ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాట విన్నారు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు అని
ఎవరు అన్నారు? తప్పకుండా ఆత్మిక తండ్రియే అనగలరు. మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు
ఇప్పుడు సమ్ముఖములో కూర్చున్నారు మరియు వారికి తండ్రి చాలా ప్రేమగా అర్థం
చేయిస్తున్నారు. ఆత్మిక తండ్రి తప్ప సర్వులకు సుఖ-శాంతులనిచ్చేవారు మరియు సర్వులను
ఈ దుఃఖము నుండి విముక్తులుగా చేసేవారు ప్రపంచమంతటిలో ఇతర మనుష్యులెవ్వరూ ఉండలేరని
మీకిప్పుడు తెలుసు, అందుకే దుఃఖములో తండ్రిని స్మృతి చేస్తూ ఉంటారు. పిల్లలైన మీరు
సమ్ముఖములో కూర్చున్నారు. బాబా మమ్మల్ని సుఖధామానికి యోగ్యులుగా తయారుచేస్తున్నారని
మీకు తెలుసు. సదా సుఖధామానికి యజమానులుగా చేసే తండ్రి సమ్ముఖములోకి వచ్చారు.
సమ్ముఖములో వినడానికి మరియు దూరంగా ఉంటూ వినడానికి చాలా తేడా ఉందని మీకు తెలుసు.
మధుబన్ లో సమ్ముఖములోకి వస్తారు. మధుబన్ ప్రసిద్ధమైనది. మధుబన్ లో వారు శ్రీకృష్ణుని
చిత్రాన్ని చూపించారు కానీ శ్రీకృష్ణుడైతే అక్కడ లేరు. ఇక్కడైతే పదే-పదే స్వయాన్ని
ఆత్మ అని నిశ్చయము చేసుకోవాలి అని పిల్లలైన మీకు తెలుసు, దీని కోసం కష్టపడవలసి
ఉంటుంది. ఆత్మనైన నేను తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నాను. తండ్రి మొత్తం
చక్రములో ఒక్క సమయములోనే వస్తారు. ఇది కల్పము యొక్క మనోహరమైన సంగమయుగము, దీనికి
పురుషోత్తమ సంగముయుగము అని పేరు పెట్టారు. ఈ సంగమయుగములోనే మనుష్యమాత్రులందరూ
ఉత్తములుగా అవుతారు. ఇప్పుడైతే మనుష్యమాత్రులందరి ఆత్మలు తమోప్రధానముగా ఉన్నాయి,
వారు మళ్ళీ సతోప్రధానముగా అవుతారు. సతోప్రధానముగా ఉన్నప్పుడు ఉత్తమముగా ఉంటారు.
తమోప్రధానముగా అవ్వడముతో మనుష్యులు కూడా కనిష్ఠులుగా అవుతారు. ఇప్పుడు తండ్రి
ఆత్మలకు సమ్ముఖములో కూర్చుని అర్థం చేయిస్తారు. మొత్తం పాత్ర అంతా ఆత్మయే
అభినయిస్తుంది, అంతేకానీ శరీరము కాదు. ఆత్మలమైన మేము వాస్తవానికి నిరాకారీ ప్రపంచము
లేక శాంతిధామములో ఉండేవారమని మీ బుద్ధిలోకి వచ్చింది. ఇది ఎవ్వరికీ తెలియదు. స్వయము
అర్థం చేయించలేరు కూడా. మీ బుద్ధి తాళము ఇప్పుడు తెరుచుకుంది. వాస్తవానికి ఆత్మలు
పరంధామములో ఉంటారని మీరు అర్థం చేసుకుంటారు. అది నిరాకారీ ప్రపంచము. ఇది సాకారీ
ప్రపంచము. ఇక్కడ ఆత్మలమైన మనమంతా నటులము, పాత్రధారులము. మొట్టమొదట మనము పాత్రను
అభినయించేందుకు వస్తాము, ఆ తర్వాత నంబరువారుగా వస్తూ ఉంటారు. పాత్రధారులందరూ ఒకేసారి
కలిసి రారు. అనేక రకాల పాత్రధారులు వస్తూ ఉంటారు. ఎప్పుడైతే నాటకము పూర్తవుతుందో,
అప్పుడు అందరూ ఒకే చోటుకు చేరుకుంటారు. ఆత్మలమైన మనము వాస్తవానికి శాంతిధామ
నివాసులమని, ఇక్కడకు పాత్రను అభినయించేందుకు వస్తామని ఇప్పుడు మీకు పరిచయము
లభించింది. తండ్రి పాత్రను అభినయించేందుకు పూర్తి సమయము రారు. మనమే పాత్రను
అభినయిస్తూ-అభినయిస్తూ సతోప్రధానము నుండి తమోప్రధానముగా అవుతాము. ఇప్పుడు పిల్లలైన
మీకు సమ్ముఖములో వినడము వలన చాలా ఆనందము కలుగుతుంది. అంతటి ఆనందము కేవలం మీకు మీరు
మురళీని చదువుకోవడము వలన కలగదు. ఇక్కడ సమ్ముఖములో ఉన్నారు కదా.
