01-10-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మాయకు భయపడకండి, మాయ ఎంతగా
మరపింపజేసేందుకు ప్రయత్నించినా కానీ అలసిపోకండి, అమృతవేళ లేచి స్మృతిలో ఉండేటువంటి
పూర్తి పురుషార్థము చేయండి’’
ప్రశ్న:-
పురుషార్థములో
ఏ పిల్లలు ముందు నంబరు తీసుకుంటారు?
జవాబు:-
ఎవరైతే
తండ్రిపై పూర్తిగా బలిహారమవుతారో అనగా సమర్పణ అవుతారో, వారే అందరికన్నా ముందుకు
వెళ్తారు. తండ్రిపై పిల్లలు బలిహారమవుతారు మరియు పిల్లలపై తండ్రి బలిహారమవుతారు.
మీరు ఏ విలువ లేని మీ పాత తనువు-మనసు-ధనాలను తండ్రికి ఇస్తారు మరియు తండ్రి మీకు
విశ్వ రాజ్యాధికారాన్ని ఇస్తారు, అందుకే వారిని పేదల పెన్నిధి అని అంటారు. నిరుపేద
అయిన భారత్ కు దానమిచ్చేందుకే తండ్రి వచ్చారు.
పాట:-
నయనహీనులకు
మార్గాన్ని చూపించండి...
ఓంశాంతి
మధురాతి
మధురమైన, అతి మధురమైన అని అంటారు కదా! వారు అనంతమైన తండ్రి మరియు వారికి అనంతమైన
ప్రేమ ఉంది. మధురమైన, చాలా కాలం తర్వాత కలిసిన పిల్లలు పాటను విన్నారని వారు అంటారు.
మార్గాన్ని ఒక్క తండ్రి మాత్రమే చూపిస్తారు. భక్తి మార్గములో మార్గము చూపించేవారు
ఎవ్వరూ లేరు. అక్కడే భ్రమిస్తూ ఉంటారు. ఇప్పుడు మార్గము లభించింది, అయినా కానీ మాయ
తండ్రితో బుద్ధియోగాన్ని జోడించనివ్వదు. ఒక్క తండ్రిని స్మృతి చేయడముతో మన
దుఃఖాలన్నీ దూరమవుతాయని, చింతించే విషయమేమీ ఉండదని అర్థం చేసుకుంటారు కూడా, అయినా
సరే మర్చిపోతారు. తండ్రి అంటారు - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ పతిత-పావన తండ్రినైన
నన్ను స్మృతి చేయండి. తండ్రి జ్ఞానసాగరుడు కదా. వారే గీతా జ్ఞాన దాత. వారు స్వర్గ
రాజ్యాధికారాన్ని, సద్గతిని ఇస్తారు. శ్రీకృష్ణుడిని జ్ఞానసాగరుడని అనలేరు. సాగరము
ఒక్కటే ఉంటుంది. ఈ భూమికి నలువైపులా సాగరమే ఉంది. సాగరమంతా ఒక్కటే. ఆ తర్వాత దానిని
విభజించడము జరిగింది. మీరు విశ్వానికి యజమానులుగా అయినప్పుడు మొత్తం సాగరానికి,
భూమికి యజమానులుగా అవుతారు. ఇది మా భాగము, మా హద్దులోకి రాకండి అని ఎవ్వరూ అనలేరు.
ఇక్కడైతే సాగరములో కూడా భాగాలు-భాగాలుగా చేసేసారు. పూర్తి విశ్వమే భారత్ గా ఉండేదని,
దానికి మీరు యజమానులుగా ఉండేవారని మీరు భావిస్తారు. పాట కూడా ఉంది - బాబా, మీ నుండి
మేము విశ్వ రాజ్యాధికారాన్ని తీసుకుంటాము, దానిని ఎవ్వరూ లాక్కోలేరు. ఇక్కడ చూడండి,
నీటి కోసం కూడా గొడవపడతారు. ఒకరికొకరు నీళ్ళు ఇచ్చుకునేందుకు లక్షల రూపాయలు
ఇవ్వాల్సి ఉంటుంది. పిల్లలైన మీకు మొత్తం విశ్వ రాజ్యము కల్పక్రితం వలె లభిస్తుంది.
