ఈ రోజు నలువైపులా ఉన్న పిల్లల్లో విశేషముగా స్నేహము నిండి
ఉంది. ఈ రోజును స్మృతి దివసము అని అంటారు. బాప్ దాదా అమృతవేళ
నుండి నలువైపులా చూసారు, దేశములో కానీ, విదేశాలలో కానీ
పిల్లలందరి హృదయాలలో తండ్రి పట్ల ఉన్న స్నేహము యొక్క చిత్రము
కనిపించింది మరియు బాబా హృదయములో కూడా ప్రతి బిడ్డ పట్ల ఉన్న
స్నేహము యొక్క చిత్రము ఇమిడి ఉంది. ఈ రోజును విశేషముగా స్నేహము
యొక్క స్మృతి దివసము అని అంటాము. బాప్ దాదా అమృతవేళ కన్నా కూడా
ముందు నుండే పిల్లల నుండి అనేకమైన స్నేహమనే ముత్యాల మాలలను
చూసారు. ప్రతి బిడ్డ యొక్క హృదయము నుండి ఆటోమేటిక్ గా ఈ పాట
మ్రోగుతుంది - ‘‘నా బాబా, బ్రహ్మాబాబా, మధురమైన బాబా’’ మరియు
బాప్ దాదా హృదయములో ఈ పాట మ్రోగుతుంది - ‘‘మధురమైన పిల్లలూ,
ప్రియమైన పిల్లలూ’’. ఈ రోజు ప్రతి ఒక్కరి లోపల ఇతర శక్తుల కన్నా
స్నేహము యొక్క శక్తి ఎక్కువగా నిండి ఉంది. ఈ పరమాత్మ స్నేహము,
ఈశ్వరీయ స్నేహము కేవలం సంగమయుగములోనే అనుభవమవుతుంది. ఈ పరమాత్మ
స్నేహము అనుభవము కలిగినవారికే తెలుసు, ఇది ప్రతి ఒక్క బిడ్డను
సహజయోగిగా చేస్తుంది. బాప్ దాదా చూసారు, పిల్లలందరిలోనూ స్నేహము
యొక్క అనుభవము చాలా-చాలా నిండి ఉంది. మీ అందరి జన్మకు ఆధారము
స్నేహము. ఇతర శక్తులు తక్కువగా ఉన్నా కానీ బాబా పట్ల స్నేహము
లేక నిమిత్తమైన విశేష ఆత్మల పట్ల స్నేహము మెజారిటీ అందరి
హృదయాలలో, ముఖాలలో కనిపిస్తుంది, ఇది లేని పిల్లలు ఎవ్వరూ
కనిపించలేదు. ఇప్పుడు మీ అందరినీ ఈ రోజు విశేషముగా ఇక్కడి వరకు
తీసుకువచ్చింది ఏమిటి? ఏ విమానములో వచ్చారు? ట్రైన్ లో వచ్చారా
లేక విమానములో వచ్చారా? అందరి ముఖాలలో స్నేహము నిండి ఉంది
కావున స్నేహమనే విమానములో చేరుకున్నారు కదా. ఏమి చెయ్యాల్సి
వచ్చినా కానీ స్నేహమనే విమానములో అందరూ చేరుకున్నారు.
ఈ రోజును స్మృతి దివసము అని అంటారు కానీ స్మృతి దివసముతో
పాటు సమర్థీ దివసము అని కూడా అంటారు, అలాగే ఈ రోజును
పట్టాభిషేకము యొక్క రోజు అని కూడా అంటారు ఎందుకంటే ఈ రోజున బాప్
దాదా, అందులోనూ విశేషముగా బ్రహ్మాబాబా, నిమిత్తమై ఉన్న మహావీర
పిల్లలకు విశ్వ సేవ అనే కిరీటాన్ని పెట్టారు. బ్రహ్మాబాబా స్వయం
అన్నోన్ (అపరిచితులు) అయ్యారు మరియు పిల్లలకు విశ్వ సేవ యొక్క
స్మృతి తిలకాన్ని దిద్దారు. పిల్లలను చేసేవారిగా తయారుచేసారు
మరియు స్వయం చేయించేవారిగా అయ్యారు. తమ సమానముగా ఫరిశ్తా
స్వరూపులుగా అవ్వండి అన్న వరదానాన్ని ఇచ్చి ప్రకాశ కిరీటాన్ని
పెట్టారు మరియు బాప్ దాదా ఏదైతే కిరీటము మరియు తిలకము యొక్క
వరదానాన్ని ఇచ్చారో, దాని అనుసారముగానే ఉన్న పిల్లల కర్తవ్యాలను
చూసి సంతోషిస్తున్నారు. పిల్లలు సేవా వరదానాన్ని కార్యములోకి
తీసుకువచ్చారు, ఇది చూసి బాప్ దాదా సంతోషిస్తున్నారు.
