‘‘సంగమయుగపు జీవన్ముక్త స్థితిని అనుభవము చేసేందుకు
అన్ని భారాలనుమరియుబంధనాలను బాబాకు ఇచ్చి డబుల్ లైట్ గా అవ్వండి’’
ఈ రోజు విశ్వ రచయిత అయిన బాప్ దాదా తమ మొదటి రచన అయిన అతి
లవ్లీ మరియు లక్కీ (ప్రియమైన మరియు అదృష్టవంతులైన) పిల్లలతో
మిలన మేళాను జరుపుకుంటున్నారు. కొంతమంది పిల్లలు సమ్ముఖములో
ఉన్నారు, నయనాలతో చూస్తూ ఉన్నారు మరియు నలువైపులా ఉన్న అనేకమంది
పిల్లలు హృదయములో ఇమిడి ఉన్నారు. బాప్ దాదా పిల్లలు ప్రతి
ఒక్కరి మస్తకములో మూడు భాగ్యాల యొక్క మూడు సితారలను మెరుస్తూ
ఉండటాన్ని చూస్తున్నారు. మొదటి భాగ్యము - బాప్ దాదా యొక్క
శ్రేష్ఠ పాలన, రెండవది - శిక్షకుని ద్వారా చదువు, మూడవది -
సద్గురువు ద్వారా సర్వ వరదానాల యొక్క మెరుస్తున్న సితార. కనుక
మీరందరూ కూడా మీ మస్తకముపై మెరుస్తున్నటువంటి సితారలను అనుభవము
చేస్తున్నారు కదా! సర్వ సంబంధాలు బాప్ దాదాతో ఉన్నాయి, అయినా
కూడా జీవితములో ఈ మూడు సంబంధాలు అవసరము మరియు అవి చాలా కాలం
క్రితం విడిపోయి ఇప్పుడు కలిసిన ప్రియమైన పిల్లలైన మీ అందరికీ
సహజముగానే ప్రాప్తించాయి. ప్రాప్తించాయి కదా! నషా ఉంది కదా!
హృదయములో ఈ పాటను పాడుతూ ఉంటారు కదా - వాహ్ బాబా వాహ్! వాహ్
శిక్షకుడు వాహ్! వాహ్ సద్గురువు వాహ్! ప్రపంచములోనివారైతే
లౌకిక గురువును, ఎవరినైతే మహానాత్మ అని అంటారో, వారి నుండి
ఒక్క వరదానాన్ని పొందేందుకు కూడా ఎంతగా ప్రయత్నము చేస్తుంటారు
మరియు మీకు బాబా మీరు జన్మించగానే సహజముగా వరదానాలతో నిండుగా
చేసారు. భగవంతుడైన తండ్రి ఇంతగా మాపై బలిహారమైపోతారు అని ఇంతటి
శ్రేష్ఠ భాగ్యము గురించి స్వప్నములోనైనా ఆలోచించారా! భక్తులు
భగవంతుని యొక్క పాటలను పాడుతూ ఉంటారు మరియు భగవంతుడైన తండ్రి
ఎవరి పాటలను పాడుతూ ఉంటారు? అదృష్టవంతులైన పిల్లలైన మీ పాటలను
పాడుతూ ఉంటారు.
ఇప్పుడు కూడా మీరందరూ రకరకాల దేశాల నుండి ఏ విమానములో
వచ్చారు? స్థూల విమానాలలోనా లేక పరమాత్ముని ప్రేమ విమానములో
అన్ని వైపుల నుండి చేరుకున్నారా! పరమాత్ముని ప్రేమ విమానము ఎంత
సహజముగా తీసుకువస్తుంది, ఎటువంటి కష్టము ఉండదు. మరి అందరూ
పరమాత్ముని ప్రేమ విమానములో చేరుకున్నారు, ఇందుకు అభినందనలు,
అభినందనలు, అభినందనలు. బాప్ దాదాకు పిల్లలు ప్రతి ఒక్కరినీ
చూస్తూ, వారు మొదటిసారి వచ్చినవారు కావచ్చు లేక చాలా కాలము
నుండి వస్తున్నవారు కావచ్చు, కానీ బాప్ దాదాకు ఒక్కొక్క బిడ్డ
యొక్క విశేషత గురించి తెలుసు. బాప్ దాదాకు పిల్లలెవరైనా సరే,
చిన్నవారు కావచ్చు, పెద్దవారు కావచ్చు, మహావీరులు కావచ్చు,
పురుషార్థులు కావచ్చు, కానీ పిల్లలు ప్రతి ఒక్కరూ చాలా కాలం
క్రితం విడిపోయి ఇప్పుడు కలిసిన ప్రియమైన పిల్లలు, ఎందుకని?