తండ్రి జ్ఞానమనే మూడవ నేత్రాన్ని ఇచ్చారు. జ్ఞానదాత పరమపిత పరమాత్మయే. వారు ఈ
సమయములో వచ్చి జ్ఞానాన్ని ఇస్తారు. సత్యయుగములో లక్ష్మీ-నారాయణుల వద్ద ఈ జ్ఞానముండదు.
అయితే, వారు పూర్వ జన్మలో జ్ఞానము తీసుకుని ఈ విధముగా తయారయ్యారని అంటారు. మీరే అలా
ఉండేవారు. మీరు అంటారు - బాబా, మీరు ఆ తండ్రియే, మీరు మమ్మల్ని విశ్వానికి
యజమానులుగా తయారుచేసారు. తండ్రి అంటారు - నా మతము చాలా పెద్దదేమీ కాదు. ఆ చదువు ఎంత
పెద్దదిగా ఉంటుంది. ఇదైతే చాలా సహజమైనది. రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాలను మీరు
తెలుసుకుని ఇతరులకు చెప్తూ ఉంటారు. 84 జన్మల చక్రములో మీరు ఎలా తిరిగారు, ఇప్పుడు
తిరిగి తండ్రి వద్దకు వెళ్ళాలి. మాయా తుఫానులు చాలా వస్తాయి, వాటికి భయపడకండి అని
కూడా తండ్రి చెప్పారు. ఉదయాన్నే లేచి కూర్చున్నప్పుడు బుద్ధి వేరే ఆలోచనల్లోకి
వెళ్ళిపోతుంది. రెండు నిమిషాలు కూడా స్మృతి నిలవదు. తండ్రి అంటారు - అలసిపోకూడదు.
అచ్ఛా, ఒక్క నిమిషము స్మృతి ఉంటే మళ్ళీ రేపు కూర్చోండి, ఆ మర్నాడు కూర్చోండి. మేము
స్మృతి చేయాల్సిందేనని లోలోపల తప్పకుండా పక్కా చేసుకోండి. ఒకవేళ ఎవరైనా వికారాలలోకి
వెళ్తే, వారికి చాలా తుఫానులు వస్తాయి. పవిత్రతయే ముఖ్యమైనది. నేడు ఈ ప్రపంచము పతిత
వేశ్యాలయముగా ఉంది. రేపు పావన శివాలయముగా ఉంటుంది. ఇది పాత శరీరమని మీకు తెలుసు.
తండ్రిని స్మృతి చేస్తూ ఉన్నట్లయితే, ఏ సమయములో శరీరము వదిలినా సరే, స్వర్గములోకి
వెళ్ళేందుకు యోగ్యులుగా అవుతారు. తండ్రి నుండి ఎంతోకొంత జ్ఞానాన్ని అయితే విన్నారు
కదా. ఇక్కడ నుండి పారిపోయి, మళ్ళీ వచ్చి తమ వారసత్వాన్ని తీసుకుంటున్నవారు కూడా
ఉన్నారు. అంతమతి సో గతి (అంతిమ సమయములో ఎలాంటి ఆలోచనలతో చనిపోతారో, అలాంటి జన్మ
లభిస్తుంది) అని కూడా అర్థం చేయించడము జరిగింది. ఎవరైనా శరీరము వదిలారు అనుకోండి,
జ్ఞాన సంస్కారాలను తీసుకువెళ్తారు, అప్పుడు వారికి చిన్నతనము నుండే ఇటువైపుకు
ఆకర్షణ కలుగుతుంది. ఇంద్రియాలు చిన్నగా ఉన్నా కానీ, మాట్లాడలేకపోయినా కానీ వారికి
ఆకర్షణ కలుగుతుంది. చిన్నతనము నుండే సంస్కారాలు బాగా ఉంటాయి. వారు సుఖాన్ని
ఇచ్చేవారిగా తయారవుతారు. ఆత్మకే తండ్రి నేర్పిస్తారు కదా. తండ్రి మిలటరీ వారి
ఉదాహరణను అర్థం చేయిస్తారు కదా, వారు సంస్కారాలను తీసుకువెళ్తే మళ్ళీ సైన్యములోనే
చేరుతారు. ఉదాహరణకు శాస్త్రాలు చదివేవారు సంస్కారాలను తీసుకువెళ్తారు, వారికి
చిన్నతనములోనే శాస్త్రాలు కంఠస్తమవుతాయి. వారికి మహిమ కూడా జరుగుతుంది. అలాగే ఎవరైతే
ఇక్కడ నుండి వెళ్తారో, వారికి చిన్నతనములోనే మహిమ కలుగుతుంది. ఆత్మయే జ్ఞానాన్ని
ధారణ చేస్తుంది కదా. ఇకపోతే, మిగిలి ఉన్న లెక్కాచారాలను సమాప్తము చేసుకోవాల్సి
ఉంటుంది. స్వర్గములోకైతే వస్తారు కదా. తండ్రి వద్దకు వచ్చి ‘మాలేకమ్ సలామ్’ చేస్తారు
(నమస్కరిస్తారు). ప్రజలైతే అనేకమంది తయారవుతారు. తండ్రి నుండి వారసత్వాన్ని
తీసుకుంటారు. చివరిలో ‘అహో ప్రభూ, మీ లీల...’ అని అంటారు కదా.