ఇప్పటివరకు ఏదైతే పాత్రను వహించారో మరియు ఇక మీదట కూడా ఏ
పాత్రనైతే వహించబోతున్నారో, అందుకు బ్రహ్మాబాబా పదమాల రెట్ల
అభినందనలను తెలియజేస్తున్నారు. వాహ్ పిల్లలు వాహ్! విదేశాలలో
కూడా తిరిగి వచ్చాము, అక్కడ ఏమి చూసాము? ప్రతి బిడ్డ స్నేహములో
నిమగ్నమై ఉన్నారు కావున బాబా ద్వారా సమర్థతలు లభించాయి ఎందుకంటే
ఈ రోజు విశేషముగా స్నేహముతో సమర్థతల వరదానాలను ప్రాప్తి
చేసుకునే రోజు. బాప్ దాదా చూసారు, కొంతమంది పిల్లలు చాలా బాగా
స్మృతి యొక్క తపనలో, సేవలో నిమగ్నమై ఉన్నారు. అమృతవేళ చాలా బాగా
అనుభవం చేస్తారు, అశరీరి స్థితిని కూడా అనుభవం చేస్తారు కానీ
ఎప్పుడైతే కర్మయోగిగా అవ్వాల్సిన సమయము వస్తుందో, అప్పుడు రెండు
పనులు అంటే - యోగిగా ఉండటము కూడా మరియు కర్మ చెయ్యటము కూడా,
రెండు పనులను కలిపి చేసేటప్పుడు తేడా వస్తుంది. కర్మ మరియు
యోగములో బ్యాలెన్సు ఉండాలి అని పురుషార్థము చేస్తున్నారు కానీ
ఎలా అయితే అమృతవేళ శక్తిశాలి అవస్థను అనుభవం చేస్తారో,
కర్మలలోకి వచ్చేసరికి తేడా వచ్చేస్తుంది. శ్రమించాల్సి వస్తుంది.
బాప్ దాదా పిల్లలందరికీ ముందే చెప్పారు, విశ్వము యొక్క వినాశనము
అకస్మాత్తుగా జరగనున్నది. ఒకవేళ రోజంతా అటెన్షన్ కు బదులుగా,
ఏదైనా ఒక ధారణలో లోపము ఉన్నట్లయితే, దాని కారణముగా కర్మయోగీ
స్టేజిలో తేడా వస్తుంది. విశ్వము యొక్క వినాశము డేట్ ను అయితే
బాప్ దాదా ప్రకటించరు కానీ మీ జీవిత కాలము ఎప్పుడు
సమాప్తమవుతుందో మీకు తెలుసా? నా మృత్యువు ఫలానా తారీఖున
జరగనున్నది అని ఎవరికైనా తెలుసా? తెలుసా? వారు చేతులెత్తండి.
అకస్మాత్తుగా ఏదైనా జరగవచ్చు. అందుకు ప్రకృతి కారణమైతే ఎంతమంది
మృత్యువు ఒకేసారి జరిగిపోతుంది. కావున విశ్వము యొక్క డేట్
గురించి ఆలోచిస్తూ నిర్లక్ష్యులుగా అవ్వకుండి. మీ జగదంబ యొక్క
స్లోగన్ ఉండేది కదా, అందుకే ఎప్పుడూ కూడా ‘ఎప్పుడు’ అని అనకండి,
‘ఇప్పుడే’. రేపు ఏమి జరిగినా కానీ నేను ఎవర్రెడీగా ఉండాల్సిందే.
