30-04-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - ఇది మీ అద్భుతమైన యూనివర్శిటీ, ఇందులో
పాడైనదానిని బాగుచేసే భోళానాథుడైన తండ్రి టీచరుగా అయి మిమ్మల్ని చదివిస్తారు’’
ప్రశ్న:-
ఈ
వినాశన సమయములో పిల్లలైన మీరు అందరికీ ఏ లక్ష్యాన్ని ఇస్తారు?
జవాబు:-
ఓ ఆత్మలూ,
ఇప్పుడు పావనముగా అవ్వండి, పావనముగా అవ్వకుండా తిరిగి వెళ్ళలేరు. అర్ధకల్పము నుండి
ఏదైతే రోగము పట్టి ఉందో, దాని నుండి విముక్తులుగా అవ్వడానికి మీరు అందరినీ 7 రోజుల
భట్టీలో కూర్చోబెడతారు. పతితుల సాంగత్యము నుండి దూరముగా ఉండాలి, ఎవ్వరూ గుర్తుకు
రాకూడదు, అప్పుడు బుద్ధిలో ఎంతోకొంత జ్ఞాన ధారణ జరుగుతుంది.
పాట:-
నీవు నిదురించి
రాత్రిని పోగొట్టుకున్నావు...
ఓంశాంతి
ఇది పిల్లలకు ఎవరు చెప్పారు? స్కూల్లో కూర్చుని ఉన్నారు కనుక తప్పకుండా టీచరు చెప్పి
ఉంటారు. ఇది టీచరు చెప్పారా, తండ్రి చెప్పారా లేక సద్గురువు చెప్పారా అన్న ప్రశ్న
తలెత్తుతుంది. ఈ మహావాక్యాలను ఎవరు వినిపించారు? పిల్లల బుద్ధిలో మొట్టమొదట ఏ విషయము
రావాలంటే - వారు మా అనంతమైన తండ్రి, వారిని పరమపిత పరమాత్మ అని అంటారు. కావున తండ్రి
కూడా చెప్పినట్లు, టీచరు కూడా చెప్పినట్లు, ఇంకా సద్గురువు కూడా చెప్పినట్లు. ఇది
విద్యార్థులైన మీ బుద్ధిలో ఉంది. వేరే కాలేజ్ లేదా యూనివర్శిటీలలో టీచరు చదివిస్తారు,
వారినేమీ తండ్రి లేదా గురువు అని అనరు. ఇది కూడా పాఠశాలనే, దీనిని యూనివర్శిటీ అని
అయినా అనవచ్చు లేక కాలేజ్ అని అయినా అనవచ్చు. ఎందుకంటే ఇది చదువు కదా. పాఠశాలలో
మమ్మల్ని ఎవరు చదివిస్తున్నారు అన్నది మొట్టమొదట అర్థం చేసుకోవాలి. ఆత్మలందరికీ
తండ్రి అయిన ఆ నిరాకారుడు, సర్వుల సద్గతిదాత మమ్మల్ని చదివిస్తున్నారని పిల్లలకు
తెలుసు. ఈ మొత్తము రచన అంతా ఆ ఒక్క రచయిత యొక్క ప్రాపర్టీ, కావున వారు స్వయమే
కూర్చుని, రచన యొక్క ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తారు. పిల్లలైన మీరు
తండ్రి వద్ద జన్మ తీసుకున్నారు. ఆత్మలైన మనందరికీ వారు తండ్రి అని, వారిని
జ్ఞానసాగరుడు, నాలెడ్జ్ ఫుల్ అని అంటారని మీరు బుద్ధి ద్వారా తెలుసుకున్నారు. వారు
జ్ఞానసాగరుడు, పతిత-పావనుడు. జ్ఞానము ద్వారానే సద్గతి కలుగుతుంది, మనుష్యులు పతితము
నుండి పావనముగా అవుతారు. ఇప్పుడు పిల్లలైన మీరు ఇక్కడ కూర్చున్నారు. ఇంకే స్కూలులోనూ,
మాకు జ్ఞానసాగరుడైన నిరాకార తండ్రి చదివిస్తున్నారు అన్నది ఎవరి బుద్ధిలోనూ ఉండదు.
