‘‘సత్యమైన స్నేహీలుగా అయి, అన్ని భారాలను బాబాకు
ఇచ్చి ఆనందాన్ని అనుభవము చేయండి, శ్రమ నుండి విముక్తులుగా కండి’’
ఈ రోజు బాప్ దాదా తమ నలువైపులా ఉన్న నిశ్చింత చక్రవర్తుల
సంగఠనను చూస్తున్నారు. ఇంత పెద్ద చక్రవర్తుల సభ పూర్తి కల్పములో
ఈ సంగమ సమయములోనే ఉంటుంది. స్వర్గములో కూడా ఇంత పెద్ద
చక్రవర్తుల సభ ఉండదు. కానీ ఇప్పుడు బాప్ దాదా చక్రవర్తులందరి
సభను చూసి హర్షిస్తున్నారు. దూరముగా ఉన్నవారు కూడా హృదయానికి
సమీపముగా కనిపిస్తున్నారు. మీరందరూ నయనాలలో ఇమిడి ఉన్నారు, వారు
హృదయములో ఇమిడి ఉన్నారు. ఇది ఎంతటి సుందరమైన సభ. నేటి ఈ విశేష
దివసము నాడు అందరి ముఖాలపై అవ్యక్త స్థితి యొక్క స్మృతికి
సంబంధించిన మెరుపు కనిపిస్తూ ఉంది. అందరి హృదయాలలో బ్రహ్మాబాబా
యొక్క స్మృతి ఇమిడి ఉంది. ఆదిదేవుడైన బ్రహ్మాబాబా మరియు శివబాబా,
ఇద్దరూ పిల్లలందరినీ చూసి హర్షిస్తున్నారు.
ఈ రోజు అయితే ఉదయము రెండు గంటల నుండి మొదలుకుని బాప్ దాదా
మెడలో భిన్న-భిన్న రకాల మాలలు కనిపిస్తున్నాయి. ఈ పుష్పల
మాలలైతే సాధారణమైనవే. వజ్రాల మాలలు కూడా అంత పెద్ద విషయమేమీ
కాదు. కానీ స్నేహము యొక్క అమూల్యమైన ముత్యాల మాల అతి
శ్రేష్ఠమైనది. పిల్లలు ప్రతి ఒక్కరి హృదయములో ఈ రోజున స్నేహము
విశేషముగా ఇమర్జ్ అయి ఉంది. బాప్ దాదా వద్ద నాలుగు రకాల
భిన్న-భిన్న మాలలు ఇమర్జ్ అయి ఉన్నాయి. మొదటి నంబర్ మాల
శ్రేష్ఠమైన పిల్లలది. బాబా సమానముగా అవ్వాలి అన్న శ్రేష్ఠ
పురుషార్థీ పిల్లలెవరైతే ఉన్నారో, అటువంటి పిల్లలు మాల రూపములో
బాబా మెడలో హారముగా ఉన్నారు. మొదటి మాల అన్నింటికంటే చిన్నదిగా
ఉంది. రెండవ మాల - హృదయపూర్వకమైన స్నేహము కలిగి సమీపముగా మరియు
సమానముగా అయ్యే పురుషార్థము చేసే పిల్లల మాల. మొదటివారు
శ్రేష్ఠ పురుషార్థులు, రెండవవారు పురుషార్థులు. మూడవ మాల ఉంది
- ఇది పెద్ద మాల, వీరు స్నేహీలు కూడా, బాబా సేవలో సహచరులు కూడా,
కానీ వీరు ఒక్కోసారి తీవ్ర పురుషార్థులు మరియు ఒక్కోసారి
తుఫానులను ఎక్కువగా ఎదుర్కునేవారు, కానీ వీరు కోరుకునేవారు అనగా
వీరికి సంపన్నముగా అవ్వాలి అన్న కోరిక కూడా బాగా ఉంటుంది.