మీరు బాబాను వెతికారు, వారు లభించలేదు, కానీ బాప్ దాదా
పిల్లలైన మీ అందరినీ ఎంతో ప్రేమతో, స్నేహముతో మూలమూలల నుండి
వెతికారు. మరి ప్రియమైనవారు కావుననే కదా వెతికారు, ఎందుకంటే
బాబాకు తెలుసు, నా పిల్లల్లో ఎటువంటి విశేషత లేనివారు ఒక్కరు
కూడా లేరు. ఏదో విశేషతయే తీసుకువచ్చింది. కనీసము గుప్త రూపములో
వచ్చిన బాబానైతే గుర్తించారు. నా బాబా అని అన్నారు, నా బాబా అని
అందరూ అంటారు కదా! నా బాబా కాదు, నీ బాబా - అని అనేవారు ఎవరైనా
ఉన్నారా, ఎవరైనా ఉన్నారా? అందరూ నా బాబా అని అంటారు. మరి
విశేషమైనవారే కదా. ఇంత పెద్ద-పెద్ద విజ్ఞానవేత్తలు,
పెద్ద-పెద్ద వి.ఐ.పిలు గుర్తించలేకపోయారు, కానీ మీరందరూ అయితే
గుర్తించారు కదా. మీవారిగా చేసుకున్నారు కదా. బాబా కూడా
తనవారిగా చేసుకున్నారు. ఈ సంతోషములోనే పాలింపబడుతూ, ఎగురుతూ
ఉన్నారు కదా! ఎగురుతూ ఉన్నారు, నడవడము లేదు, ఎగురుతూ ఉన్నారు,
ఎందుకంటే నడిచేవారు బాబాతోపాటు తమ ఇంటికి వెళ్ళలేరు, ఎందుకంటే
బాబా అయితే ఎగిరేవారు, మరి నడిచేవారు వారితోపాటు ఎలా చేరుకోగలరు!
అందుకే బాబా పిల్లలందరికీ ఏ వరదానాన్ని ఇస్తారు? ఫరిశ్తా
స్వరూప భవ. ఫరిశ్తా ఎగురుతుంది, నడవదు, ఎగురుతుంది. మరి మీరందరూ
కూడా ఎగిరే కళ కలవారే కదా! అవునా? ఎవరైతే ఎగిరే కళ కలవారో వారు
చేతులెత్తండి, లేక అప్పుడప్పుడు నడిచే కళ, అప్పుడప్పుడు ఎగిరే
కళ ఉంటుందా? కాదా? సదా ఎగిరేవారు, డబుల్ లైట్ గా ఉండేవారు కదా!
ఎందుకు? ఆలోచించండి, బాబా మీ అందరి నుండి గ్యారంటీ తీసుకున్నారు,
ఒకవేళ మనసులోనైనా, బుద్ధిలోనైనా ఏ విధమైన భారము ఉన్నా కానీ,
దానిని బాబాకు ఇచ్చేయండి, బాబా తీసుకునేందుకే వచ్చారు. మరి
బాబాకు భారాన్ని ఇచ్చేసారా లేక కొంచెం-కొంచెం సంభాళించుకుని
పెట్టుకున్నారా? తీసుకునేవారు తీసుకుంటున్నప్పుడు, మరి భారాన్ని
ఇవ్వడానికి కూడా ఆలోచించాలా? లేక భారాన్ని సంభాళించే అలవాటు 63
జన్మల నుండి ఉందా? కొంతమంది పిల్లలు అప్పుడప్పుడు ఏమంటారంటే -
అనుకోవటం లేదు, కానీ అలవాటు కారణముగా నిస్సహాయులుగా
అయిపోతున్నాము. ఇప్పుడైతే నిస్సహాయులుగా లేరు కదా!