ఇది మీరు ఇక్కడ మాత్రమే తెలుసుకున్నారు. మీకు మాత్రమే అర్థం చేయించడము జరుగుతుంది.
ముఖ్యముగా భారత్ లో మరియు మిగతా ప్రపంచములో కూడా, మమ్మల్ని నిరాకార పరమాత్మ
చదివిస్తున్నారని ఎవ్వరూ భావించరు. వారిని మనుష్య టీచర్లే చదివిస్తారు. అంతేకాక,
వారికి నేను ఒక ఆత్మను అన్నది అర్థం చేసుకునే జ్ఞానము కూడా లేదు. ఆత్మయే
చదువుకుంటుంది, ఆత్మయే అంతా చేస్తుంది. ఫలానా ఉద్యోగాన్ని ఆత్మ చేస్తుంది, ఈ
ఇంద్రియాల ద్వారా చేస్తుంది. నేను ఫలానాను అన్న అవగాహన వారికి ఉంటుంది, వారికి
వెంటనే తమ నామ-రూపాలు గుర్తుకువస్తాయి. నేను ఇది చేస్తాను, నేను ఇలా చేస్తాను అని
అనుకుంటారు. శరీరము పేరే గుర్తుకువస్తుంది, కానీ అది రాంగ్. ముందుగా మనము ఆత్మ కదా.
తర్వాత ఈ శరీరాన్ని తీసుకున్నాము. శరీరము పేరు మారుతూ ఉంటుంది, ఆత్మ పేరైతే మారదు.
ఆత్మ ఒక్కటే ఉంటుంది. ఆత్మనైన నాకు శివ అన్న పేరు ఒక్కటే ఉందని తండ్రి చెప్పారు. ఇది
మొత్తము ప్రపంచానికి తెలుసు. ఇకపోతే ఈ పేర్లన్నీ శరీరాలకు పెట్టడము జరుగుతుంది.
శివబాబానైతే శివ అనే అంటారు, అంతే. వారిదంటూ శరీరము ఏమీ కనిపించదు. నేను ఫలానాను అని
మనుష్యులకు పేరు ఉంటుంది. మమ్మల్ని ఫలానా టీచరు చదివిస్తున్నారని పేరు చెప్తారు కదా.
వాస్తవానికి ఆత్మ శరీరము ద్వారా టీచరు పని చేస్తుంది, ఆ ఆత్మలను చదివిస్తుంది.
సంస్కారాలు ఆత్మలోనే ఉంటాయి. ఆత్మ ఇంద్రియాల ద్వారా చదివిస్తుంది,
సంస్కారాలనుసారముగా పాత్రను అభినయిస్తుంది. కానీ దేహానికున్న పేర్లు అనుసారముగానే,
వ్యాపారాలు మొదలైనవన్నీ నడుస్తాయి. ఇక్కడ మనల్ని నిరాకార తండ్రి చదివిస్తున్నారని
పిల్లలైన మీకు తెలుసు. మీ బుద్ధి ఎక్కడికి వెళ్ళింది. ఆత్మ అయిన మనము ఆ తండ్రికి
చెందినవారిగా అయ్యాము. నిరాకార తండ్రి వచ్చి, ఈ సాకారుని ద్వారా మనల్ని
చదివిస్తున్నారని ఆత్మకు తెలుసు, వారి పేరు శివ. శివజయంతిని కూడా జరుపుకుంటారు.
