03-11-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - తండ్రి ద్వారా ఏ జ్ఞానమైతే లభించిందో,
దానిని బుద్ధిలో నిలిపి ఉంచుకోవాలి, ఉదయాన్నే లేచి స్వదర్శన చక్రధారులుగా అయి విచార
సాగర మంథనము చేయాలి’’
ప్రశ్న:-
ఈ ఈశ్వరీయ
చదువు యొక్క లా (నియమము) ఏమిటి? దాని కోసం ఏ డైరెక్షన్ లభించి ఉంది?
జవాబు:-
ఈ ఈశ్వరీయ
చదువు యొక్క లా ఏమిటంటే - నియమిత రూపములో (రెగ్యులర్ గా) చదువుకోవడము. అప్పుడప్పుడు
చదువుకోవడము, అప్పుడప్పుడు చదువుకోకపోవడము - ఇది లా కాదు. బాబా చదువు కోసం చాలా
ఏర్పాట్లు చేసారు. చదువు (మురళీ) ఇక్కడి నుండి పోస్ట్ లో వెళ్తుంది. 7 రోజుల కోర్సు
తీసుకుని ఎక్కడైనా చదువుకోవచ్చు. చదువును ఎప్పుడూ మిస్ చేయకూడదు.
పాట:-
ఓం నమః శివాయ...
ఓంశాంతి
ఏ పిల్లలైతే ఇక్కడ కూర్చున్నారో, వారు రచయిత మరియు రచనల ఆదిమధ్యాంతాలను మరియు
స్వదర్శన చక్రాన్ని గుర్తు చేస్తారు. స్వదర్శన చక్రధారులుగా అవ్వండి అని తండ్రి
పిల్లలకు జ్ఞానాన్ని ఇచ్చారు. బ్రాహ్మణ పిల్లలైన మీ ఉద్దేశ్యము - స్వదర్శన
చక్రధారులుగా అవ్వడము. మూలవతనము, సూక్ష్మవతనము, స్థూలవతనము మరియు ఈ 84 జన్మల
చక్రాన్ని బుద్ధిలో ఉంచుకోవాలి. మిగిలినదంతా బుద్ధి నుండి తొలగించి వేయాలి.
తప్పకుండా బాబా మనల్ని సూర్యవంశీయులుగా, చంద్రవంశీయులుగా తయారుచేసారని, మళ్ళీ 84
జన్మలు తీసుకున్నామని ఇప్పుడు పిల్లలైన మీ బుద్ధిలో ఉంది. నడుస్తూ-తిరుగుతూ,
లేస్తూ-కూర్చుంటూ స్వయానికి అనగా ఆత్మకు తండ్రి మరియు రచన యొక్క ఆదిమధ్యాంతాల
జ్ఞానముంది. ఇప్పుడు మిమ్మల్ని శివబాబా శూద్రుల నుండి బ్రాహ్మణులుగా తయారుచేసారు.
మీరు 84 జన్మల చక్రము యొక్క పిల్లిమొగ్గల ఆటను ఎలా ఆడుతారు అనేది బాబా అర్థం
చేయించారు. మొట్టమొదట మనము బ్రాహ్మణులము, బ్రాహ్మణులైన మనల్ని రచించేవారు శివబాబా,
వారు బ్రహ్మా ద్వారా రచిస్తారు. రచయిత మరియు రచనల జ్ఞానముతోనే మీరు స్వదర్శన
చక్రధారులుగా అవుతారు. ఈ జ్ఞానాన్ని బుద్ధిలో నిలిపి ఉంచుకోవాలి. ఉదయాన్నే లేచి
స్వదర్శన చక్రధారులుగా అయి కూర్చుండిపోవాలి. మనము మన 84 జన్మల చక్రాన్ని
తెలుసుకున్నాము. ఆత్మలైన మనందరి రచయిత తండ్రి ఒక్కరే. మనమంతా పరస్పరము సోదరులమని
అంటారు కూడా. మన తండ్రి ఆ నిరాకార పరమపిత పరమాత్మ, పరంధామములో నివసించేవారు. మనము
కూడా అక్కడ ఉండేవారము, వారు మన బాబా. ‘బాబా’ అనే పదము చాలా ప్రియమైనది. శివబాబా
మందిరాలకు వెళ్ళి ఎన్ని పూజలు చేస్తారు, చాలా స్మృతి చేస్తారు. తండ్రి అంటారు - నేను
మిమ్మల్ని మనుష్యుల నుండి దేవతలుగా, తుచ్ఛ బుద్ధి కలవారి నుండి స్వచ్ఛ బుద్ధి
కలవారిగా తయారుచేస్తాను. తుచ్ఛ బుద్ధి అనగా శూద్ర బుద్ధి నుండి స్వచ్ఛ బుద్ధి
కలవారిగా చేసాను అనగా ఉన్నతమైన బుద్ధి, పురుషోత్తమ బుద్ధి కలవారిగా చేసాను.