నిస్సహాయులుగా ఉన్నారా లేక శక్తిశాలిగా ఉన్నారా? నిస్సహాయులుగా
ఎప్పుడూ అవ్వకండి. శక్తిశాలిగా ఉండండి. శక్తులు శక్తివంతముగా
ఉన్నారా లేక నిస్సహాయులుగా ఉన్నారా? శక్తివంతమైనవారు కదా?
భారాన్ని పెట్టుకోవటము మంచిగా అనిపిస్తుందా ఏమిటి? భారము పట్ల
మనసు ఏర్పడిందా? వదిలేయండి, వదిలేస్తే వదిలిపోతుంది. వదలకపోతే
వదలదు. వదిలేందుకు సాధనము - దృఢ సంకల్పము. చాలామంది పిల్లలు
ఏమంటూ ఉంటారంటే, దృఢ సంకల్పమైతే చేస్తాము, కానీ, కానీ... ఇలా
అనటానికి కారణమేమిటి? దృఢ సంకల్పాన్ని అయితే చేస్తున్నారు కానీ
చేసినటువంటి దృఢ సంకల్పాన్ని రివైజ్ చేసుకోరు. పదే-పదే మనసులో
రివైజ్ చేసుకోండి మరియు భారమంటే ఏమిటి మరియు డబుల్ లైట్
అనుభవమంటే ఏమిటి అన్నది రియలైజ్ అవ్వండి. రియలైజేషన్ కోర్స్ ను
ఇప్పుడు ఇంకాస్త అండర్ లైన్ చేయండి. ఈ విషయము గురించి చెప్పడము
మరియు ఆలోచించడము చేస్తారు, కానీ భారమంటే ఏమిటి మరియు డబుల్
లైట్ గా ఉండటమంటే ఏమిటి అన్నదానిని హృదయపూర్వకముగా రియలైజ్
అవ్వండి. వ్యత్యాసాన్ని ఎదురుగా పెట్టుకోండి ఎందుకంటే బాప్ దాదా
ఇప్పుడు సమయము యొక్క సమీపత అనుసారముగా పిల్లలు ప్రతి ఒక్కరిలో
ఏం చూడాలని కోరుకుంటున్నారు? ఏదైతే చెప్తారో దానిని చేసి
చూపించాలి. ఏదైతే ఆలోచిస్తారో, దానిని స్వరూపములోకి
తీసుకురావాలి ఎందుకంటే బాబా యొక్క వారసత్వము, జన్మ సిద్ధ
అధికారము ముక్తి మరియు జీవన్ముక్తి. మీరు వచ్చి ముక్తి,
జీవన్ముక్తుల వారసత్వాన్ని ప్రాప్తి చేసుకోండి అని అందరికీ
ఆహ్వానాన్ని కూడా ఇదే ఇస్తారు కదా. మరి మిమ్మల్ని మీరు
ప్రశ్నించుకోండి, ముక్తిధామములో ముక్తిని అనుభవము చేయాలా లేక
సత్యయుగములో జీవన్ముక్తిని అనుభవము చేయాలా లేక ఇప్పుడు
సంగమయుగములో ముక్తి, జీవన్ముక్తి యొక్క సంస్కారాలను
తయారుచేసుకోవాలా? ఎందుకంటే మీరు అంటారు - మేము ఇప్పుడు మా
ఈశ్వరీయ సంస్కారాలతో దైవీ ప్రపంచాన్ని తయారుచేయబోతున్నాము, మా
సంస్కారాలతో కొత్త ప్రపంచాన్ని తయారుచేస్తూ ఉన్నాము. కావున
ఇప్పుడు సంగమములోనే ముక్తి-జీవన్ముక్తుల సంస్కారాలు ఇమర్జ్ అయి
