26-08-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - జ్ఞానసాగరుడైన తండ్రి జ్ఞానమనే వర్షాన్ని కురిపించి ఈ భూమిని సస్యశ్యామలముగా చేయడానికి వచ్చారు, ఇప్పుడు స్వర్గ స్థాపన జరుగుతోంది, అందులోకి వెళ్ళేందుకు దైవీ సాంప్రదాయానికి చెందినవారిగా అవ్వాలి’’

ప్రశ్న:-
సర్వోత్తమ కులానికి చెందిన పిల్లల ముఖ్య కర్తవ్యము ఏమిటి?

జవాబు:-
సదా ఉన్నతమైన ఆత్మిక సేవను చేయడము, ఇక్కడ కూర్చుని లేక నడుస్తూ, తిరుగుతూ విశేషముగా భారత్ ను మరియు మొత్తం విశ్వాన్ని పావనముగా తయారుచేయడము, శ్రీమతముపై తండ్రికి సహాయకులుగా అవ్వడము - ఇదే సర్వోత్తములైన బ్రాహ్మణుల కర్తవ్యము.

పాట:-
ఎవరైతే ప్రియమైనవారితో ఉన్నారో...

ఓంశాంతి
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలెవరైతే ఆత్మిక తండ్రితో పాటు ఉన్నారో, వారికి ఆత్మిక తండ్రి అర్థం చేయిస్తున్నారు ఎందుకంటే తండ్రి జ్ఞానసాగరుడు. ఏ తండ్రి? శివబాబా. బ్రహ్మాబాబాను జ్ఞానసాగరుడు అని అనరు. శివబాబానే పరమపిత పరమాత్మ అని అంటారు. ఒకరు లౌకికమైన దైహిక తండ్రి, రెండవవారు పారలౌకికమైన ఆత్మిక తండ్రి. వారు శరీరానికి తండ్రి, వీరు ఆత్మల తండ్రి, ఇవి బాగా అర్థం చేసుకోవలసిన విషయాలు మరియు ఈ జ్ఞానాన్ని వినిపించేది జ్ఞానసాగరుడు. ఏ విధముగా భగవంతుడు అందరికీ ఒక్కరే ఉంటారో, అలా జ్ఞానాన్ని కూడా ఆ ఒక్కరే ఇవ్వగలరు. ఇకపోతే శాస్త్రాలు, గీత మొదలైనవేవైతే చదువుతారో, భక్తి చేస్తారో, అది జ్ఞానమేమీ కాదు, వాటి ద్వారా జ్ఞానము వర్షించదు, అందుకే భారత్ పూర్తిగా ఎండిపోయింది, నిరుపేదగా అయిపోయింది. వర్షము కురవకపోతే భూమి మొదలైనవన్నీ ఎండిపోతాయి కదా. అది భక్తి మార్గము, దానిని జ్ఞాన మార్గము అని అనరు. జ్ఞానము ద్వారా స్వర్గ స్థాపన జరుగుతుంది. అక్కడ ఎల్లప్పుడూ భూమి సస్యశ్యామలముగా ఉంటుంది, ఎప్పుడూ ఎండిపోదు. ఇది జ్ఞానము యొక్క చదువు. ఈశ్వరుడైన తండ్రి జ్ఞానాన్ని ఇచ్చి దైవీ సాంప్రదాయానికి చెందినవారిగా తయారుచేస్తారు. తండ్రి అర్థం చేయించారు, నేను ఆత్మలైన మీ అందరికీ తండ్రిని. కానీ నా గురించి మరియు నా కర్తవ్యము గురించి తెలియని కారణముగానే మనుష్యులు ఇంత పతితులుగా, దుఃఖితులుగా, అనాథలుగా అయిపోయారు. పరస్పరము ఒకరితో ఒకరు కొట్లాడుకుంటూ ఉంటారు. ఇంటిలో తండ్రి లేకపోతే, పిల్లలు దెబ్బలాడుకుంటూ ఉంటే, మీకు అసలు తండ్రి ఉన్నారా లేరా? అని వారినంటారు కదా. అలాగే ఈ సమయములో కూడా మొత్తం ప్రపంచానికి తండ్రి ఎవరో తెలియదు. తెలియని కారణముగానే