ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలు పాటను విన్నారు. రోజురోజుకు మన ఇల్లు లేక గమ్యము
సమీపముగా వస్తూ ఉంటుంది. ఇప్పుడు శ్రీమతము ఏదైతే చెప్తుందో, అందులో నిర్లక్ష్యము
చేయకండి. అందరికీ సందేశాన్ని అందించండి అని తండ్రి డైరెక్షన్ లభిస్తుంది. లక్షలాది,
కోట్లాదిమందికి ఈ సందేశాన్ని అందించాలని పిల్లలకు తెలుసు. సందేశము తీసుకున్నాక
తరువాత ఏదో ఒక సమయములో వస్తారు కూడా. ఎప్పుడైతే ఎక్కువమంది అవుతారో అప్పుడు ఇంకా
ఎక్కువమందికి సందేశాన్ని ఇస్తారు. తండ్రి సందేశమైతే అందరికీ లభించేది ఉంది. ఈ
సందేశము చాలా సహజమైనది. వారికి కేవలం ఇదే చెప్పండి - స్వయాన్ని ఆత్మగా భావిస్తూ
తండ్రిని స్మృతి చేయండి మరియు ఏ కర్మేంద్రియాల ద్వారా కూడా మనసా, వాచా, కర్మణా ఏ
విధమైన చెడు కర్మలు చేయకూడదు. మొదట మనసులో వస్తుంది, ఆ తరువాతనే వాచాలోకి వస్తుంది.
ఇది పుణ్యకర్మ, ఇది చేయాలి అని ఇలా మంచి-చెడులను అర్థం చేసుకునే బుద్ధి ఇప్పుడు మీకు
కావాలి. మనసులో కోపం చేయాలి అని సంకల్పము వస్తుంది, కానీ ఒకవేళ కోపం చేస్తే పాపము
అవుతుంది అని అర్థమయ్యే బుద్ధి అయితే లభించింది. తండ్రిని స్మృతి చేసినట్లయితే
పుణ్యాత్మగా అయిపోతారు. సరేలే, ఇప్పుడు జరిగింది కానీ మళ్ళీ ఇంకెప్పుడూ చేయను అని
అనడం కాదు. అలా ఇంకెప్పుడూ చేయను, ఇంకెప్పుడూ చేయను అని అంటుంటే అదే అలవాటైపోతుంది.
మనుష్యులు ఇటువంటి పనులు చేసినప్పుడు, ఇది పాపము కాదు అని అనుకుంటారు. అలాగే వారు
వికారాలను పాపముగా భావించరు. ఇప్పుడు తండ్రి తెలియజేస్తున్నారు - ఇది అన్నింటికన్నా
పెద్ద పాపము, దీనిపై విజయము పొందాలి మరియు అందరికీ తండ్రి సందేశాన్ని ఇవ్వాలి,
అదేమిటంటే - తండ్రి చెప్తున్నారు, నన్ను స్మృతి చేయండి, మృత్యువు ఎదురుగా నిలబడి
ఉంది. ఎవరైనా మరణించే స్థితిలో ఉన్నప్పుడు వారితో - గాడ్ ఫాదర్ ను గుర్తు చేయండి,
రిమెంబర్ గాడ్ ఫాదర్ అని అంటారు. అతను గాడ్ ఫాదర్ వద్దకు వెళ్తారని వారు భావిస్తారు.
కానీ గాడ్ ఫాదర్ ను స్మృతి చేయడం వలన ఏమి జరుగుతుంది, ఎక్కడికి వెళ్తారు అన్నది
వారికి తెలియదు. మరణిస్తే ఆత్మ ఒక శరీరాన్ని వదిలి ఇంకొకటి తీసుకుంటుంది. అంతేకానీ
గాడ్ ఫాదర్ వద్దకైతే ఎవ్వరూ వెళ్ళలేరు. ఇప్పుడు పిల్లలైన మీకు అవినాశీ తండ్రి యొక్క
అవినాశీ స్మృతి ఉండాలి. ఎప్పుడైతే తమోప్రధానముగా, దుఃఖితులుగా అయిపోతారో అప్పుడు
ఒకరికొకరు - గాడ్ ఫాదర్ ను స్మృతి చేయండి అని చెప్పుకుంటూ ఉంటారు, ఇలా ఆత్మలందరూ
ఒకరికొకరు చెప్పుకుంటూ ఉంటారు, ఇలా చెప్పేది అయితే ఆత్మయే కదా. పరమాత్మ చెప్తారని
కాదు. తండ్రిని స్మృతి చేయమని ఆత్మ, ఆత్మకు చెప్తుంది. ఇది ఒక సాధారణమైన ఆచారము.
