28-01-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - పిల్లలైన మిమ్మల్ని విశ్వానికి
యజమానులుగా తయారుచేయడానికి అతి ప్రియాతి ప్రియమైన శివబాబా వచ్చారు, మీరు వారి
శ్రీమతముపై నడవండి’’
ప్రశ్న:-
మనుష్యులు
పరమాత్ముని గురించి ఏ రెండు విషయాలను ఒకదానికొకటి భిన్నముగా చెప్తారు?
జవాబు:-
ఒకవైపు,
పరమాత్మ అఖండ జ్యోతి అని చెప్తారు మరియు ఇంకొకవైపు, వారు నామ-రూపాలకు అతీతమైనవారని
చెప్తారు. ఈ రెండు విషయాలు ఒకదానికొకటి భిన్నము. యథార్థ రూపములో తెలియని కారణముగానే
పతితముగా అవుతూ ఉంటారు. తండ్రి ఎప్పుడైతే వస్తారో, అప్పుడు వారు తమ సత్యమైన
పరిచయాన్ని ఇస్తారు.
పాట:-
నీ దారిలోనే
మరణించాలి...
ఓంశాంతి
పిల్లలు పాట విన్నారు. ఎవరైనా మరణించినప్పుడు, వారు ఒక తండ్రి వద్ద జన్మ తీసుకుంటారు.
అనటానికి తండ్రి వద్ద జన్మ తీసుకున్నారు అనే అంటారు, తల్లి పేరు తీసుకోరు. ఆ
తండ్రికి అభినందనలు తెలుపడము జరుగుతుంది. ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు, మనము
ఆత్మలము, అది శరీరానికి సంబంధించిన విషయము. ఒక శరీరాన్ని వదిలి మరో తండ్రి వద్దకు
వెళ్తారు. మీరు 84 జన్మలలో 84 సాకార తండ్రులను పొందారు. వాస్తవానికి మీరు నిరాకార
తండ్రికి పిల్లలు. ఆత్మలైన మీరు, పరమపిత పరమాత్ముని పిల్లలు. వాస్తవానికి మీరు
అక్కడి నివాసులే, దానిని నిర్వాణధామము లేక శాంతిధామమని అంటారు. వాస్తవానికి మీరు
అక్కడి నివాసులు. తండ్రి కూడా అక్కడే నివసిస్తారు. ఇక్కడకు వచ్చి మీరు లౌకిక
తండ్రికి పిల్లలుగా అవుతారు, అప్పుడు ఆ తండ్రిని మర్చిపోతారు. సత్యయుగములో కూడా మీరు
సుఖవంతులుగా అయినప్పుడు ఆ పారలౌకిక తండ్రిని మర్చిపోతారు. సుఖములో ఆ తండ్రిని ఎవరూ
స్మరించరు, దుఃఖములో స్మరిస్తారు మరియు స్మృతి కూడా ఆత్మయే చేస్తుంది. లౌకిక
తండ్రిని స్మృతి చేసినప్పుడు బుద్ధి శరీరము వైపు ఉంటుంది. ఈ బాబా (బ్రహ్మా) వారిని
(శివబాబాను) స్మృతి చేసినప్పుడు, ఓ బాబా (తండ్రి)! అని అంటారు. వాస్తవానికి ఇద్దరూ
బాబాలే (తండ్రులే). బాబా (తండ్రి) అన్నది సరైన పదము. వీరు కూడా తండ్రియే, వారు కూడా
తండ్రియే. ఆత్మ ఆ ఆత్మిక తండ్రిని స్మృతి చేసినప్పుడు బుద్ధి అక్కడకు వెళ్తుంది. ఈ
విషయాన్ని తండ్రి కూర్చుని పిల్లలకు అర్థం చేయిస్తారు. ఇప్పుడు మీకు తెలుసు, బాబా
వచ్చి ఉన్నారు, వారు మనల్ని తమవారిగా చేసుకున్నారు. తండ్రి అంటారు, మొట్టమొదట నేను
మిమ్మల్ని స్వర్గములోకి పంపించాను. మీరు చాలా-చాలా షావుకార్లుగా ఉండేవారు, తర్వాత
84 జన్మలు తీసుకుని డ్రామా ప్లాన్ అనుసారముగా ఇప్పుడు మీరు దుఃఖితులుగా అయ్యారు.
