29-01-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - మీ మధురమైన తండ్రిని స్మృతి చేసినట్లయితే మీరు సతోప్రధాన దేవతలుగా అవుతారు, మొత్తం ఆధారమంతా స్మృతియాత్ర పైనే ఉంది’’

ప్రశ్న:-
ఎలాగైతే తండ్రి పట్ల పిల్లలకు ఆకర్షణ కలుగుతుందో, అలా ఏ పిల్లల పట్ల అందరికీ ఆకర్షణ కలుగుతుంది?

జవాబు:-
ఎవరైతే పుష్పాలుగా అయ్యారో, వారి పట్ల అందరికీ ఆకర్షణ కలుగుతుంది. ఎలాగైతే చిన్న పిల్లలు పుష్పాల వలె ఉంటారు, వారికి వికారాల గురించి తెలియను కూడా తెలియదు, కావున వారు అందరినీ ఆకర్షిస్తారు కదా, అలాగే పిల్లలైన మీరు కూడా ఎప్పుడైతే పుష్పాలుగా అనగా పవిత్రముగా అవుతారో, అప్పుడు అందరికీ ఆకర్షణ కలుగుతుంది. మీలో వికారాల ముళ్ళు ఏవీ ఉండకూడదు.

ఓంశాంతి
ఇది పురుషోత్తమ సంగమయుగమని ఆత్మిక పిల్లలకు తెలుసు. మీ భవిష్య పురుషోత్తమ ముఖాన్ని చూస్తున్నారా? పురుషోత్తమ శరీరాన్ని చూస్తున్నారా? మేము మళ్ళీ కొత్త ప్రపంచమైన సత్యయుగములో వీరి (లక్ష్మీ-నారాయణుల) వంశావళిలోకి వెళ్తాము అనగా సుఖధామములోకి వెళ్తాము మరియు పురుషోత్తములుగా అవుతామని మీరు ఫీల్ అవుతారు. కూర్చుని-కూర్చుని ఉండగానే ఈ ఆలోచనలు వస్తాయి! చదువుకునే విద్యార్థులు ఎవరైతే ఉంటారో, వారికి - తాము ఏ తరగతిలో చదువుతున్నారు, నేను బ్యారిస్టరుగా అవుతానా లేక ఫలానాగా అవుతానా అన్నది తప్పకుండా బుద్ధిలో ఉంటుంది కదా. అలాగే మీరు కూడా ఇక్కడ కూర్చున్నప్పుడు - మేము విష్ణు వంశములోకి వెళ్తామని మీకు తెలుసు. విష్ణువు యొక్క రెండు రూపాలు - లక్ష్మీ నారాయణులు, దేవి-దేవత. మీ బుద్ధి ఇప్పుడు అలౌకికముగా ఉంది. ఇతర ఏ మనుష్యుల బుద్ధిలోనూ ఈ విషయాలు రమిస్తూ ఉండకపోవచ్చు. పిల్లలైన మీ బుద్ధిలో ఈ విషయాలన్నీ ఉన్నాయి. ఇది సాధారణ సత్సంగమేమీ కాదు. ఇక్కడ కూర్చున్నప్పుడు - సత్యమైన తండ్రి ఎవరినైతే శివ అని అంటారో, వారి సాంగత్యములో కూర్చున్నామని మీరు భావిస్తారు. శివబాబాయే రచయిత, వారికే రచన యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలుసు మరియు వారే ఈ జ్ఞానాన్ని ఇస్తారు. నిన్న జరిగిన విషయము వలె వినిపిస్తారు. ఇక్కడ కూర్చున్నప్పుడు - మేము మళ్ళీ కొత్తగా అవ్వడానికి వచ్చాము అనగా ఈ శరీరాన్ని మార్చి దేవతా శరీరము తీసుకోవడానికి వచ్చాము అనైతే గుర్తుంటుంది కదా. ఆత్మ అంటుంది - ఇది నా తమోప్రధానమైన పాత శరీరము, దీనిని మార్చి ఈ విధముగా