ఓంశాంతి
అనంతమైన ఆత్మిక తండ్రి అనంతమైన ఆత్మిక పిల్లలకు అర్థం చేయిస్తున్నారు అనగా తమ
మతాన్ని ఇస్తున్నారు. మేము జీవాత్మలము అనైతే మీరు తప్పకుండా అర్థం చేసుకుంటారు. కానీ
వాస్తవానికైతే స్వయాన్ని ఆత్మ అని నిశ్చయము చేసుకోవాలి కదా. ఇక్కడ మనమేమీ కొత్త
స్కూల్లో చదువుకోవడము లేదు. ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత చదువుకుంటూ ఉంటాము.
ఇంతకుముందు ఎప్పుడైనా చదువుకోవడానికి వచ్చారా అని బాబా అడుగుతారు కదా. అప్పుడు, మేము
ప్రతి 5 వేల సంవత్సరాల తర్వాత పురుషోత్తమ సంగమయుగములో బాబా వద్దకు వస్తాము అని అందరూ
అంటారు. ఇదైతే గుర్తుంటుంది కదా లేక ఇది కూడా మర్చిపోతారా? విద్యార్థులకు స్కూల్
అయితే తప్పకుండా గుర్తుకొస్తుంది కదా. లక్ష్యము-ఉద్దేశ్యము అయితే ఒక్కటే. ఎవరెవరైతే
పిల్లలుగా అవుతారో, వారు రెండు రోజుల పిల్లలైనా లేక పాతవారైనా కానీ
లక్ష్యము-ఉద్దేశ్యము అందరిదీ ఒక్కటే. ఎవ్వరికీ నష్టము జరగదు. చదువులో సంపాదన ఉంటుంది.
వారు కూడా కూర్చుని గ్రంథ్ ను చదివి వినిపిస్తారు, అప్పుడు సంపాదన జరుగుతుంది, శరీర
నిర్వహణ కోసం కావాల్సింది వెంటనే లభిస్తుంది. సాధువులుగా అయి 1-2 శాస్త్రాలను
కూర్చుని వినిపిస్తే సంపాదన జరుగుతుంది. ఇప్పుడు ఇవన్నీ సంపాదనకు ఆధారాలు. ప్రతి
విషయములోనూ సంపాదన ఉండాలి కదా. ధనముంటే ఎక్కడికైనా తిరగడానికి వెళ్ళి రండి. బాబా
మనకు చాలా మంచి చదువును చదివిస్తున్నారని, దీని ద్వారా 21 జన్మలకు సంపాదన
లభిస్తుందని పిల్లలైన మీకు తెలుసు. ఇది ఎటువంటి సంపాదన అంటే దీనితో మనము సదా కోసం
సుఖవంతులుగా అవుతాము, ఎప్పుడూ రోగగ్రస్తులుగా అవ్వము, సదా అమరులుగా ఉంటాము. ఈ
నిశ్చయము ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. ఇటువంటి నిశ్చయము ఉంచుకున్నట్లయితే మీకు ఉత్సాహము
వస్తుంది. లేకపోతే ఏదో ఒక విషయములో ఇబ్బంది కలుగుతూ ఉంటుంది. మేము అనంతమైన తండ్రి
ద్వారా చదువుకుంటున్నామని లోలోపల స్మరణ చేసుకుంటూ ఉండాలి. భగవానువాచ - ఇది గీత. గీతా
యుగము కూడా వస్తుంది కదా. కేవలం ఇది 5వ యుగమని మర్చిపోయారు. ఈ సంగమయుగము చాలా
చిన్ననిది. వాస్తవానికి ఇతర యుగాల సమయముతో పోలిస్తే పావు వంతు అని కూడా అనము.
పర్సెంటేజ్ చెప్పవచ్చు. అది కూడా మున్ముందు తండ్రి తెలియజేస్తూ ఉంటారు. కొంత తండ్రి
చెప్పవలసింది కూడా నిశ్చితమై ఉంది కదా. ఆత్మలైన మీ అందరిలో పాత్ర నిశ్చితమై ఉంది,
అది రిపీట్ అవుతూ ఉంది. మీరు ఏదైతే నేర్చుకుంటున్నారో, అది కూడా రిపిటిషన్ కదా.