నాలుగవ మాల ఫిర్యాదులు చేసేవారి మాల. భిన్న-భిన్న రకాల పిల్లల
యొక్క అవ్యక్త ఫరిశ్తాల ముఖములతో మాలలు ఉన్నాయి. బాప్ దాదా కూడా
భిన్న-భిన్న మాలలను చూసి సంతోషిస్తున్నారు కూడా, దానితోపాటు
స్నేహాన్ని మరియు సకాష్ ను కూడా ఇస్తున్నారు. ఇప్పుడు మీరందరూ
స్వయము గురించి ఆలోచించండి - నేను ఎవరిని? కానీ నలువైపులా ఉన్న
పిల్లలలో ఒక విశేషమైన సంకల్పము వర్తమాన సమయములో హృదయములో ఇమర్జ్
అయి ఉంది, అదేమిటంటే - ఇప్పుడు ఏదైనా చెయ్యాల్సిందే. ఈ
ఉల్లాస-ఉత్సాహము మెజారిటీ పిల్లలలో సంకల్పము రూపములో ఉంది.
స్వరూపములో నంబరువారుగా ఉంది కానీ సంకల్పములో ఉంది.
బాప్ దాదా పిల్లలందరికీ నేటి స్నేహ దివసము, స్మృతి దివసము,
సమర్థ దివసము సందర్భముగా విశేషముగా హృదయపూర్వక ఆశీర్వాదాలను
మరియు హృదయపూర్వక అభినందనలను ఇస్తున్నారు. ఈ రోజు విశేషముగా
స్నేహ దివసము అయిన కారణముగా మెజారిటీ స్నేహములో మైమరచిపోయి
ఉన్నారు. ఇలాగే పురుషార్థములో సదా స్నేహములో మైమరచిపోయి ఉండండి,
లవలీనమై ఉండండి. కావున సహజ సాధనము స్నేహము, హృదయపూర్వక స్నేహము,
తండ్రి పరిచయముతో కూడిన స్మృతి సహితమైన స్నేహము, తండ్రి
ప్రాప్తుల యొక్క స్నేహ సంపన్నమైన స్నేహము. స్నేహము చాలా సహజమైన
సాధనము ఎందుకంటే స్నేహీ ఆత్మ శ్రమ నుండి రక్షింపబడుతుంది.
స్నేహములో లీనమై ఉన్న కారణముగా, స్నేహములో మైమరచిపోయి ఉన్న
కారణముగా ఏ విధమైన శ్రమ అయినా మనోరంజనము రూపములో అనుభవమవుతుంది.
స్నేహీ ఆత్మలు స్వతహాగానే దేహ భానము నుండి, దైహిక సంబంధాల
ధ్యాస నుండి, దైహిక ప్రపంచపు ధ్యాస నుండి అతీతముగా స్నేహములో
స్వతహాగానే లీనమై ఉంటారు. హృదయపూర్వక స్నేహము తండ్రి సమీపతను,
తోడును, సమానతను అనుభవము చేయిస్తుంది. స్నేహీ అయినవారు సదా
స్వయాన్ని తండ్రి ఆశీర్వాదాలకు పాత్రులుగా భావిస్తారు. స్నేహము
అసంభవాన్ని కూడా సహజముగా సంభవము చేస్తుంది. సదా తమ మస్తకముపై,
తమ శిరస్సుపై తండ్రి సహయోగాన్ని మరియు స్నేహ హస్తాన్ని అనుభవము
చేస్తారు. నిశ్చయబుద్ధి, నిశ్చింతులుగా ఉంటారు. ఆది సమయములో
స్థాపనలో ఉన్న పిల్లలైన మీ అందరికీ ఆది సమయములో ఒక అనుభవము ఉంది,
ఇప్పుడు కూడా సేవ యొక్క ఆదికి నిమిత్తమైన పిల్లలకు ఆ అనుభవము
ఉంది, ఆ అనుభవమేమిటంటే - ఆదిలో పిల్లలందరికీ తండ్రి లభించారు
అన్న స్మృతితో స్నేహము యొక్క నషా ఎంత ఉండేది! జ్ఞానమైతే తర్వాత
లభించింది కానీ మొట్టమొదటి నషా స్నేహములో మైమరిచపోయి ఉండటము.
