ్మల్ని పావనముగా చేయండి. ఇప్పుడు
మీరు దీని అర్థాన్ని కూడా అర్థం చేసుకున్నారు. తండ్రి వచ్చి చెప్తున్నారు -
పిల్లలైన మీరు రావణుడి దేశములోకి నన్ను పిలిచారు, నేనైతే పరంధామములో కూర్చుని
ఉండేవాడిని. స్వర్గ స్థాపన చేయడము కోసం నన్ను నరకములోకి, రావణుడి దేశములోకి పిలిచారు,
ఇప్పుడిక సుఖధామములోకి తీసుకువెళ్ళండి అని పిలిచారు. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని
తీసుకువెళ్తాను కదా. ఇదంతా డ్రామా. నేను మీకు ఏ రాజ్యమునైతే ఇచ్చానో, అది
పూర్తయ్యింది, మళ్ళీ ద్వాపరయుగము నుండి రావణ రాజ్యము నడుస్తూ ఉంది. 5 వికారాలలోకి
పడిపోయారు, ఆ చిత్రాలు కూడా జగన్నాథపురిలో ఉన్నాయి. మొదటి నంబరులో ఎవరైతే ఉండేవారో,
వారే 84 జన్మలను తీసుకుని ఇప్పుడు చివరిలో ఉన్నారు, వారే మళ్ళీ మొదటి నంబరులోకి
వెళ్ళాలి. ఇక్కడ బ్రహ్మా కూర్చుని ఉన్నారు, విష్ణువు కూడా కూర్చుని ఉన్నారు.
వీరిరువురికీ పరస్పరములో ఏం సంబంధము ఉంది? ఇది ప్రపంచములోని వారికెవ్వరికీ తెలియదు.
బ్రహ్మా-సరస్వతులు కూడా వాస్తవానికి సత్యయుగానికి యజమానులైన లక్ష్మీ-నారాయణులుగా
ఉండేవారు. ఇప్పుడు నరకానికి యజమానులుగా ఉన్నారు. ఇప్పుడు వీరు - లక్ష్మీ-నారాయణులుగా
అయ్యేందుకు తపస్య చేస్తున్నారు. దిల్వాడా మందిరములో పూర్తి స్మృతిచిహ్నము ఉంది.
తండ్రి కూడా ఇక్కడికే వచ్చారు, అందుకే - ఆబూ అన్ని తీర్థ స్థానాలలో కల్లా, సర్వ
ధర్మాల తీర్థ స్థానాలలో కల్లా ముఖ్యమైనది అని ఇప్పుడు వ్రాస్తారు కూడా, ఎందుకంటే
తండ్రి ఇక్కడికే వచ్చి సర్వ ధర్మాల సద్గతిని చేస్తారు. మీరు శాంతిధామానికి వెళ్ళి
అక్కడి నుండి స్వర్గములోకి వెళ్తారు. మిగిలినవారంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు. అది
జడమైన స్మృతిచిహ్నము, ఇది చైతన్యమైనది. ఎప్పుడైతే మీరు చైతన్యముగా ఆ విధముగా అవుతారో,
అప్పుడిక ఈ మందిరాలు మొదలైనవన్నీ సమాప్తమైపోతాయి, మళ్ళీ భక్తి మార్గములో ఈ
స్మృతిచిహ్నాలను తయారుచేస్తారు. ఇప్పుడు మీరు స్వర్గ స్థాపన చేస్తున్నారు. స్వర్గము
పైన ఉందని మనుష్యులు భావిస్తారు. ఈ భారత్ యే స్వర్గముగా ఉండేది, ఇప్పుడు నరకముగా
ఉంది అని ఇప్పుడు మీరు భావిస్తారు. ఈ చక్రాన్ని చూడడముతోనే మొత్తం జ్ఞానమంతా
వచ్చేస్తుంది. ద్వాపరము నుండి వేరే-వేరే ధర్మాలన్నీ వస్తాయి కావున ఇప్పుడు ఎన్ని
ధర్మాలు ఉన్నాయో చూడండి. ఇది ఇనుపయుగము. ఇప్పుడు మీరు సంగమములో ఉన్నారు. మీరు
సత్యయుగములోకి వెళ్ళేందుకు పురుషార్థము చేస్తున్నారు. కలియుగములో అందరూ రాతిబుద్ధి
కలవారిగా ఉన్నారు. సత్యయుగములో ఉన్నది పారసబుద్ధి కలవారు. మీరే పారసబుద్ధి కలవారిగా
ఉండేవారు, మీరే మళ్ళీ రాతిబుద్ధి కలవారిగా అయ్యారు, మళ్ళీ పారసబుద్ధి కలవారిగా
అవ్వాలి. ఇప్పుడు తండ్రి అంటారు, మీరు నన్ను పిలిచారు కావున నేను వచ్చాను మరియు మీకు
చెప్తున్నాను - కామాన్ని జయించినట్లయితే జగత్ జీతులుగా అవుతారు. ముఖ్యమైనది ఈ
వికారమే. సత్యయుగములో అందరూ నిర్వికారులు, కలియుగములో వికారులుగా ఉన్నారు.
