03-10-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - ఇప్పుడిది ఈ పాత ప్రపంచము యొక్క అంతిమము, అందుకే సంగమయుగములో మీరు భవిష్య రాజ్యాధికారానికి యోగ్యులుగా తయారవ్వాలి’’

ప్రశ్న:-
పిల్లల్లో ఏ అభిరుచి ఉన్నట్లయితే సింహాసనాధికారులుగా అవ్వగలరు?

జవాబు:-
ఆల్రౌండ్ సేవ చేసే అభిరుచి ఉన్నట్లయితే సింహాసనాధికారులుగా అవ్వగలరు, ఎవరైతే ఆల్రౌండ్ సేవ చేసి అనేకులకు సుఖమిస్తారో, వారికి దాని ప్రతిఫలం కూడా లభిస్తుంది. పిల్లలు సదా ప్రతి సేవలోనూ హాజరై ఉండాలి. తల్లి-తండ్రులను షో చేసే విధముగా తెలివైనవారిగా అవ్వండి. మమ్మా-బాబా అని అంటున్నారంటే, వారిలా తయారై చూపించండి.

పాట:-
ఈ పాపపు ప్రపంచము నుండి...

ఓంశాంతి
పాపపు ప్రపంచము అని దేనినంటారు మరియు పుణ్య ప్రపంచము అని దేనినంటారు, పతిత ప్రపంచమని దేనినంటారు మరియు పావన ప్రపంచమని దేనినంటారు - ఇది కేవలం మధురాతి మధురమైన బ్రహ్మాకుమార-కుమారీలకు మాత్రమే తెలుసు. మనుష్యులు - పతిత ప్రపంచాన్ని పావనముగా తయారుచేసేవారా, రండి అని పిలుస్తారు కానీ వారి గురించి తెలియదు. ఓ పతిత-పావనా... అని కూడా ఆత్మయే అంటుంది. మనుష్యమాత్రులందరూ పిలుస్తూ ఉంటారు. కానీ పావన ప్రపంచమని దేనినంటారు, అది ఎప్పుడు మరియు ఎలా స్థాపనవుతుంది అనేది ఎవ్వరికీ తెలియదు. ఇప్పుడు మీరు నాలెడ్జ్ ఫుల్ తండ్రికి చెందినవారిగా అయ్యారు, అందుకే నాలెడ్జ్ ఫుల్, జ్ఞానసాగరుడైన తండ్రి గురించి కేవలం మీకు మాత్రమే తెలుసు. మిగిలినవారెవ్వరికీ - పావన ప్రపంచము మళ్ళీ పతితముగా ఎలా అవుతుంది, పతిత ప్రపంచము మళ్ళీ పావనముగా ఎలా అవుతుంది, పతిత ప్రపంచములో ఎవరుంటారు మరియు పావన ప్రపంచములో ఎవరుంటారు అనేది అసలు తెలియదు. ఈ విషయాలన్నీ ఇప్పుడు మీకు తెలుసు. పావన ప్రపంచమని సత్యయుగాన్ని అంటారు. పావన ప్రపంచమైన భారత్ లో తప్పకుండా ఒక్క ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క రాజ్యముండేది, అందుకే భారత్ అన్నింటికంటే ప్రాచీన దేశముగా పిలవబడుతుంది. మనము మళ్ళీ పావన ప్రపంచములోకి వెళ్ళేందుకు పతిత-పావనుడైన తండ్రి యుక్తులను తెలియజేస్తున్నారని ఇప్పుడు మీరు అర్థం చేసుకున్నారు. తండ్రి అంటారు - నేను ఒక్క సెకెండులో యుక్తిని తెలియజేస్తాను. తండ్రి కొత్త ప్రపంచ రాజ్య భాగ్యాన్ని ఇచ్చేందుకే వస్తారు. ఇది అనంతమైన తండ్రి నుండి లభించే అనంతమైన వారసత్వము. తండ్రియే వచ్చి రాజయోగాన్ని నేర్పిస్తారు. మనము రాజయోగము నేర్చుకుంటున్నాము. తండ్రి అంటారు - మీరే సతోప్రధానముగా ఉండేవారు, మళ్ళీ మీరే సతోప్రధానముగా తయారవ్వాలి. ఆది సనాతన దేవీ-దేవతా ధర్మముండేది, హిందు ధర్మము కాదు. భారత్ కు చెందిన దేవీ-దేవతా ధర్మమే మొట్టమొదట ఉండేది. ఆ తర్వాత తప్పకుండా పునర్జన్మలు తీసుకుంటూ వచ్చారు. క్రిస్టియన్లు కూడా పునర్జన్మలు తీసుకుంటూ వృద్ధి చెందుతారు. బౌద్ధుల ధర్మ స్థాపన చేసేవారు బుద్ధుడు, వారు ధర్మ స్థాపకుడు అయినట్లు. ఒక్క బుద్ధుడి