27-08-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీ సతోప్రధానమైన భాగ్యాన్ని
తయారుచేసుకునేందుకు స్మృతిలో ఉండేందుకు బాగా పురుషార్థము చేయండి. నేను ఒక ఆత్మను,
తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి అని సదా గుర్తుండాలి’’
ప్రశ్న:-
పిల్లలకు స్మృతి చార్టు పెట్టడము కష్టముగా ఎందుకు అనిపిస్తుంది?
జవాబు:-
ఎందుకంటే
చాలామంది పిల్లలు అసలు స్మృతిని యథార్థముగా అర్థం చేసుకోరు. కూర్చోవడం స్మృతిలో
కూర్చుంటారు, కానీ బుద్ధి బయట భ్రమిస్తూ ఉంటుంది, బుద్ధి శాంతించదు. అటువంటివారు
వాయుమండలాన్ని పాడు చేస్తారు. అసలు స్మృతే చేయకపోతే ఇక చార్టు ఎలా వ్రాయగలరు. ఒకవేళ
ఎవరైనా అసత్యము వ్రాసినట్లయితే వారికి ఎంతో శిక్ష పడుతుంది. సత్యమైన తండ్రికి సత్యమే
వినిపించవలసి ఉంటుంది.
పాట:-
భాగ్యాన్ని
మేలుకొలుపుకుని వచ్చాను...
ఓంశాంతి
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ప్రతి రోజు అర్థం చేయిస్తూ ఉంటారు - ఎంత వీలైతే అంత
దేహీ-అభిమానులుగా అవ్వండి. స్వయాన్ని ఆత్మగా నిశ్చయము చేసుకోండి మరియు తండ్రిని
స్మృతి చేయండి, ఎందుకంటే మీకు తెలుసు - మనము ఆ అనంతమైన తండ్రి నుండి అనంతమైన సుఖము
యొక్క భాగ్యాన్ని తయారుచేసుకునేందుకు వచ్చాము. కావున తప్పకుండా తండ్రిని స్మృతి
చేయవలసి ఉంటుంది. పవిత్రముగా, సతోప్రధానముగా తయారవ్వకుండా సతోప్రధానమైన భాగ్యాన్ని
తయారుచేసుకోలేరు. ఈ విషయాన్ని బాగా గుర్తుంచుకోండి. ముఖ్యమైన విషయము ఒక్కటే. ఈ
విషయాన్ని మీ వద్ద వ్రాసుకుని పెట్టుకోండి. చేతులపై పేర్లు వ్రాసుకుంటారు కదా. అలా
మీరు కూడా వ్రాసుకోండి - నేను ఒక ఆత్మను, అనంతమైన తండ్రి నుండి నేను వారసత్వాన్ని
తీసుకుంటున్నాను అని, ఎందుకంటే మాయ మరిపింపజేస్తుంది, అందుకే అలా వ్రాసుకుని
ఉన్నట్లయితే ఘడియ-ఘడియ గుర్తుంటుంది. మనుష్యులు గుర్తుంచుకునేందుకని ఓం యొక్క
చిత్రాన్ని మరియు కృష్ణుడు మొదలైనవారి చిత్రాలను కూడా పెట్టుకుంటారు. ఇక్కడ ఇది
అన్నింటికంటే అత్యంత కొత్త స్మృతి. దీని గురించి అనంతమైన తండ్రియే అర్థం చేయిస్తారు.