ఇప్పుడు మీరు
అర్థం చేసుకుంటారు - ఓహో బాబా, మీ లీల డ్రామా ప్లాన్ అనుసారముగా ఇలా ఉంది. బాబా, మీ
పాత్ర మనుష్యమాత్రులందరి పాత్ర కన్నా అతీతమైనది. ఎవరైతే తండ్రి సేవను బాగా చేస్తారో,
వారికి బహుమతి కూడా చాలా మంచిది లభిస్తుంది. విజయమాలలో కూర్చబడతారు. ఇది ఆత్మిక
జ్ఞానము, దీనిని ఆత్మిక తండ్రి ఆత్మలకు ఇస్తారు. మనుష్యులందరూ శరీరాలనే గుర్తు
చేస్తారు. శివానందుడు, గంగేశ్వరానందుడు... మొదలైనవారు ఫలానా జ్ఞానాన్ని ఇస్తున్నారని
అంటారు. ఇక్కడ నిరాకార శివబాబా జ్ఞానాన్ని ఇస్తున్నారని అంటారు. నేను ఉన్నతోన్నతుడను.
ఆత్మనైన నా పేరు ‘శివ’. శివ పరమాత్మాయ నమః అని అంటారు. మళ్ళీ బ్రహ్మా, విష్ణు,
శంకరులను దేవతాయ నమః అని అంటారు. వారు కూడా రచనయే, వారి నుండి ఎలాంటి వారసత్వము
లభించదు. మీరు పరస్పరములో సోదరులు. సోదరుడిని స్మృతి చేయడము వలన వారసత్వము లభించదు.
వీరు (బ్రహ్మా దాదా) కూడా మీ సోదరుడే, వీరు విద్యార్థి కదా, వీరు చదువుకుంటున్నారు,
వీరి నుండి వారసత్వము లభించదు. వీరు స్వయం శివబాబా నుండి వారసత్వాన్ని పొందుతున్నారు.
ముందు వీరు (బ్రహ్మా) వింటారు. నేను బాబాతో అంటాను - బాబా, నేను మీ మొట్టమొదటి
సంతానాన్ని, మీ నుండి నేను కల్ప-కల్పము వారసత్వాన్ని తీసుకుంటాను, కల్ప-కల్పము మీ
రథముగా అవుతాను. శివుని రథము బ్రహ్మా. బ్రహ్మా ద్వారా విష్ణుపురి యొక్క స్థాపన
జరుగుతుంది. బ్రాహ్మణులైన మీరు కూడా సహాయకులు, తర్వాత మీరు యజమానులుగా అవుతారు.
ఇప్పుడు మీకు తెలుసు - మనము 5 వేల సంవత్సరాల క్రితం వలె తండ్రి ద్వారా రాజ్య
భాగ్యాన్ని తీసుకుంటాము, ఎవరైతే కల్పక్రితం రాజ్య భాగ్యాన్ని తీసుకున్నారో వారే
వస్తారు. ఎవరు మహారాజు-మహారాణిగా అవుతారు, ఎవరు ప్రజలుగా అవుతారు అనేది ప్రతి ఒక్కరి
పురుషార్థము ద్వారా తెలిసిపోతుంది. చివరిలో మీకు అంతా సాక్షాత్కారము అవుతుంది. అంతా
పురుషార్థముపై ఆధారపడి ఉంది. బలిహారము కూడా అవ్వాల్సి ఉంటుంది. తండ్రి అంటారు - నేను
పేదల పెన్నిధిని, పేదవారైన మీరే నాపై బలిహారమవుతారు. దానము సదా పేదలకే ఇవ్వడము
జరుగుతుంది. ఎవరైనా కాలేజీలు కట్టించారనుకోండి, అది పేదవారికి దానమివ్వడము కాదు.