ఇంతటి దుర్గతి జరిగింది. తెలుసుకోవడం ద్వారా సద్గతి లభిస్తుంది. సర్వుల సద్గతిదాత ఒక్కరే. వారిని బాబా (తండ్రి) అని పిలుస్తారు. వారి పేరు శివయే. వారి పేరు ఎప్పుడూ మారదు. సన్యాసము పుచ్చుకున్నప్పుడు పేరు మారుతుంది కదా. వివాహములో కూడా కుమారి పేరు మారుతుంది. ఈ ఆచారము ఇక్కడ భారత్ లో ఉంది, విదేశాలలో ఇలా ఉండదు. ఈ శివబాబా అందరికీ తల్లి, తండ్రి వంటివారు. నీవే తల్లివి తండ్రివి... అని గానం చేస్తారు కూడా. నీ కృపతో అపారమైన సుఖము లభిస్తుంది... అని ఈ విధముగా భారత్ లోనే గానం చేస్తారు. అలాగని భక్తి మార్గములో భగవంతుడు కృప చూపిస్తూ వచ్చారని కాదు, అలా కాదు. భక్తిలో అసలు అపారమైన సుఖము ఉండనే ఉండదు. స్వర్గములో అపారమైన సుఖము ఉంటుందని పిల్లలకు తెలుసు. అది కొత్త ప్రపంచము. పాత ప్రపంచములో దుఃఖమే ఉంటుంది. ఎవరైతే జీవిస్తూ పూర్తిగా మరణించి ఉంటారో వారి పేర్లు మార్చవచ్చు. కానీ మాయ వారిపై విజయాన్ని పొందితే ఇక వారు బ్రాహ్మణుల నుండి శూద్రులుగా అయిపోతారు, అందుకే బాబా పేర్లు పెట్టరు. బ్రాహ్మణుల మాల ఉండదు. పిల్లలైన మీరు సర్వోత్తమమైన, ఉన్నతమైన కులానికి చెందినవారు. మీరు ఉన్నతమైన ఆత్మిక సేవను చేస్తారు. ఇక్కడ కూర్చున్నా లేక నడుస్తూ, తిరుగుతూ ఉన్నా మీరు విశేషముగా భారత్ కు మరియు మొత్తం విశ్వానికి సేవ చేస్తారు. విశ్వాన్ని మీరు పవిత్రముగా తయారుచేస్తారు. మీరు తండ్రికి సహాయకులు. తండ్రి శ్రీమతముపై నడుస్తూ మీరు సహాయము చేస్తారు. ఈ భారత్ యే పావనముగా అవ్వనున్నది. మీరు అంటారు - మేము కల్పకల్పము ఈ భారత్ ను పవిత్రముగా తయారుచేసి పవిత్ర భారత్ పై రాజ్యము చేస్తాము. బ్రాహ్మణుల నుండి మళ్ళీ మనము భవిష్య దేవీ-దేవతలుగా అవుతాము. విరాట రూపము యొక్క చిత్రము కూడా ఉంది. ప్రజాపిత బ్రహ్మాకు సంతానము బ్రాహ్మణులే. ప్రజాపిత బ్రహ్మా సమ్ముఖముగా ఉన్నప్పుడే బ్రాహ్మణులుగా అవుతారు. ఇప్పుడు మీరు సమ్ముఖముగా ఉన్నారు. మీరు ప్రతి ఒక్కరూ స్వయాన్ని ప్రజాపిత బ్రహ్మాకు సంతానముగా భావిస్తారు. ఇది ఒక యుక్తి. సంతానముగా భావించినట్లయితే సోదరీ-సోదరులుగా అవుతారు. సోదరీ-సోదరులకు పరస్పరము ఎప్పుడూ వికారీ దృష్టి ఉండకూడదు. ఇప్పుడు తండ్రి ఒక ఆదేశాన్ని జారీ చేస్తారు - మీరు 63 జన్మలు పతితముగా ఉన్నారు, ఇప్పుడు పావన ప్రపంచమైన స్వర్గములోకి వెళ్ళాలనుకుంటే పవిత్రముగా అవ్వండి. అక్కడికి పతిత ఆత్మలు వెళ్ళలేవు. అందుకే అనంతమైన తండ్రినైన నన్ను మీరు పిలుస్తూ ఉంటారు. ఈ ఆత్మ శరీరము ద్వారా మాట్లాడుతుంది. శివబాబా