30-04-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - తండ్రి మిమ్మల్ని పురుషోత్తములుగా తయారుచేసేందుకు చదివిస్తున్నారు, ఇప్పుడు మీరు కనిష్టుల నుండి ఉత్తమ పురుషులుగా అవుతారు, అందరికన్నా ఉత్తమమైనవారు దేవతలు’’

ప్రశ్న:-
ఇక్కడ పిల్లలైన మీరు ఏ శ్రమను చేస్తారు, అది సత్యయుగంలో ఉండదు?

జవాబు:-
ఇక్కడ దేహ సహితంగా దేహం యొక్క సర్వ సంబంధాలను మర్చిపోయి, ఆత్మాభిమానిగా అయి శరీరాన్ని విడిచిపెట్టేందుకు చాలా శ్రమించాల్సి వస్తుంది. సత్యయుగంలో ఎటువంటి శ్రమ లేకుండా కూర్చుని-కూర్చునే శరీరాన్ని విడిచిపెడతారు. ఇప్పుడు మీరు - నేను ఆత్మను, నేను ఈ పాత ప్రపంచాన్ని, పాత శరీరాన్ని విడిచిపెట్టాలి, కొత్తది తీసుకోవాలి అన్న శ్రమను లేదా అభ్యాసాన్ని చేస్తారు. సత్యయుగంలో ఈ అభ్యాసం యొక్క అవసరం ఉండదు.

పాట:-
దూర దేశములో నివసించేవారు...