ఇప్పుడు డ్రామానుసారముగా పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది. మీ ఆత్మ మరియు శరీరమనే
వస్త్రము, రెండూ సతోప్రధానముగా ఉండేవి, ఆ తర్వాత బంగారు యుగము నుండి వెండి యుగములోకి
ఆత్మ వచ్చినప్పుడు శరీరము కూడా వెండి యుగములోకి వచ్చింది, ఆ తర్వాత రాగి యుగములోకి
వచ్చింది. ఇప్పుడైతే మీ ఆత్మ పూర్తిగా పతితమైపోయింది కావున శరీరము కూడా పతితముగా
ఉంది. ఉదాహరణకు 14 క్యారట్ల బంగారాన్ని ఎవరూ ఇష్టపడరు కదా. అది నల్లగా అయిపోతుంది.
మీరు కూడా ఇప్పుడు నల్లగా, ఇనుప యుగము వారిగా అయిపోయారు. ఇప్పుడు నల్లగా అయిపోయిన
ఆత్మ మరియు శరీరము, మళ్ళీ పవిత్రముగా ఎలా అవుతాయి. ఆత్మ పవిత్రముగా అయితే శరీరము
కూడా పవిత్రమైనది లభిస్తుంది. అది ఎలా జరుగుతుంది? గంగా స్నానాలు చేయడము ద్వారా
జరుగుతుందా? లేదు. ఓ పతిత-పావనా... అని పిలుస్తారు. ఇలా ఆత్మయే పిలుస్తుంది. ఓ బాబా!
అని అన్నప్పుడు బుద్ధి పారలౌకిక తండ్రి వైపుకు వెళ్ళిపోతుంది. బాబా అన్న పదము ఎంత
మధురమైనదో చూడండి. భారత్ లోనే బాబా-బాబా (తండ్రి-తండ్రి) అని అంటారు. ఇప్పుడు మీరు
ఆత్మాభిమానులుగా అయి బాబాకు చెందినవారిగా అయ్యారు. తండ్రి అంటారు - నేను మిమ్మల్ని
స్వర్గములోకి పంపించాను. మీరు కొత్త శరీరాన్ని ధారణ చేసారు. ఇప్పుడు మీరు ఎలా
అయిపోయారు. ఈ విషయాలు సదా లోలోపల ఉండాలి. బాబానే స్మృతి చేయాలి. స్మృతి కూడా
చేస్తారు కదా - ఓ బాబా, ఆత్మలమైన మేము పతితముగా అయిపోయాము, ఇప్పుడు మీరు వచ్చి
పావనముగా చేయండి అని. డ్రామాలో కూడా ఈ పాత్ర ఉంది కావుననే పిలుస్తారు. డ్రామా ప్లాన్
అనుసారముగా వారు రావడము కూడా - ఎప్పుడైతే పాత ప్రపంచము నుండి కొత్తదిగా అవ్వనున్నదో
అప్పుడు వస్తారు అనగా తప్పకుండా సంగమములోనే వస్తారు.