శివుడైతే అనంతమైన తండ్రి, వారినే పరమపిత పరమాత్మ అని అంటారు. వారు ఆత్మలందరికీ
తండ్రి, ఇప్పుడు వారి జయంతిని ఎలా జరుపుకుంటారు. ఆత్మ శరీరములో ప్రవేశిస్తుందా లేక
గర్భములో ప్రవేశిస్తుందా. ఆత్మ పై నుండి వస్తుంది అన్నది ఎవరికీ తెలియదు. క్రైస్టును
ధర్మస్థాపకుడని అంటారు. వారి ఆత్మ మొట్టమొదట పై నుండి రావలసి ఉంటుంది. సతోప్రధాన
ఆత్మ వస్తుంది, ఎటువంటి వికర్మ చేసి ఉండదు. ముందు సతోప్రధానముగా ఉంటుంది, ఆ తర్వాత
సతో, రజో, తమోలలోకి వస్తుంది, అప్పుడు వికర్మలు జరుగుతాయి. ఆత్మ మొదట వచ్చినప్పుడు
సతోప్రధానముగా ఉన్న కారణముగా, ఎటువంటి దుఃఖాన్ని అనుభవించదు. సగము సమయము
పూర్తయినప్పుడు వికర్మలు చేయడము మొదలుపెడుతుంది.
నేటికి 5 వేల సంవత్సరాల క్రితం తప్పకుండా సూర్యవంశీ రాజ్యముండేది, మిగిలిన
ధర్మాలన్నీ తర్వాత వచ్చాయి. భారతవాసులు విశ్వానికి యజమానులుగా ఉండేవారు. భారత్ ను
అవినాశీ ఖండమని అంటారు, ఆ సమయములో వేరే ఖండాలేవి లేవు. శివబాబా పాడైనదానిని
బాగుచేసేవారు. భోళానాథుడని శివుడినే అంటారు, అంతేకానీ శంకరుడిని కాదు. భోళానాథుడైన
శివుడు పాడైనదానిని బాగుచేసేవారు. శివుడు మరియు శంకరుడు ఒక్కరు కాదు, వేర్వేరు.
బ్రహ్మా, విష్ణు, శంకరులకు ఎటువంటి మహిమ లేదు. మహిమ కేవలం పాడైనదానిని బాగుచేసే
ఒక్క శివునిది మాత్రమే. వారు అంటారు, నేను సాధారణ వృద్ధ తనువులోకి వస్తాను. వీరు (బ్రహ్మా)
84 జన్మలు పూర్తి చేశారు, ఇప్పుడు ఆట పూర్తయ్యింది. ఈ పాత శరీరము, పాత సంబంధాలు కూడా
సమాప్తమవ్వనున్నాయి. ఇప్పుడిక ఎవరిని గుర్తు చేయాలి? సమాప్తమయ్యే వాటిని గుర్తు
చేయడము జరగదు. కొత్త ఇల్లు తయారవుతున్నప్పుడు, పాతదాని నుండి మనసు తొలగిపోతుంది.
ఇక్కడ ఇది అనంతమైన విషయము. సర్వుల సద్గతి జరుగుతుంది అనగా రావణ రాజ్యము నుండి
అందరికీ విముక్తి లభిస్తుంది. రావణుడు అందరినీ పాడు చేసాడు. భారత్ పూర్తిగా
నిరుపేదగా, భ్రష్టాచారిగా ఉంది. మనుష్యులు అవినీతిని, కల్తీని, దొంగతనాన్ని,
మోసాన్ని భ్రష్టాచారముగా భావిస్తారు. కానీ తండ్రి అంటారు - మొదటి భ్రష్టాచారము
మురికి పట్టిన వస్త్రాలుగా అవ్వడము (అపవిత్రముగా అవ్వడము). శరీరము వికారాల ద్వారా
జన్మిస్తుంది, అందుకే దీనిని వికారీ ప్రపంచమని అంటారు. సత్యయుగాన్ని నిర్వికారీ
ప్రపంచమని అంటారు. మనము సత్యయుగములో ప్రవృత్తి మార్గపు దేవీ-దేవతలుగా ఉండేవారము.
పవిత్రముగా ఉంటే, వికారాలు లేకపోతే, పిల్లలు ఎలా జన్మిస్తారని అంటారు. అప్పుడు మీరు
చెప్పండి - మేము మా రాజధానిని బాహుబలముతో కాదు, యోగబలముతో స్థాపన చేస్తాము,
అటువంటప్పుడు యోగబలముతో పిల్లలు జన్మించలేరా! అయినా అది నిర్వికారీ ప్రపంచము,
అక్కడున్నది పవిత్ర గృహస్థాశ్రమము. యథా రాజా రాణి, తథా ప్రజా అందరూ సంపూర్ణ
నిర్వికారులుగా ఉంటారు. ఇక్కడ సంపూర్ణ వికారులుగా ఉన్నారు. సత్యయుగములో వికారాలు
ఉండవు. దానిని ఈశ్వరీయ రాజ్యమని అంటారు, ఈశ్వరుడైన తండ్రి స్థాపన చేసినటువంటిది.
