27-01-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - అడుగడుగునా శ్రీమతముపై నడవండి, లేకపోతే మాయ దివాలా తీయిస్తుంది, ఈ కనులు చాలా మోసము చేస్తాయి, వీటిని చాలా-చాలా సంభాళించండి’’

ప్రశ్న:-
ఏ పిల్లల చేత మాయ చాలా వికర్మలు చేయిస్తుంది? యజ్ఞములో విఘ్నరూపులు ఎవరు?

జవాబు:-
ఎవరికైతే తమ అహంకారము ఉంటుందో, వారి చేత మాయ చాలా వికర్మలు చేయిస్తుంది. అటువంటి మిథ్య అహంకారము ఉన్నవారు మురళీని కూడా చదవరు. నిర్లక్ష్యముతో కూడిన ఇటువంటి పొరపాటు చేసినట్లయితే మాయ చెంపదెబ్బ వేసి పైసకు కొరగానివారిగా చేసేస్తుంది. యజ్ఞములో విఘ్నరూపులు ఎవరంటే, ఎవరి బుద్ధిలోనైతే పరచింతన విషయాలు ఉంటాయో వారు, అది చాలా చెడ్డ అలవాటు.

ఓంశాంతి
ఆత్మిక పిల్లలకు తండ్రి అర్థం చేయించారు - వీరు తండ్రి కూడా, టీచర్ కూడా, సుప్రీమ్ గురువు కూడా అని ఇక్కడ పిల్లలైన మీరు తప్పకుండా ఈ ఆలోచనతో కూర్చోవలసి ఉంటుంది, మరియు తండ్రిని స్మృతి చేస్తూ-చేస్తూ పవిత్రముగా అయి పవిత్రధామానికి వెళ్ళి చేరుకుంటామని కూడా మీకు అనుభవమవుతుంది. తండ్రి అర్థం చేయించారు, పవిత్రధామము నుండే మీరు కిందకు దిగారు. మొదట మీరు సతోప్రధానముగా ఉండేవారు, ఆ తర్వాత సతో-రజో-తమోలోకి వచ్చారు. మనము కింద పడిపోయామని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. మీరు సంగమయుగములో ఉన్నారు, మరియు మేము పక్కకు తప్పుకున్నామని మీరు జ్ఞానము ద్వారా తెలుసుకున్నారు. ఇప్పుడు మళ్ళీ ఒకవేళ మనము శివబాబా స్మృతిలో ఉన్నట్లయితే శివాలయము ఎంతో దూరములో లేదు. శివబాబాను స్మృతే చేయకపోతే శివాలయము చాలా దూరముగా ఉన్నట్లు. శిక్షలు అనుభవించవలసి ఉంటుంది కదా కావున చాలా దూరమైపోతారు. తండ్రి పిల్లలకు ఎక్కువ శ్రమనేమీ ఇవ్వరు. ఒకటేమో - మనసా-వాచా-కర్మణా పవిత్రముగా అవ్వాలి అని పదే-పదే చెప్తారు. ఈ కళ్ళు కూడా చాలా మోసము చేస్తాయి. చాలా సంభాళించుకుని నడుచుకోవలసి ఉంటుంది.