తండ్రి స్నేహ సాగరుడు కావున మెజారిటీ పిల్లలు ఆది నుండి స్నేహ
సాగరములో మైమరచిపోయి ఉన్నారు. పురుషార్థము యొక్క వేగములో చాలా
మంచి వేగముతో ముందుకు వెళ్ళారు. కానీ కొంతమంది పిల్లలు స్నేహ
సాగరములో మైమరచిపోతారు, కొందరు కేవలం మునక వేసి బయటకు
వచ్చేస్తారు, అందుకే మైమరచిపోయి ఉన్నవారికి ఎంతైతే శ్రమ
తక్కువగా ఉంటుందో అంతగా మిగిలినవారికి అనిపించదు. ఒక్కోసారి
కష్టము, ఒక్కోసారి ప్రేమ, రెండింటిలోనూ ఉంటారు. కానీ ఎవరైతే
స్నేహములో లవలీనమై ఉంటారో వారు సదా స్వయాన్ని ఛత్రఛాయలో
ఉన్నట్లుగా అనుభవము చేస్తారు. హృదయపూర్వకమైన స్నేహము కలిగి
ఉన్న పిల్లలు శ్రమను కూడా ప్రేమలోకి మార్చేస్తారు. వారి ఎదురుగా
పర్వతము వంటి సమస్య కూడా పర్వతములా కాకుండా దూదిపింజములా
అనుభవమవుతుంది. రాయి కూడా నీరు వలె అనుభవమవుతుంది. ఈ రోజు
విశేషముగా స్నేహము యొక్క వాయుమండలములో ఉన్నారు, మరి శ్రమను
అనుభవము చేసారా లేక మనోరంజనముగా ఉందా!
ఈ రోజు అయితే అందరికీ స్నేహము అనుభవమయ్యింది కదా! స్నేహములో
మైమరచిపోయి ఉన్నారా? మైమరచిపోయి ఉన్నారా అందరూ! ఈ రోజు శ్రమ
అనుభవమయ్యిందా? ఏ విషయములోనైనా శ్రమ అనుభవమయ్యిందా? ఎందుకు,
ఏమిటి, ఎలా అన్న సంకల్పాలు వచ్చాయా? స్నేహము అన్నింటినీ
మరపింపజేస్తుంది. కావున బాప్ దాదా అంటున్నారు, తండ్రి యొక్క ఈ
స్నేహాన్ని మరవకండి. స్నేహ సాగరుడు లభించారు, ఆ సాగరములో బాగా
తేలియాడండి. ఎప్పుడైనా ఏదైనా శ్రమ అనుభవమైతే, ఎందుకంటే మాయ
మధ్య-మధ్యలో పేపరు తీసుకువస్తూ ఉంటుంది, కానీ ఆ సమయములో స్నేహము
యొక్క అనుభవాన్ని గుర్తు చేసుకోండి, అప్పుడు శ్రమ ప్రేమలోకి
మారిపోతుంది. అనుభవము చేసి చూడండి. ఏం జరుగుతుందంటే, పొరపాటు
ఏం జరుగుతుందంటే, ఆ సమయములో ఏమిటి, ఎందుకు అనే ప్రశ్నలలోకి చాలా
వెళ్ళిపోతుంటారు. ఏదైతే వస్తుందో అది వెళ్ళిపోతుంది కూడా, కానీ
ఎలా వెళ్ళిపోతుంది? స్నేహాన్ని గుర్తు చేసుకుంటే శ్రమ
వెళ్ళిపోతుంది ఎందుకంటే అందరికీ భిన్న-భిన్న సమయాలలో బాప్ దాదా,
ఇరువురి స్నేహమైతే అనుభవముంది కదా, ఉంది కదా అనుభవము! ఎప్పుడో
అప్పుడు అనుభవము చేసే ఉంటారు కదా, సదా కాకపోయినా ఎప్పుడో అయితే
చేసారు కదా. తండ్రి స్నేహము అంటే ఏమిటి అని ఆ సమయములో గుర్తు
చేసుకోండి. తండ్రి స్నేహములో ఏమేమి అనుభవము చేసారు! ఆ
స్నేహాన్ని గుర్తు చేసుకోవడముతో శ్రమ మారిపోతుంది ఎందుకంటే బాప్
దాదాకు ఏ బిడ్డ యొక్క శ్రమతో కూడిన స్థితి అయినా మంచిగా
అనిపించదు. నా పిల్లలు, కానీ శ్రమనా! మరి శ్రమ నుండి ముక్తులుగా
ఎప్పుడు అవుతారు? ఈ సంగమయుగములోనే శ్రమ నుండి ముక్తులుగా మరియు
ఆనందమే ఆనందము అన్నట్లుగా ఉండగలరు. ఆనందము లేకపోతే ఏదో ఒక భారము
బుద్ధిలో ఉన్నట్లు. బాబా అన్నారు, భారాన్ని నాకు ఇచ్చేయండి.