నుండి ఎంతమంది బౌద్ధులు వెలువడ్డారు. క్రైస్టు కూడా ఒక్కరే. ఇప్పుడు ఎంతమంది క్రిస్టియన్లు ఉన్నారో చూడండి. అన్ని ధర్మాలు ఈ విధముగా నడుస్తూ వచ్చాయి. అదే విధముగా, ఆది సనాతన దేవీ-దేవతా ధర్మమున్నప్పుడు ఇవేవీ ఉండేవి కాదు. మిగిలినవారి గురించైతే మీకు తెలుసు. క్రిస్టియన్ ధర్మాన్ని క్రైస్టు, ఇస్లామ్ ధర్మాన్ని ఇబ్రహీమ్ స్థాపన చేసారు. అచ్ఛా, సత్యయుగములో ఉన్న ఆది సనాతన దేవీ-దేవతా ధర్మాన్ని ఎవరు స్థాపన చేసారు? సత్యయుగములో దేవీ-దేవతల రాజధాని ఉండేది కదా, అంటే తప్పకుండా ఎవరో ఆ రాజ్యాన్ని స్థాపన చేసి ఉంటారు. సత్యయుగములో దేవీ-దేవతా ధర్మముండేది, దానిని ఇప్పుడు తండ్రి స్థాపన చేస్తారు, అందుకే తండ్రి సంగమయుగములో తప్పకుండా రావాల్సి ఉంటుంది. ఇప్పుడు మనుష్యమాత్రులందరూ పతిత ప్రపంచములో కూర్చుని ఉన్నారు. పాత ప్రపంచములో కోట్లాదిమంది మనుష్యులున్నారు. కొత్త ప్రపంచములో ఇంతమంది మనుష్యులుండరు. అక్కడ ఒకే ధర్మముండేది. ఇస్లాములు, బౌద్ధులు, క్రిస్టియన్లు మొదలైనవారెవరూ ఉండేవారు కాదు. ఆ దేవతా ధర్మము ఇప్పుడు కనుమరుగైపోయింది. ఆ ధర్మాన్ని భగవంతుడు ఎలా స్థాపించారు అనేది ఎవ్వరికీ తెలియదు. దేవతా ధర్మము అన్న పేరునే మర్చిపోయారు, హిందు ధర్మమని అంటారు. ఇప్పుడు తండ్రి అర్థం చేయిస్తున్నారు - ఎప్పుడైతే పాత ప్రపంచము పరివర్తన అవ్వాల్సి ఉంటుందో, అప్పుడే నేను వస్తాను. ఇప్పుడిది ఈ పాత ప్రపంచము యొక్క అంతిమము. ఇది కేవలం బ్రాహ్మణులైన మీకు మాత్రమే తెలుసు. ఈ మహాభారీ యుద్ధముతోనే పాత ప్రపంచము ముగిసింది. అందరూ సమాప్తమైపోయారని, ఎవ్వరూ మిగలలేదని, పంచ పాండవులు మిగిలారని, వారు కూడా పర్వతాలపై కరిగిపోయారని గీతలో చూపిస్తారు. కానీ అలా ఏమీ జరగదు. దీనిని తండ్రి స్థాపన చేస్తారు. ప్రళయము జరగడము లేక జలమయము అవ్వడమనేది జరగదు. ఓ పతిత-పావనా రండి, మా దుఃఖాన్ని హరించి సుఖాన్ని ఇవ్వండి అని బాబాను పిలుస్తారు, ఎందుకంటే ఇప్పుడిది రావణ రాజ్యము. రామ రాజ్యాన్ని కోరుకుంటున్నారంటే, తప్పకుండా ఇది రావణ రాజ్యము అన్నట్లు కదా. తండ్రి అర్థం చేయిస్తున్నారు, ఇప్పుడు రామ రాజ్య స్థాపన, రావణ రాజ్య వినాశనము జరుగుతుంది. నేను నేర్పించే యుక్తులను ఎవరైతే నేర్చుకుంటారో, వారే వెళ్ళి కొత్త ప్రపంచములో రాజ్యము చేస్తారు. ఈ జ్ఞానము అక్కడ ఏ మాత్రము ఉండదు. ఇప్పుడు మీ బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా ఉంది. ఎవరి బుద్ధిలో జ్ఞానముంటుందో, వారు ఇతరులకు అర్థం చేయిస్తారు. నంబరువారుగా ఉంటారు కదా. సర్వీసబుల్ పిల్లల బుద్ధిలో మొత్తం జ్ఞానమంతా మెదులుతూ ఉంటుంది. తప్పకుండా సత్యయుగములో మొట్టమొదట దేవీ-దేవతా ధర్మము వారు ఉండేవారు. ఇది కూడా మీకు తెలుసు. తండ్రి ప్రజాపిత బ్రహ్మా ద్వారా మొట్టమొదటగా బ్రాహ్మణులనే రచిస్తారు. ఇది జ్ఞాన యజ్ఞము కదా, కనుక తప్పకుండా బ్రాహ్మణ సాంప్రదాయులే కావాలి. బ్రాహ్మణ సాంప్రదాయము తప్పకుండా సంగమములోనే