29-06-2025 ప్రాత:మురళి ఓంశాంతి 'బాప్దాదా' 31.12.2005


‘‘కొత్త సంవత్సరములో మీ పాత సంస్కారాలను యోగాగ్నిలో భస్మము చేసి బ్రహ్మాతండ్రి సమానముగా త్యాగము, తపస్య మరియు సేవలో నంబరువన్ గా అవ్వండి’’

ఈ రోజు బాప్ దాదా నలువైపులా ఉన్నవారికి, వారు సమ్ముఖములో ఉన్నా లేక దూరములో కూర్చుని హృదయానికి సమీపముగా ఉన్నా, అందరికీ మూడు అభినందనలు ఇస్తున్నారు. ఒకటి - కొత్త జీవితానికి అభినందనలు, రెండు - కొత్త యుగానికి అభినందనలు మరియు మూడు - నేటి ఈ రోజున కొత్త సంవత్సరానికి అభినందనలు. మీరందరూ కూడా కొత్త సంవత్సరానికి అభినందనలను ఇవ్వటానికి మరియు అభినందనలను తీసుకోవటానికి వచ్చారు. వాస్తవానికి సత్యమైన హృదయము యొక్క సంతోషపు అభినందనలను బ్రాహ్మణ ఆత్మలైన మీరు తీసుకుంటారు కూడా, ఇస్తారు కూడా. నేటి ఈ రోజుకు మహత్వము ఉంది. వీడ్కోలు కూడా మరియు అభినందనలు కూడా. ఇది వీడ్కోలు మరియు అభినందనల సంగమయుగము. నేటి ఈ రోజును సంగమము యొక్క రోజు అని అంటారు. సంగమము యొక్క మహిమ చాలా గొప్పది. సంగమయుగానికి ఉన్న మహిమ కారణముగానే ఈ రోజుల్లో పాత మరియు కొత్త సంవత్సరము యొక్క సంగమమును ఎంతో వైభవముగా జరుపుకుంటున్నారు అన్నది మీ అందరికీ తెలుసు. సంగమయుగానికి ఉన్న మహిమ కారణముగానే ఈ పాత-కొత్త సంవత్సరముల సంగమానికి మహిమ ఉంది. ఎక్కడైతే రెండు నదులు కలుస్తాయో, సంగమము జరుగుతుందో, దానికి కూడా మహిమ ఉంది. కానీ అన్నిటికంటే ఎక్కువ మహిమ ఈ సంగమయుగానిది, ఈ పురుషోత్తము యుగానిది, ఇక్కడ భాగ్యవాన్ ఆత్మలైన బ్రాహ్మణులైన మీరు కూర్చుని ఉన్నారు. ఈ నషా ఉంది కదా! ఒకవేళ ఎవరైనా మిమ్మల్ని - మీరు ఏ సమమయులో ఉన్నారు, మీరు కలియుగములో ఉంటున్నారా లేక సత్యయుగములో ఉంటున్నారా అని ప్రశ్నిస్తే, మీరు వెంటనే ఏమంటారు? మేము ఈ సమయములో పురుషోత్తమ సంగమయుగములో ఉన్నాము అని అంటారు. మీరు కలియుగానికి చెందినవారు కారు, మీరు సంగమయుగవాసులు. ఈ సంగమయుగానికి విశేష మహిమ ఎందుకు ఉంది? ఎందుకంటే భగవంతుడు మరియు పిల్లల యొక్క మిలనము జరుగుతుంది. ఏ యుగములోనూ జరగని మేళా జరుగుతుంది, మిలనము జరుగుతుంది. మరి మేళాను జరుపుకునేందుకు వచ్చారు కదా! మీరు మిలనమేళాను జరుపుకునేందుకు ఎక్కడెక్కడి నుండో వచ్చారు. డ్రామాలో ఆత్మనైన నాకు ఇటువంటి భాగ్యము కూడా నిశ్చితమై ఉంది అని ఎప్పుడైనా స్వప్నములోనైనా ఆలోచించారా. ఆత్మకు పరమాత్మతో కలిసే భాగ్యము ఇంతకుముందు ఉంది మరియు ఇప్పుడూ ఉంది. తండ్రి కూడా పిల్లల ప్రతి ఒక్కరి భాగ్యాన్ని చూసి హర్షిస్తారు - వాహ్! భాగ్యవాన్ పిల్లలూ వాహ్! మీ భాగ్యాన్ని చూసుకుని హృదయములో మీ గురించి మీరు - వాహ్ నేను వాహ్! వాహ్ నా భాగ్యము వాహ్! వాహ్ నా తండ్రి వాహ్! వాహ్ నా బ్రాహ్మణ పరివారము వాహ్! ఈ వాహ్ వాహ్ అన్న పాటలను ఆటోమేటిక్ గానే హృదయములో పాడుకుంటూ ఉంటారు కదా!