రిపిటిషన్ రహస్యము పిల్లలైన మీకు తెలిసింది. అడుగడుగునా పాత్ర మారిపోతూ ఉంది. ఒక
క్షణము మరో క్షణముతో కలవదు. పేను వలె టిక్-టిక్ అని నడుస్తూనే ఉంటుంది. టిక్ అనగానే
క్షణము గడిచిపోయింది. ఇప్పుడు మీరు అనంతములో నిలబడి ఉన్నారు. ఇతర
మనుష్యమాత్రులెవ్వరూ అనంతములో నిలబడి లేరు. ఎవ్వరికీ అనంతము అనగా ఆదిమధ్యాంతాల
జ్ఞానము లేదు. ఇప్పుడు మీకు భవిష్యత్తు గురించి కూడా తెలుసు. మనము కొత్త
ప్రపంచములోకి వెళ్తున్నాము. ఇది సంగమయుగము, దీనిని దాటాలి. అది ఉప్పునీటి కాలువ కదా.
ఇది మధురాతి మధురమైన అమృతము యొక్క కాలువ. అది విషపు కాలువ. ఇప్పుడు మీరు విషయ సాగరము
నుండి క్షీర సాగరములోకి వెళ్తారు. ఇది అనంతమైన విషయము. ప్రపంచములోని వారికి ఈ
విషయాల గురించి ఏమీ తెలియదు. ఇది కొత్త విషయము కదా. భగవంతుడని ఎవరిని అంటారో, వారు
ఏం పాత్రను అభినయిస్తారో కూడా మీకు తెలుసు. మీరు వస్తే మేము మీకు పరమపిత పరమాత్ముని
జీవిత చరిత్రను అర్థం చేయిస్తాము అని టాపిక్ లో కూడా తెలియజేస్తారు. మామూలుగా
పిల్లలు తమ తండ్రి జీవిత చరిత్రను వినిపిస్తారు, ఇది కామన్. వీరైతే తండ్రులకే తండ్రి
కదా. మీలో కూడా నంబరువారు పురుషార్థానుసారముగా తెలుసు. ఇప్పుడు మీరు యథార్థ రీతిలో
తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి. మీకు కూడా తండ్రియే ఇచ్చారు, అందుకే కదా అర్థం
చేయిస్తారు, ఇతరులెవ్వరూ అనంతమైన తండ్రిని తెలుసుకోలేరు. మీరు కూడా సంగమయుగములోనే
తెలుసుకుంటారు. మనుష్యమాత్రులెవ్వరికీ, వారు దేవతలైనా లేక శూద్రులైనా,
పుణ్యాత్ములైనా లేక పాపాత్ములైనా, ఎవ్వరికీ తెలియదు. కేవలం సంగమయుగములో ఉన్న
బ్రాహ్మణులైన మీరే తెలుసుకుంటున్నారు. కావున పిల్లలైన మీకు ఎంత సంతోషముండాలి. అందుకే,
అతీంద్రియ సుఖము గురించి అడగాలంటే గోప-గోపికలను అడగండి అన్న గాయనము కూడా ఉంది.
బాబా తండ్రి కూడా, టీచర్, సద్గురువు కూడా, సుప్రీమ్ అన్న పదాన్ని తప్పకుండా
చేర్చాలి. అప్పుడప్పుడు పిల్లలు మర్చిపోతారు. ఈ విషయాలన్నీ పిల్లల బుద్ధిలో ఉండాలి.
శివబాబా మహిమలో ఈ పదాలను తప్పకుండా చేర్చాలి. మీకు తప్ప ఇతరులెవ్వరికీ తెలియనే
తెలియదు. మీరు అర్థం చేయించగలిగితే మీకు విజయము లభించినట్లే కదా. అనంతమైన తండ్రి
సర్వుల శిక్షకుడు, సర్వుల సద్గతిదాత అని మీకు తెలుసు. వారు అనంతమైన సుఖాన్ని,
అనంతమైన జ్ఞానాన్ని ఇచ్చేవారు, అయినా కూడా ఇటువంటి తండ్రిని మర్చిపోతారు. మాయ ఎంత
సమర్థవంతమైనది. ఈశ్వరుడిని సమర్థుడని అంటారు కానీ మాయ కూడా తక్కువేమీ కాదు. దీనికి
రావణుడు అని పేరు పెట్టారని పిల్లలైన మీకు ఇప్పుడు యథార్థముగా తెలుసు. రామ రాజ్యము
మరియు రావణ రాజ్యము. వీటి గురించి కూడా యథార్థముగా అర్థం చేయించాలి. రామ రాజ్యము
ఉంది అంటే తప్పకుండా రావణ రాజ్యము కూడా ఉంటుంది. సదా రామ రాజ్యమే ఉండడమనేది జరగదు.