కూడా అంటారు - నేను ఈ శరీరము ద్వారా మాట్లాడుతాను, లేకపోతే నేను ఎలా వస్తాను? నా జన్మ దివ్యమైనది. సత్యయుగములో దైవీ గుణాలు కలిగిన దేవతలు ఉంటారు, ఈ సమయములో ఉన్నది ఆసురీ గుణాలు కలిగిన మనుష్యులు. ఇక్కడి మనుష్యులను దేవతలు అని అనరు, అది ఎవరైనా సరే. ఇక్కడ పేర్లు మాత్రము చాలా పెద్ద-పెద్దవి పెట్టుకుంటూ ఉంటారు. సాధువులు తమను తాము శ్రీ శ్రీ అని పిలుచుకుంటూ ఉంటారు మరియు మామూలు మనుష్యులను శ్రీ అని పిలుస్తారు ఎందుకంటే వారు స్వయము పవిత్రముగా ఉంటారు, కావుననే శ్రీ శ్రీ అని పిలుచుకుంటారు. కానీ వాస్తవానికి వారు కూడా మనుష్యులే. వారు వికారాలలోకి వెళ్ళరు కానీ వారు ఉన్నది వికారీ ప్రపంచములోనే కదా. మీరు భవిష్యత్తులో నిర్వికారీ దైవీ ప్రపంచములో రాజ్యము చేస్తారు. అక్కడ కూడా మనుష్యులే ఉంటారు, కానీ దివ్య గుణాలు కలవారు ఉంటారు. ఈ సమయములో మనుష్యులు ఆసురీ గుణాలు కలిగిన పతితులుగా ఉన్నారు. గురునానక్ కూడా - భగవంతుడు మురికి పట్టిన వస్త్రాలను శుభ్రపరుస్తారు అని అన్నారు, గురునానక్ కూడా తండ్రి మహిమను చేస్తారు.

ఇప్పుడు తండ్రి స్థాపన మరియు వినాశనము చేయడానికి వచ్చారు. ఇతర ధర్మస్థాపకులంతా ఎవరైతే ఉన్నారో, వారు కేవలం తమ ధర్మ స్థాపనను చేస్తారు, వారు ఇతర ధర్మాల వినాశనము చేయరు, వారి ధర్మము అలా వృద్ధిని పొందుతూనే ఉంటుంది. ఇప్పుడు తండ్రి ఆ వృద్ధిని ఆపుతారు. తండ్రి ఏక ధర్మ స్థాపనను మరియు అనేక ధర్మాల వినాశనాన్ని చేయిస్తారు. డ్రామానుసారముగా ఇది జరిగేదే ఉంది. తండ్రి అంటారు, నేను ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క స్థాపన చేయిస్తాను, దాని కొరకే మిమ్మల్ని చదివిస్తున్నాను. సత్యయుగములో అనేక ధర్మాలు ఉండనే ఉండవు. డ్రామాలో వీరందరూ తిరిగి వెనక్కు వెళ్ళడము నిశ్చితమై ఉంది. ఈ వినాశనాన్ని ఎవ్వరూ ఆపలేరు. ఎప్పుడైతే వినాశనము జరుగుతుందో అప్పుడే విశ్వములో శాంతి ఏర్పడుతుంది. ఈ యుద్ధము ద్వారానే స్వర్గ ద్వారాలు తెరచుకుంటాయి. ఈ మహాభారీ యుద్ధము కల్ప పూర్వము కూడా జరిగిందని ఇది కూడా మీరు వ్రాయవచ్చు. మీరు ప్రదర్శినీ యొక్క ప్రారంభోత్సవము చేసినప్పుడు ఈ విషయము వ్రాయండి. స్వర్గము యొక్క ప్రారంభోత్సవాన్ని చేయడానికి తండ్రి పరంధామము నుండి వచ్చారు. తండ్రి అంటారు, స్వర్గ స్థాపకుడినైన తండ్రినైన నేను స్వర్గాన్ని స్థాపన చేయడానికి వచ్చాను. స్వర్గవాసులుగా తయారుచేయడానికి నేను పిల్లల సహాయాన్నే తీసుకుంటాను. ఇంతమంది ఆత్మలందరినీ మరి ఇంకెవరు