మరి ఈ రోజున ఈ సంగమ సమయములో - ఏయే విషయాలకు వీడ్కోలు ఇవ్వాలి అని మీలోపల ఆలోచించుకున్నారా? అందరూ ఆలోచించారా? సదాకాలము కొరకు వీడ్కోలు ఇవ్వాలి, ఎందుకంటే సదాకాలము కొరకు వీడ్కోలు ఇవ్వటం ద్వారా సదాకాలికమైన అభినందనలను జరుపుకోగలరు. ఎటువంటి అభినందనలను ఇవ్వండి అంటే, మీ ముఖాన్ని చూసి ఏ ఆత్మ మీ ఎదురుగా వచ్చినా సరే, వారు కూడా అభినందనలను పొంది సంతోషించాలి. ఎవరైతే హృదయపూర్వకముగా అభినందనలను ఇస్తారో మరియు తీసుకుంటారో, వారు సదా ఎలా కనిపిస్తారు? సంగమయుగీ ఫరిశ్తాగా. బ్రాహ్మణుల నుండి ఫరిశ్తా మరియు ఫరిశ్తా నుండి దేవత, అందరిదీ ఇదే పురుషార్థము కదా! ఎందుకంటే తండ్రికు అన్ని రకాల సంకల్పాలను, ప్రవృత్తికి చెందిన, కర్మలకు చెందిన భారము ఏదైతే ఉందో, దానినీ తండ్రికు ఇచ్చేసారు కదా! భారాన్ని ఇచ్చేసారా లేక ఇంకా కాస్త ఉండిపోయిందా? ఎందుకంటే కొంచెము భారము ఉన్నా కానీ అది ఫరిశ్తాగా అవ్వనివ్వదు. అంతేకాక తండ్రి పిల్లల భారాన్ని తీసుకునేందుకు వచ్చినప్పుడు మరి భారాన్ని ఇవ్వటము కష్టమా! కష్టమా లేక సహజమా? భారాన్ని తండ్రికు ఇచ్చేసాము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. ఇచ్చేసారా? చూసుకోండి, ఆలోచించి చేతులు ఎత్తండి. భారాన్ని ఇచ్చేసారా? అచ్ఛా, ఇచ్చేసినట్లయితే చాలా అభినందనలు. మరి ఎవరైతే భారాన్ని తండ్రికు ఇవ్వలేదో వారు ఎందుకని తమ వద్ద ఉంచుకున్నారు? ఆ భారము పట్ల ప్రీతి ఉందా ఏమిటి? భారము మంచిగా అనిపిస్తుందా? చూడండి, బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ ఏమంటారు? ఓ నా నిశ్చింత చక్రవర్తులైన పిల్లలూ అని అంటారు. మరి భారము ఉంటే దానికి సంబంధించిన చింత ఉంటుంది కదా! ఆ భారాన్ని తీసుకునేందుకు తండ్రి వచ్చారు ఎందుకంటే తండ్రి చూస్తున్నారు, 63 జన్మల నుండి భారాన్ని మోస్తూ-మోస్తూ పిల్లలందరూ చాలా భారీతనము కలవారిగా అయిపోయారు. అందుకే తండ్రి పిల్లలకు భారాన్ని ఇచ్చేయండి అని ప్రేమగా చెప్తున్నారు, అయినా కూడా ఎందుకని పెట్టుకుని ఉన్నారు? భారము పెట్టుకోవటము