ఇప్పుడిది రావణ రాజ్యము. స్వర్గాన్ని స్థాపన చేసిన శివబాబాకు పూజ జరుగుతుంది.
నరకముగా తయారుచేసిన రావణుడిని కాలుస్తూ వస్తారు. ద్వాపరము ఎప్పుడు ప్రారంభమయ్యింది,
ఇది కూడా ఎవరికీ తెలియదు. ఇది కూడా అర్థం చేసుకోవలసిన విషయము. ఇది తమోప్రధాన ఆసురీ
ప్రపంచము. అది ఈశ్వరీయ ప్రపంచము. దానిని స్వర్గమని, దైవీ పావన ప్రపంచమని అంటారు. ఇది
నరకము, పతిత ప్రపంచము. ఎవరైతే రోజూ చదువుకుంటారో, వారే ఈ విషయాలను అర్థం చేసుకుంటారు.
ఫలానా స్థానములో (మధుబన్) స్కూలు లేదు కదా అని చాలామంది అంటారు. అరే, హెడ్ ఆఫీస్
ఉంది కదా. మీరు వచ్చి డైరెక్షన్ లను తీసుకుని వెళ్ళండి. ఇది పెద్ద విషయమేమీ కాదు.
సృష్టి చక్రాన్ని సెకండులో అర్థం చేయించడము జరుగుతుంది. సత్య, త్రేతాయుగాలు
గడిచిపోయాయి, తర్వాత ద్వాపర, కలియుగాలు ఉంటాయి, అవి కూడా గడిచిపోయాయి, ఇప్పుడిది
సంగమయుగము. కొత్త ప్రపంచములోకి వెళ్ళేందుకు చదువుకోవాలి. ప్రతి ఒక్కరికీ చదువుకునే
హక్కు ఉంది. బాబా, మేము ఉద్యోగము చేస్తున్నామని అంటారు. అచ్ఛా, ఒక వారము రోజులు
జ్ఞానము తీసుకుని, ఆ తర్వాత వెళ్ళండి, మురళీ అందుతూ ఉంటుంది. ముందు 7 రోజులు భట్టీలో
తప్పకుండా ఉండాలి. 7 రోజులు వస్తారు కానీ అందరి బుద్ధి ఒకేలా ఉండదు. 7 రోజుల భట్టీ
అంటే ఎవ్వరూ గుర్తుకు రాకూడదు, ఎవరితోనూ పత్ర వ్యవహారాలు మొదలైనవి కూడా ఉండకూడదు.
అందరూ ఒకేలా అయితే అర్థం చేసుకోలేరు. ఇక్కడ పతితులు పావనముగా అవ్వాలి. ఈ పతితత్వము
కూడా ఒక రోగము, మనుష్యులు అర్ధకల్పపు మహారోగులుగా ఉన్నారు. వారిని వేరుగా
కూర్చోబెట్టవలసి ఉంటుంది. ఎవ్వరి సాంగత్యము ఉండకూడదు. బయటకు వెళ్తే, అశుద్ధమైన
పదార్థాలు తింటారు, పతితుల చేతి వంటను తింటారు. సత్యయుగములో దేవతలు పావనముగా ఉంటారు
కదా. వారి కోసం ప్రత్యేకముగా మందిరాలను నిర్మిస్తారు చూడండి. దేవతలను పతితులు
ముట్టుకోలేరు. ఈ సమయములోనైతే మనుష్యులు పూర్తిగా పతితులుగా, భ్రష్టాచారులుగా ఉన్నారు.
