05-08-2026 ప్రాత:మురళి ఓంశాంతి "బాప్ దాదా" మధువనం
‘‘మధురమైన పిల్లలూ - మీరు మీ యోగబలముతో ఈ పాత ప్రపంచాన్ని
పరివర్తన చేసి కొత్తదిగా తయారుచేస్తారు, మీరు ఆత్మిక సేవ కోసమే ప్రత్యక్షమయ్యారు’’
ప్రశ్న:-
నిజాయితీపరులైన, సత్యమైన పురుషార్థీ పిల్లల గుర్తులేమిటి?
జవాబు:-
1.
నిజాయితీపరులైన పిల్లలు ఎప్పుడూ కూడా తమ పొరపాటును దాచిపెట్టరు, వారు వెంటనే బాబాకు
వినిపిస్తారు. వారు చాలా-చాలా నిరహంకారులుగా ఉంటారు. వారి బుద్ధిలో సదా ఈ ఆలోచనే
ఉంటుంది - నేను ఎలాంటి కర్మలను చేస్తానో, నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు 2. వారు
ఎవరి డిస్సర్వీస్ ను వర్ణించరు. తమ సర్వీస్ లోనే నిమగ్నమై ఉంటారు. వారు ఎవరి
అవగుణాలను చూస్తూ తమ బుద్ధిని పాడు చేసుకోరు.
పాట:-
ఓర్పు వహించు
మనసా...
ఓంశాంతి
మధురాతి మధురమైన ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి ఓదార్పును అందిస్తున్నారు. లౌకిక
తండ్రి కూడా ఓదార్పును అందిస్తారు కదా. ఎవరైనా అనారోగ్యంపాలైతే వారికి ఊరటను ఇస్తారు
- అనారోగ్యంతో ఉన్న మీ దుఃఖపు రోజులు మారి సుఖపు రోజులు వస్తాయి అని. ఆ హద్దు తండ్రి
హద్దు ఓదార్పును అందిస్తారు. ఇప్పుడు వీరైతే అనంతమైన తండ్రి, వీరు పిల్లలకు అనంతమైన
ఓదార్పును అందిస్తున్నారు. పిల్లలూ, ఇప్పుడు మీ సుఖము యొక్క రోజులు వస్తున్నాయి,
ఇంకా కొన్ని రోజులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇప్పుడు మీరు తండ్రి స్మృతిలో ఉంటూ
ఇతరులకు కూడా నేర్పించండి. మీరు కూడా శివశక్తులు కదా. శివబాబా యొక్క శక్తి సైన్యము
మళ్ళీ ప్రత్యక్షమయ్యింది. వీరు (గోపులు) కూడా ఆత్మలే. వీరందరూ శివుడి నుండి శక్తిని
తీసుకుంటారు. మీరు కూడా శక్తిని తీసుకుంటారు. ఇందులో కృప లేక ఆశీర్వాదాల విషయమేమీ
లేదని తండ్రి అర్థం చేయించారు. స్మృతిలో ఉంటూ శక్తిని తీసుకుంటూ ఉండండి. స్మృతితోనే
మీ వికర్మలు వినాశనమవుతాయి మరియు మీరు శక్తివంతులుగా అవుతూ ఉంటారు. శివుని శక్తి
సైన్యము ఎంతటి సర్వశక్తివంతమైనదంటే, అది పాత ప్రపంచాన్ని మార్చి కొత్తదిగా
తయారుచేసింది. యోగబలముతో మనము ఈ పాత ప్రపంచాన్ని మారుస్తామని మీకు తెలుసు. అల్లాను,
గాడ్ ను స్మృతి చేయండి అని మనుష్యులు చేతి వేలితో ఇలా పైకి సూచిస్తారు. తండ్రి
స్మృతితో ఈ రాళ్ళ పర్వతము అనగా ఈ ప్రపంచము మారిపోతుందని పిల్లలు ఇప్పుడు అర్థం
చేసుకున్నారు. ఇప్పుడు మనము పరిస్తాన్ ను స్థాపన చేస్తున్నాము. తండ్రి పిల్లలకు
అర్థం చేయిస్తున్నారు, ప్రదర్శనీలో బాగా సేవ చేయండి, కృషి చేయండి, సమయము
లభించినప్పుడల్లా కూర్చుని నేర్చుకోండి. ఇదా చాలా సహజము. పిల్లలకు అన్ని రకాల
శిక్షణలు లభిస్తూ ఉంటాయి. ప్రతి ఒక్కరి కర్మల లెక్క ఉంటుంది. కన్యల కర్మలు
బాగున్నాయి. వివాహమైనవారు ఏమంటారంటే - ఈ సమయములో ఒకవేళ నేను కన్యగా ఉండి ఉంటే, ఈ
బంధనాలన్నింటి నుండి విముక్తి అయి ఫ్రీ బర్డ్ గా ఉండేదానిని. కన్యలు ఫ్రీ బర్డ్స్.