ఉంటుంది. ఆసురీ సాంప్రదాయము కలియుగములో ఉంటుంది, దైవీ సాంప్రదాయము సత్యయుగములో ఉంటుంది. కనుక తప్పకుండా సంగమములోనే దైవీ సాంప్రదాయము స్థాపన అవుతుంది. పిల్లిమొగ్గలాట ఆడుతున్నప్పుడు పాదాలు మరియు పిలక కలుస్తాయి. మీరు బ్రాహ్మణులు అనేది మళ్ళీ గుర్తుకువస్తుంది. విరాట రూప చిత్రము కూడా అవసరము. దీని వివరణ చాలా బాగుంటుంది. బాబా, మేము మీకు 6 నెలల పిల్లలము, 4 రోజుల పిల్లలమని అంటారు కూడా. కొందరు - నేను ఒక రోజు బిడ్డను అని అంటారు అనగా ఈ రోజే బాబాకు చెందినవానిగా, ముఖవంశావళిగా అయ్యానని అంటారు. ఎవరైతే జీవిస్తూ తండ్రికి చెందినవారిగా అవుతారో వారు - బాబా, మేము మీ వారము అని అంటారు. చిన్న బాలుడు ఇలా చెప్పలేడు. ఈ జ్ఞానము పెద్దవారి కోసము. బాబా, నేను మీకు చిన్న బిడ్డను అని అంటారు. చిన్న పిల్లలకు చిత్రాలను చూపించి అర్థం చేయించడము సహజము. రోజురోజుకు వివరణ విస్తారమవుతూ ఉంటుంది. ఈ చిత్రాల యుక్తి డ్రామా ప్లాన్ అనుసారముగా 5 వేల సంవత్సరాల క్రితం వలె వెలువడింది. దీనికి సంబంధించి - ఇది ప్రారంభములో ఎందుకు వెలువడలేదు, ఇప్పుడు ఎందుకు వెలువడింది అని ఎవరూ ప్రశ్నించలేరు. డ్రామానుసారముగా ఏ యుక్తి ఎప్పుడు వెలువడేది ఉంటుందో, అప్పుడే వెలువడుతుంది. స్కూల్లో చదువుకు సంబంధించి నంబరువారుగా తరగతులుంటాయి. అంతేకానీ, మొదట్లోనే పెద్ద పరీక్ష పాస్ అయిపోతారని కాదు. ముందు కేవలం అ, ఆ లు మాత్రమే చదివించడము జరుగుతుంది కదా. బాబాకు పిల్లలుగా అయితేనే తండ్రి స్వర్గ రాజ్యాధికారాన్ని ఇస్తారు. లౌకికములో తండ్రిని తండ్రి అని అన్న తర్వాత ఇక నిశ్చయము తెగదు. కానీ ఇక్కడ బాబా-బాబా అని అన్న తర్వాత కూడా నిశ్చయము తెగిపోతుంది. వీరు అనంతమైన తండ్రి అని మీకు తెలుసు. మీరు అనంతమైన తండ్రి నుండి అనంతమైన వారసత్వాన్ని తీసుకుంటున్నారు కనుక వారి శ్రీమతముపై నడవాలి. తండ్రి అంటారు - మిగిలిన విషయాలన్నింటినీ వదిలి నన్ను స్మృతి చేయండి మరియు వారసత్వాన్ని స్మృతి చేయండి. నడుస్తూ-తిరుగుతూ ఇది గుర్తున్నట్లయితే సంతోషము కూడా ఉంటుంది. కానీ ఈ స్మృతి ఎందుకు నిలవదు. మీరైతే గ్యారంటీ ఇచ్చారు - బాబా, నేను మీ వానిగా అయితే, ఇక నాకు ఎవరి పట్ల మమకారము ఉండదు, నేను మీ మతముపైనే నడుస్తాము. తండ్రి కూడా అంటారు - శ్రీమతముపై నడవకపోతే పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. శ్రీమతముపై నడుస్తే సంతోషపు పాదరసము పైకి ఎక్కుతుంది. ఆత్మకు అతీంద్రియ సుఖము లభించినప్పుడు ఎంత సంతోషము కలుగుతుంది. పరమపిత పరమాత్మ మాకు రాజ్య భాగ్యాన్ని ఇచ్చారని, దానిని 84 జన్మలు తీసుకుంటూ-తీసుకుంటూ పొగొట్టుకున్నామని, మళ్ళీ తండ్రి ఇస్తున్నారని ఆత్మకు తెలుసు. కనుక అపారమైన సంతోషముండాలి కదా. ఆంతరిక సంతోషము కూడా కనిపిస్తుంది కదా. ఈ లక్ష్మీ-నారాయణుల ముఖము ద్వారా కనిపిస్తుంది కదా. అజ్ఞాన కాలములో కూడా కొందరు చాలా సంతోషముగా ఉంటారు, ఇతరులతో మాట్లాడటములో కూడా బాగుంటారు.