బాబా అర్థం చేయించారు - ధ్యానము మరియు యోగము పూర్తిగా వేర్వేరు. యోగము అనగా స్మృతి. కళ్ళు తెరిచి ఉంటూ కూడా మీరు స్మృతి చేయవచ్చు. ధ్యానాన్ని యోగమని అనరు. ధ్యానములోకి వెళ్తే దానిని జ్ఞానమనీ అనరు, యోగమనీ అనరు. ధ్యానములోకి వెళ్ళేవారిపై మాయ కూడా చాలా దాడి చేస్తుంది, అందుకే ఇందులో చాలా అప్రమత్తముగా ఉండవలసి ఉంటుంది. తండ్రి స్మృతి నియమానుసారముగా ఉండాలి. నియమానికి విరుద్ధముగా ఏదైనా పని చేస్తే మాయ ఒక్కసారిగా పడేస్తుంది. ధ్యానము యొక్క కోరికను కూడా ఎప్పుడూ పెట్టుకోకూడదు, ఇచ్ఛా మాత్రం అవిద్యగా ఉండాలి. మీరు ఎటువంటి కోరికను పెట్టుకోకూడదు. తండ్రి మీ కామనలన్నింటినీ అడగకుండానే పూర్తి చేస్తారు, అది కూడా తండ్రి ఆజ్ఞపై నడిస్తేనే. ఒకవేళ తండ్రి ఆజ్ఞను ఉల్లంఘించి తప్పుడు మార్గములోకి వెళ్తే స్వర్గములోకి వెళ్ళేందుకు బదులుగా నరకములోకి పడిపోవచ్చు. ఏనుగును మొసలి తినేసింది అనే గాయనము కూడా ఉంది. అనేకులకు జ్ఞానాన్ని ఇచ్చేవారు, భోగ్ పెట్టేవారు ఈ రోజు లేనే లేరు ఎందుకంటే నియమాలను ఉల్లంఘిస్తారు కావున పూర్తిగా మాయావిగా అయిపోతారు. దేవతగా అవుతూ-అవుతూ అసురులుగా అయిపోతారు, అందుకే ఈ మార్గములో చాలా అప్రమత్తంగా ఉండాలి. తమపై తాము కంట్రోల్ (నిగ్రహము) ఉంచుకోవాలి. తండ్రి అయితే పిల్లలను సావధానపరుస్తారు. శ్రీమతాన్ని ఉల్లంఘించకూడదు. ఆసురీ మతముపై నడవడము వలనే మీ దిగే కళ జరిగింది. ఎక్కడ నుండి ఎక్కడకు చేరుకున్నారు, పూర్తిగా కిందకు దిగజారిపోయారు. ఇప్పటికీ కూడా శ్రీమతముపై నడవకుండా, నిర్లక్ష్యులుగా అయినట్లయితే పదభ్రష్టులుగా అయిపోతారు. బాబా నిన్న కూడా అర్థం చేయించారు - శ్రీమతము యొక్క ఆధారము లేకుండా ఏమి చేసినా కూడా చాలా డిస్సర్వీస్ చేస్తారు. శ్రీమతము లేకుండా చేసినట్లయితే దిగజారుతూనే ఉంటారు. బాబా మొదటి నుండి మాతలను నిమిత్తముగా ఉంచారు ఎందుకంటే కలశము కూడా మాతలకే లభిస్తుంది. వందేమాతరము అని గాయనము చేయబడింది. బాబా కూడా మాతలది ఒక కమిటీని తయారుచేసారు, అంతా వారికి సమర్పించేసారు. కుమార్తెలు విశ్వాసపాత్రులుగా ఉంటారు, పురుషులు ఎక్కువగా దివాలా తీస్తారు. కావున తండ్రి కూడా కలశాన్ని మాతలపై పెడతారు. ఈ జ్ఞాన మార్గములో మాతలు కూడా దివాలా తీయవచ్చు. పదమాపదమ భాగ్యశాలిగా అయ్యేవారు ఎవరైతే ఉంటారో, వారు కూడా మాయతో ఓడిపోయి దివాలా తీయవచ్చు. ఇక్కడ స్త్రీ-పురుషులు, ఇరువురూ దివాలా తీయవచ్చు. అక్కడ కేవలం పురుషులు దివాలా తీస్తారు. ఇక్కడైతే ఎంతమంది ఓడిపోయి వెళ్ళిపోయారో చూడండి, అంటే దివాలా తీసారు కదా. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు, భారతవాసులు పూర్తిగా దివాలా తీసారు. మాయ ఎంత శక్తివంతమైనది. తాము ఎలా ఉండేవారు అనేది అర్థం చేసుకోలేరు. ఎక్కడి నుండి వచ్చి కిందకు దిగజారి పడిపోయారు! ఇక్కడ కూడా పైకి ఎక్కుతూ, ఎక్కుతూ మళ్ళీ శ్రీమతాన్ని మర్చిపోయి తమ మతముపై నడిచినట్లయితే దివాలా తీసేస్తారు. అప్పుడిక వారి పరిస్థితి ఏమవుతుందో చెప్పండి. ఆ ప్రపంచములోనైతే దివాలా తీస్తారు, మళ్ళీ 5-7 సంవత్సరాల తర్వాత నిలబడిపోతారు. ఇక్కడైతే 84 జన్మల కొరకు దివాలా తీసేస్తారు, ఇక ఉన్నత పదవిని పొందలేరు, దివాలా తీస్తూనే ఉంటారు. ఎంతమంది మహారథులు అనేకులను పైకి లేపేవారు, వారు ఈ రోజు లేరు, దివాలా తీసేసారు. ఇక్కడ ఉన్నత పదవులైతే చాలా ఉన్నాయి, కానీ అప్రమత్తముగా ఉండకపోతే పూర్తిగా పై నుండి కిందకు పడిపోతారు. మాయ మింగేస్తుంది. పిల్లలు చాలా అప్రమత్తముగా ఉండాలి. తమ మతముపై కమిటీలు మొదలైనవి తయారుచేయడము వలన లాభమేమీ లేదు. తండ్రితో బుద్ధియోగాన్ని జోడించండి, దాని ద్వారానే సతోప్రధానముగా అవ్వాలి. తండ్రికి చెందినవారిగా అయ్యి మళ్ళీ తండ్రితో యోగము జోడించకపోతే, శ్రీమతాన్ని ఉల్లంఘిస్తే ఇక పూర్తిగా పడిపోతారు. కనెక్షనే తెగిపోతుంది, లింకు తెగిపోతుంది. లింకు తెగిపోతే చెక్ చేసుకోవాలి - మాయ మమ్మల్ని ఇంతగా ఎందుకు విసిగిస్తుంది అని? ప్రయత్నము చేసి తండ్రితో లింకు జోడించాలి, లేదంటే బ్యాటరీ ఎలా ఛార్జ్ అవుతుంది. వికర్మలు చేయడము వలన బ్యాటరీ డిస్చార్జ్ అయిపోతుంది. పైకి ఎక్కుతూ-ఎక్కుతూ పడిపోతారు. ఇటువంటివారు ఎంతోమంది ఉన్నారని మీకు తెలుసు. ప్రారంభములో ఎంతమంది వచ్చి బాబాకు చెందినవారిగా అయ్యారు. భట్టీలోకి వచ్చారు, కానీ ఈ రోజు వారు ఎక్కడ ఉన్నారు? పడిపోయారు ఎందుకంటే పాత ప్రపంచము గుర్తుకువచ్చింది. ఇప్పుడు తండ్రి చెప్తున్నారు - నేను మీకు అనంతమైన వైరాగ్యాన్ని ఇప్పిస్తున్నాను. ఈ పాత పతిత ప్రపంచము పట్ల మనసు పెట్టుకోకూడదు. స్వర్గముతో మనసు పెట్టుకోండి, ఇందులో శ్రమ ఉంది. ఒకవేళ ఈ లక్ష్మీ-నారాయణులుగా అవ్వాలనుకుంటే శ్రమంచవలసి ఉంటుంది. బుద్ధియోగము