భారత్ దేవీ-దేవతల స్థానముగా ఉండేదని పిల్లలైన మీరు భావిస్తారు. ఇప్పుడు అలా లేదు.
మీరు చిత్రాలను చూస్తారు, వారు తప్పకుండా ఉండేవారు. మనము అక్కడి నివాసులుగా
ఉండేవారము - మొట్టమొదట మనము దేవతలుగా ఉండేవారము, మీ పాత్రను గుర్తు చేసుకుంటారా లేక
మర్చిపోతారా. తండ్రి అంటారు, మీరు ఇక్కడ ఈ పాత్రను అభినయించారు. ఇది డ్రామా. కొత్త
ప్రపంచము తప్పకుండా మళ్ళీ పాత ప్రపంచముగా అవుతుంది. మొట్టమొదట పై నుండి ఏ ఆత్మలైతే
వస్తారో, వారు స్వర్ణిమ యుగములో వస్తారు. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీ బుద్ధిలో ఉన్నాయి.
మీరు విశ్వానికి యజమానులుగా, మహారాజా-మహారాణులుగా ఉండేవారు. మీ రాజధాని ఉండేది.
ఇప్పుడైతే రాజధాని లేదు. మేము రాజ్యాన్ని ఎలా నడిపించాలి అని ఇప్పుడు మీరు
నేర్చుకుంటున్నారు! అక్కడ మంత్రులుండరు. సలహాలిచ్చే వారి అవసరమే ఉండదు. వారు
శ్రీమతము ద్వారా శ్రేష్ఠాతి శ్రేష్ఠంగా తయారైపోతారు. కావున వారికి ఇంకెవరి నుండి
సలహాలు తీసుకునే అవసరమే ఉండదు. ఒకవేళ ఎవరి నుండైనా సలహాలు తీసుకున్నట్లయితే వారి
బుద్ధి బలహీనముగా ఉందని భావించడము జరుగుతుంది. ఇప్పుడు ఏ శ్రీమతమైతే లభిస్తుందో, అది
సత్యయుగములో కూడా నిలిచి ఉంటుంది. మొట్టమొదట తప్పకుండా ఈ దేవీ-దేవతల రాజ్యము
అర్ధకల్పముండేదని ఇప్పుడు మీకు తెలుసు. ఇప్పుడు మీ ఆత్మ రిఫ్రెష్ అవుతోంది. ఈ
జ్ఞానాన్ని పరమాత్మ తప్ప ఇంకెవ్వరూ ఇవ్వలేరు.