కానీ చెడు సాంగత్యము వలన నష్టము కలుగుతుంది. పత్నికి పతి, పిల్లలు మొదలైనవారి
సంకెళ్ళు ఎన్ని ఉంటాయి. ఇందులో ఆచార-పద్ధతులు మొదలైన బంధనాలు ఎన్ని ఉంటాయి. కన్యలకు
ఎటువంటి బంధనాలు మొదలైనవి లేవు. ఇప్పుడు బొంబాయిలో కూడా కన్యలు తయారవుతూ ఉన్నారు.
మా ప్రాంతాన్ని మాకు మేమే సంబాళిస్తాము అని అంటారు. అందరూ తమ-తమ ప్రాంతాల కోసం ఎంత
కృషి చేస్తారు. మా గుజరాత్, మా యు.పి... అని అంటారు. ఇప్పుడు మీరు మీ స్వరాజ్యాన్ని
తీసుకుంటున్నారు. ఇందులో నేను ఫలానాను, ఫలానా ప్రాంతానికి చెందినవాడిని అనేది కూడా
ఉండకూడదు. మీరు ఎవరి పట్ల కూడా ఈర్ష్య పెట్టుకోకూడదు. ఎవరి అవగుణాలను చూస్తూ
బుద్ధిని పాడు చేసుకోకూడదు. నేను ఎంతమంది ఆత్మలకు అనగా ఎంతమంది సోదరీ-సోదరులకు సుఖము
యొక్క మార్గాన్ని తెలియజేసాను అని స్వయాన్ని చూసుకోవాలి! ఒకవేళ మార్గాన్ని
తెలియజేయలేదంటే, వారు దేనికి పనికి రారు. హృదయాన్ని అధిరోహించలేరు. బాప్ దాదా
హృదయాన్ని అధిరోహించలేదు అంటే సింహాసనముపై కూర్చోలేరు. కొంతమంది పిల్లలకు సేవ పట్ల
చాలా అభిరుచి ఉందని, దేహాభిమానము కొద్దిగా కూడా లేదని బాబాకు తెలుసు. మరి కొంతమంది
అయితే చాలా అహంకారములో ఉంటారు. వారు ఏమనుకుంటారంటే - మేము మాపై కాదు, బాబాపై కృప
చూపిస్తున్నాము అని. ఎప్పుడూ కూడా ఎవరి అవగుణాలను చూడకూడదు. ఫలానావారు ఇలా ఉన్నారు,
అది, ఇది చేస్తున్నారు అని అనుకోకూడదు. ఈ రోజుల్లో ఇతరుల డిస్సర్వీస్ ను వర్ణించే
తెలివైనవారు కూడా ఉన్నారు. ఫలానావారు ఇది చేస్తారు, ఇలా ఉన్నారు అని అంటుంటారు. అరే,
మీరు మీ సేవ చేసుకోండి. బ్రాహ్మణ పిల్లల పని - సేవలో నిమగ్నమవ్వడము. తండ్రి కూర్చుని
ఉన్నారు, తండ్రి వద్దకు సమాచారమంతా వస్తుంది. ప్రతి ఒక్కరి అవస్థను గురించి తండ్రికి
తెలుసు. సేవను చూసి మహిమ కూడా చేస్తారు. పిల్లల్లో సేవ పట్ల ఉత్సాహము కలగాలి. ప్రతి
ఒక్కరూ ఈ ఆత్మిక సేవ ద్వారా తమ కళ్యాణము చేసుకోవాలి. ఆ వ్యాపారాలు మొదలైనవైతే
జన్మజన్మలుగా చేస్తూ వచ్చారు. ఈ వ్యాపారాన్ని చేసే వ్యాపరస్థులు ఎవరో అరుదుగా ఉంటారు.