ఒక్క తండ్రితోనే ఉండాలి. పాత ప్రపంచము పట్ల వైరాగ్యము ఉండాలి. అచ్ఛా, పాత ప్రపంచాన్ని మర్చిపోతే మంచిదే. మరి ఇంకేమి స్మృతి చేయాలి? శాంతిధామాన్ని, సుఖధామాన్ని. ఎంత వీలైతే అంత లేస్తూ-కూర్చుంటూ, నడుస్తూ-తిరుగుతూ తండ్రిని స్మృతి చేయండి. అనంతమైన సుఖము యొక్క స్వర్గాన్ని స్మృతి చేయండి. ఇదైతే చాలా సహజము. ఒకవేళ ఈ రెండు ఆశలకు వ్యతిరేకముగా నడుచుకున్నట్లయితే పదభ్రష్టులుగా అయిపోతారు. మీరు ఇక్కడకు వచ్చిందే నరుని నుండి నారాయణునిగా అయ్యేందుకు. తమోప్రధానము నుండి సతోప్రధానముగా అవ్వాలని అందరికీ చెప్తారు ఎందుకంటే రిటర్న్ జర్నీ (తిరుగు ప్రయాణము) జరుగుతుంది. ప్రపంచ చరిత్ర-భౌగోళికాలు రిపీట్ అవ్వడము అనగా నరకము నుండి స్వర్గముగా, మళ్ళీ స్వర్గము నుండి నరకముగా అవ్వడము. ఈ చక్రము తిరుగుతూనే ఉంటుంది. ఇక్కడ స్వదర్శన చక్రధారులుగా అయి కూర్చోండి అని తండ్రి చెప్పారు. మేము ఎన్ని సార్లు ఈ చక్రములో తిరిగాము అన్న ఈ స్మృతిలోనే ఉండండి. మనము స్వదర్శన చక్రధారులము, ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అవుతాము. ప్రపంచములో ఎవ్వరికీ ఈ రహస్యాలు తెలియవు. ఈ జ్ఞానము దేవతలకైతే వినిపించేది లేదు, వారు ఎలాగూ పవిత్రముగానే ఉంటారు. శంఖాన్ని మోగించేందుకు వారిలో జ్ఞానము లేదు. వారు ఎలాగూ పవిత్రముగా ఉన్నారు కావున వారికి గుర్తులు చూపించవలసిన అవసరము లేదు. ఇరువురు కలిసి చతుర్భుజులుగా ఉన్నప్పుడు గుర్తులు చూపించడము జరుగుతుంది. మీకు కూడా చూపించరు ఎందుకంటే మీరు నేడు దేవతగా ఉంటారు, రేపు మళ్ళీ కిందకు పడిపోతారు. మాయ పడేస్తుంది కదా. తండ్రి దేవతలుగా తయారుచేస్తారు, మాయ మళ్ళీ అసురులుగా చేస్తుంది. అనేక రకాలుగా మాయ పరీక్ష తీసుకుంటుంది. తండ్రి అర్థం చేయించినప్పుడు - నిజముగానే మా స్థితి దిగజారిపోయింది అన్నది తెలుస్తుంది. పాపం ఎంతోమంది తమదంతా శివబాబా ఖజానాలో జమ చేసారు, అయినా కానీ అప్పుడప్పుడు మాయతో ఓడిపోతారు. శివబాబాకు చెందినవారిగా అయ్యారు, మళ్ళీ ఎందుకు మర్చిపోతారు, ఇందులో యోగము యొక్క యాత్ర ముఖ్యమైనది. యోగము ద్వారానే పవిత్రముగా అవ్వాలి. జ్ఞానముతో పాటుగా పవిత్రత కూడా కావాలి. బాబా, మీరు వచ్చి మమ్మల్ని పావనముగా చేయండి, తద్వారా మేము స్వర్గములోకి వెళ్ళగలమని మీరు పిలుస్తారు కూడా. పావనముగా అయి ఉన్నత