రామ రాజ్యాన్ని, శ్రీకృష్ణుని రాజ్యాన్ని ఎవరు స్థాపన చేస్తారు, ఇది అనంతమైన తండ్రి
కూర్చుని అర్థం చేయిస్తున్నారు. మీరు భారత ఖండాన్ని చాలా మహిమ చేయాలి. భారత్
సత్యమైన ఖండముగా ఉండేది, ఎంత మహిమ ఉండేది. అలా తయారుచేసేవారు తండ్రి మాత్రమే. మీకు
తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉంది. లక్ష్యము-ఉద్దేశ్యము బుద్ధిలో ఉంది. విద్యార్థులమైన
మనకు మన చదువు యొక్క నషా ఉండాలి అని కూడా మీకు తెలుసు. క్యారెక్టర్ పట్ల కూడా
శ్రద్ధ ఉండాలి. వివేకము చెప్తుంది - ఇది ఈశ్వరీయ చదువు కావున ఇందులో ఒక్క రోజు కూడా
మిస్ చేయకూడదు మరియు టీచర్ వచ్చిన తర్వాత ఆలస్యముగా రాకూడదు. టీచర్ వచ్చిన తర్వాత
రావడమంటే, ఇది కూడా ఒక అవమానమే. స్కూల్ లో కూడా లేట్ గా వస్తే వారిని టీచర్ బయటే
నిలబెడతారు. బాబా తన బాల్యము యొక్క ఉదాహరణను కూడా తెలియజేస్తున్నారు. మా టీచర్ అయితే
చాలా స్ట్రిక్ట్ గా ఉండేవారు. లోపలకి కూడా రానిచ్చేవారు కాదు. ఇక్కడైతే ఆలస్యముగా
వచ్చేవారు చాలామంది ఉన్నారు. సేవ చేసే సుపుత్రులైన పిల్లలు తప్పకుండా తండ్రికి
ప్రియముగా అనిపిస్తారు కదా. ఇదే ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము అని ఇప్పుడు మీరు అర్థం
చేసుకుంటారు. వీరి ధర్మము ఎప్పుడు స్థాపనయ్యింది అనేది కొద్దిగా కూడా ఎవరి
బుద్ధిలోనూ లేదు. మీ బుద్ధి నుండి కూడా పదే-పదే జారిపోతుంది. మీరు ఇప్పుడు
దేవీ-దేవతలుగా అయ్యేందుకు పురుషార్థము చేస్తున్నారు. ఎవరు చదివిస్తున్నారు? స్వయంగా
పరమపిత పరమాత్మ. ఇది మన బ్రాహ్మణ కులము అని మీరు భావిస్తారు. ఇక్కడ వంశము ఉండదు. ఇది
సర్వోత్తమమైన బ్రాహ్మణ కులము. తండ్రి కూడా సర్వోత్తములు కదా. వారు ఉన్నతోన్నతమైనవారు
కావున తప్పకుండా వారు ఇచ్చే సంపాదన కూడా ఉన్నతముగా ఉంటుంది. వారినే శ్రీశ్రీ అని
అంటారు. వారు మిమ్మల్ని కూడా శ్రేష్ఠముగా తయారుచేస్తారు. మనల్ని శ్రేష్ఠముగా
తయారుచేసేవారు ఎవరు అన్నది పిల్లలైన మీకే తెలుసు, ఇంకెవ్వరూ ఏమీ అర్థం చేసుకోరు. మా
తండ్రి, తండ్రి కూడా, టీచర్ కూడా, సద్గురువు కూడా, వారు చదివిస్తున్నారు అని మీరు
అంటారు. మనము ఆత్మలము. మీరు నా సంతానమని తండ్రి ఆత్మలైన మనకు స్మృతిని ఇప్పించారు.
సోదర భావము కదా. తండ్రిని తలచుకుంటారు కూడా. వారు నిరాకారీ తండ్రి కావున తప్పకుండా
ఆత్మలను కూడా నిరాకారి అనే అంటారని భావిస్తారు. ఆత్మయే ఒక శరీరాన్ని వదిలి మరొకటి
తీసుకుంటుంది. మళ్ళీ పాత్రను అభినయిస్తుంది. మనుష్యులు స్వయాన్ని ఆత్మకు బదులుగా
శరీరముగా భావిస్తారు. నేను ఆత్మను అనేది మర్చిపోతారు. నేను ఎప్పుడూ మర్చిపోను.