మరి ఇంత తయారీ అందరి అటెన్షన్ లో ఉందా? మీ కర్మల లెక్కాచారాలను
సమాప్తము చేసుకున్నారా? నాలుగు సబ్జెక్టులు - జ్ఞానము, యోగము,
సేవ మరియు ధారణ, నాలుగు వైపులా, నాలుగింటిలోనూ అటువంటి తయారీ
ఉందా? పూర్తి అనంతమైన వైరాగ్యపు అనుభవాన్ని చెక్ చేసుకున్నారా?
నేను ఎవర్రెడీగా ఉన్నానా అని మీ హృదయాన్ని చెక్ చేసుకున్నారా?
నష్టోమోహా స్మృతి స్వరూపులుగా ఉండాలి ఎందుకంటే బ్రహ్మాబాబా కూడా
పురుషార్థము చేసి స్వయాన్ని అలా తయారుచేసుకున్నారు, అది అనుభవీ
పిల్లలు చూసారు, అసలు ఎటువైపు కూడా ఎటువంటి లెక్కాచారాల
వాతావరణము లేదు, అశరీరిగా అయ్యే అభ్యాసము వారిని అకస్మాత్తుగా
అశరీరిగా చేసింది, ఇక వారు ఎగిరిపోయారు. బ్రహ్మాబాబా
వెళ్ళబోతున్నారు అని ఎవరికైనా అర్థమైందా! కానీ వారు నష్టోమోహా
అయినవారు. పిల్లల చేతిలో చేయి ఉన్నప్పటికీ ఎక్కడైనా ఆకర్షణ
ఉండినదా? ఫరిశ్తా అయిపోయారు. పిల్లలకు ఫరిశ్తాలుగా అయ్యే
తిలకాన్ని దిద్ది వెళ్ళారు. దీనికి కారణము బహుకాలపు అశరీరి
అభ్యాసము. తోడుగా ఉన్న కొందరు అనుభవీ పిల్లలు అనుభవము చేసారు,
బాబా కర్మలు చేస్తూ-చేస్తూ అలా అశరీరిగా అయిపోయేవారు. పిల్లల్లో
కర్మయోగములో ఏదైతే తేడా వస్తుందో, దానికి కారణమేమిటంటే - కర్మలు
చేస్తూ కూడా, నేను ఆత్మను అన్న స్మృతి ఇమర్జ్ కాకపోవడము. నేను
ఆత్మను అని అందరికీ తెలుసు, కానీ ఎటువంటి ఆత్మను? నేను చేయించే
ఆత్మను మరియు ఈ కర్మేంద్రియాలు చేసేవి. చేసేవాడిని అన్న ఈ
స్వమానము కర్మలు చేస్తూ స్మృతి స్వరూపములో ఉండాలి,
కర్మేంద్రియాలతో కర్మలు చేయించాల్సి వచ్చినా కానీ నేను
చేయించేవాడిని, యజమానిని అని ఈ సీట్ పై ఒకవేళ సెట్ అయి ఉంటే
అప్పుడు ఏ కర్మేంద్రియమైనా ఆర్డర్ లో ఉంటుంది. సీట్ పై సెట్
అవ్వనంత వరకు ఎవ్వరూ ఎవరి మాటనూ వినరు. నేనే చేయించే ఆత్మను, ఈ
కర్మేంద్రియాలు చేసేవి, ఇవి చేయించేవి కావు.
బ్రహ్మాబాబా అనుభవాన్ని విన్నారు కదా, బ్రహ్మాబాబా ఆరంభములో
ఒక అభ్యాసము చేసారు, రోజు సమాప్తమయ్యే సమయములో ఈ కర్మేంద్రియాల
రాజ దర్బారును ఏర్పాటు చేసేవారు. పాత పిల్లలు ఆ డైరీని చూసి
ఉంటారు. రోజూ దర్బారును పెట్టి చేయించే యజమానిగా అయ్యి ప్రతి
కర్మేంద్రియము నుండి సమాచారాన్ని తీసుకునేవారు, ఇచ్చేవారు.