ఓంశాంతి
మధురాతి-మధురమైన ఆత్మిక పిల్లలకు తెలుసు, మళ్ళీ అనగా కల్ప-కల్పము తర్వాత. దీనినే దూరదేశంలో నివసించేవారు పరాయి దేశంలోకి రావడము అని అంటారు. కేవలం వారొక్కరి కోసమే ఈ గాయనం ఉంది, వారినే అందరూ స్మృతి చేస్తారు, వారు విచిత్రుడు. వారికి చిత్రమేమీ లేదు. బ్రహ్మా, విష్ణు, శంకరులను దేవతలు అని అంటారు. శివ భగవానువాచ అని అంటారు, వారు పరంధామములో ఉంటారు. వారిని సుఖధామములోకి ఎప్పుడూ పిలవరు, దుఃఖధామములోనే పిలుస్తారు. వారు రావడం కూడా సంగమయుగంలో వస్తారు. ఇది పిల్లలకైతే తెలుసు, సత్యయుగంలో మొత్తం విశ్వమంతటిపైన పురుషోత్తములైన మీరు ఉంటారు. మధ్యములు, కనిష్టులు అక్కడ ఉండరు. ఉత్తమోత్తమమైన పురుషులు శ్రీ లక్ష్మీ-నారాయణులే కదా. వీరిని ఆ విధంగా తయారుచేసేవారు శ్రీ-శ్రీ శివబాబా అని మీరు అంటారు. శ్రీ-శ్రీ అని ఆ శివబాబానే అంటారు. ఈ రోజుల్లోనైతే సన్యాసులు మొదలైనవారు కూడా తమను తాము శ్రీ-శ్రీ అని పిలుచుకుంటారు. కావున తండ్రే వచ్చి ఈ సృష్టిని పురుషోత్తమముగా తయారుచేస్తారు. సత్యయుగములో మొత్తం సృష్టి అంతటిలో ఉత్తమోత్తములైన పురుషులు ఉంటారు. ఉత్తమోత్తమమైనవారికి మరియు అతి కనిష్టులైనవారికి మధ్యన ఉన్న వ్యత్యాసాన్ని ఈ సమయంలో మీరు అర్థం చేసుకుంటారు. కనిష్టమైన మనుష్యులు తమ నీచత్వాన్ని చూపిస్తారు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు - మనము ఎలా ఉండేవారిమి, ఇప్పుడు మనం మళ్ళీ స్వర్గవాసులుగా, పురుషోత్తములుగా తయారవుతున్నాము అని. ఇది ఉన్నదే సంగమయుగము. ఈ పాత ప్రపంచము కొత్తదిగా తయారవ్వనున్నది అని మీకు నమ్మకం ఉంది. పాతది కొత్తదిగా, కొత్తది పాతదిగా తప్పకుండా తయారవుతుంది. కొత్తదానిని సత్యయుగమని, పాతదానిని కలియుగమని అంటారు. తండ్రి ఉన్నారే సత్యమైన బంగారము వంటివారు, సత్యాన్ని వినిపించేవారు. వారిని ట్రూత్ (సత్యము) అని అంటారు. అంతా సత్యమునే చెప్తారు. ఈశ్వరుడు సర్వవ్యాపి అని వారు ఏదైతే అంటారో, అది అసత్యము. ఇప్పుడు తండ్రి అంటారు, అసత్యాన్ని వినకండి. చెడు వినకండి, చెడు చూడకండి... రాజ విద్య యొక్క విషయమే వేరు. అది ఉన్నదే అల్పకాలికమైన సుఖాన్ని ఇచ్చేందుకు. మరొక జన్మను తీసుకున్నారంటే మళ్ళీ కొత్తగా చదవాల్సి వస్తుంది. అది అల్పకాలికమైన సుఖము. ఇది 21 జన్మలు, 21 తరాల కోసము. తరము అని సంపూర్ణ ఆయుష్షును అంటారు. అక్కడ ఎప్పుడూ అకాల మరణాలు సంభవించవు. ఇక్కడైతే చూడండి, అకాల మరణాలు ఎలా జరుగుతూ ఉంటాయో. జ్ఞానములో కూడా మరణిస్తూ ఉంటారు. ఇప్పుడు మీరు కాలుడిపై విజయాన్ని పొందుతున్నారు. మీకు తెలుసు - అది అమరలోకము, ఇది మృత్యులోకము. అక్కడైతే వృద్ధులుగా అయినప్పుడు, మేము ఈ శరీరాన్ని వదిలి బాలునిగా అవుతామని సాక్షాత్కారమవుతుంది. వృద్ధాప్యము పూర్తవుతుంది మరియు శరీరాలని వదిలేస్తారు. కొత్త శరీరము లభిస్తుందంటే అది మంచిదే కదా. కూర్చుని-కూర్చుని సంతోషముగా శరీరాన్ని వదిలేస్తారు. ఇక్కడైతే ఆ అవస్థలో ఉంటూ శరీరాన్ని వదలాలంటే శ్రమ అనిపిస్తుంది. ఇక్కడి శ్రమ, అక్కడ మళ్ళీ సాధారణమైన విషయము అయిపోతుంది. ఇక్కడ దేహ సహితంగా ఏదైతే ఉందో, అంతా మర్చిపోవాలి. స్వయాన్ని ఆత్మగా భావించాలి, ఈ పాత ప్రపంచాన్ని వదిలివేయాలి. కొత్త శరీరాన్ని తీసుకోవాలి. ఆత్మ సతోప్రధానంగా ఉన్నప్పుడు సుందరమైన శరీరము లభించింది. తర్వాత కామ చితిపై కూర్చోవడము వలన నల్లగా తమోప్రధానముగా అయిపోయారు, కావున శరీరము కూడా నల్లనిదే లభిస్తుంది, సుందరము నుండి శ్యామముగా అయిపోయారు. కృష్ణుని పేరైతే కృష్ణుడే, మరి వారిని శ్యామ సుందరుడు అని ఎందుకు అంటారు? చిత్రాలలో కూడా కృష్ణుడి చిత్రాన్ని నల్లగా చేస్తారు కానీ అర్థము తెలుసుకోరు. ఇప్పుడు మీరు అర్థం చేసుకుంటారు, సతోప్రధానముగా ఉన్నప్పుడు సుందరముగా ఉండేవారు. ఇప్పుడు తమోప్రధానముగా శ్యామముగా అయ్యారు. సతోప్రధానులను పురుషోత్తములు అని అంటారు, తమోప్రధానులను కనిష్టులు అని అంటారు. తండ్రి అయితే సదా పవిత్రమైనవారు. వారు సుందరంగా తయారుచేసేందుకు వస్తారు. వారు బాటసారి కదా. కల్ప-కల్పము వస్తారు, లేదంటే పాత ప్రపంచాన్ని కొత్తదిగా ఎవరు తయారుచేస్తారు! ఇది పతిత ఛీ-ఛీ ప్రపంచము. ఈ విషయాల గురించి ప్రపంచములో ఎవరికీ తెలియదు. ఇప్పుడు మీకు తెలుసు - తండ్రి మనల్ని పురుషోత్తములుగా తయారుచేసేందుకు చదివిస్తున్నారు. దేవతలుగా అయ్యేందుకు మనమే మళ్ళీ బ్రాహ్మణులుగా అయ్యాము. మీరు సంగమయుగీ బ్రాహ్మణులు. ఇప్పుడు ఇది సంగమయుగమని ప్రపంచానికి తెలియదు. శాస్త్రాలలో కల్పము యొక్క ఆయుష్షును లక్షల సంవత్సరాలుగా వ్రాసారు, కావున కలియుగము ఇంకా బాల్యములోనే ఉందని భావిస్తారు. ఇక్కడికి మనము ఉత్తమోత్తములుగా, కలియుగీ పతితుల నుండి సత్యయుగీ పావనులుగా, మనుష్యుల నుండి దేవతలుగా అయ్యేందుకు వచ్చామని ఇప్పుడు మీరు మనసులో అర్థం చేసుకుంటారు. మురికిపట్టిన వస్త్రాలను భగవంతుడు శుభ్రం చేస్తారని గ్రంథ్ లో కూడా మహిమ ఉంది. కానీ గ్రంథ్ ను చదివేవారు కూడా అర్థాన్ని అర్థం చేసుకోరు. ఈ సమయంలోనైతే తండ్రి వచ్చి మొత్తము ప్రపంచములోని మనుష్యమాత్రులను శుభ్రం చేస్తారు. మీరు ఆ తండ్రి ఎదురుగా కూర్చున్నారు. తండ్రే పిల్లలకు అర్థం చేయిస్తారు. రచయిత మరియు రచన యొక్క ఈ జ్ఞానము ఇంకెవ్వరికీ తెలియనే తెలియదు. తండ్రే జ్ఞానసాగరుడు. వారు సత్యము, చైతన్యము, అమరుడు. పునర్జన్మ రహితుడు. వారు శాంతి సాగరుడు, సుఖ సాగరుడు, పవిత్రతా సాగరుడు. మీరు వచ్చి ఈ వారసత్వాన్ని ఇవ్వండి అని వారినే పిలుస్తారు. ఇప్పుడు మీకు 21 జన్మల కొరకు తండ్రి వారసత్వాన్ని ఇస్తున్నారు. ఇది అవినాశీ చదువు. చదివించేవారు కూడా అవినాశీ తండ్రి. అర్ధకల్పము మీరు రాజ్యాన్ని పొందుతారు, తర్వాత రావణ రాజ్యము వస్తుంది. అర్ధకల్పము రామ రాజ్యము, అర్ధకల్పము రావణ రాజ్యము.