వీరు అతి ప్రియాతి ప్రియమైన బాబా అని పిల్లలైన మీకు నిశ్చయముంది. స్వీట్, స్వీటర్,
స్వీటెస్ట్ (మధురము, అతి మధురము, మధురాతి మధురము) అని అంటారు కూడా. ఇప్పుడు
మధురమైనవారు ఎవరు? లౌకిక సంబంధములో మొదట జన్మనిచ్చే తండ్రి, ఆ తర్వాత టీచర్, అతను
మంచివారు ఉంటారు, అతని ద్వారా చదువుకుని పదవిని పొందుతారు. జ్ఞానము సంపాదనకు ఆధారము
అని అంటారు. జ్ఞానము అంటే నాలెడ్జ్. యోగము అంటే స్మృతి. కావున ఏ అనంతమైన తండ్రి
అయితే మిమ్మల్ని స్వర్గానికి యజమానులుగా తయారుచేసారో, వారిని మీరు ఇప్పుడు
మర్చిపోయారు. శివబాబా ఎలా వచ్చారు అనేది ఎవరికీ తెలియదు. చిత్రాలలో కూడా స్పష్టముగా
చూపించారు. బ్రహ్మా ద్వారా స్థాపనను శివబాబా చేయిస్తారు. శ్రీకృష్ణుడు రాజయోగాన్ని
ఎలా నేర్పించగలరు? రాజయోగాన్ని నేర్పించేదే సత్యయుగము కోసము, కావున తప్పకుండా
సంగమములో తండ్రియే నేర్పించి ఉంటారు. సత్యయుగాన్ని స్థాపన చేసేవారు బాబా. శివబాబా
వీరి ద్వారా చేయిస్తారు, వారు చేసేవారు మరియు చేయించేవారు కదా. వాళ్ళు త్రిమూర్తి
బ్రహ్మా అని అంటారు. ఉన్నతోన్నతమైనవారు శివుడు కదా. వీరు సాకారుడు, వారు నిరాకారుడు.
సృష్టి కూడా ఇక్కడే ఉంది. ఈ సృష్టి చక్రమే తిరుగుతూ ఉంటుంది, రిపీట్ అవుతూ ఉంటుంది.
సూక్ష్మవతనము యొక్క సృష్టి చక్రము అని అనరు. మనుష్య ప్రపంచము యొక్క
చరిత్ర-భౌగోళికాలు రిపీట్ అవుతాయి. సూక్ష్మవతనములో చక్రము మొదలైనవేవీ ఉండవు. ప్రపంచ
చరిత్ర-భౌగోళికాలు రిపీట్ అవుతాయని గానము కూడా చేస్తారు, అది ఇక్కడి విషయమే.
సత్యయుగము, త్రేతాయుగము... మధ్యలో తప్పకుండా సంగమయుగము ఉండాలి. లేకపోతే కలియుగాన్ని
సత్యయుగముగా ఎవరు తయారుచేస్తారు. నరకవాసులను స్వర్గవాసులుగా తయారుచేయడానికి తండ్రి
సంగమములో వస్తారు. ఇది హైయ్యెస్ట్ అథారిటీ అయిన గాడ్ ఫాదర్లీ గవర్నమెంట్ (ఉన్నతోన్నతమైన
అథారిటీ అయిన ఈశ్వరుని ప్రభుత్వము). వీరితో పాటు ధర్మరాజు కూడా ఉన్నారు.
నిర్గుణుడినైన నాలో ఏ గుణమూ లేదని ఆత్మ అంటుంది. ఏ దేవతల మందిరానికి వెళ్ళినా, వారి
ఎదురుగా ఇలా అంటారు. వాస్తవానికి ఇలా తండ్రితో అనాలి. కానీ తండ్రిని వదిలి సోదరులను
(దేవతలను) పట్టుకున్నారు. ఈ దేవతలు సోదరులు కదా. సోదరుల నుండైతే ఏమీ లభించేది లేదు.
సోదరులను పూజిస్తూ, పూజిస్తూ కిందకు పడిపోతూ వచ్చారు. బాబా వచ్చి ఉన్నారని, వారి
ద్వారా మనకు వారసత్వము లభిస్తుందని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. తండ్రి గురించే
తెలియదు, సర్వవ్యాపి అని అనేస్తారు. కొందరు, వారు అఖండ జ్యోతి తత్వమని అంటారు.