ఆత్మలైన మీరంతా సాలిగ్రామాలు. నేను పరమపితను అనగా పరమ ఆత్మను. వారికి వేరే పేరు ఏదీ
లేదు. ఆ పరమ ఆత్మ పేరు శివ. మీరు కూడా అటువంటి ఆత్మలే కానీ మీరంతా సాలిగ్రామాలు.
శివుని మందిరాలకు వెళ్తారు, అక్కడ కూడా అనేక సాలిగ్రామాలను పెడతారు. శివుడిని
పూజించేటప్పుడు సాలిగ్రామాలను కూడా పూజిస్తారు కదా. అందుకే బాబా అర్థం చేయించారు,
మీ ఆత్మకు మరియు శరీరానికి, రెండింటికీ పూజ జరుగుతుంది. నాకైతే కేవలం ఆత్మకు మాత్రమే
పూజ జరుగుతుంది, నాకు శరీరము లేదు. మీరు ఎంత ఉన్నతముగా అవుతారు. బాబాకైతే సంతోషము
కలుగుతుంది కదా. తండ్రి పేదవానిగా ఉంటారు, పిల్లలు చదువుకుని ఎంత ఉన్నతముగా అవుతారు.
ఎలా ఉన్నవారు ఎలా అవుతారు. తండ్రికి కూడా తెలుసు - మీరు ఎంత ఉన్నతముగా ఉండేవారు,
ఇప్పుడు ఎంతగా అనాథలుగా అయిపోయారు, తండ్రి గురించే తెలియదు. ఇప్పుడు మీరు తండ్రికి
చెందినవారిగా అయ్యారు కావున మొత్తం విశ్వానికి యజమానులుగా అవుతారు.
తండ్రి అంటారు - నన్నే హెవెన్లీ గాడ్ ఫాదర్ అని అంటారు. ఇప్పుడు స్వర్గ స్థాపన
జరుగుతోందని కూడా మీకు తెలుసు. అక్కడ ఏమేమి ఉంటాయి అనేది మీ బుద్ధిలో తప్ప ఇంకెవ్వరి
బుద్ధిలోనూ ఉండదు. మేము విశ్వానికి యజమానులుగా ఉండేవారము, ఇప్పుడు తయారవుతున్నాము
అని మీ బుద్ధిలో ఉంది. మేము యజమానులము అని ప్రజలు కూడా ఇలాగే అంటారు కదా. ఈ విషయాలు
కేవలం పిల్లలైన మీ బుద్ధిలో మాత్రమే ఉన్నాయి, సంతోషము ఉండాలి కదా! ఈ విషయాలను విని
ఇతరులకు కూడా వినిపించాలి, అందుకే సెంటర్లను లేక మ్యూజియంలను తెరుస్తూ ఉంటారు.
కల్పక్రితము ఏదైతే జరిగిందో, అదే మళ్ళీ జరుగుతూ ఉంటుంది. మ్యూజియంలు, సెంటర్లు
మొదలైనవి మీకు చాలామంది ఆఫర్ చేస్తారు, అప్పుడు చాలామంది వెలువడుతారు. అందరి ఎముకలు
మృదువుగా అవుతూ ఉంటాయి. మొత్తం ప్రపంచములోని వారి ఎముకలను ఇప్పుడు మీరు మృదువుగా
చేస్తూ ఉంటారు. మీ యోగములో ఎంత ఎక్కువ శక్తి ఉంది. తండ్రి అంటారు, మీలో చాలా శక్తి
ఉంది. భోజనాన్ని మీరు యోగములో ఉంటూ తయారుచేయండి మరియు తినిపించండి, అప్పుడు బుద్ధి
ఇటువైపుకు ఆకర్షింపబడుతుంది. భక్తి మార్గములోనైతే గురువుల ఎంగిలి కూడా తింటారు.