లక్ష్మీ-నారాయణులుగా అవ్వాలి. లక్ష్యము-ఉద్దేశ్యము ఎంత శ్రేష్ఠమైనది. చదివించే టీచర్ తప్పకుండా చదువుకునే విద్యార్థి కంటే చురుకైనవారిగా ఉంటారు కదా. వారు చదివిస్తారు, మంచి కర్మలు నేర్పిస్తారు, అంటే తప్పకుండా విద్యార్థి కంటే ఉన్నతముగా ఉంటారు కదా. మీకు తెలుసు, మనల్ని అందరికంటే ఉన్నతోన్నతమైన భగవంతుడు చదివిస్తున్నారు, భవిష్యత్తులో మనమే దేవతలుగా అవుతాము. మనమేదైతే చదువుతున్నామో, అది భవిష్య కొత్త ప్రపంచము కోసము. ఇంకెవ్వరికీ కొత్త ప్రపంచము కోసం తెలియను కూడా తెలియదు. ఈ లక్ష్మీ-నారాయణులు కొత్త ప్రపంచానికి యజమానులుగా ఉండేవారని మీ బుద్ధిలోకి ఇప్పుడు వస్తుంది. తప్పకుండా మళ్ళీ రిపీట్ అవుతుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, మిమ్మల్ని చదివించి మనుష్యుల నుండి దేవతలుగా తయారుచేస్తాను. దేవతలలో కూడా తప్పకుండా నంబరువారుగా ఉంటారు. దైవీ రాజధాని ఉంటుంది కదా. నేను ఆత్మను అని మీకు రోజంతా ఇదే ఆలోచన నడుస్తూ ఉండవచ్చు. మా ఆత్మ ఏదైతే చాలా పతితముగా ఉండేదో, అది ఇప్పుడు పావనముగా అయ్యేందుకు పావనమైన తండ్రిని స్మృతి చేస్తుంది. స్మృతి యొక్క అర్థాన్ని కూడా అర్థం చేసుకోవాలి. ఆత్మ తన మధురమైన తండ్రిని స్మృతి చేస్తుంది. తండ్రి స్వయంగా అంటారు - పిల్లలూ, నన్ను స్మృతి చేసినట్లయితే మీరు సతోప్రధానమైన దేవతలుగా అవుతారు. మొత్తము ఆధారమంతా స్మృతియాత్ర పైనే ఉంది. పిల్లలూ, ఎంత సమయము స్మృతి చేస్తున్నారు అని తండ్రి తప్పకుండా అడుగుతారు కదా. స్మృతి చేయడములోనే మాయతో యుద్ధము జరుగుతుంది. ఇది యాత్ర కాదు, కానీ యుద్ధము వంటిది అని, ఇందులో విఘ్నాలు ఎన్నో కలుగుతాయని మీరు స్వయంగా భావిస్తారు. స్మృతియాత్రలో ఉండటములోనే మాయ విఘ్నాలను కలిగిస్తుంది అనగా స్మృతిని మరపింపజేస్తుంది. పిల్లలు అంటారు కూడా - బాబా, మేము మీ స్మృతిలో ఉండడానికి మాయా తుఫానులు ఎన్నో వస్తున్నాయి. నంబర్ వన్ తుఫాను దేహాభిమానము. ఆ తర్వాత కామము, క్రోధము, లోభము, మోహము... పిల్లలంటారు - ఈ రోజు కామము యొక్క తుఫాను వచ్చింది, రేపు క్రోధము యొక్క తుఫాను, లోభము యొక్క తుఫాను వస్తుంది... ఈ రోజు మా అవస్థ బాగుంది, ఏ తుఫాను రాలేదు. స్మృతియాత్రలో రోజంతా ఉన్నాము, ఎంతో సంతోషము కలిగింది. బాబాను చాలా స్మృతి చేసాము. స్మృతిలో ప్రేమ అశ్రువులు ప్రవహిస్తూ ఉంటాయి. తండ్రి స్మృతిలో ఉండటముతో మీరు మధురముగా అయిపోతారు.