ప్రాణప్రియమైనవారు తండ్రి ఒక్కరే ఎందుకంటే వారే పిల్లలైన మిమ్మల్ని అన్ని దుఃఖాల నుండి విడిపించి అపారమైన సుఖములోకి తీసుకువెళ్తారు. వారు మా ప్రాణాల కన్నా ప్రియమైన పారలౌకిక తండ్రి అని మీరు నిశ్చయముతో అంటారు. ప్రాణము అని ఆత్మను అంటారు. మనుష్యమాత్రులందరూ వారిని గుర్తు చేస్తారు ఎందుకంటే అర్ధకల్పము కొరకు దుఃఖము నుండి విడిపించి శాంతి మరియు సుఖాన్ని ఇచ్చేవారు తండ్రి మాత్రమే. కావున వారు ప్రాణాల కన్నా ప్రియమైనవారు కదా. మీకు తెలుసు, సత్యయుగములో మనము సదా సుఖముగా ఉంటాము. మిగిలినవారందరూ శాంతిధామానికి వెళ్ళిపోతారు. తర్వాత రావణ రాజ్యంలో దుఃఖము ప్రారంభమవుతుంది. ఇది సుఖ-దుఃఖాల ఆట. ఇక్కడ ఇప్పుడిప్పుడే సుఖము, ఇప్పుడిప్పుడే దుఃఖము ఉంటుందని మనుష్యులు భావిస్తారు. కానీ అలా కాదు, మీకు తెలుసు - స్వర్గము వేరు, నరకము వేరు. స్వర్గ స్థాపన రాముడైన తండ్రి చేస్తారు, నరకము యొక్క స్థాపన రావణుడు చేస్తాడు, అతడిని ప్రతి సంవత్సరము కాలుస్తారు. కానీ ఎందుకు కాలుస్తారు? అతడు ఎవరు? అసలేమీ తెలియదు. ఎంత ఖర్చు చేస్తారు. ఎన్ని కథలు కూర్చుని వినిపిస్తారు, రాముడి సీతను, భగవతిని రావణుడు అపహరించినట్లుగా చెప్తారు. అలా జరిగి ఉండవచ్చు అని మనుష్యులు కూడా భావిస్తారు.

