28-08-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడు మీ పిలుపును వినడం జరిగింది, మీరు ఈ పురుషోత్తమ సంగమయుగములో ఉత్తమోత్తమ పురుషులుగా తయారవుతున్న ఆ రోజు చివరికి రానే వచ్చింది’’

ప్రశ్న:-
గెలుపు-ఓటములకు సంబంధించిన ఏ భ్రష్ట కర్మ మనుష్యులను దుఃఖితులుగా చేస్తుంది?

జవాబు:-
‘‘జూదము’’. చాలామంది మనుష్యులలో జూదము ఆడే అలవాటు ఉంటుంది, ఇది భ్రష్ట కర్మ ఎందుకంటే ఓడిపోతే దుఃఖము, గెలిస్తే సంతోషము కలుగుతుంది. పిల్లలైన మీకు తండ్రి ఇస్తున్న ఆజ్ఞ ఏమిటంటే - పిల్లలూ, దైవీ కర్మలు చేయండి. సమయము వృధా అయ్యేటువంటి కర్మలేవీ చేయకూడదు. సదా అనంతమైన గెలుపును పొందేందుకు పురుషార్థము చేయండి.

పాట:-
చివరికి ఆ రోజు నేడు వచ్చింది...

ఓంశాంతి
డబుల్ ఓం శాంతి. పిల్లలైన మీరు కూడా ఓం శాంతి అని అనవలసి ఉంటుంది. ఇక్కడ డబుల్ ఓం శాంతి అని అనడం జరుగుతుంది. ఒకటి - సుప్రీమ్ ఆత్మ అయిన శివబాబా ఓం శాంతి అని అంటారు, రెండు - ఈ దాదా కూడా ఓం శాంతి అని అంటారు. అలాగే పిల్లలైన మీరు కూడా - ఆత్మనైన నేను శాంతి స్వరూపాన్ని అని అంటారు. మీరు ఉండేది కూడా శాంతి దేశములోనే. ఇక్కడ ఈ స్థూలదేశములో పాత్రను అభినయించేందుకు వచ్చారు. ఈ విషయాలను ఆత్మలు మర్చిపోయాయి. ఇప్పుడు ఇక పిల్లలైన మీ పిలుపును వినే ఆ రోజు చివరికి తప్పకుండా వచ్చింది. ఏ పిలుపును వినడం జరుగుతుంది? బాబా, దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇవ్వండి అని అంటారు కదా. ప్రతి మనిషి సుఖ-శాంతులనే ఇష్టపడతారు. బాబా ఉన్నది కూడా పేదల పాలిటి పెన్నిధిగా. ఈ సమయములో భారత్ పూర్తిగా నిరుపేదగా ఉంది. ఒకప్పుడు మేము పూర్తిగా షావుకారులుగా ఉండేవారమని పిల్లలకు తెలుసు. ఇది కూడా బ్రాహ్మణ పిల్లలైన మీకే తెలుసు, మిగిలినవారంతా అడవిలో ఉన్నారు. పిల్లలైన మీకు కూడా నంబరువారు పురుషార్థానుసారముగా నిశ్చయము ఉంది. బాబా శ్రీ శ్రీ (శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనవారు) అని మీకు తెలుసు, వారి మతము కూడా శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనది. భగవానువాచ ఉంది కదా. మనుష్యులైతే రామా, రామా అని ఏ విధముగా జపిస్తూ ఉంటారంటే వాయిద్యము మోగుతున్నట్లుగా ఉంటుంది. వాస్తవానికి రాముడు అయితే త్రేతాయుగములోని రాజు, అతడి మహిమ ఉన్నతముగా ఉండేది. అతడికి 14 కళలు ఉండేవి. రెండు కళలు తక్కువగా ఉంటాయి. కానీ, అతని విషయములో కూడా ఈ గాయనముంది - రాముని రాజ్యములో ప్రజలు కూడా షావుకారులే మరియు ఆ నగరములో అందరూ దాతలే కాబట్టి ధర్మానికి సదా ఉపకారము జరుగుతుంది అని. మీరు షావుకారులుగా అవుతారు కదా. రాముడి కన్నా పెద్ద షావుకారులుగా లక్ష్మీ-నారాయణులు ఉంటారు. రాజును అన్నదాత అని అంటారు. తండ్రి కూడా దాతయే, వారు తమ సర్వస్వాన్ని ఇస్తారు, వారు పిల్లల్ని విశ్వానికి యజమానులుగా తయారుచేస్తారు. పాపము చేయవలసి వచ్చేందుకు అక్కడ అప్రాప్తి అనే వస్తువేదీ ఉండదు. అక్కడ పాపము అన్న పేరే ఉండదు. అర్ధకల్పము దైవీ రాజ్యము ఉంటుంది, మళ్ళీ అర్ధకల్పము ఆసురీ రాజ్యము ఉంటుంది. ఎవరిలోనైతే దేహాభిమానము ఉంటుందో మరియు పంచ వికారాలు ఉంటాయో వారినే అసురులు అని అంటారు.