మంచిగా అనిపిస్తుందా? అన్నింటికంటే సూక్ష్మమైన భారము - పాత సంస్కారాల భారము. ఈ సంవత్సరము పూర్తయిపోతుంది కదా, అందుకని బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరిదీ ఈ సంవత్సరము యొక్క చార్టును చూసారు. మీరందరూ కూడా ఈ సంవత్సరానికి సంబంధించి మీ-మీ చార్టులు చెక్ చేసుకునే ఉంటారు కదా? బాప్ దాదా ఏం చూసారంటే - చాలామంది పిల్లలకు ఈ పాత ప్రపంచముపై ఆకర్షణ తగ్గింది, పాత సంబంధాల ఆకర్షణ కూడా తగ్గింది, కానీ పాత సంస్కారాలు, వీటి భారము మెజారిటీ పిల్లలలో ఉండిపోయి ఉంది. ఏదో ఒక రూపములో, మనసులో అశుద్ధ సంకల్పాలు కాకపోయినా కానీ వ్యర్థ సంకల్పాలు చేసే సంస్కారము ఇప్పుడు కూడా పర్సెంటేజ్ లో కనిపిస్తూ ఉంది. వాచలో కూడా కనిపిస్తూ ఉంది. సంబంధ-సంపర్కాలలో కూడా ఏదో ఒక సంస్కారము ఇప్పుడు కూడా కనిపిస్తూ ఉంది.

ఈ రోజు బాప్ దాదా పిల్లలందరికీ అభినందనలతోపాటుగా ఏ సూచనను ఇస్తున్నారంటే - మిగిలిపోయి ఉన్న ఈ సంస్కారము సమయానికి కూడా మోసం చేస్తుంది మరియు అంతిమములో కూడా మోసం చేయడానికి నిమిత్తముగా అవుతుంది, అందుకే ఈ రోజు సంస్కారానికి అంతిమ సంస్కారము చెయ్యండి. ప్రతి ఒక్కరికీ తమ సంస్కారము గురించి తెలుసు కూడా, వదలాలని అనుకుంటారు కూడా, విసిగిపోయి కూడా ఉన్నారు, కానీ సదా కోసం పరివర్తన చేసుకోవటంలో తీవ్ర పురుషార్థులుగా లేరు. పురుషార్థము చేస్తున్నారు కానీ తీవ్ర పురుషార్థులుగా లేరు. కారణమేమిటి? తీవ్ర పురుషార్థము ఎందుకు జరగదు? కారణము ఏమిటంటే - రావణుడిని హతమార్చారు కూడా, కానీ కేవలము హతమార్చడమే కాదు, కాల్చేసారు కూడా. ఇలా హతమార్చడానికి పురుషార్థము చేస్తారు, అప్పుడు ఆ సంస్కారము కాస్త స్పృహ కోల్పోతుంది కూడా, కానీ కాల్చలేదు కావున ఆ స్పృహ కోల్పోయిన స్టేజ్ నుండి మధ్యమధ్యలో మళ్ళీ లేచేస్తూ ఉంటుంది. అందుకే పాత సంస్కారాల అంతిమ సంస్కారము చేయడానికి ఈ కొత్త సంవత్సరములో వాటిని యోగాగ్ని ద్వారా కాల్చాలి అనే దృఢ సంకల్పము పట్ల అటెన్షన్ పెట్టండి. ఈ కొత్త సంవత్సరములో ఏం చెయ్యాలి అని