ఉండాలి కదా! కావున చెక్ చేసుకోండి, సర్వ బంధనాల నుండి మనసు
మరియు బుద్ధి ముక్తి అయ్యాయా? ఎందుకంటే బ్రాహ్మణ జీవితములో చాలా
విషయాల నుండి, ఏవైతే గత జీవితములోని బంధనాలు ఉన్నాయో, వాటి
నుండి విముక్తులయ్యారు. కానీ సర్వ బంధనాల నుండి విముక్తులుగా
ఉన్నారా లేక కొన్ని-కొన్ని బంధనాలు ఇప్పటికీ కూడా తమ బంధనములో
బంధిస్తున్నాయా? ఈ బ్రాహ్మణ జీవితములో ముక్తి-జీవన్ముక్తులను
అనుభవము చెయ్యటమే బ్రాహ్మణ జీవితము యొక్క శ్రేష్ఠత ఎందుకంటే
సత్యయుగములో జీవన్ముక్తి మరియు జీవన బంధనము - ఈ రెండింటి
జ్ఞానము ఉండదు. జీవన బంధనము అంటే ఏమిటి, జీవన్ముక్తి అంటే ఏమిటి
అన్నదానిని ఇప్పుడు అనుభవము చెయ్యగలరు, ఎందుకంటే మీరందరూ చేసిన
ప్రతిజ్ఞ ఏమిటంటే, అనేక సార్లు ప్రతిజ్ఞ చేసారు, ఏం ప్రతిజ్ఞ
చేస్తారు? గుర్తుందా? మీ ఈ బ్రాహ్మణ జీవితము యొక్క లక్ష్యము
ఏమిటి అని ఎవరు అడిగినా కూడా, ఏమని జవాబు ఇస్తారు? బాబా
సమానముగా తయారవ్వాలి. పక్కా కదా? బాబా సమానముగా తయారవ్వాలి కదా?
లేక కొంచెం కొంచెం తయారవ్వాలా? సమానముగా తయారవ్వాలి కదా!
సమానముగా తయారవ్వాలా లేక కొంచెం తయారైనా కూడా పర్వాలేదా!
పర్వాలేదా? దానిని సమానము అనైతే అనరు కదా. బాబా విముక్తులుగా
ఉన్నారా లేక వారికి బంధనము ఉందా? ఒకవేళ ఏ రకమైన బంధనము ఉన్నా,
దేహానిది కావచ్చు, దైహిక సంబంధాలది కావచ్చు, తల్లి, తండ్రి,
బంధువు, స్నేహితుడు అని కాదు, దైహిక కర్మేంద్రియాల సంబంధము
ఏదైతే ఉందో, ఆ కర్మేంద్రియాల సంబంధము యొక్క బంధనము ఉన్నా,
అలవాటు యొక్క బంధనము ఉన్నా, స్వభావము యొక్క బంధనము ఉన్నా, పాత
సంస్కారాల బంధనము ఉన్నా, బాబా సమానముగా ఎలా అయినట్లు? మరియు
బాబా సమానముగా అవ్వాల్సిందే అని రోజు ప్రతిజ్ఞ చేస్తారు. చేతులు
ఎత్తిస్తే అందరూ ఏమంటారు? లక్ష్మీ-నారాయణులుగా అవ్వాలి అని
అంటారు. బాప్ దాదాకు సంతోషము కలుగుతుంది, ప్రతిజ్ఞలు చాలా
మంచి-మంచివి చేస్తారు కానీ ఆ ప్రతిజ్ఞల యొక్క లాభాన్ని పొందరు.
ప్రతిజ్ఞ మరియు దాని లాభము యొక్క బ్యాలెన్సు గురించి తెలియదు.