దీనిని అర్థం చేసుకోవడం ద్వారా మీరు సౌభాగ్యశాలులుగా కాదు, పదమాల రెట్లు
భాగ్యశాలులుగా అవుతారు. తండ్రి గురించి తెలియని కారణముగా, వారిని స్మృతి చేయని
కారణముగా నిరుపేదలుగా అయిపోయారు. ఒక్క తండ్రి మాత్రమే జీవితాన్ని సదా కొరకు
సుఖమయముగా చేయడానికి వచ్చారు. వారిని తలచుకుంటారు కూడా కానీ వారి గురించి ఏ మాత్రము
తెలియదు. విదేశీయులు కూడా వారిని సర్వవ్యాపి అనడమనేది భారతవాసుల నుండే
నేర్చుకున్నారు. భారత్ పతనమయ్యేటప్పటికి అందరూ పతనమయ్యారు. స్వయాన్ని పతనము
చేసుకోవడానికి మరియు సర్వులను పతనము చేయడానికి భారత్ యే కారణము. తండ్రి అంటారు, నేను
కూడా ఇక్కడికే వచ్చి భారత్ ను స్వర్గముగా, సత్యఖండముగా తయారుచేస్తాను. ఇటువంటి
స్వర్గాన్ని తయారుచేసేవారిని ఎంతగా గ్లాని చేసారు. వారిని మర్చిపోయారు కావుననే యదా
యదాహి... అని వ్రాయడం జరిగింది, దీని అర్థాన్ని కూడా తండ్రియే వచ్చి అర్థం
చేయిస్తారు. గొప్పతనమంతా ఒక్క తండ్రిదే. తండ్రి తప్పకుండా వస్తారని ఇప్పుడు మీకు
తెలుసు. శివజయంతిని జరుపుకుంటారు కానీ శివజయంతి పట్ల ఏ మాత్రమూ విలువ లేదు. తండ్రి
తప్పకుండా ఒకప్పుడు ఇక్కడకు వచ్చి వెళ్ళారని, కావుననే వారి జయంతిని జరుపుకుంటారని
ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. సత్యయుగీ ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని
వారే స్థాపన చేస్తారు. తమ-తమ ధర్మాలను ఫలానా-ఫలానావారు ఫలానా-ఫలానా సమయములో
స్థాపించారని మిగిలినవారందరికీ తెలుసు. వాటన్నింటికంటే ముందు ఉన్నది దేవీ-దేవతా
ధర్మము. ఈ ధర్మము ఎక్కడికి మాయమైపోయింది అనేది వారికెవ్వరికీ తెలియదు. ఇప్పుడు
తండ్రి వచ్చి అర్థం చేయిస్తారు. తండ్రియే అందరికన్నా ఉన్నతమైనవారు, ఇంకెవ్వరికీ
ఇంతటి మహిమ లేదు. ధర్మ స్థాపకులకు ఏమి మహిమ ఉంటుంది. తండ్రియే పావన ప్రపంచ స్థాపనను
మరియు పతిత ప్రపంచ వినాశనాన్ని చేయిస్తారు మరియు మిమ్మల్ని మాయపై విజయులుగా చేస్తారు.
ఇది అనంతమైన విషయము. రావణుడి రాజ్యము ఈ అనంతమైన ప్రపంచమంతటిపైనా ఉంది. ఇక్కడ
హద్దులోని లంక మొదలైనవాటి విషయమేదీ లేదు. ఈ గెలుపు-ఓటముల కథ అంతా కూడా భారత్ కు
సంబంధించినదే, మిగిలినవన్నీ ఉపకథలే. భారత్ లోనే ద్వికిరీటధారీ రాజులుగా మరియు ఏక
కిరీటధారీ రాజులుగా తయారవుతారు. దేవీ-దేవతలకు తప్ప మిగిలిన పెద్ద-పెద్ద
చక్రవర్తులెవరైతే ఒకప్పుడు ఇక్కడ ఉండి వెళ్ళారో, వారికెవ్వరికీ ప్రకాశ కిరీటము ఉండదు.