స్త్రీ-పురుషులందరూ ఈ లక్ష్మీ-నారాయణులకు నమస్కరిస్తారు. కానీ వారెవరు, ఎప్పుడు
వచ్చారు, ఏం చేసారు అనేది తెలియదు. తండ్రి అర్థం చేయించారు, ఈ భారత్ అవినాశీ ఖండము
ఎందుకంటే అవినాశీ తండ్రి అయిన పరమపిత పరమాత్మకు కూడా అది జన్మభూమి. పతిత-పావనుడికి,
సర్వుల సద్గతిదాతకు ఇది జన్మ స్థానము కనుక ఇది అత్యంత గొప్ప తీర్థ స్థానము అయినట్లు.
ఇది పరమపిత పరమాత్మ, సర్వుల సద్గతిదాత అయిన తండ్రి యొక్క జన్మభూమి అని అంతటి నషా
ఎవ్వరికీ లేదు. పతిత-పావనుడి జయంతి భారత్ లోనే జరిగింది. శివ జయంతిని జరుపుకుంటారు
అంటే తప్పకుండా శివుని జన్మ ఇక్కడే జరుగుతుంది. ఈ భారత్ గొప్ప తీర్థ స్థానము. కానీ
ఇది మన గాడ్ ఫాదర్ మరియు మాత-పిత, పతిత-పావనుడు, సర్వుల సద్గతిదాత యొక్క జన్మ
స్థానమని డ్రామానుసారముగా ఎవ్వరికీ తెలియదు. అందుకే భారత భూమికి వందే మాతరం అని
అంటారు. ఈ భూమిపై ఈ కుమార్తెలెవరైతే శ్రీమతమనుసారముగా భారత్ ను స్వర్గముగా
తయారుచేస్తారో, వారికి ఈ నషా ఉండాలి - మేము శ్రీమతమనుసారముగా కల్ప-కల్పము భారత్ ను
స్వర్గముగా తయారుచేస్తాము. ఎవరు ఎంతగా శ్రీమతముపై నడుస్తారో, అంత ఉన్నత పదవిని
పొందుతారు. భారతవాసులు కల్పము ఆయుష్షును లక్షల సంవత్సరాలని వ్రాసేసారు. మీకు తెలుసు
- ఈ భారత్ బాబా జన్మ స్థలము, వారు ఏ ధర్మాన్ని అయితే స్థాపన చేశారో, ఆ ధర్మానికి
సంబంధించినదే గీత. గీతను ఎవరు వినిపించారు అనేది భారతవాసులు మర్చిపోయారు. ఎంత తేడా
వచ్చేసింది! నిరాకార శివుడెక్కడ, శ్రీకృష్ణుడెక్కడ. సుందరముగా ఉండే శ్రీకృష్ణుని
ఆత్మ ఇప్పుడు అనేక జన్మల అంతిమ జన్మలో తమోప్రధానముగా అయిపోయిందని మీకు తెలుసు. మళ్ళీ
వీరిలో ప్రవేశించి వీరిని మళ్ళీ తెల్లని శ్రీకృష్ణునిగా తయారుచేస్తున్నాను, అందుకే
శ్రీకృష్ణుడిని నల్లనివారు మరియు తెల్లనివారని, శ్యామము మరియు సుందరమైనవారని అంటారు.
