‘‘ఇప్పుడు నలువైపులా దుఃఖము, అశాంతి పెరుగుతున్నాయి,
అందుకే మీ విశ్వ కళ్యాణి స్వరూపాన్ని ప్రత్యక్షము చేయండి, మనసా
సేవను పెంచండి, బాబా సాంగత్యపు రంగుతో డబల్ హోలీగా అవ్వండి’’
ఈ రోజు బాప్ దాదా ప్రతి బిడ్డ యొక్క భాగ్య రేఖలను
చూస్తున్నారు. మస్తకములో మెరుస్తున్న సితారల రేఖను, నయనాలలో
స్నేహము మరియు శక్తి యొక్క రేఖను, పెదవులపై చిరునవ్వు యొక్క
రేఖను, పాదాలలో ప్రతి అడుగులో పదమాల రేఖను చూస్తున్నారు.
మీరందరూ కూడా మీ భాగ్య రేఖలను చూసి హర్షిస్తున్నారు కదా!
హృదయములో వాహ్ నా భాగ్యము అన్న పాటయే పాడుకుంటూ ఉంటారు! ప్రతి
ఒక్కరి మస్తకము ఆ దివ్య సితారలతో మెరుస్తూ ఉండటాన్ని చూసి బాప్
దాదా కూడా సంతోషిస్తున్నారు మరియు హృదయములో వాహ్ పిల్లలు వాహ్
అన్న పాటే పాడుకుంటూ ఉంటారు. పిల్లల హృదయాల నుండి ఏ పాటను
వింటున్నారు? వాహ్ బాబా వాహ్! పిల్లలు కూడా వాహ్! బాబా కూడా
వాహ్! మరి ఈ సభ అంతా ఏమైనట్లు? వాహ్! వాహ్! వాహ్! ఎలా అయితే
ఇప్పుడు అందరూ హర్షిస్తూ ఉన్నారో, అలా మీ భాగ్యాన్ని చూసుకుని
సదా ఇలానే హర్షితముగా ఉండండి. ఈ భాగ్యము ఇప్పుడు సంగమయుగములోనే
లభిస్తుంది. సంగమయుగములోని ప్రతి క్షణానికి చాలా ఎక్కువ విలువ
ఉంది. సంగమయుగములోని ఒక్క క్షణము కూడా అవినాశీగా అయిపోతుంది
ఎందుకంటే ప్రతి క్షణానికి 21 జన్మలతో సంబంధము ఉంది. ఇప్పటి
ఒక్క క్షణము యొక్క సంబంధము 21 జన్మలతో ఉంది. కావున చెక్
చేసుకోండి, ఒకవేళ ఒక్క క్షణము వ్యర్థముగా పోయినా కానీ అది ఒక్క
జన్మకు కాక 21 జన్మలకు సంబంధించినది అవుతుంది, అందుకే బాప్ దాదా
పిల్లలకు ఎప్పటికప్పుడు అటెన్షన్ ఇప్పిస్తూనే ఉన్నారు -
సంగమయుగములోని ఒక్క క్షణాన్ని కూడా, ఒక్క సంకల్పాన్ని కూడా
వ్యర్థముగా పోనివ్వద్దు ఎందుకంటే ఒక్క జన్మ కాదు, 21 జన్మలు
వ్యర్థముగా పోగొట్టినట్లు. సంగమయుగ మహత్వాన్ని ప్రతి సమయము
గుర్తుంచుకోండి.
బాప్ దాదా అయితే వ్యర్థ సమయము మరియు వ్యర్థ సంకల్పాల గురించి
హోమ్ వర్కును అందరికీ ఇచ్చారు. మరి అందరూ హోమ్ వర్కు చేశారా?