బాబా సేవ కోసం చాలా సహజమైన విధానాలను అర్థం చేయిస్తారు. ఎప్పుడూ కూడా ఇతరులను
నిందించకండి. ఇలా చాలామంది చేస్తూ ఉంటారు. మంచి-మంచి మహారథులకు కూడా మాయ ముక్కు
పట్టుకుంటుంది. బాబాను స్మృతి చేయకపోతే మాయ పట్టుకుంటుంది. తండ్రి కూడా అంటారు కదా
- నేను సాధారణ తనువులోకి రావడము చూసి నన్ను గుర్తించలేకపోతారు అని. ఇలా ఇలా చేయాలి
- అని బాబాకు కూడా సలహాలు ఇస్తుంటారు. వారి అవస్థ ఎలా ఉంటుందంటే, బాబా కొద్దిగా
ఏమైనా చేసినా, వారు ద్రోహులుగా అయిపోతారు. బాబాకు కూడా తమ మతాన్ని పంపిస్తారు.
ఎలుకకు పసుపు కొమ్ము దొరకగానే తానొక పెద్ద వ్యాపారిని అయిపోయానని అనుకుంది అనే
సామెత ఉంది కదా. మేము డిస్సర్వీస్ చేస్తున్నాము - అని అర్థం చేసుకోరు. పొరపాట్లు
అయితే చాలామంది ద్వారా జరుగుతూ ఉంటాయి. ఒక్కోసారి అవస్థ ఉన్నతముగా ఉంటుంది,
ఒక్కోసారి తక్కువగా ఉంటుంది, ఇలా జరుగుతూ ఉంటుంది. ప్రతి ఒక్కరూ తమ అవస్థను
చూసుకోవాలి. నిజాయితీపరులైన పిల్లలు తమ అవస్థ గురించి వెంటనే తెలియజేస్తారు.
కొందరైతే తమ పొరపాట్లను దాచి పెడతారు. ఇందులో చాలా నిరహంకారితనము కావాలి. సేవను
వృద్ధి చేయడములో నిమగ్నమైపోవాలి. సదా ఈ ఆలోచన ఉండాలి - నేను ఎలాంటి కర్మలను చేస్తానో,
నన్ను చూసి ఇతరులు కూడా చేస్తారు. నేను ఎవరినైనా నిందిస్తే, ఇతరులు కూడా అలా చేయడము
మొదలుపెడతారు. చాలామందికి ఈ ఆలోచన రాదు. తండ్రి అర్థం చేయిస్తున్నారు - మీరు మీ
సేవలో నిమగ్నమవ్వండి లేదంటే చాలా పశ్చాత్తాపపడతారు. చాలామంది శత్రువులుగా కూడా
అవుతారు.
మీరు ఇప్పుడు శూద్రుల నుండి ట్రాన్స్ఫర్ అయ్యి బ్రహ్మా ముఖ వంశావళి బ్రాహ్మణులుగా
అయ్యారు. ఎవరిలోనైతే 5 వికారాలు ఉంటాయో, వారు ఆసురీ సాంప్రదాయానికి చెందినవారు. మీరు
దైవీ సాంప్రదాయానికి చెందినవారు. మీరు దేవతలుగా అయ్యేందుకు వికారాలపై విజయము
పొందుతున్నారు. దేవతలైతే ఇక్కడ లేరు. దేవతలు సత్యయుగములో ఉంటారు. మీరు ఇప్పుడు దైవీ
సాంప్రదాయులుగా అవుతున్నారు.
పిల్లలైన మీకిప్పుడు అర్థం చేయించడానికి అవకాశము లభిస్తుంది. ప్రదర్శనీలలో అర్థం
చేయిస్తూ ఉండండి. ప్రదర్శనీలలో, మేళాలలో ప్రతి ఒక్కరి నాడి గురించి తెలుస్తుంది.
ప్రొజెక్టర్ ద్వారానైతే ఎవరికీ అర్థం చేయించలేరు. సమ్ముఖముగా అర్థం చేయించినప్పుడే
అర్థం చేసుకోగలరు. ప్రదర్శనీలు, మేళాలు చాలా మంచివి. అందులో మీరు వ్రాయవచ్చు కూడా.