ఇప్పుడు పిల్లలైన మీరు దేహీ-అభిమానులుగా అవ్వాలి. శాంతిధామము నుండి వచ్చి ఇక్కడ
మీరు టాకీగా అయ్యారు. టాకీగా అవ్వకుండా కర్మలు జరగవు. ఇవి బాగా అర్థం చేసుకోవలసిన
విషయాలు. ఏ విధముగా తండ్రిలో మొత్తం జ్ఞానముందో, అదే విధముగా మీ ఆత్మలో కూడా
జ్ఞానముంది. నేను ఒక శరీరాన్ని వదిలి సంస్కారము అనుసారముగా మళ్ళీ ఇంకొక శరీరాన్ని
తీసుకుంటాను అని ఆత్మ అంటుంది. పునర్జన్మలు కూడా తప్పకుండా ఉంటాయి. ఆత్మకు ఏ పాత్ర
అయితే లభించి ఉందో, అది అభినయిస్తూ ఉంటుంది. సంస్కారాల అనుసారముగా ఇంకొక జన్మ
తీసుకుంటూ ఉంటారు. రోజురోజుకు ఆత్మ యొక్క పవిత్రతా డిగ్రీ తగ్గిపోతూ ఉంటుంది. పతితము
అనే పదాన్ని ద్వాపరము నుండి ఉపయోగిస్తారు. అయినా కొంచెం తేడా అయితే తప్పకుండా
ఉంటుంది. మీరు కొత్త ఇంటిని నిర్మించండి, ఒక నెల తర్వాత తప్పకుండా ఎంతోకొంత తేడా
వస్తుంది. బాబా మనకు వారసత్వాన్ని ఇస్తున్నారని పిల్లలైన మీరు ఇప్పుడు భావిస్తారు.
తండ్రి అంటారు, నేను పిల్లలైన మీకు వారసత్వాన్ని ఇచ్చేందుకు వచ్చాను. ఎవరు ఎంతగా
పురుషార్థము చేస్తారో, అంతటి పదవిని పొందుతారు. తండ్రి వద్ద ఎలాంటి తేడా ఉండదు. నేను
ఆత్మలను చదివిస్తున్నానని తండ్రికి తెలుసు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకోవడము
అనేది ఆత్మ యొక్క హక్కు, ఇందులో స్త్రీ-పురుషుల దృష్టి ఇక్కడ ఉండదు. మీరందరూ పిల్లలు.
తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. ఇప్పుడు ఆత్మలందరూ సోదరులు, వారిని
తండ్రి చదివిస్తారు, వారసత్వాన్ని ఇస్తారు. తండ్రియే ఆత్మిక పిల్లలతో మాట్లాడుతారు
- ఓ ప్రియమైన, మధురమైన, చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలూ, మీరు చాలా సమయము నుండి
పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ ఇప్పుడు మళ్ళీ మీ వారసత్వాన్ని తీసుకునేందుకు వచ్చి
కలుసుకున్నారు. ఇది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. ప్రారంభము నుండి మొదలుకొని పాత్ర
నిశ్చితమై ఉంది. పాత్రధారులైన మీరు పాత్రను అభినయిస్తూ, నటిస్తూ ఉంటారు. ఆత్మ
అవినాశీ, ఇందులో అవినాశీ పాత్ర నిశ్చితమై ఉంది. శరీరమైతే మారిపోతూ ఉంటుంది. ఇకపోతే
ఆత్మ కేవలం పవిత్రము నుండి అపవిత్రముగా అవుతుంది, పతితముగా అవుతుంది, సత్యయుగములో
పావనముగా ఉంటుంది. దీనిని పతిత ప్రపంచమని అంటారు. దేవతల రాజ్యమున్నప్పుడు నిర్వికారీ
ప్రపంచముండేది. ఇప్పుడది లేదు. ఇది ఆట కదా. కొత్త ప్రపంచము నుండి పాత ప్రపంచముగా,
పాత ప్రపంచము నుండి మళ్ళీ కొత్త ప్రపంచముగా అవుతుంది. ఇప్పుడు సుఖధామము
స్థాపనవుతుంది, మిగిలిన ఆత్మలందరూ ముక్తిధామములో ఉంటారు. ఇప్పుడు ఈ అనంతమైన నాటకము
పూర్తయ్యింది. ఆత్మలన్నీ దోమల వలె వెళ్తాయి. ఈ సమయములో ఏ ఆత్మ వచ్చినా కానీ పతిత
ప్రపంచములో వారికి ఏం విలువ ఉంటుంది. ఎవరైతే కొత్త ప్రపంచములో మొట్టమొదట వస్తారో,
వారికి విలువ ఉంటుంది. ఏదైతే కొత్త ప్రపంచముగా ఉండేదో, అది మళ్ళీ పాతదిగా
అయిపోయిందని మీకు తెలుసు. కొత్త ప్రపంచములో మనము దేవీ-దేవతలుగా ఉండేవారము. అక్కడ
దుఃఖము యొక్క పేరే ఉండేది కాదు. ఇక్కడైతే అపారమైన దుఃఖముంది. తండ్రి వచ్చి దుఃఖము
యొక్క ప్రపంచము నుండి విముక్తులుగా చేస్తారు. ఈ పాత ప్రపంచము తప్పకుండా మారనున్నది.