కొందరు, వారు నామ-రూపాలకు అతీతమైనవారని అంటారు. వారు అఖండ జ్యోతి స్వరూపమైతే, మరి
వారిని నామ-రూపాలకు అతీతమైనవారని ఎలా అనగలరు. తండ్రి గురించి తెలియని కారణముగానే
పతితముగా అయిపోయారు. తమోప్రధానముగా కూడా అవ్వవలసిందే. మళ్ళీ ఎప్పుడైతే తండ్రి
వస్తారో, అప్పుడు అందరినీ సతోప్రధానముగా తయారుచేస్తారు. ఆత్మలన్నీ నిరాకారీ
ప్రపంచములో తండ్రితో పాటు ఉంటారు, ఆ తర్వాత ఇక్కడ సతో, రజో, తమోలలోకి వచ్చి పాత్రను
అభినయిస్తారు. ఆత్మయే తండ్రిని స్మృతి చేస్తుంది. తండ్రి వస్తారు కూడా, నేను బ్రహ్మా
తనువును ఆధారముగా తీసుకుంటానని వారు అంటారు కూడా. వీరు భాగ్యశాలి రథము. ఆత్మ లేకుండా
రథము ఉండదు. ఇది జ్ఞాన వర్షమని ఇప్పుడు పిల్లలైన మీకు అర్థం చేయించారు. ఇది జ్ఞానము,
దీని ద్వారా ఏమవుతుంది? పతిత ప్రపంచము నుండి పావన ప్రపంచముగా అవుతుంది. గంగా, యమునలు
సత్యయుగములో కూడా ఉంటాయి. శ్రీకృష్ణుడు యమునా నదీ తీరములో ఆడుకునేవారని అంటారు.
అటువంటి విషయాలేవీ లేవు. వారు సత్యయుగ రాకుమారుడు. వారిని చాలా బాగా సంభాళిస్తారు
ఎందుకంటే వారు పుష్పము కదా. పుష్పాలు ఎంత మంచిగా, సుందరముగా ఉంటాయి. అందరూ వచ్చి
పుష్పాల నుండి సుగంధము తీసుకుంటారు. ముళ్ళ నుండి సుగంధాన్ని తీసుకోరు. ఇప్పుడిది
ముళ్ళ ప్రపంచము. ముళ్ళ అడవిని తండ్రి వచ్చి పుష్పాల తోటగా తయారుచేస్తారు, అందుకే
వారికి బబుల్ నాథ్ అన్న పేరును కూడా పెట్టారు. వారు కూర్చుని ముళ్ళను పుష్పాలుగా
తయారుచేస్తారు, అందుకే ముళ్ళను పుష్పాలుగా తయారుచేసే బాబా అని వారిని మహిమ చేస్తారు.
ఇప్పుడు పిల్లలైన మీకు తండ్రి పట్ల ఎంత ప్రేమ ఉండాలి. ఆ లౌకిక తండ్రి అయితే
మిమ్మల్ని మురికి కాలువలో పడేస్తారు. ఈ తండ్రి 21 జన్మల కోసం మిమ్మల్ని మురికి
కాలువ నుండి బయటకు తీసి పావనముగా తయారుచేస్తారు. ఆ తండ్రి మిమ్మల్ని పతితముగా
చేస్తారు, కావుననే లౌకిక తండ్రి ఉన్నప్పటికీ ఆత్మ పారలౌకిక తండ్రిని స్మృతి
చేస్తుంది.
అర్ధకల్పము తండ్రిని స్మృతి చేసామని ఇప్పుడు మీకు తెలుసు. తండ్రి తప్పకుండా వస్తారు
కూడా. శివజయంతిని జరుపుకుంటారు కదా. మనము అనంతమైన తండ్రికి చెందినవారిగా అయ్యామని
మీకు తెలుసు. ఇప్పుడు మన సంబంధము వారితో కూడా ఉంది, అలాగే లౌకిక తండ్రితో కూడా ఉంది.
పారలౌకిక తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు పావనముగా అవుతారు. వారు మన లౌకిక తండ్రి
అని, వీరు మన పారలౌకిక తండ్రి అని ఆత్మకు తెలుసు. భక్తి మార్గములో కూడా ఇది ఆత్మకు
తెలుసు. అందుకే - ఓ భగవంతుడా, ఓ గాడ్ ఫాదర్ అని అంటారు. అవినాశీ తండ్రిని స్మృతి
చేస్తారు. ఆ తండ్రి వచ్చి స్వర్గాన్ని స్థాపన చేస్తారు. ఇది ఎవ్వరికీ తెలియదు.