వారు సత్యయుగము యొక్క మొదటి నంబరు సుందరమైన రాకుమారునిగా ఉండేవారు. వారి మహిమ
ఏమిటంటే - మర్యాదా పురుషోత్తముడు, అహింస పరమధర్మముగా ఉన్నవారు. రాధా-కృష్ణులకు మరియు
లక్ష్మీ-నారాయణులకు పరస్పరము ఉన్న సంబంధమేమిటో భారతవాసులకు తెలియదు! తండ్రి అంటారు
- ఇప్పటివరకు మీరు ఏదైతే చదువుతూ వచ్చారో, అందులో సారమేమీ లేదు. ఇప్పుడు మీరు
సమ్ముఖముగా కూర్చున్నారు. మీకు తెలుసు, బాబా 5 వేల సంవత్సరాల తర్వాత మనకు మళ్ళీ
రాజయోగ శిక్షణను ఇస్తున్నారు. మీకు తెలుసు, శ్రీకృష్ణుని ఆత్మ కూడా ముందు జన్మలో ఈ
జ్ఞానాన్ని పొందారు, ఇప్పుడు మళ్ళీ పొందుతున్నారు, వారికి నేను ‘బ్రహ్మా’ అని పేరు
పెట్టాను. శ్రీకృష్ణుని అనేక జన్మల అంతిమ జన్మలో నేను ప్రవేశిస్తాను. మీరు
మరజీవులుగా అయ్యారు కదా. మీకు అవ్యక్త పేర్లు కూడా పెట్టాను. ఇప్పుడు పేర్లు
పెట్టడము లేదు ఎందుకంటే చాలామంది వదిలి వెళ్ళిపోయారు. తండ్రికి చెందినవారిగా అయ్యి,
పేరు పెట్టించుకుని పారిపోవడమనేది శోభించదు, అందుకే పేర్లు పెట్టడము ఆపేసారు.
ఇప్పుడు మీరు బ్రాహ్మణులుగా అయ్యారు. మీరు ప్రజాపిత బ్రహ్మాకు పిల్లలు, శివబాబాకు
మనవళ్ళు. తండ్రి అంటారు - వారసత్వాన్ని మీరు నా నుండి తీసుకోవాలి కనుక నన్ను స్మృతి
చేయండి. ఇది వీరి అనేక జన్మల అంతిమ జన్మ. సూక్ష్మవతనములో ఏ బ్రహ్మానైతే చూపిస్తారో,
వారు పావనమైనవారు. సూక్ష్మవతనములో ప్రజాపిత అయితే ఉండలేరు. తండ్రి అర్థం
చేయిస్తున్నారు, వీరు వ్యక్తములో ఉన్నారు, వృక్షము చివరిలో నిలబడి ఉన్నారు. వీరు
పవిత్ర ఫరిశ్తాగా అయ్యేందుకు ఇక్కడ పిల్లలతోపాటు యోగములో కూర్చుని ఉన్నారు. కనుక
వీరిని సూక్ష్మవతనములో చూపించవలసి ఉంటుంది. ఇక్కడ కూడా ప్రజాపిత తప్పకుండా కావాలి.
వారు అవ్యక్తమైనవారు, వీరు వ్యక్తములో ఉన్నవారు. మీరు కూడా ఫరిశ్తాలుగా అవ్వడానికి
వచ్చారు. ఇందులోనే మనుష్యులు తికమకపడతారు ఎందుకంటే ఇది పూర్తిగా కొత్త జ్ఞానము. ఏ
శాస్త్రాలు మొదలైనవాటిలో ఈ జ్ఞానము లేదు. భగవంతుడు ఒక్కరే, వారు ఉన్నతోన్నతమైనవారు,
నిరాకార పరమపిత పరమాత్మ, వారు ఆత్మలందరికీ తండ్రి. వారి నివాస స్థానము పరంధామము.