మనుష్య సృష్టిలో అందరికంటే ఉన్నతమైన పొజిషన్ ఎవరిది? వాస్తవానికి అందరికన్నా ఉన్నతమైనవారు శివ పరమాత్మ, వారినే అందరూ ‘ఫాదర్’ అంటూ పిలుస్తారు. కానీ వారి ఆక్యుపేషన్ (కర్తవ్యము) గురించి తెలియదు. తండ్రి వచ్చినప్పుడే, వారు తమ పరిచయాన్ని ఇస్తారు. మనకు బాబా నుండి వైకుంఠ రాజ్యము లభిస్తుందని ఇప్పుడు పిల్లలైన మీకు తెలుసు. మరి సంతోషముండాలి కదా. మనము నరుని నుండి నారాయణునిగా అవుతాము. కొందరు చేతులు ఎత్తుతారు కానీ ఏమీ అర్థం చేసుకోరు. ఎవరికైతే నిశ్చయముంటుందో, వారికి - ఇప్పుడు మేము 84 జన్మలు పూర్తి చేసాము, ఇప్పుడు మేము బాబా మతముపై నడుస్తూ విశ్వానికి యజమానులుగా అవుతాము అనే సంతోషముంటుంది. ఈ చదువు యొక్క నషా ఎంత ఉండాలి. ప్రెసిడెంట్, గవర్నర్ మొదలైనవారికి నషా ఉంటుంది కదా. వారిని కలవడానికి గొప్ప-గొప్ప వ్యక్తులు వస్తారు. పొజిషన్ (హోదా) ను తెలుసుకోకుండా వారు ఎప్పుడూ ఎవరినీ కలవరు. బాబా కూడా ఎప్పుడూ కలవరు. బాబా పొజిషన్ గురించి కేవలం పిల్లలైన మీకు మాత్రమే తెలుసు, అది కూడా నంబరువారు పురుషార్థమనుసారముగా తెలుసు. బ్రహ్మాకుమారులుగా పిలవబడతారు కానీ - తాము శివబాబా సంతానమని, వారి నుండి స్వర్గ వారసత్వాన్ని తీసుకుంటున్నారని బుద్ధిలో ఉండదు. తండ్రిని గాని, వారసత్వాన్ని గాని స్మృతి చేయలేరు. స్మృతి ఉంటే ఆంతరిక సంతోషము కూడా ఉండాలి కదా.