మేము మాయతో ఓడిపోతూ, ఓడిపోతూ ఎంతవరకు వచ్చి చేరుకున్నాము అని పిల్లలైన మీరు ఇది కూడా అర్థం చేసుకుంటారు. కల్పములో ఎన్ని నెలలు, ఎన్ని రోజులు... ఉంటాయని పిల్లలు లెక్క తీస్తారు. బుద్ధిలోకి వస్తుంది కదా. లక్షల సంవత్సరాల ఆయువు ఉంటుందని ఒకవేళ ఎవరైనా చెప్పినట్లయితే, దానిని ఎవరూ లెక్కపెట్టలేరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ సృష్టిచక్రము తిరుగుతూ ఉంటుంది. ఈ మొత్తము చక్రములో మనము ఎన్ని జన్మలు తీసుకుంటాము, ఎలా రాజ్యములోకి వెళ్తాము అనేదైతే మీకు తెలుసు కదా. ఇవి పూర్తిగా కొత్త విషయాలు, కొత్త ప్రపంచము కోసం కొత్త జ్ఞానము. కొత్త ప్రపంచమని స్వర్గాన్ని అంటారు. ఇప్పుడు మేము మనుష్యులము, దేవతలుగా అవుతున్నామని మీరు అంటారు. దేవతా పదవి ఉన్నతమైనది. మనము అందరికన్నా అతీతమైన జ్ఞానాన్ని తీసుకుంటున్నామని పిల్లలైన మీకు తెలుసు. మనల్ని చదివించేవారు పూర్తిగా అతీతమైనవారు, విచిత్రుడు. వారికి ఈ సాకార చిత్రము లేదు. వారు ఉన్నదే నిరాకారుడు. డ్రామాలో ఎంత మంచి పాత్ర రచింపబడి ఉందో చూడండి. తండ్రి ఎలా చదివిస్తారు? అందుకే - నేను ఫలానా తనువులోకి వస్తాను అని వారు స్వయముగా తెలియజేస్తున్నారు. వారు ఏ తనువులోకి వస్తారు అన్నది కూడా వారు తెలియజేస్తారు. ఒకే తనువులోకి వస్తారా అని మనుష్యులు తికమకపడతారు, కానీ ఇది డ్రామా కదా. ఇందులో మార్పు జరగదు. ఈ విషయాలను మీరే వింటారు మరియు ధారణ చేస్తారు, మరియు శివబాబా మమ్మల్ని ఏ విధముగా చదివిస్తారు అన్నది వినిపిస్తారు. మనము మళ్ళీ ఇతర ఆత్మలను చదివిస్తాము. చదువుకునేది ఆత్మ. ఆత్మయే నేర్చుకుంటుంది మరియు నేర్పిస్తుంది. ఆత్మ అత్యంత విలువైనది. ఆత్మ అవినాశీ అయినది, అమరమైనది. కేవలం శరీరము సమాప్తమవుతుంది. ఆత్మలమైన మనము మన పరమపిత పరమాత్మ నుండి జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాల గురించి మరియు 84 జన్మల గురించి జ్ఞానాన్ని తీసుకుంటున్నాము. జ్ఞానాన్ని ఎవరు తీసుకుంటారు? ఆత్మ. ఆత్మ అవినాశీ. మోహము కూడా అవినాశీ వస్తువుపైనే పెట్టుకోవాలి, అంతేకానీ వినాశీ వస్తువుపై కాదు. ఇంత సమయము మీరు వినాశీ శరీరము పట్ల మోహము పెట్టుకుంటూ వచ్చారు. నేను ఆత్మను, శరీర భానాన్ని వదిలేయాలని ఇప్పుడు మీరు భావిస్తారు. కొందరు పిల్లలు వ్రాస్తుంటారు కూడా - ఆత్మనైన నేను ఈ పని చేసాను, ఆత్మనైన నేను ఈ రోజు ఈ భాషణ చేసాను, ఆత్మనైన నేను ఈ రోజు బాబాను చాలా స్మృతి చేసాను అని. వారు సుప్రీమ్ ఆత్మ, నాలెడ్జ్ ఫుల్. పిల్లలైన మీకు ఎంత జ్ఞానాన్ని ఇస్తారు. మూలవతనము, సూక్ష్మవతనము గురించి మీకు తెలుసు. మనుష్యుల బుద్ధిలోనైతే ఏమీ లేదు. రచయిత ఎవరు అన్నది మీ బుద్ధిలో ఉంది. వారిని ఈ మనుష్య సృష్టికి రచయిత అని అంటారు, కావున తప్పకుండా ఆ కర్తవ్యము చేస్తారు కదా.