మరణించే సమయములో ఈశ్వరుడిని తలచుకుంటారు. ఈశ్వరుడు అంటే భయము ఉంటుంది. మంచి మరియు
చెడు కర్మల ఫలాన్ని ఈశ్వరుడే ఇస్తారని భావిస్తారు, చెడు కర్మలు చేసినట్లయితే
ఈశ్వరుడు ధర్మరాజు ద్వారా చాలా శిక్షలు ఇస్తారని భావిస్తారు, అందుకే భయము ఉంటుంది,
తప్పకుండా కర్మల భోగాన్ని అయితే అనుభవించవలసే ఉంటుంది కదా. పిల్లలైన మీరు ఇప్పుడు
కర్మ-అకర్మ-వికర్మల గతులను అర్థం చేసుకున్నారు. ఫలానా కర్మ అకర్మగా అవుతుందని మీకు
తెలుసు. స్మృతిలో ఉంటూ ఏ కర్మలైతే చేస్తారో అవి మంచివే చేస్తారు. రావణ రాజ్యములో
మనుష్యులు చెడు కర్మలే చేస్తారు. రామ రాజ్యములో చెడు కర్మలు ఎప్పుడూ జరగవు. ఇప్పుడు
శ్రీమతమైతే లభిస్తూనే ఉంటుంది. ఎక్కడికైనా మిమ్మల్ని పిలవడము జరిగితే, ఇది చేయాలా
లేక చేయకూడదా అని ప్రతి విషయములోనూ అడుగుతూ ఉండండి. ఉదాహరణకు ఎవరైనా పోలీస్ ఉద్యోగము
చేస్తున్నారంటే, వారికి కూడా ఏమని చెప్పడం జరుగుతుందంటే - మీరు ముందు ప్రేమగా అర్థం
చేయించండి, ఒకవేళ వారు నిజం చెప్పకపోతే ఆ తరువాత కొట్టండి. ప్రేమతో అర్థం చేయించడము
వలన వారు చేతికి రావచ్చు, కానీ ఆ ప్రేమలో కూడా యోగబలము నిండి ఉన్నట్లయితే ఆ ప్రేమలో
ఉన్న శక్తితో ఎవరికైనా అర్థం చేయిస్తే వారు అర్థం చేసుకుంటారు. అప్పుడు వీరు
ఈశ్వరుడి వలె అర్థం చేయిస్తున్నారే అని భావిస్తారు. ఈశ్వరుని పిల్లలైన మీరు యోగీలు
కదా. మీలో కూడా ఈశ్వరీయ శక్తి ఉంది. ఈశ్వరుడు ప్రేమసాగరుడు, వారిలో శక్తి ఉంది కదా.
వారు అందరికీ వారసత్వాన్ని ఇస్తారు. స్వర్గములో ప్రేమ ఎంతగానో ఉంటుందని మీకు తెలుసు.
ఇప్పుడు మీరు ప్రేమ యొక్క పూర్తి వారసత్వాన్ని తీసుకుంటున్నారు. అలా తీసుకుంటూ,
తీసుకుంటూ నంబరువారుగా పురుషార్థము చేస్తూ-చేస్తూ ప్రియముగా అయిపోతారు.
తండ్రి అంటారు - ఎవ్వరికీ దుఃఖము ఇవ్వకూడదు, లేదంటే దుఃఖితులై మరణిస్తారు. తండ్రి
ప్రేమ యొక్క మార్గాన్ని తెలియజేస్తారు. మనసులో ఏదైనా వచ్చిందంటే అది ముఖముపైకి కూడా
వచ్చేస్తుంది. కర్మేంద్రియాల ద్వారా చేసారంటే ఇక రిజిస్టర్ పాడైపోతుంది. దేవతల
నడత-నడవడిక గురించి గాయనము చేస్తారు కదా, అందుకే బాబా అంటారు - దేవతల పూజారులకు
అర్థం చేయించండి. వారు దేవతలను - మీరు సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు అని
మహిమ చేస్తారు మరియు స్వయం యొక్క నడత-నడవడికను గురించి కూడా దేవతలకు వినిపిస్తారు.
