02-09-2025 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు విశ్వములో శాంతి స్థాపన
చేయడానికి నిమిత్తులు, అందుకే మీరు ఎప్పుడూ అశాంతి చెందకూడదు’’
ప్రశ్న:-
తండ్రి
ఏ పిల్లలను ఆజ్ఞాకారీ పిల్లలు అని అంటారు?
జవాబు:-
తండ్రి ఇచ్చే
ముఖ్య ఆజ్ఞ ఏమిటంటే - పిల్లలూ, అమృతవేళలో (ఉదయమే) లేచి తండ్రిని స్మృతి చేయండి. ఏ
పిల్లలైతే ఈ ముఖ్య ఆజ్ఞను పాటిస్తారో, ఉదయముదయమే స్నానము చేసి ఫ్రెష్ అయి,
నిశ్చితమైన సమయములో స్మృతియాత్రలో ఉంటారో, ఆ పిల్లలను బాబా సుపుత్రులు లేక
ఆజ్ఞాకారులు అని అంటారు, వారే వెళ్ళి రాజులుగా అవుతారు. కుపుత్రులైన పిల్లలైతే
అక్కడకు వెళ్ళి ఊడుస్తారు.
ఓంశాంతి
దీని అర్థాన్ని అయితే పిల్లలకు అర్థం చేయించారు. ఓం అనగా నేను ఆత్మను. జీవాత్మ అనేది
తప్పకుండా ఉందని మరియు ఆత్మలందరికీ తండ్రి ఒక్కరేనని అందరూ అంటూ ఉంటారు. శారీరాలకు
తండ్రులు వేర్వేరుగా ఉంటారు. హద్దులోని తండ్రి నుండి హద్దులోని వారసత్వము మరియు
అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వము లభిస్తుందని ఇది కూడా పిల్లల బుద్ధిలో ఉంది.
ఇప్పుడు ఈ సమయములో మనుష్యులు విశ్వములో శాంతి ఏర్పడాలని కోరుకుంటున్నారు. చిత్రాలపై
అర్థం చేయించేటప్పుడు - శాంతి కొరకు కలియుగాంతము మరియు సత్యయుగ ఆదికి మధ్యలో ఉన్న
సంగమము వద్దకు వారిని తీసుకురావాలి. ఇది సత్యయుగ కొత్త ప్రపంచము, అక్కడ ఒకే
ధర్మముంటుంది, కావున పవిత్రత-శాంతి-సుఖము ఉంటాయి. దానిని స్వర్గము అని అంటారు. ఇదైతే
అందరూ అంగీకరిస్తారు. కొత్త ప్రపంచములో సుఖము ఉంటుంది, అక్కడ దుఃఖము అనేది ఉండనే
ఉండదు. ఇది ఎవరికైనా అర్థం చేయించడం చాలా సహజము. శాంతి లేక అశాంతి అన్న మాట ఈ
విశ్వములోనే ఉంటుంది. అక్కడ ఉన్నది నిర్వాణధామము, అక్కడ శాంతి-అశాంతి అన్న ప్రశ్నే
ఉత్పన్నమవ్వదు. పిల్లలు ఎప్పుడైతే భాషణ చేస్తారో, అప్పుడు మొట్టమొదట - విశ్వములో
శాంతి అన్న విషయముపైనే మాట్లాడాలి. మనుష్యులు శాంతి కొరకు ఎంతో ప్రయాస చేస్తుంటారు,
అందులో వారికి ప్రైజ్ కూడా లభిస్తూ ఉంటుంది. వాస్తవానికి దాని కోసం ఎటూ
పరిగెత్తవలసిన అవసరం లేదు. తండ్రి అంటారు, కేవలం మీ స్వధర్మములో స్థితులవ్వండి,
అప్పుడు వికర్మలు వినాశనమైపోతాయి. స్వధర్మములో స్థితులైనట్లయితే శాంతి ఏర్పడుతుంది.
మీరు ఉన్నదే సదా శాంతిగా ఉండే ఆ తండ్రికి పిల్లలు. ఈ వారసత్వము వారి నుండి
లభిస్తుంది. పరంధామాన్ని మోక్షము అనేమీ అనరు. మోక్షము అనేది భగవంతుడికి కూడా లభించదు.