అడుగుతారు కదా. సేవ విషయము వేరు, కానీ ముందుగా స్వయము యొక్క విషయము చూసుకోవాలి. యోగము చేస్తారు, పిల్లలు యోగములో అభ్యాసము చేస్తుండటాన్ని బాప్ దాదా చూస్తారు. అమృతవేళలో కూడా చాలా పురుషార్థము చేస్తారు, కానీ యోగ తపస్యను తపస్య రూపములో చెయ్యరు. తండ్రిను ప్రేమతో తప్పకుండా గుర్తు చేస్తుంటారు, ఆత్మిక సంభాషణను కూడా ఎంతగానో చేస్తుంటారు, శక్తిని తీసుకునే అభ్యాసాన్ని కూడా చేస్తారు, కానీ - వీడ్కోలు ఇవ్వాలి అన్న సంకల్పము చేస్తే వీడ్కోలు జరిగిపోగలిగేంతగా స్మృతిని అంత శక్తిశాలిగా తయారుచేసుకోలేదు. యోగాన్ని యోగాగ్ని రూపములో కార్యములో పెట్టరు, అందుకే యోగాన్ని శక్తిశాలిగా చేసుకోండి. ఏకాగ్రతా శక్తి విశేషముగా సంస్కారాలను భస్మము చేయడానికి అవసరము. ఏ స్వరూపములో ఏకాగ్రము అవ్వాలనుకుంటే ఆ స్వరూపములో, ఎంత సమయము ఏకాగ్రము అవ్వాలనుకుంటే అంత సమయము ఏకాగ్రము అవ్వగలగాలి, అటువంటి ఏకాగ్రత కావాలి, సంకల్పము చేయగానే అది భస్మమైపోవాలి. దీనిని యోగాగ్ని అని అంటారు. నామ-రూపాలు సమాప్తమవ్వాలి. కేవలం హతమార్చితే శవము అనేది ఉండిపోతుంది కదా. కానీ భస్మము అయిన తర్వాత ఇక నామ-రూపాలు అన్నీ అంతమైపోతాయి. కనుక ఈ సంవత్సరము యోగాన్ని శక్తిశాలీ స్థితిలోకి తీసుకురండి. మాస్టర్ సర్వ శక్తివంతులు ఏ స్వరూపములో ఉండాలనుకుంటే దానికి ఆజ్ఞాపించండి, సమాప్తము చేసే శక్తి మీ ఆజ్ఞను పాటించకపోవటమనేది జరగదు. మీరు యజమానులు. మాస్టర్ అని పిలవబడతారు కదా! మరి మాస్టర్ ఆర్డర్ చేస్తే ఆ శక్తి హాజరు అవ్వకపోతే మరి వారు మాస్టరేనా? బాప్ దాదా చూసారు - పాత సంస్కారానికి చెందిన ఎంతో కొంత అంశమాత్రము ఇప్పుడు కూడా ఉండిపోయి ఉంది మరియు ఆ అంశము మధ్యమధ్యలో వంశానికి కూడా జన్మనిస్తుంది, అప్పుడు అది కర్మలలోకి కూడా వచ్చేస్తుంది. యుద్ధము చెయ్యాల్సి వస్తుంది. బాప్ దాదాకు సమయమనుసారముగా పిల్లల యొక్క యుద్ధ స్వరూపము నచ్చటం లేదు. బాప్ దాదా పిల్లలు ప్రతి ఒక్కరినీ యజమాని రూపములో చూడాలనుకుంటారు. ఆర్డర్ చేస్తే ఆ శక్తి హాజరైపోవాలి.