ఇప్పుడు మీకు అందరి కర్తవ్యము గురించి తెలుసు. మీ బుద్ధిలో ఈ జ్ఞానం ఉంది. మొత్తం ప్రపంచం యొక్క చరిత్ర-భౌగోళాల గురించి మనుష్యమాత్రులెవ్వరికీ తెలిసి ఉండదు. తండ్రికే తెలుసు. వారిని ప్రపంచ రచయిత అని కూడా అనరు. ప్రపంచమైతే ఉండనే ఉంది. తండ్రి వచ్చి కేవలం ఈ చక్రం ఎలా తిరుగుతుంది అన్న జ్ఞానాన్ని ఇస్తారు. భారత్ లో ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేది, ఆ తర్వాత ఏమి జరిగింది? దేవతలు ఎవరితోనైనా యుద్ధం చేసారా? ఏమీ చేయలేదు. అర్ధకల్పము తర్వాత రావణ రాజ్యము ప్రారంభమవ్వడంతో దేవతలు వామ మార్గములోకి వెళ్ళిపోతారు. అంతేకానీ యుద్ధములో ఎవరో ఓడించారని కాదు. సైన్యము మొదలైనవాటి విషయమేదీ ఉండదు. యుద్ధము ద్వారా రాజ్యాన్ని తీసుకోరు, పోగొట్టుకోరు. ఇక్కడైతే యోగంలో ఉంటూ పవిత్రంగా అయి పవిత్ర రాజ్యాన్ని మీరు స్థాపన చేస్తారు. అంతేకానీ చేతిలో ఏ వస్తువూ లేదు. ఇది డబుల్ అహింస. ఒకటి పవిత్రత యొక్క అహింస, రెండవది మీరు ఎవ్వరికీ దుఃఖమునివ్వరు. అన్నింటికన్నా పెద్ద హింస కామ ఖడ్గానికి సంబంధించినది. అదే ఆదిమధ్యాంతాలు దుఃఖమునిస్తుంది. రావణ రాజ్యములోనే దుఃఖము ప్రారంభమవుతుంది. వ్యాధులు మొదలవుతాయి. ఎన్ని లెక్కలేనన్ని వ్యాధులు ఉన్నాయి. అనేక రకాల మందులు వెలువడుతూ ఉంటాయి. రోగగ్రస్థులుగా అయిపోయారు కదా. మీరు ఈ యోగబలం ద్వారా 21 జన్మల కొరకు నిరోగులుగా అవుతారు. అక్కడ దుఃఖము లేక అనారోగ్యము యొక్క నామ-రూపాలే ఉండవు. దానికోసమే మీరు చదువుతున్నారు. భగవంతుడు మనల్ని చదివించి భగవాన్, భగవతీలుగా తయారుచేస్తున్నారని పిల్లలకు తెలుసు. చదువు కూడా ఎంత సహజమైనది. అరగంట, పావు గంటలో మొత్తము చక్రము యొక్క జ్ఞానమంతా అర్థం చేయిస్తారు. 84 జన్మలు కూడా ఎవరెవరు తీసుకుంటారు అనేది మీకు తెలుసు.