అంతటి అటెన్షన్ ను బ్రహ్మాబాబా కూడా ఆరంభములోనే ఉంచారు. మరి
మీరు కూడా - నేను చేయించేవాడిని, యజమానిని అని భావిస్తూ
కర్మేంద్రియాల ద్వారా కర్మలను చేయించాలి ఎందుకంటే ఆత్మ రాజు, ఈ
కర్మేంద్రియాలు దానికి తోడుగా ఉన్నాయి. కావున చెక్ చేసుకోవాలి
- ఈ రోజు విశేషముగా మనసు, బుద్ధి, సంస్కారము, స్వభావము అనండి
లేక సంస్కారము అనండి - వీటి పరిస్థితి ఎలా ఉంది? వెంటనే చెక్
చేసుకున్నట్లయితే కర్మేంద్రియాలకు అటెన్షన్ ఉంటుంది, మా రాజు
మా పరిస్థితి అడుగుతారు అని. కనుక చేయించే రాజు అయిన ఆత్మ
కర్మేంద్రియాల ద్వారా చేయించేవానిగా అయ్యి చెక్ చేసుకోండి. ఏమి
గమనించడం జరిగిందంటే, కొంతమంది పిల్లలు అంటారు, మేము
కర్మేంద్రియాలను ఆర్డర్ చేస్తున్నాము కానీ మరల అదే జరిగిపోతుంది,
పురుషార్థము చేస్తున్నాము కానీ ఏదో ఒక సంస్కారము లేక స్వభావము
ఆర్డర్ లో ఉండటము లేదు అని. దీనికి కారణమేమిటంటే, మీ స్వమానము
అనే సీట్ పై సెట్ అయి ఉండటము లేదు. సీట్ పై కూర్చోకుండా ఎన్ని
ఆర్డర్లు చేసినా కానీ అవి ఆర్డర్లను పాటించేవిగా ఉండవు. కనుక
కర్మలను చేస్తూ చేయించేవాడిని, యజమానిని అన్న సీట్ పై సెట్
అయ్యి ఉండండి. కొంతమంది పిల్లలు బాప్ దాదాతో ఈ విధముగా ఆత్మిక
సంభాషణ చేస్తుంటారు - బాబా, మీరు మమ్మల్ని సర్వశక్తివంతులుగా
తయారుచేసారు, శక్తివంతులుగా కూడా కాదు, సర్వశక్తివంతులు అన్న
వరదానాన్ని ప్రతి బిడ్డకు బ్రాహ్మణ జన్మను తీసుకోగానే ఇచ్చారు.
మీ జన్మ యొక్క అధికారము గుర్తుందా! ప్రతి బిడ్డకు బాబా మాస్టర్
సర్వశక్తివాన్ భవ అన్న వరదానాన్ని ఇచ్చారు. వరదానాన్ని ఎవరు
ఇచ్చారు? ఆల్మైటీ అథారిటీ. కానీ ఏ సమయములో ఏ శక్తి కావాలో అది
సమయానికి రావడము లేదు, ఆర్డర్ ను పాటించడము లేదు అని
కంప్లెయింట్ చేస్తారు. ఇలా ఎందుకు? ఆల్మైటీ అథారిటీ ఇచ్చిన
వరదానము ఉన్నప్పుడు అంతకు మించినది మరేదీ లేదు. వరదానము యొక్క
స్థితిలో స్థితులై ఒకవేళ ఆర్డర్ చేసినట్లయితే మీరు ఆర్డర్
చేస్తే శక్తులు మాట వినకపోవడము అన్నది జరగదు. ఒకటేమో ఆత్మ
యజమాని, రెండవది సర్వశక్తివాన్ అనే వరదానము లభించి ఉంది, ఆ
స్వరూపములో స్థితి అయ్యి యజమానిని, వరదానము ఉంది - ఈ రెండు
స్వరూపాల స్మృతిలో స్థితులై ఆర్డర్ చేయండి. అప్పుడు శక్తులు మీ
మాట వినకపోవడము అన్నది అసంభవము ఎందుకంటే వరదానము ఉంది మరియు
తండ్రి ఆస్తిపై అధికారము ఉంది. సంగమయుగములో మీ అందరికీ
సర్వశక్తివంతులు అన్న టైటిల్ లభించింది. కేవలం ఆ స్థితిలో
స్థితులై ఉండటము లేదు, సదా ఉండటము లేదు. ‘అప్పుడప్పుడు’ అన్నది
వచ్చేస్తుంది. ఈ ‘అప్పుడప్పుడు’ అన్న పదాన్ని మీ బ్రాహ్మణ
డిక్షనరీ నుండి తీసేసెయ్యండి. ఇప్పుడిప్పుడే హాజరు. మీరంటారు
కదా - బాబా, మేము మిమ్మల్ని తలచుకున్న వెంటనే మీరు హాజరైపోతారు
అని. అనుభవముందా? చేతులెత్తండి. అనుభవముందా? ఇప్పుడు చూడండి,
చేతులైతే ఎత్తుతున్నారు. బాబా హాజరైపోతారు. ఆ స్వామి
హాజరైపోతారు, మరి ఈ శక్తి ఏమిటి? ఈ శక్తులు కూడా మీకు బాబా
ద్వారా ప్రాపర్టీగా లభించినవి. కావున యజమానిగా అయ్యి ఆర్డర్
చేయండి. యజమానిగా అయి ఆర్డర్ చెయ్యకపోతే శక్తిని కోల్పోతారు కదా,
యజమానిగా లేని స్థితిలో ఉంటూ ఆర్డర్ చేస్తే, యజమానిగా లేని
కారణముగా అవి ఆర్డర్ ను ఎందుకు పాటిస్తాయి!