నాది అన్నదానిని మర్చిపోయి ట్రస్టీలుగా అవ్వండి. బాధ్యతను
బాబాకు ఇచ్చేయండి మరియు స్వయము హృదయపూర్వకముగా సత్యమైన
పిల్లలుగా అయి తినండి, ఆడండి మరియు ఆనందముగా ఉండండి ఎందుకంటే ఈ
సంగమయుగము అన్ని యుగాలలో కల్లా ఆనందాల యుగము. ఈ ఆనందాల యుగములో
కూడా ఆనందాన్ని జరుపుకోకపోతే మరి ఇంకెప్పుడు జరుపుకుంటారు?
పిల్లలు భారాన్ని మోస్తూ, చాలా శ్రమ పడుతున్నారు, భారాన్ని
ఇవ్వకుండా స్వయమే మోస్తూ ఉండటాన్ని బాప్ దాదా చూసినప్పుడు
బాబాకైతే దయ కలుగుతుంది కదా, జాలి కలుగుతుంది కదా!
ఆనందించాల్సిన సమయములో శ్రమనా! స్నేహములో మైమరచిపోండి, స్నేహము
యొక్క సమయాన్ని గుర్తు చేసుకోండి. ప్రతి ఒక్కరికీ ఏదో ఒక
సమయములో విశేషముగా స్నేహము యొక్క అనుభూతి అయితే తప్పకుండా
కలుగుతుంది, కలిగింది కూడా. కలిగింది అని బాబాకు తెలుసు కానీ
మీరు గుర్తు చేసుకోరు. శ్రమనే చూస్తూ ఉంటారు, చిక్కుకుపోతూ
ఉంటారు. ఒకవేళ ఈ రోజు అయినా అమృతవేళ నుండి ఇప్పటివరకు బాప్ దాదా
ఇద్దరి అథారిటీల స్నేహాన్ని హృదయపూర్వకముగా అనుభవము చేసి ఉంటే
ఈ రోజు గుర్తు చేసుకున్నా కానీ స్నేహము ఎదురుగా శ్రమ
సమాప్తమైపోతుంది.
ఇప్పుడు బాప్ దాదా ఈ సంవత్సరములో ప్రతి బిడ్డను
స్నేహయుక్తులుగా, శ్రమ నుండి ముక్తులుగా చూడాలని
కోరుకుంటున్నారు. శ్రమ యొక్క నామ-రూపాలు హృదయములో ఉండకూడదు,
జీవితములో ఉండకూడదు. వీలవుతుందా? వీలవుతుందా? ఎవరైతే, చేసే
తీరాలి అని అనుకుంటున్నారో, ధైర్యము కలిగి ఉన్నారో, వారు
చేతులెత్తండి. ఈ రోజు విశేషముగా ఇటువంటి పిల్లలు ప్రతి ఒక్కరికీ
- శ్రమ నుండి ముక్తులుగా అవ్వండి అని బాబా యొక్క విశేష వరదానము
ఉంది. స్వీకారమేనా? మరి ఒకవేళ ఏమైనా జరిగితే అప్పుడు ఏమి
చేస్తారు? ఏమిటి, ఎందుకు అనైతే అనరు కదా? ప్రేమ యొక్క సమయాన్ని
గుర్తు చేసుకోండి. అనుభవాన్ని గుర్తు చేసుకోండి మరియు అనుభవములో
మైమరచిపోండి. మీ ప్రతిజ్ఞ ఉంది కదా. బాబా కూడా పిల్లలను ప్రశ్న
అడుగుతున్నారు - మేము బాబా ద్వారా 21 జన్మల కొరకు జీవన్ముక్త
అవస్థ యొక్క పదవిని ప్రాప్తి చేసుకుంటున్నాము, చేసుకునే
తీరుతాము అని మీ అందరి ప్రతిజ్ఞ ఉంది కదా, మరి జీవన్ముక్తిలో
శ్రమ ఉంటుందా ఏమిటి? 21 జన్మలలో ఒక జన్మ సంగమయుగానిది. మీరు
చేసిన ప్రతిజ్ఞ 21 జన్మలకు, 20 జన్మలకు కాదు. మరి ఇప్పటినుండే
శ్రమ నుండి ముక్తులుగా అనగా జీవన్ముక్తులుగా మరియు నిశ్చింత
చక్రవర్తులుగా కండి. ఇప్పటి సంస్కారాలే ఆత్మలో 21 జన్మలు ఇమర్జ్
అయి ఉంటాయి. మరి 21 జన్మల వారసత్వాన్ని తీసుకున్నారు కదా! లేక
ఇప్పుడు తీసుకోవాలా? అటెన్షన్ ప్లీజ్! శ్రమ నుండి ముక్తులుగా,
సంతుష్టముగా ఉండండి మరియు సంతుష్టపరచండి. కేవలం సంతుష్టముగా
ఉండటమే కాదు, సంతుష్టపరచాలి కూడా. అప్పుడే శ్రమ నుండి
ముక్తులుగా ఉంటారు. లేకపోతే రోజూ ఏదో ఒక భారము యొక్క విషయాలు,
శ్రమతో కూడిన విషయాలు, ఎందుకు, ఏమిటి అన్న భాషలో వస్తాయి.