మరి విన్నారా, ఈ సంవత్సరములో స్వయము కోసం ఏం చెయ్యాలో? మీరు శక్తిశాలులు, నిశ్చింత చక్రవర్తులు, ఎందుకంటే అందరి లక్ష్యము ఏమిటి అని ఎవరినైనా అడిగినా ఏమని అంటారు? మేము విశ్వ రాజ్యాన్ని ప్రాప్తి చేసుకుంటాము, రాజ్య అధికారులుగా అవుతాము అని అంటారు. స్వయాన్ని రాజయోగిగా చెప్పుకుంటారు. మీరు ప్రజాయోగులా? ఈ మొత్తము సభలో ప్రజాయోగులు ఎవరైనా ఉన్నారా? ఉన్నారా? రాజయోగులు కాకుండా ప్రజాయోగులు ఎవరైనా ఉన్నారా. టీచర్లూ, అటువంటివారు ఎవరైనా ఉన్నారా? మీ సెంటర్లో ఎవరైనా ప్రజాయోగులు ఉన్నారా? రాజయోగులము అనే అందరూ చెప్పుకుంటారు. ప్రజాయోగులు ఎవరైనా ఉన్నారా అంటే ఎవ్వరూ చేతులెత్తరు. మంచిగా అనిపించదు కదా! అంతేకాక తండ్రికు కూడా నషా ఉంది. బాప్ దాదా నషాతో అంటారు - సంగమములో కూడా పిల్లలు ప్రతి ఒక్కరూ రాజా పిల్లలు అని. నా ఒక్కొక్క బిడ్డ రాజా బిడ్డ అని ఏ తండ్రి కూడా నషాతో చెప్పలేరు. కానీ బాప్ దాదా అంటారు, నా ప్రతి బిడ్డ స్వరాజ్య అధికారీ రాజా బిడ్డనే. ప్రజాయోగులు ఎవరు అంటే అందులో అయితే చేతులెత్తలేదు కదా, అంటే రాజులనే కదా! కానీ శక్తిని ఆజ్ఞాపించినా కానీ అది రాకపోవటము అనేటువంటి ఢీలా-ఢీలా రాజులుగా అవ్వకండి. బలహీనమైన రాజులుగా అవ్వకండి. వెనక ఉన్నవారు ఎవరు? మేము రాజయోగులము అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. పైన కూడా కూర్చుని ఉన్నారు (గ్యాలరీలో కూర్చుని ఉన్నవారు చేతులు ఊపుతున్నారు, ఈ రోజు హాల్లో 18,000 మంది సోదరీ-సోదరులు కూర్చుని ఉన్నారు). బాప్ దాదా చూస్తున్నారు, పైన ఉన్నవారు చేతులెత్తండి.

ఇప్పుడు ఈ చివరి టర్న్ లో ఇది ప్రారంభమవుతుంది. బాప్ దాదా మూడు నెలలను ఇస్తారు, సరేనా, ఇవ్వాలా? హోం వర్క్ ఇస్తారు, ఎందుకంటే మధ్యమధ్యలో చేసే ఈ హోం వర్క్ కూడా చివరి పరీక్షలో జమ అవుతుంది. మూడు నెలలలో ప్రతి ఒక్కరూ తమ చార్టును చెక్ చేసుకోండి - నేను మాస్టర్ సర్వశక్తివంతునిగా అయ్యి ఏ కర్మేంద్రియానికైనా, ఏ శక్తికైనా ఎప్పుడు ఆజ్ఞాపిస్తే అప్పుడు, ఏది ఆజ్ఞాపిస్తే అది, ప్రాక్టికల్ గా అవి ఆజ్ఞను పాటిస్తున్నాయా లేదా? చెయ్యగలరా? మొదటి లైన్ లో ఉన్నవారు చెయ్యగలరా? చేతులెత్తండి. అచ్ఛా! ఈ మూడు నెలలు ఏ పాత సంస్కారము దాడి చెయ్యకూడదు. నిర్ల్యక్షులుగా అవ్వకండి, ‘అయిపోతుందిలే...’ అనే రాయల్ నిర్లక్ష్యాన్ని తీసుకురాకండి. బాప్ దాదాతో చాలా మధురాతి మధురమైన మాటలు మాట్లాడుతారు. తండ్రి, మీరు చింతించకండి, నేను అలా తయారైపోతాను అని అంటారు. బాప్ దాదా ఏం చేస్తారు? విని నవ్వుతారు. కానీ బాప్ దాదా ఈ మూడు నెలలలో అటువంటి మాటలు మాట్లాడితే మాత్రం ఒప్పుకోరు. మీరు అంగీకారమైతే చేతులెత్తండి. మనస్ఫూర్తిగా చేతులెత్తండి, సభలో ఉన్నామన్న కారణముగా చేతులెత్తవద్దు. చెయ్యాల్సిందే. ఏది సహనం చెయ్యాల్సి వచ్చినా, ఏది వదలాల్సి వచ్చినా, ఏం పర్వాలేదు. చెయ్యాల్సిందే. పక్కానా? పక్కానా? పక్కానా? టీచర్లు చేస్తారా?