వారిని అందరూ ఈ విధముగా స్మృతి చేస్తారు - రండి, మా పై మాయ నీడ పడింది, మేము
పతితముగా అయిపోయాము. ఈ విషయాలు కొత్తవారి బుద్ధిలో కూర్చోవు. ఇప్పుడు మీకు రచన
యొక్క ఆదిమధ్యాంతాల గురించి తెలుసు. సత్యయుగములో మనము చాలా కొద్దిమంది మాత్రమే
రాజ్యము చేసేవారము. అక్కడ అధర్మమనే విషయమే ఉండదు. శాస్త్రాలలో ఎన్ని విషయాలను
వ్రాసేసారు, కానీ వాటిలో సారమేమీ లేదు. మెట్లు దిగుతూ-దిగుతూ ఇప్పుడు చివరిలోకి
వచ్చి పతితముగా అయ్యారు. ఇప్పుడు మీరు జంప్ చేస్తారు, దిగడానికి 84 జన్మలు పట్టింది,
సెకండులో జంప్ చేస్తారు.
పిల్లలైన మీరు ఇప్పుడు రాజయోగము నేర్చుకుంటున్నారు, తర్వాత శాంతిధామములోకి వెళ్ళి
సుఖధామములోకి వస్తారు. ఇది దుఃఖధామము. ముందు మీరు వచ్చారు కనుక తండ్రి కూడా
మొట్టమొదట మిమ్మల్నే కలుస్తారు. ఇక్కడ తండ్రి మరియు పిల్లలు, ఆత్మ మరియు పరమాత్మ
యొక్క మేళా జరుగుతుంది. లెక్క ఉంది కదా - మనము తండ్రి నుండి వీడ్కోలు తీసుకుని 5
వేల సంవత్సరాలయ్యింది. మొట్టమొదట స్వర్గములో పాత్రను అభినయించారు, అక్కడి నుండి
పాత్రను అభినయిస్తూ-అభినయిస్తూ మీరు కిందకు దిగుతూ వచ్చారు. ఇప్పుడు మీరు తండ్రి
వద్దకు వచ్చేశారు, ఇకపోతే, మిగిలిన కొద్దిమంది ఎవరైతే ఉంటారో, వారు కూడా వచ్చేస్తారు.
తర్వాత మీ చదువు సమాప్తమైపోతుంది. అందరూ ఇక్కడికి రావాల్సిందే. అక్కడ ఖాళీ
అయినప్పుడు, బాబా అందరినీ తీసుకువెళ్తారు. ఇవి అర్థం చేసుకోవాల్సిన విషయాలు. మీరు
చదువుకోవాలి. స్కూలుకు అప్పుడప్పుడు వెళ్ళడము, అప్పుడప్పుడు వెళ్ళకపోవడము - ఇది లా
(నియమము) కాదు. బాబా చదువు కోసం చాలా ఏర్పాట్లు కూడా చేసారు. లేదంటే, చదువు అనేది
ఎప్పుడూ ఎవరి వద్దకు పోస్ట్ లో వెళ్ళదు. ఈ అనంతమైన తండ్రి యొక్క చదువు పోస్ట్ లో
వెళ్తుంది. ఎన్ని కాగితాలు ముద్రించబడతాయి. ఎక్కడెక్కడికో వెళ్తాయి. 7 రోజుల కోర్సు
తీసుకుని, తర్వాత ఎక్కడైనా చదువుకుంటూ ఉండండి. ఈ సమయములో అందరూ అర్ధకల్పము యొక్క
రోగులు, అందుకే 7 రోజులు భట్టీలో ఉంచవలసి ఉంటుంది. ఈ 5 వికారాల రోగము మొత్తం
ప్రపంచమంతటా వ్యాపించి ఉంది. సత్యయుగములో మీ శరీరము నిరోగిగా ఉండేది, సదా
ఆరోగ్యవంతులుగా, సదా ఐశ్వర్యవంతులుగా ఉండేవారు. ఇప్పుడు మీ పరిస్థితి ఎలా అయిపోయింది.