ప్రదర్శనీలు, మేళాల పట్ల అభిరుచి ఉండాలి. రెగ్యులర్ గా చదువుకోవడము ద్వారానే నషా
ఎక్కుతుంది. బంధనములో ఉన్నవారైతే ఇంటిలో ఉంటూ తండ్రిని స్మృతి చేస్తూ ఉండండి,
అప్పుడు వికర్మలు వినాశనమైపోతాయి. ఇంటిలో కూర్చుంటూ కూడా స్మృతి చేయడము మంచిదే. కానీ
స్మృతి చేయడమనేది పిల్లలకు చాలా కష్టమైన విషయము అయిపోయింది. ఏ తండ్రి నుండైతే 21
జన్మల వారసత్వము లభిస్తుందో, వారిని స్మృతి చేయరు. మంచి-మంచి భాషణలు చేసే మహారథులు
కూడా తండ్రిని స్మృతి చేయరు, ఉదయము లేవలేకపోతారు. లేచినా కూర్చోగానే కునికిపాట్లు
పడుతూ ఉంటారు. స్మృతి చేయడానికి ఉదయము వేళే మంచిది. భక్తి మార్గములో కూడా ఉదయాన్నే
లేచి స్మృతిలో నిమగ్నమైపోతారు. కానీ వారిది దిగే కళ. ఇక్కడైతే ఎక్కే విషయమే. మాయ
ఎన్ని విఘ్నాలు వేస్తుంది. ఉదయాన్నే లేచి తండ్రిని స్మృతి చేయకపోతే ధారణ ఎలా
జరుగుతుంది, వికర్మలు వినాశనమెలా అవుతాయి. ఇకపోతే, కేవలం మురళీని నడిపించడమనేది
చిన్న పిల్లలు కూడా నేర్చుకుని అర్థం చేయించడము మొదలుపెడతారు. ఈ చదువు పెద్దవారి
కోసము. ఇది ఎంత పెద్ద యూనివర్శిటీ. మమ్మల్ని చదివించేవారు ఎవరు - అనే నషా పిల్లలకు
ఉండటము లేదు. మాయ ఎవరినైనా మోసం చేస్తే, మనము వారిని చూడకుండా మన సేవలోనే నిమగ్నమై
ఉండాలి. తండ్రి వద్దకు అన్ని సమాచారాలు వస్తూ ఉంటాయి. కొందరు దేహాభిమానములోకి వచ్చి
- వీరు ఇలా చేస్తారు, ఇది చేస్తారు అని అనుకుంటూ ఉంటారు, ఈ విధముగా ఇతరులను
నిందిస్తూ టైమ్ వేస్ట్ చేసుకుంటారు. మీ పని సేవలో ఉండటము. ఏదైనా జరిగితే, తండ్రికి
సూచన ఇస్తారు, అంతే చాలు. పరచింతన చేయకూడదు. పిల్లలు సేవలో రాత్రింబవళ్ళు
నిమగ్నమవ్వాలి. మీ వ్యాపారమే ఇది. వీరు శివబాబా, వీరు ప్రజాపిత బ్రహ్మా అని రోజు
ప్రదర్శనీలో అర్థం చేయించండి. కల్పక్రితం కూడా ప్రజాపిత బ్రహ్మా మహిమ చేయబడ్డారు.
ప్రజాపిత బ్రహ్మా ద్వారా మనుష్య సృష్టిని రచిస్తారు. అలాగని ఇంతకుముందు అసలు
మనుష్యులు లేనే లేరని కాదు. మనుష్య సృష్టిని రచిస్తారు అనగా ముళ్ళను పుష్పాలుగా
తయారుచేస్తారు. బ్రహ్మా ద్వారా సృష్టిని రచిస్తారు అంటే సృష్టిని పైన రచిస్తారని
కాదు. బ్రహ్మా అయితే ఇక్కడ ఉంటారు కదా. ఎంత స్పష్టముగా అర్థం చేయించడము జరుగుతుంది.
