04-08-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం


‘‘మధురమైన పిల్లలూ - బాబాకు రైట్ హ్యాండ్ గా (కుడి భుజముగా) అవ్వాలంటే ప్రతి విషయములోనూ రైటియస్ గా (ధర్మయుక్తమైనవారిగా) అవ్వండి, సదా శ్రేష్ఠ కర్మలనే చేయండి’’

ప్రశ్న:-
ఏ సంస్కారము సేవలో చాలా విఘ్నాలను కలిగిస్తుంది?

జవాబు:-
భావ-స్వభావాల కారణముగా పరస్పరములో ద్వైత మతము యొక్క సంస్కారాలు ఏవైతే ఏర్పడతాయో, అవి సేవలో చాలా విఘ్నాలను కలిగిస్తాయి. రెండు మతాల వలన చాలా నష్టము కలుగుతుంది. క్రోధమనే భూతము ఎటువంటిదంటే, దాని వలన భగవంతుడిని ఎదిరించడానికి కూడా వెనుకాడరు. అందుకే బాబా అంటారు - మధురమైన పిల్లలూ, ఇలాంటి సంస్కారాలు ఏవైనా ఉన్నట్లయితే వాటిని తొలగించివేయండి.

పాట:-
అదృష్టాన్ని మేలుకొలుపుకుని వచ్చాను...

ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. ఆత్మిక పిల్లలు అనగా సుప్రీమ్ ఆత్మ అయిన శివబాబా యొక్క పిల్లలైన ఆత్మలు, శరీర కర్మేంద్రియాల ద్వారా పాటను విన్నారు. ఇప్పుడు పిల్లలు ఆత్మాభిమానులుగా అవ్వాలి. ఇందులో చాలా శ్రమించాల్సి ఉంటుంది కూడా. పదే-పదే స్వయాన్ని ఆత్మగా భావిస్తూ తండ్రిని స్మృతి చేయాలి. ఇది గుప్తమైన శ్రమ. తండ్రి కూడా గుప్తమైనవారు కనుక శ్రమను కూడా గుప్తముగానే చేయిస్తారు. తండ్రి స్వయంగా వచ్చి అంటారు - పిల్లలూ, నన్ను స్మృతి చేసినట్లయితే 5000 సంవత్సరాల కల్పక్రితం వలె మళ్ళీ సతోప్రధానముగా అవుతారు. పిల్లలు అర్థం చేసుకుంటారు - ఇంతకుముందు మేమే సతోప్రధానముగా ఉండేవారము, ఇప్పుడు మళ్ళీ మేమే తమోప్రధానముగా అయ్యాము, ఇప్పుడు తప్పకుండా సతోప్రధానముగా అవ్వాలి. పాటలో కూడా ఇలా అంటారు - పోగొట్టుకున్న అదృష్టాన్ని మళ్ళీ పొందడానికి పురుషార్థము చేయించేవారు సర్వశక్తివంతుడైన తండ్రి ఒక్కరే, ఎందుకంటే వారు అందరినీ పావనముగా తయారుచేస్తారు కదా. తండ్రి పిల్లలకు అర్థం చేయిస్తున్నారు - ఓ ఆత్మిక పిల్లలూ, ఇప్పుడు మీరు అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు వచ్చారు. విద్యార్థులు స్కూలుకు అదృష్టాన్ని తయారు చేసుకునేందుకు వెళ్తారు కదా. వారు చిన్న పిల్లలు. మీరు చిన్నవారు కాదు, మీరు పెద్దవారు, వృద్ధులు. అదృష్టాన్ని తయారు చేసుకుంటున్నారు. అవును, కొందరు వృద్ధులు కూడా ఉన్నారు. వృద్ధాప్యములో కన్నా యువావస్థలో చదువుకోవడము మంచిది, యువత బుద్ధి బాగుంటుంది. ఇదైతే అందరికీ చాలా సులభము. మీ శరీరమైతే పెద్దది కద. ఇక్కడ బేబీ ఉంది, అంతగా అర్థం చేసుకోలేదు ఎందుకంటే కర్మేంద్రియాలు చిన్నగా ఉన్నాయి. నింద-స్తుతి, సుఖ-దుఃఖాలు - ఈ విషయాలను మీరు అర్థం చేసుకోగలరు. ఆత్మ అయితే బిందువు. శరీరము పెరుగుతూ ఉంటుంది. ఆత్మ అయితే ఏకరసంగానే ఉంటుంది. ఎప్పుడూ తరగదు-పెరగదు. ఆత్మ బుద్ధి కోసం తండ్రి కస్తూరి వంటి కానుకను ఇస్తున్నారు, ఎందుకంటే ఇప్పుడు ఇక బుద్ధి పూర్తిగా తమోప్రధానముగా అయిపోయింది. అదే ఇప్పుడు స్వచ్ఛముగా కూడా అవుతుంది. మీరు అర్థం చేయించడము కోసం ఈ చిత్రాలు చాలా ఉపయోగపడతాయి. భక్తి మార్గములో దేవతల ఎదురుగా వెళ్ళి తల వంచి నమస్కరిస్తారు, పూజ చేస్తారు. ఇంతకుముందు మీరు కూడా అంధవిశ్వాసముతో వెళ్ళేవారు. శివుని మందిరాలకు వెళ్ళేవారు, కానీ వారే శివబాబా అని అప్పుడు మీకు తెలియదు. బాబా నుండి తప్పకుండా వారసత్వము లభించింది, అందుకే వారి మహిమ గాయనము చేయబడుతుంది. ఎవరైనా మంచి పని చేసి వెళ్తే, వారి మహిమ గాయనము చేయబడుతుంది. శివబాబా స్టాంపును తయారుచేయాలి. శివబాబా గీత సెర్మోనైజర్ (శివబాబా గీత జ్ఞానదాత)... అనే స్టాంపును సహజముగా తయారుచేయవచ్చు. ఆ తండ్రి అందరికీ సుఖాన్ని ఇచ్చేవారు. తండ్రి అంటారు - నేను మిమ్మల్ని సుఖధామానికి యజమానులుగా చేసేవాడిని. వృద్ధ మాతలు కూడా - మేము విచిత్రుడైన శివబాబా వద్దకు