ఆత్మ మరియు పరమాత్మ అయిన తండ్రి యొక్క స్మృతి ఉన్న మనుష్యులు ఇంకెవ్వరూ లేరు అన్నది మీకు తెలుసు. స్వయాన్ని ఆత్మగా భావించండి అన్న జ్ఞానాన్ని తండ్రియే ఇస్తారు. మీరు స్వయాన్ని శరీరముగా భావిస్తూ తలకిందులుగా వేలాడుతున్నారు. ఆత్మ సత్ చిత్ ఆనంద స్వరూపము. ఆత్మకు అన్నిటికన్నా ఎక్కువ మహిమ ఉంది. ఒక్క తండ్రి ఆత్మకు ఎంతటి మహిమ ఉంది. వారే దుఃఖహర్త-సుఖకర్త. దోమలు మొదలైనవాటిని అవి దుఃఖహర్త-సుఖకర్త, జ్ఞానసాగరుడు అని మహిమ చేయరు. కాదు. ఇది తండ్రి మహిమ. మీలో కూడా ప్రతి ఒక్కరూ స్వయమే దుఃఖహర్త-సుఖకర్త, ఎందుకంటే మీరు అందరి దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇచ్చే ఆ తండ్రి పిల్లలు కదా, అది కూడా అర్ధకల్పము కోసం అలా జరుగుతుంది. ఈ జ్ఞానము ఇంకెవ్వరిలోనూ లేదు. నాలెడ్జ్ ఫుల్ ఒక్క తండ్రియే. మనలో ఏ జ్ఞానమూ లేదు. ఒక్క తండ్రి గురించే తెలియకపోతే ఇంకేమి జ్ఞానము ఉంటుంది. మేము ఇంతకుముందు జ్ఞానము తీసుకునేవారము, అప్పుడు మాకు ఇంకేమీ తెలిసేది కాదని ఇప్పుడు మీరు ఫీల్ అవుతారు. పసి పిల్లలలో జ్ఞానమూ ఉండదు మరియు ఏ అవగుణాలూ ఉండవు, అందుకే వారిని మహాత్ములని అంటారు ఎందుకంటే వారు పవిత్రమైనవారు. ఎంత చిన్న పిల్లలుగా ఉంటే, అంత నంబర్ వన్ పుష్పము. పూర్తిగా కర్మాతీత అవస్థ వలె ఉంటుంది. వారికి కర్మ, వికర్మల గురించి ఏమీ తెలియదు. కేవలం స్వయము గురించే తెలుసు. వారు పుష్పాలు, కావుననే అందరినీ ఆకర్షిస్తారు. బాబా ఇప్పుడు ఏ విధముగా ఆకర్షిస్తున్నారో, అలా ఆకర్షిస్తారు. తండ్రి వచ్చిందే మిమ్మల్నందరినీ పుష్పాలుగా తయారుచేయడానికి. మీలో కొంతమంది చాలా చెడ్డ ముళ్ళ వంటివారు కూడా ఉన్నారు. 5 వికారాల రూపీ ముళ్ళు ఉన్నాయి కదా. ఈ సమయములో మీకు పుష్పాలు మరియు ముళ్ళ యొక్క జ్ఞానముంది. ముళ్ళ అడవి కూడా ఉంటుంది. తుమ్మ ముల్లు అన్నిటికన్నా పెద్దదిగా ఉంటుంది. ఆ ముళ్ళతో కూడా చాలా వస్తువులు తయారవుతాయి. మనుష్యులతో పోల్చడము జరుగుతుంది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఈ సమయములో చాలా దుఃఖాన్ని ఇచ్చే మనుష్య ముల్లులు ఉన్నారు, అందుకే దీనిని దుఃఖపు ప్రపంచమని అనడము జరుగుతుంది. తండ్రిని సుఖదాత అని కూడా అంటారు. మాయా రావణుడు దుఃఖదాత. మళ్ళీ సత్యయుగములో మాయ ఉండదు కావున ఈ విషయాలేవీ అక్కడ ఉండవు. డ్రామాలో ఒకే పాత్ర రెండు సార్లు ఉండదు. మొత్తము ప్రపంచంలో ఏ పాత్ర అయితే జరుగుతుందో, అదంతా కొత్తదని బుద్ధిలో ఉంది. మీరు ఆలోచించండి - సత్యయుగము నుండి ఇప్పటివరకు అన్ని రోజులు మారుతాయి, కార్యకలాపాలు మారుతాయి. 