తండ్రి అంటారు - నేను వీరి అనేక జన్మల అంతిమ జన్మలో ప్రవేశించి మనుష్యులను దేవతలుగా
తయారుచేస్తాను. కనుక పిల్లలు సేవలో రాత్రింబవళ్ళు కృషి చేయాలి. వ్యాపారాలు
మొదలైనవాటి నుండి కొంత సమయాన్ని తీసి ఇందులో నిమగ్నమైపోవాలి. తీరిక లభించడము లేదని
అనకూడదు. అనారోగ్యంపాలు అయితే అప్పుడు తీరిక లేదని ఏమైనా అంటారా! పురుషార్థము చేయాలి.
ప్రేరణతో ఏమీ జరగదు. భగవంతుడే ప్రేరణ ద్వారా పని చేయలేరు అన్నప్పుడు ఇక ఇతరులు ఎలా
చేయగలుగుతారు. భగవంతుడు చేయలేనిది ఏముంది, వారు చనిపోయినవారిని కూడా బ్రతికించగలరని
అనుకుంటారు. అరే, భగవంతుడిని మీరు - ఓ పతిత-పావనా, మీరు వచ్చి మమ్మల్ని పతితుల నుండి
పావనముగా చేయండి అని పిలుస్తారు. అంతే, మీరు ఇంకేమీ అనరు. మీరు వచ్చి చనిపోయిన
వారిని బ్రతికించండి అని పిలవరు కదా. వారు ఉన్నదే పతిత-పావనుడు. భారత్ పావనముగా
ఉండేది కదా. తండ్రి అంటారు - నేను కల్ప-కల్పము వచ్చి పావనముగా చేస్తాను. మాయ వచ్చి
మళ్ళీ పతితముగా చేస్తుంది. ఇప్పుడు మళ్ళీ నేను పావనముగా చేయడానికి వచ్చాను. ఎంత
సహజమైన విషయాన్ని తెలియజేస్తారు. హకీమ్ లు (మూలిక వైద్యులు) పెద్ద అనారోగ్యాలను కూడా
వేర్లు, మూలికలతో నయం చేస్తారు, అందుకే వారికి మహిమ కూడా జరుగుతుంది. ఎవరికైనా
కొడుకు పుడితే లేక ధనము లభిస్తే, గురు కృప లభించిందని అంటారు. అచ్ఛా, కొడుకు
మరణిస్తే, తలరాత అని అంటారు. ఈ విషయాలన్నింటినీ ఇప్పుడు పిల్లలైన మీరు అర్థం
చేసుకుంటారు. సన్యాసులు పవిత్రముగా అవుతారు కనుక వారికి గౌరవముంటుంది. కానీ వారు
హఠయోగులు, వారు రాజయోగాన్ని నేర్పించలేరు. వారు సన్యాసులు, మనము గృహస్థులము, మరి
మనము మనల్ని ఫాలోవర్స్ (అనుచరులు) అని ఎలా చెప్పుకోగలము. తండ్రి అంటారు, పిల్లలు
పూర్తిగా ఫాలో చేయాలి - మన్మనాభవ - నన్ను స్మృతి చేసినట్లయితే మీరు పవిత్రముగా
అవుతారు మరియు నాతో పాటు వస్తారు. నేను అయితే సదా పావనుడను. మనుష్యులు పతితముగా
చేస్తారు, తండ్రి వచ్చి పావనముగా చేస్తారు. వారు పవిత్రత, సుఖ-శాంతుల సాగరుడు. వారు
మిమ్మల్ని కూడా ఇలా తయారుచేస్తున్నారు. మీరు యోగబలముతో ఆత్మను పవిత్రముగా
చేసుకుంటారు. మనకు ఫస్ట్ క్లాస్ శరీరము లభిస్తుందని మీకు తెలుసు. మనుష్యులను
దేవతలుగా ప్రాక్టికల్ గా తయారుచేయాలి. కేవలం దేవతల వస్త్రాలు మొదలైనవి ధరించడము కాదు,
స్వయం పట్ల పూర్తి అటెన్షన్ పెట్టాలి. దేహాభిమానము రాకూడదు. బాబా, మేమైతే మీ నుండి
వారసత్వము తీసుకునే తీరుతాము, మేము భారత్ ను శ్రేష్ఠాచారిగా తయారుచేసే తీరుతామని
మీరు కూడా అంటారు. నిశ్చయము ఉన్నవారే ఇలా అంటారు కదా. కొందరు, ఇంత తక్కువ సమయములో
ఎలా జరుగుతుందని అంటారు. వాస్తవానికి ఎప్పడూ కూడా ఇటువంటి సంశయాన్ని రానివ్వకూడదు.