పావనముగా చేస్తారు. ఎంతోమంది ఆత్మలు ఉన్నారు. ఇంటింటికి వెళ్ళి మీరు ఈ విషయాన్ని అర్థం చేయించవచ్చు. భారతవాసులైన మీరు సతోప్రధానముగా ఉండేవారు, మళ్ళీ 84 జన్మల తరువాత తమోప్రధానముగా అయ్యారు, ఇప్పుడు మళ్ళీ సతోప్రధానముగా అవ్వండి. మన్మనాభవ. మేము శాస్త్రాలను నమ్మము అని అనకండి. మీరు ఏమని చెప్పండంటే - శాస్త్రాలను మరియు భక్తి మార్గాన్ని మేము నమ్మేవారము, కానీ ఇప్పుడు ఈ భక్తి మార్గము యొక్క రాత్రి పూర్తవుతుంది, జ్ఞానము ద్వారా పగలు ప్రారంభమవుతుంది, సద్గతినిచ్చేందుకు తండ్రి వచ్చారు. అర్థం చేయించేందుకు చాలా మంచి యుక్తి కావాలి. కొందరు బాగా ధారణ చేస్తారు, కొందరు తక్కువగా ధారణ చేస్తారు. ప్రదర్శినీలో కూడా మంచి-మంచి పిల్లలెవరైతే ఉన్నారో, వారు బాగా అర్థం చేయిస్తారు. ఈ తండ్రి టీచరుగా అయినట్లుగానే పిల్లలు కూడా టీచరుగా అవ్వాలి. సద్గురువే తీరానికి చేరుస్తారు అని అంటూ ఉంటారు. తండ్రిని - సత్యఖండాన్ని స్థాపన చేసే సత్యమైన బాబా అని అంటారు. అసత్య ఖండాన్ని స్థాపన చేసేది రావణుడు. ఇప్పుడు సద్గతిని ఇచ్చేవారు లభించారు కావున ఇక మనము భక్తి ఎలా చేస్తాము? భక్తిని నేర్పించేది అనేకమంది గురువులు. సద్గురువు అయితే ఒక్కరే. సద్గురువు అకాలమూర్తి... అని అంటారు కూడా. కానీ మళ్ళీ అనేకమంది గురువులుగా అవుతూ ఉంటారు. సన్యాసులు మొదలైన అనేక రకాల గురువులు ఉంటూ ఉంటారు. సిక్కు ధర్మమువారు - సద్గురువు అకాలమూర్తి అని స్వయమే అంటారు అనగా వారిని మృత్యువు కబళించదు అని అర్థము. మనుష్యులనైతే మృత్యువు కబళించివేస్తుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మన్మనాభవ. భగవంతుడిని జపించినట్లయితే సుఖము లభిస్తుంది... అని వారు అంటూ ఉంటారు. ఈ రెండు మాటలు వారికి ముఖ్యమైనవి. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయండి - భగవంతుడిని జపించండి. భగవంతుడైతే ఒక్కరే. గురునానక్ కూడా వారిని జపించమని వారి వైపే సూచించారు. వాస్తవానికి మీరు జపించకూడదు, మీరు స్మృతి చేయాలి. ఇది అజపాజపము (నిరంతర జపము). నోటితో ఏమీ అనకండి. శివ... శివ అని కూడా అనకూడదు. మీరైతే శాంతిధామానికి వెళ్ళాలి. ఇప్పుడు తండ్రిని స్మృతి చేయండి. అజపాజపము కూడా ఒకటే ఉంటుంది, దానిని తండ్రి నేర్పిస్తారు. వారు ఎన్ని గంటలు మోగిస్తూ ఉంటారు, శబ్దము చేస్తారు, మహిమ చేస్తారు. అచ్యుతం, కేశవం... అని అంటూ ఉంటారు. కానీ ఒక్క పదాన్ని కూడా అర్థం చేసుకోరు. సుఖాన్ని ఇచ్చేవారైతే ఒక్క తండ్రి మాత్రమే. వ్యాసుడు