ఎవరైతే - మాకు అటెన్షన్ ఉంది, అంతేకాక చాలావరకు సఫలతను కూడా
పొందాము, లక్ష్యము లక్షణాలు వరకు చేరుకున్న పరిణామము ఉంది అని
భావిస్తున్నారో, వారు చేతులెత్తండి. అచ్ఛా. పాండవులు
చేతులెత్తుతున్నారా? చేతులు బాగా పైకి ఎత్తండి. ఇప్పుడింకా
అందరూ చెప్పిన పనిని చెయ్యలేదు. అవినాశీ బాబా ద్వారా ఈ కార్యము
లభించింది, ప్రతి క్షణము అవినాశీగా అయ్యేది ఉంది అని సంగమయుగ
మహత్వాన్ని ఒకవేళ సదా బుద్ధిలో గుర్తుంచుకున్నట్లయితే, ఇది
సహజముగానే అయిపోతుంది ఎందుకంటే అవినాశీ తండ్రి ఈ వరదానాన్ని
ఇచ్చారు.
ప్రతి బ్రాహ్మణ బిడ్డ యొక్క అడుగులలో పదమాల రేఖ ఉందని బాబా
వినిపించి ఉన్నారు. అడుగులో పదమాల రేఖ ఉందంటే మరి సంగమయుగములో
ఎన్ని పదమాలకు గోల్డెన్ ఛాన్స్ ఉందో ఆలోచించండి. ప్రతి ఒక్కరూ
తమ ఈ భాగ్యాన్ని గుర్తుంచుకోవాలి. కొంతమంది పిల్లలు బాప్ దాదా
ఏమి కోరుకుంటున్నారు అని ఆలోచిస్తూ ఉంటారు. బాప్ దాదా ఇదే
కోరుకుంటున్నారు, ఒక్కొక్క బిడ్డ డబుల్ రాజుగా అవ్వాలి. ఇప్పుడు
స్వరాజ్య అధికారులు మరియు భవిష్యత్తులో విశ్వ రాజ్య అధికారులు.
ఏ బిడ్డ డబుల్ రాజుగా అవ్వడములో తక్కువవ్వకూడదు. కావున ప్రతి
బిడ్డ డబుల్ రాజ్యాధికారులే కదా! తల ఊపండి. మరి ప్రతి బిడ్డ
డబుల్ రాజ్యాధికారులేనా! తల ఊపండి. కావున తండ్రికి ఎంత
సంతోషముగా ఉంటుంది.
బాప్ దాదా ప్రతి బిడ్డ యొక్క రికార్డును రోజూ చూస్తారు,
అప్పుడు ఏమి చూస్తారు? ప్రతి ఒక్కరూ తమ మనసులో అయితే తెలుసుకునే
ఉంటారు. రాజ్యాధికారిగా అయితే అయ్యారు కానీ ఇప్పుడు స్వరాజ్య
అధికారిగా అవ్వాలి, స్వరాజ్య అధికారి అనగా
మనసు-బుద్ధి-సంస్కారాలను తమ కంట్రోల్ లో నడిపించేవారు. ఎప్పుడు
కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా, అధికారముతో నడిపించగలగాలి.
ఎలా అయితే ఈ స్థూల కర్మేంద్రియాలైన చేతులు, కాళ్ళు ఉన్నాయో, ఇవి
మీ కంట్రోల్లో ఉంటాయో, అలాగే మనసు, బుద్ధి, సంస్కారాలపై కూడా
ఎప్పుడు కావాలంటే అప్పుడు, ఎలా కావాలంటే అలా రూలింగ్ పవర్ మరియు
కంట్రోలింగ్ పవర్ ఉండాలి. ఇప్పుడు చూస్తే ఇందులో నంబరువారుగా
చాలామంది కనిపిస్తున్నారు. ఇవి కూడా నావే. మనసు నేను కాదు, నాది.