అటువంటివారికి అర్థం చేయించండి - మీరే ఒకప్పుడు అలా ఉండేవారు, ఇప్పుడు అలా లేరు,
కానీ మళ్ళీ తప్పకుండా అలా అవుతారు, మీరు ఆ విధంగా దేవతలుగా అవ్వాలనుకుంటే మీ
నడవడికను ఆ విధంగా ఉంచుకోండి, అప్పుడు మీరు వారి వలె అయిపోతారు. స్వయాన్ని చెక్
చేసుకోవాలి - నేను సంపూర్ణ నిర్వికారిగా ఉన్నానా? నాలో ఏ ఆసురీ గుణము లేదు కదా? ఏ
విషయములోనూ డిస్టర్బ్ అవ్వడం లేదు కదా? మూడీగా అయితే అవ్వడం లేదు కదా? అనేక సార్లు
మీరు పురుషార్థము చేసారు. తండ్రి అంటారు, మీరు ఈ విధముగా అవ్వాలి. అలా తయారుచేసేవారు
కూడా ఇక్కడ ఉన్నారు. తండ్రి అంటారు, కల్ప-కల్పము మిమ్మల్ని ఆ విధముగా తయారుచేస్తాను.
కల్పపూర్వము ఎవరైతే జ్ఞానాన్ని తీసుకున్నారో వారు తప్పకుండా వచ్చి తీసుకుంటారు.
పురుషార్థము కూడా చేయించడం జరుగుతుంది, అలాగే నిశ్చింతగా కూడా ఉంటారు. డ్రామా ఈ
విధముగా నిశ్చితమై ఉంది. కొందరు అంటారు - డ్రామాలో నిశ్చితమై ఉంటే నేను తప్పకుండా
చేస్తాను, మంచి పాత్ర ఉంటే డ్రామా చేయిస్తుందిలే అని. అలా అంటున్నారంటే - వారి
భాగ్యములో లేదని అర్థం చేసుకోవడం జరుగుతుంది. ప్రారంభములో కూడా ఒకతను ఇలాగే
డిస్టర్బ్ అయ్యారు, అతని భాగ్యములో లేదు, అందుకే - డ్రామాలో ఉంటే డ్రామా నా చేత
పురుషార్థము చేయిస్తుంది అని అన్నారు. అంతే, ఇక వదిలి వెళ్ళిపోయారు. ఇటువంటివారు
మీకు కూడా ఎంతోమంది ఎదురవుతారు. మీ లక్ష్యము-ఉద్దేశ్యము అయితే ఎదురుగా నిలబడి ఉంది,
బ్యాడ్జీ కూడా మీ వద్ద ఉంది. మీ లెక్కాపత్రాన్ని ఎలా అయితే చూసుకుంటారో, అలాగే
బ్యాడ్జీని కూడా చూసుకోండి, మీ నడత-నడవడికను కూడా చూసుకోండి. ఎప్పుడూ వికారీ దృష్టి
ఉండకూడదు. నోటి నుండి ఎటువంటి చెడు మాట రాకూడదు. చెడు మాట్లాడేవారే లేకపోతే ఇక
చెవులు ఎలా వింటాయి? సత్యయుగములో అందరూ దైవీ గుణాలు కలవారే ఉంటారు. చెడు విషయమేదీ
ఉండదు. వారు కూడా ప్రారబ్ధాన్ని తండ్రి నుండే పొందారు. తండ్రిని స్మృతి చేసినట్లయితే
వికర్మలు వినాశనమైపోతాయని అందరికీ చెప్పండి. ఇందులో నష్టము కలిగించే విషయమేమీ లేదు.
ఆత్మ తనతోపాటు సంస్కారాలను తీసుకువెళ్తుంది. సన్యాసులు ఎవరైనా ఉంటే వారు మళ్ళీ
సన్యాస ధర్మములోకి వస్తారు. వారి వృక్షమైతే పెరుగుతూ ఉంటుంది కదా. ఈ సమయములో మీరు
పరివర్తన చెందుతున్నారు. మనుష్యులే దేవతలుగా అవుతారు. అందరూ ఏమీ కలిసి ఒకేసారి రారు.
అందరూ నంబరువారుగా వస్తారు. డ్రామాలో పాత్రధారులు ఎవరూ తమ సమయము రాకుండా స్టేజి పైకి
రారు. లోపల కూర్చుని ఉంటారు. సమయము వచ్చినప్పుడు పాత్రను అభినయించేందుకు బయట
స్టేజిపైకి వస్తారు. అవి హద్దులోని నాటకాలు, ఇది అనంతమైన నాటకము. పాత్రధారులమైన మనము
మన సమయములో వచ్చి మన పాత్రను అభినయించాలని బుద్ధిలో ఉంది. ఇది అనంతమైన పెద్ద వృక్షము.