శరీరము విషముతో జన్మిస్తుంది, అందుకే దానిని భ్రష్టాచారీ అని అంటారు. సన్యాసుల
శరీరము కూడా విషముతోనే తయారయ్యింది. తండ్రి అంటారు - మొట్టమొదట ఆత్మ పవిత్రముగా
అవ్వాలి, తర్వాత శరీరము కూడా పవిత్రమైనది కావాలి, అందుకే పాత అపవిత్ర శరీరాలన్నీ
వినాశనము చెందవలసి ఉంటుంది. అందరూ తిరిగి వెళ్ళాలి. ఇది వినాశన సమయము. అందరూ
పవిత్రముగా అయి తిరిగి వెళ్ళాలి. భారత్ లోనే హోలిక పండుగను జరుపుకుంటారు. ఇక్కడ
పంచతత్వాల శరీరము తమోప్రధానముగా ఉంది. సత్యయుగములో శరీరాలు కూడా సతోప్రధానముగా
ఉంటాయి. శ్రీకృష్ణుని చిత్రముంది కదా, నరకాన్ని కాలదన్నవలసి ఉంటుంది ఎందుకంటే
సత్యయుగములోకి వెళ్ళాలి. శవాన్ని కూడా శ్మశానానికి తీసుకువెళ్ళినప్పుడు, మొదట
ముఖాన్ని ఊరి వైపు, కాళ్ళను శ్మశానము వైపు పెడతారు, తర్వాత శ్మశానము లోపలికి
వెళ్ళినప్పుడు, ముఖాన్ని శ్మశానము వైపు తిప్పుతారు. ఇప్పుడు మీరు స్వర్గములోకి
వెళ్తారు కనుక మీ ముఖము అటు వైపు ఉంది అనగా శాంతిధామము మరియు సుఖధామము వైపు ఉంది,
కాళ్ళు దుఃఖధామము వైపు ఉన్నాయి. ఇది శవానికి సంబంధించిన విషయము. ఇక్కడైతే
పురుషార్థము చేయవలసి ఉంటుంది. స్వీట్ హోమ్ ను (మధురమైన ఇల్లు) స్మృతి చేస్తూ-చేస్తూ
ఆత్మలైన మీరు స్వీట్ హోమ్ కు వెళ్ళిపోతారు. ఇది బుద్ధితో చేసే ప్రాక్టీస్. తండ్రి
కూర్చుని ఈ రహస్యాలన్నింటినీ అర్థం చేయిస్తారు. ఇప్పుడు ఆత్మలమైన మనము ఇంటికి
వెళ్ళాలని మీకు తెలుసు. ఇది పాత శరీరము, పాత ప్రపంచము. నాటకము పూర్తయ్యింది అంటే 84
జన్మల పాత్రను అభినయించాము. అందరూ 84 జన్మలు తీసుకోరని కూడా అర్థం చేయించారు. ఎవరైతే
రావడమే తర్వాత వస్తారో, వేరే ధర్మాలలోకి వస్తారో, వారికి తప్పకుండా తక్కువ జన్మలు
ఉంటాయి. ఇస్లాముల కన్నా బౌద్ధులకు తక్కువ జన్మలు ఉంటాయి, వారి కన్నా క్రిస్టియన్లకు
ఇంకా తక్కువ జన్మలు ఉంటాయి. గురునానక్ కు చెందిన సిక్కులైతే ఇప్పుడే వచ్చారు.