ఇప్పుడు సమయము యొక్క సమీపతను చూస్తున్నారు. ఏ విధముగా సమయము
సమీపముగా వస్తూ ఉందో, అదే విధముగా మీ అందరిదీ కూడా తండ్రితో
సమీపత యొక్క అనుభవము పెరగాలి కదా. తండ్రితో మీకు ఉన్న సమీపత
సమయము యొక్క సమీపతను సమాప్తము చేస్తుంది. పిల్లలైన మీ అందరికీ
ఆత్మల యొక్క దుఃఖము మరియు అశాంతితో కూడిన పిలుపులు చెవులలో
వినిపించడము లేదా! మీరు పూర్వజులు కూడా, పూజ్యులు కూడా. కావున
ఓ పూర్వజ ఆత్మల్లారా, ఓ పూజ్య ఆత్మల్లారా, విశ్వ కళ్యాణ
కార్యాన్ని ఎప్పుడు సంపన్నము చేస్తారు?
బాప్ దాదా సమాచారాలలో చూసారు - ప్రతి వర్గము వారు తమ-తమ
మీటింగులు చేస్తారు, విశ్వ కళ్యాణము యొక్క వేగాన్ని ఎలా
తీవ్రతరము చెయ్యాలి అని ప్లాన్లు తయారుచేస్తారు. ప్లాన్లు అయితే
చాలా బాగా తయారుచేస్తారు, కానీ బాప్ దాదా అడుగుతున్నారు -
ఎంతవరకు ఇలా? ఇందుకు జవాబు దాదీలు ఇస్తారు, ఎంతవరకు ఇలా?
పాండవులు చెప్పండి - ఎంతవరకు ఇలా? బాబా ప్రత్యక్షత జరగాలి అనే
ప్రతి వర్గము వారు ప్లాన్ తయారుచేసేటప్పుడు లక్ష్యము
పెట్టుకుంటారు. కానీ ప్రత్యక్షత అనేది దృఢ ప్రతిజ్ఞతోనే
జరుగుతుంది. ప్రతిజ్ఞలో దృఢత ఉండాలి. ఒక్కోసారి కొన్ని కారణాల
వల్ల లేక కొన్ని విషయాల వల్ల దృఢత తగ్గిపోతుంది. ప్రతిజ్ఞ చాలా
బాగా చేస్తారు. అమృతవేళ మీరు వినగలిగితే, బాబా అయితే వింటారు
కదా. అందరి మనసులలోని విషయాలను వినగలిగే సాధనాన్ని సైన్సు మీకు
ఇంకా ఇవ్వలేదు. బాప్ దాదా వింటుంటారు. ప్రతిజ్ఞల మాలలు,
సంకల్పము చేసే మాటలు ఎంత బాగా హృదయాన్ని సంతోషపరిచేవిగా
ఉంటాయంటే, బాప్ దాదా వాహ్ పిల్లలు వాహ్ అని అంటారు. ఏమేమి
చెప్తుంటారో వినిపించమంటారా? మురళి సమయము వరకు కూడా 75 శాతము
సరిగ్గానే ఉంటారు, కానీ కర్మలలోకి వచ్చినప్పుడు, కర్మయోగములోకి
వచ్చినప్పుడు అందులో తేడా వచ్చేస్తుంది. కొన్ని సంస్కారాలు,
కొన్ని స్వభావాలు, స్వభావాలు మరియు సంస్కారాలు ఎదురైనప్పుడు
ప్రతిజ్ఞ దృఢముగా ఉండటానికి బదులుగా సాధారణమైపోతుంది. దృఢత
యొక్క శాతము తగ్గిపోతుంది.