బాప్ దాదా ఇప్పుడు ఏమి ఆశిస్తున్నారు? తెలుసు కదా! బాబా
ఇప్పుడు కోరుకునేదేమిటంటే, నా పిల్లలు ప్రతి ఒక్కరూ కర్మలు
చేస్తూ కూడా రాజా పిల్లలుగా అయి, స్వరాజ్య అధికారిగా అయి
స్వరాజ్యమనే సీట్ ను ఎప్పుడూ వదిలిపెట్టకూడదు. రాజు అనేవారు
మొత్తము రోజంతా రాజుగానే ఉంటారు కదా! లేక ఒక్కోసారి రాజుగా
ఉండటము, మరోసారి రాజుగా ఉండకపోవటము, ఈ విధముగా అయితే ఉండదు కదా?
సింహాసనముపై కూర్చోవటము లేక కూర్చోకపోవటము అనేది వేరే విషయము,
కానీ ఇంటిలో ఉంటూ కూడా నేను రాజును అన్న విషయాన్ని మర్చిపోరు.
కావున కర్మయోగీ మరియు అమృతవేళలోని యథార్థ యోగము యొక్క శక్తిశాలి
స్థితి, వీటిలో తేడా ఉండకూడదు. రెండు పనులూ చెయ్యాలి, కానీ మీరు
ఎవరు? మీరైతే విశ్వ పరివర్తకులు, విశ్వ కళ్యాణకారులు, అందుకే
బాప్ దాదా ఇదే కోరుకుంటున్నారు - నడుస్తూ-తిరుగుతూ కూడా మీ రాజా
స్థితిని మర్చిపోకండి, సీట్ ను వదిలిపెట్టకండి. సీట్ లేకుండా
ఎవరూ మీ ఆర్డర్ ను గౌరవించరు. ఈ రోజుల్లో చూడండి, సీట్ కోసం
ఏమేమి చేస్తుంటారు? తమ హక్కును తీసుకునేందుకు ఎంతగా
ప్రయత్నిస్తుంటారు! తమ హక్కును ఎవరూ వదలాలనుకోరు. నేను ఎవరు
అన్నది మీ పరమాత్మ హక్కు! ప్రతి సమయము ఏ పని చేస్తున్నా సరే,
పని చేస్తూ కూడా మీ మనసు యొక్క టైమ్ టేబుల్ ను తయారుచేసి
పెట్టుకోండి. ఫలానా పని చేస్తూ కూడా మనసు యొక్క స్వమానము ఏది
పెట్టుకోవాలి? ఈ రోజు ఏ లక్ష్యాన్ని పెట్టుకుంటాను? ప్రతి పనికీ
సంబంధించి మీకు స్వమానాల లిస్ట్ ఉంది, రకరకాల టైమ్ టేబుల్ ను
తయారుచేసుకోండి. ఎలా అయితే స్థూల కార్యాల టైమ్ టేబుల్ ను ఫిక్స్
చేసుకుంటారో అలా మనసు యొక్క టైమ్ టేబుల్ ను ఫిక్స్ చేసుకోండి.