గురునానక్ వచ్చి 500 సంవత్సరాలయ్యింది కనుక వారు 84 జన్మలు తీసుకోరు. లెక్క వేయడము
జరుగుతుంది. 5 వేల సంవత్సరాలలో ఇన్ని జన్మలుంటే, 500 సంవత్సరాలలో ఎన్ని జన్మలు
ఉండవచ్చు. 12-13 జన్మలు ఉండవచ్చు. క్రైస్టు వచ్చి 2 వేల సంవత్సరాలయ్యింది కనుక
వారికి ఎన్ని జన్మలు ఉంటాయి. సగము కన్నా తక్కువ ఉంటాయి. లెక్క ఉంది కదా. ఇందులో
కొందరు కొన్ని, కొందరు కొన్ని జన్మలు తీసుకుంటారు, ఏక్యురేట్ గా చెప్పలేము. ఈ
విషయాల గురించి వాదించడములో ఎక్కువ టైమ్ వేస్ట్ చేయకూడదు. మీ పని తండ్రిని స్మృతి
చేయడము. బుద్ధి వ్యర్థమైన విషయాలలోకి వెళ్ళకూడదు. తండ్రితో యోగాన్ని జోడించాలి,
చక్రాన్ని తెలుసుకోవాలి. ఇకపోతే స్మృతితోనే పాపాలు నశిస్తాయి. ఇందులోనే శ్రమ ఉంది,
అందుకే భారత్ యొక్క ప్రాచీన యోగమని అంటారు, దీనిని తండ్రియే నేర్పిస్తారు. సత్య,
త్రేతాయుగాలలోనైతే యోగమనే మాటే ఉండదు. తర్వాత భక్తి మార్గములో హఠయోగము
ప్రారంభమవుతుంది. ఇది సహజ రాజయోగము. తండ్రి అంటారు, నన్ను స్మృతి చేయడముతో పావనముగా
అవుతారు. ముఖ్యమైన విషయము స్మృతి. ఏ పాపము చేయకూడదు. దేవీ-దేవతలకు మందిరాలు ఉన్నాయి
ఎందుకంటే వారు పావనులు. పూజారులైతే పతితులు, వారు పావన దేవతలకు స్నానాలు మొదలైనవి
చేయిస్తారు. వాస్తవానికి పతితుల చేయి కూడా అంటకూడదు. ఇవన్నీ భక్తి మార్గపు
ఆచారాలు-పద్ధతులు. ఇప్పుడైతే మనము పావనముగా అవుతున్నాము. పవిత్రముగా అయిపోతే మనము
దేవతలుగా అయిపోతాము. అక్కడైతే పూజలు మొదలైనవాటి అవసరము ఉండదు. సర్వుల సద్గతిదాత
ఒక్క తండ్రి మాత్రమే. వారినే భోళానాథుడని అంటారు. నేను పతిత ప్రపంచములోకి, పతిత
శరీరములోకి, పాత రావణ రాజ్యములోకి వస్తాను. అయితే వారు ఎవరి తనువులోనైనా ప్రవేశించి
మురళీని వినిపించగలరు. అలాగని వారు సర్వవ్యాపి అని కాదు. ప్రతి ఒక్కరిలోనైతే వారి
వారి ఆత్మ ఉంటుంది. మీ ఆత్మకు తండ్రి ఎవరు అని ఫారమ్ లో కూడా వ్రాయించడము జరుగుతుంది
కానీ అర్థం చేసుకోరు. ఆత్మల తండ్రి ఒక్కరే ఉంటారు. మనమంతా సోదరులము, తండ్రి ఒక్కరే,
వారి నుండి జీవన్ముక్తి యొక్క వారసత్వము లభిస్తుంది, వారే ముక్తిదాత, మార్గదర్శకుడు.
ఆత్మలందరినీ స్వీట్ హోమ్ కు తీసుకువెళ్తారు, అందుకే పాత ప్రపంచ వినాశనము జరుగుతుంది.
హోలిక పండుగ జరుగుతుంది కదా. శరీరాలన్నీ సమాప్తమైపోతాయి, ఇకపోతే ఆత్మలన్నీ తిరిగి
వెళ్ళిపోతాయి. సత్యయుగములోనైతే చాలా కొద్దిమంది ఉంటారు. స్వర్గ స్థాపనను ఎవరు
చేయిస్తారు, కలియుగ వినాశనాన్ని ఎవరు చేయిస్తారు అనేది అర్థం చేసుకోవాలి. అది
స్పష్టముగా వ్రాయబడి ఉంది. మధురముగా తయారైతే అందరూ మీతో మధురముగానే వ్యవహరిస్తారు (ప్రేమ
ఇస్తే ప్రేమ లభిస్తుంది) అని అంటారు. తండ్రి అంటారు - ఎవరైతే నా కోసం మనుష్యులను
దేవతలుగా తయారుచేసే సేవను చాలా చేస్తారో, వారు చాలా ప్రియముగా అనిపిస్తారు.