భగవంతుడు కూడా పాత్రను అభినయించేందుకు తప్పకుండా రావలసిందే. కల్ప-కల్పము, కల్పపు
సంగమయుగములో నేను వస్తాను అని వారు అంటారు. కావున భగవంతుడికే మోక్షము లేనప్పుడు ఇక
పిల్లలు మోక్షాన్ని ఎలా పొందగలరు. ఈ విషయాలను రోజంతా విచార సాగర మంథనము చేయాలి.
తండ్రి అయితే పిల్లలైన మీకే అర్థం చేయిస్తారు. పిల్లలైన మీకు ఇతరులకు అర్థం చేయించే
అభ్యాసము చాలా ఎక్కువగా ఉంది. శివబాబా అర్థం చేయిస్తున్నప్పుడు కేవలం బ్రాహ్మణులైన
మీరందరూ మాత్రమే అర్థం చేసుకుంటారు. విచార సాగర మంథనము మీరే చేయాలి. సేవలో ఉన్నది
పిల్లలైన మీరే. మీరు అయితే ఎంతో అర్థం చేయించవలసి ఉంటుంది. రాత్రింబవళ్ళు మీరు సేవలో
ఉంటారు. మ్యూజియమ్ లో రోజంతా వస్తూనే ఉంటారు. కొన్నిచోట్ల అయితే రాత్రి 10-11 గంటల
వరకు వస్తూనే ఉంటారు. ఉదయము 4 గంటల నుండి కూడా కొన్నిచోట్ల సేవ చేయడం మొదలుపెడతారు.
ఇక్కడైతే ఇది ఇల్లు, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కూర్చోవచ్చు. సెంటర్లలోనైతే బయట
నుండి, దూరదూరాల నుండి వస్తారు కావున ఒక సమయాన్ని ఫిక్స్ చేయవలసి ఉంటుంది. ఇక్కడైతే
ఏ సమయములోనైనా పిల్లలు లేవవచ్చు. కానీ పిల్లలు ఉదయము లేచి కునుకుపాట్లు పడవలసి వచ్చే
విధముగా రాత్రి సమయములో చదవకూడదు. అందుకే ఉదయము సమయాన్ని ఫిక్స్ చేయడం జరుగుతుంది.
అప్పుడు స్నానము మొదలైనవి చేసుకుని ఫ్రెష్ అయి రావచ్చు. అయినా కానీ టైమ్ కు రాకపోతే
వారిని ఆజ్ఞాకారులు అని అనలేరు. లౌకిక తండ్రికి కూడా సుపుత్రులు మరియు కుపుత్రులు
ఉంటారు కదా. అలాగే అనంతమైన తండ్రికి కూడా ఉంటారు. సుపుత్రులు వెళ్ళి రాజులుగా
అవుతారు, కుపుత్రులు వెళ్ళి అక్కడ ఊడుస్తారు. అంతా తెలిసిపోతుంది కదా.
శ్రీకృష్ణ జన్మాష్టమి గురించి కూడా అర్థం చేయించడం జరిగింది. శ్రీకృష్ణుడి జన్మ
ఎప్పుడైతే జరుగుతుందో అప్పుడు అది స్వర్గము. అక్కడ ఒకే రాజ్యము ఉంటుంది. విశ్వములో
శాంతి ఉంటుంది. స్వర్గములో చాలా తక్కువమంది మనుష్యులు ఉంటారు. ఆ ప్రపంచమే కొత్త
ప్రపంచము. అక్కడ అశాంతి ఉండజాలదు. ఎప్పుడైతే ఒకే ధర్మము ఉంటుందో అప్పుడే శాంతి
ఉంటుంది. ఆ ధర్మాన్ని తండ్రి స్థాపన చేస్తారు. ఆ తరువాత ఎప్పుడైతే ఇతర ధర్మాలు
వస్తాయో అప్పుడు అశాంతి ఏర్పడుతుంది. ఆ ప్రపంచములో ఉండేదే శాంతి, వారు పదహారు కళల
సంపూర్ణులు కదా. చంద్రుడు కూడా సంపూర్ణముగా ఉన్నప్పుడు ఎంత శోభనీయముగా ఉంటాడు.