ఉదాహరణకు కన్యకు వివాహము చేయించినప్పుడు, ఆమెకు గుప్త దానాన్ని ఇస్తారు. పెట్టె నింపి తాళంచెవిని చేతికిస్తారు. తండ్రి కూడా మీకు విశ్వ రాజ్యాధికారము యొక్క తాళంచెవిని చేతికిస్తారు. మీరు కొత్త సత్యయుగ విశ్వము యొక్క ప్రారంభోత్సవాన్ని చేస్తారు. స్వర్గములోకి కూడా మీరు వెళ్తారు. బాబా మిమ్మల్ని యోగ్యులుగా తయారుచేస్తారు. బాబా జ్ఞానాన్ని ఇవ్వనంత వరకు, తాము పవిత్రముగా అవ్వనంత వరకు భక్తులు స్వర్గములోకి వెళ్ళేందుకు యోగ్యులుగా అవ్వలేరు, అందుకే నారదుని ఉదాహరణ ఉంది. మంచి-మంచి భక్తులు చాలామంది ఉన్నారు కానీ ఆత్మ అయితే పతితముగా ఉంది కదా. జన్మజన్మలుగా వారు పతితులుగా అవుతూ వచ్చారు. తండ్రి లభించనంత వరకు స్వర్గములోకి వెళ్ళలేరు. తండ్రి మిమ్మల్ని బ్రహ్మా ద్వారా దత్తత తీసుకున్నారు, మీరు వెళ్ళి కొత్త ప్రపంచములో రాజ్యము చేస్తారు. ఇంకెవ్వరూ రాజ్యాన్ని స్థాపన చేయరు, దీని గురించి ఎవరికీ తెలియదు. తండ్రియే సంగమయుగములో వచ్చి భవిష్య 21 జన్మల రాజ్యాన్ని స్థాపన చేస్తున్నారు. ఈ తండ్రి గురించి ఎవ్వరికీ తెలియదు.