సంస్కారాలు నావి. బుద్ధి నాది. కానీ కంట్రోలింగ్ పవర్, రూలింగ్
పవర్ నంబరువారుగా ఉన్నాయి. బాప్ దాదా సమయము యొక్క సూచనను కూడా
ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నారు. ఈ సమయమనుసారముగా మీలోని
ఒక్కొక్కరి స్వమానము - విశ్వ కళ్యాణకారి. ఇప్పుడు సమయమనుసారముగా
ప్రతి బిడ్డ విశ్వ కళ్యాణి స్వరూపాన్ని ప్రత్యక్షము
చెయ్యాల్సిన సమయమిది. నలువైపులా దుఃఖము, అశాంతి పెరుగుతూ
ఉన్నాయి. మీ సోదరులు, మీ సోదరీలు, పరివారాలు దుఃఖపడుతున్నారు,
మరి మీకు మీ పరివారముపై దయ కలగడము లేదా! ఇప్పుడు బాప్ దాదా ఇదే
సూచనను ఇస్తున్నారు - స్వ పురుషార్థముతో పాటు విశ్వ సేవను కూడా
చేయండి. వర్తమాన సమయములో వాచా సేవను ఎంతో బాగా చేస్తున్నారు కదా,
దీనికి బాప్ దాదా సంతోషిస్తున్నారు. ఈ 75 సంవత్సరాల జూబ్లీ
మెజారిటీ అందరి మనసులలో సేవా ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. ఇది
చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు కానీ ఇప్పుడు మనసా సేవ యొక్క
అవసరము కూడా ఉంది ఎందుకంటే అన్నివైపులా ఇప్పుడు విశ్వ
కళ్యాణకారులుగా అవ్వాలి, అందులో మనసా, వాచా మరియు కర్మణా అనగా
నడవడిక మరియు ముఖము, మూడు సేవల యొక్క అవసరము ఇప్పుడు ఉంది. రోజూ
చెక్ చేసుకోండి - ఈ మూడు సేవలలో ఎంత పర్సెంటేజ్ సేవ చేసాను?
వాచాలో అయితే బాప్ దాదా కూడా సర్టిఫికేట్ ఇచ్చారు కానీ ఇప్పుడు
మనసా సూక్ష్మ వైబ్రేషన్ల ద్వారా దుఃఖముతో, అశాంతితో ఉన్న
ఆత్మలకు ఆధారముగా నిలవవలసి ఉంది. మీకు దయ కలగడము లేదా? బాప్
దాదాకు అయితే పిల్లల పట్ల, పిల్లలు ఎలా అయినా ఉండనీ, ఎంతైనా
పిల్లలే కదా, కావున వారిని చూసి దయ కలుగుతుంది. కావున ఇప్పుడు
ప్రతి బిడ్డ కేవలం సెంటరు కళ్యాణిగా కాదు, జోన్ కళ్యాణిగా కాదు,
విశ్వ కళ్యాణిగా అవ్వాలి. కావున బాప్ దాదా ఇప్పుడు ఇదే అటెన్షన్
ను ఇప్పిస్తున్నారు - మీ భక్తుల కళ్యాణకారులుగా అవ్వండి,
ఎందుకంటే ఈ సంగమయుగానికి చాలా గొప్ప మహత్వము ఉంది. ఇప్పుడు
సంగమయుగములో ఏది కావాలంటే అది, ఎంత కావాలంటే అంత బాబా నుండి
సహయోగము లభించగలదు. మరి ఇప్పుడు ఏమి చెయ్యాలో విన్నారా? మనసా
సేవను పెంచండి. మీ కార్యము అనుసారముగా, ఎలా అయితే ట్రాఫిక్
కంట్రోల్ సమయాన్ని ఫిక్స్ చేసి పెట్టుకున్నారో, అలానే ప్రతి
ఒక్కరూ మనసా సేవ కోసం కూడా సమయాన్ని ఫిక్స్ చేసుకోవాలి.