అచ్ఛా, కిరీటాన్ని ధరించిన ఈ చిన్నారి పిల్లలు ఏం చేస్తారు? (చిన్న పిల్లలు కిరీటాన్ని ధరించి ఎదురుగా కూర్చున్నారు). కిరీటాన్ని అయితే మంచిగా ధరించారా? మరి చెయ్యాల్సి వస్తుంది. అచ్ఛా! చూడండి, పిల్లలు చేతులెత్తుతున్నారు. ఒకవేళ మీరు చెయ్యకపోతే మరి ఏం చెయ్యాలి? అది కూడా చెప్పండి. అప్పుడు బాప్ దాదా సీజన్ లో ఒకసారికి రానివ్వరు, ఎందుకంటే బాప్ దాదా చూస్తున్నారు, సమయము మీ కోసం ఎదురుచూస్తూ ఉంది. మీరు సమయము కోసం ఎదురుచూసేవారు కారు, మీరు ఏర్పాట్లు చేసుకునేవారు, సమయము మీ కోసం ఎదురుచూస్తూ ఉంది. ప్రకృతి కూడా (సతోప్రధాన ప్రకృతి) మిమ్మల్ని ఆహ్వానిస్తూ ఉంది. కనుక మూడు నెలలలో మీ శక్తిశాలి స్థితిలో మిగిలిపోయి ఉన్న సంస్కారాలను పరివర్తన చేసుకోండి. ఒకవేళ మూడు నెలలు అటెన్షన్ పెట్టినట్లయితే ఇక దాని తర్వాత కూడా అది అభ్యాసమైపోతుంది. ఒక్కసారి పరివర్తనా విధి వచ్చింది అంటే ఇక అది చాలా పనికొస్తుంది. ఎప్పుడు వినాశనమవుతుంది, ఎప్పుడు వినాశనమవుతుంది అని సమయం కోసం మీరు ఎదురుచూడకండి. ఆత్మిక సంభాషణలో అందరూ అడుగుతుంటారు, పైకి అనరు కానీ లోపల ఇలా అనుకుంటారు - ఎప్పుడు వినాశనమవుతుందో తెలియదు, రెండు సంవత్సరాలలో అవుతుందా, 10 సంవత్సరాలలో అవుతుందా, ఎన్ని సంవత్సరాలలో అవుతుంది అని? కానీ మీరెందుకు సమయం కోసం ఎదురుచూస్తున్నారు, సమయము మీ కోసం ఎదురుచూస్తూ ఉంది. తండ్రిను అడుగుతుంటారు - తారీఖు చెప్పండి, ఏ సంవత్సరమో చెప్పండి, 10 సంవత్సరాలు పడుతుందా, 20 సంవత్సరాలు పడుతుందా, ఎన్ని సంవత్సరాలు పడుతుంది?