భగవంతుడు మనల్ని చదివిస్తారు, వారు నిరాకారుడు. వారి సత్యాతి-సత్యమైన పేరు శివ. వారు కళ్యాణకారి కదా. సర్వుల కళ్యాణకారి, సర్వుల సద్గతిదాత ఉన్నతోన్నతమైన తండ్రి. ఉన్నతోన్నతులైన మనుష్యులుగా తయారుచేస్తారు. తండ్రి చదివించి తెలివైనవారిగా చేసి, ఇప్పుడు - వెళ్ళి చదివించండి అని అంటారు. ఈ బ్రహ్మాకుమారీ-కుమారులను చదివించేవారు శివబాబా. బ్రహ్మా ద్వారా మిమ్మల్ని దత్తత తీసుకున్నారు. ప్రజాపిత బ్రహ్మా ఎక్కడి నుంచి వచ్చారు? ఈ విషయంలోనే తికమకపడతారు. వీరి యొక్క అనేక జన్మల అంతిమంలో దత్తత తీసుకున్నారు అని అంటారు. ఇప్పుడు అనేక జన్మలు ఎవరు తీసుకున్నారు? ఈ లక్ష్మీ-నారాయణులే పూర్తి 84 జన్మలను తీసుకున్నారు, అందుకే కృష్ణుడిని శ్యామసుందరుడు అని అంటారు. మనమే సుందరముగా ఉండేవారము, తర్వాత రెండు కళలు తగ్గిపోయాయి. కళలు తగ్గుతూ-తగ్గుతూ ఇప్పుడు కళా హీనముగా అయ్యాము. ఇప్పుడు తమోప్రధానము నుండి మళ్ళీ సతోప్రధానముగా ఎలా తయారవ్వాలి? తండ్రి అంటారు - నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పావనముగా అవుతారు. ఇది రుద్ర జ్ఞాన యజ్ఞమని కూడా మీకు తెలుసు. ఇప్పుడు యజ్ఞములో బ్రాహ్మణులు కావాలి. మీరు సత్యమైన బ్రాహ్మణులు, సత్యమైన గీతను వినిపించేవారు, అందుకే సత్యమైన గీతా పాఠశాల అని మీరు రాస్తారు కూడా. ఆ గీతలోనైతే పేరే మార్చేసారు. కల్పక్రితము ఎవరైతే వారసత్వాన్ని తీసుకొని ఉంటారో, వారే తీసుకుంటారు. మీ మనసును ప్రశ్నించుకోండి - మేము పూర్తి వారసత్వాన్ని తీసుకోగలమా? మనుష్యులు శరీరాన్ని వదిలినప్పుడు ఖాళీ చేతులతో వెళ్తారు, ఆ వినాశీ సంపాదనైతే తోడుగా వెళ్ళదు. మీరు శరీరాన్ని వదిలితే చేతులు నింపుకుని వెళ్తారు ఎందుకంటే 21 జన్మల కొరకు మీరు మీ సంపాదనను జమ చేసుకుంటున్నారు. మనుష్యుల సంపాదన అంతా మట్టిలో కలిసిపోతుంది. మరి మనము ట్రాన్స్ఫర్ చేసి బాబాకు ఎందుకు ఇవ్వకూడదు. ఎవరైతే ఎక్కువగా దానము చేస్తారో, వారు మరుసటి జన్మలో షావుకార్లుగా అవుతారు, ట్రాన్స్ఫర్ చేసుకుంటారు కదా. ఇప్పుడు మీరు 21 జన్మల కొరకు కొత్త ప్రపంచములోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. అందుకు ప్రతిఫలంగా మీకు 21 జన్మల కొరకు లభిస్తుంది. వారైతే ఒక్క జన్మ కొరకు, అల్పకాలము కొరకు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. మీరైతే 21 జన్మల కొరకు ట్రాన్స్ఫర్ చేసుకుంటారు. తండ్రి అయితే దాత. ఇది డ్రామాలో రచింపబడి ఉంది. ఎవరెంతగా చేసుకుంటారో, అంతగా పొందుతారు. వారు ఇన్ డైరెక్ట్ గా దాన-పుణ్యాలు చేస్తారు, కావున అల్పకాలము కొరకు ప్రతిఫలం లభిస్తుంది. ఇది డైరెక్ట్. ఇప్పుడు అంతా కొత్త ప్రపంచములోకి ట్రాన్స్ఫర్ చేయాలి. వీరిని (బ్రహ్మాను) చూసారు, ఎంత సాహసము చేసారు. సర్వస్వము ఈశ్వరుడే ఇచ్చారు అని మీరు అంటారు. ఇప్పుడు తండ్రి అంటారు - ఇదంతా నాకు ఇవ్వండి. నేను మీకు విశ్వ రాజ్యాధికారాన్ని ఇస్తాను. బాబా అయితే వెంటనే ఇచ్చేసారు, ఆలోచించలేదు. పూర్తి అధికారాన్ని ఇచ్చేసారు. నాకు విశ్వ రాజ్యాధికారం లభిస్తుంది అన్న నషా ఎక్కింది. పిల్లలు మొదలైనవారి గురించి ఏమీ ఆలోచించలేదు. ఇచ్చేవారు ఈశ్వరుడు, కావున ఎవరికైనా నేను బాధ్యుడిని ఎలా అవుతాను. 