ఎప్పుడైతే ఎక్కువ దుఃఖము ఉంటుందో, ఆ సమయములో అందరి అటెన్షన్ ఆ
అలజడి వైపే ఉంటుంది, కానీ ఇప్పుడు ఇది మనసా సేవ చెయ్యాల్సిన
సమయము, అందుకే ప్రతి బిడ్డ తమ విశ్వ కళ్యాణి స్వరూపాన్ని ఇమర్జ్
చేసుకోవాలి. విశ్వ కళ్యాణములో స్వ కళ్యాణము స్వతహాగా మరియు
సహజముగా జరిగిపోతుంది ఎందుకంటే ఒకవేళ మనసు ఫ్రీగా ఉంటే వ్యర్థము
వస్తుంది కానీ మనసు బిజీగా ఉంటే వ్యర్థము సహజముగానే
సమాప్తమైపోతుంది. బాప్ దాదా ఎప్పుడైతే నలువైపులా చుట్టి వచ్చారో,
దేశ-విదేశాలలోని అజ్ఞానీ పిల్లలను చూసినప్పుడు వారికి దయ
కలుగుతుంది, అందుకే మీరందరూ కూడా ఇప్పుడు దుఃఖహర్త, సుఖకర్తలుగా
అవ్వండి.
చూడండి, ప్రపంచములోనివారి హోలీకి మరియు మీ హోలీకి ఎంత తేడా
ఉంది. బాప్ దాదా ఇంతకుముందు కూడా చెప్పారు, మీ భక్తులు మీరు
చేసిన కార్యాలను కాపీ చెయ్యడములో తెలివైనవారు ఎందుకంటే ఈ
విధులన్నింటినీ ద్వాపరములో వచ్చే ఆత్మలు తయారుచేసారు. అది వారి
మొట్టమొదటి జన్మ కనుక, వారి బుద్ధి కూడా, నియమానుసారముగా, ముందు
సతోప్రధానముగా, ఆ తర్వాత రజో, తమోలలోకి వస్తుంది. అంటే ఆ
సమయములో వారి బుద్ధి వారి అనుసారముగా సతో బుద్ధిగా ఉండింది,
అందుకే మీ ఒక్కొక్క విశేషతను వారు కాపీ చేసారు. మీరు సదా
ఉత్సాహములో, సంతోషముగా ఉంటారు, దానిని వారు ఉత్సవ రూపములో
జరుపుకోవడము ప్రారంభించారు. శివరాత్రి రోజున కూడా చెప్పాము కదా,
భక్తులు కాపీ చేయడములో ఎంత తెలివైనవారో, అలాగే ఇప్పుడు కూడా
మీరు సదా సంగమములో ఉత్సాహములో ఉంటారు, కనుక మీ ఉత్సాహాన్ని వారు
ఉత్సవాల రూపములో స్మృతిచిహ్నముగా తయారుచేసారు. మరి హోలీలో ఏమి
చేస్తారు? మీరు కూడా మీ జీవితాన్ని రంగులమయం చేసుకున్నారు కదా.
కానీ మీ రంగు ఏమిటి? మీ అందరి రంగు బాబా సాంగత్యపు రంగు. మరి
పూర్తి సమయమంతా బాబా సాంగత్యపు రంగులో రంగింపబడి ఉంటారు కదా!
వారు రంగును తయారుచేసారు కానీ దేహాభిమానములో ఉన్నారు కదా! కనుక
స్థూల రంగును తయారుచేసారు. కానీ మీరందరూ సదా ఈ కళ్యాణకారి
సంగమయుగములో ఈ రంగులో, సాంగత్యపు రంగులో ఉంటున్నారు కదా! రంగు
వేసుకున్నారు కదా! సాంగత్యపు రంగు అంటుకుంది. హోలీ అంటే
ఇంగ్లీష్ లో పవిత్రత అని అర్థం. అంటే సాంగత్యపు రంగులో మీరు
హోలీగా అనగా పవిత్రముగా అవుతారు. పవిత్రముగా అయ్యారు కదా!
పవిత్రతా వ్రతాన్ని అందరూ పక్కాగా తీసుకున్నారు కదా!