వచ్చాము, వారు ఈ చిత్రములోకి (తనువులోకి) ప్రవేశించారని భావిస్తూ ఉండవచ్చు. నిరాకారుడిని విచిత్రుడు అని అంటారు. మేము శివబాబా వద్దకు వెళ్తున్నామని, వారు ఈ చిత్రాన్ని (శరీరముగా) తాత్కాలికంగా ధరించారని వారి బుద్ధిలో ఉంటుంది. వారు పతితులను పావనముగా చేసి ముక్తి-జీవన్ముక్తులను ఇస్తారు అనగా శాంతిధామ, సుఖధామ నివాసులుగా తయారుచేస్తారు. మనుష్యులు శాంతి కోసమే ప్రయత్నిస్తారు. భగవంతుడు లభిస్తే శాంతి లభిస్తుందని అనుకుంటారు, వారు సుఖము కోసం పురుషార్థము చేయరు. తండ్రి వద్దకు ఇంటికి వెళ్ళాలి, భగవంతుడు లభించాలి అని అనుకుంటారు. ఈ సమయములో అందరూ ముక్తిని పొందాలన్న కోరికను పెట్టుకునేవారే. జీవన్ముక్తిని పొందేవారు కేవలం బ్రాహ్మణులైన మీరు మాత్రమే. మిగిలినవారంతా ముక్తిని పొందాలన్న కోరికను పెట్టుకునేవారే. జీవన్ముక్తి యొక్క మార్గాన్ని తెలియజేసేవారు ఎవరూ లేరు. సన్యాసులు మొదలైనవారి వద్దకు వెళ్ళి శాంతిని కోరుకుంటారు. మనశ్శాంతి ఎలా లభిస్తుంది అని అడుగుతారు. ఆ మార్గాన్ని చూపించేవారంతా ముక్తిలోకి వెళ్ళేవారే. మోక్షమంటే ఏమిటి అనేది కూడా వారి బుద్ధిలోకి రాదు. ఇక విసుగు చెంది, ముక్తిలోకి వెళ్ళడమే మంచిదని అంటారు. వాస్తవానికి ముక్తిధామము - ఆత్మలు నివసించే స్థానము. ఇన్ని సెంటర్లలో పిల్లలు ఉన్నారు, అందరికీ - తాము కొత్త ప్రపంచము కోసం రాజ్య భాగ్యాన్ని తీసుకుంటున్నారని, బాబా వారికి కొత్త ప్రపంచ రాజ్యాన్ని ఇస్తున్నారని తెలుసు. ఎక్కడ ఇస్తారు? కొత్త ప్రపంచములో ఇస్తారా లేక పాత ప్రపంచములో ఇస్తారా? తండ్రి అంటారు - నేను సంగమములో వస్తాను. నేను సత్యయుగములో గాని, కలియుగములో గాని రాను, ఈ రెండింటికీ మధ్యలో వస్తాను. తండ్రి అయితే అందరికీ సద్గతిని ఇస్తారు కదా. అంతేకానీ, దుర్గతిలో వదిలేస్తారని కాదు. సద్గతి మరియు దుర్గతి, రెండూ కలిసి ఉండవు. ఈ పాత ప్రపంచము వినాశనమవ్వనున్నదని పిల్లలకు తెలుసు, అందుకే దీని పట్ల ప్రేమను పెట్టుకోకూడదు. తప్పకుండా ఇప్పుడు మనము సంగమయుగములో ఉన్నామని, ఈ ప్రపంచము మారనున్నదని బుద్ధి చెప్తుంది. ఇప్పుడు తండ్రి వచ్చి ఉన్నారు, తండ్రి అంటారు - నేను కల్ప-కల్పము సంగమములో వస్తాను, మిమ్మల్ని దుఃఖము నుండి విడిపించి హరి ద్వారానికి తీసుకువెళ్తాను. ఇది జ్ఞానానికి సంబంధించిన విషయము. హరి ద్వారము, శ్రీకృష్ణుని ద్వారము అని కృష్ణపురిని అంటారు. అచ్ఛా, దాని వెనుక మళ్ళీ లక్ష్మణ ఝూలాను కూడా పెట్టారు. ముందు హరిద్వార్ వస్తుంది. (హరిద్వార్ తర్వాత వచ్చే రిషికేష్ లో ఒక వేలాడే వంతెన పేరు లక్ష్మణ ఝూలా) సత్యయుగాన్ని హరి-ద్వారము అని అంటారు. తర్వాత రామ-లక్ష్మణులు మొదలైనవారిని చూపిస్తారు. వాస్తవానికి అలాంటి విషయమేమీ లేదు. అవి కల్పించిన విషయాలు. రామునికి ఎంతమంది సోదరులను చూపించారు! నలుగురు సోదరులు అయితే ఉండరు. 4-8 మంది సోదరులైతే ఇక్కడ ఉంటారు. ఒక వైపు ఈశ్వరీయ సంతానము ఉన్నారు, మరో వైపు ఆసురీ సంతానము ఉన్నారు.