ఇప్పుడు మీరు నావికుడు మరియు తోట యజమాని వద్దకు వచ్చారు. మనము డైరెక్టుగా వారి వద్దే కూర్చున్నామని మీకు తెలుసు. పిల్లలైన మీరు కూడా కూర్చుని ఉంటుండగానే మర్చిపోతారు. భగవంతుడు ఏ ఆజ్ఞనైతే ఇస్తారో అది పాటించాలి కదా. మొట్టమొదటగా వారు - శ్రేష్ఠాతి శ్రేష్ఠముగా తయారుచేసేందుకు శ్రీమతాన్ని ఇస్తారు. కావున వారి మతముపై నడవాలి కదా. మొట్టమొదటగా దేహీ-అభిమానులుగా అవ్వండి అన్న మతాన్ని (డైరెక్షన్ ను) ఇస్తారు. బాబా ఆత్మలైన మనల్ని చదివిస్తారు. ఈ విషయాన్ని పక్కాగా గుర్తుంచుకోండి. ఈ విషయాన్ని గుర్తుంచుకున్నట్లయితే నావ తీరానికి చేరుతుంది. మీరే 84 జన్మలు తీసుకుంటారు, మీరే తమోప్రధానుల నుండి సతోప్రధానులుగా అవుతారు అని పిల్లలకు అర్థం చేయించారు. ఈ ప్రపంచమైతే పతితముగా, దుఃఖములో ఉంది. స్వర్గాన్ని సుఖధామము అని అంటారు. భగవంతుడైన శివబాబా మనల్ని చదివిస్తున్నారని పిల్లలకు తెలుసు. వారికి మనము విద్యార్థులము. వారు తండ్రి కూడా మరియు టీచరు కూడా, కావున చదువుకోవడము కూడా బాగా చదువుకోవాలి. దైవీ కర్మలు కూడా కావాలి. ఏ విధమైన భ్రష్ట కర్మలు చేయకూడదు. భ్రష్ట కర్మలలో జూదము కూడా వస్తుంది. ఇది కూడా దుఃఖము ఇస్తుంది. ఓడిపోతే దుఃఖము కలుగుతుంది, గెలిస్తే సంతోషము కలుగుతుంది. ఇప్పుడు పిల్లలైన మీరు మాయతో అనంతమైన ఓటమిని పొందారు. ఇది ఉన్నదే అనంతమైన గెలుపు-ఓటముల ఆట. పంచ వికారాల రూపీ రావణుడి చేతిలో ఓటమిని పొందడమే ఓడిపోవడము, అతనిపై గెలుపొందాలి. మాయతో ఓడిపోవడమే ఓటమి. ఇప్పుడు పిల్లలైన మీ గెలుపు జరగనున్నది. ఇప్పుడు మీరు కూడా జూదము మొదలైనవాటినన్నింటినీ వదిలేయాలి. ఇప్పుడు అనంతమైన గెలుపును పొందడము పట్ల పూర్తి అటెన్షన్ ఉంచాలి. ఏ విధమైన చెడు కర్మను చేయకూడదు, సమయాన్ని వృధా చేయకూడదు. అనంతమైన గెలుపును పొందేందుకు పురుషార్థము చేయాలి. చేయించే తండ్రి సమర్థుడు. వారు సర్వశక్తివంతుడు. కేవలం తండ్రి మాత్రమే సర్వశక్తివంతుడు కారు, రావణుడు కూడా సర్వశక్తివంతుడే. అర్ధకల్పము రావణ రాజ్యము, అర్ధకల్పము రామ రాజ్యము ఉంటాయి. ఇప్పుడు మీరు రావణుడిపై విజయము పొందుతారు. ఇప్పుడు ఇక ఆ హద్దులోని విషయాలను వదిలి అనంతములోకి వచ్చేయాలి. నావికుడు వచ్చారు. చివరికి ఆ రోజు రానే వచ్చింది కదా. ఉన్నతోన్నమైన