దానిని పౌర్ణమి చంద్రుడు అని అంటారు. త్రేతాలో 3/4 నిండుగా ఉన్నట్లు అంటారు,
ఖండితమైనట్లు కదా. రెండు కళలు తగ్గిపోయాయి. సంపూర్ణ శాంతి సత్యయుగములో ఉంటుంది.
సృష్టి 25 శాతము పాతగా అయితే ఎంతోకొంత ఘర్షణ ఉంటుంది. రెండు కళలు తగ్గిపోవడముతో శోభ
తగ్గిపోతుంది. స్వర్గములో పూర్తి శాంతి, నరకములో ఉన్నది పూర్తి అశాంతి. మనుష్యులు
విశ్వములో శాంతిని కోరుకునే సమయము ఇదే, ఇంతకుముందు విశ్వములో శాంతి కావాలి అన్న ఈ
శబ్దము ఉండేది కాదు. ఇప్పుడు ఈ శబ్దము వెలువడుతుంది ఎందుకంటే ఇప్పుడు విశ్వములో
శాంతి ఏర్పడుతోంది. విశ్వములో శాంతి ఏర్పడాలని ఆత్మ కోరుకుంటుంది. మనుష్యులైతే
దేహాభిమానములో ఉన్న కారణముగా విశ్వములో శాంతి ఏర్పడాలి అని కేవలం అంటూ ఉంటారు. 84
జన్మలు ఇప్పుడు పూర్తయ్యాయి. ఈ విషయాలను తండ్రియే వచ్చి అర్థం చేయిస్తారు. తండ్రినే
స్మృతి చేస్తారు. వారు ఎప్పుడో అప్పుడు ఏదో ఒక రూపములో వచ్చి స్వర్గాన్ని స్థాపన
చేస్తారు. వారి పేరే హెవెన్లీ గాడ్ ఫాదర్. వారు హెవెన్ ను ఎలా రచిస్తారు అన్నది
ఎవరికీ తెలియదు. శ్రీకృష్ణుడైతే రచించలేరు, అతడిని దేవత అని అంటారు. మనుష్యులు
దేవతలకు నమస్కరిస్తారు. వారిలో దైవీ గుణాలు ఉన్నాయి, అందుకే వారిని దేవతలు అని
అంటారు. మంచి గుణాలు కలిగిన వారిని ఇతను దేవుడులా ఉన్నారు అని అంటారు కదా.
కొట్లాడటము-గొడవపడడము చేసేవారిని ఇతను ఒక అసురుడిలా ఉన్నాడు అని అంటారు. మనము
అనంతమైన తండ్రి ఎదురుగా కూర్చున్నామని పిల్లలకు తెలుసు. కావున పిల్లల నడవడిక ఎంత
బాగా ఉండాలి. అజ్ఞానకాలములో కూడా బాబా చూసారు - 6-7 కుటుంబాలు కలిసి ఉంటారు,
పూర్తిగా క్షీరఖండము వలె కలిసి-మెలిసి ఉంటారు. కొన్నిచోట్ల అయితే ఇంటిలో కేవలం
ఇద్దరే ఉంటారు, అయినా కానీ కొట్లాడుకుంటూ-గొడవపడుతూ ఉంటారు. మీరు ఈశ్వరీయ సంతానము.
మీరు చాలా-చాలా క్షీరఖండము వలె కలిసి-మెలసి ఉండాలి. సత్యయుగములో క్షీరఖండము వలె
ఉంటారు, ఇక్కడ మీరు క్షీరఖండము వలె ఉండడాన్ని నేర్చుకుంటారు. కావున చాలా ప్రేమతో
ఉండాలి. తండ్రి అంటారు, లోలోపల చెక్ చేసుకోండి -నేను ఏ వికర్మలు చేయలేదు కదా? ఎవరికీ
దుఃఖమునివ్వలేదు కదా? ఎవ్వరూ ఈ విధముగా కూర్చుని తమను తాము చెక్ చేసుకోవడం లేదు. ఇది
బాగా అర్థం చేసుకోవలసిన విషయము. పిల్లలైన మీరు విశ్వములో శాంతిని స్థాపన చేసేవారు.