భక్తి మార్గము యొక్క విస్తారమైతే చాలా ఉందని, దానిని వర్ణించలేమని పిల్లలైన మీకు
తెలుసు. ఇది బీజము, అది వృక్షము. బీజాన్ని వర్ణించగలము. అంతేకానీ, ఎవరికైనా చెట్టుకు
ఉన్న ఆకులను లెక్కపెట్టమని చెప్తే లెక్కపెట్టలేరు. ఎన్నో ఆకులు ఉంటాయి. బీజములో
ఆకుల గుర్తులు కనిపించవు. ఇది అద్భుతము కదా. దీనిని కూడా సృష్టి అద్భుతము అని అంటారు.
జీవ-జంతువులు ఎంత అద్భుతముగా ఉన్నాయి. అనేక రకాల కీటకాలు ఉన్నాయి, అవి ఎలా
జన్మిస్తాయి. ఇది చాలా అద్భుతమైన డ్రామా, దీనినే ప్రకృతి అని అంటారు. ఇది కూడా తయారై,
తయారుచేయబడిన ఆట. సత్యయుగములో ఏమేమి చూస్తారు. అవన్నీ కొత్త వస్తువులే ఉంటాయి, అన్నీ
కొత్తవే ఉంటాయి. నెమలి కోసమైతే బాబా అర్థం చేయించారు - దానిని భారత్ యొక్క జాతీయ
పక్షి అని అంటారు ఎందుకంటే శ్రీకృష్ణుని కిరీటములో నెమలి ఈకను చూపిస్తారు. మగ నెమలి
మరియు ఆడ నెమలి అందముగా కూడా ఉంటాయి. గర్భము కూడా కన్నీటితో జరుగుతుంది, అందుకే
జాతీయ పక్షి అని అంటారు. ఇటువంటి అందమైన పక్షులు విదేశాల వైపు కూడా ఉంటాయి.
ఇప్పుడు పిల్లలైన మీకు మొత్తం సృష్టి యొక్క ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం
చేయించారు, ఇది ఇతరులెవ్వరికీ తెలియదు. మీరు ఇలా చెప్పండి - మేము మీకు పరమపిత
పరమాత్మ యొక్క జీవిత చరిత్రను తెలియజేస్తాము. వారు రచయిత కావున తప్పకుండా వారి రచన
కూడా ఉంటుంది. వారి చరిత్ర-భౌగోళికాలు మనకు తెలుసు. ఉన్నతోన్నతమైన, అనంతమైన తండ్రి
యొక్క పాత్ర ఏమిటో మనకు తెలుసు, ప్రపంచములోని వారికి ఏమీ తెలియదు. ఇది చాలా ఛీ-ఛీ
ప్రపంచము. ఈ సమయములో అందముగా ఉన్నా కూడా కష్టమే. ఆడ పిల్లలను ఎలా-ఎలా ఎత్తుకుపోతూ
ఉంటారో చూడండి. పిల్లలైన మీకు ఈ వికారీ ప్రపంచము పట్ల అసహ్యము కలగాలి. ఇది ఛీ-ఛీ
ప్రపంచము, ఛీ-ఛీ శరీరము. మనమైతే ఇప్పుడు తండ్రిని స్మృతి చేసి మన ఆత్మను పవిత్రముగా
తయారుచేసుకోవాలి. మనము సతోప్రధానముగా ఉండేవారము, సుఖవంతులుగా ఉండేవారము. ఇప్పుడు
తమోప్రధానముగా అయ్యాము కావున దుఃఖితులుగా ఉన్నాము, మళ్ళీ సతోప్రధానముగా అవ్వాలి.
మేము పతితము నుండి పావనముగా అవ్వాలి అని మీరు కోరుకుంటారు. పతిత-పావనా అని పాడుతారు
కూడా కానీ కొద్దిగా కూడా అయిష్టము కలగదు. ఇది ఛీ-ఛీ ప్రపంచమని పిల్లలైన మీరు అర్థం
చేసుకున్నారు. కొత్త ప్రపంచములో మనకు శరీరము కూడా అందమైనది లభిస్తుంది. ఇప్పుడు మనము
అమరపురికి యజమానులుగా అవుతున్నాము. పిల్లలైన మీరు సదా సంతోషముగా, హర్షితముఖులుగా
ఉండాలి. మీరు చాలా మధురమైన పిల్లలు. తండ్రి 5 వేల సంవత్సరాల తర్వాత వచ్చి ఆ పిల్లలనే
కలుసుకుంటారు కావున తప్పకుండా సంతోషము ఉంటుంది కదా. నేను పిల్లలను కలుసుకునేందుకు
మళ్ళీ వచ్చాను. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.