బాప్ దాదా పిల్లల్ని ప్రశ్న అడుగుతున్నారు - మీరందరూ తండ్రి సమానముగా అయిపోయారా? పరదా తెరవమంటారా లేక పరదా తెరిస్తే కొందరు తల దువ్వుకుంటూ, కొందరు ముఖానికి క్రీమ్ ను పెట్టుకుంటూ ఉంటారా. ఒకవేళ ఎవర్రెడీగా ఉన్నట్లయితే, సంస్కారాలు సమాప్తమైపోయినట్లయితే ఇక బాప్ దాదాకు పరదాను తెరవటానికి ఆలస్యమెందుకు అవుతుంది. ఎవర్రెడీగా అయితే అవ్వండి కదా! ఎవర్రెడీగా అయిపోతాము, అయిపోతాము అని అంటూ తండ్రిను చాలా సమయము సంతోషపరిచారు. ఇప్పుడు అలా చెయ్యకండి, అవ్వాల్సిందే, చెయ్యాల్సిందే. తండ్రి సమానముగా అవ్వాలి అన్నదానిలోనైతే అందరూ చేతులెత్తుతారు. చేతులెత్తే అవసరము లేదు. బ్రహ్మాతండ్రిను చూడండి, సాకారములో అయితే బ్రహ్మాతండ్రిను ఫాలో చేయాలి కదా! బ్రహ్మాతండ్రి త్యాగమును, తపస్యను మరియు సేవను చివరి క్షణము వరకు సాకార రూపములో ప్రాక్టికల్ గా చేసి చూపించారు. తమ డ్యూటీని, శివతండ్రి ద్వారా మహావాక్యాలను ఉచ్చరించే తమ డ్యూటీని చివరి రోజు వరకు నిర్వర్తించారు. చివరి మురళి గుర్తుంది కదా? మూడు పదాల వరదానము, గుర్తుందా? (నిరాకారి, నిర్వికారి మరియు నిరహంకారిగా అవ్వండి) ఎవరికైతే ఇది గుర్తుందో, వారు చేతులెత్తండి. అచ్ఛా, అందరికీ గుర్తుంది, అభినందనలు. త్యాగము కూడా చివరి రోజు వరకు చేసారు, తమ పాత గదిని వదలలేదు. పిల్లలు ఎంత ప్రేమగా బ్రహ్మాతండ్రికు చెప్పినా కానీ వారు వినలేదు, అవి పిల్లల కోసం తయారుచెయ్యటం జరిగింది అని అన్నారు. వాటిని స్వయం ఉపయోగించలేదు. మరియు సదా 2.30 లేక 3.00 గంటలకు లేచి స్వయము కొరకు తపస్య చేసారు, సంస్కారాలను భస్మము చేసుకున్నారు, అప్పుడు కర్మాతీతముగా, అవ్వక్తము అయ్యారు, ఫరిశ్తాగా అయ్యారు. ఏది ఆలోచించారో దానిని చేసి చూపించారు. చెప్పటము, ఆలోచించటము మరియు చెయ్యటము, మూడూ సమానముగా ఉన్నాయి. ఫాలో ఫాదర్. చివరి వరకు తన కర్తవ్యములో వారు సంపూర్ణులుగా ఉన్నారు. ఉత్తరాలు కూడా వ్రాసారు, ఎన్ని ఉత్తరాలు వ్రాసారు? సేవ కూడా మానలేదు. ఫాలో ఫాదర్ చెయ్యండి. అఖండ మహాదానిగా ఉన్నారు, మహాదాని కాదు, అఖండ మహాదాని యొక్క ప్రాక్టికల్ రూపాన్ని చూపించారు, అంతిమము వరకు చూపించారు. చివరి వరకు కూడా ఎటువంటి ఆధారము లేకుండా తపస్వీ రూపములో కూర్చున్నారు. ప్రస్తుతమైతే పిల్లలు కింద కూర్చోవటానికి ఆధారాన్ని తీసుకుంటారు కదా. కానీ బ్రహ్మాతండ్రి ఆది నుండి అంతిమము వరకు తపస్వీ రూపములో ఉన్నారు. కళ్ళకు కళ్ళద్దాలు పెట్టుకోలేదు. ఇది సూక్ష్మ శక్తి. నిరాధారము. శరీరము పాతది, రోజురోజుకు ప్రకృతి, గాలి, నీరు కలుషితమవుతున్నాయి, అందుకే బాప్ దాదా మిమ్మల్ని - మీరెందుకు కింద కూర్చోవటానికి ఆధారము తీసుకుంటారు, ఎందుకు కళ్ళద్దాలు పెట్టుకుంటారు అని అడగరు, పెట్టుకోండి, పర్వలేదు పెట్టుకోండి, కానీ శక్తిశాలీ స్థితిని తప్పకుండా తయారుచేసుకోండి. మొత్తము విశ్వ కార్యమును సమాప్తము చేసారా? బాప్ దాదా మిమ్మల్ని ప్రశ్న అడుగుతున్నారు - విశ్వ కళ్యాణ కార్యము పూర్తయిపోయిందని మీరందరూ సంతుష్టముగా ఉన్నారా? విశ్వ కళ్యాణ కార్యము సమాప్తమైపోయింది అని ఎవరైతే భావిస్తున్నారో వారు చేతులెత్తండి. ఒక్కరు కూడా లేరా? మరైతే వినాశనము అవుతుందా అని మీరు ఎలా అడుగుతున్నారు? పనినైతే పూర్తి చెయ్యలేదు. అచ్ఛా!