శాస్త్రాలలోనైతే యుగాల ఆయువును చాలా ఎక్కువగా చూపించారు. తండ్రి వచ్చేదే పతితులను
పావనముగా చేయడానికి కావున వారు తప్పకుండా సంగమములోనే వస్తారు అన్నది ఎవరికీ ఆలోచన
రాదు. కల్పము ఆయువును లక్షల సంవత్సరాలని వ్రాసి మనుష్యులను పూర్తిగా ఘోర అంధకారములో
పడేసారు. తండ్రిని పొందేందుకని ఎదురుదెబ్బలు తింటూ ఉంటారు. చాలా భక్తి చేసినవారికి
భగవంతుడు లభిస్తారని అంటుంటారు. అందరికన్నా ఎక్కువ భక్తి చేసినవారికి తప్పకుండా
ముందు లభించాలి. తండ్రి లెక్కను కూడా తెలియజేసారు, అందరికన్నా ముందు మీరు భక్తి
చేస్తారు కావున మీకే మొట్టమొదట భగవంతుని ద్వారా జ్ఞానము లభించాలి, తద్వారా మీరే
మళ్ళీ కొత్త ప్రపంచములో రాజ్యము చేస్తారు. అనంతమైన తండ్రి పిల్లలైన మీకు జ్ఞానాన్ని
ఇస్తున్నారు. ఇందులో కష్టము యొక్క విషయమేమీ లేదు. తండ్రి అంటారు, మీరు అర్ధకల్పము
స్మృతి చేసారు. సుఖములోనైతే ఎవరూ స్మృతి చేయనే చేయరు. అంతిమములో ఎప్పుడైతే
దుఃఖితులుగా అవుతారో, అప్పుడు నేను వచ్చి సుఖవంతులుగా తయారుచేస్తాను. ఇప్పుడు మీరు
చాలా పెద్ద వ్యక్తులుగా అవుతారు. చూడండి, ముఖ్యమంత్రి, ప్రధానమంత్రి మొదలైనవారి
బంగళాలు ఎంత ఫస్ట్ క్లాస్ గా ఉంటాయి. ఆ ప్రపంచములో ఆవులు మొదలైనవి, మొత్తం ఫర్నీచర్
అంతా ఎంతో ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది. మీరైతే ఎంత పెద్ద వ్యక్తులుగా (దేవతలుగా)
అవుతారు. దైవీ గుణాలు కలిగిన దేవతలుగా, స్వర్గానికి యజమానులుగా అవుతారు. అక్కడ మీ
కొరకు మహళ్ళు కూడా వజ్ర-వైఢూర్యాలతో తయారుచేయబడి ఉంటాయి. అక్కడ మీ ఫర్నీచర్
బంగారముతో పొదగబడి ఫస్ట్ క్లాస్ గా ఉంటుంది. ఇక్కడైతే ఊయలలు మొదలైనవన్నీ పేదగా
ఉన్నాయి. అక్కడైతే అన్ని వస్తువులు ఫస్ట్ క్లాస్ గా వజ్ర-వైఢూర్యాలతో పొదగబడి ఉంటాయి.
ఇది రుద్ర జ్ఞాన యజ్ఞము. శివుడిని రుద్రుడని కూడా అంటారు. భక్తి పూర్తి అయినప్పుడు
భగవంతుడు రుద్ర యజ్ఞాన్ని రచిస్తారు. సత్యయుగములో యజ్ఞాలు లేక భక్తి అనే మాటలే ఉండవు.