మీకు తెలుసు, తప్పకుండా మేము సత్యయుగానికి యజమానులుగా ఉండేవారము, మళ్ళీ 84 జన్మల
తర్వాత ఈ విధముగా అయ్యాము. ఇప్పుడు మళ్ళీ తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి
చేసినట్లయితే మీరు స్వర్గానికి యజమానులుగా అవుతారు. కనుక మనము స్వయాన్ని ఆత్మ అని
నిశ్చయము చేసుకుని తండ్రిని ఎందుకు స్మృతి చేయకూడదు. ఎంతోకొంత శ్రమ అయితే చేయాలి కదా.
రాజ్యాన్ని పొందడమనేది సహజమేమీ కాదు. తండ్రిని స్మృతి చేయాలి. పదే-పదే మాయ మిమ్మల్ని
మరిపింపజేస్తుంది, ఇది మాయ యొక్క అద్భుతము. దాని కొరకు ఉపాయాన్ని రచించాలి. నా
వారిగా అవ్వడముతో స్మృతి నిలుస్తుందనేమీ కాదు. ఇక పురుషార్థము ఏం చేస్తారు! లేదు.
ఎంతవరకైతే జీవించి ఉంటారో, అంతవరకు పురుషార్థము చేయాలి. జ్ఞానామృతాన్ని తాగుతూ
ఉండాలి. ఇది మన అంతిమ జన్మ అని కూడా మీకు తెలుసు. ఈ శరీర భానాన్ని వదిలి
దేహీ-అభిమానులుగా అవ్వాలి. గృహస్థ వ్యవహారములో కూడా ఉండాలి. పురుషార్థము తప్పకుండా
చేయాలి. కేవలం స్వయాన్ని ఆత్మగా నిశ్చయించుకుని తండ్రిని స్మృతి చేయండి. త్వమేవ
మాతాశ్చ పితా... ఇదంతా భక్తి మార్గపు మహిమ. మీరు కేవలం ఒక్క భగవంతుడిని స్మృతి
చేయాలి. వారొక్కరే మధురమైన శ్యాక్రిన్. మిగిలిన విషయాలన్నీ వదిలి ఒక్క శ్యాక్రిన్
ను (తండ్రిని) స్మృతి చేయండి. ఇప్పుడు మీ ఆత్మ తమోప్రధానముగా అయిపోయింది, దానిని
సతోప్రధానముగా తయారుచేసుకోవడానికి స్మృతియాత్రలో ఉండండి. తండ్రి నుండి సుఖపు
వారసత్వాన్ని తీసుకోండి అని అందరికీ ఇదే తెలియజేయండి. సుఖము సత్యయుగములోనే ఉంటుంది.
సుఖధామాన్ని స్థాపన చేసేవారు బాబా. తండ్రిని స్మృతి చేయాలి, ఇది చాలా సహజము. కానీ
మాయ వ్యతిరేకత చాలా ఉంది, అందుకే ప్రయత్నము చేసి తండ్రినైన నన్ను స్మృతి
చేసినట్లయితే మాలిన్యము తొలగిపోతుంది. క్షణములో జీవన్ముక్తి అని అంటూ ఉంటారు.