శివబాబా బ్రహ్మా తనువులోకి వచ్చారని ఇప్పుడు మీకు తెలుసు. శివుడు తండ్రి, బ్రహ్మా ఏమో దాదా (పెద్దన్నయ్య), వారు ప్రజాపిత. శివబాబా ఆత్మల తండ్రి, వారు అనాది అయినవారు, వారు ఈ సమయములో బ్రాహ్మణులను రచిస్తారు. శివబాబా సాలిగ్రామాలను రచిస్తారని కాదు. అలా కాదు. సాలిగ్రామాలైతే అవినాశీగా ఉండనే ఉంటారు. తండ్రి వచ్చి కేవలం పవిత్రముగా తయారుచేస్తారు. ఎప్పటివరకైతే ఆత్మ పవిత్రముగా అవ్వదో, అప్పటివరకు శరీరము పవిత్రముగా ఎలా అవుతుంది. ఆత్మలమైన మనము పవిత్రముగా ఉన్నప్పుడు సతోప్రధానముగా ఉండేవారము. ఇప్పుడు అపవిత్రముగా, తమోప్రధానముగా ఉన్నాము, మళ్ళీ సతోప్రధానముగా ఎలా అవ్వాలి - ఇది సహజముగా అర్థం చేసుకునే విషయము. ఈ సమయములో మీలో మాలిన్యము చేరడముతో పతితముగా, తమోప్రధానముగా అయిపోయారు. ఇప్పుడు మళ్ళీ సతోప్రధానముగా అవ్వాలి. లెక్కాచారాలను సమాప్తము చేసుకుని అందరూ శాంతిధామానికి మరియు సుఖధామానికి వెళ్తారు. ఆత్మలు నిరాకారీ ఇంటి నుండి ఎలా వస్తారు అనేదానికి స్మృతి చిహ్నముగా - క్రిస్టియన్లు క్రిస్మస్ ట్రీ లో లైట్లు పెట్టి పండుగ జరుపుకుంటారు. అవి అన్ని ధర్మాలకు సంబంధించిన రకరకాల శాఖలని మీకు తెలుసు. అక్కడి నుండి ఆత్మలు నంబరువారుగా ఎలా కిందకు వస్తారు అనే జ్ఞానము మీకు లభించింది. ఆత్మలైన మన ఇల్లు శాంతిధామము. ఇప్పుడు ఇది సంగమము. అక్కడి నుండి ఆత్మలందరూ వచ్చేస్తారు, తర్వాత అందరూ వెళ్తారు. ప్రళయమైతే జరగదు. మనము బాబా ద్వారా అదృష్టాన్ని తయారుచేసుకునేందుకు, స్వరాజ్యాన్ని మళ్ళీ తీసుకునేందుకు వచ్చామని మీకు తెలుసు. ఇది కేవలం నామమాత్రమైన విషయము కాదు. స్మృతి ద్వారానే వారసత్వము లభిస్తుంది. తండ్రి అంటారు - దేహ సహితముగా దేహానికి సంబంధించిన మిత్ర-సంబంధీకులు మొదలైనవారు ఎవరైతే ఉన్నారో, అందరినీ మర్చిపోండి. చిత్రములో ఉన్నవారు మరియు విచిత్రుడు ఉన్నారు కదా. ఎవరినైతే ఈ కనులతో చూడలేమో, వారిని విచిత్రుడు అని అంటారు. ఇవి చాలా సూక్ష్మమైన విషయాలు. ఆత్మ ఎంత చిన్ననిది. ఆత్మ ఘడియ-ఘడియ పాత్రను అభినయించవలసి ఉంటుంది, ఇంకెవరి బుద్ధిలోనూ ఇలాంటి విషయాలు లేవు. మొట్టమొదట బుద్ధిలో ఇది కూర్చోబెట్టుకోవాలి - మనము ఆత్మలము, వారు మన తండ్రి. వారినే పతిత-పావనా, ఓ భగవంతుడా అని అంటూ స్మృతి చేస్తారు. ఇక వేరే చోటుకు వెళ్ళాల్సిన అవసరము లేదు. కావున, స్మృతి కూడా ఒక్కరినే చేయాలి కదా. భగవంతుడిని స్మృతి చేస్తున్నారంటే తప్పకుండా వారి నుండి ఏదో లభిస్తుందని అర్థం. మరి ప్రతి చోట ఎదురుదెబ్బలు ఎందుకు తింటారు! భగవంతుడైతే పరంధామము నుండి రావాల్సి ఉంటుంది కదా. మనమైతే అక్కడికి వెళ్ళలేము ఎందుకంటే పతితముగా ఉన్నాము. పతితులు అక్కడికి వెళ్ళలేరు. ఇప్పుడు మీకు ఆశ్చర్యమనిపిస్తుంది. భక్తి మార్గపు పాత్ర ఎంత అద్భుతమైనదో కదా. ఓ ఈశ్వరా, ఓ పరమపితా, ఓ గాడ్ ఫాదర్ అని ఒక్క భగవంతుడినే స్మృతి చేస్తారు. వారు ఒక్కరే అన్నప్పుడు ఇక వేరే వైపుకు వెళ్ళి ఎందుకు ఎదురుదెబ్బలు తింటారు! వారొక్కరూ పైన ఉంటారు. కానీ ఇదంతా నిశ్చితమై ఉంది, డ్రామానుసారముగా అనంతమైన అవివేకముతో భక్తి చేస్తారు. ఇప్పుడు మీరు అనంతమైన వివేకవంతులుగా అవుతారు. శ్రీమతముపై నడుచుకునేవారే వివేకవంతులుగా అవుతారు. వారు దాగి ఉండరు, వారు సదా శ్రేష్ఠాచారీ కర్మలనే చేస్తారు. తండ్రి అంటారు - నేను దుఃఖహర్త-సుఖకర్తను కావున పిల్లలు కూడా ఎంత మధురముగా తయారవ్వాలి. తండ్రికి రైట్ హ్యాండ్ గా (కుడి భుజముగా) అవ్వాలి. ఇటువంటి పిల్లలే తండ్రికి ప్రియముగా అనిపిస్తారు. వారు రైట్ హ్యాండ్ కదా. ఎడమ చేతితో అంతగా పని చేయలేరని మీకు తెలుసు, ఎందుకంటే కుడి చేయి ధర్మయుక్తమైన పనులు చేస్తుంది. అందుకే, ఈ కుడి చేతినే శుభకార్యాలలో ఉపయోగిస్తారు. పూజ సదా కుడి చేతితోనే చేస్తారు. తండ్రి అంటారు, ప్రతి విషయములోనూ ధర్మయుక్తమైనవారిగా అవ్వండి. తండ్రి లభించారంటే సంతోషము ఉండాలి కదా.