అదేమీ ఈశ్వరార్థము జరగదు, కానీ దానమైతే చేస్తారు కదా. ఎవరైనా కాలేజీని తెరిస్తే,
దానికి ఫలం లభిస్తుంది. మరుసటి జన్మలో బాగా చదువుకుంటారు. ఆ ఆశీర్వాదము లభిస్తుంది.
భారత్ లోనే అన్నింటికన్నా ఎక్కువ దాన-పుణ్యాలు జరుగుతాయి. ఈ సమయములోనైతే చాలా దానము
జరుగుతుంది. మీరు తండ్రికి దానమిస్తారు. తండ్రి మీకు దానమిస్తారు. మీ నుండి ఏ విలువ
లేనివి తీసుకుని మీకు విశ్వ రాజ్యాధికారాన్ని ఇస్తారు. ఈ సమయములో మీరు
తనువు-మనసు-ధనము, అన్నింటినీ తండ్రికి దానముగా ఇస్తారు. అక్కడి వారు మరణిస్తే, ఫలానా
ఆశ్రమానికి ఇవ్వాలని లేక ఇది ఆర్య సమాజము వారు తీసుకోవాలని వీలునామా వ్రాసి వెళ్తారు.
వాస్తవానికి ఆకలితో ఉన్న పేదవారికి దానమివ్వాల్సి ఉంటుంది. ఇప్పుడు భారత్ నిరుపేదగా
ఉంది కదా. స్వర్గములో భారత్ ఎంత షావుకారుగా ఉంటుంది. అక్కడ మీ వద్ద ఎంత ధన-ధాన్యాలు
మొదలైనవి ఉంటాయో, అంత ఇంకెవ్వరి వద్ద ఉండవని మీకు తెలుసు. అక్కడ ధనమేమీ ఖర్చు అవ్వదు.
పిడికెడు బియ్యాన్ని దానమిస్తే, దానికి ప్రతిఫలంగా 21 జన్మలకు మహళ్ళు లభిస్తాయి.
ఆస్తి కూడా లభిస్తుంది. ఇప్పుడు తత్వాలు కూడా తమోప్రధానముగా ఉన్న కారణముగా
దుఃఖమిస్తాయి, అక్కడ తత్వాలు సతోప్రధానముగా ఉంటాయి. సత్యయుగములో ఎవరెవరు వస్తారు,
తర్వాత ద్వాపరములో ఫలానావారు వస్తారని మీకు తెలుసు. కలియుగ అంతిమములో చిన్న-చిన్న
శాఖలు, మఠాలు, పీఠాలు మొదలైనవి వెలువడుతూ ఉంటాయి కదా. ఇప్పుడు మీ బుద్ధిలో వృక్షము,
డ్రామా మొదలైనవాటి జ్ఞానముంది. మీకు తండ్రి యొక్క పాత్ర గురించి కూడా తెలుసు. పంచ
పాండవులు మిగిలారని మహాభారత యుద్ధములో చూపిస్తారు. అచ్ఛా, తర్వాత ఏమి జరిగింది?
ఎవరైతే రాజయోగాన్ని నేర్చుకుంటారో, తప్పకుండా వారే వెళ్ళి రాజ్యము చేస్తారు కదా.
ఇంతకుముందు మీకు కూడా ఏమీ తెలిసేది కాదు. బాబా కూడా గీత మొదలైనవి చదివేవారు.
నారాయణుని భక్తి చేసేవారు. వారికి గీత పట్ల కూడా చాలా ప్రేమ ఉండేది. ట్రైన్ లో
వెళ్ళేటప్పుడు కూడా గీతను చదివేవారు. ఇప్పుడు చూస్తే, వారికి ఏమీ అర్థం అవ్వలేదని
తెలుస్తుంది, అనగా బుద్ధి రూపీ డబ్బాలో రాళ్ళు ఉన్నాయని అర్థమవుతుంది. భక్తి
మార్గములో అన్నీ చేస్తూ వచ్చారు కానీ ఉద్ధరణ జరగలేదు. ప్రపంచములో ఎన్ని గొడవలున్నాయి.