పిల్లలది ఒక ఆటను చూసి బాప్ దాదా చిరునవ్వు నవ్వుతుంటారు. ఏ
ఆటను ఆడుతారు, చెప్పమంటారా? బాప్ దాదాకు అయితే ఆటను చూసి దయ
కలుగుతుంది, సంతోషము కలగదు, ఎందుకంటే బాప్ దాదా చూస్తుంటారు,
పిల్లలు తమ విషయాన్ని ఇతరుల మీద పెట్టడములో చాలా తెలివైనవారు.
ఏ ఆటను ఆడుతారు? మాటలు తయారుచేస్తారు. ఏమనుకుంటారంటే - ఎవరు
చూస్తారులే, నాకు తెలుసు, నా మనసుకు తెలుసు, బాబా అయితే
పరంధామములో, సూక్ష్మవతనములో కూర్చుని ఉన్నారు కదా అని
అనుకుంటారు. ఒకవేళ ఇది చెయ్యకండి అని ఎవరికైనా చెప్తే ఏ ఆటను
ఆడుతారు, తెలుసా? అవును, అయింది కానీ... కానీ అని తప్పకుండా
అంటారు. కానీ ఏమిటి? ఇలా జరిగింది కదా, ఇలా చేసారు కదా, ఇలా
జరుగుతుంది కదా, అందుకే ఇలా జరిగింది, నేను చెయ్యలేదు. ఇలా
జరిగింది కావున... ఇప్పుడు వీరు చేసారు కావుననే నేను చేసాను...
లేకపోతే నేను చెయ్యను... అని అంటారు. మరి ఇది ఏమిటి? స్వయము
యొక్క అవగాహన, రియలైజేషన్ తక్కువగా ఉంది. అచ్ఛా, సరే, వారు అలా
చేసారనుకోండి, అందుకే మీరు ఇలా చేసారనుకోండి, సరే, చాలా మంచిది.
వారు మొదటి నంబరు వారు అయ్యారు, రెండవ నంబరు మీరు అయ్యారు. సరే.
బాప్ దాదా ఇది కూడా ఒప్పుకుంటున్నారు. మీరు మొదటి నంబరు కాదు,
మీరు రెండవ నంబరు, కానీ మొదటి నంబరు వారు పరివర్తన అయితే నేను
మారతాను అని మీరు అంటే, ఇది సరియేనా? ఆ సమయములో ఇలానే
అనుకుంటారు కదా? ఒకవేళ మొదటి నంబరువారు పరివర్తన అయ్యారు
అనుకోండి, బాప్ దాదా మరియు ఇతరులందరూ మొదటి నంబరు వారితో - మీదే
తప్పు, మీరు పరివర్తన అవ్వాలి అని చెప్పారనుకోండి, సరేనా, అచ్ఛా,
ఒకవేళ మొదటి నంబరు వారు పరివర్తన తీసుకొస్తే అప్పుడు మొదటి
నంబరు ఎవరికి లభిస్తుంది? మీకైతే మొదటి నంబరు లభించదు కదా.
పరివర్తన శక్తిలో మీది మొదటి నంబరు అవ్వదు. మొదటి నంబరు మీరు
వారికి ఇచ్చినప్పుడు మీది ఏ నంబరు అవుతుంది? రెండవ నంబరు
అవుతుంది కదా? ఒకవేళ మీది రెండవ నంబరు అంటే మీరు ఒప్పుకుంటారా?
ఒప్పుకుంటారా? ఏమంటారంటే - లేదు, ఇలా జరిగింది, అలా జరిగింది,
ఎలా జరిగింది... అని అంటారు. ఆటలో ఈ భాష చాలా కనిపిస్తుంది. ఇలా,
అలా, ఎలా అన్న ఆటను ఆపు చేసి - నేను పరివర్తన అవ్వాలి, నేను
పరివర్తన అయ్యి ఇతరులను పరివర్తన చెయ్యాలి అని అనుకోండి, కానీ
ఒకవేళ ఇతరులను పరివర్తన చెయ్యలేకపోతే శుభ భావన, శుభ కామన అయితే
ఉంచగలరు కదా! అదైతే మీ వస్తువే కదా. కావున హే అర్జునుడిగా నేను
అవ్వాలి. విశ్వ రాజ్యాధికారులైన లక్ష్మీ-నారాయణులకు సమీపముగా
మొదట మీరు రావాలా లేక రెండవ నంబరు వారా?