ఆత్మలమైన మనము ఆత్మిక తండ్రికి సంతానము, అక్కడి నివాసులము. మళ్ళీ మనము మన పాత్రను
రిపీట్ చేయాలి. ఈ డ్రామాలో అందరికన్నా ఎక్కువ పాత్ర మనకు ఉంది. సుఖము కూడా
అందరికన్నా ఎక్కువగా మనకే లభిస్తుంది. మీ దేవీ-దేవతా ధర్మము చాలా సుఖాన్ని ఇచ్చేది
అని తండ్రి అంటారు, మిగిలినవారంతా లెక్కాచారాలను పూర్తి చేసుకుని ఆటోమెటిక్ గా
శాంతిధామానికి వెళ్ళిపోతారు. ఎక్కువ విస్తారములోకి మనము ఎందుకు వెళ్ళాలి. తండ్రి
వచ్చేదే అందరినీ తిరిగి తీసుకువెళ్ళేందుకు. దోమల వలె అందరినీ తీసుకువెళ్తారు.
సత్యయుగములో చాలా కొద్దిమంది ఉంటారు. ఇదంతా డ్రామాలో నిశ్చితమై ఉంది. శరీరాలు
సమాప్తమైపోతాయి. అవినాశీగా ఉండే ఆత్మ లెక్కాచారాన్ని సమాప్తము చేసుకుని
వెళ్ళిపోతుంది, అంతేకానీ ఆత్మ అగ్నిలో పడటము వలన పవిత్రముగా అవుతుందని కాదు. స్మృతి
రూపీ యోగాగ్ని ద్వారానే ఆత్మ పవిత్రముగా అవ్వాలి. ఇది యోగాగ్ని. దానికి వారు సీత
అగ్నిని దాటి వెళ్ళిందని నాటకాన్ని తయారుచేసారు. అగ్ని ద్వారా ఎవ్వరూ పావనముగా
అవ్వరు. తండ్రి అర్థం చేయిస్తున్నారు, సీతలైన మీరంతా ఈ సమయములో పతితముగా ఉన్నారు,
రావణ రాజ్యములో ఉన్నారు. ఇప్పుడు ఒక్క తండ్రి స్మృతితో మీరు పావనముగా అవ్వాలి.
రాముడు ఒక్కరే. అగ్ని అనే పదము వినడముతో అగ్నిని దాటారని భావిస్తారు. యోగాగ్ని
ఎక్కడ, అది ఎక్కడ. ఆత్మ పరమపిత పరమాత్మతో యోగాన్ని జోడించడముతోనే పతితము నుండి
పావనముగా అవుతుంది. రాత్రికి-పగలుకు ఉన్నంత తేడా ఉంది. నరకములో సీతలందరూ రావణుని
జైలులో శోకవాటికలో ఉన్నారు. ఇక్కడి సుఖమైతే కాకిరెట్ట సమానమైనది. పోల్చడము
జరుగుతుంది. స్వర్గము యొక్క సుఖాలైతే అపారమైనవి.
ఆత్మలైన మీకు ఇప్పుడు ప్రియుడైన శివునితో నిశ్చితార్థము జరిగింది. కనుక ఆత్మ
స్త్రీ అయింది కదా! శివబాబా అంటారు, కేవలం నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనముగా
అయిపోతారు. శాంతిధామానికి వెళ్ళి మళ్ళీ సుఖధామములోకి వచ్చేస్తారు. కనుక పిల్లలు
జ్ఞాన రత్నాలతో జోలెను నింపుకోవాలి. ఏ రకమైన సంశయాన్ని తీసుకురాకూడదు.
దేహాభిమానములోకి రావడముతో అనేక రకాల ప్రశ్నలు ఉత్పన్నమవుతాయి. ఇక తర్వాత తండ్రి ఏ
కర్తవ్యాన్ని అయితే ఇస్తారో, అది చేయరు. ముఖ్యమైన విషయము, మనము పతితము నుండి
పావనముగా అవ్వాలి. మిగిలిన విషయాలను వదిలేయాలి. రాజధాని యొక్క ఆచార-వ్యవహారాలు ఏవైతే
ఉంటాయో, అవే నడుస్తాయి. మహళ్ళను అప్పుడు ఎలా నిర్మించి ఉంటారో, అలాగే నిర్మిస్తారు.