పదవిని పొందేందుకే స్మృతియాత్ర ఉన్నది. ఎవరైతే వెళ్ళిపోతారో వారు కూడా ఎంతోకొంత విన్నారు కనుక శివాలయములోకి తప్పకుండా వస్తారు. వారు ఎటువంటి పదవిని పొందినా కానీ రావడమైతే తప్పకుండా వస్తారు. ఒక్కసారి స్మృతి చేసినా కూడా స్వర్గములోకి వచ్చేస్తారు, కానీ ఉన్నత పదవిని పొందలేరు. కేవలం స్వర్గము పేరును విని సంతోషపడిపోకూడదు. ఫెయిల్ అయ్యి పైసకు కొరగాని పదవిని పొందడము, ఇందులో సంతోషపడకూడదు. అది స్వర్గమే, కానీ అందులో పదవులైతే ఎన్నో ఉన్నాయి కదా. నేను నౌకరును, ఊడ్చేవాడిని అనే ఫీలింగ్ అయితే వస్తుంది కదా. మేము ఏమవ్వబోతున్నాము, మా ద్వారా ఏ వికర్మ జరగడము వలన ఇటువంటి పరిస్థితి ఏర్పడింది, నేను మహారాణిగా ఎందుకు అవ్వలేదు అని చివరిలో మీకంతా సాక్షాత్కారమవుతుంది. అడుగడుగనూ అప్రమత్తముగా నడుచుకున్నట్లయితే మీరు పదమపతులుగా అవ్వగలరు. అప్రమత్తముగా లేకపోతే పదమపతులుగా అవ్వలేరు. మందిరాలలో దేవతలకు పదమపతుల గుర్తును చూపిస్తారు. తేడానైతే అర్థం చేసుకోగలరు కదా. పదవులలో కూడా చాలా తేడా ఉంటుంది. ఇప్పుడైనా కూడా ఎన్ని రకాల పదవులు ఉన్నాయో చూడండి. ఎంత ఆర్భాటముంటుంది. వాస్తవానికి అది అల్పకాలికమైన సుఖమే. తండ్రి అంటున్నారు, ఈ ఉన్నతమైన పదవిని పొందాలి, దాని కోసం అందరూ చేతులెత్తుతారు కావున అంతటి పురుషార్థము చేయాలి. చేతులెత్తేవారు కూడా స్వయము సమాప్తమైపోతారు. వీరు దేవతలుగా అవ్వబోయారు, పురుషార్థము చేస్తూ-చేస్తూ సమాప్తమైపోయారని అంటారు. చేతులెత్తడము సహజమే. అనేకులకు అర్థం చేయించడము కూడా సహజమే, మహారథులు అర్థం చేయిస్తూ కూడా మాయమైపోతారు. ఇతరుల కళ్యాణము చేస్తూ స్వయము యొక్క అకళ్యాణము చేసుకుంటారు, అందుకే తండ్రి అర్థం చేయిస్తున్నారు - అప్రమత్తముగా ఉండండి. అంతర్ముఖులుగా అయి తండ్రిని స్మృతి చేయాలి. ఏ విధముగా? బాబా మనకు తండ్రి కూడా, టీచర్ కూడా, సద్గురువు కూడా, మనము మన స్వీట్ హోమ్ కు వెళ్తున్నాము. ఈ జ్ఞానమంతా లోలోపల ఉండాలి. తండ్రిలో జ్ఞానము మరియు యోగము, రెండూ ఉన్నాయి. మీలో కూడా ఉండాలి. శివబాబా చదివిస్తున్నారని మీకు తెలుసు కావున ఇది జ్ఞానము కూడా అయినట్లు మరియు స్మృతి కూడా అయినట్లు. జ్ఞానము మరియు యోగము, రెండూ కలిసి కొనసాగుతాయి. అంతేకానీ యోగములో కూర్చుని శివబాబాను స్మృతి చేస్తూ ఉండటము మరియు జ్ఞానాన్ని మర్చిపోవటము అని