తండ్రి వద్ద మీ పిలుపు వినడం జరుగుతుంది. తండ్రి అంటారు - పిల్లలూ, మీరు అర్ధకల్పము ఎన్నో ఎదురుదెబ్బలు తిన్నారు, పతితముగా అయ్యారు. పావనమైన భారత్ శివాలయముగా ఉండేది. మీరు శివాలయములో ఉండేవారు, ఇప్పుడు మీరు వేశ్యాలయములో ఉన్నారు. మీరు శివాలయములో ఉన్నవారిని పూజిస్తారు. ఇక్కడ ఈ అనేక ధర్మాల అలజడి ఎంతగా ఉంది. తండ్రి అంటారు, వీటినన్నింటినీ నేను అంతము చేస్తాను. అన్నీ వినాశనమవ్వవల్సిందే. ఇతర ధర్మస్థాపకులెవ్వరూ వినాశనము చేయరు, అలాగే వారు సద్గతినిచ్చే గురువులు కూడా కారు. సద్గతి అనేది జ్ఞానము ద్వారానే లభిస్తుంది. జ్ఞానసాగరుడైన తండ్రియే సర్వుల సద్గతిదాత. ఈ పదాలను బాగా నోట్ చేసుకోండి. చాలామంది ఎలా ఉన్నారంటే, ఇక్కడ అంతా వింటారు, బయటికి వెళ్తే ఇక్కడి విషయాలు ఇక్కడే ఉండిపోతాయి. ఉదాహరణకు గర్భజైలులో ఉన్నప్పుడు - మేము ఇంకెప్పుడూ పాపము చేయము అని అంటారు కదా, కానీ బయటికి రాగానే ఇక అక్కడిది అక్కడే ఉండిపోతుంది. కాస్త ఎదగగానే పాపాలు చేయడము మొదలుపెడతారు. కామ ఖడ్గాన్ని ఉపయోగిస్తారు. సత్యయుగములోనైతే గర్భము కూడా మహలులా ఉంటుంది. తండ్రి కూర్చుని అర్థం చేయిస్తున్నారు - చివరికి ఆ రోజు రానే వచ్చింది. ఏ రోజు? పురుషోత్తమ సంగమయుగము యొక్క రోజు, దీని గురించి ఎవ్వరికీ తెలియదు. మేము పురుషోత్తములుగా తయారవుతామని పిల్లలు భావిస్తారు. ఉత్తమోత్తమ పురుషులుగా మనమే ఉండేవారము, అప్పుడు శ్రేష్ఠాతి శ్రేష్ఠమైన ధర్మము ఉండేది, కర్మలు కూడా శ్రేష్ఠాతి శ్రేష్ఠముగా ఉండేవి, అక్కడ రావణ రాజ్యమే ఉండదు. తండ్రి చదివించడానికి వచ్చే ఆ రోజు చివరికి రానే వచ్చింది. వారే పతిత-పావనుడు. కావున ఇటువంటి తండ్రి శ్రీమతముపై నడవాలి కదా. ఇప్పుడు ఇది కలియుగ అంతిమము. పావనముగా తయారయ్యేందకు కొంత సమయమైతే కావాలి కదా. 60 సంవత్సరాల తరువాత వానప్రస్థము అని అంటారు. 60వ ఏడు నుండి చేతి కర్ర పట్టుకోవలసి ఉంటుంది అని అంటారు. కానీ ఇప్పుడు చూడండి, 80 సంవత్సరాలు వచ్చినవారు కూడా వికారాలను వదలరు. తండ్రి అంటారు, నేను ఇతని వానప్రస్థావస్థలో ప్రవేశించి ఇతనికి అర్థం చేయిస్తాను. ఆత్మయే పవిత్రముగా అయి ఆవలి తీరానికి చేరుకుంటుంది. ఆత్మయే ఎగురుతుంది. ఇప్పుడు ఆత్మ రెక్కలు విరిగిపోయాయి, ఇక