ఇక్కడ కూడా అందరూ పవిత్రముగా అవ్వలేరు, అందుకే గొడవలు జరుగుతాయి. తండ్రి శరణును
తీసుకుంటారు కూడా, అయినా సరే రోగము తప్పకుండా తిరగబడుతుందని అంటారు. పిల్లలు
మొదలైనవారు గుర్తుకువస్తారు, ఇందులో నష్టోమోహులుగా అవ్వాల్సి ఉంటుంది. మేము
మరణించాము అని భావించాలి. తండ్రికి చెందినవారిగా అవ్వడము అనగా ఈ ప్రపంచము నుండి
మరణించడము. అప్పుడిక శరీర భానము ఉండదు. తండ్రి అంటారు - దేహ సహితముగా ఏ సంబంధాలైతే
ఉన్నాయో, వాటిని మర్చిపోవాలి. ఈ ప్రపంచములో ఏదైతే చూస్తున్నారో, అవేవీ లేనట్లే. ఈ
పాత శరీరాన్ని కూడా విడిచిపెట్టాలి. మనము ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్ళి, మళ్ళీ
వచ్చి కొత్త సుందరమైన శరీరాన్ని తీసుకుంటారు. ఇప్పుడు శ్యామముగా ఉన్నారు, తర్వాత
సుందరముగా అవుతారు. భారత్ ఇప్పుడు శ్యామముగా ఉంది, తర్వాత సుందరముగా అవుతుంది.
ఇప్పుడు భారత్ ముళ్ళ అడవిలా ఉంది. అందరూ ఒకరికొకరు ముళ్ళు గుచ్చుకుంటూ ఉంటారు. ఏదైనా
విషయములో డిస్టర్బ్ అయితే నిందిస్తారు, గొడవపడతారు. పిల్లలైన మీరు ఇంటిలో కూడా చాలా
మధురముగా అవ్వాలి. లేదంటే మనుష్యులు అంటారు - వీరు 5 వికారాలను దానమిచ్చారు, మళ్ళీ
క్రోధమెందుకు చేస్తున్నారు, బహుశా క్రోధాన్ని దానమివ్వలేదేమో అని. తండ్రి అంటారు -
పిల్లలూ, జోలిలో 5 వికారాలను దానమివ్వండి, అప్పుడు మీ గ్రహణము తొలగిపోతుంది.
చంద్రునికి గ్రహణము పడుతుంది కదా. మీరు కూడా ఇప్పుడు సంపూర్ణముగా అవుతున్నారు కనుక
తండ్రి అంటారు - వికారాలను దానమివ్వండి, మీకు స్వర్గ రాజ్యాధికారము లభిస్తుంది.
ఆత్మకు తండ్రి నుండి వారసత్వము లభిస్తుంది. ఆత్మ అంటుంది - ఈ పాత ప్రపంచములో ఇంకా
కొద్ది సమయమే మిగిలి ఉంది, పని ముగించాలి, ఏ ఆలోచనలు వచ్చినా వాటిని తొలగించుకోవాలి.
అనేక రకాల ఆలోచనలు వస్తుంటాయని బాబాకు తెలుసు. వ్యాపారానికి సంబంధించిన ఆలోచనలు
వస్తుంటాయి. భక్తి మార్గములో భక్తి చేసే సమయములో కొనుగోలుదారులు, వ్యాపార-వ్యవహారాలు
గుర్తుకువస్తే - నేను నారాయణుని స్మృతిలో కూర్చున్నాను, మరి ఈ విషయాలు ఎందుకు
గుర్తుకువచ్చాయి అని తమను తాము గిచ్చుకుంటారు! ఇక్కడ కూడా అలాగే జరుగుతుంది. ఈ
ఆత్మిక సేవలో మంచి రీతిలో నిమగ్నమైతే - ఇక వ్యాపార-వ్యవహారాలను విడిచిపెట్టండి, బాబా
సేవలో నిమగ్నమవ్వండి అని అర్థం చేయించడము జరుగుతుంది. వదిలేస్తే వదిలిపోతుందని
అంటారు. దేహాభిమానాన్ని వదులుతూ వెళ్ళండి. కేవలం తండ్రిని స్మృతి చేసినట్లయితే