ప్రతిజ్ఞల ఫైల్ బాప్ దాదా వద్ద చాలా, చాలా, చాలా పెద్దది ఉంది,
అందరి ఫైల్ ఉంది. అదే విధముగా లాభాల యొక్క ఫైల్ కూడా ఉండాలి, ఆ
బ్యాలెన్స్ ఉండాలి, అప్పుడు ఎంత బాగా అనిపిస్తుంది.
సెంటర్ టీచర్లు కూర్చుని ఉన్నారు కదా. సెంటర్ నివాసులు కూడా
కూర్చుని ఉన్నారు కదా? మరి మీరు సమానముగా అయ్యేవారు కదా. సెంటర్
నివాసులు ఎవరైతే నిమిత్తముగా అయ్యారో, ఆ పిల్లలైతే సమానముగా
ఉండాలి కదా! ఉన్నారా? ఉన్నారు కూడా, కానీ అప్పుడప్పుడు కాస్త
అల్లరి చేసేవారిగా అయిపోతారు. బాప్ దాదా అయితే పిల్లలందరిదీ
మొత్తం రోజంతటి పరిస్థితి మరియు నడవడిక చూస్తూ ఉంటారు. మీ దాదీ
కూడా వతనములో ఉండేవారు కదా, అప్పుడు దాదీ కూడా చూసి ఏమనేవారో
తెలుసా? ఏమనేవారంటే - బాబా, ఇలా కూడా ఉంటుందా? ఇలా జరుగుతూ
ఉంటుందా, ఇలా చేస్తూ ఉంటారా, మీరు చూస్తూ ఉంటారా? విన్నారా, మీ
దాదీ ఏం చూసారో. ఇప్పుడు బాప్ దాదా ఇదే చూడాలనుకుంటున్నారు -
పిల్లలు ప్రతి ఒక్కరు ముక్తి-జీవన్ముక్తుల వారసత్వానికి
అధికారులుగా అవ్వాలి, ఎందుకంటే వారసత్వము ఇప్పుడు లభిస్తుంది.
సత్యయుగములోనైతే సహజ జీవితము ఉంటుంది, ఇప్పటి అభ్యాసము యొక్క
సహజ జీవితము, కానీ వారసత్వము యొక్క అధికారము ఇప్పుడు సంగమములో
ఉంటుంది, అందుకే బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు - ప్రతి ఒక్కరూ
స్వయాన్ని చెక్ చేసుకోండి, ఒకవేళ ఏదైనా బంధనము లాగుతూ ఉంటే
దానికి కారణము ఆలోచించండి. కారణము ఆలోచించండి మరియు
కారణముతోపాటు నివారణను కూడా ఆలోచించండి. నివారణనైతే బాప్ దాదా
అనేక సార్లు భిన్న-భిన్న రూపాలలో ఇచ్చి ఉన్నారు. సర్వ శక్తుల
వరదానాన్ని ఇచ్చారు, సర్వ గుణాల ఖజానాను ఇచ్చారు, ఖజానాలను
ఉపయోగించినట్లయితే ఖజానా పెరుగుతుంది. ఖజానా అందరి వద్ద ఉంది,
బాప్ దాదా చూసారు. ప్రతి ఒక్కరి స్టాక్ ను కూడా చూస్తారు.
బుద్ధి అనేది స్టాక్ రూమ్. బాప్ దాదా అందరి స్టాక్ ను చూసారు.
స్టాక్ లో ఉంది కానీ ఖజానాలను అవసరమైన సమయములో ఉపయోగించరు.
కేవలం ఒక పాయింట్ రూపములోనే ఆలోచిస్తారు, అవును, ఇది చెయ్యకూడదు,
ఇది చెయ్యాలి అని ఇలా పాయింట్ రూపములో ఉపయోగిస్తారు,
ఆలోచిస్తారు, కానీ పాయింట్ (బిందువు) గా అయ్యి పాయింట్ ను
ఉపయోగించరు, అందుకే పాయింట్ పాయింట్ గానే ఉండిపోతుంది, పాయింట్
గా అయ్యి దానిని ఉపయోగించండి, అప్పుడు నివారణ జరుగుతుంది. ఇది
చెయ్యకూడదు అని అంటారు కూడా, మళ్ళీ మర్చిపోతారు కూడా.