ఎగరలేదు. రావణుడు రెక్కలను తెంచేసాడు. ఆత్మ పతితముగా అయిపోయింది. ఒక్కరు కూడా తిరిగి వెళ్ళలేరు. మొదటైతే సుప్రీమ్ తండ్రి వెళ్ళాలి. శివుని ఊరేగింపు అని అంటారు కదా. శంకరునికి ఊరేగింపు ఉండదు. తండ్రి వెనుక పిల్లలైన మనమంతా వెళ్తాము. మనల్ని తీసుకువెళ్ళేందుకు బాబా వచ్చారు. శరీర సహితముగానైతే తీసుకునివెళ్ళరు కదా. ఆత్మలన్నీ పతితముగా ఉన్నాయి. ఎప్పటివరకైతే పవిత్రముగా అవ్వరో అప్పటివరకు తిరిగి వెళ్ళలేరు. పవిత్రత ఉన్నప్పుడు సుఖము, సంపన్నత ఉండేవి. అప్పుడు కేవలము ఆది సనాతన దేవీ-దేవతా ధర్మానికి చెందిన మీరు మాత్రమే ఉండేవారు. ఇప్పుడు ఇతర ధర్మాలవారందరూ ఉన్నారు, దేవతా ధర్మము లేదు. దీనిని కల్పవృక్షము అని అంటారు. దీనిని మర్రివృక్షముతో పోలుస్తారు, దానికి కాండము లేదు, మిగిలిన వృక్షమంతా ఉంది. అదే విధముగా ఈ దేవీ-దేవతా ధర్మము యొక్క కాండము కూడా లేదు, మిగిలిన వృక్షమంతా నిలబడి ఉంది. దేవీ-దేవతా ధర్మము ఒకప్పుడు ఉండేది, కానీ ఇప్పుడది కనుమరుగైపోయింది, మళ్ళీ అది రిపీట్ అవుతుంది. తండ్రి అంటారు, నేను ఏక ధర్మ స్థాపన చేసేందుకు మళ్ళీ వస్తాను, ఆ తరువాత మిగిలిన ధర్మాలన్నీ వినాశనమైపోతాయి. లేకపోతే సృష్టిచక్రము ఎలా తిరుగుతుంది? ప్రపంచ చరిత్ర-భౌగోళికములు రిపీట్ అవుతాయని అంటారు కూడా. ఇప్పుడు ఇది పాత ప్రపంచము, మళ్ళీ కొత్త ప్రపంచము రిపీట్ అవ్వనున్నది. ఈ పాత ప్రపంచము మారి కొత్త ప్రపంచ స్థాపన అవుతోంది. ఇదే భారత్ కొత్తది నుండి పాతదిగా అవుతుంది. యమునా నదీ తీరముపై పరిస్తాన్ ఉండేది అని అంటారు. బాబా అంటారు, మీరు కామచితిపై కూర్చుని స్మశానవాసులుగా అయిపోయారు, మళ్ళీ మిమ్మల్ని పరిస్తాన్ వానులుగా తయారుచేస్తాను. శ్రీకృష్ణుడిని శ్యామసుందరుడు అని అంటారు - ఎందుకు? ఈ విషయము ఎవ్వరి బుద్ధిలోనూ ఉండదు. పేరైతే బాగుంది కదా. రాధా-కృష్ణులు - వీరు కొత్త ప్రపంచపు యువరాణీ, యువరాజులు. తండ్రి అంటారు, కామ చితిపై కూర్చోవడం వలన ఇనుపయుగములో ఉన్నారు. సాగరుని పిల్లలు కామచితిపై దగ్ధమయ్యారు అని అంటూ ఉంటారు కూడా. ఇప్పుడు తండ్రి అందరిపైనా జ్ఞాన వర్షాన్ని కురిపిస్తారు. అప్పుడు అందరూ బంగారుయుగములోకి వెళ్ళిపోతారు. ఇప్పుడు ఇది సంగమయుగము. మీకు అవినాశీ జ్ఞాన రత్నాల దానము లభిస్తుంది, దాని