కోతుల వలె ఉన్నవారు మందిర యోగ్యులుగా తయారవుతారు. భ్రమరము, తాబేలు, ఈ ఉదాహరణలన్నీ
తండ్రి ఇస్తారు, వీటినే మళ్ళీ భక్తి మార్గములోని వారు ఉదాహరణలుగా చూపిస్తారు. అక్కడ
పేడ పురుగు అని ఎవరిని అంటారో ఇప్పుడు మీకు తెలుసు. మీరు బ్రాహ్మణీలు. మీరు భూ-భూ
చేస్తారు. ఈ ఉదాహరణ ఇప్పటిదే. వారు చెప్పలేరు. పండుగలు మొదలైనవన్నీ ఈ సమయానికి
సంబంధించినవే. సత్య, త్రేతాయుగాలలో పండుగలేవీ ఉండవు. అవన్నీ భక్తి మార్గానికి
సంబంధించినవి. ఇప్పుడు చూడండి, శ్రీకృష్ణ జయంతి జరిగింది, శ్రీకృష్ణుని మూర్తిని
మట్టితో తయారుచేసి, వారిని పూజించి, తర్వాత తీసుకువెళ్ళి కొలనులో ముంచేసారు. వారు
ఏం చేస్తున్నారు అనేది ఇప్పుడు మీకు అర్థమవుతుంది. అది అంధ విశ్వాసము. మీరు ఎవరికైనా
అర్థం చేయిస్తే, వారు అర్థం చేసుకోలేరు. ఎవరికైనా అనారోగ్యము మొదలైనవి వస్తే -
చూడండి, మీరు శ్రీకృష్ణుని పూజను వదిలేశారు, అందుకే ఇలాంటి పరిస్థితి ఏర్పడిందని
అంటారు. ఇలా చాలా మంది ఆశ్చర్యము కలిగేలా వింటారు, వినిపిస్తారు, తర్వాత పారిపోతారు.
అందుకే బ్రాహ్మణుల మాల తయారవ్వదు. ఉన్నతోన్నతమైనవారు ఈ బ్రాహ్మణ కులభూషణులు. కానీ
వారి మాల తయారవ్వదు. ఇది శివబాబా మాల, తర్వాత మనము వెళ్ళి సత్యయుగములో నంబరువారుగా
విష్ణు మాలలోని మణులుగా అవుతాము అని మీ బుద్ధిలో ఉంది. మీ ఒక్కొక్క పదము ఎటువంటిదంటే,
వాటిని ఎవరూ అర్థం చేసుకోలేరు. తండ్రి చదివిస్తూ ఉంటారు, వృద్ధిని పొందుతూ ఉంటారు.
ప్రదర్శనీలకు ఎంతమంది వస్తారు. మేము వచ్చి అర్థం చేసుకుంటామని అంటారు కూడా, కానీ
ఇంటికి వెళ్ళగానే ఇక అంతే, అక్కడిది అక్కడే ఉండిపోతుంది. ప్రభువును కలుసుకునే
మార్గాన్ని చాలా బాగా చెప్తున్నారని అంటారు. కానీ తాము ఆ మార్గములో నడవాలని,
వారసత్వాన్ని తీసుకోవాలని వారి బుద్ధిలోకి రాదు. బ్రహ్మాకుమారీలు చాలా మంచి సేవ
చేస్తున్నారని అంటారు, అంతే. అరే! మీరు కూడా అర్థం చేసుకోండి కదా. భౌతిక సేవలను
చేస్తూ ఉంటారు. ఇప్పుడు ఈ ఆత్మిక సేవను చేయండి. సమాజ సేవనైతే మనుష్యులందరూ చేస్తూ
ఉంటారు. ఉచితముగా ఎవరూ సేవలు చేయరు, లేదంటే ఎక్కడ నుండి తింటారు. ఇప్పుడు పిల్లలైన
మీరు చాలా మంచి సేవ చేస్తారు. మీకు భారత్ పట్ల చాలా దయ కలుగుతుంది. మన భారత్ ఎలా
ఉండేది, తర్వాత రావణుడు ఏ గతిలోకి తీసుకువచ్చాడు. ఇప్పుడు మనము తండ్రి శ్రీమతముపై
నడుచుకుని వారసత్వాన్ని తప్పకుండా తీసుకుంటాము.