తండ్రి అంటారు - నన్నొక్కరినే స్మృతి చేసినట్లయితే, అంత మతి సో గతి జరుగుతుంది (అంతిమ సమయములో ఎటువంటి ఆలోచనలతో చనిపోతారో, అటువంటి జన్మ లభిస్తుంది). మతము మరియు గతి ఒక్కటే లేదా గతిని ప్రాప్తింపజేసే మతము ఒక్కటే. ఈశ్వరుడు ఇచ్చే గతి లేక మతము ఈశ్వరునికే తెలుసు అని అంటూ ఉంటారు. వారే పతిత-పావనుడు. నేను మనుష్యులను పావనముగా చేసి, దుర్గతి నుండి సద్గతిలోకి ఎలా తీసుకువెళ్తాను అనేది నాకు తెలుసు. భక్తి మార్గములో ఎంత శ్రమ చేస్తారు కానీ సద్గతి కలగదు, ఫలమేమీ లభించదు. సద్గతినిచ్చేవారైతే ఒక్క తండ్రి మాత్రమే. భక్తిలో ఎవరు ఏ భావనతో పూజ చేస్తారో, వారికి ఆ ఫలాన్ని ఇచ్చేవాడిని నేనే. అది కూడా డ్రామాలో నిశ్చితమై ఉంది. వారంతట వారికే పురుషార్థమనుసారముగా ఫలం లభిస్తుంది. ఇప్పుడు పిల్లలు తమ పురుషార్థముతోనే పవిత్రముగా అవ్వాలి. తండ్రి అంటారు - మధురాతి మధురమైన తండ్రిని స్మృతి చేయండి. వారే సర్వశక్తివంతుడు, ఆల్మైటీ అథారిటీ, వారు ఎంత ఉన్నతముగా తయారుచేస్తారు. మీరు అంతా తెలుసుకున్నారు మరియు తండ్రి నుండి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. రచయిత మరియు రచనల జ్ఞానము మీ బుద్ధిలో ఉంది. ఇంతకుముందు మీలో ఈ జ్ఞానము లేదని మీకు తెలుసు. యజ్ఞ-తపాదులు మొదలైనవి చేయడం, శాస్త్రాలు మొదలైనవి వినడము - ఇది శాస్త్రాలకు సంబంధించిన జ్ఞానము. దానిని భక్తి అని అంటారు. అందులో లక్ష్యము-ఉద్దేశ్యము ఏమీ లేవు. చదువులో లక్ష్యము-ఉద్దేశ్యము ఉంటాయి. ఏదో ఒక రకమైన జ్ఞానముంటుంది. పతితుల నుండి పావనముగా అయ్యేటువంటి జ్ఞానాన్ని మనకు పతిత-పావనుడైన తండ్రి ఇచ్చారు. సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని తండ్రి ఇచ్చారు. ఈ సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది, ఇందులో యాక్టర్లు అందరూ పాత్రధారులే. ఈ నాటకము అనాదిగా తయారై ఉంది. ఈ అనంతమైన జ్ఞానమైతే తప్పకుండా ఉండాలి.