ఈ సమయములోనే తండ్రి ఈ అవినాశీ రుద్ర జ్ఞాన యజ్ఞాన్ని రచిస్తారు, దీనికి తర్వాత
గాయనము జరుగుతుంది. భక్తి అయితే సదా కొనసాగుతూ ఉండదు. భక్తి మరియు జ్ఞానము. భక్తి
రాత్రి, జ్ఞానము పగలు. తండ్రి వచ్చి పగలుగా చేస్తారు కావున పిల్లలకు తండ్రి పట్ల
ఎంత ప్రేమ ఉండాలి. బాబా మనల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు. వారు అతి
ప్రియాతి ప్రియమైన తండ్రి. వారి కన్నా ప్రియమైన వస్తువు ఇంకేదీ ఉండదు. బాబా, మీరు
వచ్చి మా దుఃఖాలను హరించండి అని అర్ధకల్పము నుండి స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు
తండ్రి వచ్చారు. మీరు మీ గృహస్థ వ్యవహారములో ఉండవలసిందేనని బాబా అర్థం చేయిస్తారు.
ఇక్కడ బాబా వద్ద ఎంత కాలమని కూర్చుంటారు. తండ్రితో పాటు అయితే పరంధామములోనే ఉండగలరు.
ఇక్కడ ఇంతమంది పిల్లలైతే ఉండలేరు. టీచర్ ప్రశ్నలను ఎలా అడగగలరు. లౌడ్ స్పీకర్ లో
రెస్పాన్స్ (సమాధానము) ఎలా ఇవ్వగలరు, అందుకే కొద్ది-కొద్దిమంది విద్యార్థులనే
చదివిస్తారు. కాలేజీలైతే ఎన్నో ఉంటాయి, తర్వాత అందరికీ పరీక్షలు జరుగుతాయి. లిస్ట్
వెలువడుతుంది. ఇక్కడైతే ఒక్క తండ్రే చదివిస్తారు. దుఃఖములో అందరూ ఆ పారలౌకిక
తండ్రిని స్మరిస్తారని కూడా అర్థం చేయించాలి. ఇప్పుడు ఆ తండ్రి వచ్చి ఉన్నారు.
మహాభారీ మహాభారత యుద్ధము కూడా ఎదురుగా నిలబడి ఉంది. మహాభారత యుద్ధములో శ్రీకృష్ణుడు
వచ్చారని వారు భావిస్తారు. కానీ అది జరగదు. పాపం వారు తికమకపడి ఉన్నారు కదా. అయినా
కూడా కృష్ణ-కృష్ణ అని తలచుకుంటూ ఉంటారు. ఇప్పుడు అతి ప్రియాతి ప్రియమైనవారు శివుడు
కూడా, అలాగే శ్రీకృష్ణుడు కూడా. కానీ వారు నిరాకారుడు, ఇతను సాకారుడు. నిరాకార
తండ్రి ఆత్మలందరికీ తండ్రి. వాస్తవానికి ఇద్దరూ అతి ప్రియాతి ప్రియమైనవారే.
శ్రీకృష్ణుడు కూడా విశ్వానికి యజమానియే కదా. ఎక్కువ ప్రియమైనవారు ఎవరు అన్నది
ఇప్పుడు మీరు నిర్ణయించుకోగలరు. శివబాబాయే ఈ విధముగా యోగ్యులుగా తయారుచేస్తారు కదా.
శ్రీకృష్ణుడు ఏం చేస్తారు? తండ్రియే శ్రీకృష్ణుడిని ఆ విధముగా తయారుచేస్తారు కావున
గాయనము కూడా ఎక్కువగా ఆ తండ్రికే జరగాలి. శంకరుని నృత్యాన్ని చూపిస్తారు.
వాస్తవానికి నృత్యము మొదలైనవాటి విషయమేమీ లేదు. తండ్రి అర్థం చేయించారు, మీరందరూ
పార్వతులు. ఈ అమరనాథుడైన శివుడు మీకు కథను వినిపిస్తున్నారు. అది నిర్వికారీ
ప్రపంచము. అక్కడ వికారాల విషయమేమీ ఉండదు. తండ్రి వికారీ ప్రపంచాన్ని రచించరు.