నంబరువారుగా ఉండి ఉండవచ్చు కానీ బ్రాహ్మణులుగా అవ్వడము అనగా
పవిత్రతా వ్రతాన్ని తీసుకోవడము, ఎందుకంటే తండ్రి సదా పవిత్రులు.
వారు ఉన్నదే పవిత్ర స్వరూపులుగా. వారు అలా అవ్వవలసిన అవసరము
లేదు, వారి స్వరూపమే పవిత్రత. మరి హోలీ విశేషత ఏమిటో తెలుసా?
పవిత్రముగా అయితే మీరు అవుతారు కానీ మీరు సాంగత్యపు రంగులో
డబుల్ పవిత్రులుగా అవుతారు. ధర్మపితలు, మహానాత్మలు కూడా
పవిత్రముగా అవుతారు కానీ వారు కేవలం ఆత్మను మాత్రమే పవిత్రముగా
చేసుకుంటారు. శరీరము మరియు ఆత్మ రెండూ పవిత్రముగా మీరు
భవిష్యత్తులో అవుతారు. ప్రారంభము నుండి చూడండి, ద్వాపరము నుండి
ఎవరైతే వచ్చారో, వారు పవిత్రముగా అయ్యారు కానీ డబుల్ పవిత్రముగా
ఎవ్వరూ అవ్వలేదు. శరీరము కూడా పవిత్రము, ఆత్మ కూడా పవిత్రము.
మీరు ఎప్పుడైతే భవిష్యత్తులో రాజ్యాధికారులుగా అవుతారో, అప్పుడు
ఆత్మ మరియు శరీరము, రెండూ పవిత్రముగా ఉంటాయి. పూర్తి చక్రమంతా
తిరగండి. ద్వాపరము నుండి వచ్చారు. ద్వాపరము నుండి ఇప్పటివరకు
చూడండి, ఎవరైనా డబుల్ పవిత్రముగా అయ్యారా! మరి డబుల్ పవిత్రముగా
అయిన మీరు ఇంత మహనీయులుగా ఎందుకు అయ్యారు? మీకు అంటిన రంగు
ఎటువంటిది? పరమాత్ముని సాంగత్యపు రంగు అంటుకుంది. ఎలా అయితే
పరమ ఆత్మ పవిత్రమైనవారో, అలా మీరు కూడా 21 జన్మలు డబుల్
పవిత్రులుగా ఉంటారు. ధర్మపితలు వచ్చినా కానీ వారు కూడా డబుల్
పవిత్రులుగా అవ్వలేదు. ఇది మీ భాగ్యము ఎందుకంటే మీరు ఉండేదే
పరమాత్ముని సాంగత్యములో. సాంగత్యపు రంగు ఎంత పక్కాగా ఉంటుందంటే
మీరు డబుల్ పవిత్రులుగా అయిపోతారు. హోలీకి మరో అర్థం హో-లీ.
జరిగిపోయింది, గడిచిపోయిందేదో గడిచిపోయింది. మరి హో-లీ చెయ్యడము
వస్తుందా? జరిగిందేదో జరిగిపోయింది. హో-లీ అన్న పదానికి ఉన్న
అర్థం ఏమిటి? గతం గతః. దీని ద్వారా మీరు డబుల్ హోలీగా 21 జన్మలు
ఉంటారు, ఒక్క జన్మ కాదు, ఎందుకంటే సంగమములోని ఒక్కొక్క క్షణము
యొక్క కనెక్షన్ 21 జన్మలతో ఉంటుంది. ఇక్కడ ఒకవేళ మీరు ఒక్క
క్షణాన్ని లేదా ఒక్క నిమిషాన్ని సఫలం చేస్తే 21 జన్మలు మీవి
సఫలమై ఉంటాయి, ఇది గ్యారంటీ. మరి ఇటువంటి హోలీని జరుపుకున్నారా?
హోలీ చెయ్యడము వచ్చా? జరిగినదేదో జరిగిపోయింది, అయిపోయింది.