తప్పకుండా 5 వేల సంవత్సరాల క్రితం భగవంతుడు వచ్చారని, గీతా జ్ఞానాన్ని వినిపించారని, దాని ద్వారా మనుష్యుల నుండి దేవతలుగా అయ్యారని ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం చేసుకుంటారు. గీత అనేది ఆది సనాతన దేవీ-దేవతా ధర్మము యొక్క శాస్త్రము. సత్యయుగములో శాస్త్రాలు మొదలైనవేవీ ఉండవు. తండ్రి అంటారు, నేను సంగమయుగములోనే వస్తాను, వచ్చి మళ్ళీ సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తాను, వారే దేవీ-దేవతలుగా అవుతారు, మళ్ళీ 84 జన్మల చక్రములో తిరిగి అంతిమానికి చేరుకున్నప్పుడు, మళ్ళీ వచ్చి వారికే అర్థం చేయిస్తాను. నేను మధ్యలో ఎప్పుడూ రాను. క్రైస్టు కూడా మధ్యలో వస్తారని కాదు. మిగిలిన ధర్మాలు ఏవైతే స్థాపన చేస్తారో, అవి ఈ ప్రపంచము కోసమే. నేను కొత్త ప్రపంచాన్ని స్థాపన చేసేందుకు సంగమములోనే వస్తాను. క్రైస్టు ఆత్మ వచ్చి ప్రవేశించి తమ ధర్మాన్ని స్థాపన చేస్తారు. ఈ తండ్రి అయితే రాజ్యాన్ని స్థాపన చేస్తారు. ఈ లక్ష్మీ-నారాయణుల రాజ్యాన్ని ఎప్పుడు, ఎవరు స్థాపించారు అనేది ఎవ్వరికీ తెలియదు. ఈ లక్ష్మీ-నారాయణుల మందిరాలు మొదలైనవాటిని ఎవరైతే నిర్మిస్తారో, వారిని అడగాలి. మీరు సభలో కూడా అడగవచ్చు. ఈ రహస్యము మీ బుద్ధిలో ఉంది. బాబా కల్ప-కల్పము బ్రహ్మా ద్వారా స్థాపన చేస్తారు, ఇది ఇంకెవ్వరికీ తెలియదు. పదాలు కూడా ఉన్నాయి కానీ యథార్థ రీతిలో ఎవరి బుద్ధిలోనూ కూర్చోదు. కొంతమంది పిల్లలపై గ్రహచారము కూడా కూర్చుంటుంది. దేహాభిమానము మొదటి నంబరు గ్రహచారము. తండ్రి అంటారు - పిల్లలూ, దేహీ-అభిమాని భవ. ఈ లక్ష్మీ-నారాయణుల చిత్రము మరియు మెట్ల వరుస చిత్రము ఇతరులకు అర్థం చేయించేందుకు చాలా బాగుంటాయి. వీటి ద్వారా అనేకుల కళ్యాణము జరుగుతుంది. కానీ డ్రామాలో ఇంకా సమయము ఉన్నట్లు ఉంది, కావుననే రాజధాని స్థాపనవ్వడములో విఘ్నాలు కలుగుతుంటాయి. తండ్రి స్వయంగా అంటారు - చాలా విఘ్నాలు కలుగుతాయి, మాయ చాలా సమర్థవంతమైనది, నా పిల్లల ముక్కు, చెవిని పట్టుకుంటుంది. దీనిని రాహువు గ్రహచారమని అంటారు. భారత్ లో ముఖ్యముగా ఈ సమయములో వికారాల రూపీ రాహువు గ్రహచారము పూర్తిగా కూర్చుని ఉంది. ఇదే భారత్ పావనముగా, వజ్ర సమానముగా ఉండేదని, ఇప్పుడు వికారీగా, గవ్వ సమానముగా తయారైందని, మళ్ళీ వజ్ర సమానముగా తయారవ్వనున్నదని మీరు సెకెండులో ఋజువు చేయగలరు. ఈ కథ అంతా భారత్ కు సంబంధించిందే. తండ్రి వచ్చి వజ్ర సమానముగా తయారుచేస్తారు. అయినా, ఎన్నో రకాల విఘ్నాలు కలుగుతుంటాయి. దేహాభిమానమనే చాలా పెద్ద విఘ్నము కలుగుతుంది. లక్ష్మీ-నారాయణుల చిత్రముపై కూడా ఎవరికైనా అర్థం చేయించడము చాలా సహజము. పిల్లలకు సేవ పట్ల చాలా అభిరుచి ఉండాలి. సేవలు కూడా చాలా రకాలుగా ఉంటాయి కదా. అనేకమందికి సుఖమిస్తే, దానికి ప్రతిఫలం కూడా ఎంతగానో లభిస్తుంది. కొందరు ఆల్రౌండ్ సేవలను, తమ ఎముకలను సైతం అర్పిస్తూ చేస్తారు. నేను ఆల్రౌండర్ గా అవ్వాలి అన్న సంతోషముండాలి. బాబా, మేము సేవలో హాజరై ఉన్నాము. ఆత్మిక సేవ చేసే మంచి-మంచి పిల్లలు, భోజనాన్ని తమ చేతులతో తయారుచేసుకుంటారు. పిల్లలు కూడా ఎంత తెలివైనవారిగా అవుతారంటే, వారు సింహాసనాన్ని తీసుకునేవారిగా అవుతారని మీకు తెలుసు. ఇక్కడ ఇంటిని సంభాళించేవారు మాతలు. ఇప్పుడు మాతలు, కుమారీలు ఈ సేవలో నిలబడాలి. మమ్మా వలె సేవ చేసి చూపించాలి. షో చేయాలి. అంతేకానీ, కేవలం మమ్మా-మమ్మా అని అనడము వలన ఏం లాభముంది! వారి వలె తయారవ్వాలి. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. దేహాభిమానమనే గ్రహచారమే యజ్ఞములో విఘ్న రూపముగా అవుతుంది, అందుకే ఎంత వీలైతే అంత దేహీ-అభిమానులుగా అయ్యేందుకు పురుషార్థము చేయాలి.