ఈ సంవత్సరము బాప్ దాదా యొక్క ఆశ ఇదే - సర్వ బ్రాహ్మణాత్మలు,
బహ్మాకుమార, బ్రహ్మాకుమారీలు ఎలా అయితే ఇక్కడ ఈ బ్యాడ్జిను
పెట్టుకుంటారు కదా, అందరూ పెట్టుకుంటారు కదా! ఇక్కడకు
వచ్చినప్పుడు కూడా మీకు బ్యాడ్జి లభిస్తుంది కదా, అది కాగితముది
కావచ్చు, బంగారముది కావచ్చు లేక వెండిది కావచ్చు, ఎలా అయితే
ఇక్కడ బ్యాడ్జి పెట్టుకుంటారో, అలాగే హృదయములో, మనసులో ఈ
బ్యాడ్జి పెట్టుకోండి - ‘‘నేను పరివర్తన అవ్వాలి, నేను
నిమిత్తము అవ్వాలి’’. వీరు మారాలి, ఈ విషయము మారాలి, ఈ వ్యక్తి
మారాలి, ఈ పరిస్థితులు మారాలి అని అనుకోకండి. నేను మారాలి.
పరిస్థితులైతే వస్తాయి. మీరు ఉన్నతిలోకి వెళ్తున్నారు,
ఉన్నతమైన స్థానములో సమస్యలు కూడా పెద్దవే వస్తాయి కదా! కానీ ఎలా
అయితే ఈ రోజు నంబరువారుగా, యథా శక్తి స్నేహముతో కూడిన స్మృతి
యొక్క వాయుమండలము ఉందో, అలాగే మీ మనసులో సదా స్నేహములో లవలీనమై
ఉండే వాయుమండలాన్ని సదా ఇమర్జ్ చేసి ఉంచుకోండి.
బాప్ దాదా వద్దకు సమాచారాలు చాలా మంచి-మంచివి వస్తుంటాయి.
సంకల్పాల వరకు చాలా బాగుంటాయి. స్వరూపములోకి రావడములో మాత్రము
యథాశక్తి అయిపోతున్నారు. ఇప్పుడు రెండు నిమిషాలు కోసమైనా అందరూ
పరమాత్మ స్నేహములో, సంగమయుగపు ఆత్మిక ఆనందపు స్థితిలో
స్థితులైపోండి. (డ్రిల్) అచ్ఛా - ఈ అనుభవాన్నే ప్రతి రోజు
పదే-పదే ఎప్పటికప్పుడు అనుభవము చేస్తూ ఉండండి. స్నేహాన్ని
విడిచిపెట్టకండి. స్నేహములో మైమరచిపోవడము నేర్చుకోండి. అచ్ఛా!
నలువైపులా ఉన్న యోగయుక్త, యుక్తియుక్త, రహస్యయుక్త, స్వయము
కూడా రహస్యాన్ని తెలుసుకుని సదా సంతుష్టపరిచేవారికి మరియు
సంతుష్టముగా ఉండేవారికి, కేవలం స్వయము సంతుష్టముగా ఉండటము కాదు,
సంతుష్టపరచాలి కూడా, ఇలా సదా స్నేహ సాగరములో లవలీనులైన పిల్లలకు,
సదా తండ్రి సమానముగా అయ్యేందుకు తీవ్ర వేగము కల పురుషార్థీ
పిల్లలకు, సదా అసంభవాన్ని కూడా సహజముగా సంభవము చేసే శ్రేష్ఠ
ఆత్మలకు, సదా తండ్రితో పాటు ఉండే మరియు తండ్రి సేవలో సహచరులుగా
ఉండే, ఇలా చాలా చాలా లక్కీ మరియు లవ్లీ పిల్లలకు ఈ నాటి
అవ్యక్త దివసము యొక్క, అవ్యక్త ఫరిశ్తా స్వరూపము యొక్క
ప్రియస్మృతులు మరియు హృదయపూర్వకమైన ఆశీర్వాదాలు. అచ్ఛా!