కాదు. తండ్రి యోగాన్ని నేర్పించేటప్పుడు వారేమైనా జ్ఞానాన్ని మర్చిపోతారా ఏమిటి! మొత్తము జ్ఞానమంతా వారిలో ఉంటుంది. పిల్లలైన మీలో ఈ జ్ఞానము ఉండాలి. మీరు చదువుకోవాలి. ఎటువంటి కర్మను నేను చేస్తానో, నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు. నేను మురళీని చదవకపోతే ఇతరులు కూడా చదవరు. నేను ఏ విధముగా దుర్గతిని పొందుతానో, అలా ఇతరులు కూడా దుర్గతిని పొందుతారు. ఇతరులను పడవేసేందుకు నేను నిమిత్తమవుతాను. కొంతమంది పిల్లలు మురళీని చదవరు, మిథ్య అహంకారము వచ్చేస్తుంది. మాయ వెంటనే దాడి చేస్తుంది. అడుగడుగులోనూ శ్రీమతము కావాలి. లేకపోతే ఏదో ఒక వికర్మ జరుగుతుంది. చాలామంది పిల్లలు పొరపాట్లు చేస్తారు, ఇక అప్పుడు సర్వనాశనమైపోతారు. పొరపాటు జరిగినట్లయితే మాయ చెంపదెబ్బ వేసి పైసకు కొరగానివారిగా చేసేస్తుంది, ఇందులో చాలా వివేకము కావాలి. అహంకారము వస్తే మాయ చాలా వికర్మలను చేయిస్తుంది. ఎప్పుడైనా ఏదైనా కమిటీ మొదలైనవి తయారుచేస్తే, అప్పుడు అందులో హెడ్ గా ఒకరిద్దరు స్త్రీలు తప్పకుండా ఉండాలి, వారి సలహాపై పని జరగాలి. కలశమైతే లక్ష్మిపైనే పెట్టడము జరుగుతుంది కదా. అమృతాన్ని అందించినప్పుడు అసురులు కూడా కూర్చుని తాగేవారని గాయనము కూడా ఉంది. ఆ తర్వాత యజ్ఞములో విఘ్నాలను కలిగిస్తారు, అనేక రకాల విఘ్నాలు వేసేవారు ఉన్నారు. రోజంతా బుద్ధిలో పరచింతన విషయాలే ఉంటాయి, ఇది చాలా చెడ్డ విషయము. ఏ విషయమైనా సరే తండ్రికి రిపోర్టు చేయండి. సరిదిద్దేవారైతే ఒక్క తండ్రి మాత్రమే. మీరు చట్టాన్ని మీ చేతిలోకి తీసుకోకండి. మీరు తండ్రి స్మృతిలో ఉండండి, అందరికీ తండ్రి పరిచయాన్ని ఇవ్వండి, అప్పుడే అలా అవ్వగలరు. మాయ చాలా కఠినమైనది, అది ఎవ్వరినీ వదలదు. సదా తండ్రికి సమాచారము వ్రాయాలి. డైరెక్షన్లు తీసుకుంటూ ఉండాలి. ప్రతి ఒక్క డైరెక్షన్ లభిస్తూనే ఉంటుంది. బాబా అయితే ఈ విషయము గురించి వారంతట వారే అర్థం చేయించారు కావున వారు అంతర్యామి అని పిల్లలు భావిస్తారు. తండ్రి అంటారు - అలా కాదు, నేనైతే జ్ఞానాన్ని చదివిస్తాను. ఇందులో అంతర్యామి యొక్క విషయమే లేదు. అయితే, వీరంతా నా పిల్లలు, ప్రతి ఒక్కరిలో ఉండే ఆత్మ నా సంతానమేనని నాకు తెలుసు. అంతేకానీ తండ్రి అందరిలోనూ విరాజమానమై ఉన్నారని కాదు. మనుష్యులు తప్పుగా అర్థం చేసుకుంటారు.