నంబరువారుగా వస్తూ ఉంటారు. ప్రారంభములో ఒకే ధర్మము ఉండేది, అన్ని ధర్మాలవారు
ప్రారంభములోనే రాలేరు.
పాత్రను అభినయించేందుకు మొదటైతే దేవీ-దేవతా ధర్మము వారే వస్తారు, అది కూడా
నంబరువారుగా వస్తారు. వృక్షము యొక్క రహస్యాన్ని కూడా అర్థం చేసుకోవాలి. తండ్రియే
వచ్చి మొత్తం కల్పవృక్షపు జ్ఞానాన్ని వినిపిస్తారు. దీనిని మళ్ళీ నిరాకార వృక్షముతో
పోల్చడం జరుగుతుంది. మనుష్య సృష్టి రూపీ వృక్షానికి బీజరూపుడను నేను అని ఒక్క తండ్రి
మాత్రమే అంటారు. బీజములో వృక్షము ఇమిడి ఉండదు, కానీ వృక్షము యొక్క జ్ఞానము ఇమిడి
ఉంటుంది. ప్రతి ఒక్కరికీ తమ-తమ పాత్ర ఉంది. ఇది చైతన్యమైన వృక్షము కదా. వృక్షములో
ఆకులు కూడా నంబరువారుగా వస్తాయి. ఈ వృక్షము గురించి ఎవ్వరూ అర్థం చేసుకోరు, దీని
బీజము పైన ఉన్నారు, కావుననే దీనిని తలక్రిందులుగా ఉన్న వృక్షము అని అంటారు. రచయిత
అయిన తండ్రి పైన ఉన్నారు. మనము ఇంటికి వెళ్ళాలని మీకు తెలుసు, అక్కడ ఆత్మలు ఉంటాయి.
ఇప్పుడు మనము పవిత్రముగా అయి వెళ్ళాలి. మీ ద్వారా యోగబలముతో మొత్తం విశ్వమంతా
పవిత్రముగా అవుతుంది. మీ కోసమైతే పవిత్ర సృష్టి కావాలి కదా. మీరు పవిత్రముగా అవుతారు
కావున ప్రపంచమంతటినీ కూడా పవిత్రముగా తయారుచేయవలసి ఉంటుంది. అందరూ పవిత్రముగా
అయిపోతారు. మీ బుద్ధిలో ఉంది, ఆత్మలోనే మనసు, బుద్ధి ఉన్నాయి కదా. ఆత్మ చైతన్యమైనది.
ఆత్మయే జ్ఞానాన్ని ధారణ చేయగలుగుతుంది. కావున మధురాతి మధురమైన పిల్లలకు - మనము
పునర్జన్మలు ఎలా తీసుకుంటాము అన్న రహస్యమంతా బుద్ధిలో ఉండాలి. 84 జన్మల చక్రము మీది
పూర్తయితే అందరిదీ పూర్తవుతుంది. అందరూ పావనముగా అయిపోతారు. ఇది అనాదిగా తయారై ఉన్న
డ్రామా. ఇది ఒక్క క్షణము కూడా ఆగదు. క్షణక్షణము ఏదైతే జరుగుతుందో అది మళ్ళీ కల్పము
తరువాత జరుగుతుంది. ప్రతి ఆత్మలో అవినాశీ పాత్ర నిండి ఉంది. ఆ పాత్రధారులు మహా అయితే
రెండు-నాలుగు గంటలు పాత్రను అభినయిస్తారు. ఇక్కడైతే ఆత్మకు న్యాచురల్ పాత్ర లభించి
ఉంది, కావున పిల్లలకు ఎంత సంతోషము ఉండాలి. అతీంద్రియ సుఖము ఇప్పటి ఈ సంగమయుగానికి
సంబంధించిన గాయనమే. తండ్రి వస్తారు, 21 జన్మల కొరకు మనం సదా సుఖవంతులుగా అవుతాము.