అని కూడా వారినే అంటారు. వారిలో జ్ఞానముంది, దానిని అందరికీ ఇస్తారు. సుఖాన్ని కూడా వారే ఇస్తారు. ఇప్పుడు మనము పైకి ఎక్కే కళలోకి వెళ్తున్నామని పిల్లలైన మీరు భావిస్తారు. మెట్ల వరుసలో కళలను గురించి కూడా చూపించారు. ఈ సమయములో కళలేమీ లేవు. నిర్గుణుడినైన నాలో ఏ గుణమూ లేదు అని అంటారు. ఒక నిర్గుణ సంస్థ కూడా ఉంది. ఇప్పుడు తండ్రి అంటారు - చిన్న పిల్లలైతే మహాత్ముల వంటివారు, వారిలో అవగుణాలేమీ ఉండవు, కానీ వారికి నిర్గుణ బాలురు అన్న పేరు పెడతారు. ఒకవేళ పిల్లల్లోనే గుణాలు లేకపోతే మరి తండ్రులలో కూడా ఉండవు, అందరిలోనూ అవగుణాలు ఉన్నాయి. దేవతలు మాత్రమే గుణవంతులుగా అవుతారు. నంబర్ వన్ అవగుణము ఏమిటంటే తండ్రి గురించి తెలియకపోవడము. రెండవ అవగుణము విషయ సాగరములో మునుగుతూ ఉండడము. తండ్రి అంటారు, అర్ధకల్పము మీరు మునుగుతూ వచ్చారు. ఇప్పుడు జ్ఞానసాగరుడినైన నేను మిమ్మల్ని క్షీరసాగరములోకి తీసుకువెళ్తాను. నేను అయితే క్షీరసాగరములోకి వెళ్ళేందుకు మీకు శిక్షణను ఇస్తాను. నేను ఇతడికి పక్కన వచ్చి కూర్చుంటాను, ఆత్మ ఉండే స్థానములో వచ్చి కూర్చుంటాను. నేను స్వతంత్రుడిని, నేను ఎక్కడికైనా వెళ్ళి రాగలను. మీరు పితృలకు శ్రాద్ధ భోజనాలు తినిపించినప్పుడు వారి ఆత్మలకు తినిపిస్తారు కదా. శరీరమైతే భస్మమైపోతుంది. వారిని చూడడం కూడా సంభవము కాదు. ఫలానా ఆత్మ యొక్క శ్రాద్ధము అని అర్థం చేసుకుంటారు. ఆత్మను పిలవడం జరుగుతుంది. ఈ పద్ధతి కూడా డ్రామాలోని పాత్ర. ఆత్మ అప్పుడప్పుడు వస్తుంది, అప్పుడప్పుడు రాదు కూడా. కొన్ని ఆత్మలు తెలియజేస్తాయి, కొన్ని ఆత్మలు తెలియజేయవు కూడా. అలాగే ఇక్కడ కూడా ఆత్మను పిలుస్తారు, అప్పుడు ఆత్మ వచ్చి మాట్లాడుతుంది. కానీ - నేను ఫలానా స్థానములో జన్మ తీసుకున్నాను అని ఆత్మ చెప్పదు, కేవలం - నేను చాలా సుఖముగా ఉన్నాను, మంచి ఇంటిలో జన్మ తీసుకున్నాను అని మాత్రము చెప్తుంది. మంచి జ్ఞానము కల పిల్లలు మంచి ఇంటిలోకి వెళ్తారు. తక్కువ జ్ఞానము కలవారు తక్కువ పదవిని పొందుతారు. కానీ సుఖమైతే ఉంటుంది. రాజుగా అవ్వడము మంచిదా లేక దాసిగా అవ్వడం మంచిదా? రాజుగా అవ్వాలనుకుంటే ఈ చదువులో నిమగ్నమైపోండి. ప్రపంచమైతే చాలా అశుద్ధముగా ఉంది. ప్రపంచపు సాంగత్యాన్ని చెడు సాంగత్యము అని అంటారు. ఒక్క సత్యమైనవారి సాంగత్యమే తీరానికి చేరుస్తుంది, మిగిలిన సాంగత్యాలన్నీ ముంచేస్తాయి. తండ్రికి అయితే అందరి జన్మపత్రుల గురించి తెలుసు కదా. ఇది పాపపు ప్రపంచము, కావుననే దీని నుండి