ఈ ఆటంతా భారత్ కు సంబంధించినదే. ఇప్పుడు మీకు 84 జన్మల స్మృతి కలిగింది. కల్ప-కల్పము
మీరే స్వదర్శన చక్రధారులుగా అవుతారు మరియు చక్రవర్తి రాజులుగా కూడా అవుతారు. ఇక్కడ
రాజ్య స్థాపన జరుగుతూ ఉంది, ఇందులో పదవులు నంబరువారుగా ఉంటాయి. ప్రజలు కూడా అనేక
రకాల వారు కావాలి. నేను ఎంతమందిని నా సమానముగా స్వదర్శన చక్రధారులుగా తయారుచేసాను
అని హృదయాన్ని ప్రశ్నించుకోవాలి. ఎవరు ఎంతమందిని తయారుచేస్తే, అంత ఉన్నత పదవిని
పొందుతారు. మీకు తండ్రి మాయతో యుద్ధము చేయడము నేర్పిస్తారు, అందుకే వీరికి (బ్రహ్మాకు)
యుధిష్టరుడు అని పేరు పెట్టారు. మాయపై విజయము పొందే యుద్ధాన్ని నేర్పిస్తారు.
యుధిష్టరుడుని మరియు ధృతరాష్ట్రుడిని కూడా చూపిస్తారు. మాయను జయిస్తే జగత్తును
జయిస్తారని అంటూ ఉంటారు కూడా. ఎంత సమయము మీ విజయము నిలిచి ఉంది, తర్వాత ఎంత సమయము
ఓటమిని చూసారు, ఇది కూడా మీకు తెలుసు. ఇది భౌతిక యుద్ధము కాదు, అలాగే ఇది దేవతలు
మరియు అసురుల యుద్ధము కూడా కాదు, అలాగే కౌరవులు మరియు పాండవుల యుద్ధము కూడా కాదు.
అసత్యపు శరీరము, అసత్యపు మాయ... ఈ భారత్ అసత్య ఖండముగా ఉంది. ఒకప్పుడు సత్య ఖండముగా
ఉండేది, రావణ రాజ్యము మొదలైనప్పటి నుండి అసత్య ఖండముగా అయిపోయింది. ఈశ్వరుని గురించి
ఎన్ని అసత్యాలు చెప్తారు, ఎన్ని కళంకాలను మోపుతారు. కళంగీ అవతారము అని కూడా అంటూ
ఉంటారు. అందరికన్నా ఎక్కువ కళంకాలను తండ్రిపై మోపారు. వారి గురించి, ఈశ్వరుడు కూర్మ,
మత్స్య అవతారాలు తీసుకుంటారని, రాయి-రప్పలలో ఉంటారని అంటారు. ఎంతగా నిందిస్తారు. ఇది
సభ్యతేనా? ఇప్పుడు మీకు ప్రకాశము లభించింది. తండ్రి మనకు రచయిత మరియు రచనల
ఆదిమధ్యాంతాల రహస్యాన్ని అర్థం చేయిస్తున్నారని, ఈ విషయాలు వేరెవ్వరికీ తెలియదని
మీకు తెలుసు. తండ్రియే సద్గతిదాత. బాబా జ్ఞానముతో అందరికీ సద్గతి కలుగుతుంది. ఇకపోతే,
ఎవరైతే స్వయమే దుర్గతిలో ఉన్నారో, వారు ఇతరులకు సద్గతిని ఎలా కలిగిస్తారు. నేను
వచ్చి మిమ్మల్ని రాజులకే రాజులుగా తయారుచేస్తాను. మీరే పవిత్రముగా, పూజ్యులుగా
ఉండేవారు, ఇప్పుడు పూజారులుగా అయ్యారు. పవిత్ర రాజులను అపవిత్ర రాజులు పూజిస్తారు.