ఇది సంతోషకరమైన విషయము కదా. ఎవరైతే బాగా అర్థం చేసుకుంటారో మరియు అర్థం చేయిస్తారో,
వారు సేవలో నిమగ్నమై ఉంటారు. పిల్లలెవరైనా స్వయమే క్రోధీలుగా ఉంటే అది ఇతరులలోకి
కూడా ప్రవేశిస్తుంది. చప్పట్లనేవి రెండు చేతులతోనే మోగుతాయి. అక్కడ ఇటువంటి విషయాలు
ఉండవు. ఇక్కడ పిల్లలైన మీకు శిక్షణ లభిస్తుంది - ఎవరైనా క్రోధము చేస్తే మీరు వారిపై
పుష్పాలు అర్పించండి, ప్రేమతో అర్థం చేయించండి. క్రోధము కూడా ఒక భూతమే, అది చాలా
నష్టము కలిగిస్తుంది. ఎప్పుడూ క్రోధము చేయకూడదు. నేర్పించేవారిలోనైతే క్రోధము అసలు
ఏమాత్రమూ ఉండకూడదు. నంబరువారుగా పురుషార్థము చేస్తూ ఉంటారు. కొందరి పురుషార్థము
తీవ్రతరముగా ఉంటుంది, కొందరిది చల్లబడినట్లుగా ఉంటుంది. చల్లబడినట్లుగా పురుషార్థము
చేసేవారు తప్పకుండా స్వయాన్ని అప్రతిష్ఠపాలు చేసుకుంటారు. ఎవరిలోనైనా క్రోధము ఉంటే,
వారు ఎక్కడికి వెళ్ళినా వారిని అక్కడి నుండి తీసేస్తారు. చెడు ప్రవర్తన కలవారు ఎవరూ
ఇక్కడ ఉండలేరు. పరీక్ష ఎప్పుడైతే పూర్తవుతుందో అప్పుడు అందరికీ తెలుస్తుంది. ఎవరెవరు
ఏమేమి అవుతారు అనేదంతా సాక్షాత్కారమవుతుంది. ఎవరు ఎలాంటి పని చేస్తే వారికి అలాంటి
మహిమ జరుగుతుంది.
పిల్లలైన మీకు డ్రామా ఆదిమధ్యాంతాల గురించి తెలుసు. మీరందరూ అంతర్యాములు. ఈ
సృష్టి చక్రము ఎలా తిరుగుతుంది అనేది ఆత్మకు లోలోపల తెలుసు. మొత్తం సృష్టిలోని
మనుష్యుల నడత-నడవడిక గురించి, సర్వ ధర్మాల గురించి మీకు జ్ఞానము ఉంది, దీనినే
అంతర్యామిగా ఉండడమని అంటారు. ఆత్మకు ఇప్పుడు అంతా తెలిసింది. భగవంతుడు కణకణములోనూ
ఉంటారు కదా, కావున భగవంతుడు అన్నీ తెలుసుకోవలసిన అవసరమేముంది - అని అనుకోకూడదు.
భగవంతుడు ఇప్పుడు కూడా ఏమంటారంటే - ఎవరు ఎలాంటి పురుషార్థము చేస్తే అలాంటి ఫలాన్ని
పొందుతారు, నేను అదంతా తెలుసుకోవలసిన అవసరమేముంది, ఎవరైనా ఏదైనా చేస్తే దానికి
శిక్ష వారు స్వయమే అనుభవిస్తారు. అటువంటి నడవడిక నడిస్తే అధమ గతిని పొందుతారు, పదవి
చాలా తక్కువైపోతుంది. ఆ స్కూల్లోనైతే ఫెయిల్ అయితే మళ్ళీ వచ్చే సంవత్సరము చదువుతారు.
ఈ చదువు అయితే కల్ప-కల్పాంతరాల కొరకు చదివే చదువు. ఇప్పుడు చదవకపోతే ఇక
కల్ప-కల్పాంతరాలు చదవరు. ఈశ్వరీయ లాటరీనైతే పూర్తిగా తీసుకోవాలి కదా. ఈ విషయాలను
పిల్లలైన మీరు అర్థం చేసుకోగలరు. భారత్ సుఖధామముగా ఉన్నప్పుడు, మిగిలినవారందరూ
శాంతిధామములో ఉంటారు. ఇప్పుడు ఇక మన సుఖమయమైన రోజులు రానున్నాయని పిల్లలకు
సంతోషముండాలి. దీపావళి రోజు దగ్గరవుతుంటే - ఇంకా కొద్ది రోజులే ఉన్నాయి, ఇంక కొత్త
బట్టలు వేసుకుంటాము అని అంటారు కదా. అలాగే మీరు కూడా అంటారు - స్వర్గము వస్తోంది,
మేము స్వయాన్ని అలంకరించుకున్నట్లయితే స్వర్గములో మంచి సుఖాన్ని పొందుతాము అని.