ఇంకెక్కడికైనా తీసుకువెళ్ళండి అని పిలుస్తారు. ఇప్పుడు తండ్రి అంటారు - మధురాతి మధురమైన పిల్లలూ, మీరు నా పిల్లలుగా అయి ఇక నా మతముపై నడవండి. ఇది చాలా అశుద్ధమైన ప్రపంచము. ఇక్కడ అవినీతి ఉంది. లక్షల-కోట్ల రూపాయల మోసము జరుగుతూ ఉంటుంది. ఇప్పుడు పిల్లలను స్వర్గానికి యజమానులుగా తయారుచేయడానికి తండ్రి వచ్చారు కావున అపారమైన సంతోషము ఉండాలి కదా. వాస్తవానికి ఇదే సత్యమైన గీత. ఆ తరువాత ఈ జ్ఞానము కనుమరుగైపోతుంది. ఇప్పుడు మీకు ఈ జ్ఞానము ఉంది, మళ్ళీ ఇంకొక జన్మ తీసుకుంటే ఈ జ్ఞానము సమాప్తమైపోతుంది. ఇక అప్పుడు ప్రారబ్ధము ప్రారంభమవుతుంది. మిమ్మల్ని పురుషోత్తములుగా తయారుచేయడానికి తండ్రి చదివిస్తున్నారు. ఇప్పుడు మీరు తండ్రిని తెలుసుకున్నారు. ఇప్పుడు అమరనాథ్ యాత్ర చేస్తూ ఉంటారు కదా, వారిని అడగండి - సూక్ష్మవతనములో చూపించబడిన శంకరుడు మళ్ళీ స్థూలవతనములోకి ఎలా వచ్చారు, పర్వతాలు మొదలైనవైతే ఇక్కడే ఉన్నాయి కదా, పార్వతికి జ్ఞానమునిచ్చేందుకు అక్కడ అసలు పతితులు ఎలా ఉంటారు? కూర్చుని చేతులతో మంచు లింగాన్ని తయారుచేస్తారు. అలా ఎక్కడైనా తయారుచేయవచ్చు. మనుష్యులు ఎన్ని ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. పావనముగా చేసేందుకు, అసలు శంకరుడి వద్దకు పార్వతి ఎలా వస్తుంది అన్న ఈ విషయాన్ని అర్థం చేసుకోరు. శంకరుడు ఏమీ పరమాత్మ కారు, వారు కూడా ఒక దేవతయే. మనుష్యులకు ఎంతగా అర్థం చేయించడం జరుగుతుంది, అయినా అర్థం చేసుకోరు. పారసబుద్ధి కలవారిగా అవ్వలేరు. ప్రదర్శినీకి ఎంతమంది వస్తారు. ఏమంటారంటే - జ్ఞానమైతే చాలా బాగుంది, దీనిని అందరూ తీసుకోవాలి అని. అరే, మీరైతే తీసుకోండి కదా అని అంటే మాకు ఖాళీ లేదు అని అంటారు. ప్రదర్శినీలో ఇది కూడా వ్రాయాలి - ఈ యుద్ధానికి ముందే తండ్రి స్వర్గము యొక్క ప్రారంభోత్సవాన్ని చేస్తున్నారు అని. వినాశనము తరువాత స్వర్గ ద్వారాలు తెరుచుకుంటాయి. బాబా అన్నారు - ప్రతి ఒక్క చిత్రములోనూ ‘పారలౌకిక పరమపిత పరమాత్మ అయిన త్రిమూర్తి శివ భగవానువాచ’ అని వ్రాయండి. త్రిమూర్తి అని వ్రాయకపోతే ఏమంటారంటే - శివుడైతే నిరాకారుడు, వారు జ్ఞానాన్ని ఎలా ఇస్తారు? మొదట్లో ఇతనే తెల్లగా ఉండేవారు, శ్రీకృష్ణునిగా ఉండేవారు, ఇప్పుడు మళ్ళీ శ్యామముగా ఉన్న మనిషిగా అయిపోయారు అని అర్థం చేయించడం జరుగుతుంది. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తారు. ఆ తరువాత మళ్ళీ చరిత్ర రిపీట్ అవ్వనున్నది. భగవంతునికి మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేయడానికి ఎంతో సమయము పట్టదు అని గాయనము కూడా ఉంది, ఆ తరువాత మళ్ళీ మెట్లు దిగుతూ మనుష్యులుగా అయిపోతారు, మళ్ళీ తండ్రి వచ్చి దేవతలుగా తయారుచేస్తారు. తండ్రి అంటారు, నేను రావలసి ఉంటుంది. కల్ప-కల్పము, కల్పము యొక్క సంగమయుగములో నేను వస్తాను. ప్రతి యుగములోనూ వస్తాను అని అనడం తప్పు. నేను సంగమయుగములో వచ్చి మిమ్మల్ని పుణ్యాత్ములుగా తయారుచేస్తాను. మళ్ళీ రావణుడు మిమ్మల్ని పాపాత్ములుగా చేస్తాడు. తండ్రియే పాత ప్రపంచాన్ని కొత్త ప్రపంచముగా తయారుచేస్తారు. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తండ్రి సమానముగా టీచరుగా అవ్వాలి, చాలా యుక్తిగా అందరినీ ఈ అసత్య ఖండము నుండి బయటికి తీసి, సత్యఖండములోకి వెళ్ళేందుకు యోగ్యులుగా తయారుచేయాలి.

2. ప్రపంచము యొక్క సాంగత్యము చెడు సాంగత్యము, అందుకే చెడు సాంగత్యము నుండి దూరముగా ఉంటూ ఒక్క సత్యమైనవారి సాంగత్యమునే చేయాలి. ఉన్నత పదవి కొరకు ఈ చదువులో నిమగ్నమైపోవాలి. ఒక్క తండ్రి మతము పైనే నడవాలి.

వరదానము:-
తమ సర్వస్వాన్ని సేవలో అర్పితము చేసే గుప్తదాని పుణ్యాత్మా భవ

మీరు ఏ సేవనైతే చేస్తారో దానిని విశ్వ కళ్యాణార్థము అర్పితము చేస్తూ వెళ్ళండి. ఏ విధముగా భక్తిలో గుప్తదానులుగా, పుణ్యాత్ములుగా ఎవరైతే ఉంటారో, వారు - సర్వుల హితం కొరకు అనే సంకల్పమునే చేస్తారు, అలా మీ ప్రతి సంకల్పము సేవలో అర్పితమవ్వాలి. ఎప్పుడూ ‘నా కోసము’ అన్న కామనను పెట్టుకోకండి. సర్వుల కోసము సేవ చేయండి. ఏ సేవ అయితే విఘ్నరూపముగా అవుతుందో దానిని సత్యమైన సేవ అని అనరు. అందుకే ‘నా కోసము’ అన్న భావనను వదిలి గుప్తమైన మరియు సత్యమైన సేవాధారులుగా అయి సేవ ద్వారా విశ్వ కళ్యాణము చేస్తూ వెళ్ళండి.

స్లోగన్:-
ప్రతి విషయాన్ని ప్రభు అర్పణ చేసినట్లయితే రాబోయే కష్టాలు సహజమైనవిగా అనుభవమవుతాయి.

అవ్యక్త ప్రేరణలు - సహజయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి

ఆదికాలమైన అమృతవేళలో మీ హృదయములో పరమాత్మ ప్రేమను సంపూర్ణ రూపములో ధారణ చెయ్యండి. ఒకవేళ హృదయములో పరమాత్మ ప్రేమ, పరమాత్మ శక్తులు, పరమాత్మ జ్ఞానము నిండుగా ఉన్నట్లయితే ఇక ఎప్పుడూ ఎవరి వైపుకు కూడా మోహము లేక స్నేహము వెళ్ళదు. తండ్రిపై సత్యమైన ప్రేమ ఉన్నట్లయితే ఆ ప్రేమకు గుర్తు - సమానముగా, కర్మాతీతముగా అవ్వటము. ‘చేయించేవారి’గా అయ్యి కర్మలు చేయండి మరియు చేయించండి. ఎప్పుడూ కూడా మనసు, బుద్ధి మరియు సంస్కారాలకు వశమై ఏ కర్మనూ చేయకండి.