మూడవ స్మృతిచిహ్నముగా ఏం చేస్తారు? ముందుగా కాలుస్తారు, ఆ
తర్వాత జరుపుకుంటారు. మరి మీరేమి చేసారు? యోగాగ్నితో మీ
బలహీనతలను, సంస్కారాలను, అనేక జన్మల నుండి ఉన్న తప్పుడు
సంస్కారాలను యోగాగ్నితో కాల్చి వేసారు కదా! కాల్చి వేసారా లేక
ఇప్పటికీ ఇంకా కాలుస్తూ ఉన్నారా? కాల్చి వేసారా? మేము
యోగాగ్నితో మా పాత సంస్కారాలను కాల్చి వేసాము, కాలిపోయాయి అని
భావించేవారు చేతులెత్తండి. కాలిపోయాయా లేక ఇప్పటికీ వస్తున్నాయా?
కొద్దికొద్దిగా వస్తున్నాయా? బాప్ దాదా వద్దకు మీ చార్టును
పంపించినప్పుడు ఏమంటారంటే, చాలావరకు వెళ్ళిపోయాయి అని. మీరు
చెప్పడములో చతురులు కదా! కనుక ఏమంటారంటే, చాలావరకు
సమాప్తమైపోయాయి, అప్పుడప్పుడూ కొద్దిగా ఇమర్జ్ అవుతూ ఉంటాయి.
కానీ కాలిపోవడము అంటే కాలిపోవడము. కాలిపోయిన తర్వాత దాని
నామరూపాలు కూడా ఉండవు. మరణించిన తర్వాత శరీరమైతే కనిపిస్తుంది,
కానీ కాలిపోయిన తర్వాత సమాప్తమైపోతుంది. రావణుడిని కూడా చూడండి,
అతడిని కేవలం హతమార్చడము కాదు, కాల్చారు కూడా, నామరూపాలు
పూర్తిగా సమాప్తమైపోతాయి. మరి మీరు కూడా అందరూ నోట్ చేసుకోండి
- సంస్కారాలను హతమార్చారా లేక కాల్చారా? భస్మము చేశారా? పాత
సంస్కారాలను ఒకవేళ కాల్చకపోతే, మధ్యమధ్యలో అవి ఇమర్జ్ అవుతాయి.
కానీ భక్తులు అన్నీ కాపీ చేసారు. మీరు కాలుస్తారు కనుక వారు
కూడా కాలుస్తారు, ఆ తర్వాత జరుపుకుంటారు. కాల్చకుండా జరుపుకోరు.
మీరైతే సంస్కారాలను కాల్చి వేస్తూ హోలీగా (పవిత్రముగా) అయ్యారు.
కొంతమంది అవుతూ ఉన్నారు, కొంతమంది అయిపోయారు. మరి మీరు హోలీని
జరుపుకున్నారా? బాబా సాంగత్యపు రంగు యొక్క హోలీని జరుపుకున్నారా?
ఇప్పుడు సాంగత్యములో కూర్చుని ఉన్నారు కనుక సాంగత్యపు రంగు
యొక్క హోలీని జరుపుకున్నారు కదా! జరుపుకున్నారా? చేతులెత్తండి.
జరుపుకున్నారు. హోలీ జరుపుకోవడము అంటే హోలీగా అవ్వడము,
పవిత్రముగా అవ్వడము. తండ్రి ఎలా ఉన్నారో, పిల్లలు కూడా అలాగే
ఉన్నారు. ఒకవేళ మీలోని ఏ సంస్కారమైనా కాలిపోలేదు అనుకోండి,
ఇమర్జ్ అవుతూ ఉంటే అది మంచిగా అనిపిస్తుందా? ఇప్పుడు తీవ్ర
పురుషార్థముతో దానిని కాల్చి వేయాల్సిందే అని మీకు సంకల్పము
వస్తుంది కదా. కేవలం హతమార్చడమే కాదు, ఏమవుతుందంటే కొంతమంది
సంస్కారాలను హతమార్చారు, కానీ మరణించినవారిలో ఒక్కోసారి ప్రాణము
తిరిగి వస్తుంది. అదే కాల్చివేస్తే మళ్ళీ ఎప్పుడూ రాదు.