తండ్రి చెప్తున్నారు, అందరి సింహాసనముపైన ఆత్మ విరాజమానమై ఉందని నాకు తెలుసు. ఇది ఎంత సహజమైన విషయము. అయినా మర్చిపోయి పరమాత్మను సర్వవ్యాపి అని అనేస్తారు. ఇదే ఏకైక పొరపాటు, దీని కారణముగానే ఇంత కిందకు పడిపోయారు. విశ్వానికి యజమానులుగా తయారుచేసేవారిని మీరు నిందిస్తారు, అందుకే తండ్రి అంటారు, యదా యదాహి... తండ్రి ఇక్కడకు వస్తారు కావున పిల్లలైన మీరు మంచి రీతిలో విచార సాగర మంథనము చేయాలి. జ్ఞానము గురించి చాలా-చాలా మంథనము చేయాలి, సమయమునివ్వాలి, అప్పుడే మీరు మీ కళ్యాణాన్ని చేసుకోగలరు, ఇందులో ధనము మొదలైనవాటి విషయము కూడా లేదు. ఆకలితో ఎవ్వరూ మరణించరు. ఎవరు ఎంతగా తండ్రి వద్ద జమా చేస్తారో, అంతగా వారి భాగ్యము తయారవుతుంది. జ్ఞానము మరియు భక్తి, ఆ తర్వాత వైరాగ్యము అని తండ్రి అర్థం చేయించారు. వైరాగ్యము అనగా అంతా మర్చిపోవలసి ఉంటుంది. స్వయాన్ని డిటాచ్ చేసుకోవాలి, ఆత్మనైన నేను శరీరము నుండి ఇప్పుడు వెళ్తున్నాను. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. తమపై తాము చాలా కంట్రోల్ (నిగ్రహం) పెట్టుకోవాలి. శ్రీమతములో ఎప్పుడూ నిర్లక్ష్యముతో ఉండకూడదు. చాలా-చాలా అప్రమత్తముగా ఉండాలి, ఎప్పుడూ ఏ నియమము యొక్క ఉల్లంఘన జరగకూడదు.

2. అంతర్ముఖులుగా అయి ఒక్క తండ్రితోనే బుద్ధి యొక్క లింకును జోడించాలి. ఈ పతిత పాత ప్రపంచము పట్ల అనంతమైన వైరాగ్యము పెట్టుకోవాలి. నేను ఎలాంటి కర్మను చేస్తానో, నన్ను చూసి అందరూ చేస్తారు అని బుద్ధిలో ఉండాలి.

వరదానము:-
జ్ఞానపు పాయింట్లను ప్రతిరోజూ రివైజ్ చేసుకుని సమాధాన స్వరూపులుగా అయ్యే నిశ్చింత చక్రవర్తి భవ

జ్ఞానపు పాయింట్లేవైతే డైరీలలో లేక బుద్ధిలో ఉంటాయో వాటిని ప్రతిరోజూ రివైజ్ చేసుకోండి మరియు వాటిని అనుభవములోకి తీసుకురండి, అప్పుడు ఏ విధమైన సమస్యనైనా సహజముగా సమాధానపర్చగలుగుతారు. ఎప్పుడూ వ్యర్థ సంకల్పాల రూపీ గొడ్డలితో సమస్య రూపీ రాయిని పగులగొట్టడములో సమయాన్ని వ్యర్థము చేయకండి. ‘‘డ్రామా’’ అన్న పదము యొక్క స్మృతి ద్వారా హైజంప్ చేసి ముందుకు వెళ్ళండి. అప్పుడు ఈ పాత సంస్కారాలు మీ దాసులుగా అయిపోతాయి. కానీ, మొదట చక్రవర్తిగా అవ్వండి, సింహాసనాధికారిగా అవ్వండి.

స్లోగన్:-
ప్రతి ఒక్కరికీ గౌరవాన్ని ఇవ్వడమే గౌరవాన్ని పొందడము.

అవ్యక్త ప్రేరణలు - ఈ అవ్యక్తీ మాసములో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవము చేయండి

జీవన-బంధనముతోపాటే జీవన్ముక్తి యొక్క అనుభవము ఉంటుంది, అక్కడైతే జీవన-బంధనము అన్న మాటే ఉండదు. అక్కడైతే కేవలము ఆ ప్రారబ్ధములోనే ఉంటారు, ముక్తిధామములోని ముక్తి యొక్క అనుభవము ఏదైతే ఇప్పుడు చెయ్యగలరో దానిని అక్కడ చెయ్యలేరు కనుక సంగమయుగములో ముక్తి-జీవన్ముక్తుల అనుభవాన్ని చేయండి. వారసత్వానికి అధికారులుగా అయితే అయ్యారు, ఇప్పుడు దానిని జీవితములో ధారణ చేసి పూర్తి లాభాన్ని పొందండి.