5 వేల సంవత్సరాల యొక్క పూర్తి కార్యకలాపాల రికార్డు ఆత్మలో నిండి ఉంది, అది మారదు. ప్రతి ఆత్మలోనూ తమ-తమ పాత్ర నిండి ఉంది. ఈ ఒక్క విషయము కూడా ఎవరూ అర్థం చేసుకోలేరు. ఇప్పుడు ఆదిమధ్యాంతాల గురించి మీకు తెలుసు. ఇది స్కూల్ కదా. సృష్టి ఆదిమధ్యాంతాలను తెలుసుకోవాలి మరియు ఇది తండ్రిని స్మృతి చేస్తూ పవిత్రముగా అయ్యే చదువు. మేము ఈ విధముగా తయారవ్వాలి అన్నది ఇంతకుముందు మీకు ఏమైనా తెలుసా. తండ్రి ఎంత స్పష్టముగా అర్థం చేయిస్తారు. మీరు మొదటి నంబరులో ఇలా ఉండేవారు, ఆ తర్వాత మీరు కిందకు దిగిపోతూ-దిగిపోతూ ఇప్పుడు ఎలా అయిపోయారు. ప్రపంచము ఎలా అయిపోయిందో చూడండి! ఎంతమంది మనుష్యులు ఉన్నారు. ఈ లక్ష్మీ-నారాయణుల రాజధాని ఎలా ఉండేదో ఆలోచించండి. వారు ఎక్కడైతే ఉండేవారో, అక్కడ ఎటువంటి వజ్ర-వైఢూర్యాల మహళ్ళు ఉంటూ ఉండవచ్చు. ఇప్పుడు మేము స్వర్గవాసులుగా అవుతున్నాము, అక్కడ మేము మా ఇళ్ళు మొదలైనవి తయారుచేసుకుంటాము అని బుద్ధిలోకి వస్తుంది. శాస్త్రాలలో చూపించినట్లుగా కింద నుండి ద్వారక పైకి వస్తుందని కాదు. శాస్త్రాలు అనే పేరే కొనసాగుతూ వస్తుంది, ఇంకే పేరునూ పెట్టలేరు. వేరే పుస్తకాలు చదువుకోవడం కోసముంటాయి. నవలలు కూడా ఉంటాయి. ఇకపోతే వాటిని పుస్తకాలు లేక శాస్త్రాలని అంటారు. అవి చదువుకునే పుస్తకాలు. శాస్త్రాలు చదివేవారిని భక్తులని అంటారు. భక్తి మరియు జ్ఞానము, రెండూ వేర్వేరు. ఇప్పుడు వైరాగ్యము దేని పట్ల? భక్తి పట్లనా లేక జ్ఞానము పట్లనా? తప్పకుండా భక్తి పట్లనే అని అంటారు. ఇప్పుడు మీకు జ్ఞానము లభిస్తోంది, దీని ద్వారా మీరు ఇంత ఉన్నతముగా అవుతారు. ఇప్పుడు తండ్రి మిమ్మల్ని సుఖవంతులుగా తయారుచేస్తున్నారు. సుఖధామమునే స్వర్గమని అంటారు. సుఖధామములోకి మీరు వెళ్ళబోతున్నారు కావున మిమ్మల్నే చదివిస్తారు. ఈ జ్ఞానము కూడా మీ ఆత్మ తీసుకుంటుంది. ఆత్మకు ఏ ధర్మమూ లేదు. అది ఆత్మ, అంతే. తర్వాత ఆత్మ ఎప్పుడైతే శరీరములోకి వస్తుందో, అప్పుడు శరీర ధర్మము వేరుగా ఉంటుంది. ఆత్మ ధర్మము ఏమిటి? ఒకటేమో ఆత్మ బిందువు వంటిది మరియు శాంతి స్వరూపము. ఆత్మలు శాంతిధామము, ముక్తిధామములో ఉంటాయి. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు, పిల్లలందరికీ హక్కు ఉంది. చాలామంది పిల్లలు వేరే-వేరే ధర్మాలలోకి కన్వర్ట్ అయిపోయారు. వారు మళ్ళీ బయటకు వచ్చి తమ అసలైన ధర్మములోకి వచ్చేస్తారు. ఎవరైతే దేవీ-దేవతా ధర్మాన్ని వదిలి ఇతర ధర్మాలలోకి వెళ్ళారో, ఆ ఆకులన్నీ తమ స్థానానికి తిరిగి వచ్చేస్తాయి. ఈ విషయాలన్నింటినీ ఇంకెవ్వరూ అర్థం చేసుకోలేరు. మొట్టమొదటైతే తండ్రి పరిచయాన్ని ఇవ్వాలి, ఇందులోనే అందరూ తికమకపడ్డారు. ఇప్పుడు మనల్ని ఎవరు చదివిస్తున్నారు అనేది పిల్లలైన మీకు తెలుసు. తండ్రి చదివిస్తున్నారు. శ్రీకృష్ణుడైతే దేహధారి. వీరిని (బ్రహ్మాను) దాదా అని అంటారు. అందరూ పరస్పరము సోదరులే కదా. మిగిలినదంతా పదవిపై ఆధారపడి ఉంది. ఇది సోదరుడి శరీరము, ఇది సోదరి శరీరము - ఇది కూడా ఇప్పుడు మీకు తెలుసు. ఆత్మ అయితే ఒక చిన్నని నక్షత్రము వంటిది. ఇంతటి జ్ఞానమంతా చిన్నని నక్షత్రములో ఉంది. నక్షత్రము శరీరము లేకుండా మాట్లాడలేదు కూడా. నక్షత్రానికి పాత్రను అభినయించేందుకు ఇంద్రియాలు కూడా కావాలి. నక్షత్రాల ప్రపంచమే వేరు, ఆ తర్వాత ఇక్కడకు వచ్చి ఆత్మ శరీరాన్ని ధారణ చేస్తుంది. అది ఆత్మల ఇల్లు. ఆత్మ చిన్నని బిందువు. శరీరము పెద్దది. కావున దానిని ఎంతగా గుర్తు చేసుకుంటారు! ఇప్పుడు మీరు ఒక్క పరమపిత పరమాత్మనే గుర్తు చేయాలి. ఇదే సత్యము. ఎందుకంటే ఇప్పుడే ఆత్మ మరియు పరమాత్మల మేళా జరుగుతుంది. ఆత్మలు మరియు పరమాత్మ చాలా కాలము వేరుగా ఉన్నారని గాయనము కూడా ఉంది. మనము బాబా నుండి వేరయ్యాము కదా. ఎంత సమయము వేరయ్యాము అన్నది గుర్తుందా! తండ్రి కల్ప-కల్పము ఏదైతే వినిపిస్తూ వచ్చారో, అదే వచ్చి వినిపిస్తారు. ఇందులో కొద్దిగా కూడా తేడా ఉండదు. క్షణ-క్షణము ఏ పాత్ర అయితే నడుస్తుందో, అదంతా కొత్తది. ఒక్క క్షణము గతిస్తుంది, నిమిషము గతిస్తుంది, ఇక దానిని వదిలేస్తూ ఉన్నట్లే. అలా గతిస్తూ ఉంటే - ఇన్ని సంవత్సరాలు, ఇన్ని రోజులు, ఇన్ని నిముషాలు, ఇన్ని క్షణాలు దాటి వచ్చామని అంటారు. పూర్తి 5 వేల సంవత్సరాల తర్వాత మళ్ళీ మొదటి నంబరు నుండి ప్రారంభమవుతుంది. ఖచ్చితమైన లెక్క ఉంది కదా. నిమిషము, క్షణము అన్నీ నోట్ చేస్తారు. ఫలానావారు ఎప్పుడు జన్మ తీసుకున్నారు అని ఇప్పుడు మిమ్మల్ని ఎవరైనా అడిగితే, మీరు లెక్క పెట్టి చెప్తారు. శ్రీకృష్ణుడు మొదటి నంబరులో జన్మ తీసుకున్నారు. శివుని గురించైతే నిమిషాలు, క్షణాలు ఏమీ చెప్పలేరు. శ్రీకృష్ణుని తిథి, తారీఖు