వికారాలలోనే దుఃఖము ఉంది. మనుష్యులు హఠయోగము మొదలైనవి చాలా నేర్చుకుంటారు. గుహలలోకి
వెళ్ళి కూర్చుంటారు, అగ్నిని కూడా దాటి వెళ్తారు. రిద్ధి-సిద్ధి కూడా ఎంతో ఉంది.
ఇంద్రజాలముతో ఎన్నో వస్తువులను బయటకు తీస్తూ ఉంటారు. భగవంతుడిని కూడా ఇంద్రజాలికుడు,
రత్నాకరుడు, వ్యాపారస్థుడు అని అంటారు, కావున తప్పకుండా వారు చైతన్యమైనవారు కదా.
నేను వస్తాను అని కూడా వారు అంటారు, వారు ఇంద్రజాలికుడు కదా. మనుష్యులను దేవతలుగా,
బికారుల నుండి రాకుమారులుగా తయారుచేస్తారు. ఇటువంటి ఇంద్రజాలాన్ని ఎప్పుడైనా చూసారా.
అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. పుష్పాలతోటలోకి వెళ్ళాలి, అందుకే సుగంధభరితమైన పుష్పాలుగా అవ్వాలి. ఎవ్వరికీ
దుఃఖమునివ్వకూడదు. ఒక్క పారలౌకిక తండ్రితోనే సర్వ సంబంధాలను జోడించాలి.
2. శివబాబా ప్రియాతి ప్రియమైనవారు, వారొక్కరినే ప్రేమించాలి. సుఖదాత అయిన
తండ్రిని స్మృతి చేయాలి.
వరదానము:-
ఎవరి లోపాలను, బలహీనతలను చూడకుండా తమలో ఉన్న గుణాలు మరియు
శక్తుల యొక్క సహయోగాన్ని ఇచ్చే మాస్టర్ దాత భవ
మాస్టర్ దాత ఎవరంటే - ఎవరైతే ఆత్మలందరూ మా సమానముగా
వారసత్వానికి అధికారులుగా అయిపోవాలి అని సదా ఇదే ఆత్మిక భావనలో ఉంటారో వారు. వారు
ఎవరి లోపాలను, బలహీనతలను చూడకుండా తాము ధారణ చేసిన గుణాలు మరియు శక్తుల యొక్క
సహయోగాన్ని ఇస్తారు. వీరు ఇలాగే ఉంటారు అన్న భావనకు బదులుగా నేను వీరిని కూడా తండ్రి
సమానముగా తయారుచేయాలి అన్న శుభభావన ఉండాలి. అలాగే ఇదే శ్రేష్ఠ కామన ఉండాలి - ఈ
ఆత్మలందరూ పేదరికము, దుఃఖము, అశాంతి నుండి సదా శాంతిగా, సుఖ స్వరూపముగా,
సుసంపన్నముగా అయిపోవాలి అని. అప్పుడే మాస్టర్ దాత
స్లోగన్:-
మనసా,
వాచా, కర్మణా సేవ చేసేవారే నిరంతర సేవాధారులు, వారి ప్రతి శ్వాసలోనూ సేవ ఇమిడి ఉంది.
అవ్యక్త ప్రేరణలు - ఈ
అవ్యక్తీ మాసములో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవము చేయండి
మొదట మీ దేహము నుండి,
దేహ సంబంధాల నుండి మరియు పాత ప్రపంచపు స్మృతుల నుండి ముక్తులుగా అవ్వండి. ఎప్పుడైతే
ఈ ముక్తి యొక్క అవస్థను అనుభవము చేస్తారో, అప్పుడు ముక్తులుగా అయిన తరువాత
జీవన్ముక్తి యొక్క అనుభవము స్వతహాగానే జరుగుతుంది. కనుక చెక్ చేసుకోండి - జీవితములో
ఉంటూ దేహము, దేహ సంబంధాలు మరియు పాత ప్రపంచపు ఆకర్షణల నుండి ఎంతవరకు ముక్తులుగా
అయ్యారు?
| | | |