అనటముతోపాటు మర్చిపోతారు కూడా. ఇంతటి సహజమైన విధిని వినిపించారు,
సంగమయుగములో కేవలం బిందువు యొక్క అద్భుతమే ఉన్నది, కేవలం
బిందువును ఉపయోగించండి, ఇంకే గుర్తు యొక్క అవసరము లేదు. మూడు
బిందువులను ఉపయోగించండి. ఆత్మ బిందువు, బాబా బిందువు మరియు
డ్రామా బిందువు. మూడు బిందువులను ఉపయోగిస్తూ ఉన్నట్లయితే బాబా
సమానముగా అవ్వటము కష్టమేమీ కాదు. బిందువే పెట్టాలనుకుంటారు కానీ
పెట్టే సమయములో చెయ్యి కదిలిపోతుంది, అప్పుడు అది
ప్రశ్నార్థకముగానైనా అయిపోతుంది లేక ఆశ్చర్యార్థకముగానైనా
అయిపోతుంది. అక్కడ చెయ్యి కదులుతుంది, ఇక్కడ బుద్ధి కదులుతుంది.
లేదంటే మూడు బిందువులను స్మృతిలో పెట్టుకోవటము ఏమైనా కష్టమా?
బాప్ దాదా అయితే మరొక సహజ యుక్తిని కూడా తెలియజేశారు, అదేమిటి?
ఆశీర్వాదాలను ఇవ్వండి మరియు ఆశీర్వాదాలను తీసుకోండి. అచ్ఛా,
ఒకవేళ యోగము శక్తిశాలిగా కుదరటం లేదంటే, ధారణలు కాస్త తక్కువగా
జరుగుతున్నాయంటే, భాషణ చేసే ధైర్యము ఉండటం లేదంటే, ఆశీర్వాదాలను
ఇవ్వండి మరియు ఆశీర్వాదాలను తీసుకోండి, ఒకటే పని చేయండి,
మిగిలినవన్నీ వదిలేయండి, ఒకటే పని చేయండి, ఆశీర్వాదాలు
తీసుకోవాలి, ఆశీర్వాదాలు ఇవ్వాలి. ఏం జరిగినా కానీ, ఎవరు ఏమి
ఇచ్చినా కానీ, నేను ఆశీర్వాదాలను ఇవ్వాలి, తీసుకోవాలి. ఈ ఒక్క
విషయాన్ని అయితే పక్కా చేసుకోండి, ఇందులో అంతా వచ్చేస్తుంది.
ఒకవేళ ఆశీర్వాదాలను ఇస్తూ మరియు ఆశీర్వాదాలను తీసుకుంటూ
ఉన్నట్లయితే అందులో శక్తులు మరియు గుణాలు రావా? స్వతహాగానే
వచ్చేస్తాయి కదా! ఒకటే లక్ష్యము పెట్టుకోండి, చేసి చూడండి,
ఒక్క రోజు అభ్యాసము చేసి చూడండి, ఆ తర్వాత 7 రోజులు చేసి చూడండి,
సరే, మిగిలిన విషయాలు బుద్ధిలోకి రాకపోయినా కానీ, ఒకటైతే
వస్తుంది. ఏం జరిగినా కానీ ఆశీర్వాదాలను ఇవ్వాలి మరియు
తీసుకోవాలి. ఇదైతే చెయ్యగలరా లేదా? చెయ్యగలరా? అచ్ఛా, కనుక
ఎప్పుడు వెళ్ళినా కానీ దీనిని ప్రయత్నించండి. దీని వలన అందరూ
తమంతట తామే యోగయుక్తులుగా అయిపోతారు ఎందుకంటే వ్యర్థ కర్మలు
చెయ్యరు కావున యోగయుక్తులుగా అయిపోయినట్లే కదా. కానీ లక్ష్యము
పెట్టుకోండి - ఆశీర్వాదాలు ఇవ్వాలి, ఆశీర్వాదాలు తీసుకోవాలి.