మనమంతా
సంగమయుగానికి చెందినవారమని, మిగిలినవారంతా కలియుగానికి చెందినవారని ఇప్పుడు మీకు
తెలుసు. మనము అటువైపుకు వెళ్తున్నాము. ఎవరైతే తండ్రి స్మృతిలో మంచి రీతిలో ఉంటారో,
వారు కూర్చుని-కూర్చునే స్మృతి చేస్తూ-చేస్తూనే శరీరాన్ని వదిలేస్తారు. ఇక ఆత్మ
తిరిగి రాదు. కూర్చుని-కూర్చునే తండ్రి స్మృతిలో వెళ్ళిపోయారు. ఇక్కడ హఠయోగము
మొదలైనవాటి విషయమేమీ లేదు. ఎలాగైతే ధ్యానములో కూర్చుని-కూర్చునే వెళ్ళిపోవడము
చూస్తారో, అలా మీరు కూర్చుని-కూర్చునే ఈ శరీరాన్ని వదిలేస్తారు. సూక్ష్మవతనానికి
వెళ్ళి ఆ తర్వాత తండ్రి వద్దకు వెళ్ళిపోతారు. ఎవరైతే స్మృతియాత్రలో చాలా కృషి
చేస్తారో, వారు ఆ విధముగా శరీరాన్ని వదిలేస్తారు. సాక్షాత్కారము జరుగుతుంది. ఎలాగైతే
ప్రారంభములో మీకు చాలా సాక్షాత్కారాలు జరిగాయో, అలా చివరిలో కూడా మీరు చాలా చూస్తారు.
అచ్ఛా!
మధురాతి
మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్.
ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. మందిర యోగ్యులుగా అయ్యేందుకు దేహాభిమానాన్ని వదిలేయాలి. ఆత్మిక సేవలో
నిమగ్నమవ్వాలి.
2. ఇప్పుడు ఇది ఇంటికి వెళ్ళే సమయము, అందుకే ఏవైతే లెక్కాచారాలు,
వ్యాపార-వ్యవహారాలకు సంబంధించిన ఆలోచనలు ఉన్నాయో, వాటిని తొలగించుకోవాలి.
స్మృతియాత్రలో ఉండేందుకు కృషి చేయాలి.
వరదానము:-
సత్సంగము ద్వారా ఆత్మిక రంగును వేసే సదా హర్షిత మరియు డబల్
లైట్ భవ
ఏ పిల్లలైతే తండ్రిని హృదయపూర్వకమైన సత్యమైన సహచరునిగా
చేసుకుంటారో, వారికి సాంగత్యము యొక్క ఆత్మిక రంగు సదా అంటుకునే ఉంటుంది. బుద్ధి
ద్వారా సత్యమైన తండ్రి, సత్యమైన శిక్షకుడు మరియు సద్గురువు యొక్క సాంగత్యము చేయడము
- ఇదే సత్సంగము. ఎవరైతే ఈ సత్సంగములో ఉంటారో, వారు సదా హర్షితముగా మరియు డబల్ లైట్
గా ఉంటారు. వారికి ఏ రకమైన భారమూ అనుభవమవ్వదు. వారు ఎలా అనుభవం చేస్తారంటే - నేను
నిండుగా ఉన్నాను, సంతోషాల గని నాతో ఉంది, తండ్రికి చెందినవి ఏవైతే ఉన్నాయో అవన్నీ
నావైపోయాయి.
స్లోగన్:-
మీ మధురమైన
మాటలు మరియు ఉల్లాస-ఉత్సాహాల సహయోగముతో నిరాశగా ఉన్నవారిని శక్తివంతులుగా చేయండి.
అవ్యక్త ప్రేరణలు -
పరోపకార భావనతో సంపన్నులుగా అయి అపకారికి కూడా ఉపకారము చేయండి
పరోపకార భావనతో
సంపన్నులుగా అయ్యేందుకు ప్రతి ఆత్మలోని గుణాలనే చూడండి. ఎవరిలోనైనా బలహీనతలను మరియు
అవగుణాలను చూసినా కూడా మీ శుభ భావన ద్వారా, సహయోగపు కామన ద్వారా ఆ ఆత్మను కూడా
గుణవంతులుగా తయారుచేసేందుకు శక్తిని దానము చెయ్యండి. మీ సమయాన్ని, సుఖాన్ని,
పేరు-ప్రతిష్ఠలను, గౌరవాన్ని, సర్వ ప్రాప్తుల కోరికను బలిహారము చేసి, తీసుకోవాలన్న
కోరికను వదిలి, ఇచ్చే మహాదానిగా అవ్వండి, అప్పుడు పరోపకార భావనతో సంపన్నులుగా
అయ్యారని అంటారు.