మరి ఈ రోజు కాల్చి వేయాలా లేక హతమారుస్తే సరిపోతుందా?
కాల్చివేసే శక్తి ఉందా? ఉందా శక్తి? సంకల్పము చెయ్యగలరా? బాప్
దాదాతో ఆత్మిక సంభాషణ చేస్తారు కదా. కొందరు అంటారు, చాలా
మధురాతి మధురమైన ఆత్మిక సంభాషణ చేస్తారు. ఏమంటారంటే, బాబా,
మేమైతే చాలా ప్రయత్నించాము, కానీ మళ్ళీ-మళ్ళీ వచ్చేస్తుంది,
కావాలనుకోవడము లేదు కానీ వచ్చేస్తుంది. కారణమేమిటో తెలుసా?
కాలుస్తున్నారు, బాప్ దాదా చూస్తున్నారు, పురుషార్థము చాలా
చేస్తారు కానీ పురుషార్థముతో పాటు దృఢ సంకల్పము యొక్క అవసరముంది.
దృఢత సఫలతకు తాళంచెవి. దృఢ సంకల్పము చేసినట్లయితే, దృఢము అంటేనే
మళ్ళీ తిరిగి రాదు అని అర్థం. ఇంకా చాలా మధురాతి మధురమైన మాటలు
మాట్లాడుతారు తెలుసా. సంస్కారాలు మళ్ళీ తిరిగి వస్తాయి కదా,
అప్పుడు ఏమంటారు? ఆత్మిక సంభాషణ అయితే అందరూ చేస్తారు కదా! చాలా
మధురమైన ఆత్మిక సంభాషణ జరుగుతుంది. ఏమంటారంటే, కావాలని అనుకోము
కానీ వచ్చేస్తుంది. అంటే శక్తి తక్కువగా ఉంది కదా! దృఢత
తక్కువగా ఉంది కదా! దృఢ సంకల్పధారులుగా అవ్వండి. చెయ్యాల్సిందే.
మరియు ఆ దృఢ సంకల్పాన్ని ప్రతి రోజూ చెక్ చేసుకోండి - ఏ కారణము
చేత మళ్ళీ దృఢతలో బలహీనత వచ్చింది? మళ్ళీ అది రాకుండా ఉండేలా ఆ
పరిస్థితిపై ప్రత్యేకమైన అటెన్షన్ పెట్టండి. మాస్టర్
సర్వశక్తివాన్ అనే సీట్ పై కూర్చుని ఆ సంకల్పాన్ని,
సంస్కారాన్ని సమాప్తము చేయండి. కొంతమంది పిల్లలు ఏమంటారంటే,
ఒక్కోసారి ఏదైనా శక్తిని కోరుకుంటాము కదా, ఆ శక్తి ఆ సమయానికి
రాదు. ఆ మాటకొస్తే ఆ శక్తి ఉంది, కానీ అవసరమైన సమయములో
ఒక్కోసారి ఆ శక్తిని ఇమర్జ్ చేసుకుంటాము కదా, అయినా కూడా అది
రాదు అని అంటారు. మీరు ఉన్నదే మాస్టర్ సర్వశక్తివంతులుగా. మీ
టైటిల్ ఏమిటి? మాస్టర్ సర్వశక్తివంతులు కానీ ఏమని అంటారు? శక్తి
సమయానికి రాదు అని అంటారు. కారణము? మీ మాస్టర్ సర్వశక్తివంతుని
సీట్ పై సెట్ అవ్వడము లేదు. ఇప్పుడు ఆఫీసుకు వెళ్ళినప్పుడు కూడా,
అధికారము ఉన్నవారు ఆజ్ఞాపిస్తే చేసేవారు వారి ఆజ్ఞను పాటిస్తారు
కదా. ఇంకెవరైనా చెప్తే పాటిస్తారా? మరి మీ సీట్ - మాస్టర్