ఎవరు ఏమి ఇచ్చినా కానీ, శాపనార్థాలు కూడా లభిస్తాయి, క్రోధము
యొక్క విషయాలు కూడా వస్తాయి ఎందుకంటే ప్రతిజ్ఞ చేస్తారు కదా,
అప్పుడు మాయ కూడా, వీరు ప్రతిజ్ఞ చేస్తున్నారు అని వింటుంది,
కావున అది కూడా తన పనినైతే చేస్తుంది కదా. ఎప్పుడైతే మీరు
మాయాజీతులుగా అయిపోతారో అప్పుడిక అది చెయ్యదు, ఇప్పుడైతే ఇంకా
మాయాజీతులుగా అవుతూ ఉన్నారు కదా, కావున మాయ తన పని చేస్తుంది,
కానీ నేను ఆశీర్వాదాలు ఇవ్వాలి మరియు ఆశీర్వాదాలు తీసుకోవాలి.
వీలవుతుందా? వీలవుతుంది అని ఎవరైతే అంటారో వారు చేతులెత్తండి.
అచ్ఛా, శక్తులు చేతులెత్తండి. అవునా, వీలవుతుందా? అన్ని వైపుల
నుండి టీచర్లు వచ్చారు కదా. ఎప్పుడైతే మీరు మీ దేశానికి
వెళ్తారో అప్పుడు మొట్టమొదట అందరూ ఒక వారం రోజులు ఈ హోమ్ వర్క్
ను చేయాలి మరియు రిజల్టును పంపించాలి - క్లాస్ కు వచ్చే సభ్యులు
ఎంతమంది, ఎంతమంది ఓ.కె.గా ఉన్నారు మరియు ఎంతమంది కొంచెం
అపరిపక్వముగా ఉన్నారు మరియు ఎంతమంది పక్కాగా ఉన్నారు, ఇలా ఓ.కె.
మధ్యలో గీతను గీయండి, అంతే. ఈ విధముగా సమాచారాన్ని పంపండి -
ఇంతమంది ఓ.కె.గా ఉన్నారు, ఇంతమందికి ఓ.కె. మధ్యలో గీత గీయబడింది.
ఇందులో చూడండి, డబుల్ విదేశీయులు వచ్చారు కావున డబుల్ పని
చేస్తారు కదా. ఒక వారం రోజుల రిజల్టును పంపండి, అప్పుడు బాప్
దాదా చూస్తారు, సహజమే కదా, కష్టమైతే కాదు కదా. మాయ వస్తుంది,
మీరు అంటారు, బాబా, నాకు ఇంతకుముందైతే ఇటువంటి సంకల్పము ఎప్పుడూ
వచ్చేది కాదు, ఇప్పుడు వచ్చింది. అలా జరుగుతుంది, కానీ దృఢ
నిశ్చయము కలవారికి విజయము నిశ్చితము. దృఢతకు ఫలము సఫలత. సఫలత
లభించకపోవటానికి కారణము దృఢతలో లోపము. కనుక దృఢతతో కూడిన సఫలతను
ప్రాప్తి చేసుకోవలసిందే.
ఏ విధముగా సేవను ఉల్లాస-ఉత్సాహాలతో చేస్తున్నారో, అదే
విధముగా స్వయం విషయములో స్వయం యొక్క సేవ. స్వ సేవ మరియు విశ్వ
సేవ. స్వ సేవ అనగా చెక్ చేసుకోవటము మరియు స్వయాన్ని బాబా
సమానముగా తయారుచేసుకోవటము. ఎటువంటి లోపాన్ని అయినా, బలహీనతను
అయినా బాబాకు ఇచ్చేయండి కదా, దానిని ఎందుకు పెట్టుకున్నారు,
బాబాకు మంచిగా అనిపించదు. బలహీనతను ఎందుకు పెట్టుకుంటారు?