సంశయములోకి రావడము వలన సేవలో ఢీలా పడిపోతారు. సమయము చాలా తక్కువ ఉంది. ఎంత వీలైతే
అంత, బాగా పురుషార్థము చేయాలి. ఎక్కడైనా కాస్త యుద్ధము మొదలైన హంగామాలు జరిగితే,
ఎంతగా కృషి చేయడము మొదలుపెడతారో చూడండి! మేము స్మృతిలో పూర్తిగా ఉండకపోతే, ఆ సమయములో
పెనుగులాడలేమని అర్థం చేసుకుంటారు కదా. ఆ సమయములోనైతే చాలా ఆపదలు మొదలైనవి ఉంటాయి.
అందుకే తండ్రి అంటారు, ఎంత వీలైతే అంత గ్యాలప్ చేస్తూ (వేగముగా పరిగెత్తుకుంటూ)
వెళ్ళండి. ఇది ఆత్మల రేస్. తండ్రి ఎంత బాగా అర్థం చేయిస్తారు. లక్ష్యము వరకు వెళ్ళి
అనగా తండ్రి ఇంటికి వెళ్ళి మళ్ళీ కొత్త ప్రపంచములోకి తిరిగి రావాలి. ఇది చాలా
సూక్ష్మమైన రేస్. తండ్రి అంటారు - నన్ను టచ్ చేసి అనగా మూలవతనములోకి వెళ్ళి మళ్ళీ
రావాలి. ఎవరైతే యోగయుక్తులుగా ఉంటారో, వారే మొట్టమొదట వస్తారు. మేము ముక్తిధామానికి
వెళ్ళాలని కోరుకుంటారు. కనుక తండ్రి అంటారు - నన్ను స్మృతి చేసినట్లయితే వెళ్ళగలరు.
ముక్తిధామమైతే అందరికీ ఇష్టమే. తర్వాత పాత్రను అభినయించేందుకు వస్తారు. మోక్షమనేది
ఎవరికీ లభించదు. ఈశ్వరీయ చరిత్ర, భౌగోళికాలలో మోక్షమనే పదమే లేదు. ఒక్క సెకండులో
మీకు జీవన్ముక్తి లభిస్తుంది, మిగిలినవారంతా ముక్తులైపోతారు. రావణ రాజ్యము నుండి
ముక్తులవ్వాల్సిందే. ఎవరైతే పురుషార్థము చేస్తారో, వారే ఉన్నత పదవిని పొందుతారు.
పిల్లలు చాలా మధురముగా అవ్వాలి. స్వభావము చాలా మధురముగా ఉండాలి. క్రోధులుగా
అవ్వకూడదు. దుర్వాసుని పేరు ఉంది కదా. ఈ రాజఋషులలో కూడా కొందరు ఇలాంటివారు ఉన్నారు.
నేను ఏమి చేస్తున్నాను, దీనితో నాకు ఏమి పదవి లభిస్తుంది అని ఎల్లప్పుడూ తమ హృదయముపై
చేయి వేసుకుని ప్రశ్నించుకోవాలి. ఒకవేళ సేవ చేయలేదంటే, తమ సమానముగా తయారుచేయలేదంటే
ఇక ఏమి పదవి లభిస్తుంది. కొద్ది మాత్రానికే రాజీ పడకూడదు. తండ్రి అంటారు - పిల్లలకు
పూర్తి రాజ్యాధికారాన్ని ఇవ్వడానికి నేను వచ్చాను. కనుక ధైర్యముంచి చూపించాలి. కేవలం
చెప్పినంత మాత్రాన జరగదు కదా. తండ్రి సేవలోనైతే ఎముకలను సైతం ఇవ్వాలి. అలా చేస్తారు
కూడా, మళ్ళీ ఎక్కడైనా దేహాభిమానము వచ్చిందంటే నషా వచ్చేస్తుంది, ఇక పడిపోతారు. మాయ
కూడా తక్కువ పహల్వాన్ (వస్తాదు) ఏమీ కాదు. తండ్రి శ్రీమతమనుసారముగా నడవకపోతే మాయ
దాడి చేస్తుంది. అప్పుడు తండ్రిని వదిలి పారిపోతారు. తండ్రి సుఖధామానికి యజమానులుగా
చేస్తారు కనుక మీపై మీకు దయ కలగాలి. తండ్రి చాలా సింపుల్ సలహాలనిస్తున్నారు. మాయా
తుఫానులైతే ఎన్నో వస్తాయి. కానీ మహావీరులుగా అవ్వాలి. అచ్ఛా!