సర్వశక్తివాన్. ఆ సీట్ పై సెట్ అవ్వకపోతే శక్తిని ఆహ్వానించినా
కానీ అది సమయానికి రాదు. అందుకే బాప్ దాదా పదే-పదే చెప్పారు,
మీ మనసును బిజీగా పెట్టుకోండి. ఒకసారి ఒక శక్తిని మొత్తం
రోజంతటిలో ఇమర్జ్ చేసి పెట్టుకోండి, మరోసారి మరో శక్తిని ఇమర్జ్
చేసి చూడండి, దాని శక్తి ఏమిటో చూడండి? ఇలా అనుభవం చేస్తూ ఉంటే,
మీ సీట్ పై సెట్ అయ్యి ఉంటే, శక్తులు మీ ఎదురుగా సదా చిత్తం
ప్రభూ అని హాజరవుతాయి. మీ శక్తులు కదా! మరి హోలీని
జరుపుకున్నారా? మీరైతే సదా హోలీని జరుపుకుంటూ ఉంటారు. సదా బాబా
యొక్క సాంగత్యపు రంగును వేసుకుంటూనే ఉంటారు. రంగులో రంగింపబడి
ఉన్నారు కదా? అచ్ఛా.
ఈ రోజు బాప్ దాదా ప్రతి బిడ్డకు ఒక స్వమానాన్ని ఇస్తున్నారు
- ప్రతి బిడ్డ దృఢ సంకల్పధారీ విశేష ఆత్మగా అవ్వండి. సంకల్పము
చెయ్యగానే జరిగిపోవాలి, దీనినే దృఢ సంకల్పము అని అనడము
జరుగుతుంది. దృఢ సంకల్పమే చేసాము అని అంటారు కానీ దృఢత అంటేనే
సఫలత. ఒకవేళ సఫలత లేదు అంటే దృఢత ఉంది అని అనము. కనుక ఇప్పుడు
దృఢత భవ! మీ ఈ విశేష స్వమానాన్ని రోజూ అమృతవేళలో స్మృతిలోకి
తెచ్చుకోండి మరియు ఆ విధిపూర్వకముగా ముందుకు సాగండి. సంగమయుగ
సమయము చాలా ప్రియమైనది. అందులోని ఒక్క సెకండు, సెకండు కాదు.
ఒక్క సెకండు ఒక్క సంవత్సర ప్రాప్తితో సమానము, అందుకే బాప్ దాదా
చెప్తూనే ఉంటారు - ఒక్క సెకండు కూడా వ్యర్థముగా పోకూడదు, ఒక్క
సంకల్పము కూడా వ్యర్థముగా పోకూడదు. సమర్థులుగా అవ్వండి మరియు
సమర్థులుగా చేయండి. సరేనా! అచ్ఛా!
నలువైపులా ఉన్న హోలియెస్ట్ పిల్లలకు, ప్రతి అడుగులో నా బాబా,
నా బాబా అంటూ ఎగురుతూ ఉన్న పిల్లలకు మరియు సదా తమ తీవ్ర
పురుషార్థము ద్వారా ముందుకు వెళ్తూ మరియు ముందుకు తీసుకువెళ్తూ
ఉన్న పిల్లలకు, బాప్ దాదా హృదయ రత్నాలకు బాప్ దాదా చాలా చాలా
చాలా చాలా హృదయపూర్వక ప్రేమను అందిస్తున్నారు. దానితోపాటు హోలీ
అభినందనలు కూడా తెలియజేస్తున్నారు ఎందుకంటే వాస్తవానికి మీరే
హోలీ, మరెవ్వరూ డబుల్ హోలీగా అవ్వరు. మీరే డబుల్ హోలీగా అవుతారు,
అందుకే పదమాల రెట్లు అభినందనలు, అభినందనలు.