ఈ సమయములో ఈ పని చేయాలి అన్నదైతే మీకు తెలుసు, మరి అప్పుడు ఏ
స్వమానాన్ని పెట్టుకోవాలి? యజమానత్వపు అధికారాన్ని ఏ స్వమానము
రూపములో పెట్టుకోవాలి, మనసు యొక్క ఈ టైమ్ టేబుల్ ను
తయారుచేసుకోండి. టైమ్ టేబుల్ ను తయారుచేసుకోవటము వస్తుంది కదా!
మాతలకు వస్తుందా? మాతలు మీకు మీరే ప్రోగ్రామ్ ను తయారుచేసుకోండి.
మంచి భోజనాన్ని తయారుచేయాలి, ఆ సమయములో ఏ స్వమానాన్ని మీ
బుద్ధిలో ఇమర్జ్ చేసి ఉంచుకోవాలి. స్వమానాల మాల చాలా పెద్దది
ఉంది. ఎంత పెద్ద మాల ఉందంటే స్వమానాలను లెక్క పెట్టుకుంటూ,
లెక్క పెట్టుకుంటూ ఆ మాలలో ఇమిడిపోండి. ఇప్పుడు బహుకాలపు
అభ్యాసము కావాలి. కొంతమంది పిల్లలు ఏమంటారంటే - ఇప్పటివరకైతే
వినాశనమేమీ కనిపించటం లేదు, ఇప్పుడైతే ఇంకా తారీఖు ఫిక్స్
అవ్వలేదు కదా, చేసేస్తాములే, అయిపోతుందిలే... ఇది నిర్లక్ష్యము.
సందేశము ఇవ్వటములో కూడా మీరు విశ్వ కళ్యాణకారులు. కొంతమంది
పిల్లలు అనుకుంటున్నారు, ఇప్పుడు ఇంకా సమయము మిగిలి ఉంది,
మున్ముందు సందేశాన్ని ఇచ్చేస్తాములే అని. కానీ అలా అనుకోకూడదు.
మీరు చివరిలో సందేశము ఇస్తే వారు కూడా మీపై ఫిర్యాదు చేస్తారు,
ఏమని ఫిర్యాదు చేస్తారు? మీరు మాకు ముందే ఎందుకు చెప్పలేదు,
చెప్పి ఉంటే మేము కూడా ఏదైనా చేసేవారము కదా, ఇప్పుడు మీరు మాకు
చివరిలో చెప్పారు, కనుక మేమైతే కేవలం తెలుసుకుని అహో ప్రభూ, మీ
లీలలు అపారమైనవి అని ఈ మాత్రమే అనగలము కదా, పదవినైతే పొందలేము
కదా అని అంటారు. ఎందుకని? బహుకాలపు సహయోగము కావాలి. మీరంతా
వారసులు కూర్చుని ఉన్నారు కదా! మేము వారసులము అని ఎవరైతే
భావిస్తున్నారో వారు చేతులెత్తండి, మీరు వారసులేనా? అచ్ఛా,
వారసులైతే మరి మీరు పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలా లేక కొంచమే
తీసుకోవాలా? పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలి అనే అందరూ అంటారు.