21 జన్మల కొరకు ఎలా ట్రాన్స్ఫర్ తెలుసుకోవాలంటే - ఈ తండ్రిని (బ్రహ్మాను) చూడండి, ఫాలో ఫాదర్ చేయండి. ప్రజాపిత బ్రహ్మా చేసారు కదా. ఈశ్వరుడైతే దాత. వారు వీరి ద్వారా చేయించారు. మీకు కూడా తెలుసు - తండ్రి నుండి రాజ్యాధికారం తీసుకునేందుకు మనం వచ్చాము. రోజు రోజుకు సమయము తగ్గిపోతూ ఉంటుంది, ఆపదలు ఎటువంటివి వస్తాయంటే ఇక అడగకండి. వ్యాపారుల శ్వాస గుప్పిట్లో ఉంటుంది, ఏ యమదూతలు వస్తారో అని. సిపాయిల ముఖాలను చూసి మనుష్యులు స్పృహ కోల్పోతారు. మున్ముందు ఎంతగానో విసిగిస్తారు. బంగారం మొదలైనవేవీ పెట్టుకోనివ్వరు. ఇక మీ వద్ద ఏముంటుంది! ఏదైనా కొనుగోలు చేసేందుకు ధనమే ఉండదు. నోట్లు మొదలైనవి కూడా చెల్లవు. రాజ్యము మారిపోతుంది. అంతిమంలో చాలా దుఃఖితులై మరణిస్తారు. చాలా దుఃఖం తర్వాత మళ్ళీ సుఖం ఉంటుంది. ఇది అనవసరమైన రక్తసిక్తపు ఆట. ప్రకృతి వైపరీత్యాలు కూడా జరుగుతాయి. దీని కన్నా ముందు తండ్రి నుండి పూర్తి వారసత్వాన్ని అయితే తీసుకోవాలి. తిరగండి, విహరించండి, కేవలం తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే పావనంగా అవుతారు. ఇకపోతే, ఆపదలు ఎన్నో వస్తాయి. ఎంతగానో ఆర్తనాదాలు చేస్తూ ఉంటారు. పిల్లలైన మీరు ఇప్పుడు ఎటువంటి అభ్యాసం చేయాలి అంటే అంతిమంలో ఒక్క శివబాబాయే గుర్తు ఉండాలి. వారి స్మృతిలోనే ఉంటూ శరీరాన్ని విడిచిపెట్టాలి, మిత్ర-సంబంధీకులు మొదలైనవారు ఎవరూ గుర్తు రాకూడదు. ఈ అభ్యాసం చేయాలి. తండ్రినే స్మృతి చేయాలి మరియు నారాయణుడిగా తయారవ్వాలి. ఈ అభ్యాసము ఎంతగానో చేయాల్సి ఉంటుంది. లేదంటే చాలా పశ్చాత్తాపపడవలసి వస్తుంది. ఇంకెవరైనా గుర్తుకు వచ్చినట్లయితే ఫెయిల్ అయినట్లు. ఎవరైతే పాస్ అవుతారో, వారే విజయ మాలలో కూర్చబడతారు. తండ్రిని ఎంతగా స్మృతి చేస్తున్నాను అని స్వయాన్ని ప్రశ్నించుకోవాలి. చేతిలో ఏదైనా ఉన్నట్లయితే అది అంతిమ సమయంలో గుర్తుకు వస్తుంది. చేతిలో లేదంటే గుర్తు కూడా రాదు. తండ్రి అంటారు, నా వద్ద ఏమీ లేదు. ఇవి నా వస్తువులు కావు. ఆ జ్ఞానానికి బదులుగా ఈ జ్ఞానాన్ని తీసుకున్నట్లయితే 21 జన్మల కొరకు వారసత్వము లభిస్తుంది. లేదంటే స్వర్గ రాజ్యాన్ని పోగొట్టుకుంటారు. తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకునేందుకే మీరు ఇక్కడికి వస్తారు. పావనముగా అయితే తప్పకుండా అవ్వాలి. లేకపోతే శిక్షలను అనుభవించి, లెక్కాచారాలను సమాప్తం చేసుకుని వెళ్తాము. పదవి కూడా ఏమీ లభించదు. శ్రీమతముపై నడిచినట్లయితే కృష్ణుడిని ఒడిలోకి తీసుకుంటారు. కృష్ణుని వంటి పతి లభించాలి, కృష్ణుని వంటి కొడుకు లభించాలి అని అంటారు కదా. కొందరైతే మంచి రీతిలో అర్థం చేసుకుంటారు, కొందరు తప్పుగా మాట్లాడుతూ ఉంటారు. అచ్ఛా!

మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఏ విధంగానైతే బ్రహ్మా బాబా తమదంతా ట్రాన్స్ఫర్ చేసి పూర్తి అధికారాన్ని తండ్రికి ఇచ్చేసారో, ఆలొచించలేదో, అదే విధముగా ఫాలో ఫాదర్ చేసి 21 జన్మల ప్రారబ్ధాన్ని జమ చేసుకోవాలి.

2. అంతిమ సమయములో ఒక్క తండ్రి తప్ప ఇంకేదీ గుర్తుకు రాకూడదు అన్న అభ్యాసం చేయాలి. నాదంటూ ఏదీ లేదు, సర్వస్వము బాబాది. అల్ఫ్ మరియు బే (తండ్రి మరియు వారసత్వము), ఈ స్మృతి ద్వారా పాస్ అయి విజయమాలలోకి రావాలి.

వరదానము:-
మనసుపై పూర్తి అటెన్షన్ ను ఉంచే ఎక్కే కళ యొక్క అనుభవీ విశ్వ పరివర్తక భవ

ఇప్పుడు చివరి సమయంలో మనసు ద్వారానే విశ్వ పరివర్తనకు నిమిత్తులుగా అవ్వాలి, అందుకే ఇప్పుడు మనసులోని ఒక్క సంకల్పము వ్యర్థమైనా ఎంతో పోగొట్టుకున్నట్లు, ఒక్క సంకల్పాన్ని కూడా సాధారణ విషయంగా భావించకండి, వర్తమాన సమయములో సంకల్పాల అలజడి కూడా పెద్ద అలజడిగా లెక్కించబడుతుంది ఎందుకంటే ఇప్పుడు సమయము మారిపోయింది, పురుషార్థపు గతి కూడా మారిపోయింది కావున సంకల్పాలలోనే ఫుల్ స్టాప్ పెట్టాలి. ఎప్పుడైతే మనసుపై ఇంతటి అటెన్షన్ ఉంటుందో, అప్పుడు ఎక్కే కళ ద్వారా విశ్వ పరివర్తకులుగా అవ్వగలరు.

స్లోగన్:-
కర్మలలో యోగం యొక్క అనుభవము అవ్వడము అనగా కర్మయోగిగా అవ్వడము.

అవ్యక్త సూచనలు - కంబైండ్ రూపపు స్మృతి ద్వారా సదా విజయులుగా అవ్వండి’’

‘‘బాబా మరియు మీరు’’ - ఈ కంబైండ్ రూపాన్ని అనుభవము చేస్తూ, సదా శుభ భావన, శ్రేష్ఠ కామన, శ్రేష్ఠ వాణి, శ్రేష్ఠ దృష్టి, శ్రేష్ఠ కర్మల ద్వారా విశ్వ కళ్యాణకారీ స్వరూపాన్ని అనుభవము చేసినట్లయితే క్షణములో సర్వ సమస్యలను సమాధానపర్చగలరు. సదా ఒక స్లోగన్ ను గుర్తుంచుకోండి - ‘‘సమస్యగానూ అవ్వము, అలాగే సమస్యను చూసి అలజడి చెందము, స్వయము కూడా సమాధాన స్వరూపులుగా ఉంటాము మరియు ఇతరులకు కూడా సమాధానాన్ని ఇస్తాము’’. ఈ స్మృతి సఫలతా స్వరూపులుగా చేస్తుంది.