అన్నీ వ్రాయబడి ఉన్నాయి. మనుష్యుల గడియారములో నిమిషాలు, క్షణాలు తేడా రావచ్చు. కానీ శివబాబా అవతరణలోనైతే ఏ మాత్రమూ తేడా రాదు. వారు ఎప్పుడు వచ్చారు అనేది తెలియను కూడా తెలియదు. బాబాకు ఎప్పుడైతే సాక్షాత్కారమైందో, అప్పుడే శివబాబా వారిలోకి వచ్చారని కూడా కాదు. అలా కాదు, సుమారుగా చెప్తారు. అంతేకానీ ఆ సమయములోనే ప్రవేశించారని కాదు. నేను ఫలానాగా అవుతానని సాక్షాత్కారము అయ్యింది. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. సుఖధామములోకి వెళ్ళేందుకు సుఖవంతులుగా అవ్వాలి. అందరి దుఃఖాలను హరించి సుఖాన్ని ఇవ్వాలి. ఎప్పుడూ కూడా దుఃఖాన్ని ఇచ్చే ముల్లుగా అవ్వకూడదు.

2. ఈ వినాశీ శరీరములో ఆత్మే అత్యంత విలువైనది, అదే అమరమైనది, అవినాశీ అయినది, అందుకే అవినాశీ వస్తువు పట్ల ప్రేమను ఉంచుకోవాలి. దేహ భానాన్ని తొలగించివేయాలి.

వరదానము:-
తమ అనాది మరియు ఆది స్వరూపపు స్మృతి ద్వారా నిర్బంధనులుగా అయ్యే మరియు తయారుచేసే మరజీవా భవ

ఏ విధముగా తండ్రి శరీరాన్ని అప్పుగా తీసుకుంటారో, అంతేకానీ బంధనములోకి రారో, అలా మరజీవా జన్మ కల పిల్లలైన మీరు శరీరము, సంస్కారాలు మరియు స్వభావాల బంధనాల నుండి ముక్తులుగా అవ్వండి, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు, ఎలా కావాలనుకుంటే అలా మీ సంస్కారాలను తయారుచేసుకోండి. ఏ విధముగా తండ్రి నిర్బంధనులో అలా నిర్బంధనులుగా అవ్వండి. మూలవతనపు స్థితిలో స్థితులై ఆ తర్వాత కిందకు రండి. మీ అనాది మరియు ఆది స్వరూపపు స్మృతిలో ఉండండి. నేను అవతరించిన ఆత్మను అని భావిస్తూ కర్మలు చేసినట్లయితే ఇతరులు కూడా మిమ్మల్ని ఫాలో చేస్తారు.

స్లోగన్:-
స్మృతి యొక్క వృత్తి ద్వారా వాయుమండలాన్ని శక్తిశాలిగా తయారుచేయడము - ఇదే మనసా సేవ.

అవ్యక్త ప్రేరణలు - ఈ అవ్యక్తీ మాసములో బంధనముక్తులుగా ఉంటూ జీవన్ముక్త స్థితిని అనుభవము చేయండి

ఎప్పటివరకైతే ఏదో ఒక రకమైన మోహము ఉంటుందో, అది సంకల్పము రూపములో ఉండచ్చు, సంబంధాల రూపములో ఉండవచ్చు, సంపర్కము రూపములో ఉండవచ్చు, తమలోని ఏదైనా విశేషత పట్ల ఉండవచ్చు, ఏ మోహము అయినా సరే, అది బంధన-యుక్తులుగా చేస్తుంది. ఆ మోహము అశరీరిగా అవ్వనివ్వదు మరియు విశ్వ కళ్యాణకారులుగా కూడా అవ్వనివ్వదు, అందుకే ముందు స్వయము మోహ ముక్తులుగా అవ్వండి, అప్పుడు విశ్వానికి ముక్తి మరియు జీవన్ముక్తుల వారసత్వాన్ని ఇప్పించగలరు.