దేవతలైతే ఎంతైనా స్వర్గానికి యజమానులు కదా. ఇప్పుడు శివబాబాను పరమపిత, పతిత-పావనా
అని అంటారు. వారికి ఈ ప్రకాశాన్ని ఎక్కడ చూపించగలరు. ప్రకాశము లేని పతితులు కూడా
ఉన్నప్పుడు ప్రకాశాన్ని చూపించడం జరుగుతుంది. తండ్రి ఎప్పుడూ ప్రకాశములేనివారిగా
అవ్వనే అవ్వరు. బిందువుకు ప్రకాశాన్ని ఎలా చూపించగలరు. చూపించలేరు. రోజురోజుకు మీకు
చాలా గుహ్యాతి గుహ్యమైన విషయాలను అర్థం చేయిస్తూ ఉంటారు. ఎవరు ఎంతగా బుద్ధిలో
నిలుపుకోగలిగితే అంత. ముఖ్యమైనది స్మృతియాత్ర. ఇందులో మాయ విఘ్నాలు ఎంతగానో కలుగుతూ
ఉంటాయి. కొందరు స్మృతి చార్టులో 50 శాతము, 60 శాతము అని కూడా వ్రాస్తారు కానీ అసలు
స్మృతియాత్ర అని దేనినంటారో వారు అర్థం చేసుకోరు. ఈ విషయాన్ని స్మృతి అని అనవచ్చా
అని అడుగుతూ ఉంటారు. ఇది చాలా కష్టము. మీరు ఇక్కడ 10-15 నిమిషాలు కూర్చొంటారు,
అందులో కూడా చెక్ చేసుకోండి - స్మృతిలో బాగా ఉంటున్నారా? స్మృతిలో ఉండలేకపోతున్నవారు
చాలామంది ఉన్నారు, వారు వాయుమండలాన్ని పాడు చేస్తారు. స్మృతిలో ఉండని కారణముగా
విఘ్నాలను కలిగించేవారు చాలామంది ఉన్నారు. రోజంతా బుద్ధి బయట భ్రమిస్తూ ఉంటుంది.
అటువంటి బుద్ధి ఇక్కడ ఎలా శాంతిస్తుంది. అందుకే వారు స్మృతి చార్టును కూడా పెట్టరు.
అసత్యము వ్రాసినట్లయితే ఇంకా ఎక్కువ శిక్ష పడుతుంది. చాలామంది పిల్లలు పొరపాట్లు
చేస్తారు కానీ దాచిపెడతారు, సత్యము చెప్పరు. వారిని తండ్రి అని పిలుస్తూ మరి వారికి
సత్యము చెప్పకపోతే అటువంటివారిపై ఎంత దోషము వస్తుంది. ఎంత పెద్ద అశుద్ధమైన పని
చేసినా కానీ అక్కడ సత్యము చెప్పేందుకు సిగ్గుగా అనిపిస్తుంది. చాలావరకు అందరూ
అసత్యమే చెప్తారు. అసత్యమైన మాయ, అసత్యమైన దేహము... అన్న గాయనము ఉంది కదా. పూర్తిగా
దేహాభిమానములోకి వచ్చేస్తారు. సత్యము వినిపించడమనేది మంచిదే కదా, ఇతరులు కూడా వారి
నుండి నేర్చుకుంటారు. ఇక్కడ సత్యము చెప్పాలి. జ్ఞానముతోపాటు స్మృతియాత్ర కూడా
తప్పనిసరి, ఎందుకంటే స్మృతియాత్ర ద్వారానే స్వ కళ్యాణము మరియు విశ్వ కళ్యాణము
జరగనున్నది. జ్ఞానమనేది అర్థం చేయించేందుకు చాలా సహజమైనది. స్మృతిలోనే కష్టముంది.
ఇకపోతే బీజము నుండి వృక్షము ఏ విధముగా వెలువడుతుంది అనేది అందరికీ తెలుస్తుంది.
బుద్ధిలో 84 జన్మల చక్రము ఉంది. బీజము మరియు వృక్షము యొక్క జ్ఞానము ఉంటుంది కదా.
తండ్రి అయితే సత్యము, చైతన్యము, జ్ఞానసాగరుడు. వారిలో అర్థం చేయించేందుకు జ్ఞానముంది.