ఒకవేళ ఇంటిలోనే అశాంతి కలిగించేవారిగా ఉంటే ఇక వారు శాంతిని ఎలా స్థాపించగలరు.
లౌకిక తండ్రిని తన కొడుకు విసిగిస్తూ ఉంటే - ఇతడు చనిపోతే బాగుండును అని అంటారు.
ఏదైనా అలవాటు ఏర్పడితే అది పక్కాగా అయిపోతుంది. మేమైతే అనంతమైన తండ్రికి పిల్లలము,
మేము విశ్వములో శాంతిని స్థాపన చేయాలి అన్న వివేకము ఉండదు. శివబాబాకు పిల్లలై ఉండి
ఒకవేళ అశాంతికి లోనైతే శివబాబా వద్దకు రండి. బాబా అయితే వజ్రము వంటి వారు. వారు
వెంటనే మీకు - ఈ విధముగా శాంతి కలుగుతుంది అని యుక్తిని తెలియజేస్తారు. శాంతి కోసం
ఏర్పాట్లు చెప్తారు. దైవీ వంశావళి వంటి నడవడిక లేనివారు చాలామంది ఉన్నారు. పుష్పాల
ప్రపంచములోకి వెళ్ళేందుకు మీరు ఇప్పుడు తయారవుతున్నారు. ఇది ఉన్నదే అశుద్ధమైన
ప్రపంచము, వేశ్యాలయము, దీని పట్లనైతే అయిష్టము కలుగుతుంది. విశ్వములో శాంతి అనేది
కొత్త ప్రపంచములో ఏర్పడుతుంది. సంగమయుగములో అది ఏర్పడదు. ఇక్కడ శాంతిగా అయ్యేందుకు
పురుషార్థము చేస్తారు. పూర్తి పురుషార్థము చేయకపోతే మరి శిక్షలు అనుభవించవలసి
ఉంటుంది. నాతోపాటు అయితే ధర్మరాజు ఉన్నారు కదా. లెక్కాచారాలు సమాప్తము చేసుకోవలసిన
సమయము వచ్చినప్పుడు బాగా దెబ్బలు తింటారు. కర్మభోగము తప్పకుండా ఉంటుంది. అనారోగ్యము
వస్తుంది, అది కూడా కర్మభోగమే కదా. తండ్రిపైనైతే ఏ కర్మభోగమూ లేదు. వారు అర్థం
చేయిస్తున్నారు - పిల్లలూ, పుష్పాల వలె తయారవ్వండి, అప్పుడు ఉన్నత పదవిని పొందుతారు,
లేదంటే లాభమేమీ లేదు. భగవంతుడైన తండ్రిని అర్ధకల్పము స్మృతి చేసారు, వారి నుండి
వారసత్వాన్ని తీసుకోకపోతే ఇక పిల్లలు దేనికి పనికొస్తారు. కానీ డ్రామానుసారముగా ఇది
కూడా తప్పకుండా జరిగి తీరవలసిందే. కావున అర్థం చేయించేందుకు యుక్తులు ఎన్నో ఉన్నాయి.
విశ్వములో శాంతి అయితే సత్యయుగములో ఉండేది, అక్కడ ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యము ఉండేది.
ఇక్కడ యుద్ధాలు కూడా తప్పకుండా జరుగుతాయి ఎందుకంటే ఇక్కడ అశాంతి ఉంది కదా.
శ్రీకృష్ణుడు మళ్ళీ సత్యయుగములో వస్తారు. కలియుగములో దేవతల నీడ కూడా పడదు అని అంటారు.
ఈ విషయాలను పిల్లలైన మీరే ఇప్పుడు వింటున్నారు. శివబాబా మనల్ని చదివిస్తున్నారని
మీకు తెలుసు. ధారణ చేయాలి. అందుకు మొత్తం జీవితకాలమంతా పడుతుంది. జీవితమంతా అర్థం
చేయించాము, అయినా కానీ అర్థం చేసుకోవటం లేదు అని అంటారు కదా.