ఎవరైతే పురుషార్థము చేస్తారో, వారే ఉన్నతమైన వారసత్వాన్ని పొందుతారు.
వారసత్వాన్ని ఆత్మలు తండ్రి అయిన పరమాత్మ నుండి పొందాలి. ఆత్మాభిమానులుగా అవ్వవలసి
ఉంటుంది. చాలామంది చాలా తప్పులను కూడా చేస్తారు, పాత అలవాట్లు పక్కా అయిపోయాయి.
అందుకే ఎంతగా అర్థం చేయించినా సరే, అవి తొలగిపోవు, దాని వల్ల వారి పదవే
తక్కువైపోతుంది. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. ఏ విషయములోనూ వాదనలోకి వచ్చి తమ టైమ్ వేస్ట్ చేసుకోకూడదు. వ్యర్థ విషయాలలోకి
బుద్ధి ఎక్కువగా వెళ్ళకూడదు. ఎంత వీలైతే అంత స్మృతియాత్రతో వికర్మలను వినాశనము
చేసుకోవాలి. ఆత్మాభిమానులుగా ఉండే అలవాటు చేసుకోవాలి.
2. ఈ పాత ప్రపంచము నుండి మీ ముఖాన్ని తిప్పుకోవాలి. శాంతిధామాన్ని మరియు
సుఖధామాన్ని స్మృతి చేయాలి. కొత్త ఇల్లు తయారవుతుంది కావున పాతదాని నుండి మనసును
తొలగించాలి.
వరదానము:-
ఈశ్వరీయ కులము యొక్క స్మృతి ద్వారా మాయను ఎదుర్కొనే సదా
సమర్థ స్వరూప భవ
ఏ కార్యములోనైనా సఫలతను ప్రాప్తి చేసుకోవాలంటే, ముందుగా
స్మృతి ద్వారా సమర్థ స్వరూపులుగా అవ్వండి. సమర్థత వచ్చిందంటే మాయను ఎదుర్కోవడము
సహజమైపోతుంది. ఎలాంటి స్మృతి ఉంటే, అలాంటి స్వరూపము తయారవుతుంది, అందుకే సదా ఏ
శక్తిశాలి స్మృతి ఉండాలంటే - ఈ ఈశ్వరీయ జన్మ ఉన్నంతవరకు ప్రతి సెకెండు, ప్రతి
సంకల్పము, ప్రతి కార్యము చేస్తూ ఈశ్వరీయ సేవలో ఉన్నాను. ఇది మన ఈశ్వరీయ కులము, ఈ
స్మృతి అనే సీట్ అన్ని బలహీనతలను సమాప్తము చేసేస్తుంది.
స్లోగన్:-
సత్యము
అనేది సమయమనుసారముగా దానంతటదే ఋజువవుతుంది, దానిని ఋజువు చేయాల్సిన అవసరము లేదు.
అవ్యక్త ప్రేరణలు -
‘‘మహానులుగా అయ్యేందుకు మధురత మరియు నమ్రత గుణాలను ధారణ చేయండి’’
మెజారిటీకి సేవలో
ఇబ్బంది కలిగించే ముఖ్యమైన విఘ్నము ఏమిటంటే - నేను ఇది చేసాను, నేనే ఇది చేయగలను...
ఈ నేను అనే భావన రావటమంటే, దీనినే - జ్ఞానము యొక్క అభిమానము, బుద్ధి యొక్క అభిమానము,
సేవ యొక్క అభిమానము అని అంటారు, ఈ రూపాలలోనే విఘ్నాలు వస్తాయి. ఈ రకమైన విఘ్నాలను
సమాప్తము చేయడానికి సదా ఒక్క మాట గుర్తుంచుకోండి - నేను నిమిత్తము. నిమిత్తముగా
అవ్వటము ద్వారానే నిరాకారీ, నిరహంకారీ మరియు నమ్రచిత్త, నిస్సంకల్ప అవస్థలో ఉండగలరు,
ఈ ధారణలే వాయుమండలాన్ని నిర్విఘ్నము చేస్తాయి.
| | | |