మరి పూర్తి వారసత్వమంటే పూర్తి 21 జన్మలు, ఆది నుండి అంతిమము
వరకు, రాయల్ ప్రజలు కాదు, రాయల్ కుటుంబములోకి రావాలి, రాజ్య
కుటుంబములోకి రావాలి. సింహాసనముపైనైతే ఒక్క జంటే కూర్చుంటారు
కదా, యుగళులు కూర్చుంటారు. అక్కడ ఎప్పుడు సభను ఏర్పాటు చేసినా,
రాయల్ కుటుంబములోనివారిలో విశేషముగా నిమిత్తమైనవారు కిరీటధారులై
కూర్చుంటారు. కిరీటము లేకుండా కూర్చోరు, అంతేకాక ప్రతి
కార్యములోనూ వారు సలహాను ఇచ్చేవారిగా ఉంటారు. కేవలము రాజు
మాత్రమే రాజ్యము చేస్తారు అని కాదు, వారు సలహా తీసుకుంటూ
రాజ్యము చేస్తారు. అందుకే ఒకవేళ సంపూర్ణ వారసత్వాన్ని
తీసుకోవాలంటే మొదటి జన్మ నుండి మొదలుకుని అంతిమము వరకు పూర్తి
21 జన్మలు తీసుకోవాలి, సగము కూడా కాదు, మధ్యలోనైతే వెళ్ళకూడదు,
అకాల మృత్యువులు ఉండవు. మరి పూర్తి వారసత్వాన్ని తీసుకోవాలా
లేక కొద్దిలోనే సంతోషపడిపోవాలా? మీ మాతేశ్వరి జగదంబ సదా ఈ
లక్ష్యాన్ని పెట్టుకునేవారు - బాప్ దాదా ఏ శ్రీమతాన్ని అయితే
ఇచ్చారో, మనసా కావచ్చు, వాచా కావచ్చు, కర్మణా కావచ్చు, ఏ
శ్రీమతాన్ని అయితే ఇచ్చారో, దానిని మనము చెయ్యాల్సిందే. అలా
పూర్తి వారసత్వాన్ని తీసుకునేవారు ఈ లక్ష్యమునే బుద్ధిలో
పెట్టుకోండి - అకస్మాత్తు, ఎవర్రెడీ మరియు బహుకాలము. ఈ మూడు
పదాలను కలిపి గుర్తుపెట్టుకోండి, అందుకే బాప్ దాదాకు ఆశా
దీపాలైన పిల్లలందరి పట్ల ఇదే వరదానము ఉంది - సదా ఈ మూడు పదాలను
గుర్తు పెట్టుకుంటూ అందరూ ఆశా దీపాలుగా అయ్యే ప్రత్యక్ష
ప్రమాణాన్ని చూపించండి. అచ్ఛా!
విదేశాలవారు కూడా మనసా సేవ ద్వారా సహయోగులు కదా! వృద్ధి
అనేది అన్ని ధర్మాలలోనూ జరగటాన్ని బాప్ దాదా చూసారు. ఒక్క
ధర్మమనే కాదు, కేవలము హిందువులనే కాకుండా ముస్లింలు, బౌద్ధులు,
క్రిస్టియన్లు అన్ని ధర్మాలు మెల్లమెల్లగా ఆధ్యాత్మికతలో
అభిరుచిని కలిగి ఉంటున్నారు. మొదటిలో చూడండి, బ్రహ్మాకుమారీల
పేరు విని భయపడేవారు, ఎప్పుడూ వినాశనము, వినాశనమని అంటుంటారు
అని అనేవారు. ఇప్పుడేమంటున్నారు? ఇప్పుడేమంటున్నారంటే, వినాశనము
ఎప్పుడవుతుందో, ఎలా అవుతుందో, ఏం చెయ్యాలో చెప్పండి. అందుకే
జరిగేదేదో జరుగుతుంది, అదైతే గ్యారంటీ. మీ అందరికీ గ్యారంటీనే
కదా, విదేశాలలోనివారైనా, భారత్ లోనివారైనా, గ్యారంటీనే కదా!
పురుషార్థము తీవ్రతరము చేయండి అని బాప్ దాదా సూచనను ఇచ్చారు.
కేవలం పురుషార్థము కాదు, పురుషార్థము చేసే సమయము గడిచిపోయింది,
ఇప్పుడిది తీవ్ర పురుషార్థము చేసే సమయము. మరియు ‘అప్పుడప్పుడు’
అన్న మాటపై నిలవకండి, ఇప్పుడే. ఇప్పుడే చేయాలి, ఇప్పుడే
తయారవ్వాలి. కనుక జరిగేదే ఉంది. అచ్ఛా!
నలువైపులా ఉన్న తీవ్ర పురుషార్థులకు, సదా ఉల్లాస-ఉత్సాహాలతో
అడుగులు ముందుకు వేసే పిల్లలకు బాప్ దాదా స్మృతి దివసము
సందర్భముగా ప్రియస్మృతులను ఇస్తున్నారు. బాప్ దాదా మనసులో ప్రతి
బిడ్డ ఇమిడి ఉన్నారు మరియు ప్రతి బిడ్డ మనసులో బాబా ఇమిడి
ఉన్నారు, బాబా మనసులో పిల్లలు ఇమిడి ఉన్నారు, కనుక అభినందనలు,
అభినందనలు. అభినందనలతోపాటు నమస్తే కూడా.