ఇచ్చేయండి. ఇచ్చే సమయములో చిన్న పిల్లలుగా అయిపోండి. ఏ విధముగా
చిన్న బాలుడు ఏ వస్తువునైనా సంభాళించలేకపోతే, ఏ వస్తువు అయినా
నచ్చకపోతే ఏం చేస్తాడు? అమ్మా, నాన్నా, దీనిని మీరు తీసుకోండి.
అదే విధముగా, ఏ రకమైన భారమైనా, బంధనమైనా, ఏదైతే మంచిగా
అనిపించదో, ఎందుకంటే బాప్ దాదా చూస్తుంటారు, ఒకవైపేమో ఇదైతే
మంచిది కాదు, సరైనదైతే కాదు అని ఆలోచిస్తున్నారు, కానీ మరో వైపు
ఏం చెయ్యను, ఎలా చెయ్యను... అని అనుకుంటున్నారు, మరి ఇదైతే
మంచిది కాదు. ఒకవైపేమో మంచిది కాదు అని అంటున్నారు, మరో వైపు
సంభాళించుకుని ఉంచుకుంటున్నారు, మరి దీనిని ఏమంటారు! మంచిది
అంటారా? మంచిదైతే కాదు కదా. మరి మీరు ఎలా తయారవ్వాలి? చాలా చాలా
మంచివారిగా అవ్వాలి కదా. మంచివారిగా కూడా కాదు, చాలా చాలా
మంచివారిగా అవ్వాలి. కనుక ఇలాంటి విషయము ఏదైనా ఉంటే, భగవంతుడైన
బాబా హాజరై ఉన్నారు, వారికి ఇచ్చేయండి, మరియు ఒకవేళ అది తిరిగి
వస్తే దానిని తాకట్టుగా భావించి మళ్ళీ ఇచ్చేయండి. తాకట్టు
విషయములో మోసము చేయడం జరగదు ఎందుకంటే మీరైతే ఇచ్చేసారు, ఇక అది
బాబా వస్తువుగా అయిపోయింది, బాబా యొక్క వస్తువైనా లేక ఇతరుల
యొక్క వస్తువైనా మీ దగ్గరకు పొరపాటున వచ్చేస్తే, దానిని మీరు
అలమారులో పెట్టుకుంటారా? పెట్టుకుంటారా? తీసేస్తారు కదా. ఏదో
ఒకలా తీసేస్తారు, అంతేకానీ దానిని ఉంచుకోరు. దానిని సంభాళించరు
కదా. కనుక ఇచ్చేయండి. బాబా తీసుకునేందుకు వచ్చారు. ఇవ్వటానికి
మీ వద్దనైతే ఇంకేమీ లేదు. కానీ దీనినైతే ఇవ్వగలరు కదా. ఇవి
జిల్లేడు పుష్పాలు, వీటిని ఇచ్చేయండి. వీటిని సంభాళించడం మంచిగా
అనిపిస్తుందా? అచ్ఛా!
నలువైపులా ఉన్న బాప్ దాదా మనసుకు నచ్చిన పిల్లలందరికీ, బాబా
మనోభిరాముడు కదా, కనుక మనోభిరాముని మనసుకు నచ్చిన పిల్లలకు,
ప్రేమ యొక్క అనుభవాలలో సదా తేలియాడుతూ ఉండే పిల్లలకు, ఒక్క బాబా
తప్ప మరెవ్వరూ లేరు, స్వప్నములో కూడా మరెవ్వరూ లేరు, ఇటువంటి
బాప్ దాదాకు అతి ప్రియమైన మరియు దేహ భానానికి అతి అతీతమైన,
ప్రియమైన, పదమాల రెట్ల భాగ్యశాలీ పిల్లలకు, హృదయపూర్వకమైన
ప్రియస్మృతులు మరియు పదమాల, పదమాల రెట్ల ఆశీర్వాదాలు, అలాగే
బాలకుల నుండి యజమానులుగా అయిన పిల్లలకు బాప్ దాదా యొక్క నమస్తే.