పిల్లలైన మీకు తెలుసు - ఇప్పుడు మనము ఘోర అంధకారము నుండి బయటకు వచ్చి అత్యంత ప్రకాశములోకి వెళ్తున్నాము. మీరు ఇప్పుడు దేవతలుగా అవుతున్నారు. ఆది సనాతన ధర్మము దేవీ-దేవతా ధర్మమని, దానిని హిందు ధర్మమని అనేసారని కూడా మీరు అర్థం చేయించాలి. నెమ్మది-నెమ్మదిగా ఈ విషయాన్ని కూడా అర్థం చేసుకుంటారు. పిల్లలు లేచి నిలబడాలి. ఇందులో చాలామంది పిల్లలు కావాలి. ఢిల్లీలో కాన్ఫరెన్స్ చేయాల్సి ఉంటుంది. పరిస్తాన్ అని కూడా ఢిల్లీనే అంటారు. ఇదే యమునా నది తీరముండేది, ఢిల్లీ రాజధాని. ఎంతోమంది చేతుల్లోకి వచ్చింది. దేవతల రాజధాని కూడా ఇదే. ఢిల్లీలో చాలా పెద్ద కాన్ఫరెన్స్ జరగాలి, కానీ మాయ ఎలాంటిదంటే, అది అలా జరగనివ్వదు. చాలా విఘ్నాలు వేస్తుంది. ఈ రోజుల్లో భావ-స్వభావాలు కూడా అనేకమైపోయాయి కదా. పిల్లలు పరస్పరములో కలిసి సేవలో నిమగ్నమవ్వాలి. ఆ మనుష్యులు కూడా పరస్పరములో కలవకపోతే, రాజ్యాలే పోతాయి. రెండు పార్టీలుగా అయిపోతే, రాష్ట్రపతిని కూడా తొలగించేస్తారు. ద్వైత మతము చాలా నష్టము కలిగిస్తుంది. అప్పుడిక భగవంతుడిని ఎదిరించడానికి కూడా వెనుకాడరు. చాలా నష్టపోతారు. క్రోధమనే భూతము వచ్చిందంటే, ఇక అడగకండి, అందుకే బాబా అంటారు - బెల్లం గురించి బెల్లానికి మరియు బెల్లం సంచికి మాత్రమే తెలుసు అని. తండ్రి పిల్లలకు సృష్టి ఆదిమధ్యాంతాల జ్ఞానాన్ని వినిపిస్తున్నారు. ఇప్పుడిక ఎవరైనా ధారణ చేయడము, చేయకపోవడము అనేది వారి పురుషార్థము పైన ఆధారపడి ఉంటుంది. అంతేకానీ, బాబా ఆశీర్వాదాలు ఇస్తారని లేక కృప చూపిస్తారని కాదు, ఇందులో కృప మొదలైనవి అడిగే విషయమేమీ లేదు. ఒకవేళ ప్రేరణతో యోగము మరియు జ్ఞానము నేర్పించేది ఉంటే, ఇక నేను ఈ అశుద్ధమైన ప్రపంచములోకి ఎందుకు వస్తానని తండ్రి అంటారు. ప్రేరణ, ఆశీర్వాదము - ఇవన్నీ భక్తి మార్గము యొక్క పదాలు. ఇక్కడ పురుషార్థము చేయాల్సి ఉంటుంది, అంతేకానీ ప్రేరణ యొక్క విషయము కాదు. మీకు 3 ఇంజన్లు ఒకేసారి లభించాయి. అక్కడైతే తండ్రి వేరుగా, టీచరు వేరుగా లభిస్తారు, గురువు చివరిలో లభిస్తారు. ఇక్కడైతే ఈ ముగ్గురూ కలిసి ఉన్నారు. తండ్రి అంటారు - నేను మిమ్మల్ని పూజ్యులుగా చేస్తాను, మీరు తర్వాత పూజారులుగా అయిపోతారు. చాలా యుక్తిగా అర్థం చేయించాలి. అంతేకానీ, ఇతరులు మూర్ఛితులైపోయేలా చెప్పకూడదు. ముందుగా ఇద్దరు తండ్రుల విషయము ముఖ్యమైనది. భగవంతుడు తండ్రి, వారి జన్మను, శివజయంతిని కూడా ఇక్కడే జరుపుకుంటారు. వారు తప్పకుండా స్వర్గానికి యజమానులుగా తయారుచేస్తూ ఉండవచ్చు. భారత్ లోనే స్వర్గముండేది. ఇప్పుడు నరకము యొక్క వినాశనము కోసం మహాభారత యుద్ధము ఎదురుగా నిలబడి ఉంది. తప్పకుండా తండ్రి కొత్త ప్రపంచాన్ని స్థాపన చేయించేవారు కూడా. మేము భారత్ ను పావనముగా తయారుచేసి తీరుతాము అని తండ్రి శ్రీమతము అనుసారముగానే మనము చెప్తాము. అచ్ఛా!

మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.

ధారణ కొరకు ముఖ్య సారము:-

1. ఎలాగైతే తండ్రి దుఃఖహర్త-సుఖకర్తగా ఉన్నారో, అలా తండ్రి సమానముగా అవ్వాలి. చాలా మధురముగా అవ్వాలి. సదా శుభమైన కార్యాలను చేసి రైట్ హ్యాండ్ గా (కుడి భుజముగా) అవ్వాలి.

2. ఎప్పుడూ రెండు మతాలు ఉండకూడదు. భావ-స్వభావాలలోకి వచ్చి ఒకరినొకరు ఎదిరించుకోకూడదు. క్రోధమనే భూతాన్ని తొలగించివేయాలి.

వరదానము:-
స్వయము యొక్క స్మృతిలో ఉంటూ, తమ ప్రతి కర్మను నియమముగా తయారుచేసే అథారిటీ స్వరూప భవ

ఎలాగైతే సాకారములో (బ్రహ్మాబాబా) స్వయము యొక్క స్మృతిలో ఉండటముతో, వారు ఏ కర్మనైతే చేసారో, అదే బ్రాహ్మణ పరివారానికి నియమముగా అయ్యింది. సాకారుని ద్వారా ఏదైనా వ్యతిరేక కర్మ జరిగినా కానీ నేను దానిని సరి చేస్తాను అని బాబా అథారిటీతో చెప్పగలిగేవారు, దీనికి కారణము ఏమిటంటే బ్రహ్మాబాబా స్వయము యొక్క నషాలో ఉండేవారు. స్వ-స్వరూప స్మృతిలో ఉన్నట్లయితే, ఏ కర్మ కూడా అసలు వ్యతిరేకముగా జరగదు అన్న నషా ఉంటుంది. అలా పిల్లలైన మీరు కూడా స్వ-స్థితిలో స్థితులై ఉన్నట్లయితే, ఏ సంకల్పము నడిచినా, ఏ మాట మాట్లాడినా లేదా ఏ కర్మ చేసినా, అదే నియమముగా తయారవుతుంది.

స్లోగన్:-
పవిత్రతా స్తంభాన్ని దృఢముగా చేసుకున్నట్లయితే, ఆ స్తంభము లైట్ హౌస్ గా పని చేస్తూ ఉంటుంది.

అవ్యక్త ప్రేరణలు - అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తము చేసి సంపూర్ణముగా స్వచ్ఛముగా (పవిత్రముగా) అవ్వండి

బుద్ధిలో అశుద్ధ సంకల్పాలు మరియు పాత సంస్కారాలు ఒకవేళ సంకల్పము రూపములో టచ్ అయినా కూడా సంపూర్ణ వైష్ణవులు అని అనరు. ఏదైనా చేయకూడని కార్యాన్ని చూసినా కూడా ఆ చూసినదాని ప్రభావము ఉంటుంది, దానికి కూడా లెక్క తయారవుతుంది. ఈ లెక్క ఆధారముగా ఆలోచించినట్లయితే ఒకవేళ పాత సంస్కారాలు మరియు అశుద్ధ సంకల్పాలు బుద్ధిలో టచ్ అయినా కూడా సంపూర్ణ వైష్ణవులని లేక సంపూర్ణ పవిత్రులని ఎలా అంటారు.