అనంతమైన తండ్రి అంటున్నారు, మొట్టమొదట ఈ ముఖ్యమైన విషయాన్ని అర్థం చేయించండి -
జ్ఞానము వేరు మరియు భక్తి వేరు. అర్ధకల్పము పగలు, అర్ధకల్పము రాత్రి. శాస్త్రాలలో
కల్పము ఆయుష్షునే తప్పుగా వ్రాసేసారు కావున సగం-సగం అని చెప్పలేరు. మీలో ఎవరైనా
శాస్త్రాలు మొదలైనవి చదివి ఉండకపోతే మంచిది. చదివి ఉంటే సంశయము వస్తుంది, ప్రశ్నలు
అడుగుతూ ఉంటారు. వాస్తవానికి ఎప్పుడైతే వానప్రస్థావస్థ వస్తుందో అప్పుడు భగవంతుడిని
తలచుకుంటారు. ఎవరో ఒకరి డైరెక్షన్లు తీసుకుంటారు. గురువు ఎలా నేర్పిస్తే అలా
చేస్తారు. వారు భక్తిని కూడా నేర్పిస్తారు. భక్తిని నేర్పించనివారు ఎవరూ ఉండరు.
వారిలో భక్తి యొక్క శక్తి ఉంది, అందుకే అంతమంది శిష్యులుగా అవుతారు. శిష్యులను
భక్తులు, పూజారులు అని అంటారు. ఇక్కడ అందరూ పూజారులే. అక్కడ ఎవ్వరూ పూజారులు కారు.
భగవంతుడు ఎప్పుడూ పూజారిగా అవ్వరు. అనేక పాయింట్లు అర్థం చేయించడం జరుగుతుంది.
మెల్లమెల్లగా పిల్లలైన మీలో కూడా అర్థం చేయించేందుకు శక్తి వస్తూ ఉంటుంది.
శ్రీకృష్ణుడు వస్తున్నారని ఇప్పుడు మీరు తెలియజేస్తున్నారు. సత్యయుగములో తప్పకుండా
శ్రీకృష్ణుడు ఉంటారు. లేకపోతే ప్రపంచ చరిత్ర మరియు భౌగోళికము ఎలా రిపీట్ అవుతుంది.
కేవలం ఒక్క శ్రీకృష్ణుడు మాత్రమే ఉండరు. యథా రాజా రాణి తథా ప్రజా అందరూ ఉంటారు కదా.
ఇది కూడా అర్థం చేసుకోవలసిన విషయము. మేమైతే ఆ తండ్రికి సంతానము, తండ్రి వారసత్వాన్ని
ఇవ్వడానికి వచ్చారు అని పిల్లలైన మీరు భావిస్తారు. స్వర్గములోకి అయితే అందరూ రారు.
అలాగే త్రేతాలోకి కూడా అందరూ రాలేరు. వృక్షము మెల్లమెల్లగా వృద్ధి చెందుతూ ఉంటుంది.