ఇది పూర్తిగా అసామాన్యమైన విషయము. ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షము. ఇది కూడా
ఎవ్వరికీ తెలియదు. అందరూ మాకు తెలియదు, మాకు తెలియదు అని అంటూ వచ్చారు. దీని ఆయువు
గురించే తెలియకపోతే ఇక మిగిలిన విషయాలను ఏమి తెలుసుకుంటారు. బాగా తెలిసినవారు మీలో
కూడా చాలా తక్కువమంది ఉన్నారు. కావుననే సెమినార్లు కూడా ఏర్పాటు చేస్తారు. మీ-మీ
సలహాలు చెప్పండి అని పిలుస్తారు. తమ-తమ సలహాలైతే ఎవ్వరైనా ఇవ్వవచ్చు. ఎవరి పేర్లు
ఉంటాయో, వారే సలహాలు ఇవ్వాలి అని ఏమీ లేదు. మా పేరు లేదు కదా, మేము ఎలా ఇవ్వాలి అని
భావించకూడదు. అలా కాదు. ఎవరైనా సరే, సేవ కొరకు ఏదైనా సలహా ఉంటే దానిని వ్రాయవచ్చు.
తండ్రి అంటారు, ఏదైనా సలహా అనిపిస్తే వ్రాయవచ్చు. బాబా, ఈ యుక్తి ద్వారా సేవ బాగా
పెరగవచ్చు అని బాబాకు వ్రాయవచ్చు. ఎవరైనా సలహా ఇవ్వవచ్చు. ఎటువంటి సలహాలు ఇచ్చారో
తండ్రి చూస్తారు. బాబా అయితే చెప్తూ ఉంటారు - ఏ యుక్తి ద్వారా మనము భారత్ యొక్క
కళ్యాణము చేయవచ్చు, ఏ యుక్తితో మనము అందరికీ సందేశాన్ని ఇవ్వవచ్చు అనేది పరస్పరము
చర్చించుకుని యుక్తులు రచించండి, వాటిని వ్రాసి పంపించండి. మాయ అందరినీ
పడుకోబెట్టేసింది. మృత్యువు ఎప్పుడైతే ఎదురుగా ఉంటుందో అప్పుడే తండ్రి వస్తారు.
ఇప్పుడు తండ్రి అంటారు, ఇది అందరిదీ వానప్రస్థావస్థ. మీరు చదివినా, చదవకపోయినా
తప్పకుండా మరణించి తీరవలసిందే. మీరు ఏర్పాట్లు చేసుకున్నా, చేసుకోకపోయినా కొత్త
ప్రపంచము తప్పకుండా స్థాపన అయి తీరవలసిందే. మంచి-మంచి పిల్లలు ఎవరైతే ఉన్నారో, వారు
తమ ఏర్పాట్లు చేసుకుంటున్నారు. పిడికెడు బియ్యము తీసుకువచ్చారని సుదాముడి ఉదాహరణ
కూడా ఉంది. బాబా, మాకు కూడా మహళ్ళు లభించాలి అని అంటారు. వారి వద్ద ఉన్నదే పిడికెడు
బియ్యమైతే వారు ఏమి చేస్తారు. మమ్మా ఉదాహరణను బాబా ఇచ్చారు. మమ్మా, పిడికెడు బియ్యము
కూడా తీసుకురాలేదు, అయినా ఎంత ఉన్నత పదవిని పొందారు, ఇందులో ఇది ధనానికి సంబంధించిన
విషయము కాదు. స్మృతిలో ఉండాలి మరియు తమ సమానముగా తయారుచేయాలి. బాబా వద్ద అయితే ఫీజు
అనేది లేదు. మా వద్ద ధనము ఉంది కావున దానిని యజ్ఞములో ఎందుకు స్వాహా చేయకూడదు అని
భావిస్తారు. వినాశనమైతే జరిగేదే ఉంది. అంతా వ్యర్థమైపోతుంది, మరి దాని బదులు
ఎంతోకొంత సఫలము చేసుకుంటే బాగుంటుంది కదా. ప్రతి మనిషి ఎంతోకొంత దానపుణ్యాలు
మొదలైనవి తప్పకుండా చేస్తారు. అవి పాపాత్ములకు పాపాత్ములు చేసే దానపుణ్యాలు. అయినా
సరే వాటికి కూడా అల్పకాలికమైన ఫలము లభిస్తుంది. ఉదాహరణకు ఎవరైనా యూనివర్శిటీ లేక
కాలేజీ మొదలైనవి నిర్మిస్తే, ఎవరి వద్దనైనా ధనము ఎక్కువగా ఉంటే, ధర్మశాలలు మొదలైనవి
నిర్మిస్తే, వారికి దానికి ప్రతిఫలముగా ఇల్లు మొదలైనవి మంచివి లభిస్తాయి. కానీ
అనారోగ్యము అయితే ఉంటుంది కదా. ఒకవేళ ఎవరైనా హాస్పిటల్ వంటివి నిర్మిస్తే దానికి
ప్రతిఫలముగా ఆరోగ్యము బాగుంటుంది. కానీ వారి కోరికలన్నీ పూర్తవ్వవు. ఇక్కడైతే
అనంతమైన తండ్రి ద్వారా మీ కోరికలన్నీ పూర్తయిపోతాయి.