2. మీ చదువు మరియు సత్యయుగ పదవికి సంబంధించిన పొజిషన్ యొక్క సంతోషము మరియు నషాలో ఉండాలి, శ్రీమతముపై నడవాలి. ఎలాంటి పొరపాట్లు చేయకూడదు.

వరదానము:-
ఆత్మిక ఎక్సర్ సైజ్ మరియు సెల్ఫ్ కంట్రోల్ ద్వారా సూక్ష్మతను అనుభవం చేసే ఫరిశ్తా భవ

బుద్ధి యొక్క సూక్ష్మత మరియు తేలికదనము బ్రాహ్మణ జీవితము యొక్క పర్సనాలిటీ. సూక్ష్మతయే మహానత. కానీ దాని కోసం ప్రతిరోజూ అమృతవేళ అశరీరితనము యొక్క ఆత్మిక ఎక్సర్ సైజ్ ను చేయండి మరియు వ్యర్థ సంకల్పాలనే భోజనము యొక్క పథ్యము పాటించండి. పథ్యము కోసం సెల్ఫ్ కంట్రోల్ ఉండాలి. ఏ సమయములో ఏ సంకల్పము రూపీ భోజనాన్ని స్వీకరించాలో, ఆ సమయములో అదే స్వీకరించండి. వ్యర్థ సంకల్పాలనే ఎక్స్ ట్రా భోజనము చేయకండి, అప్పుడు సూక్ష్మ బుద్ధి కలవారిగా అయి ఫరిశ్తా స్వరూపమనే లక్ష్యాన్ని ప్రాప్తి చేసుకోగలరు.

స్లోగన్:-
ఎవరైతే ప్రతి సెకండు, ప్రతి అడుగు శ్రీమతముపై ఏక్యురేట్ గా నడుస్తారో, వారే మహానాత్మలు.

అవ్యక్త ప్రేరణలు - పరోపకార భావనతో సంపన్నులుగా అయి అపకారికి కూడా ఉపకారము చేయండి

విశేషముగా మీ మనసా ద్వారా అనగా సంకల్ప శక్తి ద్వారా, వాణి శక్తి ద్వారా, మీ సాంగత్యపు రంగు ద్వారా, సంబంధాల స్నేహము ద్వారా, సంతోషమనే తరగని ఖజానా ద్వారా అఖండ దానాన్ని చేస్తూ ఉండటము - ఇదే పరోపకారము చెయ్యటము. ఏ ఆత్మ మీ సంపర్కములోకి వచ్చినా సరే, వారు సంతోషపు ఖజానాతో సంపన్నులుగా అయ్యి వెళ్ళాలి, అటువంటి అఖండ దానులుగా అవ్వండి.