ఇది మనుష్య సృష్టి రూపీ వృక్షము. అక్కడ ఆత్మల వృక్షము ఉంటుంది. ఇక్కడ బ్రహ్మా ద్వారా
స్థాపన, ఆ తరువాత శంకరుడి ద్వారా వినాశనము, ఆ తరువాత పాలన... ఈ పదాలను కూడా
నియమబద్ధముగా ఉపయోగించాలి. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది, రచన ఎలా జరుగుతుంది
అన్న నషా పిల్లల బుద్ధిలో ఉంది. ఇప్పుడు ఇది చిన్నని కొత్త రచన కదా. ఇది
పిల్లిమొగ్గల ఆట వంటిది. మొదట శూద్రులు అనేకమంది ఉంటారు, ఆ తరువాత తండ్రి వచ్చి
రచనను రచిస్తారు, బ్రహ్మా ద్వారా బ్రాహ్మణులను రచిస్తారు. బ్రాహ్మణులు పిలక వంటి
వారు. పిలక మరియు కాళ్ళు, రెండూ కలుస్తాయి. మొదట బ్రాహ్మణులు కావాలి. బ్రాహ్మణుల
యుగము చాలా చిన్నదిగా ఉంటుంది. ఆ తరువాత ఉన్నది దేవతలు. ఈ వర్ణాల చిత్రము కూడా చాలా
ఉపయోగపడుతుంది. ఈ చిత్రాన్ని అర్థం చేయించడం చాలా సహజము. వెరైటీ మనుష్యులకు వెరైటీ
రూపాలు ఉన్నాయి. దీనిని అర్థం చేయించడములో ఎంత ఆనందము కలుగుతుంది. బ్రాహ్మణులు
ఎప్పుడైతే ఉంటారో, అప్పుడు అన్ని ధర్మాలు ఉంటాయి. శూద్రుల నుండి బ్రాహ్మణుల అంటు
కట్టడం జరుగుతుంది. మనుష్యులైతే వృక్షాలకు అంట్లు కడుతూ ఉంటారు. తండ్రి కూడా
విశ్వములో శాంతి ఏర్పడేందుకు అంటు కడతారు. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. సదా స్మృతిలో ఉంచుకోవాలి - మేము ఈశ్వరీయ సంతానము, మేము క్షీరఖండము వలె ఉండాలి,
ఎవ్వరికీ దుఃఖమునివ్వకూడదు.
2. లోలోపల స్వయాన్ని చెక్ చేసుకోవాలి - నా ద్వారా ఏ వికర్మలూ జరగటం లేదు కదా,
అశాంతి చెందే అలవాటు కానీ, అశాంతిని వ్యాపింపజేసే అలవాటు కానీ లేదు కదా?
వరదానము:-
పవిత్రత యొక్క శక్తి ద్వారా సదా సుఖమయమైన ప్రపంచములో ఉండే
నిశ్చింతపురికి చక్రవర్తిగా కండి
సుఖ-శాంతులకు పునాది పవిత్రత. ఏ పిల్లలైతే
మనసా-వాచా-కర్మణా మూడు విధాలగానూ పవిత్రముగా అవుతారో, వారే ఉన్నతోన్నతులు మరియు
పవిత్రమైనవారు. ఎక్కడైతే పవిత్రతా శక్తి ఉంటుందో అక్కడ సుఖ-శాంతులు స్వతహాగా ఉంటాయి.
పవిత్రత సుఖ-శాంతులకు జనని. పవిత్ర ఆత్మలు ఎప్పుడూ కూడా ఉదాసీనులుగా అవ్వలేరు. వారు
నిశ్చింతపురికి చక్రవర్తి, వారి కిరీటము కూడా అతీతముగా ఉంటుంది మరియు సింహాసనము కూడా
అతీతముగా ఉంటుంది. ప్రకాశ కిరీటము పవిత్రతకే గుర్తు.
స్లోగన్:-
నేను
ఆత్మను, శరీరాన్ని కాను, ఈ చింతన చేయడమే స్వచింతన.
అవ్యక్త ప్రేరణలు -
ఇప్పుడు లగనము అనే అగ్నిని ప్రజ్వలితము చేసి యోగాన్ని జ్వాలా రూపముగా చేయండి
శక్తిశాలీ యోగము అనగా
లగనము యొక్క అగ్ని. జ్వాలా రూపపు స్మృతియే భ్రష్టాచారము యొక్క, అత్యాచారము యొక్క
అగ్నిని సమాప్తము చేస్తుంది మరియు సర్వ ఆత్మలకు సహయోగాన్ని ఇస్తుంది, దీని ద్వారానే
అనంతమైన వైరాగ్య వృత్తి ప్రజ్వలితమవుతుంది. స్మృతి యొక్క అగ్ని అనేది - ఒకవైపేమో
ఆ అగ్నిని సమాప్తము చేస్తుంది మరియు ఇంకొకవైపు ఆత్మలకు పరమాత్మ సందేశము యొక్క,
శీతల స్వరూపము యొక్క అనుభూతిని కలిగిస్తుంది, దీని ద్వారానే ఆత్మలు పాపాల అగ్ని
నుండి ముక్తులవ్వగలుగుతారు.
| | |