నలువైపులా ఉన్న సదా ఉల్లాస-ఉత్సాహాలతో ముందుకు వెళ్ళేవారికి, సదా ధైర్యము ఉంచి బాప్ దాదా నుండి పదమాల రెట్ల సహాయాన్ని తీసుకునేందుకు పాత్రులైన పిల్లలకు, సదా విజయీ రత్నాలకు, ప్రతి కల్పములో విజయులుగా అయ్యారు, ఇప్పుడు కూడా విజయులుగా ఉన్నారు మరియు ప్రతి కల్పములోనూ విజయులుగా ఉండనే ఉన్నారు, ఇటువంటి విజయీ పిల్లలకు, సదా ఒక్క తండ్రి తప్ప ఇతరులెవ్వరూ లేరు అని భావించేవారికి, ప్రపంచ ఆకర్షణ లేకుండా, సంస్కారాల ఆకర్షణ లేకుండా, రెండు ఆకర్షణల నుండి ముక్తులుగా ఉండేవారికి, సదా తండ్రి సమానమైన పిల్లలకు బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు నమస్తే.

వరదానము:-
సదాకాలికమైన అటెన్షన్ ద్వారా విజయమాలలో కూర్చబడే బహుకాలపు విజయీ భవ

బహుకాలపు విజయులు, విజయమాలలోని మణులుగా అవుతారు. విజయులుగా అయ్యేందుకు సదా తండ్రిని మీ ఎదురుగా పెట్టుకోండి - తండ్రి ఏదైతే చేసారో, అదే మనము చెయ్యాలి. ప్రతి అడుగులో తండ్రి సంకల్పము ఏదైతే ఉందో అదే పిల్లల సంకల్పము, తండ్రి మాట ఏదైతే ఉందో అదే పిల్లల మాట - అప్పుడు విజయులుగా అవుతారు. ఈ అటెన్షన్ సదాకాలము కొరకు ఉండాలి, అప్పుడు సదాకాలిక రాజ్యభాగ్యము ప్రాప్తిస్తుంది ఎందుకంటే ఎటువంటి పురుషార్థమో అటువంటి ప్రారబ్ధము ఉంటుంది. సదాకాలపు పురుషార్థము ఉన్నట్లయితే సదాకాలికమైన రాజ్యభాగ్యము ఉంటుంది.

స్లోగన్:-
సేవలో సదా జీ హాజిర్ (చిత్తం ప్రభు) అనటము - ఇదే ప్రేమకు సత్యమైన ఋజువు.

అవ్యక్త ప్రేరణలు - ఆత్మిక స్థితిలో ఉండే అభ్యాసము చెయ్యండి, అంతర్ముఖులుగా అవ్వండి

ఎలాగైతే ఎవరైనా వ్యక్తి అద్దం ముందు నిలబడినప్పుడు స్వయం యొక్క సాక్షాత్కారాన్ని చూసుకుంటారో, అలాగే మీ ఆత్మిక స్థితి మరియు శక్తి అనే దర్పణము ముందుకు ఏ ఆత్మ వచ్చినా కానీ, వారు ఒక్క క్షణములో స్వ స్వరూపపు దర్శనము లేక సాక్షాత్కారము చేసుకుంటారు. మీ ప్రతి కర్మలో, ప్రతి నడవడికలో ఆత్మికత యొక్క ఆకర్షణ ఉండాలి. ఎవరైతే స్వచ్ఛమైన, ఆత్మిక బలము కల ఆత్మలు ఉంటారో, వారు అందరినీ తమ వైపుకు తప్పకుండా ఆకర్షితము చేస్తారు.