మీరు పావనముగా అవుతారు కావున ధనమంతటినీ విశ్వాన్ని పావనముగా తయారుచేయడములో
ఉపయోగించడము మంచిది కదా. మీరు ముక్తి-జీవన్ముక్తులను ఇస్తారు, అది కూడా అర్ధకల్పము
కొరకు. మాకు శాంతి ఎలా లభిస్తుంది అని అందరూ అంటారు. అది శాంతిధామములో లభిస్తుంది,
అలాగే సత్యయుగములో ఒకే ధర్మము ఉన్న కారణముగా అక్కడ అశాంతి అనేది ఉండదు. అశాంతి అనేది
రావణ రాజ్యములో ఉంటుంది. రాముని రాజ్యములో ప్రజలు కూడా షావుకారులే మరియు ఆ నగరములో
అందరూ దాతలే కాబట్టి ధర్మానికి సదా ఉపకారము జరుగుతుంది అన్న గాయనము కూడా ఉంది కదా.
అది అమరలోకము. అక్కడ అమరలోకములో మరణము అన్న మాట ఉండదు. ఇక్కడైతే కూర్చుని, కూర్చునే
అకస్మాత్తుగా మరణిస్తారు. దీనిని మృత్యులోకమని, దానిని అమరలోకమని అంటారు. అక్కడ
మరణించడము ఉండదు. పాత శరీరాన్ని వదిలి మళ్ళీ చిన్నపిల్లలుగా అయిపోతారు. అక్కడ
అనారోగ్యము ఉండదు. ఎంత లాభము ఉంటుంది. శ్రీశ్రీ మతముపై మీరు సదా ఆరోగ్యవంతులుగా
అవుతారు. కావున ఇటువంటి ఆత్మిక సెంటర్లు ఎన్ని తెరవబడాలి. కొద్దిమంది వచ్చినా అది
తక్కువేమీ కాదు. ఈ సమయములో మనుష్యులెవ్వరికీ డ్రామా ఆయువు గురించి తెలియదు. మరి మీకు
ఇది ఎవరు నేర్పించారు అని అడుగుతారు. అరే, మాకు ఇదంతా తెలియజేసేది తండ్రి. ఇక్కడ
ఇంతమంది బి.కె.లు ఉన్నారు, మీరు కూడా బి.కె.లే, మీరూ శివబాబా సంతానమే, అలాగే
ప్రజాపిత బ్రహ్మాకు కూడా మీరు సంతానము. వీరు మానవాళి యొక్క గ్రేట్-గ్రేట్ గ్రాండ్
ఫాదర్, వీరి నుండి బి.కె.లైన మనము వెలువడ్డాము. వంశావళులు ఉంటాయి కదా. మీ దేవీ-దేవతా
కులము చాలా సుఖాన్ని ఇస్తుంది. ఇక్కడ మీరు ఉత్తములుగా అవుతారు, ఆ తరువాత అక్కడ
రాజ్యము చేస్తారు. ఈ విషయము ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఉండదు. దేవతల పాదాలు ఈ
తమోప్రధానమైన ప్రపంచములో మోపే అవకాశమే లేదు అని కూడా పిల్లలకు అర్థం చేయించడం
జరిగింది. జడ చిత్రాల యొక్క నీడ పడవచ్చు కానీ చైతన్య దేవతల నీడ ఇక్కడ పడడానికి
అవకాశమే లేదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - పిల్లలూ, ఒకటేమో స్మృతియాత్రలో ఉండండి,
ఏ విధమైన వికర్మలు చేయకండి మరియు సేవ కొరకు యుక్తులను రచించండి. పిల్లలు అంటారు -
బాబా, మేమైతే లక్ష్మీ-నారాయణుల వలె తయారవుతాము. బాబా అంటారు, మీ నోట్లో గులాబ్, కానీ
దీని కొరకు కృషి కూడా చేయాలి. ఉన్నత పదవిని పొందాలంటే మీ సమానముగా తయారుచేసే సేవ
చేయండి. మీరు ఒకానొక రోజు చూస్తారు - ఒక్కొక్క పండా తమతోపాటు 100-200 మంది
యాత్రికులను కూడా తీసుకువస్తారు. మున్ముందు మీరు అన్నీ చూస్తారు. మొదటే అన్నీ
చెప్పలేము కదా. ఏదైతే జరుగుతూ ఉంటుందో, దానిని మీరు చూస్తూ ఉంటారు.