ద్వారా మీరు షావుకారులుగా అవుతారు. ఈ ఒక్కొక్క రత్నము లక్షల రూపాయలు విలువ చేస్తుంది. వారు శాస్త్రాలలోని వాక్యాలు లక్షల రుపాయలు విలువ చేస్తాయని భావిస్తారు. పిల్లలైన మీరు ఈ చదువు ద్వారా పదమపతులుగా అవుతారు. చదువు సంపాదనకు ఆధారము కదా. ఈ జ్ఞాన రత్నాలను మీరు ధారణ చేస్తారు, మీ జోలిని నింపుకుంటారు. కానీ వారు శంకరుని విషయములో - ఓ బమ్-బమ్ మహాదేవ్, జోలిని నింపండి అని అంటారు. శంకరునిపై ఎన్ని నిందలు మోపారు. బ్రహ్మా మరియు విష్ణువు పాత్ర ఇక్కడ ఉంది. 84 జన్మలు కలవారు అని విష్ణువును కూడా అంటారు, అలాగే లక్ష్మీ-నారాయణులను కూడా అంటారు. మీరు బ్రహ్మాకు కూడా 84 జన్మలు ఉంటాయని అంటారు. రైట్ ఏమిటి, రాంగ్ ఏమిటి, బ్రహ్మా మరియు విష్ణువు యొక్క పాత్ర ఏమిటి అనేది తండ్రి కూర్చుని అర్థం చేయిస్తారు. మీరే దేవతలుగా ఉండేవారు, మళ్ళీ చక్రములో తిరుగుతూ బ్రాహ్మణులుగా అయ్యారు, ఇప్పుడు మళ్ళీ దేవతలుగా అవుతారు. పాత్ర అంతా ఇక్కడే జరుగుతుంది. వైకుంఠపు ఆట-పాటలను చూస్తారు. ఇక్కడైతే వైకుంఠము లేదు. మీరా నాట్యము చేసేవారు, వాటన్నింటినీ సాక్షాత్కారాలు అని అంటారు. మీరాకు ఎంత పేరు ఉంది! ఆమెకు సాక్షాత్కారము కలిగింది, శ్రీకృష్ణునితో నాట్యము చేసారు, కానీ దాని వలన ఏమి జరిగింది, స్వర్గములోకైతే వెళ్ళలేదు కదా. గతి-సద్గతులైతే సంగమయుగములోనే లభించగలవు. ఈ పురుషోత్తమ సంగమయుగము గురించి మీరు అర్థం చేసుకుంటారు. మనము బాబా ద్వారా ఇప్పుడు మనుష్యుల నుండి దేవతలుగా తయారవుతున్నాము. విరాట రూపము యొక్క జ్ఞానము కూడా కావాలి కదా. చిత్రాలు పెట్టుకుంటారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. అకాసుర్, బకాసుర్, ఇవన్నీ ఈ సంగమయుగపు పేర్లు. భస్మాసుర అన్న పేరు కూడా ఉంది. కామ చితిపై కూర్చుని భస్మమైపోయారు. ఇప్పుడు తండ్రి అంటారు - నేను అందరినీ మళ్ళీ జ్ఞాన చితిపై కూర్చోబెట్టి తీసుకువెళ్తాను. ఆత్మలన్నీ పరస్పరము సోదరులు. హిందువులు, చైనీయులు భాయి-భాయి, హిందు-ముస్లిమ్ భాయి-భాయి అని అంటూ ఉంటారు కూడా. కానీ ఇప్పుడు సోదరులు కూడా పరస్పరము కొట్లాడుకుంటూ ఉంటారు. కర్మ అయితే ఆత్మయే చేస్తుంది కదా. శరీరము ద్వారా ఆత్మ యుద్ధము చేస్తుంది. పాపము కూడా ఆత్మకే అంటుకుంటుంది, కావుననే