ముఖ్యమైన విషయము, పవిత్రముగా అవ్వడము. ఓ పతిత-పావనా... అని పిలుస్తారు కూడా.
పావనముగా అవ్వడముతో సుఖవంతులుగా అవుతారు. అందరికన్నా పావనమైనవారు దేవీ-దేవతలు.
ఇప్పుడు మీరు 21 జన్మల కొరకు సర్వోత్తమ పావనులుగా అవుతారు. వారిని సంపూర్ణ
నిర్వికారీ, పావనమైనవారని అంటారు. కనుక తండ్రి ఏదైతే శ్రీమతాన్ని ఇస్తున్నారో,
దానిపై నడవాలి. ఏ సంకల్పమూ చేసే అవసరము లేదు. మొదట మనము పతితము నుండి పావనముగా అయితే
అవ్వాలి. ఓ పతిత-పావనా... అని పిలుస్తారు కూడా, కానీ ఏమీ అర్థం చేసుకోరు.
పతిత-పావనుడు ఎవరు అన్నది కూడా తెలియదు. ఇది పతిత ప్రపంచము, అది పావన ప్రపంచము.
ముఖ్యమైన విషయము పావనముగా అవ్వడమే. పావనముగా ఎవరు తయారుచేస్తారు? ఇది ఏ మాత్రమూ
తెలియదు. పతిత-పావనుడని పిలుస్తారు కానీ మీరు పతితులు అని అన్నట్లయితే డిస్టర్బ్
అవుతారు. ఎవ్వరూ స్వయాన్ని వికారులుగా భావించరు. అందరూ గృహస్థములోనే ఉండేవారు కదా,
రాధా-కృష్ణులు, లక్ష్మీ-నారాయణులకు కూడా పిల్లలుండేవారు కదా అని అంటారు. కానీ అక్కడ
యోగబలము ద్వారా పిల్లలు జన్మిస్తారని మర్చిపోయారు. దానిని నిర్వికారీ ప్రపంచము,
స్వర్గమని అంటారు. అది శివాలయము. తండ్రి అంటారు, పతిత ప్రపంచములో పావనమైనవారు ఒక్కరు
కూడా లేరు. ఈ తండ్రి అయితే తండ్రి, టీచర్ మరియు సద్గురువు కూడా, వారు అందరికీ
సద్గతినిస్తారు. అక్కడైతే ఒక గురువు వెళ్ళిపోతే వారి పిల్లలకు పీఠాన్ని ఇస్తారు.
ఇప్పుడు వారు సద్గతిలోకి ఎలా తీసుకువెళ్తారు? సర్వుల సద్గతిదాత ఒక్కరే. సత్యయుగములో
కేవలం దేవీ-దేవతలుంటారు. మిగిలిన ఆత్మలంతా శాంతిధామానికి వెళ్ళిపోతారు. రావణ రాజ్యము
నుండి విముక్తులైపోతారు. తండ్రి అందరినీ పవిత్రముగా తయారుచేసి తీసుకువెళ్తారు.
పావనము నుండి ఎవ్వరూ వెంటనే పతితముగా అవ్వరు. నంబరువారుగా దిగుతారు, సతోప్రధానము
నుండి సతో, రజో, తమో... మీ బుద్ధిలో 84 జన్మల చక్రము కూర్చుంది. ఇప్పుడు మీరు లైట్
హౌస్ వంటి వారు. ఈ చక్రము ఎలా తిరుగుతుంది అనేది జ్ఞానము ద్వారా తెలుసుకున్నారు.
ఇప్పుడు పిల్లలైన మీరు మిగిలినవారందరికీ మార్గాన్ని తెలియజేయాలి. అందరూ నావలు, మీరు
మార్గాన్ని తెలియజేసే పైలెట్లు. అందరికీ ఇలా చెప్పండి - మీరు శాంతిధామాన్ని,
సుఖధామాన్ని స్మృతి చేయండి, కలియుగ దుఃఖధామాన్ని మర్చిపోండి అని. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.