సత్యయుగములో డబల్ కిరీటధారులుగా ఉండేవారు. వికారీ రాజులున్నప్పుడు సింగిల్ కిరీటము
ఉంటుంది. వారు కూడా మహారాజు-మహారాణులే కానీ పవిత్రమైనవారికి అపవిత్రమైనవారు వెళ్ళి
తల వంచి నమస్కరిస్తారు. ఆ భారతవాసులు పవిత్ర ప్రవృత్తి మార్గము వారిగా ఉండేవారు, ఆ
భారతవాసులే పతిత ప్రవృత్తి మార్గము వారిగా అవుతారు. ఇప్పుడు తండ్రి అంటారు - ఈ
మృత్యులోకములో ఇది మీ అంతిమ జన్మ. ఇప్పుడు నేను మిమ్మల్ని మళ్ళీ సత్యయుగములోకి
తీసుకువెళ్ళేందుకు వచ్చాను. ఈ మిసైల్స్ యుద్ధము 5 వేల సంవత్సరాల క్రితం కూడా
జరిగింది. ఈ పాత ప్రపంచము సమాప్తమవ్వనున్నది. తండ్రి అర్థం చేయిస్తున్నారు, గృహస్థ
వ్యవహారములో ఉంటూ కమల పుష్ప సమానముగా అవ్వాలి. కమల పుష్ప సమానముగా బ్రాహ్మణులైన మీరు
అయ్యారు కానీ ఈ గుర్తును విష్ణువుకు చూపించారు ఎందుకంటే మీరు సదా ఏకరసముగా ఉండరు.
నేడు కమల పుష్ప సమానముగా అవుతారు, రెండు సంవత్సరాల తర్వాత పతితులుగా అయిపోతారు.
ఇది మీ సర్వోత్తమ కులము. బ్రాహ్మణులైన మీరు పిలక వంటివారు. తర్వాత పునర్జన్మలు
తీసుకుంటూ-తీసుకుంటూ దేవతలుగా, క్షత్రియులుగా, వైశ్యులుగా, శూద్రులుగా అవుతారు.
శూద్రుల నుండి వెంటనే దేవతలుగా అవ్వరు. పిలక సమానమైన బ్రాహ్మణులు కావాలి. ఇప్పుడు
బ్రాహ్మణులను బాబా చదివిస్తున్నారు. కనుక ఇటువంటి బాబాను వదిలి వెళ్ళకూడదు. బాబా
అంటారు - ఆశ్చర్యము కలిగేలా నా వారిగా అవుతారు, వింటారు, అయినా పారిపోయి మాయకు
చెందినవారిగా అవుతారు. ద్రోహులుగా అవుతారు, నన్ను నిందింపజేస్తారు... ఇటువంటివారిని,
సద్గురువుకు నింద తీసుకువచ్చేవారిని స్వర్గములో ఉన్నత స్థానాన్ని పొందలేరని అంటారు.
ఇకపోతే, వారు భక్తి మార్గపు గురువులు, వారేమీ సద్గతిదాతలు కాదు. ఆత్మలందరికీ తండ్రి,
టీచరు, గురువు ఒక్క నిరాకార తండ్రి మాత్రమే. వారే అందరినీ ఉద్ధరించడానికి వచ్చారు.
మున్ముందు అర్థం చేసుకుంటారు, అప్పుడిక ‘టూ లేట్’ అయిపోతుంది. వారు మళ్ళీ తమ
ధర్మములోకే వెళ్ళిపోతారు. శ్రేష్ఠాతి శ్రేష్ఠమైనది దేవతా ధర్మము. దేవతలకంటే
ఉన్నతమైనవారు బ్రాహ్మణులైన మీరు. మీరు తండ్రితో పాటు కూర్చున్నారు. మిమ్మల్ని
చదివించేవారు విచిత్రుడు మరియు విదేహీ. తండ్రి అంటారు - నాకు దేహము లేదు. నన్ను
‘శివ’ అని అంటారు, నా పేరు మారదు. మిగిలిన అందరివీ శరీరాల పేర్లు మారుతూ ఉంటాయి.