పాపాత్మ అని అంటారు. తండ్రి కూర్చుని ఎంత ప్రేమగా అర్థం చేయిస్తున్నారు. పిల్లలూ, పిల్లలూ అని సంబోధించే హక్కు శివబాబాకు మరియు బ్రహ్మాబాబాకు, ఇరువురికీ ఉంది. దాదా ద్వారా తండ్రి - ఓ పిల్లలూ అని సంబోధిస్తారు! ఆత్మలమైన మనము ఇక్కడికి వచ్చి పాత్రను అభినయిస్తాము అని మీరు అర్థం చేసుకుంటారు కదా. మళ్ళీ అంతిమములో తండ్రి వచ్చి అందరినీ పవిత్రముగా తయారుచేసి తమతోపాటు తీసుకువెళ్తారు. తండ్రియే వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. వారు రావడము కూడా ఇక్కడికే వస్తారు. శివజయంతిని కూడా జరుపుకుంటారు. శివజయంతి తరువాత మళ్ళీ కృష్ణజయంతి ఉంటుంది. శ్రీకృష్ణుడే మళ్ళీ శ్రీనారాయణుడిగా అవుతారు, ఆ తరువాత చక్రములో తిరుగుతూ అంతిమములో నల్లగా (పతితముగా) అవుతారు. తండ్రి వచ్చి మళ్ళీ తెల్లగా తయారుచేస్తారు. బ్రాహ్మణులైన మీరే మళ్ళీ దేవతలుగా అవుతారు. మళ్ళీ మెట్లు దిగుతారు. ఈ 84 జన్మల లెక్క ఇంకెవ్వరి బుద్ధిలోనూ ఉండదు. తండ్రియే పిల్లలకు అర్థం చేయిస్తారు. చివరికి భక్తుల పిలుపును వినడం జరుగుతుంది అని పాటలో కూడా విన్నారు. ఓ భగవంతుడా, వచ్చి మాకు భక్తి ఫలాన్ని ఇవ్వండి అని పిలుస్తారు కూడా. ఫలమును ఇచ్చేది భక్తి కాదు, ఫలమును ఇచ్చేది భగవంతుడు. వారు వచ్చి భక్తులను దేవతలుగా తయారుచేస్తారు. చాలా భక్తిని మీరే చేసారు. మొట్టమొదట మీరే శివుని భక్తిని చేసారు. ఎవరైతే ఈ విషయాలను బాగా అర్థం చేసుకుంటారో, వారు మన కులానికి చెందినవారని మీరు భావిస్తారు. ఎవరి బుద్ధిలోనైనా ఈ విషయాలు నిలవకపోతే, వారు ఎక్కువ భక్తి చేయలేదని, చివరిలో వచ్చారని అర్థం చేసుకోండి. వారు ఇక్కడకు కూడా మొదట రారు. ఇది ఒక లెక్క. ఎవరైతే చాలా భక్తి చేస్తారో వారికి చాలా ఫలము లభిస్తుంది. కొద్దిగా భక్తి చేస్తే ఫలము కూడా కొద్దిగానే లభిస్తుంది. వారు స్వర్గ సుఖాలను అనుభవించలేరు, ఎందుకంటే ప్రారంభములో శివుని భక్తిని కొద్దిగానే చేసారు. మీ బుద్ధి ఇప్పుడు పని చేస్తోంది. బాబా భిన్న-భిన్న యుక్తులను ఎన్నో అర్థం చేయిస్తారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. అవినాశీ జ్ఞాన రత్నాలు ఒక్కొక్కటీ పదమాలతో సమానమైనవి, వీటితో మీ జోలిని నింపుకుని బుద్ధిలో ధారణ చేసి ఆ తరువాత దానము చేయాలి.