ఇది అనంతమైన డ్రామా. మీది తండ్రితోపాటు అందరికన్నా ముఖ్యమైన పాత్ర, అదేమిటంటే
మీరు పాత ప్రపంచాన్ని కొత్తదిగా తయారుచేస్తారు. ఇది పురుషోత్తమ సంగమయుగము. ఇప్పుడు
మీరు సుఖధామానికి యజమానులుగా అవుతారు. అక్కడ దుఃఖము యొక్క నామ-రూపాలు ఉండవు. తండ్రి
ఉన్నదే దుఃఖహర్త, సుఖకర్త. తండ్రి వచ్చి దుఃఖము నుండి విముక్తులుగా చేస్తారు. ఎంతో
ధనముంది, పెద్ద-పెద్ద మహళ్ళు ఉన్నాయి, కరెంట్ ఉంది, కావున ఇదే స్వర్గము అని
భారతవాసులు భావిస్తూ ఉంటారు. ఇదంతా మాయ ఆర్భాటము. సుఖము కొరకు ఎన్నో సాధనాలను
తయారుచేస్తూ ఉంటారు. పెద్ద-పెద్ద మహళ్ళను, ఇళ్ళను తయారుచేస్తూ ఉంటారు, కానీ మృత్యువు
అకస్మాత్తుగా ఎలా వస్తుందో చూడండి. ఆ ప్రపంచములో మరణము అంటే భయముండదు. ఇక్కడైతే
అకస్మాత్తుగా మరణిస్తారు, అప్పుడు ఎంతగా దుఃఖిస్తారు. ఆ తరువాత సమాధి వద్దకు వెళ్ళి
ఏడుస్తారు. ప్రతి ఒక్కరికీ తమ-తమ ఆచార-వ్యవహారాలు ఉన్నాయి. అనేక అభిప్రాయాలు ఉన్నాయి.
సత్యయుగములో ఇటువంటి విషయాలు ఉండవు. అక్కడ ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటారు.
మరి మీరు ఎంతటి సుఖములోకి వెళ్తారు. దాని కొరకు ఎంత పురుషార్థము చేయాలి.
అడుగడుగులోనూ డైరెక్షన్లు తీసుకోవాలి. ఇతరులైతే గురువుల డైరెక్షన్లను కానీ, పతి
డైరెక్షన్లను కానీ తీసుకుంటారు లేకపోతే తమ మతముపైనే తాము నడుస్తూ ఉంటారు. ఆసురీ మతము
ఏం పసికొస్తుంది. అసురత్వము వైపుకే తోస్తుంది. ఇప్పుడు మీకు ఈశ్వరీయ మతము లభిస్తుంది,
ఇది ఉన్నతోన్నతమైనది, కావుననే శ్రీమత్ భగవానువాచ అన్న గాయనము కూడా ఉంది. పిల్లలైన
మీరు శ్రీమతము ద్వారా మొత్తం విశ్వాన్ని స్వర్గముగా తయారుచేస్తారు, ఆ స్వర్గానికి
మీరే యజమానులుగా అవుతారు, అందుకే మీరు ప్రతి అడుగులోనూ శ్రీమతము తీసుకోవాలి. కానీ
ఎవరి భాగ్యములోనైనా లేకపోతే ఇక వారు తండ్రి డైరెక్షన్లపై నడవరు. బాబా అర్థం
చేయించారు - ఎవరి వద్దనైనా ఏదైనా ఆలోచన ఉంటే, సలహా ఉంటే దానిని బాబా వద్దకు
పంపించండి. ఎవరెవరు సలహా ఇచ్చేందుకు యోగ్యులుగా ఉన్నారో బాబాకు తెలుసు. కొత్త-కొత్త
పిల్లలు వెలువడుతూ ఉంటారు. ఎవరెవరు మంచి-మంచి పిల్లలో బాబాకైతే తెలుసు కదా.