నేను పరమ ఆత్మను, నా జన్మపత్రిని ఎవ్వరూ వ్రాయలేరు. అనంతమైన రాత్రి ఏర్పడినప్పుడు
పగలుగా చేయడానికి నేను వస్తాను. ఇప్పుడిది సంగమము, ఈ విషయాలను బాగా అర్థం చేసుకుని
ధారణ చేయాలి, స్మృతిలోకి తీసుకురావాలి. ఇక్కడకు పిల్లలైన మీరు వస్తారు, తీరిక
లభిస్తుంది. ఇక్కడ విచార సాగర మంథనము బాగా చేయగలరు. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. సర్వోత్తమ కులము యొక్క స్మృతితో గృహస్థ వ్యవహారములో ఉంటూ కమల పుష్ప సమానముగా
పవిత్రముగా అవ్వాలి. ఎప్పుడూ కూడా సద్గురువును నిందింపజేయకూడదు.
2. శ్రీమతముపై నడుస్తూ భారత్ ను స్వర్గముగా తయారుచేసే సేవ చేయాలి. స్వదర్శన
చక్రధారులుగా అవ్వాలి మరియు తయారుచేయాలి. ఎప్పుడు సమయము లభిస్తే అప్పుడు తప్పకుండా
విచార సాగర మంథనము చేయాలి.
వరదానము:-
సదా కళ్యాణకారి భావన ద్వారా గుణాలను గ్రహించేవారిగా అయ్యే
చలించనివారిగా, స్థిరమైనవారిగా కండి
మీ స్థితిని చలించకుండా, స్థిరముగా తయారుచేసుకునేందుకు సదా
గుణాలను గ్రహించేవారిగా అవ్వండి. ఒకవేళ ప్రతి విషయములోనూ గుణాలను గ్రహించేవారిగా
అయినట్లయితే అలజడిలోకి రారు. గుణాలను గ్రహించడము అనగా కళ్యాణ భావన. అవగుణములో
గుణాన్ని చూడటము, వారినే గుణాలను గ్రహించేవారు అని అంటారు, అందుకే అవగుణాలు
కలిగినవారి నుండి కూడా గుణాలను గ్రహించండి. ఏ విధముగా వారు అవగుణాలలో దృఢముగా
ఉన్నారో, అదే విధముగా మీరు గుణాలలో దృఢముగా ఉండండి. గుణాలను గ్రహించేవారిగా అవ్వండి,
అవగుణాలను గ్రహించేవారిగా కాదు.
స్లోగన్:-
తమదంతా
తండ్రికి అర్పణ చేసి సదా తేలికగా ఉండేవారే ఫరిశ్తాలు.
అవ్యక్త ప్రేరణలు -
బ్రహ్మాబాబా సమానముగా సంపన్న మరియు సంపూర్ణ స్థితిని అనుభవము చేయండి
బాబా సమానముగా
అయ్యేందుకు బ్రహ్మాబాబాను ఫాలో చేస్తూ వెళ్ళండి. ఆలోచించండి, బ్రహ్మాబాబా
సంపూర్ణముగా ఎలా అయ్యారు? వారిలో ఏ విశేషత ఉంది? సంపూర్ణతకు విశేష ఆధారము ఏమిటి?
బ్రహ్మాబాబా తమ పూర్తి సమయాన్ని సఫలము చేసారు. ప్రతి శ్వాసను, ప్రతి క్షణాన్ని సఫలము
చేసారు. కనుక బాబా సమానముగా అయ్యేందుకు - సఫలము చేయాలి మరియు సఫలతామూర్తిగా అవ్వాలి
అన్న లక్ష్యము పెట్టుకోండి.