మధురాతి మధురమైన సికీలధే పిల్లలకు మాత-పిత, బాప్ దాదాల ప్రియస్మృతులు మరియు గుడ్
మార్నింగ్. ఆత్మిక పిల్లలకు ఆత్మిక తండ్రి నమస్తే.
ధారణ కొరకు ముఖ్య సారము:-
1. సేవ పట్ల అభిరుచి ఉంచి తమ మరియు ఇతరుల కళ్యాణము చేయాలి. ఎవరి డిస్సర్వీస్ ను
వర్ణించకూడదు. పరచింతనలో తమ సమయాన్ని పోగొట్టుకోకూడదు.
2. నిజాయితీపరులుగా మరియు నిరహంకారులుగా అయ్యి సేవను వృద్ధి చేయాలి. ఉదయాన్నే
లేచి తండ్రిని ప్రేమగా స్మృతి చేయాలి. చెప్పడాన్ని మరియు చేయడాన్ని సమానముగా
చేసుకోవాలి.
వరదానము:-
మన్మనాభవ స్థితి ద్వారా మనసులోని భావాలను తెలుసుకునే సఫలతా
స్వరూప భవ
ఏ పిల్లలైతే మన్మనాభవ స్థితిలో స్థితులై ఉంటారో, వారు
ఇతరుల మనసులలోని భావాలను తెలుసుకోగలరు. మాటలు ఏవైనా కానీ, వాటి భావమేమిటి అన్నదానిని
తెలుసుకునే అభ్యాసాన్ని చేస్తూ వెళ్ళండి. ప్రతి ఒక్కరి మనసులోని భావాలను అర్థం
చేసుకోవడముతో, వారి అవసరము లేదా ప్రాప్తి యొక్క కోరిక ఏదైతే ఉందో, దానిని పూర్తి
చేయగలరు. దీనితో వారు అవినాశీ పురుషార్థులుగా అయిపోతారు, అప్పుడిక కొద్ది సమయములోనే,
సేవలో గొప్ప సఫలత కనిపిస్తుంది మరియు మీరు పురుషార్థీ స్వరూపులకు బదులుగా సఫలతా
స్వరూపులుగా అయిపోతారు.
స్లోగన్:-
నిదురించే
సమయములో అంతా తండ్రికి అర్పణ చేసి ఖాళీ అయిపోండి, అప్పుడు వ్యర్థమైన లేక వికారీ
స్వప్నాలు రావు.
అవ్యక్త ప్రేరణలు -
అపవిత్రత యొక్క బీజాన్ని కూడా సమాప్తము చేసి సంపూర్ణముగా స్వచ్ఛముగా (పవిత్రముగా)
అవ్వండి
ఆత్మలైన మీరు
బ్రాహ్మణ జీవితములో ఎంతటి పవిత్రులుగా అవుతారంటే, ఇక శరీరాన్ని, ప్రకృతిని కూడా
పవిత్రముగా తయారుచేస్తారు, అందుకే అక్కడ శరీరము కూడా పవిత్రముగా ఉంటుంది మరియు ఆత్మ
కూడా పవిత్రముగా ఉంటుంది. సంపూర్ణ పవిత్రత అనగా అపవిత్రత అంశమాత్రము కూడా లేకుండా
ఉండటము ఎందుకంటే ఎంత పవిత్రత ఉంటుందో అంతగానే బ్రాహ్మణ జీవితము యొక్క పర్సనాలిటీ (వ్యక్తిత్వము)
ఉంటుంది. ఒకవేళ పవిత్రత తక్కువగా ఉన్నట్లయితే పర్సనాలిటీ కూడా తక్కువగా ఉంటుంది.
పవిత్రతకు చెందిన ఈ పర్సనాలిటీ సేవలో కూడా సహజ సఫలతను అందిస్తుంది