షావుకారులకు తమ షావుకారుతనము యొక్క నషా ఉంటుంది. మనుష్యులు పూర్తిగా ఘోర నిద్రలో
ఉన్నారు, ఆ తరువాత ఉన్నట్లుండి ఒక్కసారిగా తెలుస్తుంది - వీరు సత్యము వినిపించారే
అని. ఎప్పుడైతే సత్యము యొక్క సాంగత్యము ఉంటుందో అప్పుడే సత్యాన్ని అర్థం చేసుకోగలరు.
మీరు ఇప్పుడు సత్యమైనవారి సాంగత్యములో ఉన్నారు. సత్యమైన తండ్రి ద్వారా మీరు సత్యముగా
తయారవుతారు. వారంతా అసత్యమైనవారి ద్వారా అసత్యముగా తయారవుతారు. భగవంతుడు ఏమి
చెప్తున్నారు మరియు మనుష్యులు ఏమి చెప్తున్నారు అని ఈ రెండింటికీ మధ్యన ఉన్న
వ్యత్యాసాన్ని కూడా ఇప్పుడు ముద్రించడం జరుగుతుంది. దీనిని మ్యాగజైన్ లో కూడా
ముద్రించవచ్చు. చివరికైతే విజయము మీదే. ఎవరైతే కల్పపూర్వము పదవిని పొందారో వారు
తప్పకుండా పొందుతారు. ఇది తప్పకుండా జరుగుతుంది. అక్కడ అకాల మృత్యువులు ఉండవు.
ఆయుష్షు కూడా ఎక్కువగా ఉంటుంది. పవిత్రత ఉన్నప్పుడు ఆయుష్షు ఎక్కువ ఉండేది. పరమాత్మ
తండ్రి పతిత-పావనుడు కావున తప్పకుండా వారే అందరినీ పావనముగా తయారుచేసి ఉంటారు.
శ్రీకృష్ణుడు ఇలా చేసారు అన్న విషయము శోభించదు. పురుషోత్తమ సంగమయుగములో శ్రీకృష్ణుడు
ఎక్కడి నుండి వస్తారు. అవే ముఖకవళికలు ఉన్న మనిషి అయితే ఇక మళ్ళీ ఉండరు. 84 జన్మలు,
84 ముఖకవళికలు, 84 పాత్రలు - ఇది తయారై, తయారుచేయబడి ఉన్న నాటకము. అందులో మార్పు ఏమీ
ఉండదు. డ్రామా ఎంత అద్భుతముగా తయారై ఉంది. ఆత్మ ఒక చిన్న బిందువు, అందులో అనాది
పాత్ర నిండి ఉంది - దీనినే ప్రకృతిసిద్ధము అంటారు. మనుష్యులు ఇది విని ఆశ్చర్యపోతారు.
కానీ మొట్టమొదట - తండ్రిని స్మృతి చేయండి అన్న సందేశాన్ని ఇవ్వాలి. వారే
పతిత-పావనుడు, సర్వుల సద్గతిదాత. సత్యయుగములో దుఃఖపు విషయాలేవీ ఉండవు.
కలియుగములోనైతే ఎన్ని దుఃఖాలు ఉన్నాయి. కానీ ఈ విషయాలను అర్థం చేసుకునేవారు
నంబరువారుగా ఉన్నారు. తండ్రి అయితే ప్రతిరోజూ అర్థం చేయిస్తూ ఉంటారు. శివబాబా మనల్ని
చదివించేందుకు వచ్చారని పిల్లలైన మీకు తెలుసు, మళ్ళీ వారు తమతోపాటు తీసుకువెళ్తారు.
ఇక్కడ తండ్రితోపాటు ఉండేవారికన్నా బంధనములో ఉన్నవారు ఎక్కువ స్మృతి చేస్తారు. వారు
ఉన్నత పదవిని పొందవచ్చు. ఇది కూడా అర్థం చేసుకోవలసిన విషయము కదా. వారు బాబా స్మృతిలో
ఎంతగానో తపిస్తూ ఉంటారు. తండ్రి అంటారు - పిల్లలూ, స్మృతియాత్రలో ఉండండి, దైవీ
గుణాలను కూడా ధారణ చేయండి, అప్పుడు బంధనాలు కట్ అవుతూ ఉంటాయి, పాపపు కుండ
అంతమవుతుంది. అచ్ఛా!
మధురాతి-మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.