తండ్రి అంటారు - పిల్లలూ, ఇప్పుడు నిర్వికారులుగా అవ్వండి. 63 జన్మలు వికారాలలోకి
వెళ్ళారు. ఇప్పుడు ఈ అంతిమ జన్మలో పవిత్రముగా అవ్వండి. ఇప్పుడు అందరూ మరణించవలసిందే.
నేను స్వర్గ స్థాపన చేయడానికి వచ్చాను కావున ఇప్పుడు నా శ్రీమతముపై నడవండి. నేను ఏమి
చెప్తే అది వినండి. ఇప్పుడు మీరు రాతిబుద్ధిని పారసబుద్ధిగా తయారుచేసే పురుషార్థము
చేస్తున్నారు. మీరే మెట్లను పూర్తిగా దిగుతారు, మళ్ళీ ఎక్కుతారు. మీరు జిన్నుభూతము
వంటివారు. జిన్నుభూతము కథ ఉంది కదా - అది పని ఇవ్వమని అడిగితే, అచ్ఛా, మెట్లు ఎక్కు,
మళ్ళీ దిగు అని రాజు చెప్పినట్లుగా చెప్తారు. చాలామంది మనుష్యులు ఏమంటారంటే - అసలు
భగవంతునికి ఏమి అవసరమని మెట్లు ఎక్కిస్తూ మరియు దింపుతూ ఉంటారు, అసలు భగవంతునికి
ఏమయ్యిందని ఇటువంటి మెట్లను తయారుచేసారు! తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇది అనాది
ఆట. మీరు 5 వేల సంవత్సరాలలో 84 జన్మలు తీసుకున్నారు. మీకు కిందికి దిగడానికి 5 వేల
సంవత్సరాలు పట్టింది, మళ్ళీ ఒక్క సెకెండులో పైకి వెళ్ళిపోతారు. ఇది మీ యోగబలము
యొక్క లిఫ్ట్. తండ్రి అంటారు, స్మృతి చేసినట్లయితే మీ పాపాలు కట్ అయిపోతాయి. తండ్రి
వచ్చినప్పుడు ఒక్క సెకెండులో మీరు పైకి ఎక్కిపోతారు, మళ్ళీ కిందికి దిగడానికి 5 వేల
సంవత్సరాలు పట్టింది. కళలు తగ్గిపోతూ ఉంటాయి. ఎక్కేందుకైతే లిఫ్ట్ ఉంది. సెకెండులో
జీవన్ముక్తి. సతోప్రధానముగా అవ్వాలి. మళ్ళీ మెల్లమెల్లగా తమోప్రధానముగా అవుతారు.
అందుకు 5 వేల సంవత్సరాలు పడుతుంది. అచ్ఛా, మళ్ళీ ఒక్క జన్మలోనే తమోప్రధానము నుండి
సతోప్రధానముగా అవ్వాలి. ఇప్పుడు నేను మీకు స్వర్గ రాజ్యాధికారాన్ని ఇస్తున్నప్పుడు
మీరు పవిత్రముగా ఎందుకు అవ్వరు. కానీ కామానికి, క్రోధానికి వశమయ్యేవారు కూడా ఉన్నారు
కదా. వికారాలు లభించకపోతే పత్నిని కొడతారు, బయటకు పంపించేస్తారు, నిప్పు
అంటించేస్తారు. అబలలపై ఎన్ని అత్యాచారాలు జరుగుతాయి. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై
ఉంది. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.