దుకాణదారులు కూడా సలహాలు తీయాలి. తండ్రి పరిచయము లభించే విధముగా ప్రయత్నించాలి.
దుకాణములో కూడా అందరికీ స్మృతిని కలిగిస్తూ ఉండాలి. భారత్ లో సత్యయుగము ఉన్నప్పుడు
ఒకే ధర్మముండేది. ఇందులో డిస్టర్బ్ అయ్యే విషయమే లేదు. అందరికీ తండ్రి ఒక్కరే.
తండ్రి అంటారు, నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే మీ వికర్మలు వినాశనమవుతాయి, మీరు
స్వర్గానికి యజమానులుగా అవుతారు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. శ్రీమతముపై నడుస్తూ మొత్తం విశ్వాన్ని స్వర్గముగా తయారుచేసే సేవ చేయాలి,
అనేకులను తమ సమానముగా తయారుచేయాలి. ఆసురీ మతము నుండి స్వయాన్ని రక్షించుకోవాలి.
2. స్మృతి యొక్క కృషితో ఆత్మను సతోప్రధానముగా తయారుచేసుకోవాలి. సుదాముని వలె తమ
వద్ద ఉన్న పిడికెడు బియ్యాన్ని సఫలము చేసుకుని తమ సర్వ మనోకామనలను నెరవేర్చుకోవాలి.
వరదానము:-
ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు అన్న ఈ దృఢ సంకల్పము ద్వారా
అవినాశీ, అమర భవ
ఏ పిల్లలైతే ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ లేరు అన్న దృఢ
సంకల్పాన్ని చేస్తారో వారి స్థితి స్వతహాగా మరియు సహజముగా ఏకరసముగా అవుతుంది. ఈ దృఢ
సంకల్పము ద్వారానే సర్వ సంబంధాల అవినాశీ సంబంధము జోడించబడుతుంది మరియు వారికి సదా
అవినాశీ భవ, అమర భవ అన్న వరదానము లభిస్తుంది. దృఢ సంకల్పము చేయడం ద్వారా
పురుషార్థములో కూడా విశేషముగా లిఫ్ట్ లభిస్తుంది. ఎవరికైతే ఒక్క తండ్రితో సర్వ
సంబంధాలు ఉంటాయో వారికి సర్వ ప్రాప్తులు స్వతహాగా లభిస్తాయి.
స్లోగన్:-
ఆలోచించడము, మాట్లాడడము మరియు చేయడము, మూడింటినీ సమానము చేయండి, అప్పుడు సర్వోత్తమ
పురుషార్థులు అని పిలవబడతారు.
అవ్యక్త ప్రేరణలు -
సహజయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి
ఏ సమయములో ఏ సంబంధము
యొక్క అవసరము ఉంటుందో, ఆ సంబంధములోనే భగవంతుడిని మీ వారిగా చేసుకోండి. ‘మేరా బాబా’
(నా బాబా) అని మనస్ఫూర్తిగా అనండి, అప్పుడు బాబా కూడా ‘నా పిల్లలు’ అని అంటారు, ఈ
స్నేహ సాగరములోనే ఇమిడిపోండి. ఈ స్నేహము ఛత్రఛాయలా పని చేస్తుంది, దీని లోపలికి మాయ
రాలేదు, ఇదే సహజయోగిగా అయ్యేందుకు సాధనము.
| | |