2. శ్రీ శ్రీ యొక్క శ్రేష్ఠ మతముపై పూర్తిగా నడుచుకోవాలి. ఆత్మను సతోప్రధానముగా తయారుచేసుకునేందుకు దేహీ-అభిమానులుగా అయ్యే పూర్తి పురుషార్థాన్ని చేయాలి.

వరదానము:-
సర్వుల పట్ల శుభ భావమును మరియు శ్రేష్ఠ భావనను ధారణ చేసే హంస బుద్ధి కల హోలీహంస భవ

హంస బుద్ధి అనగా సదా ప్రతి ఆత్మ పట్ల శ్రేష్ఠముగా మరియు శుభముగా ఆలోచించేవారు. వారు మొదట ప్రతి ఆత్మ యొక్క భావాన్ని పరిశీలిస్తారు, ఆ తరువాత ధారణ చేస్తారు. ఎప్పుడూ కూడా బుద్ధిలో ఏ ఆత్మ పట్ల అశుభమైన లేక సాధారణ భావము ధారణ అవ్వకూడదు. సదా శుభ భావమును మరియు శుభ భావనను ఉంచుకునేవారే హోలీహంసలు. వారు ఏ ఆత్మ యొక్క అకళ్యాణ విషయాలనైనా వింటూ-చూస్తూ కూడా, ఆ అకళ్యాణాన్ని తమ కళ్యాణ వృత్తితో పరివర్తన చేస్తారు. వారి దృష్టి ప్రతి ఆత్మ పట్ల శ్రేష్ఠమైనదిగా, శుద్ధమైనది, స్నేహముతో కూడినదిగా ఉంటుంది.

స్లోగన్:-
ప్రేమతో నిండుగా ఉన్న ఎటువంటి గంగగా అవ్వండంటే మీ ద్వారా ప్రేమసాగరుడైన తండ్రి కనిపించాలి.

అవ్యక్త ప్రేరణలు - సహజయోగులుగా అవ్వాలంటే పరమాత్మ ప్రేమ యొక్క అనుభవజ్ఞులుగా అవ్వండి

కొంతమంది భక్తాత్మలు ప్రభు ప్రేమలో లీనమవ్వాలని కోరుకుంటారు, మరికొంతమంది జ్యోతిలో లీనమవ్వాలని కోరుకుంటారు. అటువంటి ఆత్మలకు క్షణములో తండ్రి పరిచయాన్ని, తండ్రి మహిమను మరియు ప్రాప్తులను వినిపించి సంబంధము యొక్క లవలీన అవస్థను అనుభవము చేయించండి. లవలీనులుగా ఉన్నట్లయితే సహజముగానే లీనమయ్యే రహస్యాన్ని కూడా అర్థం చేసుకుంటారు.